కోడి పందాలు కాస్తున్న ఐదుగురి అరెస్ట్
Published Sun, Jul 10 2016 9:37 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
హయత్‌నగర్: పందాల రాయుళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హయత్‌నగర్ పరిధిలోని కోహెడ సర్వీసు రోడ్డు సమీపంలో కోడి పందేలు కాస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.29 వేల నగదు, రెండు కోళ్లు, రెండు కత్తులు, 6 సెల్‌ఫోన్‌లు, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement