పాకిస్తాన్లో ఉగ్రదాడి, ఐదుగురు మృతి
పాకిస్తాన్లో ఉగ్రదాడి, ఐదుగురు మృతి
Published Fri, Sep 2 2016 10:44 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని పెషావర్లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆఫ్గనిస్తాన్, పాక్ సరిహద్దు ప్రాంతమైన క్రిస్టియన్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఓ పౌరుడు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపడుతున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సూసైడ్ జాకెట్స్ ధరించారని మీడియా సంస్థ డాన్ వెల్లడించింది.
Advertisement
Advertisement