Peshawar
-
ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు.. ప్రయాణికుల కేకలు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో తృటిలో ఘోర విమానం తప్పింది. సౌదీకి చెందిన ఎయిర్‌లైన్స్‌లోని పెషావర్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో మంటలు వ్యాపించడం అధికారులు గుర్తించారు. వెంటనే సహాయక బృందాలు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం 276 మంది ప్రయాణికులు, 21 విమాన సిబ్బందితో రియాద్ నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎస్వీ 792 పాకిస్థాన్‌లోని పెషావర్‌కు బయలుదేరింది. ఇక, విమానం పెషావర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు వచ్చాయి.ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమయ్యారు. మంటల విషయాన్ని విమాన పైలెట్‌తోపాటు సహాయక సిబ్బందికి చేరవేశారు. అనంతరం, విమానాన్ని వెంటనే ఎయిరోపోర్ట్‌లో నిలిపివేశారు. హుటాహుటిన ప్రయాణికులతోపాటు సిబ్బందిని విమానం నుంచి దింపివేశారు. తర్వాత విమానం గేర్ వద్ద ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. Latest: Saudia Airbus A330 operating Riyadh to Peshawar experienced a fire in the left landing gear on landing The aircraft went on to suffer a runway excursion before coming to a complete stop. Evacuation initiated, all passengers and 21 crew are safe.pic.twitter.com/WF34skShM1— Alex Macheras (@AlexInAir) July 11, 2024 ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, విమానంలో గేర్ నుంచి మంటలు రావడానికి గల కారణాలను టెక్నికల్ టీమ్ అన్వేషిస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాలేదని సౌదీ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. #SaudiAirlines flight 792 4rm #Riyadh experienced a #fire in the left landing gear while maneuvering at #Peshawar Airport, Rescue Services swiftly extinguished the #blaze after n alert by air traffic preventing a major accident, 276passeng n 21crew evacuated via inflatable slides pic.twitter.com/mUnBYUvPRj— Sajjad Tarakzai (@SajjadTarakzai) July 11, 2024 -
WC 2023: భారత్‌లో వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యం.. అంత సీన్ లేదు!
India- Pakistan- ODI World Cup 2023: వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ గెలవడమే తన ప్రధాన లక్ష్యమని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. కెరీర్లో తాను సాధించాల్సింది ఇంకెంతో ఉందని.. అయితే, అన్నిటికంటే భారత్‌లో జరుగనున్న మెగా టోర్నీలో జట్టును విజేతగా నిలపడమే ముఖ్యమని పేర్కొన్నాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బాబర్ నిలిచిన సంగతి తెలిసిందే. పెషావర్ కెప్టెన్‌గా.. అదే విధంగా.. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడు స్వదేశంలో జరుగుతున్న పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. పెషావర్ జల్మీ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇక తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు మూడింట రెండు మ్యాచ్‌లు గెలిచిన బాబర్ బృందం.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడిన బాబర్ ఆజం తన తదుపరి లక్ష్యాల గురించి చెప్పుకొచ్చాడు. భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ నెగ్గాలి ‘‘నేను కెరీర్లో సాధించాల్సింది చాలా ఉంది. అయితే, ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం పీఎస్ఎల్లో తొలి సెంచరీ నమోదు చేయడం.. అది కూడా ఈ ఏడాదే జరగాలి. అంతేకాకుండా ఇండియాలో జరుగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టైటిల్ గెలవాలి. ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన జట్టుగా నా దేశానికి పేరు తీసుకురావాలి’’ అని బాబర్ ఆజం పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్-2023 నిర్వహణకు సంబంధించి బీసీసీఐ- పీసీబీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అంతసీన్ లేదంటున్న టీమిండియా ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో పాక్ నుంచి వేదికను తరలించే అంశంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. కాగా తమ దేశంలో ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా రాకపోతే.. తాము కూడా భారత్‌లో వరల్డ్‌కప్ ఆడమంటూ గతంలో పీసీబీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బాబర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘భారత్‌లో టీమిండియా ఫేవరెట్. మా వాళ్లను దాటుకుని మీరు ట్రోఫీ సాధిస్తారా? అంత సీన్ లేదు. ఈసారి కప్ భారత్‌దే. నువ్వు ఇంకో మాట చెప్పు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ICC Rankings: ఆండర్సన్ ప్రపంచ రికార్డు! మళ్లీ ఎవరికీ సాధ్యం కాదేమో! అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదమిదే! Bumrah: ‘అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్ చేయనా?’ -
పాక్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 50 మంది మృతి.. 100 మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పోలీస్ లైన్స్ ప్రాంతంలోని మసీదులో ఈ పేలుడు సంభవించింది. మసీదులో మధ్యాహ్నం 1.45 గంటలకు జుహర్ ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్దం రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 50 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 100 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు దాటికి మసీదు పైకప్పు, ఓ వైపు గోడ భాగం కూలిపోయింది. భవన శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మసీదులో ఓ వ్యక్తి తనతంట తాను పేల్చుకున్నట్లు.. తొలి వరుసలో ఉన్న వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: Gunfire: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి.. -
పాక్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత
పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. మృతులను సుగంధ ద్రవ్యాల దుకాణం నడుపుకునే సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38)గా గుర్తించారు. ఘటనకు బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. పెషావర్‌లో సుమారు 15 వేల మంది సిక్కు మతస్తులున్నారు. చదవండి: సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా -
ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు.. ‘పదవి లేదు, ఇప్పుడు మరింత..’
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాను మరింత ప్రమాదకరంగా మారుతానని గురువారం హెచ్చరించారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా పెషావర్‌లో బహిరంగ ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారి కాదు. కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారిగా మారుతా’నని పేర్కొన్నారు. అయితే అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి వారం కూడా గడవకముందే ఇమ్రాన్ ఖాన్ ఇలా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం అర్ధరాత్రి దాకా న్యాయస్థానం తలుపులు తెరవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. ‘నేను న్యాయవ్యవస్థను అడుగుతున్నాను, మీరు అర్ధరాత్రి వరకు కోర్టును ఎందుకు తెరిచి ఉంచారు. ఈ దేశం నాకు 45 సంవత్సరాలుగా తెలుసు. నేను ఎప్పుడైనా చట్టాన్ని ఉల్లంఘించానా? నేను క్రికెట్ ఆడినప్పుడు ఎవరైనా నన్ను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారా’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చదవండి: ఇమ్రాన్ ఖాన్ కక్కుర్తి పని బట్టబయలు పాకిస్థాన్‌లోని తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష పార్టీల సహాయంతో వాషింగ్టన్లో విదేశీ శక్తులు కుట్ర పన్నినట్లు ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. ఆదివారం నుంచి మొదలైన ప్రజల నిరసనలు ఉద్ధేశిస్తూ.. ‘మేము దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని అంగీకరించము. ఈ చర్యకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చూపించారు. ప్రతిసారీ ఒక ప్రధానమంత్రిని తొలగించినప్పుడు ప్రజలు పండగ జరుపుకుంటారు, కానీ నన్ను పదవి నుండి తొలగిస్తే ప్రజలు నిరసనలు చేస్తున్నారు’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. కాగా అనేక నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడిన విషయం తెలిసిందే. గత ఆదివారం జరిగిన జనరల్ అసెంబ్లీ అవిశ్వాస ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ ఓటమిపాలయ్యారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ రికార్డుల్లో నిలిచారు. అనంతరం పాక్‌కు 23వ ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్‌ను ఎన్నికయ్యారు. మూడు సార్లు పాక్ కు ప్రధానిగా పనిచేసిన నవాబ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ ఖాన్. చదవండి: పాక్ పీఠం షాబాజ్‌కు! ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారు? -
పెషావర్‌లో బాంబు దాడి; ఆందోళనలో క్రికెట్ ఆస్ట్రేలియా
24 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ తీవ్రవాదులు బాంబు దాడితో కంగారెత్తించారు. పెషావర్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారమే పెషావర్‌కు 187 కిమీ దూరంలో ఉన్న రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లలో కంగారు మొదలైంది. ఉగ్రవాదుల దాడుల భయంతో పాకిస్తాన్లో పర్యటించేందుకు ఏ జట్టు ఇష్టపడలేదు. దీనికి తోడూ 2009లో పాక్ పర్యటనకు వచ్చిన లంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఈ దాడిలో లంక క్రికెటర్లు సమరవీర, జయవర్దనే, సంగక్కర సహా తదితర క్రికెటర్లు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తాన్ పోలీసులతో పాటు ఇద్దరు దేశ పౌరులు కాల్పులకు బలయ్యారు. దీంతో పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఇతర దేశాలు నిరాకరించాయి. అయితే ఇటీవలే మా దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ సహా పీసీబీ స్వయంగా వెల్లడించింది. కాగా తమ దేశంలో సిరీస్ ఆడేందుకు రావాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది. ఆ దేశం కోరికను మన్నించి ఇక్కడకు వచ్చింది. 1998లో ఆఖరుసారిగా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. ఆ తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. తాజాగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడడానికి ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై మరోసారి అడుగుపెట్టింది. సిరీస్ నిర్వహణ సజావుగా సాగుతుందా..? అని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ భయపడినట్లే జరిగింది. శుక్రవారం పెషావర్‌లోని కిస్సా ఖవానీ బజార్ ఏరియాలోని మసీదులో బాంబు పేలుడు కలవరం రేపింది. పెషావర్ బాంబు దాడి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రాంతం రావల్పిండికి ఏమంత దూరం కాకపోవడంతో సీఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అయితే పాక్ లో ఉన్న తమ ఆటగాళ్ల భద్రత గురించి ఆసీస్ ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నది. భద్రతకు సంబంధించి ఏ ఆటగాడికి ఇబ్బంది కలిగినా తిరిగి స్వదేశానికి రావొచ్చని సీఏ సూచించినట్టు సమాచారం. అయితే బాంబు దాడి నేపథ్యంలో సీఏ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయం పక్కనబెడితే.. తొలి టెస్టు మొదటి రోజున పాకిస్తాన్ పట్టుబిగించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 80 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (127 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కగా మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (44)ఫర్వాలేదనిపించాడు ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 105 పరుగులు జోడించారు. అబ్దుల్లా నిష్క్రమణతో వచ్చిన అజర్ అలీ (59 బ్యాటింగ్) కలిసి ఇమామ్ ఇన్నింగ్సును నడిపిస్తున్నాడు. ఇక శుక్రవారం కావడంతో ప్రార్థనలకు వెళ్లిన చాలా మంది అమాయకులు బాంబుదాడిలో మరణించారు. అయితే సాయుధులై ఉన్న తీవ్రవాదులు.. ముందు ప్రజలపై కాల్పులు జరుపుదామని ప్రయత్నించినా.. అది వీలుకాకపోవడంతో ఆత్మాహుతికి దిగారని తెలుస్తున్నది. ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ కూడా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు. గాయపడిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులన ఆస్పత్రులకు తరలించి తగిన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. Suicide bombing at Shi'ite mosque in Pakistan's Peshawar kills at least 30 https://t.co/yL6Ssty5f7 pic.twitter.com/rGgAXAimG8 — Reuters (@Reuters) March 4, 2022 -
పాకిస్తాన్లో ఉగ్ర ఘాతుకం: 56 మంది మృతి
Peshawar Explosion:పెషావర్: వాయవ్య పాకిస్తాన్లో.. అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పెషావర్ నగరంలో ఉగ్రవాదులు తీవ్ర ఘాతుకానికి ఒడిగట్టారు. మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 194 మంది గాయాల పాలయ్యారు. ఖైబర్–పఖ్తూంక్వా ప్రావిన్స్‌లో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడుల్లో ఇది కూడా ఒకటని అధికారులు చెప్పారు. పెషావర్‌లోని ఖిస్సా ఖ్వానీ బజార్ ఏరియా సమీపంలో ఇమామ్‌బర్గా వద్ద షియా వర్గానికి చెందిన జామియా మసీదులో పేలుడు జరిగిందని తెలిపారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థే కారణమని నిర్ధారణకు వచ్చారు. షియావర్గం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ కొంతకాలంగా భీకర దాడులకు పాల్పడుతోంది. జామియా మసీదులో పేలుడు ఘటనలో ఉగ్రవాదులు పాల్గొన్నారని ఖైబర్–పఖ్తూంక్వా ప్రభుత్వ అధికార ప్రతినిధి బారిస్టర్ మొహమ్మద్ అలీ సైఫ్ చెప్పారు. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాల్గొన్నప్పటికీ.. వారిలో ఒక్కడు మాత్రమే ప్రార్థనలు జరుగుతున్న సమయంలో తనను తాను పేల్చేసుకున్నాడని పెషావర్ పోలీసు ఉన్నతాధికారి హరూన్ రషీద్ ఖాన్ తెలిపారు. నల్ల రంగు దుస్తులు ధరించిన వ్యక్తిని సూసైడ్ బాంబర్‌గా ఓ ప్రత్యక్ష సాక్షి గుర్తించారు. సదరు ముష్కరుడు తొలుత మసీదు సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపాడని, తర్వాత మసీదు లోపలికి ప్రవేశించి, తనను తాను పేల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. జామియా మసీదులో ఆత్మాహుతి పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. పెషావర్‌లో పేలుడు ఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని ఖైబర్–పఖ్తూంక్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రార్థనల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం అమానవీయం, రాక్షస కృత్యం అని చెప్పారు. -
వైరల్: మాస్క్‌తో భయపెట్టాలనుకున్నాడు.. చివరికి
పాకిస్తాన్: విభిన్నమైన ఫేస్ మాస్కులు ధరించి కొంతమంది పలు వేడుకల్లో సందడి చేస్తారు. అయితే కొన్ని మాస్కులు వినూత్నంగా ప్రముఖుల ముఖాలు, జంతువులను పోలి ఉంటాయి. అటువంటి వాటిని ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని మాస్కులు మాత్రం ఎదుటివారికి భయం కలిగించేలా దెయ్యాలు, వికృతమైన ముఖాలతో తయారు చేయారుబడతాయి. ఆ మాస్కులు ధరించిన వారికి చిక్కులు కూడా తప్పవు కొన్ని సార్లు. అయితే అటువంటి ఓ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని పెషావర్‌కు చెందిన ఓ వ్యక్తి భయంకరమైన ముఖాన్ని పోలిన ఓ మాస్కును ధరించి రోడ్డు మీద వెళ్లే వారిని ఆట పట్టించాలనుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నైలా ఇనాయత్ అనే జర్నలిస్ట్ ట్విటర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మరికొన్ని రోజుల్లో రాబోయే పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ మాస్క్‌ను ధరించి అందరిని భయపెట్టించాలని చూస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే గతంలో కూడా ఇలా భయంకమైన మాస్కులు ధరించి అల్లరి చేసేవారిని పాక్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. This guy arrested in Peshawar, had plans to celebrate independence day by scaring people. Apparently, the police wasn't much impressed, he was caught in his scary mask. pic.twitter.com/eYEe5YIaQE — Naila Inayat (@nailainayat) August 10, 2021 -
పాక్‌లో పేలుడు
పెషావర్: పాకిస్తాన్లో మంగళవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో 8 మంది చిన్నారులు మృతి చెందగా, 120 మంది గాయపడ్డారు. పెషావర్‌లోని డిర్ కాలనీలో ఒక మత పాఠశాల వద్ద ఉదయం ప్రార్ధనల అనంతరం ఈ ఘటన జరిగింది. పేలుడులో 4–5 కిలోల పేలుడు పదార్ధాలు వినియోగించినట్లు అధికారులు చెప్పారు. పేలుళ్లను పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఖైబర్ పక్తున్‌క్వా ముఖ్యమంత్రి మెహ్మద్‌ఖాన్ ఖండించారు. పేలుడు జరిగినప్పుడు పాఠశాలలో దాదాపు 40–50 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. పేలుడుకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. -
దైవ దూషణ: కోర్టులో ముస్లిం హత్య
ఇస్లామాబాద్: ఇస్లాం మతాన్ని కించపరుస్తూ మాట్లాడాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కిరాతకంగా చంపేసిన ఘటన పాకిస్తాన్లో జరిగింది. దైవదూషణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తాహిర్ షమీమ్ అనే ముస్లిం యువకుడు బుధవారం విచారణ నిమిత్తం పెషావర్ సిటీలోని కోర్టుకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఖలీద్ ఖాన్ అనే యువకుడు పోలీసుల కళ్లు గప్పి తుపాకీతో లోనికి ప్రవేశించాడు. అనంతరం అదును చూసి తాహిర్పై కోర్టు గదిలోనే కాల్పులు జరిపి దారుణంగా హత మార్చాడు. (మద్యం మత్తులో దాడి.. అవమానంతో ఆత్మహత్య) దీంతో షాక్ తిన్న పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. మరోవైపు బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు విడిచాడు. తాహిర్ రెండేళ్ల క్రితం దైవ దూషణ చేసినట్లు కేసు నమోదైందని అక్కడి పోలీసు అధికారి అజ్మత్ ఖాన్ వెల్లడించారు. కాగా పాకిస్తాన్లో దైవదూషణను ఘోర నేరంగా పరిగణిస్తారు. దైవదూషణ చేసినట్లు రుజువైతే వారికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధిస్తారు. అయితే మైనారిటీలను బెదిరించేందుకు, వ్యక్తిగత కక్షలు సాధించేందుకు దైవదూషణ ఆరోపణలను ఒక అస్త్రంగా ఉపయోగిస్తారని పాకిస్తానీ, అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. (‘రాడ్లతో కొట్టారు.. మురికి నీరు తాగించారు’) -
పాక్‌లో జైలు నుంచి ప్రేమ ఖైదీ విడుదల
ఇస్లామాబాద్ : గత ఆరేళ్లుగా పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ హమీద్ నెహాల్ అన్సారి విడదలయ్యారు. పాక్‌లో ఉన్న ప్రియురాలిని కలుసుకోవడానికి ఆరేళ్ల కిందట(2012) ఆ దేశం వెళ్లిన హమీద్ నెహల్ అన్సారీ ఆదేశ పోలీసులకు పట్టుపడ్డారు. గూఢచర్యం చెయ్యడానికి వచ్చాడని అతనిపై పాక్ పోలీసులు కేసు పెట్టారు. 2015లో విచారణ చేపట్టిన పాక్ మిలిటరీ కోర్టు హమీద్‌కు మూడేళ్ల కారాగారవాసం విధించింది. నేటితో అతని శిక్ష ముగియడంతో హమిద్ భారత్‌కు తిరిగి రానున్నారు. తన కుమారుడి విడుదల పట్ల హమిద్ తల్లి ఫౌజియా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తన కుమారుడిని చూస్తునందుకు సంతోషంగా ఉందన్నారు. హమిద్ విడుదల మాతవత్వం విజయమని చెప్పారు. వీసా లేకుండా ఆ దేశం వెళ్లడం తప్పే కానీ, తన కుమారుడు వేరే ఉద్ధేశంతో వెళ్లలేదని, ప్రేమించిన అమ్మాయి కోసమే వెళ్లాడని వ్యాఖ్యానించారు. ముంబైలోనే ఒక సాఫ్టవేర్ ఇంజనీర్‌గా పనిచేసిన హమీద్ నెహల్, ఆప్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా ప్రవేశించినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు కున్నారు. అతను ఏడు ఫేస్బుక్ అకౌంట్లు, 30కి పైగా ఈమెయిల్ ఐడీల ద్వారా గూఢచర్యానికి పాల్పడినట్లు పాక్ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో అక్రమంగా దేశంలోకి చొరబడ్డారనే కారణంతో హమిద్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. తీర్పు అనంతరం అన్సారీని పెషావర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు కాగా సోషల్ మీడియాలో అతనికి పరిచయమై ప్రేమకు దారితీసిన పాక్ యువతిని కలుసుకునేందుకే, వీసా లేకుండా ఆ దేశానికి తన కుమరుడు వెళ్లాడని హమిద్ తల్లి ఫౌజియా అన్సారి పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్ మీదుగా పాక్‌కు రమ్మని ఆ యువతి ఇచ్చిన సలహాతోనే హమిద్ వెళ్లాడని చెప్పారు. తన కుమారుడిపై పాకిస్తాన్ చేసిన అభియోగాలను ఆమె ఖండించారు. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం గూఢచార్యం కోసమే తమ దేశంలోని చొరబడ్డారని మూడేళ్లు శిక్ష విధించారు. -
ఆత్మాహుతి దాడి కలకలం
పెషావర్ : పాకిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఓ నేత సహా 14 మంది మృతిచెందగా, దాదాపు 60 మంది మరో తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థ ఈ చర్యకు పాల్పడింది తామేనని ప్రకటనలు విడుదల చేయలేదు. అవామీ నేషనల్ పార్టీ (ఏఎన్పీ) పెషావర్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ఇందులో భాగంగా ఏఎన్పీ నేత హరూన్ బిలౌర్ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. హరూన్ బిలౌర్ను హత్య చేయాలని కొందరు కుట్రపన్నారు. ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా బాంబు పేలిన ఘటనలో 14 మంది మృత్యువాత పడగా 60 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల్లో ఏఎన్పీ అభ్యర్థి హరూన్ బిలౌర్ ఉన్నారు. ఈ నెల 25న జరగనున్న సార్వత్రిక ఎన్నికల బరిలో హరూన్ ఉండటం గమనార్హం. 2013 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఏఎన్పీ అభ్యర్థులు, నేతలపై తాలిబన్లు ఉగ్రదాడులకు పాల్పడిన విషయం విదితమే. దీనిపై పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు దారుణాన్ని ఖండించారు. ఎన్నికల ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు వారి నేతలకు సరైన భద్రత కల్పించాలని ఇమ్రాన్ సూచించారు. ఈ మేరకు ట్వీట్ ద్వారా ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
పాక్ ఎన్నికల్లో భారత సూపర్‌స్టార్ బంధువు!
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బంధువు ఒకరు పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. షారుఖ్‌కు కజిన్ అయిన నూర్ జెహాన్ పాక్‌లోని పెషావర్ నుంచి పోటీ చేయబోతున్నారు. పెషావర్‌లోని PK-77 నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆమె గురువారం ఎన్నికల సంఘం నుంచి నామినేషన్ పత్రాలను తీసుకున్నారని పాక్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక తెలిపింది. షారుఖ్ తండ్రి తరఫు బంధువైన నూర్ జెహాన్ గతంలో రెండుసార్లు షారుఖ్‌ను కలిశారు. ఆమె కుటుంబం ఇప్పటికీ భారత్‌లోని బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంది. ‘మహిళల సాధికారత కోసం నేను పని చేయాలనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను’ అని ఆమె తెలిపారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సోదరుడు మన్సూర్ నాయకత్వం వహిస్తున్నారు. తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యముందని, బచ్చా ఖాన్‌గా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నేతృత్వంలో జరిగిన ఖుదై ఖిద్మాత్గర్ ఉద్యమంలో తమ కుటుంబం చురుగ్గా పాల్గొన్నదని మన్సూర్ తెలిపారు. -
పాకిస్థాన్‌లో సైన్యానికి వ్యతిరేకంగా అందోళనలు
-
పాకిస్తాన్లో ఉగ్రదాడి, ఐదుగురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆఫ్గనిస్తాన్, పాక్ సరిహద్దు ప్రాంతమైన క్రిస్టియన్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఓ పౌరుడు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపడుతున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సూసైడ్ జాకెట్స్ ధరించారని మీడియా సంస్థ డాన్ వెల్లడించింది. -
పాక్ జైల్లో భారతీయ ఖైదీపై దాడి
తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పాకిస్తాన్లో ప్రవేశించాడనే కారణంతో పెషావర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 31 ఏళ్ల భారతీయ ఖైదీపై స్థానిక ఖైదీలు గత కొద్ది నెలల్లో మూడు సార్లు దాడికి పాల్పడినట్లు అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు ముంబైకి చెందిన హమిద్ నెహాల్ అన్సారీ 2012లో తప్పుడు ధ్రువీకరణ పత్రంతో భారత్ నుంచి అఫ్ఘానిస్తాన్ ద్వారా పాక్‌లో ప్రవేశించాడు. హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న తీవ్ర నేరస్తులున్న సెల్లో తన క్లయింట్‌ను ఉంచడం వల్ల వారు అతన్ని తీవ్రంగా కొడుతున్నారని అన్సారీ తరుపు న్యాయవాది పెషావర్ హైకోర్టుకు విన్నవించారు. జైలు హెడ్ వార్డర్ కూడా ఏ కారణం లేకుండానే అతన్ని ప్రతిరోజూ హింసిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. భారతీయ ఖైదీపై దాడి వాస్తవమేనని, ఇదేమీ అంత పెద్ద సంఘటన కాదని, జైళ్లలో ఇటువంటి ఘటనలు సహజమేనని జైలు సూపరింటెండెంట్ అన్నట్లు డాన్ పత్రిక వెల్లడించింది. -
వరుస బాంబు పేలుళ్లు: పోలీస్ మృతి
పెషావర్ : పాకిస్థాన్‌లోని పెషావర్‌లో బుధవారం రెండు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఓ పోలీస్ దుర్మరణం పాలైయ్యాడు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని మాత్ర ప్రాంతంలో రహదారిపై వెళ్తున్న పోలీస్ వాహనమే లక్ష్యంగా బాంబు పేలుడు సంభవించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా ఘటన స్థలికి చేరుకున్నారు. ఆ క్రమంలో మరో బాంబు పేలుడు సంభవించింది. దీంతో స్థానికంగా ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఈ పేలుళ్లలో పోలీసులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని లేడి రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు బాధ్యులం తామేనంటూ ఏ సంస్థ ప్రకటించ లేదు. -
ప్రయాణికులే లక్ష్యంగా పేలుడు : 15 మంది మృతి
-
భారత ఇంజినీర్‌కు పాక్‌లో జైలు శిక్ష
పెషావర్: భారత్‌కు చెందిన ఓ ఇంజినీర్‌కు పాకిస్ధాన్ సైనిక కోర్టు జైలు శిక్షను విధించింది. గూఢాచర్యం కేసులో అతడికి ఈ శిక్షను ఖరారు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ముంబయికి చెందిన ఇంజినీర్ హమిద్ నెహల్ అన్సారీ (31) అఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి గుఢాచర్యం నిర్వహిస్తున్నాడనే అభియోగాలతో పాక్ పోలీసులు, నిఘా విభాగం అధికారులు 2012లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి పలు కోణాల్లో విచారణ చేపట్టిన పాక్ ఆర్మీ కోర్టు తుది తీర్పును వెలువరిస్తూ అన్సారీని దోషిగా ప్రకటించింది. మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. తీర్పు అనంతరం అన్సారీని పెషావర్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పాక్ ఆర్మీ ఉన్నత కోర్టుకు మరోసారి అపీల్ చేసుకునే అవకాశం అన్సారీకి ఉంది. మరోపక్క, అన్సారీని తాము విడిపించుకునేంత వరకు రక్షణ కల్పించాలని పాక్ అధికారులను భారత అధికారులు కోరారు. -
తాలిబన్లపై పాక్ ప్రొఫెసర్ సాహసం
పెషావర్: తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు కూడా ప్రేమకు నిలయాలు అని చెప్తుంటారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో వారు పెరుగుతున్న క్రమంలో విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయులకు కూడా అంతకుమించిన ప్రేమ ఉంటుందని అంటారు. పాకిస్థాన్‌లో ఓ ప్రొఫెసర్ అదే విషయాన్ని రుజువు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తున్నారని తెలిస్తేనే ఆ ప్రాంతాన్ని వదిలి ప్రాణాలు అరచేతబట్టుకొని పారిపోయే ఈ రోజుల్లో ఆ ప్రొఫెసర్ మాత్రం తన విద్యార్థులను కాపాడేందుకు తన ప్రాణాలు అడ్డుగా పెట్టాడు. ఏకంగా భారీ తుపాకులతో దూసుకొస్తున్న ఉగ్రవాదులను నిలువరించేందుకు ఓ సైనికుడిలాగా మారి తన లైసెన్స్ తుపాకీతో వారికి ఎదురు నిలిచాడు. తన దగ్గర తుపాకీతో కాల్పులు జరిపి ఆ ముష్కరులను ఎదుర్కొనే లోపే వారు తెగబడ్డారు. ఆ ప్రొఫెసర్ పై తూటాల వర్షం కురిపించారు. దీంతో 30 ఏళ్ల ప్రాయంలోనే అతడు కన్నుమూశాడు. పాకిస్థాన్‌లో ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలోకి 12 మంది సాయుధులైన ఉగ్రవాదులు బుధవారం చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 24మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సమయంలోనే రసాయన శాస్త్రం బోధించే ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ (34) తన లైసెన్స్ రివాల్వర్ తో అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రాణాలువదిలాడు. ఆయన ప్రాణం కోల్పోయిన తీరును ఆ వర్సిటీ జువాలజీ విద్యార్థి తెలుపుతూ 'ముందు కాల్పుల చప్పుళ్లు వినగానే మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ తానుచెప్పే వరకు భవనం వెలుపలికి రావొద్దని హెచ్చరించారు. అనంతరం ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తన తుపాకీ తీశారు. నేను చూస్తుండగానే ఆయనకు బుల్లెట్ తాకింది. ఆయన కూడా కాల్పులు జరిపారు. అయితే, అంతకంటే వేగంగా ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించడంతో నేను గోడ దూకి పారిపోయాను. మిగితా వాళ్లు కూడా అలాగే చేశారు. మా ప్రొఫెసర్ తో సహా 25మంది ప్రాణాలు విడిచారు' అని అతడు వివరించాడు. -
పాక్‌లో ఆత్మాహుతి దాడి, ఐదుగురి మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని పెషావర్ నగరం మరోసారి బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పెషావర్ నగరం శివారున పోలీస్ చెక్‌పోస్ట్ సమీపంలో పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దుర్ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో 20 మంది గాయపడినట్టు సమాచారం. గతంలో పెషావర్‌లో స్కూలుపై ఉగ్రవాదులు దాడి చేసి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. -
లెజెండరీ నటుడి 'హవేలి'ని కూల్చేస్తున్నారు!
పెషావర్: పాకిస్థాన్ పెషావర్‌లోని బాలీవుడ్ లెజెండరీ నటుడు రాజ్‌కపూర్‌కు చెందిన చారిత్రక నివాసాన్ని పాక్షికంగా కూల్చేశారు. ఈ నివాసం స్థానంలో ఓ ప్లాజా కట్టాలని భావిస్తున్న యజమానులు.. దాని మొదటి అంతస్తును కూల్చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఖైబర్ పఖ్తూన్ఖా అధికారులు కూల్చివేతను ఆపివేయించారు. స్థానిక కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకురావడం ద్వారా తాత్కాలికంగా కూల్చివేతకు బ్రేక్ పడింది. అయితే ఈ ఉత్తర్వులు వచ్చేలోపు యజమానులు 'హావేలి' (కోట) మొదటి అంతస్తును మొత్తం కూల్చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటులు రాజ్‌కపూర్, దిలీప్కపూర్ పెషావర్‌లో జన్మించారు. దీంతో వారి నివాసాలను చారిత్రక వారసత్వ సంపదగా కాపాడుతామని ఖైబర్ పఖ్తూన్కా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయినప్పటికీ రాజ్‌కపూర్ 'హవేలి' భారీగానే ధ్వంసమైంది. పాక్ ప్రభుత్వం ఏమైనా చేసుకోని! రాజ్‌కపూర్ నివాసాన్ని కూల్చివేయడంపై ఆయన కుమారుడు, నటుడు రిషి కపూర్ స్పందించారు. పెషావర్‌లోని తమ తాత పృథ్వీరాజ్ కపూర్ నివాసంతో తమకు ఎలాంటి భావోద్వేగమైన అనుబంధం లేదని, ఆ నివాసాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఏం కావాలంటే అది చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఆ నివాసాన్ని తామెన్నడూ చూడలేదని ఆయన చెప్పారు. -
ఇటు నిర్భయ.. అటు పెషావర్
స్వాతంత్య్రానంతరం ఇరు దేశాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు ఘోర సంఘటనలను భారత్, పాకిస్థాన్ గుర్తు చేసుకుంటున్నాయి. మూడేళ్ల క్రితం డిసెంబర్ 16న భారత రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై పాశవిక లైగింకదాడి, అనంతరం దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు.. కొత్త చట్టాలకు బాటలు వేస్తే, ఏడాది క్రితం ఇదే డిసెంబర్ 16న పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు సాగించిన నరమేధం.. పాలు పొసి పెంచిన ఉగ్రవాదమనే పాము తనను కూడా కాటేయకుండా ఉండదని పాక్‌కు తెలిసొచ్చేలా చేసింది. మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు జస్టిస్ వర్మ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన చట్టానికి 'నిర్భయ' పేరు పెట్టుకుంది భారత్. పెషావర్ మారణహోమం తర్వాత ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది పాక్. ఆ మేరకు ఉగ్రవాదులకు ఉరిశిక్షల అమలుపై కొనసాగుతున్న మారటోరియాన్ని ఎత్తేసి నాలుగు నెలల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులకు మరణ దండన విధించింది. నిర్భయ చట్టం రూపొందించినంత మాత్రన మన దేశంలో లైంగిక దాడులు ఆగలేదు. మరణశిక్షలు అమలు చేసినంత మాత్రాన పాకిస్థాన్‌లో ఉగ్రవాదమూ అంతమొందలేదు. కానీ ఆ రెండు ఘటనలు ఇరుదేశాల పౌరుల ఆలోచనా సరళిని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు ఇండియాలో వేధింపులు తగ్గలేదు. కానీ వేధింపులను భరించే మహిళల సంఖ్య తగ్గింది. కాటేయజూసినవాడు కన్నతండ్రైనా, సొంత అన్నైనా, ఉపాధ్యాయుడైనా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే పోయే 'పరువు' కంటే, పిల్లల ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి భారతీయ కుటుంబాలు. కేవలం దాయాది దేశం మీద ద్వేషంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే.. భావితరం బతకలేదని గుర్తించారు పాకిస్థానీ పేరెంట్స్. -
'టీచర్ చేతిలో పేలిన తుపాకీ.. విద్యార్థి బలి'
పెషావర్: పాఠశాలలోని స్టాప్ రూంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఉపాధ్యాయుడి తీరు ఒక విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. తన పిస్తోల్‌ను అతడు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలి పన్నేండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పాకిస్థాన్ లోని పెషావర్ లో చోటుచేసుకుంది. అదేంటి ఉపాధ్యాయుడి చేతిలో తుపాకీ అనుకుంటున్నారా.. ! గత డిసెంబర్లో పాక్ లోని పెషావర్ పాఠశాలపై ఉగ్రవాదులు విరుచుకుపడి 132 మందిని బలితీసుకున్న అనంతరం అక్కడి ఉపాధ్యాయులకు తమతో తుపాకీలు పాఠశాలలకు తీసుకెళ్లే అనుమతినిచ్చింది. అందుకోసం వారికి జనవరిలో శిక్షణ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రోజువారిగా తుపాకీ తెచ్చుకుంటున్న మజీద్ ఖాన్ అనే టీచర్ దానిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి వరండా గుండా దూసుకెళ్లి పన్నెండేళ్ల విద్యార్థికి తగిలింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రతి ఒక్క పాఠశాలకు పోలీసు గార్డులను ఏర్పాటుచేయలేని కారణంగా ఉపాధ్యాయులకే పాక్ తుపాకీలు ఇచ్చింది. -
పెషావర్‌లో ఉగ్రవాదుల దాడి
-
పెషావర్‌లో మళ్లీ ఉగ్రవాద దాడి
-
పాక్ ప్రావిన్స్ ఫక్తూన్వాలో టీచర్ల దుస్థితి!
-
నగరంపై ఉగ్రవాదుల నజర్
సాక్షి, ముంబై: ఇటీవల పాకిస్థాన్‌లో మారణకాండ సృష్టించిన ఐసిస్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ముంబైలోని పాఠశాలలపై కన్నేసినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ ముఖ్యంగా నగరంలోని గుజరాత్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయని ట్విటర్ ద్వారా బయట పడింది. ఇటీవల పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ స్కూల్‌పై దాడిచేసి సుమారు 145 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్నారు. ఇదే తరహాలో ముంబైలోని పాఠశాలపై దాడులు చేయనున్నట్లు అందులో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రెండు నెలల కిందట కల్యాణ్‌కు చెందిన నలుగురు ముస్లిం యువకులు హజ్ యాత్రకు వెళ్లి అక్కడ ఉగ్రవాదులతో కలిసినట్లు వార్తలు వచ్చాయి. అందులో అరీబ్ మాజిద్ తిరిగి భారత్‌కు వచ్చాడు. మిగతావారు ఐసీస్‌లో చేరారు. ఆ ముగ్గురిలో ఒకడైన ఫహద్ శేఖ్ ఈ విషయాన్ని ట్వీట్ చేసినట్లు కేంద్ర గూఢచార సంస్థ తెలిపింది. దీంతో పోలీసులు ముంబైలోని గుజరాత్‌తోపాటు ఇతర పాఠశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్వీట్లో పొందుపర్చిన వివరాలిలా ఉన్నాయి... ‘2008 నవంబర్ 26న నగరంలో అక్కడక్కడ దాడులు చేయడానికి కారణం గుజరాతీయులను హతమార్చడమే ప్రధాన లక్ష్యం. దశకంన్నర కిందట గుజరాత్లో మతఘర్షణలు సృష్టించి ముస్లింలపై దాడులు చేయడానికి ముంబై నుంచి గుజరాతీలు డబ్బులు పంపించారు. ఈ ఘటనలో అనేక మంది అమాయక ముస్లింలు మరణించారు. దానికి ప్రతీకారంగానే ముంబైలోని గుజరాతీయులను లక్ష్యంగా చేసుకుంటు’న్నట్లు ట్వీట్లో స్పష్టం చేశాడు. ఐసీస్ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు ములుండ్, ఘాట్కోపర్, విలేపార్లే, కాందివలి, బోరివలి, దహిసర్ తదితర గుజరాతీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో హై అలర్ట్ జారీచేశారు. ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్), క్విక్ రెస్పాన్స్ టీంలను అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు శాఖ హెచ్చరించింది. -
1,159 విద్యాసంస్థలకు ‘ఉగ్ర’ ముప్పు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 1,159 విద్యాసంస్థలు ఉగ్రవాద దాడులకు సులభంగా గురయ్యే ప్రమాదముందని పోలీసులు చెప్పారు. వీటిలో పలు కళాశాలలు, 22 యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. నగరంలోని 77 మార్కెట్లు, 14 ఆస్పత్రులకు కూడా ఉగ్రవాద ముప్పు ఉందని తెలిపారు. కాగా, ఈ నెల 16న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఓ పాఠశాల విద్యార్థులపై ఉగ్రవాదుల దాడి కేసులో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నివేదికను సిద్ధం చేశారు. 11 మంది ఉగ్రవాదులు ఈ నెల 16న లాండికోటల్ పట్టణం నుంచి పెషావర్‌లోకి అడుగుపెట్టగా అందులో ఏడుగురు దాడిలో పాల్గొన్నట్లు, మిగిలిన నలుగురు తిరిగి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. -
‘సైనిక పాఠశాల’తో పాఠం
విశ్లేషణ పెషావర్ సైనిక పాఠశాల మీద విరుచుకుపడి 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని తాలిబాన్ మట్టుబెట్టడం ప్రపంచాన్ని కలచివేసింది. బ్రిటిష్ వలస పాలన నుంచి ఉపఖండానికి వారసత్వంగా అందిన అలజడి విశ్వానికి బెడదగా మారి చాలా కాలమైంది. ఆ అలజడినే ఇప్పుడు అమెరికా పోషిస్తోంది. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్లలో ఉగ్ర కార్యకలాపాలకు ఊతమిచ్చిన అగ్రదేశాలు, మరో పక్క వారికి వ్యతిరేకంగా సైనిక వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాయి. కశ్మీర్, పాక్, అఫ్ఘాన్, అమెరికా, ఇరాక్లలో దాడులు, న రమేధం వీటి పరిణామమే. పెషావర్ పాఠశాల మీద దాడి వాటి కొనసాగింపే. ‘పాకిస్తాన్‌లోని పెషావర్ సైనిక పాఠశాలలో చదువుతున్న 132 మందిని దండెత్తి చంపిన ముష్కరులు (తాలిబాన్ ఉగ్రవాదులు) ఇస్లామ్ ధర్మానికే శత్రు వులు. ఈ నీచమైన చర్యకు పాల్పడినవారు మానవ జాతికే శత్రువులు, వీళ్లు అల్లాకు శత్రువులు’. - నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి: (16.12.2014) ‘ప్రజలందరి రక్తం ఒక్కటే. అది హిందువుదైనా, ముస్లిందైనా, క్రైస్తవుడిదైనా- ఏమతమైనా శాంతినే కోరుకుంటుంది. రక్తపాతం ఇస్లాం ధర్మానికే వ్యతిరేకం’ - తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ: (18-12-2014) పాక్ సైన్యం అమెరికాతో మిలాఖత్ అయి తమ కుటుంబాలను హతమా రుస్తున్నందుకు ప్రతీకారంగా ఈ పని చేశామని మతోగ్రవాద సంస్థ తాలిబాన్ ఉన్మాదులు ప్రకటించుకున్నారు. వాయవ్య ప్రాంతంలోని పెషావర్ సైనిక పాఠ శాలలో చదువుకుంటున్న ముక్కుపచ్చలారని చిన్నారులను చంపిన తరువాత తాలిబాన్ చెప్పిన కారణమిది. ఈ దుర్మార్గం భారత ఉపఖండ దేశాల ప్రజలనే గాక, ప్రపంచ దేశాల పౌర సమాజాలను కూడా కలచివేసింది. ఉన్మాదానికి సరి హద్దులూ, వాస్తవాధీన రేఖలూ ఉండవు. చరిత్రలో దాని జాడ కూడా సుదీర్ఘమై నదే. అన్ని దేశాల, అన్ని మతాల ధర్మసూత్రాలూ శాంతిని, సౌమనస్యాన్నే ప్రబోధిస్తున్నప్పుడు మత ఘర్షణలు ఉన్మాదరూపం ఎందుకు ధరిస్తున్నాయి? ఆసియా ఖండానికీ, భారత ఉప ఖండానికీ తాజా ‘పెషావర్ ఘటన’ చెబుతున్న పాఠం ఏమిటి? వలస పాలకులు మిగిల్చిన సమస్య భారత్, పాకిస్తాన్ విభజనకోసం, ఆ రాజకీయాల కోసం బ్రిటిష్ వలసపాల కులూ, అధికార తాపత్రయంలో ఉభయ మతాలకు చెందిన నాయకులూ రేపిన చిచ్చు ఉపఖండంలో ఈరోజు దాకా ఆరలేదు. ఆయుధ వ్యాపారం కోసం యుద్ధ రాజకీయాలు నడుపుతున్న ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఆ చిచ్చు ఆరకుండా జాగ్రత్తపడుతున్నారు. అందు లో భాగమే తాలిబాన్ సృష్టి. తొలుత ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాద పాలక వర్గాలు అఫ్ఘానిస్థాన్‌లో సోవియెట్ పలుకుబడిని దెబ్బకొట్టడం కోసం అక్కడి సెక్యులర్ (మతాతీత లౌకిక) ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ముందు ముజా హుదీన్ల పేరిట, ఆ తరువాత తాలిబాన్ పేరిట సెక్యులర్ వ్యతిరేకశక్తులకు డబ్బు, మారణాయుధాలిచ్చి సాకుతూ వచ్చారు. ఫలితంగానే అఫ్ఘానిస్తాన్‌లోని సెక్యులర్ ప్రభుత్వం కూలిపోయింది. ఇంత జరిగినా తమకొచ్చే దీర్ఘకాలిక రాజ కీయ ప్రయోజనంగానీ, సొంత ప్రభుత్వ స్థాపన గానీ సాధ్యపడదని నిర్ధారిం చుకోవడమే కాకుండా, తమను ఆంగ్లో-అమెరికన్లు ‘కరివేపాకు’లా వాడుకుం టున్నారని తాలిబాన్ గ్రహించింది. సామ్రాజ్యవాద పాలకులు కూడా, తాలి బాన్ దీర్ఘకాలంలో ఎదురు తిరిగి తమకే ‘ఏకు మేకవు’తారని వారిపైనే యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమైనారు. దాని ఫలితంగానే 2002 సెప్టెంబర్ 11న కొత్త నాటకానికి తెరలేచింది. అదే - అమెరికాలోని వాణిజ్య కేంద్రమైన భారీ జంట సౌధ సముదాయంపై పౌర విమానాలతో జరిగిన దారుణ ఘటన. ఇందుకు బాధ్యులెవరై ఉంటారన్న వెతుకులాటలో తమకు తాజాగా శత్రువులుగా మారిన తాలిబాన్‌నూ, ఇరాక్‌లో సెక్యులర్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సద్దాం హుస్సేన్‌నూ ఆంగ్లో-అమెరికన్లు ‘టార్గెట్’గా పెట్టుకుని, వారిని హతమార్చే వ్యూహరచనకు దిగారు. నిజానికి తాలిబాన్ అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా పెంచి పోషించిన శక్తే. కాగా ‘ట్విన్ టవర్స్’ కూల్చివేతకు ఎవరు సూత్రధారులో ఇప్ప టిదాకా తేల్చలేకపోయారు. దానిపైన అమెరికన్ సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాత మూర్ తీసిన చిత్రం (‘‘9/11’’) మనకు తెలియని రహస్యాల్ని బయట పెట్టింది. చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త, ప్రపంచ వ్యవహారాల విశ్లేషకుడు ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ ‘‘9/11’’ దుర్ఘటనపైన ఆ పేరుతోనే ఒక గ్రంథం రాశాడు. ఆ దుర్ఘటన నిర్వహణ తీరును ఒకే ఒక్క వాక్యంతో తేల్చాడు: ‘ఈ దుర్ఘటనకు (సుమారు 3,000 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గానికి) సంబంధించిన నిజాలను పూర్తిగా చరిత్ర నుంచి తొలగించడం జరిగింది’ (ఫ్యాక్ట్స్ హేవ్ బీన్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రం హిస్టరీ). ఎందుకంటే, ఈ దుశ్చర్యకు తోడ్పడిన సాధన సంపత్తి అంతా - అమెరికా సైనిక శిక్షణ కేంద్రమూ, నేరగాళ్ల ఆటస్థలం ఫ్లోరిడా నగరం నుంచే, స్థానిక అమెరికన్ విమానాల సమీకరణతో జరిగిందనేది మరచిపోరాదు. అంటే, ఇంటిదొంగ (అమెరికన్) దొరికిపో యాడు. అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ ‘ట్విన్ టవర్స్’పై విమానదాడికి ముందు ఎక్కడున్నాడు? మారుమూల ఒక ప్రాంతంలో ఎలా తలదాచుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ట్విన్ టవర్స్ కూల్చివేత రహస్యం అందుకే అసలు దాడి రహస్యాన్ని తెలుసుకునేందుకు 1,500 మంది అమెరికన్ ప్రసిద్ధ భవన నిర్మాణపు ఇంజనీర్లు, వాస్తుశిల్పులూ, నిజనిర్ధారణ సంఘాలూ ఒక భారీ విచారణ సంఘంగా ఏర్పడి ‘ట్విన్ టవర్స్’ పతన కారణాలపైన సమగ్ర విచారణ జరిపి తీరాల్సిందేనని పట్టుబట్టారు. మిరుమిట్లు గొలిపే నివేది కను ప్రపంచం ముందుంచారు. కాని దాన్ని అమెరికా పాలకులు పక్కన పెట్టే శారు. ఎందుకంటే అమెరికా పాలకులకు ఒక సిద్ధాంతం ఉంది - ‘సాధ్యమైతే దేశాలపైన చర్యకు అమెరికా ఇతర దేశాలను కలుపుకుని దిగుతుంది, ఒకవేళ దాడులు ఉమ్మడిగా సాధ్యపడకపోతే అమెరికా ఏకపక్షంగా చర్యకు దిగుతుంది’. మాజీ అధ్యక్షుడు క్లింటన్ దీనిని (1993) ప్రకటించాడు! ఇందుకొక సూత్రాన్ని బుష్ కనిపెట్టాడు: అమెరికా ఉగ్రవాదాన్ని మరచిపోండి, ‘ప్రపంచ ఉగ్రవాదం (టైజం)పై కత్తి కట్టడానికి అమెరికాతో చేతులు కలపాలి, లేదా కలపని దేశా లను దేశాధిపతులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తాం, జరిపే విధ్వంసకాండకు మీరు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది’ అని ప్రగల్భించాడు (‘న్యూయార్క్ టైమ్స్’ లో బుష్ ప్రకటన ప్రచురణ: 2001 సెప్టెంబర్ 4). అంటే ట్విన్ టవర్స్‌పై స్థాని కంగానే జరిగిన దాడికి వారం రోజుల ముందుగానే వెలువడిన బుష్ (జూని యర్) ప్రకటన ఇది. అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌లపై అమెరికా వేట, తానుగా అల్లు కున్న ‘మిష’ ఆధారంగా అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌లపై యుద్ధాలు, లక్షలాది మంది అరబ్బు ప్రజలపై జరిపిన మారణకాండ అక్కడి నుంచే మొదలైనాయి. ఇంకా అఫ్ఘానిస్తాన్లోనూ, ఇరాక్‌లోనూ ‘నాటో’ కూటమి, దుష్టచతుష్టయం (యూరప్ దేశాలు సహా) జరిపిన దురాక్రమణలూ; అఫ్ఘానిస్తాన్, ఇరాక్లలో అమెరికా తైనాతీ ‘ప్రభుత్వాల’ ఏర్పాటు అందులో భాగమే. ‘ఉగ్రవాద’ మిషపైన కశ్మీర్ పక్కలో బల్లెంగా, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా అఫ్ఘానిస్తాన్, ఆంగ్లో- అమెరికన్ సైనిక కూటమి ‘నాటో’ సైన్యాల తిష్ట కూడా ఆ క్రమంలోనిదే. అటు పాకిస్తాన్ సైన్యాన్ని ఇన్నాళ్లూ సాకుతూ వస్తూన్న ఆంగ్లో-అమెరికన్లను అక్కడే తాలిబాన్ ఎదిరించి డీకొనడమూ, అమెరికాకు వ్యతిరేకంగా తమతో కలసిరాని పాకిస్తాన్ పౌర ప్రభుత్వ పాలకులపైన, ఎదురొచ్చిన పాక్ పౌరులపైన తాలి బాన్ ఎదురుదాడులకు దిగడమూ, భీతావహులను చేయడం ఈ పరి ణామాలలో భాగమే. పెషావర్ పాఠశాల ఘటన ఆ క్రమంలోనిదే. మూడో శక్తికి చోటివ్వరాదు పాక్, చైనాలకు ఇండియా మిత్రదేశంగా ఉండటం ఆంగ్లో - అమెరికన్లకు ఇష్టం లేదు. అందుకే సంప్రదింపులకు భారత-పాకిస్తాన్ మధ్య అవకాశాలున్నా, వాటిని ఏదో ఒక రూపంలో చెదరగొట్టడం సామ్రాజ్యవాద పాలకుల లక్ష్యం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇండియా కేంద్రంగా కవ్వింపుతో నిర్వహించిన అఫ్ఘాన్ యుద్ధాలు, విస్తరణ చర్యలూ మనకు తెలుసు. ఫక్తూనిస్తాన్ ఏర్పడ కుండా భారత నాయకుల్ని బ్రిటన్ దువ్వుతూ వచ్చిన రహస్యమూ తెలుసు. అందువల్ల చరిత్ర పాఠాలు మరొక్కసారి చదువుకుని భారత్, పాకిస్తాన్ పాలకులు మూడో శక్తి ప్రమేయం లేకుండా నిరంతర సంప్రదింపుల ద్వారా జాగరూకులై స్వతంత్ర నిర్ణయాలు చేసుకుంటే ఉపఖండంలో శాంతికి వీలుంది. ఉగ్రవాదాలకు, అగ్రవాద కుట్రలకు స్వస్తి చెప్పించవచ్చు. గతించిన నాటి క్రిస్టియన్-ముస్లిం పాలకుల మత యుద్ధాలకూ, సామాన్య క్రైస్తవ, ముస్లిం ప్రజాబాహుళ్య శాంతి ప్రయోజనాలకూ సంబంధం లేదు! అటు పాకిస్తాన్, ఇటు అఫ్ఘానిస్తాన్. ఈ రెండు దేశాలూ మనకు ఇరుగు పొరుగు. అఫ్ఘానిస్తాన్‌లో మన వాళ్లకు కార్పొరేట్ కాంట్రాక్టులు ఎరచూపి అమెరికా మనల్ని యుద్ధాల్లోకి దించే అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే బ్రిటిష్ వాళ్ల నిష్ర్కమణ తర్వాత కశ్మీర్‌పై కన్ను వేసిన అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో 1948-49 నాటి ఫిర్యాదుల ఉపసంహరణ జరగనంత కాలం జోక్యం చేసుకునే విధానానికి అమెరికా వెరవదు గాక వెరవదు. అలాగే అఫ్ఘాన్‌ను ఆక్రమించి కూర్చున్నట్టే కశ్మీర్లో తలచుకున్నదే తడవుగా అఫ్ఘానిస్తాన్‌లోని ‘నాటో’ కూటమి సేనలను కశ్మీర్లోకి నడిపించడానికి కూడా అమెరికా వెనుకాడదు. పైగా ఇప్పుడు హమీద్ కర్జాయ్ పాలన ముగిసి, అమెరికా ఆశీస్సులతో ఆష్రాఫ్ ఘనీ పాలన అఫ్ఘాన్‌లో కొనసాగుతోంది. భారత్-పాక్ చర్చలే కీలకం కనుక భారత-పాకిస్తాన్ పౌర ప్రభుత్వాలు తమ మధ్య కశ్మీర్ సమస్యను మరిం త జటిలంగా మార్చుకోకుండా ఉపఖండ శాంతి ప్రయోజనాల కోసం తక్షణం చర్చల ప్రక్రియకు ప్రాణప్రతిష్ట చేయాలి. మూడో శక్తి ప్రమేయానికి తావు లేకుం డా అప్పుడే జాగ్రత్త పడగలరు. ఇది రెండు దేశాల ప్రజల సమస్య. నాయకుల పదవుల సమస్య కాదు. దీనిని గుర్తించాలి. అలాగే ఉభయ దేశాలలోని వివిధ మత ఛాందసవాదులకు కళ్లెం వేయడం ఉభయ దేశాల పాలకుల ఉమ్మడి ఎజెండాగా కూడా ఉండాలి. అన్నింటికీ మించి, బ్రిటిష్ వలస పాలన మిగిల్చిన ఈ కాష్టం ప్రచ్ఛన్నయుద్ధంతో మరోసారి భగ్గుమంది. దీనితో పాత సమస్యలు కొత్తరూపంలో వేధిస్తున్నాయి. పెషావర్ సైనిక స్కూలు బాలలపై జరిగిన హత్యాకాండ గానీ, అంతకు ముందు జరిగిన అనేక మారణహోమాలు వీటన్నిటి ఫలితాలే. (వ్యాసకర్త మొబైల్: 98483 18414) -
ఉగ్రవాదంపై పోరు ఇలాగేనా?!
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు పాఠశాలపై దాడిచేసి 132 మంది పిల్లలతోసహా 145 మందిని పొట్టనబెట్టుకుని ఆరు రోజులవుతున్నది. వారి క్రౌర్యాన్ని, ఉన్మాదాన్ని మరచిపోవడం పాకిస్థాన్‌కు ఇప్పట్లో సాధ్యం కాదు. ఆ దుర్మార్గం జరిగిన వెంటనే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పాక్‌నుంచి మాత్రమే కాదు...అఫ్ఘాన్‌నుంచి, ఆమాటకొస్తే ఈ ప్రాంతంనుంచే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆ సందర్భంగా ఆయన ప్రకటించారు. మరణశిక్షలపై దేశంలో ఉన్న మారటోరియాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత పాక్ పరిణామాలను గమనిస్తే ఉగ్రవాదంపై ప్రకటించిన యుద్ధం అక్కడ సవ్యమైన దిశలో వెళ్తున్నదా అనే సందేహం కలుగుతుంది. 2008లో ముంబై ఉగ్రవాద ఘటనకు కుట్రపన్నిన ఉగ్రవాది లఖ్వీకి పెషావర్ విషాదం జరిగిన మూడు రోజులకే రావల్పిండి కోర్టు బెయిల్ మంజూరుచేసింది. దీనిపై ఇంటా,బయటా తీవ్ర నిరసనలు వెలువడ్డాక అతన్ని ప్రజా భద్రత చట్టంకింద మూడు నెలలు నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరోపక్క ఉగ్రవాద ఘటనల్లో మరణశిక్ష పడినవారికి ఆ శిక్షను అమలు చేయడమూ ప్రారంభమైంది. పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌పై హత్యాయత్నం చేసిన నలుగురు ఉగ్రవాదులను వెనువెంటనే ఉరితీశారు. అదే కేసులో ముద్దాయిలైన మరో నలుగురికి కూడా మరణశిక్ష అమలుచేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు... ఈ వారంలో 500 మంది ఉగ్రవాదులకు ఉరి బిగించబోతున్నట్టు ఒక అధికారి చెప్పారు. పాకిస్థాన్‌లో మొత్తం 8,261 మంది ఉరిశిక్ష పడిన ఖైదీలున్నారు. వీరిలో 30 శాతంమంది...అంటే దాదాపు 2,580 మంది ఉగ్రవాద ఉదంతాల్లో దోషులుగా తేలినవారు. పాకిస్థాన్‌లో 2002 తర్వాత 60,000 మంది ఉగ్రవాదుల దుశ్చర్యకు బలైపోయారు. అయితే, మారటోరియం ఎత్తేశాక ప్రభుత్వం ముందుగా ఉరిశిక్షకు ఎంపిక చేసుకున్నవారంతా ముషార్రఫ్‌పై దాడికి దిగినవారే కావడం కేవలం యాదృచ్ఛికమేనా అనే సందేహం సహజంగానే తలెత్తుతుంది. పెషావర్ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదులపై పాక్ సైన్యానికి ఆగ్రహావేశాలున్న మాట నిజమే. వారొక్కరికి మాత్రమే కాదు...ప్రపంచం మొత్తమే ఆ దుర్గార్గులను శిక్షించాలని కోరుకుంటున్నది. ఈ పన్నెండేళ్లలో ఉగ్రవాదుల ఆగడాలకు బలైపోయిన 60,000 మందికి చెందిన కుటుంబాల వారూ అదే కోరుకుంటున్నారు. మరణశిక్ష అమలులోని మంచిచెడ్డల మాట అలా ఉంచి అసలు దాన్ని అమలు చేయడానికి ఎంపిక చేసుకున్న విధానం ఎలాంటిదో ఒకసారి పాక్ సరిచూసుకోవాలి. పాక్ సైన్యానికి ఉగ్రవాదం విషయంలో స్పష్టత లేదు. ‘ఒక దేశం ఉగ్రవాదులుగా ముద్రవేసినవారు మరో దేశం దృష్టిలో దేశభక్తులు కావొచ్చ’ని దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్వయంగా ముషార్రఫ్ అన్నారు. మన దేశంలో దాడులకు దిగుతున్నవారినుద్దేశించి ఆయన ఆ మాటలన్నారు. అలాంటి అభిప్రాయం ఉండబట్టే పాక్ సైన్యం కొన్ని ఉగ్రవాద గ్రూపులకు అండగా నిలుస్తున్నది. వారికి ఆయుధాలు, శిక్షణ వంటివి ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. భారత- పాక్‌ల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడుతుందనుకున్న ప్రతిసారీ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ గ్రూపులను రంగంలోకి దించి మారణకాండకు కారణమవుతున్నది. ఇటు రాజకీయ వ్యవస్థ కూడా మతాన్ని, రాజకీయాలనూ కలగాపులగం చేయడంవల్ల...మతం బోధించే అంశాలను వక్రీకరించడంవల్లా దాదాపు అన్ని స్థాయిల్లోనూ ఉగ్రవాదులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. తాము బలంగా ద్వేషించే మతస్తులపైనో, దేశంపైనో ఉగ్రవాదులు దాడులకు దిగినప్పుడు సంబరపడే స్థితి ఈ వాతావరణంవల్ల ఏర్పడింది. ఇదే పెషావర్‌లో నిరుడు సెప్టెంబర్‌లో ఆల్ సెయింట్స్ చర్చిలో ఇద్దరు మానవ బాంబులు తమను తాము పేల్చుకున్నప్పుడు వందమందికిపైగా మరణించారు. ఆ ఉదంతంపై ఇంతరకూ సరైన చర్యలు లేవు. ఇకపై తమకు మంచి తాలిబన్లు, చెడ్డ తాలిబన్లు అనే విచక్షణ ఉండబోదని షరీఫ్ ఇప్పుడు ప్రకటించి ఉండొచ్చుగానీ ఇలాంటి వాతావరణం అంత సులభంగా మారదు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)పై పాక్ సైన్యం చర్యలు తీసుకుంటున్న మాట వాస్తవమే అయినా అది ఇప్పటికీ జమా ఉద్ దవా, లష్కరే తొయిబా, హక్కానీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో తనకున్న బాంధవ్యాన్ని తెగదెంపులు చేసుకోలేదు. తమ అస్తవ్యస్థ విధానాల పర్యవసానంగా ఏర్పడిన సంక్షోభంనుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, ఇరుగు పొరుగు దేశాల్లో అలజడులు సృష్టించడానికి పాకి స్థాన్లోని పాలకవర్గం ఆదినుంచీ ఇలాంటి గ్రూపులను ప్రోత్సహిస్తుంటే...పనిలో పనిగా తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి సైన్యం కూడా ఉగ్రవాదులను చేరదీస్తున్నది. ఇది వికటించిన కారణంగానే పెషావర్‌లో ఉగ్రవాదుల కదలికలపై ఉప్పందించే వారు లేకుండా పోయారు. దీన్నంతటినీ సరిచేయకుండా ఆదరా బాదరాగా ఉరిశిక్షల అమలు ప్రారంభించడంవల్ల సాధించాలనుకుంటున్నదేమిటో పాక్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. సైన్యమూ, భద్రతావ్యవస్థ, ప్రభుత్వం లోని సమస్త విభాగాలూ ఇకనుంచి అయినా పారదర్శకతతో, జవాబుదారీతనంతో పనిచేయాలి. ఇంతవరకూ తమవైపుగా జరిగిన తప్పులను చిత్తశుద్ధితో సమీక్షించు కుని సరిచేసుకోవాలి. భారత్, అఫ్ఘాన్వంటి దేశాలతో కలిసి పనిచేయాలి. ఇవేమీ చేయకుండా కొన్ని ఘటనలకు పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీసి, ఎంచుబడిగా కొన్ని ఉగ్రవాద ముఠాలపై మాత్రమే గురిపెట్టి చర్యలకు ఉపక్రమించడంవల్ల సరైన ఫలితాలు రావు. ఉగ్రవాదంపై జరగాల్సిన విస్తృత పోరాటాన్ని కుదించడంలోని ప్రమాదాన్ని పాకిస్థాన్ గ్రహించుకోవాలి. -
పలు పాఠశాలల్లో భద్రతా చర్యలు
పెషావర్ ఘటన ప్రభావం న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పెషావర్‌లోగల పాఠశాలలో తాలిబన్ రక్తపిశాచుల మారణకాండ నేపథ్యంలో నగరంలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు తగు భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విషయమై లక్ష్మణ్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఉషారాం మాట్లాడుతూ తమ పాఠశాలకు సమీపంలోనే మెట్రో రైల్వేస్టేషన్ ఉందన్నారు. ఇందువల్ల ఎవరైనా తమ పాఠ శాల వద్దకు సులువుగా చేరుకునేందుకు వీలవుతుందన్నారు. ఇలా ఉండడం తనకు ఎంతో అసౌకర్యంగా అనిపిస్తోందన్నారు. అందువల్ల తమ పాఠశాల ప్రహరీగోడ ఎత్తును పెంచాలని నిర్ణయించామన్నారు. దీంతోపాటు భద్రతా చర్యల్లో భాగంగా లంచ్ బాక్సులను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించామన్నారు. దీంతోపాటు పాఠశాల ప్రాంగణమంతటా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. కాగా పెషావర్ ఘటన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ పాఠశాలల యాజమాన్యాలకు కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. ఇదిలాఉంచితే సాధారణంగా పాఠశాలల్లోకి లంచ్ బాక్సులను అనుమతిస్తారు. అయితే పెషావర్ ఘటన నేపథ్యంలో ఇకపై పాఠశాలకు తీసుకొచ్చే ప్రతి వస్తువునూ తనిఖీ చేయనున్నారు. ఇదే విషయమై మరో పాఠశాల ప్రిన్సిపాల్ నీనా మాట్లాడుతూ ‘ఒకసారి విద్యార్థి బడిలోకి అడుగుపెట్టిన తర్వాత ఎటువంటివాటినీ లోపలికి అనుమతించబోం. ఒకవేళ విద్యార్థులు ఎవరయినా భోజనం మరిచిపోయి వస్తే వారికి డబ్బులు ఇచ్చి క్యాంటీన్‌కు పంపుతాం. ముందస్తు అప్పాయింట్మెంట్ లేకుండా పిల్లల తల్లిదండ్రులను బడిలోకి రానివ్వం’అని తెలిపారు. -
'తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా'
అతని వృత్తి.. మృతదేహాలను ఖననం చేయడం. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఇతర వృత్తుల మాదిరిగా అతనూ పొట్టకూటి కోసం తన పని తాను చేసుకుపోతుంటాడు. బాధ, విచారం వంటి భావోద్వేగాలకు చోటేలేదు. అలాంటి ప్రొఫెషనల్ కాటికాపరి మృతదేహాలను ఖననం చేసేటపుడు తొలిసారి బోరున విలపించాడు. చనిపోయినవారితో ఎలాంటి బంధం లేకపోయినా అతనికి దుఃఖం ఆగలేదు. మృతదేహాలను ఖననం చేయడం తన వృత్తయినా ఆప్తులను కోల్పోయినట్టు బాధపడ్డాడు. పాకిస్థాన్‌లోని పెషావర్ శ్మశానవాటికలో తాజ్ మహమ్మద్ అనే కాటికాపరికి ఈ విషాదకర పరిస్థితి ఎదురైంది. పెషావర్ ఆర్మీ స్కూల్‌పై ఇటీవల జరిగిన ఉగ్రవాదదాడిలో దాదాపు 140 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. చిన్నారుల మృతదేహాలను తాజ్ మహమ్మద్ ఖననం చేశాడు. 'గతంలో చాలా మంది మృతదేహాలను ఖననం చేశాను. వీరిలో విభిన్న వయసు, ఎత్తు, బరువు ఉన్న వారు ఉన్నారు. అయితే ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన చిన్నారుల మృతదేహాలను ఖననం చేస్తున్నప్పుడు చాలా భారంగా అనిపించింది. జీవితంలో తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయాను' అని తాజ్ మహమ్మద్ చెప్పాడు. తాజ్ ఇద్దరు కొడుకులు కూడా ఆయనకు తోడుగా పనిచేస్తుంటారు. -
దండుబాట
లంగరు బండ క్రీ.శ. 1600 ::: బండమీద చందుపట్ల పదం నుంచి పథంలోకి 21 టపా సమయం. టపాబంటు వచ్చే సమయానికి ఊళ్లో ఒకొక్కరూ ఒకొక్కరూ మర్రిచెట్టు వద్దకి చేరుకుంటున్నారు. మొదట ఫౌజ్దార్ రహీంఖాన్ వచ్చేశాడు. ఎప్పుడో పెషావర్ నుండి వలప వచ్చిన రహీంఖాన్ మల్కిభ రాముడి సుల్తానీలో చందుపట్ల ఫిర్కాలో ఫౌజ్దార్గా నియమించబడ్డాడు. అతడు ఒంటిచేత్తో రోహిల్లా బందిపోట్లని ఎదిరించి గ్రామాన్ని కాపాడిన వీరకథ ప్రసిద్ధం. అతడి కోసమని అరుగు మీద గుడుగుడు పళ్ళెంలో కణకణమండే నిప్పులు వేసి ఊదసాగాడు వెట్టి మల్లేసు. ఇంకా ఊరి పెద్దమనుషులూ ఆరడుగుల ఎత్తుండే పఠాన్దొరలు కూడా జనం సలాములు అందుకుంటూ అరుగుపై వచ్చి కూచున్నారు. ఎండమావుల మధ్య కాళ్లకు గజ్జెల మోతతో పరుగెత్తుకొస్తున్న టపాబంటు రూపం కనపడగానే అందరిలో ఉత్సుకత పెరిగింది. టపా వచ్చిందంటే గోల్కొండ ఖబర్లు తెలుస్తాయి మరి. ‘బారెమాలిక్ గట్ల మొగలాయిల కాడ్నుండి రాయబారి వచ్చిండట?’ తూర్పు మాగాణి యాదిరెడ్డి ఎవర్నీ ఉద్దేశించకుండా అడిగాడు. ‘ఔ! ఢిల్లీ పాదుషా జలాలుద్దీన్(అక్బర్) హుకూమత్ జబర్దస్త్‌గా ఉందంట’ సమాధానం ఇచ్చాడు రహీంఖాన్. మాట పూర్తియ్యేలోగా టపా వచ్చేసింది. అక్కడే సిద్ధంగా ఉన్న మరో టపాబంటు టపా సంచి అందుకొని తర్వాతి గమ్యానికి పరుగందుకున్నాడు. ‘ఖాన్ సాహెబ్! గోల్కొండ నుంచి మీ ఊరికి టపా ఉంది’ అంతవరకూ పరిగెత్తుతూ వచ్చిన అలసటతో గసపెడుతూ అంగీలో భద్రం చేసిన సిక్కా కమ్మను రహీంఖాన్‌కు అందించాడు టపాబంటు నల్లసిద్ది. అరబీ లిపిలో ఉన్న ఆ కమ్మను వెదరు గొట్టం నుంచి బయటకి లాగి చూడగానే ‘ఒరే మల్లాయ్! పెద్దనాయుడుగార్ని దౌడెల్లి తోల్కరా. గోల్కొండ కాడ్నించి ఖబరని చెప్పు’ అని వెట్టివాడిని పురమాయించి ఉత్తరం చదవడంలో పడ్డాడు రహీంఖాన్. చూస్తున్న జనంలో విశేషం తెలుసుకోవాలనే ఆత్రం. గోల్కొండ నుంచి ప్రత్యేకంగా కబురు రావడం మాములు విషయం కాదు. కానీ పెద్దనాయుడు వచ్చేదాకా రహీంఖాన్ నోరు విప్పలేదు. పెద్దనాయుడు వచ్చాడు. రహీంఖాన్ అరబ్బీలో ఉన్న పత్రం చూపించాడు. నాయుడికి అర్థంకాని ఆ లిపిలో ఏముందో చెప్పాడు. నాయుడి సంబరానికి అంతులేదు. పాలమురు తరఫ్దార్ నుండి నాయుడిని పదూళ్ళ ఫిర్కాకి గుత్తేదార్‌గా నియమిస్తూ పంపిన నియామక పత్రం అది. ‘గోల్కొండలో ఎవురో ఖాస్ ఆద్మీ ఉన్నట్టున్నాడు. అన్నీ వరాలు నీకే ఇచ్చాడు’ అన్నాడు రహీంఖాన్ నవ్వుతూ. పెద్దనాయుడు అంతా ఆ దేవుడి దయ అన్నట్టు ఆకాశంలో చూశాడు. ‘గోల్కొండ నుంచి ఫిరంగి దెయ్యాల (డచ్చివాళ్ళు) దళమొకటి వస్తుందట. మచిలీబందర్ వెళుతూ ఈడ్నే నాల్గుదినాలు మకాం ఉంటుందట. వాళ్ల మంచీ చెడ్డా చూడాలి’ అన్నాడు రహీంఖాన్. పెద్దనాయుడు అలాగే అని తలాడించాడు. ‘మరో ఖబర్ కూడా ఉంది. మచిలీబందర్లో సర్కారీ కార్ఖానాకి నూరుమంది నేతగాళ్ళు కావల్నెంట. ఆడమనిషికి దూది వడకేంటికి తెలిసింటే సాలు. ఖానా పీనా ఇచ్చి జంటకి వారానికొక హొన్ను బత్యం. ఎవరైనా ఉంటే చూడు. దళంతో పాటు పంపించేద్దాం’ అంటూ అలవాటుగా పెద్దనాయుడికి హుక్కా గొట్టం అందించాడు రహీంఖాన్. నాయుడు తీసుకోలేదు. ‘వద్దులే భాయీ. నా సుట్ట ఉందిలే. నీ తురకల గుడుగుడు పిలిస్తే కులం సంకరమైనట్లు’ అని, నవ్వుతూ మొలలో దోపిన సంచిలోంచి పొగాకు కట్ట తీశాడు. ‘ఇంతకీ ఈ నేతగాండ్ల పనికి పంపేందికి నీ దమాక్లో ఎవరైన ఉండిరా?’ అన్నాడు నాయుడు. రహీంఖాన్ నవ్వాడు. ‘నీ ఇరాదా నాకు సంఝాయెలే. నీ కొడుకుల్లో ఒకడిని పంపేటికి యోచన్జేస్తుండావ్ కదా’ అన్నాడు. పెద్దనాయుడు దాచలేదు. అతడికి ఐదుగురు కొడుకులు. ఒకడు దేశాలు పట్టిపోగా మరొక నలుగురు గట్టెక్కాల్సి ఉంది. పెద్దనాయుణ్ణి చూస్తూ రహీంఖాన్ సతమతం అయ్యాడు. అసలు సంగతి నాయుడికి ఎలా చెప్పాలి? కబురు పూర్తిగా ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. సమయం వచ్చేదాకా రహస్యంగానే ఉంచితే మంచిదనే నిర్ణయానికి వస్తూ ‘నాయుడూ. నయీముద్దీన్ అనీ మీర్‌జుమ్లా దివాన్లో దబీర్గా ఉంటుండు. ఈ ఫిరంగుల్తో వస్తుండు. నా ఇంట్లనే మకాం. కాని వాని ఖానాకి మీ ఇంట్లనయితే వంటలు ఖాస్గా ఉంటవి. కాస్త లచ్చక్కతో సెబుతావె?’ ‘అదెంత భాగ్యం భాయ్. నువ్ ఫికర్ చేయకు’ అన్నాడు పెద్దనాయుడు. గోల్కొండ కోట గుమ్మం వద్ద ఫర్మానా పెట్టెని సేవకులకి అందించి ఉత్సాహంగా గుర్రమెక్కాడు దబీర్ నయీముద్దీన్. కారవాన్ రాస్తా రద్దీగా ఉంది. మూసీనది దాటితే సుల్తాన్ కట్టిస్తున్న కొత్త షహర్. ఫిరంగులకి అక్కడ విడిది. చుట్టూ తోటలతో అందమైన నగరం బాగ్‌నగర్! అతడు పన్నెండేళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయి దేశమంతా తిరిగాడు. ఉర్దూ, మరాఠి, ఫార్సీలే కాక బుడతకీచుల వద్ద ఫిరంగి (ట్రేడ్ఫ్రెంచ్) భాష కూడా నేర్చుకున్నాడు. బుడతకీచుల దుబాసీగా గోల్కొండ వచ్చి మీర్‌జుమ్లా అమీన్ ఉల్ ముల్క్ ప్రాపకం సంపాదించాడు. గోల్కొండ అమీర్లలో ఒకడిగా ఎదిగాడు. బందేనవాజ్ గిసుద్రాజ్ ఖంఖాలో ఇస్లాం మతం స్వీకరించి నయీముద్దీన్గా పేరు మార్చుకున్నాడు. రోహిల్లాబండ (షాలిబండ) వద్ద డచ్చి వర్తకుల దండు ప్రయాణానికి సిద్ధంగా ఉంది. మచిలీబందర్లో రంగువస్త్రాల కర్మాగారాలు నెలకొల్పేందుకు సుల్తాన్ నుండి ఫర్మానా సాధించడమేగాక మడపొలెంలో తుపాకీ మందు కార్ఖానాకీ మిరాసీ సంపాదించాడు. రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే రాజ్యంలో ఏ పదవి కావాలన్నా కొనగలిగేటంత ధనం! నన్ను చూస్తే బాపు ఎంత సంతోషిస్తాడో? చందుపట్లలో నాలుగు రోజుల మకాం తరువాత నయీముద్దీన్ కారవాన్ కదిలింది. మర్రిచెట్టు కింద అరుగు మీద నిలుచొని మరోసారి చేయి వూపి వీడ్కోలు చెప్పాడు నాయుడు. ఇక అసలు రహస్యం చెప్పేందుకు సమయమొచ్చింది అనుకుంటూ ‘పద నాయుడు భాయ్! నీకొక ఖాస్ ఖబర్ చెప్పాల’ అని దూరంగా తాటితోపులో దారి తీశాడు రహీంఖాన్. ‘భాయ్! ఈ నాల్గురోజుల్ నీ ఇంట్ల ఉన్న మాలిక్ నయీముద్దీన్ సాహెబ్‌ని చూసిండవు గాదె?’ చిరునవ్వుతో అడిగాడు. ‘ఔ! ఆ సాహెబ్‌ని సూస్తా వుంటే ఎవడో దగ్గర మనిషుల్ని సూస్తన్నట్లుంది’. ‘మల్ల అంత దగ్గరంటోడ్ని గుర్తుపట్టిండ్లా నాయుడూ భాయ్?’ అడిగాడు రహీంఖాన్ తీక్షణంగా నాయుడి కళ్లలోకి చూస్తూ. అంతవరకూ ఎక్కడో మనసు లోతుల్లో తోచిన చిన్న సందేహం ఒక్కసారిగా విశ్వరూపంతో అతడి కళ్లముందుకొచ్చింది. నిజమా? చిన్నప్పుడు ఇంటి నుండి పారిపోయిన తన పెద్దకొడుకు నర్సింగు నాయుడే ఈ నయీముద్దీన్ సాహెబా? ‘ఎందుకు చెప్పలేదు?’ అంటూ ఖాన్ సాహెచ్ భుజం పట్టుకొని కుదిపేశాడు. రహీంఖాన్ మౌనంలో కూడా నాయుడికి సమాధానం దొరికింది. కులం, సాంప్రదాయం ప్రాణంగా భావించే తాను, తన కొడుకు ముస్లిముల్లో కలిశాడంటే ఊరివాళ్లకి మొహమెలా చూపగలడు? ఇరవై ఏళ్ల స్నేహంలో తన గురించి తనకంటే ఖాన్‌కే ఎక్కువ తెలుసు. ఉబికివస్తున్న కన్నీళ్లు అణుచుకుంటూ ఖాన్ భుజంపై తలవాల్చాడు నాయుడు. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 ‘ఆ... గోల్కొండ నుంచి ఫిరంగి దెయ్యాల (డచ్చివాళ్ళు) దళమొకటి వస్తుందంట. మచిలీబందర్ వెళుతూ ఈడ్నే నాల్గుదినాలు మకాం ఉంటుందంట. వాళ్ల మంచీ చెడ్డా చూడాలి’ అన్నాడు రహీంఖాన్. -
లేత నెత్తుటి సాక్షిగా ఉగ్ర సవాల్
కాలువలో ఒక పుట్టి మునగడం నుంచి తుపానైనా, ఉప్పెనైనా, కరువైనా, కాటకమైనా, జాతుల పోరాటాలైనా, ఉన్మాదమైనా, ఉగ్రవాదమైనా... మొదట బలయ్యేది పిల్లలు, మహిళలు, ఇతర బడుగు, బలహీన వర్గాలే. పసికందులు నిష్కారణంగా బలైన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు. పెషావర్‌లో ఏ పాపం ఎరుగని పసిబిడ్డలు శవాల కుప్పలుగా మారడం అందరినీ కలచివేసింది. ఇది ప్రతీకార చర్య అని తాలిబన్లు సమర్థించుకున్న తీరు దుర్మార్గమైనది. హానిచేయని ఏ జీవికీ శిక్ష విధించరాదని ఖురాన్ నొక్కి చెబుతోంది. కాబట్టి ఇది రాక్షసత్వమవుతుంది తప్ప, ఇస్లామిక్ తీవ్రవాదం కూడా కాజాలదు! ఉగ్రవాదానికి హృదయమే కాదు, కళ్లూ ఉండవని పాకిస్తాన్‌లోని పెషావర్ మారణకాండ మరోమారు స్పష్టం చేసింది. కల్లాకపటమెరుగని పసిరక్తం పారిం చి ఉగ్రమూక మానవ చరిత్రనే మలినం చేసింది. అన్నెంపున్నెం ఎరుగని పిల్లల్ని లక్ష్యం చేసుకొని సాగించిన ఈ దురాగతం, ఒక దుర్ఘటనగా కన్నా భవితకు సంబంధించిన అత్యంత ప్రమాదకర సంకేతం. అటు దేశానికి హితం చేయక, ఇటు మతానికి మేలు చేయక... మౌడ్యంతో పెట్రేగే రక్కసి ఉగ్రవాదం పసికూన లను తన లక్ష్యాలుగా మార్చుకోవడం అత్యంత ప్రమాదకరం, హేయం! అరుదైన ఘటనలుగా కాక ఇటువంటి దుశ్చర్యలు వ్యవస్థీకృతంగా జరిగితే ప్రపంచ మానవాళే గడగడ వణకాల్సిన పరిస్థితి. ఏ రక్షణ కవచం లేకుండా సాగే సరస్వతీ నిలయాలపై మున్ముందు ఇలాగే ముష్కర దాడులు సాగితే భావి ప్రపంచ పౌరుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలవాల్సిందేనా? ఈ తీవ్రతను గుర్తించి, దుస్థితిని తప్పించే మార్గాన్వేషణ చేయాలి. అంతే తప్ప, మనం ఇంకా రాజకీయ ఉదారవాదంతో ఖండనలు, ప్రకటనలతో సరిపెట్టే సమయం కాదని విశ్వ సమాజం, ముఖ్యంగా పాక్ పాలకులు గుర్తించాల్సిన తరుణమిది. ఉగ్రవా దాన్ని పెంచి పోషిస్తూ తాము పులిపైస్వారీ చేస్తున్నామన్న నిజాన్ని గ్రహించే స్థితిలో పాక్ పాలకులు లేరు. అంతకన్నా దారుణమైన విషయం... ఎక్కడో, పాక్ భూభాగానికి దూరంగా కూర్చుని ఇంకా రాజకీయ వ్యాఖ్యలతో పబ్బం గడుపుతున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ప్రకటన. పాకిస్తాన్ ప్రజల్ని ఇంకా ఓటు బ్యాంకులుగానే భావిస్తూ, ఎలాగైనా మభ్యపెట్టగలననే భ్రమల్లో బతుకుతున్న ఆయన, తాలిబన్ల వెనుక భారత ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఉందనే చచ్చు పుచ్చు ప్రకటన చేశారు. ఈ విషయంలో పాకి స్తాన్ ప్రభుత్వం కూడా ఏం తక్కువ తినలేదు. భారత్ విషయంలో దాని వైఖరే ఇందుకు నిదర్శనం. ఎప్పుడు సంఘటన చోటు చేసుకుంటే అప్పుడు, ఎవరికి నష్టం జరిగితే ఆ దేశం అన్న పద్ధతిన ఎక్కడికక్కడ చేపట్టే చర్యలు ఉగ్రవాదాన్ని అణచడంలో ఫలితాలనివ్వవు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రచిస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రక టించి 24 గంటలు గడవలేదు ఆ సమీకృత కృషికి గండిపడింది. తాజా దాడికి బాధ్యులమని ప్రకటించుకున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాక్ నేత ఫజ్లుల్లాను తమ కు అప్పగించాలని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రహీల్ షరీఫ్ ఒక వైపు అప్ఘానిస్తా న్ను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ముంబై ఉగ్రదాడుల కేసు నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్తాన్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లఖ్వీకి బెయిలు తాలిబన్ల డిమాండ్ కావడం దురదృష్టకరం! పాక్ పాలకుల ఈ ద్వంద్వ వైఖరి తరచూ కనిపిస్తున్నదే. భారత్‌లో విధ్వంస చర్యలకు పాల్పడే ముష్కర మూక లకు పాకిస్తాన్ సురక్షిత స్థావరమౌతోంది. ముంబై దాడుల్లో కుట్రదారులైన హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంలను అప్పగించాలని భారత్ తాజాగా మరో మారు పాకిస్తాన్‌ను కోరింది. ఎల్లలెరుగని హింసోన్మాదంతో తీవ్రవాదులు పేట్రేగిపోతూనే ఉంటారు, నాయకులు రాజకీయ ప్రకటనలతో పబ్బంగడుపు తూనే ఉంటారు. ఇది రివాజయిన తంతుగా కొనసాగినంత కాలం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. పసికందులు బలిపశువులు చిన్న కాలువలో పుట్టి మునగడం నుంచి దేశాల మధ్య జరిగే పెను యుద్ధాల వరకు మొదట బలయ్యేది పిల్లలే! తుపానయినా, ఉప్పెనయినా, కరువైనా, కాటకమైనా, జాతుల పోరాటాలయినా, ఉన్మాదమైనా, ఉగ్రవాదమైనా.... ఏ ఉపద్రవం ముంచుకువచ్చినా నిష్కారణంగా మొదట బలయ్యేది పిల్లలు, మహి ళలు, ఇతర బడుగు, బలహీనవర్గాలే. మానవ ఇతిహాస పరిణామంలో అనేకా నేక దుర్ఘటనల్లో సంబంధం లేకపోయినా, కారకులు కాకున్నా... మంచి చెడు తెలియని పసి జీవితాలు బలైన సందర్భాలు కోకొల్లలు. పెద్దల ఉన్మాదపు చర్య లకు పిల్లలు బలికావడం కొత్తేమీ కాదు. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా అణుబాంబులు విసిరినా, నాజీలు పిల్లల్ని యుద్ధ శిబిరాల్లోకి కవాతు చేయిం చినా, చంకల్లో తుపాకులు పెట్టి శ్రీలంకలో ఎల్టీటీఈ బాల సైనికుల్ని తీర్చి దిద్దినా.. అమానవీయంగా బలయిపోయింది బాలలే! రువాండా అంతర్యుద్ధం లో నాలుగు నెలల్లోనే మూడు లక్షల మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారన్న ఐక్యరాజ్యసమితి లెక్క వినేవారికి కన్నీరు తెప్పించదా! ఉగ్రవాదమో, ఉన్మాద మో... వాటిని పెంచి పోషించిన, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపేక్షించిన పెద్దమనుషుల చేతులన్నీ పిల్లల రక్తంతో తడిబారినవే! పెషావర్‌లో ఉన్మాదుల మూకుమ్మడి కాల్పులకు ఏ పాపం ఎరుగని పసిబిడ్డలు శవాల కుప్ప లుగా మారడం ప్రతి మానవ హృదయాన్నీ కలచివేసింది. ఇది తమ ప్రతీకార చర్య అని, ఇందుకోసం కావాలనే సైనికుల పిల్లలనే లక్ష్యంగా ఎంచుకున్నామని సమర్థించుకున్న తాలిబన్ల అధికార ప్రతినిధి మహ్మద్ ఉమర్ ఖొరాసని మాట లు దుర్మార్గమైనవి. ‘‘మా కుటుంబాల్ని, భార్యాపిల్లల్ని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది, ఆ బాధేంటో వారికి తెలియజెప్పాలనే, మేం సైనికుల పిల్లల్ని ఎంపిక చేసుకున్నాం’’ అనే వాదన అత్యంత ప్రమాదకరమైంది. పిల్లలేం పాపం చేశారు? సైనికోద్యోగులేం తప్పు చేశారు? పాలకుల, ప్రభుత్వాల నిర్ణయాలను అమలుచేస్తూ దేశ రక్షణకోసం విధులు నిర్వర్తించేవారు సైనికులు. ఇంకా పచ్చి గా చెప్పాలంటే, జీవితాన్ని నెట్టేందుకు నాలుగు జీతం రాళ్ల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాస్తున్న అల్పజీవులు. అటువంటిది పొట్ట కూటి కోసం ఉద్యోగం చేస్తున్న సైనికుల పిల్లలపైన ప్రతీకారమేంటి? ఇస్లాంలో ఓ గొప్ప సందేశముంది. అదెంత చిన్నదయినా, పెద్దదయినా శిక్ష అనేది హాని చేయని ఏ జీవికీ విధించకూడదనే మౌలికాంశాన్ని ఖురాన్ నొక్కి చెబుతోంది. ప్రాణాల్ని బలితీసుకోవడమనే అతి తీవ్రమైన శిక్షను అమాయకులైన పసికూన లకు విధించడం ఇస్లాం పరంగా కూడా హేతుబద్ధం కానపుడు, వారిది పచ్చి రాక్షసత్వమవుతుంది తప్ప, ఇస్లామిక్ తీవ్రవాదం కూడా కాజాలదు! పాకి స్తాన్‌లో ఉంటూ ఆ దేశపు భావి పౌరుల్ని నిష్కారణంగా పొట్టనపెట్టుకున్నవారు దేశ హితంతో పనిచేస్తున్నట్టు కాదు. ఇస్లాం పేరు చెప్పుకొని రక్త పిపాసతో ఇస్లాం మౌలిక సూత్రాలకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నవారు ఇస్లాం ఉద్ధారకులూ కారు. చేతులు కాలాక ఆకులు పడితే మేలేంటి? పాకిస్తాన్లో బడిపిల్లలపై తాలిబన్ ఉగ్రవాదుల దాడులు కొత్తేమీ కాదు. వేర్వేరు సందర్భాల్లో, వివిధ రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. పసిమొగ్గల ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. 2010 నుంచి ఇప్పటివరకు కనీసం నాలుగుమార్లు పాఠశాల బస్సులపైదాడులు జరిపారు. ఇటీవల నోబెల్ శాంతి బహుమతి పొం దిన మలాలా యూసఫ్జాయ్పైన 2012లో జరిగిన దాడి ఈ పరంపరలోదే. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కనీసం నాలుగుమార్లు పాఠశాలలపై తాలిబన్లు దాడులు జరిపారు. ముఖ్యంగా వాయవ్య పాకిస్తాన్లో సాధారణ పౌరులకు కూడా రక్షణ లేకుండా పోయిందని పలుమార్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా హెచ్చరించింది. ఉగ్రవాదుల నుంచి పౌరులకు రక్షణ కల్పించే చర్యలు పాక్ ప్రభుత్వం చేపట్టాలని ఆమ్నెస్టీ డిప్యూటీ డెరైక్టర్ (ఆసియా-పసిఫిక్) డేవిడ్ గ్రిఫిత్ తరచూ చెబుతున్నారు. ఈ మధ్య పాక్ తమపై చేపట్టిన సైనిక చర్యకు ప్రతీకారమే పెషావర్ ఘాతుకమనే తాలిబన్ల వాదన ఏ రకంగానూ సమర్థనీ యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా, గడచిన వందేళ్ల చరిత్రలో పలుమార్లు విద్యా ర్థుల మీద, విద్యా సంస్థల మీద ఉగ్రదాడులు కోకొల్లలుగా జరిగాయి. కానీ, పదేళ్ల కింద రష్యాలోని బెస్లాన్‌లో చెచెన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల తర్వాత అంతటి పెద్ద నరమేధం ఇప్పుడు పెషావర్‌లోనే జరిగింది. పాక్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? తన స్పందనని కార్యరూపంలో ఎలా చూపిస్తుంది? అన్న దే ఇప్పుడు కీలకాంశం. ‘మంచి తాలిబన్లు, చెడు తాలిబన్లు అని ఉండరు, అం తాచెడే, తాలిబన్లు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వారీ ప్రాంతపు శాంతికి ప్రమా దకారకులు, వారిని ఉపేక్షించేది లేదు’ అంటున్న పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాటలు ఎంత మేరకు ఆచరణ రూపం ధరిస్తాయో వేచి చూడాల్సిందే! అటు అఫ్ఘానిస్థాన్‌ను అస్థిరపరచడానికి, ఇటు భారత్‌ను చికాకు పరుస్తూ ఆధిపత్యం సాధించడానికి పాకిస్తాన్ పనిగట్టుకొని తాలిబన్లను పెంచి పోషిం చింది. కత్తితో వ్యవహరించేవాడు కత్తికే బలవుతాడనే చైనా సామెతను గుర్తుతె చ్చేదే పెషావర్ ఘటన. కానీ, తప్పు పాక్ పాలకులదైతే శిక్ష పసికూనలకెందు కన్నదే ఎవరికీ జీర్ణం కావడం లేదు. పాలకులు అది గ్రహించాలి. మరణశిక్షపై మారటోరియాన్ని ఇప్పుడు పాక్ ఎత్తివేసింది. ఉగ్రవాద పీచమణచడానికి కార్యా చరణ అంటోంది. ఈ ఇంగితం ముందే ఉండాల్సింది. బాలల్ని బలిపెట్టాక ప్రభుత్వానికి మెలకువ వచ్చింది. హిరోషిమాలో ఎందరో బాలలు హతమ య్యారు. ఎందుకంటే అణుబాంబులకు వివక్ష లేదు, విచక్షణ తెలియదు. గాజా లో చిన్నారులు మరణించారు. వారిని రక్షణ కవచంగా మిలిటెంట్లు వాడు కోవడంవల్ల. రువాండాలో పసిబిడ్డలు అసువులుబాశారు, వారు ఇతర గిరిజా తుల వారు కనుక. చెచెన్యాలో చంటిపాపలు మట్టిలో కలిశారు, ఎందుకంటే వారు పరదేశీయులు అయినందున. పెషావర్‌లో బడిపిల్లలు ప్రాణాలొదిలారు, వారు పాక్ సైనికులకు పుట్టినందున. ఎంత దుర్మార్గం? ఎంత అమానవీయం? మహాప్రస్థానం చేసిన మహాకవి శ్రీశ్రీ గుర్తొస్తున్నాడు. పాపం పుణ్యం, ప్రపంచ మార్గం/ కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ఏమీ ఎరుగని పూవుల్లారా,/ పాపల్లారా / మెరుపు మెరిస్తే,/ వానకురిస్తే/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా:/ మీదే మీదే సమస్త విశ్వం:/ మీరే లోకపు భాగ్యవిధా తలు:/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు: ఈమెయిల్: dileepreddy@sakshi.com - దిలీప్ రెడ్డి -
భారత పార్లమెంటు నివాళి
పెషావర్ మృతులకు సంతాపం తెలిపిన ఎంపీలు ఘటనను ఖండిస్తూ తీర్మానం; బాధితులకు సంతాపం న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని పెషావర్ మారణకాండలో చనిపోయిన చిన్నారులకు పార్లమెంటు బుధవారం నివాళులు అర్పించింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించింది. సిడ్నీ, పెషావర్ వంటి ఘటనలు ప్రపంచ దేశాలన్నింటికీ హెచ్చరికలాంటివని... మానవత్వంపై నమ్మకమున్నవారందరూ ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి చేతులు కలపాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు పెషావర్‌లో ఉగ్రవాద ఘాతుకానికి బలైన చిన్నారులకు నివాళిగా లోక్‌సభ, రాజ్యసభల్లో సభ్యులంతా కొంతసేపు నిలబడి మౌనం పాటించారు. తొలుత పెషావర్ ఘటనలో బాధిత కుటుంబాలు, పాకిస్తాన్ ప్రజలకు సంతాపం వ్యక్తం చేస్తూ.. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఉగ్రవాదం పట్ల ఏ మాత్రం కూడా సహనం చూపకుండా, కఠినంగా వ్యవహరించాలని తీర్మానంలో పేర్కొంది. ఇక రాజ్యసభలోనూ సభ్యులంతా కొంత సేపు మౌనం పాటించారు. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి, చైర్మన్ హమీద్ అన్సారీ పేర్కొన్నారు. అనంతరం సభను వాయిదా వేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రసంగిస్తూ... సిడ్నీ, పెషావర్ ఘటనలను ఖండించారు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి అందరూ ఉమ్మడిగా కృషి చేయాలని... ఇందుకోసం భారత్ సంసిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. పాఠశాలలో చొరబడి అత్యంత పాశవికంగా 132 మంది చిన్నారులను బలిగొన్న ఈ ఘటనను మొత్తం ప్రపంచం ఖండిస్తోందన్నారు. సరిహద్దులు, విభేదాలకు అతీతంగా భారత్ ఆ ఘటనపై స్పందించిందని, సానుభూతిని ప్రకటించిందని తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మాట్లాడి మన దేశ ప్రజల తరఫున సంఘీభావం తెలిపారని సుష్మా చెప్పారు. రెండు రోజుల కింద సిడ్నీలో జరిగి ఉగ్రవాద ఘాతుకాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఉగ్రవాదం ప్రపంచం మొత్తానికీ ముప్పుగా పరిణమించిందని వ్యాఖ్యానించారు. స్కూళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయండి పాక్ సైనిక స్కూల్లో ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విద్యాసంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది. అలాగే షాపింగ్ మాల్స్ వద్ద కూడా భద్రతను పెంచాలని పేర్కొంది. బుధవారం పార్లమెంట్ బయట కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఉగ్రవాద దాడి జరిగితే ఏం చేయాలి? పిల్లల్ని ఎలా అప్రమత్తం చేయాలి? అన్న విషయాలపై స్కూళ్లకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చే నెల భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ కేంద్రం బుధవారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశమున్న ప్రదేశాలు, కట్టడాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. -
ఉగ్రవాదం అంతానికి
జాతీయ ప్రణాళిక: షరీఫ్ పెషావర్: పెషావర్ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వారంలోగా జాతీయ ప్రణాళికను రూపొందిస్తామని, కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. అన్ని పార్టీల నేతలు షరీఫ్ అధ్యక్షతన బుధవారమిక్కడ సమావేశమై ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తామంతా నిర్ణయించినట్లు షరీఫ్ చెప్పారు. విలేకరుల భేటీలో షరీఫ్‌కు ఇరువైపులా.. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్, పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఖుర్షీద్ షా ఉన్నారు. ఉగ్రవాద సంబంధిత కేసుల్లో మరణశిక్ష విధించడాన్ని అడ్డుకునే మారటోరియంను పాక్ ప్రభుత్వం ఎత్తేసింది. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ అఫ్ఘానిస్తాన్ వెళ్లారు. ఈ దాడికి కారణమని ప్రకటించుకున్న తెహ్రీక్ ఇ తాలిబాన్ పాక్ నేత ఫజ్లుల్లాను పాకిస్తాన్‌కు అప్పగించాలనే డిమాండ్‌తో ఆయన అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. -
కాలిపోయిన విద్యానవనం
అంత కర్కశంగా.. మరింత రక్కసంగా మూర్ఖుల్లా.. ముష్కరుల్లా అతి కిరాతకంగా ప్రవర్తించారే.. వారికి మనసు లేదా చిన్నారులన్న కనికరం లేదా.. ఎందుకింతగా బరితెగించారు ఎందరు తల్లుల ఉసురు పోసుకున్నారు.. పాషాణం సైతం కరుగుతుందంటారే బండబారిన గుండెలేమో వారివి! విచక్షణ మరిచి.. సిగ్గు విడిచి పిల్లల్ని పిట్టల్లా కాల్చిపడేశారే ఎంత ఘోరం.. ఎంత దారుణం! విద్యానవనంలో నిండుగా విరబూసి గుబాళించాల్సిన పసిమొగ్గలు నిర్దాక్షిణ్యంగా కాలిపోయాయి.. హే భగవాన్.. ఎటుపోతోందీ విశ్వం! - శర్మ సీహెచ్ విజయవాడ (పెషావర్‌లో తాలిబన్ దమనకాండ చూశాక) -
మారణకాండకు మౌనసాక్షి..
పెషావర్ ఆర్మీ స్కూల్ ఆడిటోరియంలో 100 మంది విద్యార్థుల మృతదేహాలు ఇస్లామాబాద్: పెషావర్‌లోని ఆర్మీ స్కూల్ ఆడిటోరియం.. రక్తపు మరకలతో భీతావహంగా, తాలిబాన్ రక్తపిపాసకు మౌనసాక్షిగా నిలుస్తోంది. ఈ ఒక్క ఆడిటోరియంలోనే వందకు పైగా విద్యార్థుల లేత దేహాలు ఉగ్రవాదుల మెషిన్గన్ల నుంచి దూసుకొచ్చిన తుపాకీ గుళ్లకు ఛిద్రమయ్యాయి. ప్రాణభయంతో టేబుళ్ల కింద, కుర్చీల వెనుక దాక్కున్న చిన్నారులను వెతికి మరీ, పారిపోతున్న వారిని వెంటాడి మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కర్కశంగా కాల్చి చంపిన తాలిబాన్ హింసోన్మాదం కళ్లకు కట్టేలా అక్కడి దృశ్యాలున్నాయి. బుల్లెట్ల ధాటికి రంధ్రాలు పడ్డ గోడలు ఆ రాక్షసులెంత దారుణంగా కాల్పులు జరిపారో వివరిస్తున్నాయి. పాఠశాలలోకి మీడియాను అనుమతించిన ఆర్మీ.. వారికి ఆ ప్రాంతమంతా తిప్పి చూపడంతో.. 132 మంది విద్యార్థులు సహా 148 మందిని బలి తీసుకున్న తాలిబాన్ ఘాతుకానికి సంబంధించిన పలు వివరాలు, ఫొటోలు బుధవారం వెలుగు చూశాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు, పాదరక్షలు, నేలపై రక్తపు మరకలు, గోడలకు బుల్లెట్ దెబ్బలు.. పాఠశాలంతా యుద్ధభూమిలా ఉందని ఒక జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫస్ట్ ఎయిడ్ శిక్షణ తీసుకుంటుండగా.. స్కూల్ పక్కనున్న శ్మశానం నుంచి లోపలికి వచ్చిన ఉగ్రవాదులు.. తరగతి గదులు, ఆడిటోరియం వైపు వెళ్తూనే కాల్పులు ప్రారంభించారని ప్రత్యక్ష సాక్షులైన పలువురు విద్యార్థులు వెల్లడించారు. ‘ఆడిటోరియంలో ఫస్ట్ ఎయిడ్ శిక్షణ తీసుకుంటుండగా కాల్పుల శబ్దం వినిపించింది. నేలపై బోర్లా పడుకోమని మా టీచర్ చెబ్తుండగానే.. లోపలికి వచ్చిన ఉగ్రవాదులు మమ్మల్ని అతి దగ్గర నుంచి కాల్చడం ప్రారంభించారు. పారిపోతున్న వారిని వెంటాడి మరీ కాల్చారు’ అని 7వ తరగతి చదువుతున్న మొహమ్మద్ జీషాన్ ఆ భయానక ఘటనను గుర్తు చేసుకున్నాడు. తన రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని, బెంచ్ కింద దాక్కోవడంతో ప్రాణాలు కాపాడుకోగలిగానని హహ్రుఖ్ ఖాన్ అనే విద్యార్థి తెలిపాడు. కొందరు టీచర్లను సజీవ దహనం చేశారని కూడా వార్తలొచ్చాయి. పాఠశాల ప్రిన్సిపాల్ బాత్రూమ్లో దాక్కోగా ఉగ్రవాదులు వెంటిలేటర్ ద్వారా అందులోకి గ్రెనేడ్ విసరడంతో ఆయన చనిపోయారని సైనికదళాల ప్రధాన అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిమ్ బజ్వా వెల్లడించారు. మా దాడి న్యాయమే! ఈ నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదుల ఫొటోలను తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) సంస్థ బుధవారం విడుదల చేసింది. ఆర్మీ స్కూల్‌పై దాడి న్యాయమైనదేనని ప్రకటించింది. తమ యోధుల పిల్లలను, కుటుంబాలను చాలా సంవత్సరాలుగా ఆర్మీ చంపేస్తోందని, అందుకే ఈ ప్రతీకార దాడి అని టీటీపీ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఉమర్ ఖొరాసని వ్యాఖ్యానించారు. 148కి పెరిగిన మృతుల సంఖ్య పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌పై తాలిబాన్ జరిపిన పాశవిక దాడిలో మరణించినవారి సంఖ్య 148కి చేరింది. తీవ్రగాయాలతో స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఏడుగురు బుధవారం చనిపోయారు. -
పాక్ చిన్నారులకు భారత్ నివాళి
-
పెషావర్ దాడి భయానక దృశ్యాలు!
-
'పెషావర్' చిన్నారులకు అంత్యక్రియలు
పెషావర్ : పాకిస్తాన్ పెషావర్‌లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో 132 మంది చిన్నారులతో సహా మొత్తం 141 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఆఫ్ఘనిస్థాన్‌తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల మృతికి సంతాపంగా దేశంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించినట్లు వెల్లడించారు. అయితే పెషావర్ దాడి ఘటనపై భారత ప్రధాని మోదీ .... షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేపట్టిన పోరులో మీకు తోడుగా ఉంటామని మోదీ.. షరీఫ్‌కు భరోసా ఇచ్చారు. -
పెషావర్ మృతులకు పార్లమెంట్ శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ : పాకిస్తాన్ పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిని పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం ఖండించాయి. మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉభయసభల్లో సభ్యులు రెండు నిమిషాల పాటూ మౌనం పాటించారు. అనంతరం మత మార్పిళ్ల అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. ప్రధాని మోదీ సభకు వచ్చి ఈ అంశంపై ప్రకటన చేసేదాకా సభ సజావుగా సాగనివ్వబోమని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి... సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను మధ్యాహానానికి వాయిదా వేశారు. -
'రెండు నిమిషాలు మౌనం పాటించండి'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పెషావర్-లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆ దాడిలో 160 మంది మృతి పట్ల మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పెషావర్ ఘటనకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని భారత్‌లోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు నరేంద్ర మోదీ బుధవారం పిలుపు నిచ్చారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. తీవ్రవాదంపై పోరుకు పాకిస్థాన్‌కు అండగా ఉంటామని ఆయన షరీఫ్‌కు హామీ ఇచ్చారు. -
కాన్వాయే లక్ష్యంగా బాంబు పేలుడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పెషావర్‌లో భద్రత ఉన్నతాధికారి ప్రయాణిస్తున్న కాన్వాయిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని పెషావర్ పోలీసు ఉన్నతాధికారి ఇజాజ్ ఖాన్ వెల్లడించారు. మృతుల్లో మహిళ, భద్రత ఉన్నతాధికారితోపాటు ఓ వ్యక్తి మరణించారని చెప్పారు. పెషావర్‌లో ఇజాజ్ ఖాన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భద్రత ఉన్నతాధికారి బ్రిగేడియర్ ఖలీద్ జవేద్ లక్ష్యంగా ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. కాగా ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారని వివరించారు. రహదారిపై ఉంచిన కారులో శక్తిమంతమైన బాంబును అమర్చి ఈ పేలుడుకు పాల్పడ్డారని ఇజాజ్ ఖాన్ తెలిపారు. -
ల్యాండ్ అవుతున్న విమానంపై కాల్పులు
పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. విమాన ప్రయాణీకులే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పెషావర్ విమానాశ్రయంలో పీకే 756 విమానం కిందకు దిగుతుండగా.... టెర్రరిస్టులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఒక మహిళా ప్రయాణికురాలు మృతి చెందగా, ముగ్గురు విమాన సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫైలెట్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు. మొత్తం ఫ్లైట్‌కు ఆరు బుల్లెట్లు తగిలాయని.. ఒక బుల్లెట్ విమాన ఇంజిన్‌లో ఇరుక్కుపోయిందని ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు. దాదాపు 178 మంది ప్రయాణికులతో విమానం సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్‌కు వస్తుందని అధికారులు చెప్పారు. ఊహించని దాడితో బచాఖన్ విమానాశ్రయం వద్ద అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. దాడి నేపథ్యంలో విమాన రాకపోకలు, కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. జూన్ 8న తాలిబన్లు కరాచీ ఎయిర్‌పోర్టుపై విరుచుకుపడి 34 మంది ప్రయాణికుల ప్రాణాలను తీశారు. ఇంతలోనే మరోసారి ఉగ్రమూక కాల్పులకు తెగబడడంతో పాకిస్తాన్ ప్రజలు వణికిపోతున్నారు. -
ఉగ్రమూక దాడి
-
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి:15 మంది మృతి
వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం మరోసారి రక్తమోడింది. పెషావర్ నగరంలో గురువారం ఉదయం తాలిబన్లు చెలరేగిపోయారు. తాలిబన్‌కు చెందిన ఆత్మాహుతి జరిపిన దాడిలో 15 మంది మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారని, వారు నగరంలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గత రెండు వారాల కాలంలో తాలిబాన్లు జరిపిన నాలుగో ఘాతుక చర్య అని వారు పేర్కొన్నారు. గత ఆదివారం పెషావర్‌లోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించి 50 మందికి పైగా మరణించారని గుర్తు చేశారు. అలాగే మరో అదివారం నగరంలోని చర్చ వద్ద తీవ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 80 మందికిపైగా మృతి చెందారని వివరించారు. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తున్న బస్సుపై చేసిన దాడిలో 17 మంది మరణించారని చెప్పారు. గత కొద్ది కాలంగా తాలిబాన్లు పాకిస్థాన్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, పాకిస్థాన్‌లో మోహరించిన ఆర్మీ దళాలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాలిబాన్లు ఆ దాడులు చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. -
కారు బాంబు పేలుడులో 40 మంది మృతి
పెషావర్: పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం వారం రోజుల వ్యవధిలో మూడోసారి భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఆదివారం చారిత్రక కిసా ఖ్వామీ మార్కెట్లో ఓ కారులో ఉంచిన శక్తిమంతమైన బాంబు పేలడంతో 40 మంది మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఉన్నారు. నిలిపి ఉన్న కారులో దుండగులు 220 కేజీల పేలుడు పదార్థాలు ఉంచి రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారని పోలీసులు చెప్పారు. పేలుడు ధాటికి 50 దుకాణాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పెళ్లి కోసం చార్సద్దా జిల్లా నుంచి నగరానికి వచ్చిన 13 మంది సభ్యుల కుటుంబంలోని 9 మంది ఈ దుర్ఘటనలో అసువులు బాశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. నిలిపి ఉన్న ఓ కారును అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లాలని పోలీసు అధికారి ఒకరు ఓ డ్రైవర్‌కు చెప్పాక బాంబు పేలినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తమ పని కాదని తాలిబన్లు ప్రకటించారు. -
పాకిస్థాన్‌లో మళ్లీ బాంబు పేలుళ్లు: 29 మంది మృతి
పాకిస్థాన్‌లో ఓ వైపు భూకంపం, మరో వైపు ఉగ్రవాదదాడులతో అట్టుడుకుతోంది. పెషావర్ పట్టణం వారం వ్యవధిలోనే మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఆదివారం కారు బాంబు పేలిన సంఘటనలో కనీసం 29 మంది మరణించారు. మరో 40 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సివుంది. పెషావర్‌లోనే ఇటీవల చారిత్రక చర్చిపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఇక పాక్‌లో భూకంప ప్రభావానికి భారీ ఆస్థి, ప్రాణ నష్టం జరిగింది. -
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 56 మంది మృతి
పాకిస్థాన్‌లో మరోసారి భారీ హింస చెలరేగింది. ఆదివారం ఓ ప్రార్థనా మందిరం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో పిల్లలు, మహిళలతో సహా 56 మంది మరణించారు. మరో 80 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ వాయవ్య రాష్ట్రమైన ఖైబర్ పఖ్టుంఖ్వాలోని పెషావర్ ఈ ఘటన జరిగింది. ఓ పురాతన మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. మందిరం నుంచి జనం బయటికి వస్తున్న సమయంలో ఓ ఉగ్రవాది బాంబుతో తనను తాను పేల్చుకున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో ఓ మతానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో నివస్తున్నారు. ఆదివారం కావడంతో ప్రార్థన చేసుకునేందుకు చాలా మంది వచ్చారు. ఈ సమయంలో ఆత్మాహుతి దాడి జరగడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రాంతం ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటుంది. మార్కెట్, షాపింగ్ కాంప్లెక్సులు ఉండటంతో మహిళలు ఎక్కువగా వస్తుంటారు.