
'రెండు నిమిషాలు మౌనం పాటించండి'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పెషావర్-లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆ దాడిలో 160 మంది మృతి పట్ల మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పెషావర్ ఘటనకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని భారత్లోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు నరేంద్ర మోదీ బుధవారం పిలుపు నిచ్చారు.
ఈ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. తీవ్రవాదంపై పోరుకు పాకిస్థాన్కు అండగా ఉంటామని ఆయన షరీఫ్కు హామీ ఇచ్చారు.