పాకిస్థాన్లో ఓ వైపు భూకంపం, మరో వైపు ఉగ్రవాదదాడులతో అట్టుడుకుతోంది. పెషావర్ పట్టనం వారం వ్యవధిలోనే మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.
పాకిస్థాన్లో ఓ వైపు భూకంపం, మరో వైపు ఉగ్రవాదదాడులతో అట్టుడుకుతోంది. పెషావర్ పట్టణం వారం వ్యవధిలోనే మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పోలీస్ స్టేషన్కు సమీపంలో ఆదివారం కారు బాంబు పేలిన సంఘటనలో కనీసం 29 మంది మరణించారు. మరో 40 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
పెషావర్లోనే ఇటీవల చారిత్రక చర్చిపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఇక పాక్లో భూకంప ప్రభావానికి భారీ ఆస్థి, ప్రాణ నష్టం జరిగింది.