కాన్వాయే లక్ష్యంగా బాంబు పేలుడు | Three people killed in Pakistan blast | Sakshi
Sakshi News home page

కాన్వాయే లక్ష్యంగా బాంబు పేలుడు

Published Tue, Sep 23 2014 1:44 PM | Last Updated on Sat, Mar 23 2019 8:09 PM

Three people killed in Pakistan blast

ఇస్లామాబాద్: పాకిస్థాన్ పెషావర్లో భద్రత ఉన్నతాధికారి ప్రయాణిస్తున్న కాన్వాయిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని పెషావర్ పోలీసు ఉన్నతాధికారి ఇజాజ్ ఖాన్ వెల్లడించారు. మృతుల్లో మహిళ, భద్రత ఉన్నతాధికారితోపాటు ఓ వ్యక్తి మరణించారని చెప్పారు.

పెషావర్లో ఇజాజ్ ఖాన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భద్రత ఉన్నతాధికారి బ్రిగేడియర్ ఖలీద్ జవేద్ లక్ష్యంగా ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. కాగా ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారని వివరించారు. రహదారిపై ఉంచిన కారులో శక్తిమంతమైన బాంబును అమర్చి ఈ పేలుడుకు పాల్పడ్డారని ఇజాజ్ ఖాన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement