Three people killed
-
చాంద్రాయణగుట్టలో ట్రిపుల్ మర్డర్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. చాంద్రాయణగుట్ట బార్కస్‌లో నలుగురుపై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే... కుటుంబ కలహాలతో అహ్మద్ బా ఇస్మాయిల్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సొంత అక్కచెల్లెళ్లనే దారుణంగా నరికి చంపాడు. ఇస్మాయిల్ గత ఏడాది భార్యను హత్య కేసులో అరెస్ట్ కాగా, ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. (నకిలీ పత్రాలతో బెయిల్ పొందిన శ్యామ్) అప్పటి నుంచి కుటుంబసభ్యుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇవాళ సాయంత్రం ఇస్మాయిల్ ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు, సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఇస్మాయిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
ప్రాణం తీసిన అతివేగం
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌లోని సుచిత్ర చౌరస్తా వద్ద నిజామాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని మరువక ముందే గుండ్లపోచంపల్లి అయోధ్య జంక్షన్‌కు కూతవేటు దూరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మద్యం సేవించి ముగ్గురు యువకులు వేగంగా బైక్ నడిపి చెట్టుకు ఢీకొని గోడ కు గుద్దుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు యువకు లు అక్కడికక్కడే మృతి చెందారు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బైరాపూర్ గ్రామానికి చెందిన నానావత్ అనీల్‌కుమార్ (26) బీటెక్ ద్వితీయ సంవత్సరం చదివి మానేశాడు. అనీల్ చిన్నాన్న కుమారుడైన చింటూ (20) టీస్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు రెండు రోజుల క్రితం గుండ్లపోచంపల్లికి వచ్చాడు. నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం నాచారిపేట్కు చెందిన కందాడి శశిధర్‌రెడ్డి (22) ఐటీఐ పూర్తి చేసి ఓ పరిశ్రమలో అప్రెంటీస్‌గా ఎలక్ట్రిక్ పనులు చేస్తున్నా డు. అనీల్, శశిధర్‌రెడ్డి స్నేహితులు. ఈ ముగ్గురు శనివారం రాత్రి అయోధ్య జంక్షన్ వద్ద మాధవన్ బార్లో మద్యం సేవించారు. అనంతరం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అవెంజర్ బైక్‌పై బయ లుదేరారు. బైక్‌ను అతివేగంగా నడపడంతో కొద్ది దూరం వెళ్లగానే అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టారు. ముగ్గురు చెల్లాచెదురుగా పడి తలలు పగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై శ్రీనా«థ్ సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతుల బంధువుల కు సమాచారం చేరవేశారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఈ నెల 17న సుచిత్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ ఆర్మూర్‌కు చెందిన ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డ విషయాన్ని మరువక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. వద్దని తల్లి వారించినా.. రాత్రి 10.30 కు బయటకు వెళ్లి.. శనివారం రాత్రి 10.30 సమయంలో అనీ ల్, చింటూతో పాటు శశిధర్‌రెడ్డి ముగ్గురూ బయటకు వెళ్తుండగా అనీల్ తల్లి వెళ్లొద్దని వారించింది. ఇప్పుడే వస్తాం.. అంటూ వెళ్లిపోయిన వారు విగత జీవులుగా మారడం ఆ ప్రాంతంలో విషాదం నింపింది. శనివారం మధ్యాహ్నం నుంచే అనీల్, చింటూ మద్యం తాగుతూ ఉన్నారని, శశిధర్‌రెడ్డి రావడంతో మళ్లీ ముగ్గురు బైక్‌పై వెళ్లారని అనీల్ సోదరుడు అజయ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. -
కారు ప్రమాదానికి గురై ముగ్గురి మృతి
శేరిలింగంపల్లిలో విషాదచాయలు శేరిలింగంపల్లి: గోదావరి పుష్కరాలకు వెళ్తూ కారు ప్రమాదానికి గురైన సంఘటనలో ముగ్గురు మరణించడంతో శేరిలింగంపల్లిలోని వారి నివాసాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. గోదావరి పుష్కరాల కోసం శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు శేరిలింగంపల్లి ఆదర్శనగర్, గోపినగర్లకు చెందిన రెండు కుటుంబాలు వారు కారులో బయలుదేరి వెళ్లారు. కాగా కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్లే మార్గంలోని వెల్గటూరు మండలం అంబాజీ పేట వద్ద తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన కారు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా అర్థవీడు మండలానికి చెందిన కాకర్ల గ్రామవాసి కె. అల్లూరయ్య గౌడ్ పటాన్‌చెరులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మెకానిక్ పని చేస్తూ శేరిలింగంపల్లి ఆదర్శ నగర్లో నివాసముంటున్నాడు. ఆయన భార్య రమణమ్మ(42), అదే ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బీహెచ్ఈఎల్ ఉద్యోగి టి.నర్సింహులు గోపినగర్‌లో నివాసముంటున్నాడు. ఆయన భార్య వెంకట లక్ష్మీ(45), కుమారుడు శ్రీనివాస్ ఎంటెక్(24)లు సాంత్రో కారులో కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాల పుష్కర ఘాట్‌లో స్నానాలు ఆచరించేందుకు బయలుదేరారు. పుష్కరఘాట్‌కు 10 కి.మీ. దూరం ఉందనగా పెద్దపల్లి మార్గంలో బోలేరో వాహనాన్ని ఢీకొట్టి కారు అదుపు తప్పింది. దీంతో కారు పల్టీలు కొట్టడంతో, కారు డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాస్, రమణమ్మ, వెంకట లక్ష్మీ మృతి చెందారు. రమణమ్మ అక్కడిక్కడే మృతి చెందగా, శ్రీనివాస్, వెంకట లక్ష్మీలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అల్లూరయ్య గౌడ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లగా, నర్సింహులుకు తొంటిలో కీలు విరిగిందని తెలిపారు. -
ఆప్యాయంగా గడిపారు.. అందరినీ విడిచి వెళ్లారు!
పెళ్లికి వెళ్లి వస్తూ {పమాదానికి గురయ్యారు ముగ్గురి దుర్మరణం పది నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో కబళించిన మృత్యువు పీలేరు: వారంతా రాత్రి బంధువుల వివాహానికి వెళ్లి అందరితో ఆప్యాయంగా గడిపారు. మరో పది నిమిషాల్లో ఇల్లు చేరుకునే లోపే రోడ్డు ప్రమాదంలో అందనంత దూరం వెళ్లిపోయారు. మరో పది నిమిషాలు దాటి ఉంటే వారంతా క్షేమంగా ఇంటికి చేరుకునేవారు. పీలేరు మండలంలో వేపులబైలు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దర్మరణం పాలైన సంఘటన తెలిసిందే. పీలేరు పట్టణం ఆర్టీసీ బస్టేషన్ సమీపంలో కాపురముంటున్న ఆనంద్(47) మండలంలోని తలపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పీలేరు ఎస్వీ డీలక్స్ మార్గంలో శ్రీసాయి ఇండియన్ ఇండస్ట్రీస్ అధినేత కోలా శ్రీనివాసులు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో కాపురముంటున్నారు. బుధవారం సాయంత్రం ఆనంద్, అతని భార్య సరళాదేవి, కూతుర్లు మనోగ్న, షణ్మిత, కోలా శ్రీనివాసులు, అతని భార్య ఉమ శ్రీనివాసులు కారులో మదనపల్లెలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. పెళ్లిలో కొంతసేపు బంధువులతో ఆనందంగా గడిపారు. అందరితో కలసి భోజనం చేశారు. రాత్రి మదనపల్లె పీలేరుకు తిరుగుప్రయాణమయ్యారు. పీలేరు పట్టణానికి మరో పది నిమిషాల్లో చేరుకునే సమయంలో మార్గంమద్యలోని వేపులబైలు పంచాయతీ పరిధిలోని అంకాలమ్మ ఆలయం సమీపంలోకి వచ్చేసరికి తిరుపతి నుంచి మదనపల్లెకు వెళుతున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆనంద్(47), అతని చిన్న కుమార్తె షణ్మిత(4) కారు నడుపుతున్న కోలా శ్రీనివాసులు(50) అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు. ఆనంద్ భార్య సరళాదేవి, రెండవ కుమార్తె మనోగ్న, కోలా శ్రీనివాసులు భార్య ఉమ తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి ప్రమాద విషయం తెలుసుకున్న పీలేరు సీఐ టీ.నరసింహులు, ఎస్ఐ సిద్దతేజమూర్తి సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన సరళాదేవి, ఉమ, మనోగ్నలను అతి కష్టంపై వాహనం నుంచి వెలుపలికి తీసి చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రమాద విషయం తెలియడంతో మృతుల బంధువులు, స్నేహితులు, పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పది నిమిషాలు ఆగి ఉంటే ఇంటికి వచ్చేసే వారు గదా.. అంటూ వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు పీలేరు సీఐ తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి
సాక్షి, ముంబై: పుణే సమీపంలోని కాత్రాజ్ ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పురుషులుండగా ఒక మహిళ ఉంది. అదేవిధంగా గాయపడ్డ వారిలో ఇద్దరు మహిళలుండగా ఒక పురుషుడున్నారు. సతారా నుంచి పునే దిశగా వస్తున్న కంటైనర్‌ను వెనక నుంచి వేగంగా దూసుకు వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. కంటైనర్ కింది భాగంలోకి కారు చొరబడడంతో అందులో వీరంతా ఇరుక్కుపోయారు. స్థానికులు పరుగునవచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే డ్రైవర్ సహా ముగ్గురు చనిపోయారు. గాయపడ్డ వారిని కాత్రజ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
కాన్వాయే లక్ష్యంగా బాంబు పేలుడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పెషావర్‌లో భద్రత ఉన్నతాధికారి ప్రయాణిస్తున్న కాన్వాయిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని పెషావర్ పోలీసు ఉన్నతాధికారి ఇజాజ్ ఖాన్ వెల్లడించారు. మృతుల్లో మహిళ, భద్రత ఉన్నతాధికారితోపాటు ఓ వ్యక్తి మరణించారని చెప్పారు. పెషావర్‌లో ఇజాజ్ ఖాన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భద్రత ఉన్నతాధికారి బ్రిగేడియర్ ఖలీద్ జవేద్ లక్ష్యంగా ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. కాగా ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారని వివరించారు. రహదారిపై ఉంచిన కారులో శక్తిమంతమైన బాంబును అమర్చి ఈ పేలుడుకు పాల్పడ్డారని ఇజాజ్ ఖాన్ తెలిపారు. -
శోకసంద్రంగా రాయగూడెం
రాయగూడెం (నేలకొండపల్లి): నల్లగొండ జిల్లా మునగాల మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయగూడెం గ్రామస్తులు ముగ్గురు మృతిచెందారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. రాయగూడెం నుంచి మెదక్ జిల్లా సిద్ధిపేటకు పెంకులతో వెళుతున్న లారీ నల్లగొండ జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామం వద్ద మంగళవారం అర్థరాత్రి దాటాక బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాయగూడెం గ్రామస్తులు డి.కుమారి(45), ఆకం శ్రీను(35), తొట కొండలు(35) మృతిచెందారు. లింగం అప్పారావు, వడ్డెబొయిన గురవయ్య, లారీ డ్రైవర్ షేక్ వలీ, క్లీనర్ ఈసూబ్ (నల్గొండ హుజూర్నగర్ నివాసి) తీవ్రంగా గాయపడ్డారు. రాలేనని చెప్పినా.. ‘జ్వరంతో ఉన్నాను. రాలేను’ అని, తన భర్త ఆకం శ్రీను చెప్పినప్పటికీ డ్రైవర్ బలవంతం చేయడంతో వెళ్లాడని శ్రీను భార్య రోదించింది. నిరుపేద కూలీ అయిన శ్రీనుకు భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు చైతన్య(7), రోహిత్(9) ఉన్నారు. ‘‘నాన్న ఎక్కడమ్మా’’ అంటూ, అడుగుతున్న ఆ పిల్లలన తల్లి హత్తుకుని గుండెలవిసేలా రోదిస్తోంది. పిల్లలు జాగ్రత్తని చెప్పి... ‘పిల్లలు జాగ్రత్త. వచ్చేసరికి ఆలస్యం కావచ్చు’ అని చెప్పి, కానరాని లోకాలకు వెళ్లాడని తొట కొండలు భార్య మల్లికాంబ గుండె పగిలేలా రోదించి సృహ కోల్పోయింది. కొండలుది నిరుపేద కుటుంబం. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహమైంది. వ్యాపారంలో అనుభవనం కోసమని... గ్రామంలో చిన్న దుకాణం నడుపుతున్న కుమారి... మొట్టమెదటిసారిగా పెంకుల వ్యాపారంలోకి దిగింది. ఇటీవల చుట్టుపక్కల గ్రామాలలో పాతపెంకులు కొని సిద్ధిపేటలో విక్రయిస్తోంది. ఒక్కసారి సిద్ధిపేటకు స్వయంగా వెళ్లాల నుకుని మంగళవారం బయల్దేరి, ప్రపమాదంలో ప్రాణా లు కోల్పోయింది. ఆమె తన మనుమరాలు తేజస్వి(కూతురు బిడ్డ)ను పెంచుకుంటోంది. కుమారి మృతదేహం వద్ద ఆ చిన్నారి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వైఎస్ఆర్ సీపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేస్తుండేది. ఆమె మృతదేహాన్ని పార్టీ మండల అధ్యక్షుడు కొర్లకుంట్ల నాగేశ్వరరావు, ఎంపీటీసీ సూరేపల్లి రామారావు, నాయకులు పతానపు నాగయ్య, బి.రేణుకరావు సందర్శిం చి, పార్టీ పతాకాన్ని కప్పారు. ఆమెకు కుమారుడు లేకపోవడంతో కూతురు అనసూయ అంత్యక్రియలు నిర్వహించింది. -
ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు కూలీలు మృతి
కర్నూలు జిల్లా గడివేముల మండలం ఇందుట్ల గ్రామ సమీపంలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడిన కూలీలలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ వేగంగా ట్రాక్టర్‌ను నడపడం వల్లే ఆ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు. -
కడప శివారులో లారీ,మినీ వ్యాన్ ఢీ: ముగ్గురు మృతి
కడప శివారు ప్రాంతమైన కనుమలోపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.అతివేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న మినీ వ్యానును ఢీ కొట్టింది.ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఆ ఘటనలో మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి 108తోపాటు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అలాగే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.అనంతరం మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతులంతా కర్నూలు జిల్లా డోన్ వాసులని పోలీసులు తెలిపారు.లారీ డ్రైవర్ అతివేగమే ఆ దుర్ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.