
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. చాంద్రాయణగుట్ట బార్కస్‌లో నలుగురుపై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే... కుటుంబ కలహాలతో అహ్మద్ బా ఇస్మాయిల్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సొంత అక్కచెల్లెళ్లనే దారుణంగా నరికి చంపాడు. ఇస్మాయిల్ గత ఏడాది భార్యను హత్య కేసులో అరెస్ట్ కాగా, ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. (నకిలీ పత్రాలతో బెయిల్ పొందిన శ్యామ్)
అప్పటి నుంచి కుటుంబసభ్యుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇవాళ సాయంత్రం ఇస్మాయిల్ ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు, సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఇస్మాయిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment