ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చాంద్రాయణగుట్ట: వారం రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఆర్.దేవేందర్ వివరాల ప్రకారం.. శంషీర్‌గంజ్‌లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన హన్మంత్‌చారి కుమార్తె సాహితి(27) వివాహాన్ని ఈసీఐఎల్‌కు చెందిన యువకుడితో ఈ నెల 14వ తేదీన వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే పెళ్లి పత్రికలు పంచేందుకు హన్మంత్‌చారి దంపతులు లింగంపల్లిలోని బంధువుల ఇంటికి మధ్యాహ్నం వెళ్లారు.
సాయంత్రం వచ్చి చూడగా సాహితి ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా..? లేక మరే ఇతర కారణాలున్నాయా..? అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment