Rave Party: Police Registered Case Against 5 People For Conducting Rave Party In Hyderabad Outskirts - Sakshi
Sakshi News home page

అమ్మాయిలను రప్పించి.. చాంద్రాయణగుట్టలో రేవ్‌ పార్టీ 

Published Wed, Apr 7 2021 6:47 AM | Last Updated on Wed, Apr 7 2021 9:53 AM

Rave Party In Chandrayangutta In Hyderabad Over Five People Booked - Sakshi

సాక్షి, చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మజ్లిస్‌ పార్టీ నాయకులు రేవ్‌ పార్టీ నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బార్కాస్‌కు చెందిన మజ్లిస్‌ పార్టీ నాయకుడు పర్వేజ్‌కు గౌస్‌నగర్‌ ఉందాహిల్స్‌లో ఇంపీరియల్‌ ఫాం హౌజ్‌ ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన పర్వేజ్‌ తన స్నేహితులతో కలిసి ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను రప్పించి రేవ్‌ పార్టీ నిర్వహించాడు. వీరు విచ్చలవిడిగా నృత్యాలు చేస్తున్న వీడియో రెండు నెలల అనంతరం తాజాగా వెలుగులోకి వచ్చింది.

సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో వైరల్‌ కావడంతో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌  రుద్ర భాస్కర్, అదనపు ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌ వర్మలు ఫాంహౌజ్‌ను పరిశీలించారు. ఈ వీడియోను ఆధారంగా చేసుకొని పర్వేజ్‌తో పాటు వీడియోలో ముఖాలు గుర్తు పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ తెలిపారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై టీడీపీ శ్రేణుల దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement