
సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులు జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పసుమాములలోని ఓ ఫాంహౌస్‌లో రెండు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు శనివారం రాత్రి తమ స్నేహితుడు సుభాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు.
గంజాయి లభ్యం కావడంతో 29 మంది విద్యార్థులను, నలుగురు యవతులను అదుపులోకి తీసుకున్నారు. 11 కార్లు, ఒక బైక్, 28 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారంతా విద్యార్థులు కావడంతో వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కేసు నమోదు చేసే విషయంపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే వీరికి గంజాయి సరఫరా చేసిన వారిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పట్టుబడిన విద్యార్థుల తల్లితండ్రులని పిలిపించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. మరలా బుధవారం రోజున అధికారులు ఇచ్చే కౌన్సిలింగ్‌కి హాజరు కావాలని పోలీసులు తెలిపారు.
చదవండి: (విజృంభిస్తున్న జంటభూతాలు.. అప్రమత్తం కాకుంటే ప్రమాదమే)
Comments
Please login to add a commentAdd a comment