hayatnagar
-
అప్పు డబ్బులు తిరిగి అడిగినందుకు గొంతు కోసి చంపేశాడు
లింగోజిగూడ: అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇమ్మన్నందుకు వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం దోనకొండకు చెందిన యక్కలి కాశీరావు (37), భార్య సుమలత, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్ భాగ్యలత అరుణోదయ నగర్లో రెండున్నరేళ్లుగా ఉంటున్నాడు. కాశీరావు స్థానికంగా కార్ల క్రయ విక్రయాలు చేస్తుంటాడు. కాశీరావు కిరాయికి ఉంటున్న ఇంట్లోని మొదటి అంతస్తులోనే నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన బ్యాచ్లర్లు పెద్దగాని శేఖర్, పెద్దగాని సాయి, ఐతరాజు శంకర్లు అద్దెకి ఉంటున్నారు. వీరిలో సాయి, శంకర్ హయత్‌నగర్‌లోని బొమ్మలగుడి సమీపంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాశీరావు, పెద్దగాని శేఖర్ ఇద్దరూ కలిసి కార్ల వ్యాపారం ప్రారంభించారు. 2023లో రూ.1.5 లక్షలు ఒకసారి, రూ. 3.60 లక్షలు మరోసారి కాశీరావు వద్ద శేఖర్ అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు డబ్బులు ఇవ్వాలని శేఖర్ గదికి వెళ్లి కాశీరావు అడుగుతుండేవాడు. ఈ విషయమై వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సాయి, శంకర్ వ్యక్తిగత పనిపై గదిలోంచి బయటకు వెళ్లారు. 10 గంటల సమయంలో కాశీరావు.. పైఅంతస్తులో ఉన్న శేఖర్ గదికి వెళ్లాడు. 20 నిమిషాలు గడుస్తున్నా కాశీరావు కిందకు రాలేదు. 10.20 గంటల సమయంలో శేఖర్ రక్తపు మరకలతో కిందకు దిగి వచ్చాడు. అక్కడే దుస్తులు ఆరేస్తున్న కాశీరావు భార్య సుమలతతో.. ‘నీ భర్తను చంపేశాను’ అంటూ వెళ్లిపోయాడు. సుమలత వెంటనే పైఅంతస్తులోని గదికి వెళ్లి చూడగా.. మెడ భాగంలో బలమైన గాయాలతో కాశీరావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. భర్తను పైకి లేపాలని సుమలత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడు అప్పటికే మృతి చెందినట్లు గ్రహించిన సుమలత స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది. అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడనే కోపంతోనే గొడపడిన శేఖర్.. కాశీరావును గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుమలత ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శేఖర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
పోలీసులకు మహిళ బెదిరింపులు
లింగోజిగూడ: తన భర్త వద్ద ఉన్న కారు బంగారు, నగదును ఇప్పించాలని పోలీసులను కోరిన మహిళ అందుకు వారు నిరాకరించడంతో పోలీసులపైనే బెదిరింపుకు పాల్పడిన సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే హయత్‌నగర్, మునగనూర్‌లో నివాసం ఉంటున్న కాటమోని పావని తన మొదటి భర్త గోపీతో విడాకులు తీసుకుని ఐదేళ్ల క్రితం కర్నూలుకు చెందిన గోరుకంటి శ్రీకాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. శ్రీకాంత్ స్థానికంగా పురోహితం చేస్తుండగా, పావని జూనియర్ లాయర్‌గా పని చేసేది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నెలలో శ్రీకాంత్ ఇంటి నుంచి వెళ్లి పోయాడు. దీంతో పావనీ మీర్‌పేట పోలీస్టేషన్లో తన భర్త తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని అతడి తల్లి పద్మ పేరున ఉన్న కారుతో పాటు బంగారం, నగదు తనకు ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. సివిల్ కేసు కావడంతో తమ పరిధిలోకి రాదని పోలీసులు తేల్చి చెప్పారు.దీంతో ఆమె గత నెల 16న తన భర్త కనిపించడం లేదంటూ హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ కర్నూలులో ఉన్నట్లు గుర్తించి అతడిని పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు. అతను పావనీతో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో వదిలేశారు. దీంతో ఆమె అతడి వద్ద ఉన్న కారు, బంగారం, నగదు ఇప్పించాలని కోరడంతో వారు కారు, కొంత నగదును ఇప్పించారు. అయినా సంతృప్తి చెందని పావని బంగారం మరింత నగదు కోసం డిమాండ్ చేయడంతో అది తమ పని కాదని సివిల్ తగదాలు కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఆమె ఈ నెల 23న హయత్‌నగర్ పోలీస్టేషన్లో తన భర్త శ్రీకాంత్, అతని సోదరుడు దుర్గప్రసాద్‌తో కలిసి వేధింపులకు గురి చేస్తున్నారని, దుర్గప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎస్ఐపై ఆరోపణలు పావనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎస్ సైదులు కేసు వివరాలు తెలుసుకునేందుకు తన ఫోన్ నెంబర్ తీసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపణలు చేయడంతో పాటు సీపీకి ఫిర్యాదు చేసినట్లు సామాజిక మధ్యమాల్లో వార్త సంచలనమైంది. మా పరిధి కాదన్నందుకే.. సివిల్ తగదాలు తాము పరిష్కరించమని, కోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతోనే పావనీ ఎస్ఐ సైదులుతో పాటు తమపై అసత్య ఆరోపణలు చేస్తుందని హయత్‌నగర్ సీఐ నాగరాజ్‌గౌడ్ అన్నారు. పావని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. -
హైదరాబాద్: యువకుడి ప్రాణం తీసిన బైక్ స్టంట్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ.. యువకులు ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. హయత్‌నగర్‌లో బైక్ స్టంట్లు యువకుడి ప్రాణాలు తీశాయి. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు.వర్షం కురుస్తున్న సమయంలో కేటీఎం బైక్‌పై ఇద్దరు యువకులు స్టెంట్లు చేస్తుండగా.. అదుపు తప్పి పల్టీలు కొట్టింది. చేతికందిన కుమారుడు మృతిచెందాడన్న వార్త జీర్ణించుకోలేక ఆ కన్నతల్లి పెట్టిన రోదన అక్కడివారిని కలిచివేయించింది. -
బాలిక కిడ్నాప్.. అత్యాచార యత్నం
హయత్‌నగర్: హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో ఓ బాలికను అపహరించి లైంగిక దాడి యత్నం చేయగా.. దుండగులను ప్రతిఘటించి తప్పించుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ కథనం ప్రకారం... పెద్దఅంబర్‌పేట్‌లో నివసించే ఓ బాలిక(17) పదో తరగతి వరకు చదివి ఇంటివద్దనే ఉంటోంది. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఓ గుర్తు తెలియని యవకుడు బైకుపై వచ్చి బాత్రూంకు వెళుతున్న బాలికను పిలిచి అడ్రస్ తెలపమని ఫోన్ చూపించాడు. ఆమె ఫోన్ చూస్తుండగానే ఆ అడ్రస్‌కు తీసుకెళ్లమని కోరి బైకుపై ఎక్కించుకుని వెళ్లాడు. మధ్యలో మరో యువకుడు బైకుపై ఎక్కాడు. వారిద్దరు బాలికను బైకుపై ఔటర్ రింగురోడ్డు సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఓ చిన్నరూంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి ప్రయ త్నించారు. భయాందోళనకు గురైన బాలిక ప్రతిఘటించి వారి నుంచి తప్పించుకుని జాతీయ రహదారిపైకి చేరింది. రోడ్డుపై తచ్చాడుతున్న బాలికను గమనించిన ఓ హిజ్రా ఆమెను ప్ర శ్నించగా.. తన తల్లికి ఫోన్ చేయమని కోరింది. తల్లి స్పందించక పోవడంతో పక్కనే ఉన్న హోటల్ వద్దకు వెళ్లి వారి సహాయంతో పోలీ సులకు సమాచారం అందించారు. వెంట నే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరిన బాలికను చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలిక తప్పించుకుని చెట్ల పొదల నుంచి రావడం వల్ల చిన్న చిన్న గాయాలయ్యాయని, ఆమెకు వైద్య పరీక్షలు చేయించామని లైంగికదాడి జరగలేదని డీసీపీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాగా దుండగులు బాలికపై మత్తుమందు స్ప్రే చేశారని అనుమానిస్తున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
హయత్‌నగర్ రాజేశ్ మృతి కేసులో వీడిన మిస్టరీ.. పోలీసులు ఏం చెప్పారంటే!
సాక్షి, హైదరాబాద్: సంచలనం రేపిన హయత్ నగర్ రాజేశ్ మృతి కేసును పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. రాజేశ్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు రాచకొండ సీపీ చౌహన్ గురువారం మీడియా ముందు వివరాలు వెల్లడించారు. తొలుత సుజాత ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆస్పత్రిలో మృతి చెందింది. తరువాత రాజేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రాజేశ్, సుజాతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు. ‘రాజేశ్‌కు ఆరు నెలల క్రితం సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసి వివాహం కాలేదని భావించిన రాజేశ్.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ తరచూ కలుసుకుంటున్నారు. రాజేష్ ప్రతి రోజు సుజాత ఇంటి చుట్టూ తిరిగేవాడు. సుజాతతో రాజేశ్ బాగా చనువుగా ఉండేవాడు. ఆమె తన పర్సనల్ ఫోటోలను రాజేశ్‌కు పంపింది. సంబంధిత వార్త: మిస్డ్ కాల్‌తో కనెక్టయ్యారు.. లవ్‌లో మునిగితేలారు.. చివరకు.. అయితే సుజాత సంబంధం గురించి ఆమె కొడుకు జయచంద్రకు తెలిసింది. జయచంద్ర రాజేష్‌ను కొట్టాడు. కానీ అతనికి మృతికి ఈ గాయాలు కారణం కాదు. రాజేశ్ పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి గాయాలు లేదు. ఈ క్రమంలో చనిపోదామని ఇద్దరూ నిర్ణయించారు. మే 24న సుజాత మొదట పురుగుల తాగింది. తన తల్లి చావు బతుకుల మధ్య ఉందని సుజాత కొడుకు రాజేశ్‌కు చెప్పాడు. అదే రోజు (మే 24) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ కేసుని చేధించాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’ అని తెలిపారు. చదవండి: ట్రైన్ ఎక్కుతూ జారిపడిపోయిన మహిళ.. రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయి -
రాజేష్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
సాక్షి, రంగారెడ్డి: హయత్‌నగర్‌లో దారుణంగా హత్యకు గురైన రాజేష్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. సుజాతతో వివాహేతర సంబంధం కారణంగానే.. ఆమె భర్త రాజేష్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈలోపు నాగేశ్వర్రావు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. తన భార్యది సూసైడ్ కాదని.. రాజేష్ చంపాడంటూ సాక్షి టీవీతో చెప్పాడు. ‘‘నా భార్యను రాజేషే చంపాడు. విషం తెచ్చి బలవంతంగా నా భార్యకు తాగించాడు. నేను కానీ.. నా కొడుకులు కానీ రాజేష్‌ను కొట్టలేదు. కొన్ని నెలలుగా నా భార్యను రాజేష్ టార్చర్ పెడుతున్నాడు’’ అని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడాయన. ఇదిలా ఉంటే ఈ కేసులో వివాహేతర సంబంధమే రాజేష్ హత్యకు కారణమనే విషయాన్ని పోలీసులు దాదాపుగా ధృవీకరించుకున్నారు. ప్రభుత్వ టీచర్ అయిన సుజాతతో రాజేష్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగిందని పేర్కొంటూ.. ఈ నెల 24వ తేదీన సుజాతను ఆస్పత్రిలో చేర్పించాడు నాగేశ్వరరావు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. అయితే ఆమె విషం తాగిందని చెబుతున్న సమయానికి ముందు ఆమె ఇంటి వద్ద రాజేష్ కనిపించాడని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాకేష్ హత్య కేసులో హయత్‌నగర్ పోలీసులు నాగేశ్వర్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్‌ను నాగేశ్వరరావు కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
చంచల్‌గూడ జైలుకు నిహారిక
సాక్షి, క్రైమ్: నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హాసన్, నిహారికలను అరెస్ట్ చేసి.. తాజా నిందితులుగా చేర్చి సోమవారం హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు పోలీసులు. ఈ కేసులో నిహారిక, హసన్‌లను ఏ2, ఏ3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చంచల్‌గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. హాసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు స్నేహితుడు కాగా, నిహారిక గర్ల్‌ఫ్రెండ్. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్ హత్య జరిగింది. గత నెల 17న జరిగిన నవీన్‌ను అతి కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేశాడు. ఈ హత్య గురించి నిహారికకు కూడా తెలుసని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్య జరిగిన తర్వాత.. ప్రియుడు హరిహరను గుడ్ బాయ్ అంటూ నిహారిక మెచ్చుకోవడం, ఆపై అవసరం ఉందని చెబితే రూ.1500 ట్రాన్స్ఫర్ కూడా చేసింది. నవీన్‌ను హత్య చేసిన ఘటనాస్థలానికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని పోలీసులు తేల్చారు. మరోవైపు తన ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం ద్వారా ఆధారాలను మాయం చేసేందుకు నిహారిక ప్రయత్నించిందని తెలుస్తోంది. -
Crime: భర్త లేకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని..
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధాల మోజులో పడి.. మానవ సంబంధాలకు పాతరేస్తున్నారు కొందరు. పక్కదారి పట్టిన ఆ భార్యను.. మంచి దారిలోకి తేవాలని ఆ భర్త చేసిన ప్రయత్నం ఫలించలేదు. పైగా ఒకరకంగా అదే అతని ప్రాణం మీదకు తెచ్చింది కూడా!. హయత్‌నగర్‌లో జరిగిన దారుణ ఘటన.. భార్య చేసిన కుట్ర, బాధితుడి మరణాంతరం కొన్నినెలలకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ హయత్ నగర్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం మోజులో పడి.. భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని ప్లాన్ చేసింది ఓ మహిళ. అందుకోసం ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తపై దాడి చేయించింది. అదృష్టం బాగుండి ఆ టైంకి బతికాడు. అనుమానం రాకుండా కన్నీళ్లు కారుస్తూ.. లేని ప్రేమను నటించిందామె. మంచానపడ్డ ఆ భర్త కొన్నాళ్లకు కన్నుమూశాడు. దీంతో తన కుట్ర బయటకు రాదని ఆమె భావించింది. అయితే.. సన్నిహితురాలి ద్వారానే ఆమె బాగోతం వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్‌లో నివాసం ఉండే శంకర్ గౌడ్, రజితలు ఇద్దరూ ఆర్టీసీ కండక్టర్లు. శంకర్ కూకట్పల్లి, రజిత హయత్ నగర్ డిపో-1లో పని చేస్తుండేవాళ్లు. అయితే.. రజిత పని చేసే డిపోలోనే రాజ్‌కుమార్ ఆర్టీసీ కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. శంకర్ గౌడ్ డ్యూటీ కోసం వెళ్లగానే.. రాజ్‌కుమార్ రజిత కోసం ఇంటికి వచ్చేవాడు. భార్య ప్రవర్తనలో మార్పు గమనించి.. ఆమెను మందలించాడు శంకర్. అయితే..అది ఆమెకు కోపం తెప్పించింది. భర్త లేకుంటే.. ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని భావించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. .. ఈ ఏడాది మార్చి 7వ తేదీ రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న శంకర్‌పై.. దారి కాచిన రాజ్‌కుమార్, అతని ఇద్దరి స్నేహితులు దాడికి దిగారు. ఆ దాడిలో శంకర్ తీవ్రంగా గాయపడగా.. తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది రజిత. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించినా.. నిందితులెవరు అనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆ దాడిలో తగిలిన దెబ్బలతో శంకర్ మంచానికే పరిమితం అయ్యాడు. అలా మూడు నెలల తర్వాత గుండెపోటుతో కన్నుమూశాడు. అయితే.. భర్తపై దాడికి సంబంధించిన విషయాన్ని రజిత తన స్నేహితురాలితో పంచుకుంది. ఆమె అతని సోదరుడికి చెప్పడం, ఆ సోదరుడు శంకర్ గౌడ్ సోదరుడికి స్నేహితుడు కావడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో శంకర్ సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసును తిరిగి ఓపెన్ చేసిన పోలీసులు.. రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రజితతో వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణమని జరిగిందంతా వివరించాడు. దీంతో.. ఐపీసీ సెక్షన్ 307గా కేసు నమోదు చేసుకుని.. రాజ్‌కుమార్, అతని సహకరించిన నీరజ్, ఉమాకాంత్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శంకర్ భార్య రజిత కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
Hyderabad: రేవ్‌పార్టీ భగ్నం.. పట్టుబడిన 33 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులు జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పసుమాములలోని ఓ ఫాంహౌస్‌లో రెండు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు శనివారం రాత్రి తమ స్నేహితుడు సుభాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. గంజాయి లభ్యం కావడంతో 29 మంది విద్యార్థులను, నలుగురు యవతులను అదుపులోకి తీసుకున్నారు. 11 కార్లు, ఒక బైక్, 28 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారంతా విద్యార్థులు కావడంతో వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కేసు నమోదు చేసే విషయంపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే వీరికి గంజాయి సరఫరా చేసిన వారిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పట్టుబడిన విద్యార్థుల తల్లితండ్రులని పిలిపించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. మరలా బుధవారం రోజున అధికారులు ఇచ్చే కౌన్సిలింగ్‌కి హాజరు కావాలని పోలీసులు తెలిపారు. చదవండి: (విజృంభిస్తున్న జంటభూతాలు.. అప్రమత్తం కాకుంటే ప్రమాదమే) -
అవమానించారంటూ ఆయువు తీసుకుంది
హయత్‌నగర్: పాఠశాలలో అవమానం జరిగిందని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హయత్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది. విద్యార్థిని మృతికి ఉపాధ్యాయుల వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ డివిజన్లోని బంజారా కాలనీలో నివసించే కరంటోతు లక్పతి, సరిత దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. లక్పతి ఆటో డ్రైవర్. ఆయన కూతురు అక్షయ శాశ్వత్ (13) హయత్‌నగర్ రాఘవేంద్ర కాలనీలోని శాంతినికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన అక్షయ తలుపులు వేసుకుని చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఊరికి వెళ్లిన తల్లి దండ్రులు ఇంటికి ఫోన్ చేయగా ఎంతకూ ఎత్తలేదు. దీంతో పక్క వీధిలో నివసించే వారి బంధువులకు ఫోన్ చేయగా వారు వచ్చి తలుపులు తీసి చూశారు. అక్షయ ఉరేసుకుని కనిపించింది. కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీందో వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పాఠశాలపై దాడికి యత్నం.. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు అక్షయ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కూతు మృతికి పాఠశాల ఉపాధ్యాయులే కారణమంటూ ఆరోపించారు. విద్యార్థినిని అవమానించిన ఉపాధ్యాయులను, పాఠశాల యాజమాన్యాన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాలపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ పురుషోత్తంరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని పోలీసులు, పాఠశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బయట నిలబెట్టారు: తోటి విద్యార్థిని తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులు బెంచీలు మారడంతో తమకు తెలియకుండా ఎందుకు మారారని ఓ ఉపాధ్యాయుడు అక్షయతో పాటు మరో విద్యార్థినిని బయట నిల్చోబెట్టారని తోటి విద్యార్థిని తెలిపింది. తర్వాత మరో టీచర్ వచ్చి మీరెందుకు బయట ఉన్నారు... లోపలికి రమ్మని పిలిచింది. మిమ్మల్ని బయట నిలబెట్టాను కదా లోపలికి ఎందుకు వచ్చారని సదరు ఉపాధ్యాయుడు అడిగాడని ఆమె తెలిపింది. టీచర్ రమ్మని చెప్పినట్లు వారు సమాధానమిచ్చారు. తాను రమ్మనలేదు టీచర్ అనడంతో తిరిగి వారిని బయట నిలబెట్టారు. సుమారు రెండు పీరియడ్లు బయట నిలుచోవడంతో వారు తమకు అవమానం జరిగినట్లు భావించారని. దీంతో అక్షయ మనస్తాపానికి గురై ఉండవచ్చని తోటి విద్యార్థిని తెలిపింది. అవసరమైతే పాఠశాలపై కేసు నమోదు చేస్తాం: సీఐ ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని హయత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. విద్యార్థిని మృతికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు కారణమని తేలితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. -
అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని..
హయత్‌నగర్: దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దుప్పట్లో చుట్టి బయట పడేసే ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శక్రవారం రాత్రి హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. హయత్‌నగర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి శ్రీను మేస్త్రీ పని చేస్తుండగా, లక్ష్మి(35) కూలి పని చేసేది. ఆమె అనారోగ్యంతో ఇంట్లోనే ఉండగా శ్రీను పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తల్లికి కూతురు భవాని మంచి నీళ్ళు ఇవ్వగా కొద్దిసేపటికి లక్ష్మీ మృతి చెందింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేవని రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితుడు వినోద్ సహాయంతో బార్య మృత దేహాన్ని భజంపై వేసుకుని సమీపంలో ఉప్ప బాతుల చెరువు అలుగు వద్ద పడేసేందుకు వెళుతున్నాడు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన ఇది గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకుని నిలదీశారు. చంపి శవాన్ని పడేసేందుకు వచ్చారనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించి శ్రీను, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
‘మా కూతురి ఆచూకీ తెలపండి’
సాక్షి, హయత్‌నగర్ : పదిరోజులు క్రితం కనిపించకుండా పోయిన తమ కూతురు ఆచూకీ ఇంత వరకు తెలియలేదని.. ఆమె ఎక్కడ ఉందో? ఎలా ఉందో? కనీస సమాచారం లేదంటూ ఆందోళన చెందుతున్నారు ఓ యువతి తల్లిదండ్రులు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కంట్లూర్లో నివాసముండే ఓ యువతి(18) గత నెల 18న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. యువతిని స్థానికంగా ఉండే ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌చేసి తీసుకెళ్లాడని ఆమె తల్లిదండ్రులు అదే రోజున హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కూతురి జాడ వెతకాలని అప్పటి నుంచి వారు పోలీస్ స్టేషన్ చుట్టు తిరుగుతున్నారు. పది రోజులు గడుస్తున్నా పోలీసులు ఇంత వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతి తన ఇష్టపూర్వకంగా వెళ్తున్నట్లు లెటర్ రాసిపోయిందని పోలీసులు పేర్కొంటున్నారు. యువతి ఆచూకీని వెతికేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. చదవండి: బండరాళ్లతో మోది భర్తను చంపిన భార్య -
హయత్‌నగర్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్ కార్యాలయం?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని హయత్‌నగర్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. స్థానిక మండల పరిషత్ ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగించాలని యోచిస్తోంది. ఇక్కడైతే అబ్దుల్లాపూర్‌మెట్ మండల ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు విస్తృతంగా రవాణా సౌకర్యాలు ఉన్నాయని భావిస్తోంది. అబ్బుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి సజీవదహనంతో అక్కడి ఉద్యోగులు సదరు కార్యాలయంలో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇన్చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సైతం కార్యాలయానికి వెళ్లేందుకు సాహసించడం లేదు. విజయారెడ్డి హత్య కు గురైన భవనంలో తాము విధులు నిర్వహించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించిన యంత్రాంగం..హయత్‌నగర్‌లోని మండల పరిషత్ ప్రాంగణంలోని భవన సముదాయంలో ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుం దని యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. దీని పట్ల ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీశ్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ఇన్చార్జి కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
మొండం లేని మహిళా మృతదేహాం లభ్యం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గ్రామా శివారులో దారుణ ఘటన చోటుకుంది. ఓ 50 ఏళ్ల మహిళా మెడ నరికి దుండగులు హత్య చేసిన ఘటన హాయాత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. కుంట్లుర్ గ్రామ శివారులో మొండం లేని మహిళా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు హాయత్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్కాడ్ బృందంతో డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ..ఈ హత్య రెండు రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే మృతిచెందిన మహిళ మెదక్ జిల్లా జోగిపెట మండలం యారరం గ్రామానికి చెందిన బెతమ్మ(50)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు మీడియాకు తెలిపారు. -
ఒక్కడు.. అంతులేని నేరాలు
సాక్షి, నాగోలు: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడి, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘరానా నేరస్తుడిని రాచకొండ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఒక కారు, రెండు బంగారు ఉంగరాలు, వెండి ఉంగరం, నాలుగు సెల్ ఫోన్లు, ఎనిమిది సిమ్ కార్డ్ లు, రూ.47 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం దవలూరుకు చెందిన ఇత్తెం రవి శేఖర్ అలియాస్ రవి అలియాస్ సతీశ్ అలియాస్ శశిధర్‌రెడ్డి మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. 1994లో వివాహం కాగా 2014 లో భార్య చనిపోయింది. 2011 లో రవిశేఖర్ దగ్గరి బంధువుకు ఉయ్యూరు కేసీపీలో ఉద్యోగం పెట్టిస్తానని రూ.30 వేలు నగదు తీసుకుని మోసం చేయగా ఈ కేస్‌లో అరెస్ట్ అయి జైల్‌కు వెళ్ళివచ్చాడు. మరో కేస్ లో ఓ మహిళను మోసం చేసి జైల్‌కు వెళ్ళి విడుదలయ్యాడు. పలు అధికారులుగా అవతారాలు.. జైలు నుంచి వచ్చిన అనంతరం రవి శేఖర్ రైస్ మిల్లర్స్, రేషన్ డీలర్స్, ఫర్టిలైజర్స్ షాపుల వద్దకు విజిలెన్స్, ఇన్‌కంటాక్స్ అధికారినని, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నని, జడ్జిలు తనకు బంధువులని చెబుతూ డబ్బు తీసుకుని మోసాలకు పాల్పడేవాడు. నిరుద్యోగ యువకులకు కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకుని మొహం చాటేసేవాడు. విశాఖపట్నంలో ఓ మోసపూరిత వ్యవహారంలో మే 23న కాకినాడ కోర్ట్ నుంచి విశాఖపట్నం జైల్‌కు తరలిస్తుండగా ఎస్కార్ట్ వాహనం నుంచి తప్పించుకుని పారిపోయాడు. అనంతరం జూన్‌లో రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో కర్నాటక కొప్పల్ జిల్లాకు చెందిన మహిళతో తాను సెక్యూరిటీ ఆఫీసర్నని పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద రూ.3 కోట్ల మేర డబ్బు వుండగా దాంతో స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు నమ్మించి అక్కడి స్థలాలకు చెందిన పత్రాలను, కొంత నగదుతో మరో వ్యక్తితో ఐ 20 కారు ను తీసుకుని వస్తూ కార్ డ్రైవర్‌ను మధ్యలో వదిలి కారుతో సహా ఉడాయించాడు. ఆ కారుతో కర్నూలు జిల్లాకు వచ్చి నెంబరు మార్చుకుని తాను గోదావరి జిల్లా సీబీఐ ఆఫీసర్ నని చెప్పి నితిన్ కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.50వేలు, ఒక సెల్ ఫోన్ తీసుకుని పారిపోయాడు. ఇలా పలు నేరాలు చేశాడు. గత నెల బొంగులూరు గేట్ సమీపంలో ఓ విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాలికను కిడ్నాప్ చేశాడు. అక్కడ నుంచి కడపలో తెలిసిన బంధువులతో జాబ్ గురించి మాట్లాడే పని వుందని చెప్పి కడప, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఆ విద్యార్థిని తిప్పుతూ ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 28 న బాధితురాలిని కారులోనే బంధించి ఆ వాహనం నెంబర్‌ను తిరిగి మార్చి ఎరువుల దుకాణం వద్దకు వెళ్ళి తాను విజిలెన్స్ అధికారినని బెదిరించి వారి నుంచి రూ.82 వేల నగదు, బంగారం, వెండి వుంగరాలు తీసుకుని పరారయ్యాడు. అప్పటికే హయత్ నగర్ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో గత నెల 30న కిడ్నాప్ చేసిన విద్యార్థిని హైదరాబాద్ బస్ ఎక్కించి ‘నువు వెళ్ళిపో.. నేను నీ వెనక వచ్చేస్తా..’ నని చెప్పి అక్కడ నుంచి ఉదాయించాడు. పోలీసులు జీపీఆర్ సిస్టమ్ ద్వారా రవి శేఖర్ ను పంతంగి టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేసి అతడి నుంచి కారు, నగదు, బంగా రం స్వాధీనం చేసుకుని విచారించగా ఇతడిపై తెలంగాణలో 10 కేస్లు, ఆంధ్రప్రదేశ్‌లో 38 కేస్ లు, కర్నాటకలో 1 కేస్లు నమోదైనట్లు గుర్తించారు. రవిశేఖర్ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ధారాళంగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడటంలో దిట్ట అని పేర్కొన్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్, మ్యాథ్స్.. చాలా ఈజీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యా రంగంలో స్టార్టప్స్ అంటే? స్కూల్ సిలబస్‌ను స్మార్ట్ఫోన్లలోకి తీసుకొచ్చినవి.. ఆన్లైన్లో ఫీజులు, పాఠశాల నిర్వహణ చేసేవి.. లంచ్ బాక్స్‌లు అందించేవి..., స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం రుణాలిచ్చేవి... ఇలా చాలా ఉన్నాయి. కానీ, దేశంలో తొలిసారిగా వ్యక్తిగత విద్యార్థుల అభ్యసన ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చింది మాత్రం హైదరాబాద్‌కు చెందిన ‘360 లెర్నింగే!’. అందులోనూ ఇంగ్లిష్, గణితం వంటి కీలక సబ్జెక్ట్స్ వర్క్‌షీట్స్‌ను కూడా అభివృద్ధి చేసింది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ జితేంద్ర మాచిరాజు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా. బీటెక్ పూర్తయ్యాక ఎక్స్‌సీడ్ ఎడ్యుకేషన్‌లో ఎనిమిదేళ్లు పనిచేశా. తర్వాత హయత్‌నగర్, చంపాపేట్‌లో సొంతంగా స్కూల్స్ పెట్టా. ఎక్స్సీడ్లో, స్కూల్స్‌లో ఉన్న సమయంలో గమనించిందేమిటంటే? విదేశాల్లో మాదిరిగా ఇక్కడి పాఠశాలల్లో వ్యక్తిగత అభ్యసన ప్రక్రియలు లేవు. దీనివల్లే విద్యార్థుల విద్యా విధానంలో తేడాలొస్తున్నాయని గమనించా! దీన్ని అధిగమించాలంటే స్టూడెంట్స్‌కు పర్సనల్ లెర్నింగ్ కావాలి. అందుకే మిత్రుడు కర్నాటి ప్రమోద్ కుమార్‌తో కలిసి 2015 నవంబర్ 14న రూ.10 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 360 లెర్నింగ్ఎడ్యుటెక్.కామ్‌ను ప్రారంభించాం. ఇంటికే వర్క్‌షీట్స్.. ప్రస్తుతం 3 నుంచి 13 ఏళ్ల వయస్సు విద్యార్థులు లేదా 8వ తరగతి లోపు విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్ట్స్ వర్క్‌షీట్స్ అందిస్తున్నాం. పోటీ పరీక్షలతో సహా దేనికైనా మ్యాథ్స్, ఇంగ్లిష్‌పై పట్టుండాలి. అందుకే ఈ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేశాం. విద్యార్థి పరిజ్ఞానం, అభ్యసన తీరును బట్టి ఒక్కొక్క విద్యార్థికి ప్రత్యేకంగా వర్క్‌షీట్స్‌ను రూపొందిస్తాం. ఇందుకోసం 8 మంది నిపుణుల బృందం ఉంది. ఇందులో సబ్జెక్ట్స్ నిపుణులతో పాటూ పిల్లల మానసిక వేత్తలూ ఉంటారు. వర్క్‌షీట్స్‌ను పరిష్కరించేటపుడు ఏమైనా సందేహాలొస్తే... వీడియోకాల్ ద్వారా నిపుణులు అందుబాటులోకి వస్తారు. ప్రతి వారం విద్యార్థికి వ్యక్తిగత వర్క్‌షీట్స్‌ను ఇంటికి తీసుకెళ్లి ఇస్తాం. వాటి ని పరిష్కరించాక నిపుణుల బృందం పరిశీలిస్తుంది. తర్వాత విద్యార్థి అభ్యసన శక్తిని అంచనా వేసి వేరే వర్క్‌షీట్స్ అందిస్తుంటాం. 5 నెలలకు రూ.5 వేలు.. ప్రస్తుతం 360 లెర్నింగ్‌లో 3,500 మంది విద్యార్థులున్నారు. ఒక్క విద్యార్థికి ఒక్క సబ్జెక్ట్ వర్క్షీట్స్కు గాను 5 నెలలకు రూ.5 వేలు చార్జీ ఉంటుంది. త్వరలో ఐఐటీ ఫౌండేషన్ వర్క్‌షీట్స్‌ను విద్యార్థులకు అందిస్తాం. ఏడాదిలో మరో 2 వేల మంది విద్యార్థులను చేరుకోవటంతో పాటూ 10, 12వ తరగతుల గణితం, ఇంగ్లిష్ సిలబస్‌లను అందుబాటులోకి తేవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం ఆయా సిలబస్‌ల వర్క్‌షీట్స్ రూపొందిస్తున్నాం. త్వరలోనే పాఠశాలలతో ఒప్పందం చేసుకుంటాం. ఏడాదిలో సుమారు 15 పాఠశాలలతో ఒప్పందంతో సుమారు రూ.కోటి వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. రూ.5 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.75 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.2 కోట్లు వ్యాపారాన్ని చేరుకుంటాం. త్వరలో బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో సేవలను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నా రు. అజయ్ ఈడూరి, రవి మంథా ఇద్దరు కలిసి సీడ్ రౌండ్లో రూ.1.2 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఏంజిల్ రౌండ్లో రూ.5 కోట్లు సమీకరించనున్నాం. ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. 6 నెలల్లో డీల్ క్లోజ్ చేస్తాం’’ అని జితేంద్ర వివరించారు. -
24 గంటల్లో ఐదు హత్యలు
-
హయత్‌నగర్‌లో యువతి దారుణ హత్య
-
జంతు కళేబరాల కల్తీ ఆయిల్ దందా గుట్టు రట్టు
-
హయత్‌నగర్ ప్రేమ పెళ్లి వ్యవహారం కొత్త ట్విస్ట్
-
హయత్‌నగర్ బట్టల షోరూంలో అగ్ని ప్రమాదం
-
10 ప్రైవేట్ బస్సులు సీజ్
హైదరాబాద్: అనుమతి లేకుండా అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 10 ప్రైవేటు బస్సులను సోమవారం ఉదయం సీజ్ చేశారు, మరో పది బస్సులపై కేసులు నమోదుచేశారు. హయాత్‌నగర్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స బస్సులపై ఉప్పల్ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. -
పొట్లకా.....య!
హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీ రామాలయం వీధిలో నివసించే రిటైర్డ్ టీచర్ సీహెచ్.ఆంజనేయులు తన ఇంటి మేడపైన ఫిబ్రవరి నెలలో పొట్లకాయల పాదు పెట్టాడు. దానికి ఒక్కోటి 7 అడుగుల పొడవు గల 6 కాయలు కాశాయి. ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ విత్తనాలను హార్టికల్చర్ కార్యాలయం నుంచి తెచ్చినట్లు ఆయన తెలిపారు. -
వినోద ప్రాంగణం!
ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ఇక మినీ థియేటర్లు మొదట హయత్‌నగర్, ఈసీఐఎల్, పటాన్చెరులో... ఆదాయం పెంపు వ్యూహంలో భాగంగానే.. సిటీబ్యూరో: ప్రయాణికులకు వినోదభరితమైన కబురు. సరదాగా సినిమాకి వెళ్లాలనుకుంటున్నారా...ఇక మీరు సినిమాల కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలే ఇక మినీ థియేటర్లుగా అవతరించనున్నాయి.ప్రయాణ సదుపాయంతో పాటు వినోదభరితమైన చిత్రాలను కూడా అందజేయనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు గ్రేటర్‌లోని అన్ని ప్రధాన ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు రాబోతున్నాయి. హయత్‌నగర్, ఈసీఐఎల్, కాచిగూడ, కోఠీ, కూకట్పల్లి, పటాన్‌చెరులోని కమ్యూటర్ ఎమినిటీస్ సెంటర్లలో మినీథియేటర్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మొదట పటాన్‌చెరులోని ప్రయాణ ప్రాంగణంలో త్వరలో మినీ థియేటర్‌ను ప్రారంభించనున్నారు. ఒక్కో థియేటర్లో 125 నుంచి 150 మంది వరకు కూర్చొనే విధంగా ఈ థియేటర్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అద్దెకు ఇచ్చిన తరహాలోనే మినీథియేటర్స్ను కూడా అద్దెకు ఇస్తారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు కేవలం టిక్కెట్‌పైన వచ్చే ఆదాయంపై మాత్రమే ఆధారపడకుండా ఇతర మార్గాలను సైతం అన్వేషించాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. అదనపు ఆదాయం వచ్చే మార్గాన్వేషణలో భాగంగా మినీ థియేటర్లకు శ్రీకారం చుట్టారు. మొదట నగరంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తెచ్చిన అనంతరం మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లలో కూడా థియేటర్లు ఏర్పాటు చేస్తారు. అన్ని సదుపాయాలు ఒకేచోట.... రవాణా సదుపాయాన్ని అందజేయడంతో పాటు నగరవాసులకు కావలసిన సదుపాయాలన్నింటినీ ఒకే చోట అందజేయాలన్న లక్ష్యంతో ఆర్టీసీ దశలవారీగా ప్రయాణ ప్రాంగణాలను నిర్మించింది. నిత్యావసర వస్తువులు, ఈ సేవ, బ్యాంకింగ్, బస్‌పాస్‌ల జారీ వంటి అన్ని రకాల సదుపాయాలు, సేవలు లభించేందుకు అనుగుణంగా జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా దశలవారీగా ఏర్పాటు చేశారు. కాచిగూడ, కోఠీ వంటి కొన్ని ప్రాంగణాలకు వ్యాపారవర్గాల నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ మరికొన్ని ఎలాంటి ఆదరణకు నోచకుండా అలంకారప్రాయంగా ఉండిపోయాయి. హయత్‌నగర్ ప్రధాన హైవేపైన ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడి కమ్యూటర్ ఎమినిటీస్ సెంటర్‌కు వ్యాపారవర్గాల నుంచి స్పందన కరువైంది. అలాగే కూకట్పల్లి, ఈసీఐఎల్ కేంద్రాల్లోనూ ఆర్టీసీ కాంప్లెక్స్‌లు అలంకారప్రాయంగానే ఉన్నాయి. ఇలాంటి చోట్ల మినీ థియేటర్లను ఏర్పాటు చేయడ ం వల్ల అదనపు ఆదాయం లభించగలదని ఆర్టీసీ అంచనా వేస్తోంది. నష్ట నివారణకు ఇదో మార్గం... నగరంలోని 28 డిపోల ద్వారా ప్రతి రోజు సుమారు 3550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 33 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. బస్సుల నిర్వహణ, విడిభాగాలు, ఇంధనం కొనుగోళ్లు, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర ఖర్చుల వల్ల ఏటేటా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుండగా, బస్సుల నిర్వహణ కోసం రూ.3.5 కోట్ల మేర ఖర్చు చేయవలసి వస్తోంది. దీంతో రోజుకు రూ.కోటి మేర నష్టం వాటిల్లుతోంది. గ్రేటర్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు జీహెచ్ఎంసీ గత సంవత్సరం రూ.100 కోట్ల మేర అందజే సింది. తాజాగా రూ.198 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ప్రస్తుతం టిక్కెట్టేతర ఆదాయంపైన ప్రధానంగా దృష్టి సారించారు. -
బంధువు చనిపోయాడంటూ... పెళ్లికి నిరాకరణ
పోలీసులకు బాధితుల ఫిర్యాదు చిలకలగూడ: తమ బంధువు మృతి చెందారని చెప్పి... సుష్టి (సూతకం) ఉంద నే సాకుతో పెళ్లి వాయిదా వేయాలని కోరిన వరుడిపై వధువు తరఫు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలకలగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ... బౌద్ధనగర్ గొల్లపుల్లయ్యబావికి చెందిన వరిగంటి బాలయ్య, సత్తెమ్మల కుమార్తె (21)కు హయాత్ నగర్‌కు చెందిన సతీష్ యాదవ్‌తో ఈ నెల 30న (శుక్రవారం) ఉదయం 11.20 గంటలకు పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వేకువజామున పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తమ బంధువు మృతిచెందాడని...సూతకం వల్ల పెళ్లి వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులు హయత్‌నగర్ వెళ్లి పెళ్లి కొడుకు కాళ్లావేళ్లా పడ్డారు. తాము అన్నీ సమకూర్చుకున్నామని... వివాహం వాయిదా అంటే చాలా ఇబ్బంది పడతామని చెప్పడంతో శుక్రవారం సాయంత్రం మరో ముహూర్తం ఉందని.. ఆ సమయానికిపెళ్లి చేసుకుంటానని నచ్చజెప్పాడు. సాయంత్రం మరోమారు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. దీంతో కావాలనే కుంటి సాకులతో పెళ్లికి నిరాకరిస్తున్నాడని వధువు తల్లిదండ్రులు గుర్తించారు. తమను మోసగించారని ఆరోపిస్తూ వరుడు సతీష్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రత్యేక బృందాన్ని హయత్‌నగర్ పంపించామని పోలీసులు తెలిపారు. -
షాప్‌కు వెళ్లిన నవవధువు కిడ్నాప్
-
భారీ వర్షం
హయత్‌నగర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్లు గ్రేటర్ పరిధిలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం క్యుములోనింబస్ మేఘాల తీవ్రతే కారణం సిటీబ్యూరో: గ్రేటర్ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలు సహా, రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం తెల్లవారు ఝాము వరకు కుండపోత వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం శివారు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తన ప్రభావం మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. క్యుములో నింబస్ మేఘాల ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం తెల్లవారు ఝాము వరకు అత్యధికంగా హయత్‌నగర్ మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో 3.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్‌లో 8.4, గోల్కొండలో 3.5, మేడ్చల్‌లో 2.5, శామీర్‌పేట్‌లో 1.7 సెంటీమీటర్లు, మహేశ్వరంలో ఒక సెంటీమీటరు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూలై 15 నాటికి హైదరాబాద్ నగరంలో సాధారణంగా 182.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 155.6 మిల్లీమీటర్లు(-15 ఎంఎం) వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 192.3 మిల్లీమీటర్లకుగాను ఇప్పటివరకు 136.6 మిల్లీమీటర్లు (-29 ఎంఎం) వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం..
హయత్‌నగర్ డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు బీటెక్ విద్యార్థులను బలిగొంది. డీసీఎం వ్యాన్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పడంతో వెనుకే బైక్‌పై వేగంగా వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు దానిని ఢీకొట్టారు. ఇద్దరు విద్యార్థులు వ్యాన్ టైర్లకింద నలిగి మృతి చెందగా.. స్వల్పగాయాలకు గురైన మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాజేంద్రనగర్ మండలం కిస్మత్‌పూర్‌కు చెందిన శివరాజు మురళీధర్ కొడుకు హేమంత్ మణిదీప్ (20), కరీంనగర్జిల్లా సిరిసిల్లకు చెందిన కాశెట్టి నాగయ్య కొడుకు పద్మేందర్ (20), నల్లగొండ జిల్లా తుంగతుర్తికి చెందిన పి.యాదగిరి కొడుకు సాయికృష్ణ దేశ్ముఖిలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ చింతల్‌కుంటలో అద్దెకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం బస్‌పాస్ దరఖాస్తు ఫారంపై సంతకం చేయించుకునేందుకు స్నేహితుడి బైక్ (ఏపీ12హెచ్ 1642)పై ముగ్గురూ చింతల్‌కుంట నుంచి బయలుదేరారు. పెద్దఅంబర్‌పేట జాతీయ రహదారిపై బలిజగూడ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ (ఏపీ28 వై 3004) బంక్‌లోకి ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీంతో వెనుక వస్తున్న విద్యార్థుల బైక్.. డీసీఎంను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం కింద పడటంతో వాహనం వెనుక కూర్చున్న మణిదీప్, పద్మేందర్లు డీసీఎంవ్యాన్ వెనుక చక్రాల కింద పడిపోయారు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో వారిపై నుంచి వ్యాన్ చక్రాలు వెళ్లాయి. దీంతో మణిదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ పద్మేందర్ను మొదట హయత్‌నగర్‌లోని సన్రైస్ ఆసుపత్రికి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి గ్లోబల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. స్వల్పంగా గాయపడ్డ సాయికృష్ణ సన్రైస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు మణిదీప్ తండ్రి ప్రైవేటు ఉద్యోగి కాగా... ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు మణిదీప్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
తాత్కాలిక సిబ్బందిపై ఆర్టీసీ కార్మికుల దాడి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో తాత్కాలిక సిబ్బందిపై సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంతో అధికారులు తాత్కాలిక సిబ్బందిని తీసుకున్నారు. తాము సమ్మెలో పాల్గొంటే, పనిచేయడానికి వస్తారా? అని ఆర్టీసి కార్మికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దాడి చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకుండా తాత్కాలిక కార్మికులను తీసుకుంటారా? అని అధికారులపై మండిపడ్డారు. దాడి విషయాన్ని బాధితులు అధికారులకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాలికపై అత్యాచారం!
హైదరాబాద్: హయత్‌నగర్‌లో ఓ యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కృష్ణ అనే యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
వేధిస్తున్న 'ఫేస్బుక్ ఫ్రెండ్' పై ఫిర్యాదు
హైదరాబాద్ : ఫేస్బుక్ ద్వారా పరిచయమై స్నేహితుడుగా మారి మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అరుణోదయ కాలనీలో నివసించే యాదగిరి విద్యుత్ శాఖలో డీఈగా పని చేస్తున్నాడు. అతని కుమార్తె (16) కొత్తపేటలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. బాలిక పదో తరగతి చదివే సమయం నుంచే ఫేస్బుక్ ద్వారా అర్జున్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం క్రితమే అమ్మాయికి ఫోన్ కొనిచ్చి తరచుగా కాల్స్ చేస్తూ మాట్లాడుతున్నాడు. దాంతో తల్లిదండ్రులు బాలికను కళాశాల మాన్పించారు. అయినా వేధింపులు ఆగకపోవటంతో యువకుడిపై చర్యలు తీసుకోవాలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.