
హయత్‌నగర్: దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దుప్పట్లో చుట్టి బయట పడేసే ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శక్రవారం రాత్రి హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. హయత్‌నగర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు.
చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి
శ్రీను మేస్త్రీ పని చేస్తుండగా, లక్ష్మి(35) కూలి పని చేసేది. ఆమె అనారోగ్యంతో ఇంట్లోనే ఉండగా శ్రీను పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తల్లికి కూతురు భవాని మంచి నీళ్ళు ఇవ్వగా కొద్దిసేపటికి లక్ష్మీ మృతి చెందింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేవని రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితుడు వినోద్ సహాయంతో బార్య మృత దేహాన్ని భజంపై వేసుకుని సమీపంలో ఉప్ప బాతుల చెరువు అలుగు వద్ద పడేసేందుకు వెళుతున్నాడు.
చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన
ఇది గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకుని నిలదీశారు. చంపి శవాన్ని పడేసేందుకు వచ్చారనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించి శ్రీను, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment