No Cash
-
అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని..
హయత్‌నగర్: దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దుప్పట్లో చుట్టి బయట పడేసే ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శక్రవారం రాత్రి హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. హయత్‌నగర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి శ్రీను మేస్త్రీ పని చేస్తుండగా, లక్ష్మి(35) కూలి పని చేసేది. ఆమె అనారోగ్యంతో ఇంట్లోనే ఉండగా శ్రీను పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తల్లికి కూతురు భవాని మంచి నీళ్ళు ఇవ్వగా కొద్దిసేపటికి లక్ష్మీ మృతి చెందింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేవని రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితుడు వినోద్ సహాయంతో బార్య మృత దేహాన్ని భజంపై వేసుకుని సమీపంలో ఉప్ప బాతుల చెరువు అలుగు వద్ద పడేసేందుకు వెళుతున్నాడు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన ఇది గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకుని నిలదీశారు. చంపి శవాన్ని పడేసేందుకు వచ్చారనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించి శ్రీను, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
ఖాళీ డబ్బాల్లా ఏటీఎంలు!
‘రాజన్న పది రోజుల కిందనే తుకం పోసిన. నాటుకు వస్తది. కూలీలకు ఇచ్చేందుకు పైసలు లేవు.. బ్యాంకుకు పోతే పైసల్లేవంటున్నరు. ఏటీఎంలల్ల కూడా ఏం లేవు. ఏంజేయాలే’.. అంటూ మరో రైతు భూమన్న అన్న మాటలివి. ఇలాంటి పరిస్థితి ఈ ఇద్దరిదే కాదు. ఉమ్మడి జిల్లాలలోని అన్ని ప్రాంతాల్లో నెలకొంది. బ్యాంకులు మాత్రం నగదు లేదు, రూ.రెండే వేలు ఇస్తమంటున్నరని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిని అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): నోట్ల రద్దు ప్రభావం నేటికి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. నగదు కొరతతో ఖాతాదారులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే బ్యాంకుల ముందు రైతులు, ఖాతాదారులు బారులు తీరుతున్నారు. బ్యాంకర్లు మాత్రం ప్రతి ఖాతాదారుడికి రూ.2 వేలకు మించి ఇవ్వడం లేదు. రామారెడ్డి మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలుండగా 35,909 జనాభా ఉంది. మండల కేంద్రం రామారెడ్డిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, సొసైటీ బ్యాంకులతో పాటు రెడ్డిపేటలో ఎస్బీఐ బ్యాంకులున్నాయి. రామారెడ్డిలో ఇండిక్యాష్ ఏటీఎం, రెడ్డిపేటలో ఎస్బీఐ ఏటిఎంలు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయి. అయితే నగదు కారణంగా 24 గంటలపాటు పని చేయాల్సిన ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఒక్క మండలంలోనే కాదు, ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో నెలకొంది. రైతులు, ఖాతాదారులు, సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు, ధాన్యంలవీ అదే కథ.. రామారెడ్డి మండలంలో 19 గ్రామ పంచాయతీలున్నాయి. కాగా 14 రెవెన్యూ గ్రామాలున్నాయి. యాసంగి పంట పెట్టుబడి కోసం అర్హులైన 7791 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద డబ్బులను జమ కానున్నాయి. దీనికి తోడు ధాన్యం కొనుగోలు డబ్బులు సైతం బ్యాంకు ఖాతాల్లో వస్తుండడంతో డబ్బుల రైతులు, బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. నగదు కొరత కారణంగా రూ.2 వేల నుంచి రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి రూ.2వేలు ఏం సరి పోతాయని వారు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఖాతాదారులకు సైతం నగదు కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నగదు కొరతను నివారణకు గతంలో నగదు రహితంను సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రజలకు ఇప్పటికీ నగదు తిప్పలు తప్పడం లేదు. ఏటీఎంను తెరిపించండి మోర్తాడ్: మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రాన్ని తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు. ఎస్బీఐ ఏటీఎం ఎన్నో రోజుల నుంచి మూసి ఉంటున్నా బ్యాంకు అధికారులు ఏమి పట్టించుకోక పోవడంతో స్థానిక ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంను తెరచి ఉంచితే వినియోగదారులు తమకు అవసరం ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవడంతో పాటు, మినీ స్టేట్మెంట్, బ్యాంకు బ్యాలెన్స్ ఇతర సదుపాయాలను పొందుతారని పలువురు వినియోగదారులు వెల్లడించారు. ఏటీఎంను నిరంతరం మూసి ఉంచడం కారణంగా ఎంతో మంది వినియోగదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎం కేంద్రాన్ని తెరచి ఉంచాలని పలువురు కోరుతున్నారు. -
నగదు యాతన!
ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు కాస్తా బ్యాంకు ఖాతాలో జమయింది... కానీ దానిని తీసుకునేందుకు అవకాశం లేకపోతోంది. పిల్లల పెళ్లిళ్లకోసం గతంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తం మెచ్యూర్ అయింది... కానీ దానిని చెల్లించేందుకు బ్యాంకులో నగదు కొరతగా ఉందంట. బ్యాంకులో డబ్బు నిల్వ ఉంది కదా అని ఓ చిన్నపాటి స్థలం కొనుక్కుంటే... వారికి చెల్లించేందుకు బ్యాంకు నెంచి తెచ్చుకునే వెసులుబాటు లేదు. జీతం డబ్బు ఖాతాలో ఉంది. కానీ రోజువారీ ఖర్చులకు తీసుకుందామంటే ఏ ఏటీఎం కూడా పనిచేయడం లేదు. ఇదీ జిల్లాలో సగటు జనం క్యాష్కష్టాలు. సాక్షిప్రతినిధి విజయనగరం : పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడ్డ కష్టాలు జిల్లా వాసులను వదలనంటున్నాయి. నగదు కోసం ఏటీఎంల వద్దకెళితే ‘నో క్యాష్’బోర్డులు వెక్కిరిస్తున్నాయి. కొన్ని చోట్లయితే ఏకంగా షట్టర్లు వేసేసి ఉంటున్నాయి. అరకొరగా నగదు ఉన్న ఏటీఎంలవద్ద చాంతాడంత క్యూ కనిపిస్తోంది. జిల్లాలో నగదు కష్టాలు మళ్లీ పెరిగాయనే చెప్పక తప్పదు. జిల్లాలోని ఏటిఎంలలో దాదాపు సగం ఖాళీగా ఉండగా 25 శాతం ఏటిఎంలలో సగానికి కంటే తక్కువ నగదు ఉంది. మిగతా వాటిలో 75 శాతం ఉం డటంతో జనం వాటి వద్ద క్యూ కడుతున్నారు. జిల్లాకు గతంలో ఆర్బీఐ నుంచి వచ్చే నగదు కోటా కూడా సగానికిపైగా తగ్గిపోయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిపాజిట్లు కూడా తగ్గాయి. అయితే శుక్రవారా ని కల్లా నగదు కొరత సమస్యను తీరుస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ గురువారం ప్రకటించారు. మిగిలి న బ్యాంకులు మాత్రం ఇంత వరకూ ఈ సమస్యపై స్పందించలేదు. విడుదలవుతున్న నిధులు ఏ మూలకి? జిల్లా్లలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, రూరల్ బ్యాంకుల శాఖలన్నీ కలిపి 295 వరకూ ఉన్నాయి. వీటిలో 40.91 లక్షల ఖాతాదారులున్నారు. వీరిలో 40 శాతం మంది ఏటీఎం సేవలను వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 258 ఏటీఎంలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాలు, సామాజిక పింఛన్ల సొమ్ములు వంటి ప్రధాన రంగాలను కలుపుకొని జిల్లాకి నెలకు రూ.250 కోట్ల వరకూ అవసరం ఉంది. కానీ నోట్ల రద్దు నేపధ్యలో ఏర్పడిన స్తబ్ధత కారణంగా ఏడాదిగా ప్రతినెలా సగటున రూ.120 కోట్లకు మించిరావడం లేదు. గత నెల రూ.150 కోట్లు, తాజాగా ఈ నెల రూ.81 కోట్లు మాత్ర మే ఆర్బీఐ నుంచి వ చ్చింది. ఈ నేపథ్యం లో జిల్లాలో నగదు సమస్య తీవ్రమైంది. మరో వైపు నగదు రహిత లావాదేవీలకు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు నీరుగారాయి. అవసరానికి తగ్గ పరికరాలేవీ? అవగాహన ఉన్న 50 శాతం వినియోగదారులకు కూడా అందుబాటులో క్యాష్‌లెస్ ట్రాంజేక్షన్ మెషీన్లు జిల్లాలో లేవు. జిల్లా వ్యాప్తంగా కనీసం 1,500 నగదు రహిత లావాదేవీల పరికరాల డిమాండ్ ఉండగా కేవలం 831 మిషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో వైపు జిపాజిట్లు కూడా బాగా తగ్గాయి. గతేడాది డిసెంబర్‌నాటికి ముగిసిన ఆరు మాసాల్లో తొలి మూడు మాసాలకు రూ.7,956 కోట్ల మేరకు డిపాజిట్లు రాగా చివరి మూడుమాసాలలో రూ.300 కోట్ల వరకు తగ్గి కేవలం రూ.7,656 కోట్లు మాత్రమే డిపాజిట్లు లభించాయి. అన్ని విభాగాలవారీకి అవస్థలే పొలం పనులు మొదలుపెట్టడానికి పెట్టుబడికి డబ్బులు కావాలి. కానీ నగదు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాల్లో డబ్బులున్నప్పటికీ తీసుకోలేని పరిస్థితి రావడంతో శుభకార్యాలు చేసుకునేవారి బాధలు అన్నీ ఇన్నీ కావు. మే నెల మొదటి వారం తర్వాత ఆగస్టు వరకూ సుముహూర్తాలు లేవని పండితులు చెబుతుండటంతో ఈ నెలలోనే పెళ్లి వంటి శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకున్నవారు వాటి నిర్వహణకు డబ్బులు లేక ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంక్ అధికారులను బ్రతిమలాడినా రూ.20 వేలకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. కొంతమంది తమకు దగ్గర్లో ఉన్న ఏటీఎంలో నగదు లేకపోతే పక్క ఊళ్లల్లో, పట్టణాల్లో ఏటీఎంలకు పరుగులు తీస్తున్నారు. తీరా వెళ్లాక అక్కడ చాంతాడంత లైన్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. నోట్లు రద్దు చేసినప్పుడు ఎటువంటి కష్టాలు పడ్డామో ఇప్పుడూ అవే కష్టాలు పడాల్సి వస్తోందని, డబ్బులు బ్యాంక్‌లో దాచుకోవాలంటేనే భయం వేస్తోందని వారు వాపోతున్నారు. బ్యాంక్‌ల్లో నిల్వ చేయడానికి విముఖత బ్యాంక్‌ల్లో నిల్వ ఉంచడానికి ఖాతాదారులు ఇష్టపడకపోవడం వల్లే నగదు రొటేషన్ అవ్వడం లేదు. బ్యాంక్‌ల్లో నగదు దాచేందుకు ఖాతా దారులకు ఉత్సాహం చూపే దిశగా చర్యలు మెరుగుపరచాలి. వ్యాపార వర్గాలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉండొచ్చు. –పి.ఎస్.సి.నాగేశ్వరావు, అధ్యక్షుడు, విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్ -
ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు
-
2వేల నోట్లను నిలిపేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరోసారి నగదు కష్టాలు తీవ్రతరమయ్యాయి. ఏటీఎంల్లో, బ్యాంకుల్లో నగదు లభించకపోవడంతో మరోసారి పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. మళ్లీ నోట్ల కష్టాలు ఎందుకు పునరావృతం అయ్యాయి? రూ. 2వేల నోట్లు బయటకు రాకుండా నిజంగానే నిలిపేశారా? ఇదే విషయమై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దినేశ్ త్రివేది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో నగదు కొరతకు అసలు కారణాలు ఏమిటో వెల్లడించాలని కోరారు. రూ. 2వేల నోట్ల చెలామణిని నిలిపేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఆర్థిక రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్న దినేశ్ త్రివేది బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘రూ. 2వేల నోట్లను నిలిపివేయడంతోనే దేశంలో మళ్లీ నగదు కొరత ఏర్పడినట్టు కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. నగదు కొరత విషయంలో నిజానిజాలపై కేంద్రం వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టజారని, ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం సరికాదని అన్నారు. గత కొన్ని నెలలుగా తనకు కూడా బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేయడంతో వ్యవస్థలోని వాటి విలువను భర్తీ చేయడానికి కేంద్రం రూ. 2వేలనోట్లు అమల్లోకి తీసుకొచ్చిందని, ఈ నేపథ్యంలో రూ. 2వేల నోట్ల కొనసాగింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. -
24 గంటల్లో 80శాతం ఏటీఎంలలోకి క్యాష్!
సాక్షి, న్యూఢిల్లీ : ఏడాదిన్నర కిందట చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రభావం మరోసారి దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల పెద్దలతో సమావేశమైంది. దేశంలో తీవ్ర నగదు కొరత నెలకొని ఉండటం, నగదు లేక ఏటీఎంలు వెలవెలబోతుండటం, బ్యాంకుల్లో, ఏటీఎంల్లో డబ్బులు దొరకక ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్రం భేటీ అయింది. దేశంలోని ఆర్థిక కార్యకలాపాలు, లావాదేవీలు, నగదు ప్రవాహం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీచేసింది. 24 గంటల్లో దేశంలోని 80శాతం ఏటీఎంలు పనిచేస్తాయని, నగదు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఈ సందర్భంగా భరోసా ఇచ్చింది. ఆర్బీఐ కూడా నగదు కష్టాలపై స్పందించింది. ఏటీఎంల వద్ద పరిస్థితి మెరుగుపడుతోందని, నగదు కొరత కష్టాలు క్రమంగా తొలగిపోతున్నాయని ఆర్బీఐ తెలిపింది. -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ఏడాదిన్నర క్రితం పెద్ద నోట్ల రద్దుతో పడరాని పాట్లు పడ్డాం. మళ్లీ అదే పరిస్థితి దాపురించింది. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఏ ప్రాంతానికి వెళ్లినా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నోక్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నగదుకు కొరత ఉందని ముందుగా దేశ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ అంగీకరించారు. ఈ సమస్య తాత్కాలికమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని ఆర్థికశాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా అన్నారు. ఐదు నుంచి ఏడు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని బ్యాంకింగ్ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ సమస్యను సత్వరం పరిష్కరించేందుకు కేంద్రం రాష్ట్రాల వారీగా కమిటీలను వేయగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంతర్రాష్ట కమిటీని వేసింది. ఐదు వందల రూపాయల నోట్ల ముద్రణను ఐదింతలు పెంచాక కూడా నోట్ల కొరత ఎందుకుంటుందని ఆర్బీఐ ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది. నోట్ల కొరత ప్రమాదం ఉందంటూ ఫిబ్రవరి నెలలో వచ్చిన వార్తలను పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందని అర్థం అవుతుంది. తమకు నోట్ల కొరత ఎక్కువగా ఉందంటూ ఫిబ్రవరి నెలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నగదు ప్రవాహాన్ని అడ్డుకుంటోందంటూ విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. డిజిటల్ లావాదేవీలు పెంచడానికే నగదును అడ్డుకుంటున్నారన్నది వారి వాదన. కుట్రపూరితంగా చెలామణి నుంచి రెండు వేల రూపాయల నోట్లు మాయం అవుతున్నాయని మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అయినా ప్రభుత్వం నుంచి, ఆర్బీఐ నుంచి నివారణ చర్యలు లుప్తం. ప్రధాని నరేంద్ర మోదీ ‘అచ్చేదిన్’ వస్తాయంటూ తన మానాన తాను చెప్పుకుంటూ పోతుంటే దేశంలో నిత్యం నీరవ్ మోదీ స్కామ్‌లు, కథువా, ఉన్నావో కేసులు వినిపిస్తున్నాయి. -
క్యాష్‌కి ఎందుకీ కటకట వచ్చింది?
ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ కాదు.. ఎనీ టైమ్ మూత.. అవును.. మళ్లీ కరెన్సీ సంక్షోభం కల్లోలాన్ని రేపుతోంది. ఒక్కసారిగా ఏడాదిన్నర క్రితం పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు కనబడితే ఇప్పుడు కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,గుజరాత్,ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అవే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కొత్త నోట్లు పంపిణీలోకి వచ్చాయి. ఆర్బీఐ డేటా ప్రకారంపెద్ద నోట్ల రద్దు చేసిన రెండు నెలలకి , అంటే 2017 జనవరి నాటికి కేవలం 8.9 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్ 6 నాటికి 18.4 లక్షల కోట్లు విలువ చేసే నోట్లు చెలామణిలోకి వచ్చాయి. మరి పుష్కలంగా కొత్త నోట్లను ముద్రించినా క్యాష్‌కి ఎందుకీ కటకట వచ్చింది? ఎఫ్ఆర్డీఐ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఫైనాన్సియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ –2017 (ఎఫ్ఆర్డీఐ) బిల్లు చట్టరూపం దాలిస్తే బ్యాంకుల్లో తమ సొమ్ముకు భద్రత ఉండదని ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది .బ్యాంకుల్లో జరుగుతున్న భారీ స్కామ్‌లతో ఆ వ్యవస్థపైనే నమ్మకం సడలిపోతోంది. దీంతో బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు తీసేవారే తప్ప వేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో డిపాజిట్లు 15.3 శాతంగా ఉంటే ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. 2018, మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం 6.7 శాతం మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నగదు డిపాజిట్ల కంటే నగదుని విత్ డ్రాయల్స్ ఎక్కువగా ఉంటోందని ఆర్బీఐ అధ్యయనంలో తేలింది. కర్ణాటక ఎన్నికలు మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆ రాష్ట్రంలో నగదు అవసరం అనూహ్యంగా పెరిగిపోయింది. పార్టీలకతీతంగా నాయకులందరూ ఎన్నికల ప్రచారం కోసం డబ్బుని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. తమకున్న సంబంధ బాంధవ్యాలను వినియోగించి ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భారీగా నోట్లకట్టలను తీసుకువస్తున్నారు. రూ. 2 వేల నోట్ల అక్రమ నిల్వలు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండడంతో చాలా చోట్ల రాజకీయ నేతలు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్న వివిధ పార్టీలు ఇప్పటికే భారీ సంఖ్యలో 2 వేల నోట్లను అక్రమంగా నిల్వ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 2 వేల నోట్లు చెలామణిలోకి వచ్చిన తర్వాత వాటిని తీసుకువెళుతున్నవారే తప్ప, తిరిగి డిపాజిట్ చేస్తున్న వారు మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఆర్బీఐ నుంచి కొత్తగా 2 వేల నోట్లు సరఫరా కూడా నిలిచిపోయింది. ఇది కూడా ప్రస్తుతం క్యాష్ కొరతకి ఒక కారణమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏటీఎం మిషన్లలో మార్పులు కొన్నాళ్ల క్రితం ఆర్బీఐ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన రూ. 200 నోట్లను ఏటీఎం మిషన్లలో ఉంచడానికి వీలుగా చాలా చోట్ల సాంకేతికపరంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు.. దేశవ్యాప్తంగా 2.2 లక్షల ఏటీఎంలు ఉంటే వాటిల్లో సగానికి పైగా ఏటీఎంలలో రూ. 200 నోట్లు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఏటీఎం మిషన్ల నుంచి 200 నోట్లు కూడా వచ్చేలా చేయడానికి సాఫ్ట్‌వేర్‌ని అప్డేట్ చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. పంటలు, పండుగ సీజన్ కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులు కూడా ఏటీఎంలు మూతపడడానికి కారణంగా కనిపిస్తోంది. రబీ పంటలు కోతకు రావడంతో రైతులకు భారీగా నగదు చెల్లించాల్సి వస్తోంది. ఇక అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బైశాఖి, బిహు వంటి పంటల పండుగల జరుపుకుంటున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలో నగదుని డ్రా చేయడంతో క్యాష్‌కి కటకట ఏర్పడింది. అయిదు రెట్లు ఎక్కువగా రూ.500 నోట్ల ముద్రణ దేశంలో కరెన్సీ కొరత తాత్కాలికమేనని, తర్వలోనే దీనిని పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. కావల్సినంత నగదు బ్యాంకుల్లో ఉందని అకస్మాత్తుగా వినియోగం పెరగడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు నోట్ల ముద్రణను అయిదు రెట్లు పెంచుతున్నామంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. రూ. 500 నోట్లను రోజుకి 500 కోట్లు ముద్రిస్తున్నామని ఆయన చెప్పారు. మరికొద్దిరోజుల్లో రోజుకి 2,500 కోట్ల విలువ చేసే అయిదువందల నోట్లను చెలామణిలోకి తెస్తామని వెల్లడించారు. మరో నెలరోజుల్లో 75 వేల కోట్ల విలువ చేసే 500 నోట్లు అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా కరెన్సీ కష్టాలను తొలగిస్తామని వివరించారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
పండుగ పూట పైసల్లేవ్
-
పండుగ పూట పైసల్లేవ్..
-
మళ్లీ నో క్యాష్..!
సాక్షి నెట్వర్క్: సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనాలన్నా, ఇతర సరుకులు కొనాలన్నా చేతిలో నగదు లేని పరిస్థితి నెలకొంది. ఈ నెల మొదట్లో కొంతవరకు ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉన్నా.. నాలుగైదు రోజులుగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏ ఏటీఎం వద్దకు వెళ్లినా ‘నో క్యాష్’బోర్డులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల డబ్బు లేదనేందుకు బదులుగా ఏకంగా ‘ఏటీఎం ఔటాఫ్ సర్వీస్’అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల ఏటీఎం షెట్టర్లను కూడా మూసేస్తున్నారు. బ్యాంకులకు వెళితే బోలెడు క్యూలు ఏటీఎంలలో నగదు లభించకపోవడంతో బ్యాంకు లకు వెళుతున్న వారికీ ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకుల్లో చాంతాడంత క్యూలు ఉంటున్నాయి. గంటలు గంటలు నిలబడితేగానీ డబ్బులు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాల వారు, పింఛన్ల కోసం వచ్చే వారితోపాటు సాధారణ ఖాతాదారులతో బ్యాంకులు కిటకిటలాడుతుంటాయి. ఇప్పుడు నగదు కోసం వెళ్లేవారితో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల బ్యాంకుల్లో తగినంత నగదు లేదంటూ రూ. పది వేలు వరకు మాత్రమే చేతిలో పెడుతున్నారు. కార్డులు వాడుదామంటే బాదుడు! నగదు చేతిలో లేక ఏటీఎం/డెబిట్ కార్డులను వినియోగించుకుందామంటే బాదుడు తప్పడం లేదు. అసలు చిన్న పట్టణాలు, గ్రామాల్లో అసలు కార్డు స్వైపింగ్ యంత్రాలే అందుబాటులో లేవు. చాలా చోట్ల క్రెడిట్/డెబిట్ కార్డులతో డబ్బులు చెల్లిస్తామంటే.. 2 శాతం వరకు అదనంగా వసూలు చేస్తు న్నారు. దీంతో అటు నగదూ లేక ఇటు కార్డులూ వాడితే బాదుడు భరించలేక జనం లబోదిబోమంటున్నారు. ఆర్బీఐ సరఫరా నిలిపేయడంతోనే..! సరిపడా నగదు అందుబాటులో లేకనే బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు ఉండడం లేదని బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. రిజర్వు బ్యాంకు నగదు సరఫరాను నిలిపివేయడంతోనే ఈ సమస్య ఏర్పడిం దంటున్నారు. బ్యాంకుల్లోకి కొత్తగా డిపాజిట్లు రావడం తగ్గిపోయిందని, అదే సమయంలో నగదు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయిందని అంటున్నారు. ‘‘బ్యాంకుల నిబంధనలు మారుతాయి, నష్టాలు వస్తే డబ్బులు పోతాయి.. అనే ప్రచారం ఉండటంతో ఇంతకు ముందటిలా బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసేందుకు ఖాతాదారులు ముందుకు రావడం లేదు. దీంతో నగదు కొరత ఏర్పడుతోంది.’’ అని ఓ బ్యాంకు అధికారి పేర్కొనడం గమనార్హం. బ్యాంకులకు వెళ్లినా లాభమేదీ? వరంగల్ పాత జిల్లా పరిధిలో దాదాపు 215 ఏటీఎంలు ఉండగా అందులో 90శాతం ఏటీఎంలు నగదు లేక వెలవెలబోతున్నాయి. జనం నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 254 ఏటీఎంలు, కామారెడ్డి జిల్లాలో 120 ఏటీఎంలు ఉండగా.. చాలా వాటిలో ‘నో క్యాష్’బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో నగదు కొరత తీవ్రంగా ఉంది. నాలుగైదు రోజులుగా చాలా ఏటీఎంలు పూర్తిగా మూతపడ్డాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పది రోజులుగా నగదు కొరత ఏర్పడింది. వేములవాడలో ఏటీఎంలు పనిచేయకపోవడంతో రాజన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం దాటితే ‘క్యాష్’లేనట్లే! ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, యాదాద్రి భువనగరి, సూర్యాపేట జిల్లాల్లో చాలా వరకు ఏటీఎంలు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్నిం టిలో నగదు నింపుతున్నా కొద్దిగంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రమైతే ఏ ఏటీఎం లోనూ డబ్బులుండటం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో ఏటీఎంలున్నా.. వాటిలో చాలావరకు నెలలో మొదటి వారంలోనే పనిచేస్తాయి. ఎన్నాళ్లీ అవస్థలు? నోట్ల కొరతతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏటీఎంలలో డబ్బుల్లేవు. బ్యాంకుల్లో పెద్ద పెద్ద లైన్లు. ఎన్నాళ్లీ అవస్థలు భరించాలి.. – రాజు యాదవ్, కూకట్పల్లి డివిజన్, హైదరాబాద్ బ్యాంకుల్లో లైన్లు.. ఆన్లైన్లో మోసాలు నోట్ల రద్దు నాటి నుంచి డబ్బుల కోసం తిప్పలు తప్పడం లేదు. ఏటీఎంలలో డబ్బుల్లేవు. బ్యాంకులకు వెళితే గంటలు గంటలు ఉండాల్సి వస్తోంది. ఆన్లైన్ వాడుదామంటే రోజుకో కొత్త మోసం పేరిట వార్తలు వస్తూ భయపెడుతున్నాయి.. – సత్యనారాయణ, వివేకానందనగర్ కాలనీ, హైదరాబాద్ హైదరాబాద్‌లో కటకట హైదరాబాద్‌లో వేలాది ఏటీఎంలున్నా నగదు కోసం కటకట తప్పడం లేదు. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, కూకట్పల్లి.. ఇలా ఏ ప్రాంతమైనా ఇదే సీన్. ఏటీఎంలు నగదు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ‘ఔటాఫ్ సర్వీస్’, ‘నో క్యాష్’బోర్డులు వెక్కిరిస్తున్నాయి. కేవలం బ్యాంకులకు అనుసంధానంగా ఉన్న చోట్ల మాత్రమే ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంది. దాంతో వాటి ముందు జనం బారులు తీరుతున్నారు. మొత్తంగా మూడు వేల ఏటీఎంలు ఉండగా.. సగానికిపైగా ఖాళీయే. మిగతా వాటిలోనూ రోజూ రూ. లక్ష, రెండు లక్షలు మాత్రమే నింపుతున్నారు. ఈ నగదు రెండు మూడు గంటల్లోనే అయిపోతోంది. చాలా మంది నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. నగదు చేతిలో లేకపోవడంతో బస్సు, ఆటో చార్జీలు, చిల్లర సరుకుల కొనుగోళ్లకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి తదితర ప్రధాన బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులు నగదు కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఉన్న ఏటీఎంలు పూర్తిగా ఖాళీగా ఉంటున్నాయి. -
నో క్యాష్!
కొత్త సంవత్సరంలో మళ్లీ పాత కథ మొదలైంది. కరెన్సీకోసం కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంలవద్ద బారులు తీరిన జనాలు కనిపిస్తున్నారు. బ్యాంకుకెళ్తే... వారు నామమాత్రంగా మొత్తాలిచ్చి సరిపెడుతున్నారు. అక్కడా రద్దీ తప్పట్లేదు. సంక్రాంతి సమీపిస్తోంది. అన్నిరకాల అవసరాలూ ఇప్పుడే ఉంటాయి. బ్యాంకుల్లో మొత్తాలున్నాయిగానీ... అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందక రైతులు... ఉద్యోగులు... పెన్షనర్లు... చిరు వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. విజయనగరం అర్బన్/పార్వతీపురం/రామభద్రపురం: జిల్లాలో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కరెన్సీ కష్టాలే కనిపిస్తున్నాయి. ప్రజానీకం డబ్బుల కోసం పూర్తిగా ఏటీఎంలపైనే అధారపడ్డారు. నగదు ఉన్న ఏటీఎంల కోసం ప్రజలు గాలించడం కనిపించింది. మధ్యాహ్నం 2.00 గంటల వరకు విజయనగరం పట్టణంలోని అన్ని ఏటీఎంలలోనూ నగదు పెట్టలేదు. ఆ తరువాత బ్యాం క్ శాఖలకు ఆనుకొని ఉన్న ఏటీఎంలో నగదు పెట్టడం కనిపించింది. సొమ్ముండీ ఖాతాదారులకు కరెన్సీ కష్టాలు తీరడంలేదు. నగదు తిప్పలు పది రోజులుగా మరింత పెరిగాయి. నగదు విత్‌డ్రా చేసుకునేందుకు నానా యాతన అనుభవిస్తున్నారు. చాలా చోట్ల బాంకుల్లో నగదు నిల్వలు లేవు. కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న మొత్తాలను బట్టి ఒక్కో ఖాతాదారుకి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నారు. 289 ఏటీఎంలో పనిచేసినవి 80 జిల్లా వ్యాప్తంగా 289 జాతీయ, గ్రామీణ బ్యాంకులున్నా యి. వీటికి నుబంధంగా 267 ఏటీఎంలున్నాయి. గ్రామాల్లో 74, పట్టణాల్లో 193 ఏటీఎంలు న్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.12 కోట్ల వరకు నగదు లావాదేవీలు అవుతాయి, సంబంధిత బ్యాంకులకు ఆర్బీఐ నుంచి రోజుకు కనీసం రూ.10 కోట్ల వంతున వారంలో కనీసం ఒక్కసారైనా నగదు పంపిణీ చేసే బ్యాంక్ చెస్ట్ కేంద్రాలకు వస్తాయి. ఒకటో తేదీకే వారానికి సరిపడే నగదును ఆర్బీఐ పంపిణీ చేయాలి. కానీ తాజాగా జనవరి నెలకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఒక్కపైసాకూడా రాలేరు. దీం తో ఏటీఎంలకు నగదు కొరత ఏర్పడింది. బ్యాంకులో జరిగి న లావాదేవీల వల్ల వచ్చే మొ త్తాన్ని మాత్రమే ఏటీఎంలకు చేరుస్తున్నారు. సహజంగా దా చుకున్న సొమ్ములు సంక్రాం తి పండగ ఖర్చుకోసం జనవరినెలలో తీసుకుంటారు. వా రం రోజులుగా నగదు చేతికి అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నకు రబీ కష్టాలు సాధారణంగా ఖరీఫ్‌లో పండిన పంట ద్వారా వచ్చిన ఆదాయాన్ని రబీకోసం పెట్టుబడి పెడతారు. ఆ విధంగా ధాన్యం, పత్తి వంటి పంటలు అమ్మగా వచ్చిన డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లగా డబ్బులు లేవని, రేపు మాపు అంటూ బ్యాంకు అధికారులు తిప్పుతున్నారు. దీనివల్ల రబీ సాగు పెట్టుబడులకు అప్పడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నాట్లు వేయడానికి, ఎరువులు కొనుగోలు, కూలీలకు, దుక్కులకు డబ్బులు చెల్లించడానికే గాదు... ఖరీఫ్ సాగుకు చేసిన అప్పులూ తీర్చాల్సి ఉంది. నగదు లేదన్న సాకుతో బ్యాంకర్లు డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనజీవుల వెతలు జిల్లాలొ దాదాపుగా 30వేలకు పైబడి ప్రభుత్వ ఉద్యోగులు, 30 వేలమంది విశ్రాంత ఉద్యోగులు, 25 వేలమంది ఔట్సోర్సింగ్, 80 వేల వరకు ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒకటో తారీఖు ఎప్పుడొస్తుందా.. జీతాలు ఎప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తుంటారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడం, బ్యాంకర్లు నగదు కొరత అని చెప్పడం, ఏటీఎంలకు వెళితే నోక్యాష్ బోర్డులు కనిపించడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. జీతం కోసం విధులు మానుకొని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో రూ.10 వేలు మాత్రమే ఇస్తుండటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురంలో కొన్నింటే నగదు పార్వతీపురం పట్టణంలో 20 వరకు ఏటీఎం సెంటర్లుండగా కొన్ని సెంటర్లలోనే నగదు లభ్యమౌతోంది. చాలా ఏటీఎంలు ఏడాదిగా పనిచేయకపోగా, పనిచేస్తున్నవాటిలో నగదు నిల్వలు లేవు. బ్యాంకునకు వెళ్లి తీసుకుందామంటే అక్కడ చాంతాడంత క్యూ కనిపిస్తోంది. పండగ అవసరాలకోసం వచ్చేవారికి రూ.10 వేలకు మించి ఇవ్వడంలేదు. మరోవైపు నోట్ల రద్దు పుకారు ఇటీవల కాలంలో రెండు వేల రూపాయల నోట్లు రద్దవుతాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో రెండు వేల రూపాయలను ఎవరూ తీసుకుకోవడానికి, ఇంట్లో నిల్వ ఉంచుకోవడానికి ఇష్టపడడంలేదు. అంతే గాకుండా వారి వద్ద ఉన్న రూ.500 నోట్లను అట్టిపెట్టుకుంటున్నారు. దీనివల్లే నగదు కొరత ఏర్పడుతోంది. రామభద్రపురానికి చెందిన ఈయన పేరు కనిమెరక వెంకటి. ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేసిన ఈయన పదిహేను రోజుల క్రితం దానిని విక్రయించారు. మొత్తం 40 క్వింటాళ్ల పత్తికి రూ. లక్ష 60 వేల పైచిలుకు నగదు స్టేట్‌బ్యాంకు ఖాతాలో జమయింది. ఇప్పుడు ఆయనకు డబ్బు అవసరం కాగా బ్యాంకులో నగదు లేకపోవడంతో బ్యాంకర్లు ఇవ్వలేకపోతున్నారు. ఏటీఎంలు... బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రెండు మూడు రోజులకోసారి రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాడంగి మండలం బొత్సవానివలసకు చెందిన ఈయన పేరు కె.జగ్గునాయుడు. ఈయన పాల సొసైటీకి కార్యదర్శి కావడంతో పాలు సరఫరా చేసిన పాడి రైతులకు పదిహేను రోజులకోసారి పేమెంట్లు ఇవ్వాలి. విశాఖ డెయిరీ రూ.40 కోట్ల వరకు లావాదేవీలు ఉం టాయనీ అయినా రూ. లక్ష,59 వేలు నగదు ఇవ్వడానికి బ్యాంకులు సహకరించడం లేదనివాపోతున్నారు. పాడి రైతులు పశువుల పోషణకు, కుటుంబపోషణకు ఇబ్బందులు పడుతున్నారనీ, తననూ అనరాని మాటలు అం టున్నారనీ చెప్పారు. బ్యాంకర్లు మాత్రం నగదు నిల్వ లేదు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చీకటి జ్ఞాపకం
కేంద్ర ప్రభుత్వం ఉన్నఫలంగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నవంబర్ 8వ తేదీని జనం మర్చిపోలేకపోతున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి బుధవారం నాటికి సంవత్సరం పూర్తయినా నోట్ల కష్టాల నుంచి జనం ఇంకా తేరుకోలేకపోతున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన నుంచీ డబ్బుల కోసం జనం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. నల్లధనాన్ని వెలికితీసి అవినీతి పరుల ఆటకట్టిస్తామని, ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి దేశాన్ని సుసంపన్నం చేస్తామని పాలకులు గొప్పలు చెప్పడంతో నోట్ల రద్దును మొదట కొన్ని వర్గాలు స్వాగతించాయి. కానీ... నాలుగు రోజుల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. పెద్దనోట్లు రద్దు..చిన్ననోట్ల కొరతతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కరెన్సీ కోసం కటకట పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు అందుకు అనుగుణంగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రెండు రోజులు గడవక ముందే ప్రజలను కరెన్సీ కష్టాలు చుట్టుముట్టాయి. ఏటీఎంలన్నీ మూతపడగా...బ్యాంకులు జనజాతరను తలపించాయి. పెద్ద నోట్ల మార్పిడి, డిపాజిట్లపై పూటకో నిబంధన, రోజుకో షరతు విధించడం, బ్యాంకుల్లో సరైన సదుపాయాలు, తగినంత నగదు నిల్వలు లేకపోవడంతో అటు బ్యాంకర్లు ఇటు అన్ని వర్గాల ప్రజలు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. మొదట్లో కేవలం రూ.2 వేల రూపాయల కొత్త నోట్లు మాత్రమే విడుదల చేయడంతో దాన్ని చిల్లర చేసుకునేందుకు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రూ.100 నోటు ఒకటి దొరికిందంటే పండుగ చేసుకున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాతి పడుకునేదాకా నిద్రాహారాలు మాని ఇంట్లో ఎందరంటే అందరూ బ్యాంకుల వద్ద పడిగాపలు కాశారు. రాజకీయ నాయకులు, కొందరు సంపన్న వర్గాలు, బ్యాంకు అధికారులు తెలిసిన కొందరు ఎలాగోలా డబ్బుల మార్పిడి, డిపాజిట్లు సులభంగా చేసుకున్నారు. 80 శాతం మంది సామాన్య, మ«ధ్య తరగతి, పేద వర్గాలు నోట్ల కష్టాలతో నానా అవస్థలు పడ్డారు. అందరికీ ఇబ్బందే నోట్ల రద్దుతో దాదాపుగా అందరూ ఇబ్బంది పడ్డారు. పెళ్లిళ్లు, చదువులు, ఆస్పత్రుల్లో చేరిన వారు సకాలంలో డబ్బులు కట్టలేక సతమతమయ్యారు. సామాజిక పింఛన్ అందక వృద్ధులు, వికలాంగులు, నెలవారీ పెన్షన్ అందక విశ్రాంత ఉద్యోగులు, వేతనం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ వర్గాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు, పొట్టకూటి కోసం పేదలు, తోపుడుబండ్లు, చిరువ్యాపారులు, కార్మికులు, కూలీలు... ఇలా ఒకవర్గం కాదు దాదాపు అన్ని వర్గాల ప్రజలు భయం గుప్పిట్లో బతికారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా 34 ప్రిన్సిపల్ బ్యాంకులు వాటి పరిధిలో 457 శాఖలు పనిచేస్తున్నాయి. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో నగదు సరఫరా అంతంత మాత్రంగా ఉండటంతో పాక్షికంగా సేవలందించాయి. రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా డబ్బులు అందని పరిస్థితి. బ్యాంకు దగ్గర బారులు తీరినా మధ్యలో ‘నోక్యాష్–క్యాష్‌నిల్’ బోర్డులు దర్శనమిచ్చేవి. నోట్ల రద్దుకు ముందు ఒక్కో బ్యాంకు చెస్ట్‌లో రూ.50 నుంచి రూ.70 కోట్లు నిల్వ ఉండగా... నోట్ల రద్దుతో డబ్బంతా ఖాళీ అయ్యింది. ఇపుడు కూడా ఒక్కో చెస్ట్‌లో రూ.5 కోట్లకు మించి నిల్వ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సగానికిపైగా మూత జిల్లా వ్యాప్తంగా 556 ఏటీఎం సెంటర్లు పనిచేస్తున్నా... గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 30 నుంచి 40 ఏటీఎంలకు మంచి పనిచేయలేదు. అవి కూడా పాక్షికంగా సేవలందించడంతో అన్ని వర్గాలు ఏటీఎంల వద్ద పడిగాపులు కాశారు. ఈ నేపథ్యంలో సగానికి పైగా ఏటీఎంలు నిరవధికంగా మూతబడ్డాయి. నగదు రహితం...వేదనా భరితం నగదు రహిత లావాదేవీలు అంటూ స్వైప్‌మిషన్లు, సేల్స్ మిషన్లు, మినీఏటీఎంలు, బడ్డీ, వాలెట్ యాప్‌లు అంటూ జనాన్ని భయంగుప్పిట్లోకి నెట్టేశారు. సంవత్సరం పూర్తయినా నగదు రహిత లావాదేవీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. 3 వేల వరకు స్వైప్‌మిషన్లు పంపిణీ చేసినా అందులో సగం కూడా పనిచేయలేదు. శింగనమల మండలం పెరవలి గ్రామాన్ని దత్తత తీసుకున్న సిండికేట్ బ్యాంకు వందశాతం నగదు రహితం చేస్తామని చెప్పినా 10 శాతం కూడా అమలు చేయలేక చతికిలపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఆశయం కూడా నెరవేరకపోవడంతో నోట్ల రద్దును మెజార్టీ ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నగదు రాక నరక యాతన ఒక రోజు నగదు ఉంటుంది, మరొక రోజు ఉండేది కాదు. ఉద్యోగులు బ్యాంకు వెళ్లి డబ్బు తెచ్చుకోలేని పరిస్థితి. నోట్ల రద్దు తో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సంవత్సరమయినా అధికారులు ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. అందువల్లే ఇప్పుడు కూడా ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు. – రామాంజనేయులు, టీచర్, ఆనందరావుపేట కూలీలకు డబ్బులివ్వలేకపోయాం పెద్దనోట్లు రద్దు తర్వాత నగదు కోసం రైతులందరం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అప్పటి నుంచి ఇ ప్పటి వరకు ఏటీఎంలు సక్రమంగా పని చేయకపోవడంతో పెట్టుబడుల కోసం, కూలీల డబ్బులు చెల్లింపుల కోసం ఇబ్బందులు పడుతున్నాం. పెనకచెర్లడ్యాంలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో ఎప్పుడూ డబ్బులుండవు. బ్యాంకు వద్దకు వెళ్లి క్యూలో నిలబడి నగదు తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఏటీఎంలు ఉన్న ప్రయోజనం లేదు. – నాగలింగారెడ్డి, రైతు, పెనకచెర్ల -
మళ్లీ నగదు కష్టాలు
- ఏటీఎంల వద్ద నోక్యాష్ బోర్డులు - బ్యాంకులలో తగ్గిన నిల్వ - ఆర్బీఐ చిల్లిగవ్వ విదల్చని వైనం - 712 ఏటీఎంలకు పనిచేస్తున్నవి 150 - బ్యాంకు డిపాజిట్లకు ప్రజలు అనాసక్తి - స్వల్పంగానే నగదురహిత లావాదేవీలు మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. ఏటీఎంల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. నెల రోజులుగా ఆర్బీఐ చిల్లిగవ్వ కూడా విదిల్చకపోవడంతో బ్యాంకుల్లో నగదు కొరత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 596 బ్యాంకు శాఖల్లో రూ.488.99 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. ఆర్బీఐ నుంచి నగదు రాకుంటే నగదు కష్టాలు పెరిగే ప్రమాదం ఉంది. 712 ఏటీఎంలలో 150 ఏటీఎంలకు మించి పనిచేయడం లేదు. అవి కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. చిన్న బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో ఏటీఎంలను తాత్కాలికంగా మూసివేశారు. ఖాతాదారులు నగదు డిపాజిట్ చేసేందుకు అనాసక్తి చూపుతున్నారు. దీంతో నగదు కొరత ఏర్పడుతోంది. నగదు రహిత లావాదేవీలు నామమాత్రంగా కొనసాగుతుండడంతో నగదు కష్టాలు మొదటికొచ్చాయి. తిరుపతి (అలిపిరి): జిల్లాలో నగదు కట కట ప్రారంభమయ్యింది. గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత రెండు నెలల పాటు జిల్లాలో నగదు కష్టాలతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఈఏడాది ఆరంభం తర్వాత నుంచి నగదు కష్టాల నుంచి పోయాయి. ఆర్బీఐ బ్యాంకులకు దశలవారీగా నగదు పంపిణీ చేస్తూ వచ్చింది. నగదు రహితం పేరుతో జూన్‌లో ఆర్బీఐ పైసా కూడా విదల్చ లేదు. ఫలితంగా బ్యాంకులో నగదు నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం 40 జాతీయ బ్యాంకుల పరిధిలో 596 బ్యాంకు శాఖలున్నాయి. వీటిలో రూ.488.99 కోట్లు మాత్రమే నిల్వ ఉంది. జూలై మొదటి వారంలో బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలానే కొనసాగితే రెండు వారాల్లో నగదు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదముందని తెలుస్తోంది. ఏటీఎంలలో నో మనీ.. జిల్లాలో 712 ఏటీఎం కేంద్రాలుంటే 150కు మించి పనిచేయడం లేదు. వాటిలో కూడా గంటల వ్యవధిలో నగదు ఖాళీ అవుతోంది. దీంతో ఏటీఎం కేంద్రాలకు వెళ్లే ఖాతాదారులకు అవస్థలు తప్పడం లేదు. చిన్న బ్యాంకు శాఖలు ఏటీఎం కేంద్రాలను నిర్వహించలేక తాత్కాలికంగా మూసివేశాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు, పుంగనూరు వంటి ప్రాంతా ల్లో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్, యూనియన్ బ్యాంక్ శాఖలకు చెందిన ఏటీఎంలలో నగదు లేక బోసిపోయాయి. సోమవారం మధ్యాహ్నం ఎస్బీఐ శాఖలకు చెందిన ఏటీఎంలో నగదు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొద్దిసేపట్లోనే నగదు ఖాళీ అయిపోయింది. నగదు డిపాజిట్లకు అనాసక్తి ఖాతాదారులు బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకుంటున్నారే గాని డిపాజిట్ చేయడం లేదు. దీంతో బ్యాంకులో రొటేషన్ ఆగిపోయింది. మూడుసార్లకు మించి నగదును డిపాజిట్, విత్‌డ్రాలు చేస్తే సేవా పన్ను విధిస్తామని బ్యాంకులు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. నామమాత్రంగా నగదు రహితం.. నగదు కష్టాల నుంచి గట్టేక్కడానికి నగదు రహితం ఒక్కటే శరణ్యమని అధికారులు చెప్పుకొచ్చారు. బ్యాంకర్లు కూడా దీనినే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీల్లో ఖాతాదారులు దారుణంగా మోసపోతున్నాడు. స్వైపింగ్ ద్వారా కొనుగొలు చేసే ఖాతాదారులకు రూ.100కి రూ.1.20 సర్వీసు ట్యాక్స్ పడుతోంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే కంటికి కనిపించకుండా సర్వీసు చార్జీల పేరుతో నగదు ఖాతాల్లోనుంచి మాయమవుతుండడంతో ప్రజలు నగదు రహితం జోలికి వెళ్లడానికి భయపడుతున్నారు. బ్యాంకుల్లో నగదు కొరత జిల్లా బ్యాంకుల్లో నగదు కొరత వాస్తవమే. ఏటీఎంలు పరిమితిగా> పనిచేస్తున్నాయి. ఆర్బీఐ నుంచి నగదు రావాల్సివుంది. నెల రోజులుగా జిల్లాకు ఆర్బీఐ నగదును పంపిణీ చేయలేదు. దీంతో బ్యాంకుల్లో తాత్కాలిక నగదు కొరత ఏర్పడింది. వారం రోజుల్లో నగదు చేరే అవకాశం వుంది. –లక్ష్మీనారాయణ, డీజీఎం,లీడ్ బ్యాంక్, తిరుపతి -
బ్యాంకుల్లో డబ్బుల్లేవ్
♦ రుణ పంపిణీలో ఇబ్బందులు.. ♦ లక్ష్యం కొండంత.. పంపిణీ గోరంత.. ♦ అప్పుల కోసం అన్నదాత అగచాట్లు.. ♦ పట్టించుకోని బ్యాంకర్లు.. ఆదిలాబాద్‌టౌన్: ఖరీఫ్ బ్యాంకు రుణాల పంపిణీలో నత్తేనయం అన్నట్లు ఉంది. ఈ సీజన్లో సకాలంలో వర్షాలు కురిసినప్పటికీ బ్యాంకు రుణాలు అందకపోవడంతో అన్నదాతలు అగచాట్లు పడాల్సి వస్తోంది. బ్యాంకుల ముందు రోజు గంటల తరబడి వేచి ఉంటున్నా డబ్బులు చేతికి అందని దుస్థితి నెలకొంది. జిల్లాలోని చాలా బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డు దర్శనమిస్తోంది. అవసరమైన మేరకు నగదు లేకపోవడం.. ఇచ్చే అరకొర రుణాలు కూడా ఖాతాలో జమ చేస్తున్నారు. ఏటీఎంలలో సైతం డబ్బులు లేకపోవడంతో అన్నదాతల కష్టాలు వర్ణణాతీతం. గత ఏడాది కంటే ఈ ఏడాది 42 శాతం రుణ లక్ష్యం పెంచినప్పుటికీ పంపిణీ నత్తనడకన సాగుతుండడంతో కష్టాలు తప్పడం లేదు.. జిల్లాలో.. జిల్లాలో లక్షా 40 వేల మంది రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 96 గ్రామీణ ప్రాంత బ్యాంకులు ఉన్నాయి. గత ఏడాది ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.842.30 కోట్లు కాగా ఈ ఏడాది వార్షిక ప్రణాళిక రుణ లక్ష్యం రూ.1328.53 కోట్లు.. ఇప్పటి వరకు కేవలం రూ.115 కోట్లు పంపిణీ చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.400 కోట్ల వరకు పెంచినప్పటికీ రుణ పంపిణీ ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది కనీసం 50 శాతం కూడా పూర్తవుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కూడా పూర్తి స్థాయిలో బ్యాంకు రుణాలు పంపిణీ చేయలేదు. రుణæ పంపిణీ కాగితాల్లోనే కనిపిస్తోంది. పంపిణీ చేసేదెప్పుడు.. ఇప్పటికే 60 శాతం పైగా రైతులు పంటలు విత్తుకున్నారు. బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో దళారులను ఆశ్రయించి అధికవడ్డీకి డబ్బులు తీసుకుంటున్నారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నప్పటికీ బ్యాంకు రుణం జాప్యం అవుతోంది. ఇప్పటికే వేసిన విత్తనాలు మొలకెత్తాయి. ఎరువులు, కలుపు, ఇతర పనుల కోసం డబ్బులు అవసరం ఉండగా.. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో మొలకెత్తుతున్న పంటను చూస్తూ దిగాలు పడడమే తప్ప ఏమీ చేయని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ప్రతి ఖరీఫ్ సీజన్లో జూన్ నుంచి మొదలు పెడితే జూలై నెలాఖరు వరకు రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చే వారు కానీ ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కొంత మొత్తంలోనే నగదు జిల్లాలోని చాలా బ్యాంకుల్లో నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రుణాల పంపిణీ ప్రారంభించినప్పటికీ కొంత మొత్తంలోనే డబ్బులను ఇస్తున్నారు. మిగతావి అకౌంట్లలో జమ చేస్తున్నారు. రుణ పంపిణీలో గ్రామీణ బ్యాంకులు కొంచెం ముందు వరుసలో ఉన్నా, సహకార బ్యాంకులు 20 శాతం కూడా పంపిణీ చేయలేదు. మరికొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే రుణాలను ప్రారంభిస్తున్నాయి. ఏటీఎంలలో సైతం డబ్బులు అందుబాటులో లేవు. ఒక్కో రైతు ఐదారు సార్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 2017–18 సంవత్సరానికి గానూ బ్యాంకుల వార్షిక ప్రణాళికను రెండు, మూడు రోజుల క్రితం అధికారులు ప్రకటించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యం రూ.251.39 కోట్లు, సహకార బ్యాంకు రూ.149.43 కోట్లు, ఎస్బీఐ రూ.289.39 కోట్లు, మహారాష్ట్ర బ్యాంకు రూ.96.80 కోట్లు, ఆంధ్రాబ్యాంకు రూ.78.68 కోట్లు, ఇతర బ్యాంకులు రూ.443.53 కోట్లు రుణాలు అందించేందుకు లక్ష్యం ప్రకటించారు. గత ఏడాది కంటే 42 శాతం పెంచినా అందించే లక్ష్యం ముందుకు సాగడం లేదు. రెండు విడతల్లో రూ.30 వేలు.. నాకు ఎనిమిది ఎకరాల వ్యవసాయం ఉంది. ఇచ్చోడలోని దక్క¯Œన్ గ్రామీణ బ్యాంకు వ్యవసాయ రుణం రూ.లక్షా 30 వేలు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.30 వేలు మాత్రమే ఇచ్చింది. మిగతా డబ్బుల కోసం చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న. అధికారులు స్పందించి రుణాలు త్వరగా ఇప్పిస్తే మంచిగుంటది. – నాందేవ్, గ్రామం : కిన్నెరపల్లి, మం : బజార్హత్నూర్ 15 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్న.. ఇచ్చోడలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు చుట్టూ రుణం కోసం తిరుగుతున్న. నాకు రూ.30 వేల రుణం మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. రూ.20 వేల కోసం గత 15 రోజులుగా బ్యాంకుకు తిరుగుతున్న. అధికారులు పట్టించుకోవడం లేదు. రేపు మాపు అనడంతో ఎవుసం కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న. – ఇక్బాల్, గ్రామం : గుండాల, మం : ఇచ్చోడ -
కంచికి చేరని కరెన్సీ కష్టాలు
• ఐదు నెలలు దాటినా తీరని వెతలు • మళ్లీ నవంబర్ నాటి పరిస్థితులు • ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు • బ్యాంకుల్లో అడుగంటిన నగదు నిల్వలు • మళ్లీ పడిపోతున్న వ్యాపారాలు పెద్ద నోట్ల రద్దు.. ప్రజలెవ్వరూ ఊహించని పరిణా మం. ఆర్థిక వ్యవస్థ మూలాలనే కదిలించిన నిర్ణయం. నెలలు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడంలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు పేరుతో మార్చిలో బ్యాంకులు విధించిన ఆంక్షలు.. ఏప్రిల్‌లో కూడా కొనసాగిస్తుండడంతో కరెన్సీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఏ ఏటీఎం వద్దకెళ్లినా నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తుంటే.. అడుగంటిన నగదు నిల్వల కారణంగా బ్యాంకుల్లో సైతం ఆర్థిక లావాదేవీలు తగ్గిపోయాయి. మళ్లీ నవంబర్ నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి. విశాఖపట్నం/విశాఖ సిటీ : జిల్లాలో ప్రతిరోజు కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం రోజుకు కనీసం రూ.50కోట్ల మధ్య లావేదేవీలు జరగని పరిస్థితి కన్పిస్తోంది. జిల్లాలో 1100 ఏటీఎంలుండగా.. వాటిలో కనీసం వంద ఏటీఎంల్లో కూడా డబ్బుల్లేని పరిస్థితి. గడిచిన 20 రోజుల్లో ఆర్బీఐ నుంచి జిల్లాకు రూ.350 కోట్ల కరెన్సీ వచ్చింది. ఈ మొత్తంలో 70 శాతం ఏటీఎంలకు తరలించగా.. 30 శాతం మాత్రమే బ్యాంకుల్లో ఉంచారు. ఏటీఎంల్లో క్యాష్ దాదాపు పూర్తి కావడంతో అన్ని నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు అడుగంటడం, డిపాజిట్లు పెద్దగా లేకపోవడంతో నగదు చెల్లింపులపై ఆంక్షలు విధిస్తున్నారు. రూ.పది వేలు అడుగుతున్న వారికి ఐదువేలు.. ఐదు వేలు అడుగుతున్న వారికి రెండు వేలతో సరిపెడుతున్నారు. పెద్దనోట్ల రద్దుకు ముందు జిల్లాలో 10 నుంచి 15 శాతం మాత్రమే ఆన్లైన్ లావాదేవీలు జరిగేవి. ప్రస్తుతం ఆన్లైన్ లావాదేవీలు 40 శాతం పెరిగాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా మాత్రం 25 శాతం మించి జరగడం లేదు. ఏటీఎం కార్డుపై నగదురహిత లావాదేవీలు చేసేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడతున్నారు. ఉన్నత విద్యావంతులు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కాస్తో కూస్తో ఆన్లైన్ లావాదేవీలతో బండినెట్టుకొస్తున్నా.. చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు నరకయాతన పడుతున్నారు. ఆన్లైన్ చెల్లింపులు ఎలా చెయ్యాలో తెలీక.. సరైన సమయానికి డబ్బులు అందక వేలాది మంది మనోవేదనకు గురవుతున్నారు. సాంకేతిక లోపాల కారణంగా చెల్లింపులు జరిగినట్టుగా మెస్సేజ్ రావడం.. తీరా అవతల ఖాతాలకు జమ కాకపోవడంతో డబ్బు ఏమైయ్యాయో తెలియక గగ్గోలు పెడుతున్నారు. తగ్గిన స్వైపింగ్ వినియోగం పెద్దనోట్ల రద్దుకు ముందు 6,084 స్వైపింగ్ మెషిన్లు జిల్లాలో ఉండేవి. ఆ తర్వాత వాటి సంఖ్య 9 వేలకు చేరినప్పటికి ప్రస్తుతం వినియోగంలో 4 వేలకు మించిలేవు. వేలిముద్ర ద్వారా నగదు చెల్లింపుల కోసం ఇటీవల ప్రారంభించిన ‘భీమ్యాప్’డివైస్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు 600 వరకు మాత్రమే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. స్వైపింగ్ మెషిన్ల స్థానే వీటిని తీసుకురావాలంటే కనీసం 40 వేల డీవైఎస్లు అవసరమని అంచనా వేస్తున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్లలో దాదాపు 80 శాతం మేర పడిపోయిన వ్యాపారాలు.. జనవరిలో కాస్త గాడిలో పడ్డాయి. ప్రస్తుతం 50 నుంచి 60 శాతానికి మించి వ్యాపార లావాదేవీలు జరగడం లేదని వ్యాపారవర్గాలు వాపోతున్నాయి. -
ఖాతాలో లెక్క.. చేతికి దక్కేదెలా?
అనంతపురం: బ్యాంక్ ఖాతాలో నిండుగా లెక్క ఉన్నా.. జనం చేతికి అందడం లేదు. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ (ఏటీఎం)లపైనే ఇంత కాలం ఆధారపడి నగదు విత్ డ్రా చేసుకున్న జిల్లా వాసులు నగదు కొరత కారణంతో సరికొత్త ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న గ్రామీణ ప్రజలు సైతం ఇంతకాలం నగదు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌ల కన్నా తొలి ప్రాధాన్యత ఏటీఎం కేంద్రాలకే ఇస్తూ వచ్చారు. అయితే ఐదు నెలల క్రితం పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జనం నగదు కష్టాలు రెట్టింపయ్యాయి. అవన్నీ తాత్కలికమే... పరిస్థితి కొన్ని రోజుల్లో సర్దుకుంటుందంటూ చెప్పుతూ వచ్చిన పాలకులు ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులపై పెదవి విప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. పనిచేస్తున్న 30 శాతం ఏటీఎంల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడు నగదు వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. నగదు కోసం బ్యాంక్‌ల వద్ద గంటల తరబడి వేచి ఉండలేక ప్రజల్లో అసహనం తలెత్తుతోంది. -
బాబోయ్.. బ్యాంకులు
ఓ వ్యక్తి రోడ్డుపై వెళుతూ వెళుతూ యథాలాపంగా పక్కనే ఉన్న బ్యాంకు వైపు చూశాడు. అంతే.. ‘మీ బ్యాంకు ఖాతాలో రూ.25 కోత విధించడమైనది..’ అంటూ అతని మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది. మరో వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి బయటకు వస్తూ ఏటీఎం కార్డుతో మెడ మీద గోక్కున్నాడు. అంతే.. ‘మీరు మీ ఏటీఎం కార్డును ఐదుకన్నా ఎక్కువ సార్లు గీకారు. అందుకు రూ.25 సర్వీసు చార్జీ..’ అంటూ మెసేజ్ వచ్చింది. ఇవన్నీ నిజం కాదు. బ్యాంకులు ఖాతాదారుల నుంచి నానా రకాలుగా వసూలు చేస్తున్న చార్జీలపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జోకులు. సాక్షి, అమరావతి: బ్యాంకులు అడ్డగోలుగా విధిస్తున్న చార్జీలు ఖాతాదారులకు చిర్రెత్తిస్తున్న మాట మాత్రం నిజం. ప్రస్తుతం బ్యాంకు అన్నా, బ్యాంకు లావాదేవీ అన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. డబ్బులు డిపాజిట్ చేసినా చార్జీ, విత్ డ్రా చేసినా చార్జీ. ఏటీఎం కార్డు ఎక్కువసార్లు వాడినా చార్జీ. ఇలా.. ప్రతి లావాదేవీకి బ్యాంకులు చార్జీల మోత మోగిస్తున్నాయి. బాదుడే బాదుడు బ్యాంకులు అవలంభిస్తున్న విధానాలతో పాత పద్ధతిలో ఇంటిలోనే డబ్బు దాచుకోవడం మంచిదన్న ఆలోచనలోకి ప్రజలు వస్తున్నారు. తాను సంపాదించిన మొత్తాన్ని ఏ రోజుకు ఆరోజు బ్యాంకులో జమ చేసేవాడినని, కానీ బ్యాంకు చార్జీల మోత మొదలు పెట్టినప్పటి నుంచి ఇంటిలోనే దాచుకోవడం మొదలు పెట్టానని విజయవాడకు చెందిన సెలూన్‌షాపు యజమాని రఘు చెపుతున్నాడంటే ప్రజల్లో బ్యాంకులపై ఎంత విరక్తి పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద బ్యాంకయిన ఎస్బీఐ చార్జీల మోత షురూ చేయగా మిగిలిన బ్యాంకుల అదే దారిలో పయనించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక నుంచి ఎస్బీఐలో నెలలో మూడుసార్లు మించి బ్యాంకుకు వెళ్లి నగదు డిపాజిట్ వేస్తే సర్వీస్ ట్యాక్స్‌తో కలిసి రూ.50 వరకు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకు సొంత ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు మించి, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడు సార్లకు మించి నగదు తీసుకుంటే రూ.10 నుంచి రూ.20 వరకు చార్జీల విధిస్తున్నాయి. అలాగే బ్యాంకు నిబంధనల మేరకు ఖాతాలో కనీస నిల్వ ఉంచకపోయినా..రోజుల లెక్కన రూ.200 ఆపై సర్‌చార్జీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇక నిర్దిష్ట కాలం తర్వాత బ్యాంకుల నుంచి వచ్చే ఎస్సెమ్మెస్‌లకు కూడా చార్జీలు వసూలు చేస్తారు. చార్జీలే..సేవలేవీ..? ఇన్ని చార్జీలు విధిస్తున్నా సేవలైనా సరిగా అందిస్తున్నాయా అంటే అదీ లేదు. ఏప్రిల్ నెల వచ్చి అప్పుడే అయిదు రోజులు గడుస్తున్నా ఉద్యోగులు జీతాలు తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఏటీఎంలు పనిచేయవు. అలాగని బ్యాంకుకి వెళితే ‘నగదు లేదు తర్వాత రండి’ అన్న సమాధానాలే చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఇంటి అద్దెలు, ఫీజులు, ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితులను రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంటలు అమ్మిన డబ్బు బ్యాంకుల్లో వేస్తుకుని తీసుకోవాలనుకుంటే తల ప్రాణం తోకకు వస్తోం దని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ పనే..! పెద్ద నోట్ల రద్దు తర్వాత పెరిగిన డిజిటల్ లావాదేవీలు జనవరి రెండవ వారం నుంచి తగ్గు ముఖం పట్టడంతో, నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ఆర్బీఐ నగదు కొరతను సృష్టిస్తు న్నట్లు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మార్చి నెల మొదలైనప్పటి నుంచి నగదు సరఫరా తగ్గిపోయిందని, అడిగినంత నగదును ఆర్బీఐ ఇవ్వడం లేదని ఈ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్న బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బ్యాంకులో డబ్బులున్నా.. పింఛను డబ్బులు తీసుకోవడం కోసం రెండు రోజులుగా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నాను. పెద్దనోట్ల రద్దు సమయంలో ఇబ్బందులు పడ్డాం. ఆ రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఏటీఎంలలో ఎక్కడా డబ్బులుండటం లేదు. చిల్లర ఖర్చులకు డబ్బులు లేక తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులో డబ్బులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. – పి. విశ్వేశ్వరరావు, రిటైర్డు ఉద్యోగి, కాకినాడ. ఎక్కడ చూసినా నోటీఎంలే... ఎక్కడా చూసినా ఏటీఎంలు కనిపిస్తున్నా వాటిల్లో నగదు మాత్రం ఉండటం లేదని కాకినాడకు చెందిన ఎల్.శ్రీనివాస్ తెలిపారు. ఇంటి అద్దె చెల్లించడం కోసం మంగళవారం మొత్తం ఏడు ఏటీఎంలు తిరిగినా ఒక్కటి కూడా పనిచేయలేదన్నారు. ఏటీఎం ఎక్కువసార్లు వాడితే చార్జీలు వేయడం కాదని, ఏటీఎంలో నగదు ఉంచనందుకు బ్యాంకులపై ఫైన్ విధించాలంటున్నారంటే బ్యాంకులతో ప్రజలెంతగా విసిగిపోతున్నారో అర్థమవుతుంది. 8,036 రాష్ట్రంలో మొత్తం ఏటీఎంలు రాష్ట్రంలో గత ఇరవై రోజుల నుంచి 80 శాతానికి పైగా ఏటీఎంలు పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 7,007 బ్యాంకు శాఖలు ఉండగా 8,036 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 449 ఏటీఎంలున్నాయి. అడిగినంత ఇవ్వకపోవటంతో.. ఏప్రిల్ 1 తేదీకి తక్షణం రూ. 3,000 కోట్లు అవసరమవుతాయని, లేకపోతే రాష్ట్రంలో నగదు కొరత తీవ్రమవుతుందని ఆర్బీఐకి చెప్పినా ఇంతవరకు నగదు పంపలేదని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. -
ఎనీటైం... నోమనీ
► ఖాతాల్లో నగదున్నా పనిచేయని ఏటీఎంలు! ► బ్యాంకుల్లోనూ నిండుకున్న నగదు నిల్వ ► ఖాతాదారులకు మళ్లీ నోట్లరద్దు నాటి కష్టాలు శ్రీకాకుళం: నో క్యాష్... నెల ప్రారంభం నుంచి ఏటీఎంల వద్ద బోర్డులు ఖాతాదారులను వెక్కిరిస్తున్నాయి. విత్‌డ్రాలపై ఆంక్షలు సోమవారం నుంచి ఎత్తివేసినా నగదు తీసుకోవడానికి అగచాట్లు తప్పట్లేదు. నవంబరు ఎనిమిదో తేదీన పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన నగదు కష్టాలు మరోసారి పునరావృతమవుతున్నాయి. మరోవైపు బ్యాంకుల్లోనూ నగదు నిల్వ లు నిండుకున్నాయి. నగదు అడిగితే రూ.10 నాణాలున్న మూటలు చేతుల్లో పెడుతున్నారు. తీరా ఆ పది రూపాయల నాణాలు కూడా తీసుకోవడానికి వ్యాపారులు వెనుకంజ వేస్తుండడంతో సామాన్యులకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. తమ దుస్థితి తామే తిట్టుకుని వెళ్లిపోవడం తప్ప! జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిపి 23 ఉన్నాయి. వీటికి 298 శాఖల పరిధిలో 290 ఏటీఎంలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి రోజుకు సుమారు రూ.100 కోట్లు మేర నగదు లావాదేవీలు జరగాల్సి ఉంది. కానీ నెల ప్రారంభం నుంచి రూ.70 కోట్లుకు మించలేదు. నగదు తగినంత లేకపోవడంతో వారం రోజులుగా సగానికి సగం తగ్గిపోయింది. దీంతో లావాదేవీలను అనధికారికంగానే వాయిదా వేయాల్సిన పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు తర్వాత జిల్లాకు రూ.500, రూ.2000 కొత్తనోట్లు తొలి మూడు విడతల్లో రూ.800 కోట్ల మేర వచ్చాయి. తర్వాత నగదు చలామణి పెరిగిన తర్వాత మరికొంత మొత్తంలో బ్యాంకులకు చేరింది. ఇటీవల రూ.30 కోట్లు రాగా, దాన్ని పింఛనుదారుల కోసం కేటాయించారు. గత వారం రూ.65 కోట్ల వరకూ కొత్త నోట్లు వచ్చాయి. కానీ ఇది ఖాతాదారుల అవసరాలకు ఏమాత్రం సరిపోలేదు. ఏటీఎంల్లో నగదు కూడా ఉండట్లేదు. దీనికి నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు సడలించడం, అలా సడలించడంతో విత్ డ్రా అవుతున్న నగదు తగినట్లుగా డిపాజిట్లు లేకపోవడం ప్రధాన కారణాలనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఖాతాదారులు ఎక్కువ మంది నగదును ముందుజాగ్రత్తగా తమవద్దే ఉంచేసుకుంటున్నారు. దీంతో నగదు ఎక్కడికక్కడ ‘బ్లాక్’ అయిపోతోంది. బ్యాంకు డిపాజిట్లు తగ్గిపోయాయి. దీంతో బ్యాంకులు తమవద్దనున్న కొద్దిపాటి నగదునే విత్‌డ్రాలకు కేటాయిస్తున్నాయి. అదీ విత్‌డ్రాలపై అనధికార ఆంక్షలు అమలు చేసి ఖాతాదారులకు సర్దిచెబుతున్నాయి. మరోవైపు ఏటీఎంలకు నగదు సరఫరాను ఆపేశాయి. ఒకవైపు నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు బహుమతులు ప్రకటిస్తున్న ప్రభుత్వం... మరోవైపు ఆ వ్యవస్థను బలోపేతం చేయడంపై మాత్రం ప్రచారానికే పరిమితమైంది. జిల్లాలో డిజిటల్, ఆన్లైన్ లావాదేవీలు ఏమాత్రం పుంజుకోలేదు. జిల్లాలో వ్యాపారులకు స్వైపింగ్ మెషిన్లు కొత్తగా ఇవ్వట్లేదు. గతంలో ఉన్న మెషిన్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే నగదు రహిత లావాదేవీలపై రుసుం వేస్తుండటంతో వినియోగదారులు కార్డులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. నగదు సహిత కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. కానీ చేతిలో నగదు లేక సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. -
నేటి నుంచి విత్‌డ్రాలపై ఆంక్షలు లేవు.. కానీ!
న్యూఢిల్లీ: సేవింగ్స్ అకౌంట్ నుంచి మీరు ఇక ఎంత నగదు అయినా విత్ డ్రా చేసుకోవచ్చు. సేవింగ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రాయల్స్‌పై ఉన్న ఆంక్షలు ఇవాళ్టి నుంచి తొలగిపోయాయి. ఈ మేరకు జనవరి 30న ఆర్బీఐ చేసిన ప్రకటన ప్రకారం.. నేటి(మార్చ్ 13) నుంచి ఆంక్షలు తొలగించబడ్డాయి. డీమోనిటైజేషన్ అనంతరం ఏర్పడ్డ నగదు కొరత పరిస్థితులను అదిగమించేందుకు ఆర్బీఐ తొలుత రోజుకు రూ. 2000 మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. తరువాత దీనిని రోజుకు రూ. 4500కు, ఆ తరువాత వారానికి రూ. 24,000కు మించకుండా రోజుకు రూ 10,000 వరకు విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అనంతరం ఫిబ్రవరి 20న వారానికి గల లిమిట్‌ను రూ 24,000 నుంచి రూ. 50.000కు పెంచిన విషయం తెలిసిందే. ఆర్బీఐ నిర్ణయంతో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు లేకపోవడంపై ఓ వైపు హర్షం వ్యక్తమౌతోంది. కానీ.. ఏటీఎంల వద్ద ఇప్పటికీ కనిపిస్తున్న నోక్యాష్ బోర్డుల పట్ల ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్‌లో నాలుగైదు రోజులుగా నోట్ల కష్టాలు కొనసాగతుతున్నాయి. డబ్బుకోసం ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. -
నేటి నుంచి విత్‌డ్రాలపై ఆంక్షలు లేవు.. కానీ!
-
కాసులకు కటకట
⇒ రూ.3,000 కోట్లు జిల్లాలో నెలకు కావాల్సింది ⇒ రూ.112 కోట్లు ఈ నెలలో రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చింది ఏటీఎం కేంద్రాల్లో నగదు లేక ఇక్కట్లు జిల్లాలో నోట్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, పింఛన్‌దారులు నగదుకోసం బ్యాంకుల వద్దకు వెళ్తే వారికి నిరాశే మిగులుతుంది. అధికశాతం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. గతేడాది నవంబరు 8వ తేదీ రాత్రి నుంచి పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో నగదు కోసం నానా తిప్పలు పడ్డారు. రెండు నెలల తర్వాత కొంత కుదుట పడింది. ప్రస్తుతం మళ్లీ అవే కష్టాలు పునరావృతమయ్యాయి. నెల్లూరు(సెంట్రల్): రిజర్వ్ బ్యాంక్ నుంచి సకాలంలో నగదు రాకపోవడంతో జిల్లాలో ప్రజలకు నగదు కష్టాలు పూర్తిగా తీరడంలేదు. దీంతో బ్యాంకుల్లో నగదు కట్టించుకోవడం తప్ప ఇచ్చే పరిస్థితి దాదాపుగా లేదు. రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుకున్నంత మొత్తం నగదు బ్యాంకులకు సరఫరా కాక పోవడంతోనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, కావలి, కోవూరు, నాయుడుపేట, నెల్లూరు, సూళ్లూరుపేటలలోని బ్యాంకులకు గతంలో రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా నగదు వచ్చేది. నోట్ల రద్దుతో ఈ బ్యాంకులకు నగదు రావడంలేదు. ఇవేగాక జిల్లా మొత్తంగా ఉన్న బ్యాంకులకు ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయిలో నగదు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన పట్టణాల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. ఇక గ్రామాలలోని వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇదే విధంగా నగదు రాకుండా ఉంటే తీవ్రమైన నగదు కొరత ఏర్పడే ప్రమాదముందని పలువురు బ్యాంకు అ«ధికారులే పేర్కొంటున్నారు. రూ.3 వేల కోట్లకు రూ.112 కోట్లు.. జిల్లాలో 424 బ్యాంకులు, 482 ఏటీఎం కేంద్రాలున్నాయి. రోజుకు అన్ని బ్యాంకుల్లో లావాదేవీలకు కనీసం రూ.100 కోట్లు అవసరం. అంటే నెలకు రూ.3 వేల కోట్లు కావాల్సి వస్తే ఇప్పటి వరకు జిల్లాకు వచ్చింది రూ.112 కోట్లు మాత్రమే. ఈ నెల 10వ తేదీ వరకు పరిశీలిస్తే మొత్తం రూ.వెయ్యి కోట్లు కావాల్సి ఉంది. అయితే రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చింది రూ.112 కోట్లు. ఈ విధంగా ఉంటే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పింఛన్, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ ఎలా పంపిణీ చేస్తారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల మొదటి వారం దాటినా ఇప్పటి వరకు చాలా మంది వారి జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉందంటే నగదు కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతోంది. దీంతోపాటు వ్యాపారులు, రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 95 శాతం ఏటీఎంలు మూత జిల్లాలో 482 ఏటీఎం కేంద్రాలున్నాయి. నగదు లేక పోవడంతో 95 శాతం ఏటీఎం కేంద్రాలు మూసి ఉన్నారు. నెల్లూరు నగరంలో అయ్యప్పగుడి నుంచి గాంధీబొమ్మ వరకు పరిశీలిస్తే రెండు మూడు మినహా ఎక్కడా ఏటీఎం కేంద్రాలు తీసిన దాఖలాలు లేవు. ఎస్బీఐ, ఎస్బీహెచ్ ఏటీఎంలు దాదాపుగా మూతపడి ఉన్నాయి. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కోవూరు, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జీతాలు తీసుకోలేని పరిస్థితి మొదటి వారం వచ్చినా జీతాలు తీసుకోలేని పరిస్థితి. నగరంలో ఎక్కడికెళ్లినా ఏటీఎం కేంద్రాలు మూసేసి ఉన్నాయి. కొన్ని ఉన్నా నో.. క్యాష్ బోర్డు పెట్టారు. బ్యాంకులకు వెళదామన్నా డబ్బులు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ ఇబ్బందులు నాకొక్కడికే కాదు. చాలా మంది ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. –వి.శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగి ఏటీఎంలు పనిచేయడం లేదు ఏటీఎంలలో నగదు ఉండటంలేదు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నా అవసరాలకు నగదు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడకు వెళ్లినా నోక్యాష్ బోర్డులు పెట్టి ఉన్నారు. మరో రెండు రోజులు సెలవులు ఉండటంతో నగదు కోసం ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. –భాస్కర్, కావలి, ప్రైవేట్ ఉద్యోగి ఆర్బీఐ నుంచి వస్తేనే ఆర్బీఐ నుంచి మాకు నగదు వస్తేనే బ్యాంకులకు సరఫరా చేయగలం. ప్రస్తుతం ఈ నెలలో కొద్దిగా మాత్రమే నగదు వచ్చింది. జిల్లాలోని బ్యాంకులకు నిత్యం లావాదేవీలు జరపాలంటే రోజుకు రూ.100 కోట్లు అవసరం ఉంటుంది. మార్చి నెల కావడంతో కూడా ఇబ్బందికరంగా ఉంది. ఉన్న కాస్త నగదును సర్దుబాటు చేస్తున్నాం. నగదు వచ్చేదాకా ఏమీ చేయలేని పరిస్థితి. –వెంకట్రావ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ -
కష్టాలు తీరవా?
► కొనసాగుతున్న కరెన్సీ సమస్య ► నగదు కోసం క్యూలైన్లలో పడిగాపులు ► సామాన్యులు, ఖాతాదారుల ఇబ్బందులు శ్రీకాకుళం అర్బన్: నగదు కష్టాలు వీడటం లేదు! కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి! ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి! బ్యాంకుల్లోనూ నగదు కొరత తీవ్రంగా ఉండటంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో సామాన్యులు, ఖాతాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కడికి వెళ్లినా మొండిచెయ్యే..: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా కరెన్సీ కొరత ఏర్పడింది. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆ ఇబ్బందులు తప్పాయి అనుకుంటున్న జిల్లా వాసులకు మళ్లీ కరెన్సీ షాక్ మొదలైంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు కావాలనుకునే ఖాతాదారులు బ్యాంకులకు వెళ్తే మొండి చెయ్యే ఎదురవు తోంది. దీంతో చేసేది లేక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. చివరికి చిన్న మొత్తం కోసం ఏటీఎం కేంద్రాల వద్దకు వెళ్లినా.. అక్కడ కూడా నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు, వినియోగదారుల బాధలు వర్ణనాతీతం. ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే..: నగదు కోసం ఏ బ్యాంకుకు వెళ్లినా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. తనకు కావాల్సిన నగదు కోసం విత్‌డ్రా చేసేందుకు వెళితే అక్కడ సరిపడా నగదు ఉండటం లేదు. దీనికి బ్యాంకుల్లో నగదు నిల్వలేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఖాతాదారులు నగదును డిపాజిట్ చేస్తేనే ఆ సొమ్మును విత్‌డ్రా కోసం వేచి ఉండే ఇతర ఖాతాదారులకు సర్దుబాటు చేస్తున్నారు. డిపాజిట్ కనుక రాకపోతే విత్‌డ్రా కోసం వచ్చిన ఖాతాదారులు అలా ఉండాల్సిందే. ఇదే తంతు ఏటీఎంల వద్ద ఏర్పాటు చేసిన క్యాష్ డిపాజిట్ మెషీన్ వద్ద కూడా జరుగుతోంది. ఖాతాదారుడు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత.. మళ్లీ వేరొకరు విత్‌డ్రా చేస్తే నగదు వస్తోంది. నగదు విషయంలో అంతా సక్రమంగానే ఉందని ఒక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు చెబుతుంటే అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని ప్రజలు, ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగదు కష్టాలను ప్రజాప్రతినిధులుగానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. రూ.10నాణేలు తీసుకునేందుకు వెనకడుగు: మరికొన్ని బ్యాంకుల్లో నగదు కోసం వెళ్తే రూ.100, రూ.500, రూ.2వేలు నోట్లు లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో రూ.10 కాయిన్లు తీసుకెళ్లాలని బ్యాంకు అధికారులు కోరినా.. ఖాతాదారులు వాటిని తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. రూ.10 కాయిన్లుచెల్లుబాటు కావనే అపోహ ఉండటంతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
నోట్ల వేట
సిరిసిల్ల : కొత్త సంవత్సరంలోనూ జనాలకు నోట్ల తిప్పలు తప్పలేదు. ఆదివారం బ్యాంకులకు సెలవ కావడంతో నగదు కోసం ఖాతాదారులకు ఏటీఎంలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో 16 ఏటీఎంలు ఉండగా.. ఎస్బీహెచ్, గాయత్రీ బ్యాంకుల ఏటీఎం మాత్రమే పని చేశాయి. మిగతా వాటి ఎదుట ‘నో క్యాష్’ బోర్డులు తగిలించారు. నెలమొదటి రోజు కావడంతో బ్యాలెన్స్ పరిశీలించేందుకు, నగదు డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు ఏటీఎంల ఎదుట బారులు తీరా రు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల డబ్బులు ఖాతాల్లో పడడంతో వారు సైతం నగదు కోసం ఏటీఎంలను ఆశ్రయించారు. అయితే, ఆర్బీఐ తాజా నిర్ణయంతో పనిచేసే రెండు ఏటీఎంల నుంచి రూ.4500 విత్‌డ్రా చేసుకున్న ఖాతాదారులు కాస్త ఊపిరి తీల్చుకున్నారు. మొన్నటి వరకు రోజుకు రూ.2000, ఆ తర్వాత రూ.2,500 తీసుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా రూ.4,500 తీసుకున్నారు. ఇందులో రూ.రెండువేల నోట్లు రెండు, ఐదు వం దల నోట్లు అందాయి. కొత్త సంవత్సరం వేళ సిరిసిల్లలో పాత సమస్యనే జనాన్ని వెంటాడింది. అన్ని బ్యాంకులు ఏటీఎంల్లో డబ్బులను అందుబాటులో ఉంచితే.. బ్యాంకుల్లో జనం రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. నేటి నుంచి రద్దీ.. ఉద్యోగులకు సోమవారం వేతనాలు తమ బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. దీంతో వేతనాలు డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీనిని అధిగమిం చేందుకు బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలి ఉంది. -
40 రోజులైనా మారని నోట్ల కష్టాలు
-
నో ’చేంజ్’
పనులు మానుకుని బ్యాంకుల వద్ద క్యూ కడుతున్న జనం అయినా అందరికీ అందని నగదు రోజురోజుకు నగదు పరిమితిని తగ్గిస్తున్న బ్యాంకులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్లను రద్దు చేసి 38 రోజులైంది. బ్యాంకుల వద్ద పరిస్థితుల్లో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. మొదట్లో రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం రూ.2వేల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. దీంతో చిల్లర కష్టాలు పెరిగిపోయాయి. ప్రజలు ఇప్పటికీ రోజువారీ పనులు మానుకుని ఉదయాన్నే బ్యాంకుకు చేరుకుని క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. ఖాతాదారుల ఆందోళనలతో ప్రతి బ్యాంకు వద్ద పోలీసు బందోబస్తు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్‌ల నుంచి వారానికి రూ.24 వేలు డ్రా చేసుకోవచ్చనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ప్రస్తుతం రోజుకు రూ.4 వేలు, అక్కడక్కడా రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం దాదాపు అన్ని రోజులు పనిచేసిన తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఏటీఎం గురువారం నుంచి పనిచేయకపోవడంతో ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాలకొల్లు మండలం దగ్గులూరు ఆంధ్రాబ్యాంక్‌లో శుక్రవారం నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. ఉదయం 8 గంటలకే పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బ్యాంకుకు చేరుకున్న ఖాతాదారులు, పింఛనుదారులు ఇబ్బంది పడ్డారు. పెనుగొండ మండలం వడలిలో సుమారు రెండు ఫర్లాంగుల క్యూ ఉండటంతో ఖాతాదారులు ఎండలో మలమల మాడిపోయారు. పెనుగొండ ఎస్బీఐ, సిద్ధాంతం ఆంధ్రాబ్యాంకు వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. బ్యాంకుల గేట్లు మూసివేసి లోపలికి ప్రాధాన్యత క్రమంలో అనుమతిస్తుండటంతో ఎక్కువమంది బయటే వేచి ఉండాల్సి వస్తోంది. ఆచంట, కొడమంచిలి ఎస్బీఐల వద్దకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో తోపులాటలు జరిగాయి. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొడమంచిలి ఎస్బీఐ వద్ద గురువారం నగదు పంపిణీ చేయకపోవడంతో శుక్రవారం ఖాతాదారులు పోటెత్తారు. రూ.4 లక్షలు మాత్రమే అందుబాటులో ఉందని చెప్పి, ఒక్కో ఖాతాదారుడికి రూ.2 వేల చొప్పున పంపిణీ చేసేందుకని 200 మందికి టోకెన్లు ఇచ్చారు. దీంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు తిరగాలంటూ బ్యాంకు సిబ్బందిపై మండిపడ్డారు. మొగల్తూరు ఎస్బీఐలో ఒక్కొక్కరికి రూ.2 వేలు మాత్రమే ఇచ్చారు. కొద్ది గంటలకే నగదు లేదని మరుసటి రోజు తేదీ, సీరియల్ నంబర్లను విత్ డ్రాయల్ ఫారంపై వేసి ఖాతాదారులకు అందించారు. ఆంధ్రా బ్యాంక్‌లో నగదు తక్కువ ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు. జంగారెడ్డిగూడెం ఎస్బీఐ ఏటీఎం వద్ద జనం కిక్కిరిశారు. పట్టణంలోని హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. ఈ ఏటీఎంలలో నగదు పెట్టిన కొద్ది గంటల్లోనే అయిపోవడంతో చాలామంది ఖాతాదారులు నిరాశగా వెనుదిరిగారు. చింతలపూడి ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతాదారులకు రూ.24 వేల వరకు పంపిణీ చేశారు. ఎస్బీఐలో మాత్రం రూ.4 వేలు అందించారు. పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎం ఒక్కటే పని చేయడంతో జనం ఏటీఎం వద్ద బారులు తీరారు. లింగపాలెం ధర్మాజీగూడెం ఎస్బీఐ, రంగాపురం ఆంధ్రాబ్యాంకుల్లో శుక్రవారం ’నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చాయి. రంగాపురం ఆంధ్రాబ్యాంక్ లో మాత్రం సాయంత్రం నుంచి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఇచ్చి సర్దుబాటు చేశారు. కామవరపుకోట ఆంధ్రాబ్యాంకులో ఒక్కొక్క ఖాతాదారుడికి శుక్రవారం రూ.4 వేలు ఇవ్వగా, ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐలలో రూ. 2 వేల చొప్పున ఇచ్చారు. బ్యాంకులో డబ్బు లేకపోవడంతో చాలామంది ఖాతాదారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. -
రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం జనం విలవిల
-
తీరని కష్టం..
-
కష్టాలు.. కన్నీళ్లే!
►రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం జనం విలవిల ►క్యూలైన్లలో సొమ్మసిల్లుతున్న వృద్ధులు ► పలు చోట్ల తొక్కిసలాటలు, ఆందోళనలు సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నగదు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనమంతా బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు కాస్తున్నారు. చాలా చోట్ల బ్యాంకుల్లో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకే అదీ తొలి వంద, రెండు వందల మంది ఖాతాదారులకే చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు నగదు లేదంటూ ‘నో క్యాష్’ బోర్డులు పెడుతున్నారు. అటు గురువారం కూడా హైదరాబాద్‌లోని సుమారు 1,435 బ్యాంకుల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరారు. మొత్తంగా ఉన్న ఏడువేల ఏటీఎంలలో గురువారం తెరుచుకున్నవి వెయ్యిలోపు మాత్రమే. ఎస్డీ రోడ్‌లోని సిండికేట్ బ్యాంకు వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు క్యూలైన్లో నిలబడిన కృష్ణ సూర్యనారాయణ (65) అనే రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను పోలీసులు వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఇక పలు చోట్ల బ్యాంకులు ఇచ్చే కొద్దిపాటి నగదు అయినా.. వారానికి ఒకసారి మాత్రమే ఇస్తామని చెబుతుండడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు కష్టాలతో కోఠి, అబిడ్స్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, మోండా మార్కెట్, చార్మినార్ తదితర మార్కెట్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలు.. ఆందోళనలు.. నగదు కోసం బ్యాంకుల వద్దకు జనం భారీ సంఖ్యలో చేరుకుంటుండడంతో తొక్కిసలాట, తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల నగదు అందక జనం ఆందోళనలకు దిగుతున్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట భారీగా జనం చేరారు. ఉదయం 10.30కు బ్యాంకు గేటు తెరవడంతో.. వారంతా ఒక్కసారికి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ రైతులు, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వేర్వేరుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. నగదు ఇవ్వకుంటే తాము పంటలు ఎలా వేసుకోవాలంటూ బ్యాంకుల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఎస్బీహెచ్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నగదు లేదనడంతో రైతులు రాస్తారోకో చేశారు. ఏటీఎంకు పూజలతో నిరసన జనాలకు డబ్బులు అందజేయాల్సిన ఏటీఎంలు.. నోట్ల రద్దుతో ఎందుకూ పనికిరాని డబ్బాలుగా మారిపోయాయి. దీంతో జనం ఏటీఎంలకు పూజలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో గురువారం కామారెడ్డిలోని పలు ఏటీఎంలకు పట్టణ కాంగ్రెస్ నేతలు పూజలు చేశారు. అన్ని బ్యాంకుల ఏటీఎంలలోనూ డబ్బులు పెట్టడం లేదని.. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కన్నయ్య పేర్కొన్నారు. తిండీతిప్పలూ బ్యాంకు వద్దే.. అటు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తోపాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం కొండపాక, దుద్దెడ ఆంధ్రా బ్యాంకులకు వచ్చారు. రూ.4వేల చొప్పున ఇస్తామంటూ బ్యాంకు అధికారులు వారికి టోకెన్లు ఇచ్చారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ సేవలు పనిచేయకపోవడంతో నగదు ఇవ్వలేదు. దీంతో ఖాతాదారుల్లో చాలా మంది బ్యాంకు వద్దే నిరీక్షించారు. వారిలో కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్న సద్దులు తిని కడుపు నింపుకున్నారు. వృద్ధురాలికి ‘పెద్ద’ కష్టం ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు భాగ్యమ్మ (70). ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామం. చేతిలో చిల్లి గవ్వ లేని దుస్థితిలో గురువారం పింఛన్ సొమ్ము తీసుకుం దామని చెరువుమాధారం ఏపీజీవీ బ్యాంకుకు వచ్చింది. 2 గంట ల పాటు క్యూలో నిలబడడంతో.. సొమ్మసిల్లి పడిపోయింది. ఇది చూసిన మస్తాన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే భాగ్యమ్మ తుంటి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడు తన పరిస్థితేమిటని వృద్ధురాలు కన్నీరమున్నీరవుతోంది. క్యూలైన్లోనే బీడీలు చుడుతూ.. రోజూ బీడీలు చుడితేగానీ పూట గడవని పరిస్థితి వారిది. నోట్ల రద్దుతో చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి. దీంతో అటు బ్యాంకుల ముందు క్యూలైన్లో ఉంటూనే.. ఇటు బీడీలూ చుడుతు న్నారు కొందరు మహిళలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఆం ధ్రాబ్యాంకు ఎదుట గురువారం తెల్ల వారుజామున కనిపించిన దృశ్యమిది. పోత్గల్‌కు చెందిన ఈర్ల లక్ష్మి, ముస్తా బాద్‌కు చెందిన ఆరుట్ల లక్ష్మి, మరి కొందరు క్యూలైన్ల ఉండే బీడీలు చుడుతూ తమ వంతు కోసం ఎదురు చూశారు. గంటలు గంటలు నిలబడా ల్సి వస్తోందని, దాంతో పని పోతుం దనే ఉద్దేశంతో లైన్లోనే బీడీలు చుడుతున్నామని వారు పేర్కొన్నారు. అమ్మా.. పాలకులను కదిలించేనా నీ కంటి చెమ్మ.. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి.. ఉన్నచోటి నుంచి కదలాలన్నా కష్టమైన పరిస్థితి.. అటు తిండికీ, ఇటు మందులకూ నెల నెలా వచ్చే పింఛన్ డబ్బులే దిక్కు.. కానీ ‘నోట్ల రద్దు’తో ఆ పింఛన్ సొమ్మునూ తీసుకోలేని పరిస్థితి.. కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుకు వచ్చినా లైన్లో నిలబడలేక.. నిలబడినా సొమ్ము చేతికి అందక కన్నీళ్లే మిగులుతున్నాయి.. గురువారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం షాపూర్‌నగర్ ఎస్బీహెచ్ బ్రాంచీకి వచ్చిన కమలమ్మ అనే వృద్ధురాలికి ఇదే పరిస్థితి ఎదురైంది. దుండిగల్ మండలం బౌరంపేట్‌కు చెందిన ఆమె.. అందరికన్నా ముందే బ్యాంకుకు వచ్చింది. కానీ నగదు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో.. తల బాదుకుంటూ, రోదిస్తూ ఇంటిదారి పట్టింది. ఇలా పింఛన్ సొమ్ము అందక ఎందరో పండుటాకులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. వాస్తవానికి తొలుత పింఛన్ల సొమ్మును నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేసేవారు. తర్వాత ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘నగదు’ సమస్యల నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులకు కష్టాలు తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా?.. పాత పద్ధతిలో నేరుగా పింఛన్ సొమ్ము అందజేసేందుకు ఏర్పాట్లు చేయలేదా..? -
ఒక్కో చోట తంతు
సాక్షి, నల్లగొండ : జిల్లాలో బ్యాంకర్ల అలసత్వం కొనసాగుతూనే ఉంది. మూడు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో బ్యాంకులు మూతపడగా.. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు తెరచిన నాడైనా ప్రజానీకానికి ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాల్సిన బ్యాంకర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు వ్యాపార వర్గాలకు దొంగ దారిన ఇస్తున్నారని ఇంటెలిజెన్స్, సీబీఐ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా.. సామాన్య జనాన్ని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా మంగళవారంజిల్లాలో బ్యాంకర్లు ప్రాంతానికో రీతిలో, బ్యాంకుకో విధంగా వ్యవహరించారు. అకౌంట్ ఉన్న ప్రతి ఖాతాదారుడికి రూ.4వేలు రోజుకు కచ్చితంగా ఇవ్వాలన్న నిబంధనను కేంద్రమే విధించినా.. డబ్బులు లేవన్న సాకుతో దాన్ని రూ.2వేల వరకు కుదించారు. చాలాచోట్ల బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు పెట్టారు. టోకెన్లు ఇచ్చిన తర్వాత డబ్బులు లేవని చెప్పి పంపించేయడం వంటి ఘటనలు సైతం చోటుచేసుకోవడంతో పలు ప్రాంతాల ప్రజలు ఆగ్రాహావేశాలు వ్యక్తం చేశారు. ఉదయం 8 నుంచి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డా, సాయంత్రం వరకు ఎదురు చూసినా.. కావాల్సినంత డబ్బులు రాకపోవడంతో ఖాతాదారులు చేసేదేమీ లేక నిరాశగా వెళ్లిపోవాల్సి వచ్చింది. జిల్లాలో అధిక ప్రాంతాల్లో ఏటీఎంలు ఇంకా తెరచుకోలేదు. అక్కడక్కడా నాలుగైదు ఏటీఎం కేంద్రాలు తెరచినా, గంట సమయంలోనే డబ్బులు నిండుకున్నాయి. జిల్లాలోని మంగళవారం నాటి పరిస్థితి.. మునుగోడు : నియోజకవర్గ వ్యాప్తంగా బ్యాంకుల వద్ద జనం బారులుదీరారు. చౌటుప్పల్‌లో బ్యాంకులకు జనం పెద్ద ఎత్తున రావడంతో తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చండూరులో రెండు బ్యాంకుల్లో మినహా ఇతర బ్యాంకుల వద్ద నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. మర్రిగూడలో రూ.4వేల నుంచి రూ.6వేల వరకు ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 31 ఏటీఎంలు పనిచేయలేదు. నాగార్జునసాగర్ : నియోజకవర్గంలో కూడా అన్ని బ్యాంకుల వద్ద డబ్బుల కోసం ప్రజలు క్యూ కట్టారు. త్రిపురారం మండల కేంద్రంలోని ఎస్బీహెచ్ వద్ద గంటల తరబడి క్యూలో నిల్చొన్న వారికి రూ.2వేలు ఇచ్చి పంపించారు. ఏపీజీవీబీలో మాత్రం ఖాతాదారులకు రూ. 4 వేలు అందించారు. హాలియా మండలంలోని ఎస్బీహెచ్లోé రూ. 4 వేలు ఇచ్చారు. 10 రూపాయల నాణేలు కావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రాబ్యాంకులో ప్రజలకు రూ. 10 వేలు అందించారు. కార్పొరేషన్ బ్యాంకులో నోక్యాష్ బోర్డు పెట్టారు. గుర్రంపోడు మండలంలోని కొప్పోలు ఎస్బీఐలో కూడా అదే పరిస్థితి కనిపించింది. గుర్రంపోడు ఏపీజీవీబీలో రూ.2వేలే ఇచ్చారు. పెద్దవూర మండలంలోని ఆంధ్రా బ్యాంకులో ముందుగానే 300 మంది ఖాతాదారులకు టోకెన్లు ఇచ్చి ఒక్కొకరికీ రూ. 10 వేల చొప్పున డబ్బులు అందించారు. ఏపీజీవీబీలో రూ. 2వేల చొప్పున అందించారు. సాగర్‌లో ఎస్బీహెచ్, కెనరా బ్యాంకులో ఖాతాదారులకు రూ. 2 వేల చొప్పున నగదును ఇచ్చారు. నిడమనూరు మండలంలోని ఏపీజీవీబీ బ్యాంకులో రూ. 3 వేలు, సెంట్రల్ బ్యాంకులో రూ. 4 వేలు, ఆంధ్రాబ్యాంకులో రూ. 5 వేల చొప్పున ప్రజలకు అందించారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఏటీఎం సెంటర్లలో నోమనీ బోర్డులే కనిపించాయి. మిర్యాలగూడ : పట్టణంలో బ్యాంకుల వద్ద పెద్ద బారులు కనిపించాయి. పట్టణంలో ఒక్క హెచ్డీఎఫ్సీ ఏటీఎం మాత్రమే తెరిచి ఉంది. మాడ్గులపల్లిలోని ఎపీజీవీబీలో నోక్యాష్ బోర్డు పెట్టారు. వేములపల్లిలోని నాగార్జున గ్రామీణ బ్యాంకు, ఎస్బీహెచ్లో భారీగా జనం బారులుదీరారు.అక్కడ రూ.2 నుంచి రూ.4వేలు మాత్రమే ఇచ్చారు. మిర్యాలగూడలోని ఎస్బీఐలో రూ.2 వేల నుంచి రూ.24వేల వరకు ఇచ్చారు. అవంతీపురంలోని సిండికేట్ బ్యాంకులో 15 రోజులుగా డబ్బులు లేకపోవడం వల్ల ఖాతాదారులు వచ్చి వెళ్లిపోతున్నారు. నకిరేకల్ : నియోజకవర్గంలో బ్యాంక్‌లు తెరవకముందే ఉదయం నుంచే బారులుదీరారు. నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, చిట్యాల, నార్కట్‌పల్లి, శాలిగౌరారం మండలాలలోని ఆయా బ్యాంక్‌ల వద్ద ప్రజలు కిక్కిరిసిపోయారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో నో క్యాష్ బోర్డులు కనిపించాయి. నకిరేకల్‌లో ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంక్లలో రూ.6వేలు లోపు మాత్రం నగదు చేతికి ఇచ్చారు. ఎస్బీఐలో ఖాతాదారులకు 150 టోకెన్లు ఇచ్చినప్పటికీ.. నగదు రాకపోవడంతో వెనక్కు పంపించారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల బ్యాంక్‌లో రూ.2వేలు ఇచ్చారు. కట్టంగూరు, ఈదులూరు గ్రామీణ వికాస బ్యాంక్‌ల ముందు పొదస్తమానం పడిగాపులు కాసినా నోక్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. కేతేపల్లి మండలంలో గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున 100 మందికి రూ.4 లక్షలు ఇచ్చారు. శాలిగౌరారం మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎస్‌బిహెచ్‌లో డబ్బులు రాకపోవడంతో నో క్యాష్ బోర్డులు పెట్టారు. చిట్యాల మండలంలో ఒకరికి నాలుగు వేల కంటె ఎక్కువ ఇవ్వలేదు. నార్కట్‌పల్లి మండలంలో ఎస్బీహెచ్, ఎస్బీఐలో మాత్రం రూ.5వేలు ఇచ్చారు. మిగతా బ్యాంక్‌లలో రూ.2వేలు చొప్పున ఇచ్చారు. నల్లగొండ : నగదు కోసం పట్టణ ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పట్టణంలోని ఒక్క ఏటీఎంలో మాత్రమే డబ్బులు పెట్టారు. అవి మధ్యాహ్నం వరకు అయిపోయాయి. కొన్ని బ్యాంకుల్లో రూ.6వేలు, రూ. 10వేలు ఇచ్చారు. కనగల్, తిప్పర్తి, నల్లగొండ మండలాల్లోని డబ్బుల కోసం ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా మండలాల్లో నాలుగు రోజులుగా తెరచుకోని ఏటీఎంలు మంగళవారం మాత్రం తెరచుకున్నాయి. దేవరకొండ : నియోజకవర్గంలో 17 ఏటీఎంలు ఉండగా ఇందులో మంగళవారం దేవరకొండ, కొండమల్లేపల్లిలోని మూడు ఏటీఎంలు మాత్రం పనిచేశాయి. మిగతా ఎక్కడా ఏటీఎంలు పని చేసిన దాఖలాలు లేవు. పీఏపల్లి మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకు వద్ద డబ్బుల కోసం వచ్చిన ఓ మహిళ గంటల తరబడి క్యూలో నిల్చొంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి కిందపడగా.. క్యూలో ఉన్న వారు ఆమెకు సపర్యలు చేశారు. -
వేతన జీవులు విలవిల..
సాక్షి, సిటీబ్యూరో: నెల నెలా జీతం డబ్బులు చేతికందితే తప్ప బతుకుబండి ముందుకు సాగని వేతన జీవులకు కరెన్సీ కొరత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. బ్యాంకుల్లోంచి తగినంత నగదు డ్రా చేసేందుకు అవకాశం లేక, ఏటీఎంలలో డబ్బుల్లేక ప్రజలు కరెన్సీ కష్టాలను అనుభవిస్తున్నారు. నగరంలో తెరిచి ఉన్న ఏటీఎంల వద్ద ఫర్లాంగుల కొద్దీ క్యూలే దర్శనమిస్తున్నాయి. మరోవైపు నూటికి తొంభై శాతం ఏటీఎంలు ‘నో క్యాష్ ’ బోర్డులతోనే కనిపిస్తున్నాయి. ప్రతి నెలా మొదటి వారంలోనే జీతాలు అందుకొని ఇంటి అద్దెలు, పాలు, పేపర్, పిల్లల ఫీజులు, నిత్యావసరవస్తువులు, ఆటోచార్జీలు, వంటగ్యాస్, బస్‌పాస్‌లు వంటివి తెచ్చుకొనే సగటు నగర జీవి ప్రతి రూపాయి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. సోమవారం కూడా నగరంలో ఇదే పరిస్థితి నెలకొంది. నగరమతటా నోటు కష్టాలే కనిపించాయి. వారానికి రూ.24 వేలు చెల్లిస్తాయన్న బ్యాంకులు రూ. 3 వేల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. దీంతో అవసరాలకు డబ్బుల్లేక ఏటీఎంలను ఆశ్రయిస్తే గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మొదటి తారీఖు దాటి రెండు వారాలు కావస్తున్నా ఇంటి కిరాయీలు చెల్లించకపోవడంతో ఓనర్ల నుంచి ఒత్తిళ్లు తప్పడం లేదు. బియ్యం, పప్పులు, వంటనూనెలు, తదితర అవసరాల కోసం, ఇతరత్రా ఖర్చుల కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తుందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏ ఇద్దరి నోట విన్నా నోటు కష్టాలే వినిపిస్తున్నాయి. నలుగురు కలిసిన చోట నోట్ల బాధలే ఏకరువు పెడుతున్నారు. ఆకస్మాత్తుగా ఏటీఎంల మూత... మరోవైపు ఎంతో ఆశగా ఏటీఎంల వద్ద పడిగాపులు కాసేవాళ్లకు ఒకవైపు తాము లైన్లో నించొని ఉండగానే ఏటీఎంలలో డబ్బులు ఖాళీ అయిపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఉస్సూరంటూ వెనుదిరగాల్సి వస్తోంది.తెల్లవారు జామున, అర్దరాత్రి పూట కూడా జనం ఏటీఎంల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. నగరంలోని సికింద్రాబాద్, ఆబిడ్స్,కోఠి, దిల్సుఖ్నగర్, ఉప్పల్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పని చేయని ఏటీఎంలు, ఉన్న చోట భారీ క్యూలైన్లు, బ్యాంకుల్లో తగినన్ని డబ్బులు చేతికందక వెనుదిరిగే వచ్చే ఖాతాదారులు కనిపిస్తున్నారు. నోట్ల రద్దు అనంతరం నెలకొన్న కష్టాలు, బాధలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. -
నోక్యాష్ బోర్డులు.. తెరుచుకోని ఏటీఎంలు
నగదు కొరతతో ఉక్కిరిబిక్కిరి - డిపాజిట్లు రూ.5వేల కోట్లు.. జిల్లాకు వచ్చిన కొత్త కరెన్సీ రూ.760 కోట్లే - ఆన్లైన్ లావాదేవీలకు అన్నీ సమస్యలే కర్నూలు(అగ్రికల్చర్): నగదు కొరత అన్ని వర్గాల ప్రజలను ఉక్కిరి, బిక్కిరి చేస్తోంది. నగదు రహిత లావాదేవీలపై అవగాహన లేక ఉద్యోగ, వ్యాపార వర్గాలే అల్లాడిపోతుంటే.. గ్రామీణ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 20 రోజులుగా ఆన్లైన్ లావాదేవీలపై జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు దక్కని పరిస్థితి. అనేక మందికి ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు లేకపోవడం, ఉన్నా వాటికి ఆన్లైన్ సదుపాయం లేకపోవడంతో నగదు రహిత లావాదేవీలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇకపోతే మంగళవారం జిల్లాలో దాదాపు ఏ బ్యాంకులోనూ నగదు లేకపోవడంతో లావాదేవీలు స్తంభించాయి. నగదు కొరత కారణంగా ఇప్పటికీ వందలాది మంది ఉద్యోగులు నవంబర్ నెల జీతంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రోజూ జీతంలో కనీసం రూ.10వేలు తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్తున్నా నో క్యాష్ బోర్డులు కనిపిస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర అర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. కలెక్టరేట్లోని ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచ్‌లో మంగళవారం నో క్యాష్ బోర్డు పెట్టడం ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. బ్యాంకుల్లో డబ్బుల్లేవ్.. ఏటీఎంల మూత పెద్దనోట్ల రద్దు తర్వాత జిల్లాకు వచ్చిన కొత్త కరెన్సీ కేవలం రూ.760 కోట్లు మాత్రమే. రద్దయిన పెద్దనోట్లు మాత్రం బ్యాంకులకు డిపాజిట్లుగా రూ.5వేల కోట్లకు పైగా వచ్చాయి. రద్దయిన కరెన్సీని అన్ని బ్యాంకులు ఆర్బీఐకి పంపుతాయి. అక్కడి నుంచి అంతే మొత్తంలో కరెన్సీ రావాలి. కానీ 20 శాతం కూడా జిల్లాకు కొత్త కరెన్సీ రాకపోవడంతో నగదు కొరత తీవ్రమైంది. జిల్లాలో ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకు సహా ఎక్కడా డబ్బులేని పరిస్థితి. కెనరా బ్యాంకు, ఏపీజీబీ, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తదితర బ్యాంకులు నగదు లేక సంక్షోభంలో పడ్డాయి. మామూలుగా అయితే బ్యాంకుల్లో రూ.100 కోట్లకు పైగా నగదు ఉండాలి. అలాంటిది జిల్లాలోని 445 బ్రాంచ్‌ల్లో రూ.10కోట్లు కూడా లేకపోవడం గమనార్హం. కొన్ని బ్యాంకుల్లో ఖాతాదారులకు రూ.4వేల వరకు నగదు చెల్లిస్తుండగా.. పలు బ్యాంకులు నోక్యాష్ బోర్డులతో సరిపెడుతున్నాయి. జిల్లాలో 485 ఏటీఎంలు ఉండగా 95 శాతం మూతపడ్డాయి. గతంలో ఎప్పుడూ మూతపడని ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలు పూర్తిగా మూతేశారు. ఎస్ఐబీ ఏటీఎంలు జిల్లా వ్యాప్తంగా ఐదురు మాత్రమే సేవలందిస్తున్నాయి. ఆన్లైన్ సదుపాయం లేక.. నగదు కొరత నేపథ్యంలో ఆన్లైన్ లావాదేవీలకు ప్రాధాన్యత ఏర్పడింది. నేడు జిల్లా యంత్రాంగం అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి దీనిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది. కానీ బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ సదుపాయం లేకపోవడంతో ఇది అమలు కావడం కష్టంగా మారింది. జిల్లాలో జన్‌ధన్ ఖాతాలు 6.93 లక్షలు, ఎస్బీ ఖాతాలు 40లక్షలకు పైగా ఉన్నా 50 శాతం ఖాతాలకు కూడా అన్లైన్ సదుపాయం లేదు. ఇందువల్ల నగదు రహిత లావాదేవీలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. -
కాసులకు కటకట
- ఎక్కడ చూసినా ‘నోక్యాష్’ – 450 బ్యాంకు శాఖలకు రూ.20 కోట్ల కేటాయింపుతో అవస్థలు – ఏటీఎంల పరిస్థితి ఘోరం – జిల్లా వ్యాప్తంగా చాలా బ్యాంకు శాఖల్లో నిలిచిపోయిన విత్‌డ్రాలు అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రోజులు గడుస్తున్నా కరెన్సీ సమస్య మాత్రం తీరడం లేదు. 28వ రోజు మంగళవారం కూడా అన్ని వర్గాల పరిస్థితి దయనీయంగా కన్పించింది. చాలా బ్యాంకుల వద్ద 'నోక్యాష్' 'క్యాష్‌నిల్' బోర్డులు దర్శనమిచ్చాయి. జిల్లా కేంద్రంలోనే ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్, ఏపీజీబీ లాంటి ప్రధాన బ్యాంకులకు చెందిన కొన్ని శాఖల్లో 'నో క్యాష్' బోర్డులు కనిపించడం గమనార్హం. ఇక మండల, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించిన బ్యాంకులు పరిమితంగానే కన్పించాయి. నగదు లేక కొన్ని బ్యాంకులు మధ్యాహ్నం వరకు పనిచేయగా... ఆలస్యంగా సరఫరా కావడంతో మరికొన్ని బ్యాంకులు మధ్యాహ్నం తర్వాత సేవలు కొనసాగించాయి. జిల్లా వ్యాప్తంగా 34 ప్రిన్సిపల్ బ్యాంకులు, వాటి పరిధిలో ఉన్న 450 శాఖలకు కేవలం రూ.20 కోట్లు (అన్నీ రూ.2 వేల నోట్లు) కేటాయించడంతో సర్దుబాట్లు కూడా సాధ్యం కావడం లేదని బ్యాంకర్లు తెలిపారు. ఎక్కువ అకౌంట్లు కలిగిన ఎస్బీఐ, ఏపీజీబీ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ , కెనరా లాంటి ప్రధాన బ్యాంకుల్లో క్యూలైన్లు కనిపించాయి. విత్‌డ్రాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరినా చాలా మందికి నగదు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మరీ అత్యవసరమైన వారు, సిఫారసులున్న వారికే రూ.10 వేలు లేదా గరిష్టంగా రూ.14 వేల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో రోజుకు కనీసం రూ.90 కోట్లు కేటాయిస్తే అందరికీ కొంత వరకు నగదు ఇవ్వడానికి సాధ్యమవుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఏ రోజు కూడా ఈ స్థాయిలో నగదు సరఫరా కావడం లేదు. బ్యాంకు కౌంటర్లలో విత్‌డ్రాలకే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో ఏటీఎంలను జనం పూర్తిగా మరచిపోయారు. 556 ఏటీఎంలకు గానూ మంగళవారం 13 మాత్రమే పనిచేశాయి. రోడ్డెక్కుతున్న ప్రజలు తలుపుల/అమరాపురం : కరెన్సీ కష్టాలు అధికం కావడంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. మంగళవారం తలుపుల మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదుట ఖాతాదారులు, మహిళలు ధర్నా చేశారు. వీరికి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శంకర,యూత్ కన్వీనర్ ఉత్తారెడ్డి,రైతు సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రమణ మద్దతు పలికారు. అలాగే అమరాపురం సిండికేట్ బ్యాంకు ఎదుట పెన్షనర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ పెన్షన్ ఖాతాలో డబ్బు జమ అయ్యిందని, అయితే బ్యాంకు వద్దకు వస్తే నోక్యాష్ బోర్డు దర్శనమిస్తోందని వారు వాపోయారు. కంబదూరు స్టేట్‌బ్యాంక్ ఎదుట కూడా పింఛన్‌దారులు ధర్నా చేపట్టారు. -
రాష్ట్రంలో నో క్యాష్
► కొనసాగుతున్న నగదు సంక్షోభం.. ఆదివారం భారీగా పెళ్లిళ్లు ► డబ్బుల్లేక పెళ్లివారికి కటకట.. మొండిచేయి చూపుతున్న బ్యాంకులు సాక్షి, హైదరాబాద్: నగదు కొరతతో రాష్ట్రం అల్లాడుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అందరి నోటా డబ్బు మాటే. పట్టుమని పది రూపాయలు కూడా లేని దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నా రు. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం, అందులో పదో వంతు కూడా కొత్త నోట్లను ముద్రించకపోవడంతో సంక్షోభం తీవ్రరూపు దాల్చింది. దాంతో... జీతాలందుకునే ఒకటో తేదీ నాటికై నా బ్యాంకుల నుంచి ఆశించిన మేర నగదు అందుకోవచ్చని భావించిన ప్రజానీకం నిరాశలో మునిగిపోరుుంది. నగ దు కొరత సమస్య తగ్గుతుందని, సజావుగా బేరాలు నడుస్తాయని ఆశపడ్డ లక్షలాది మంది చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడి 23 రోజులు గడిచినా తమ కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆది వారం రాష్ట్రంలో భారీగా వివాహ శుభకార్యా లున్నాయి . ఖర్చుల నిమిత్తం డబ్బుల కోసం వెళ్లిన వారికి బ్యాంకులు అక్షరాలా చుక్కలు చూపిస్తున్నాయి . రోజంతా కూర్చోపెట్టి, చివరికి ఏ సాయంత్రానికో రూ.50 వేలు ఇచ్చి పంపుతున్నాయి . పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరుపుకునే వారికి రూ.2.5 లక్షలు ఇస్తామన్న కేంద్రం హామీ నీటిమూటే అయి ంది. గురువారం జీతాలు ఖాతాల్లో పడ్డా, తెలంగాణలో 80 శాతం బ్యాంకుల్లో డబ్బుల్లేవన్న బోర్డులే దర్శనమిచ్చాయి . ప్రభుత్వోద్యోగులకు రూ.10 వేల నగదు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్న బ్యాంకులు ఎక్కడా అలా ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్క స్టేట్ బ్యాంక్ అఫ్ హైదరాబాద్ మాత్రం తన కొన్ని శాఖల్లో తొలి గంటపాటు మాత్రం ఉద్యోగులకు రూ.10 వేలు ఇచ్చి సరిపెట్టింది. పలు బ్యాంకుల్లో తమ వేతన ఖాతాదారులకు రూ.5 వేలు ఇచ్చేందుకు ప్రయత్నించినా, తమ సంగతేమిటంటూ ఇతర ఖాతా దారులు గొడవకు దిగడంతో గందరగోళం నెలకొంది. వేసింది రూ.40 వేల కోట్లు.. ఇచ్చింది రూ.1200 కోట్లే పెద్ద నోట్లు రద్దు తరువాత బ్యాంకుల్లో రూ.40 వేల కోట్ల డిపాజిట్లు జరిగాయి . కానీ రిజర్వుబ్యాంక్ నుంచి వచ్చిన నగదు మాత్రం కేవలం రూ.1,200 కోట్లు. దాంతో నగదుకు తీవ్ర కటకట ఏర్పడింది. తెలంగాణలో రోజుకు వేల కోట్ల రూపాయల మేర వ్యాపారాలు నిలిచిపోయాయి . గ్రామీణ ప్రాంతాల్లోనైతే బ్యాంకుల్లో నవంబర్ నెలాఖరు నాటికి రూ.11 వేల కోట్లు జమయి తే, బ్యాంకులు జారీ చేసింది కేవలం రూ.500 కోట్లు! ఇది కూడా పెద్ద నోట్లు రద్దయిన తొలి మూడు రోజుల్లో ఇచ్చిన మొత్తమే. నవంబర్ 15 నుంచి గ్రామీణ ప్రాంత బ్యాంకులకు చాలాచోట్ల పైసా నగదు కూడా అందలేదు. దాంతో వచ్చిన మొత్తాలను డిపాజిట్ చేసుకోవడం మినహా ఆ బ్యాంకుల సిబ్బందికి పని కూడా లేకుండా పోయింది. నగదు కోసం వస్తున్న వారికి సమాధానం చెప్పలేక వారు సతమతమవుతున్నారు. -
నూటొక్క కష్టాలు
- ఏ బ్యాంకుకెళ్లినా ‘నో క్యాష్’ -దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్న ఏటీఎంలు -ఒకటీ అరా పనిచేస్తున్నా..గంటలోపే నగదు ఖాళీ - ‘ఒకటో తారీఖు’ వచ్చేయడంతో జనం కష్టాలు రెట్టింపు! -పాల బిల్లు మొదలు.. ప్రతిదానికీ అవస్థే అనంతపురం అగ్రికల్చర్ : కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. పైగా మరింత ఎక్కువయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. పెద్దనోట్లు రద్దు చేసి 22 రోజులు పూర్తయినా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ‘ఒకటో తారీఖు’ కూడా వచ్చేయడంతో పాల బిల్లు మొదలు..ప్రతిదానికీ అవస్థలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. మొదటి వారమంతా ఉద్యోగుల జీతాలు, ప్రజల కమిట్మెంట్ల హడావుడి ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా వస్తే తమ పరిస్థితి ఏంటని బ్యాంకర్లు భయపడుతున్నారు. బుధవారం కూడా జిల్లాలో చాలా బ్యాంకుల గేట్లు వద్ద 'నోక్యాష్' బోర్డులు దర్శనమిచ్చాయి. అనంతపురం నగరం, ప్రధాన పట్టణాల్లోనే పరిస్థితి ఇబ్బందికరంగా కన్పించింది. ఇక మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు శాఖల్లో దారుణ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. వారం రోజులుగా తిరుగుతున్నా డబ్బు ఇవ్వలేదన్న ఆక్రోశంతో కూడేరులో ఎస్బీఐ ఖాతాదారులు రాస్తారోకో చేపట్టారు. ఎస్బీఐ, సిండికేట్, ఆంధ్రా, కెనరా, ఏపీజీబీ, కార్పొరేషన్ లాంటి ప్రధాన బ్యాంకుల్లోనే అరకొరగా నగదు పంపిణీ చేశారు. అందులోనూ కొన్ని శాఖల్లో నోక్యాష్ బోర్డులు పెట్టారు. ఇక చిన్నాచితక బ్యాంకులకు వెళ్లిన ఖాతాదారులు నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. అనంతపురంలోని ఎస్బీఐ ప్రధానశాఖలో బుధవారం రద్దీ ఎక్కువగా కనిపించింది. గురువారం ఉదయానికి రూ.20 కోట్ల వరకు నగదు సరఫరా కానుండడంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు రెండు, మూడు రోజుల పాటు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) ఎంవీఆర్ మురళీకృష్ణ తెలిపారు. ఇబ్బందులను అధిగమించడానికి స్వైప్ మిషన్లు, ఎస్బీఐ 'బడ్డీ' యాప్ లాంటి నగదు రహిత లావాదేవీలపై అన్ని వర్గాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎనీ టైం మూత ఏటీఎంల పరిస్థితి ఏ మాత్రమూ మెరుగుపడలేదు. జిల్లా అంతటా 100 లోపు ఏటీఎంలు మాత్రమే పాక్షికంగా పనిచేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. అందులో కూడా రూ.2 వేల నోట్లు పెట్టడం, తెరిచిన రెండు గంటల్లోపే మూతబడటంతో ప్రజలకు నిరాశ తప్పలేదు. రూ.500 నోట్లు పరిమితంగా వచ్చాయి. దీంతో నాలుగైదు బ్యాంకుల్లో మినహా ఇంకా పంపిణీ చేయలేదు. గురువారం నుంచి మొదలుపెట్టనున్నట్లు పలువురు బ్యాంకర్లు తెలిపారు. రూ.20, రూ.50, రూ.100 నోట్ల కొరత ఎక్కువగా ఉండటంతో చిల్లర సమస్య తగ్గడం లేదు. గత రెండు రోజుల్లోనే రూ.110 కోట్లు అన్ని బ్యాంకులకు సరఫరా చేసినా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ (ఎల్డీఎం) జయశంకర్ తెలిపారు. బుధవారం ఏపీజీబీ పరిధిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా కొంతవరకు డబ్బు సర్దుబాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ ఎల్.జయసింహారెడ్డి చెప్పారు. ఆంధ్రాబ్యాంకు పరిధిలో నగదు కొరత కారణంగా అవస్థలు పడ్డామని బ్యాంకు సీనియర్ మేనేజర్ అమ్మయ్య తెలిపారు. -
చేతిలో చిల్లిగవ్వ లేదు ఏటీఎంలో మనీ లేదు
-
ప్రాణం తీసిన ‘నో క్యాష్’
-
ప్రాణం తీసిన ‘నో క్యాష్’
బ్యాంకులోనే కుప్పకూలిన వృద్ధుడు నందికొట్కూరు: నగదు కోసం బ్యాంక్‌కు వెళ్లి గుండెపోటుతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా నంది కొట్కూరులో చోటు చేసుకుం ది. పట్టణంలోని మద్దూరు సుబ్బారెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న బాలరాజు(65) వెటర్నరీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసి 2010లో పదవీ విరమణ ఛేశాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమా రులు. రెండవ కోడలు ఇటీవల డెలివరీ అయిన నేపథ్యంలో డబ్బు అవసరమై ఐదు రోజులుగా నగదు కోసం స్థానిక ఎస్బీఐ చుట్టూ తిరుగుతున్నాడు. రోజూ క్యూలో నిల్చోవడం.. డబ్బు లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో వెనుదిరగడం జరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకే బ్యాంకుకు చేరుకుని క్యూలో నిల్చోగా కౌంటర్ వద్దకు చేరుకునే లోపు బ్యాంకు అధికారులు నో క్యాష్ అని చెప్పడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. -
నో క్యాష్!
‘‘చేతి ఖర్చుల కోసం డబ్బు డ్రా చేసుకుందామని ఏటీఎంకు వెళితే చాంతాడంత క్యూ ఉంది. సరే అని వరుసలో నిలబడితే నా దగ్గరికి వచ్చే సరికి ఏటీఎం ఖాళీ. ఇక బ్యాంకుకై నా వెళదామని వెళితే అక్కడ ‘నో క్యాష్’ అన్న సమాధానం..’’ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి మంగళవారం ఎదురైన అనుభవం ఇది,, సాక్షి, కామారెడ్డి : బ్యాంకుల్లో డబ్బుల్లేవు.. ఏటీఎంలలో డబ్బుల్లేవు.. ఏం చేయాలో తోచక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో గడచిన పన్నెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు నిత్యం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. తమ వద్ద ఉన్న పాత నోట్లను ఖాతాల్లో జమ చేయడంతో పాటు, మార్పిడి కోసం మంగళవారం కూడా బారులు తీరారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంల వద్దకు వెళితే అక్కడ డబ్బులు ఉండడం లేదు. బ్యాంకుల్లోనూ డబ్బులు లేవని తెలిసి మరింత ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో బ్యాంకుకు వచ్చిన వారు ఉత్తి చేతులతో ఉసురోమంటూ ఇంటిముఖం పట్టారు. బ్యాంకుల్లోనే ఈ పరిస్థితి ఉంటే ఏటీఎంల సంగతి వేరే చెప్పనక్కర్లేదు.. డబ్బులు నింపకముందే బారులు.. ఏటీఎంలలో డబ్బులు నింపుతున్నారని తెలిస్తే చాలు అక్కడికి వందల సంఖ్యలో జనం తరలివచ్చి బారులు తీరుతున్నారు. స్టేట్ బ్యాంకుకు చెందిన పలు ఏటీఎంల వద్ద నిత్యం రద్దీ కనిపిస్తోంది. ఉదయం ఉంచి రాత్రి దాకా ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసుకోవడానికి జనం వస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు లేవని తెలిస్తే వెనక్కు వెళ్లడం, డబ్బులు వస్తాయని తెలిస్తే లైనులో నిలుచోవడం జరుగుతోంది. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
నోట్ల పాట్లు..
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు..‘నో క్యాష్’ బోర్డులు చూసి జనం ఆందోళనలు..పోలీసు బందోబస్తు మధ్య బ్యాంకుల లావాదేవీలు..వెరసి సోమవారం నగరంలో కరెన్సీ కష్టాలు కొనసాగారుు. జనం గంటలతరబడి బ్యాంకుల వద్దే గడపాల్సి వచ్చింది. చాలా చోట్ల క్యాష్ అరుుపోవడంతో జనం తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. - సాక్షి, సిటీబ్యూరో -
కళ తప్పిన కార్తీకం
మార్కెట్లు వెలవెల సామాన్యులకు ‘చిల్లర’ సమస్యలు గిరాకీ లేక వ్యాపారులూ సతమతం ఏటీఎంలలో నో క్యాష్..దిక్కుతోచని జనం సిటీబ్యూరో: కార్తీక పౌర్ణమి..అదీ సోమవారం రావడంతో వ్యాపారాలు బాగా జరుగుతాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. పెద్దనోట్ల రద్దు..చిల్లర సమస్యతో ‘కార్తీక మార్కెట్’ కళతప్పింది. సోమవారం నగరంలోని గుడిమల్కాపూర్, సుల్తాన్‌బజార్, బడిచౌడీ మార్కెట్, అబిడ్స, బేగంబజార్, సిద్దంబర్‌బజార్, మోండా మార్కెట్, జుమ్మెరాత్బజార్లలో పూలు, పూజా సామాగ్రి అమ్మకాలు సగం పడిపోయాయని తెలుస్తోంది. మరోవైపు చిల్లర సమస్య కారణంగా వ్యాపారులు కూడా చేసేదేమీ లేక ధరలను అమాంతం పెంచేశారు. ఓ పక్క నోట్ల రద్దు, మరో పక్క పూల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పూలను రూ. 400 కిలో చొప్పున వ్యాపారులు విక్రరుుంచారు. పలువురు వినియోగదారులు రూ.వెరుు్య(పాతవి),రూ. 2000 కొత్త నోట్లు తీసుకురావడంతో వారికి చిల్లర ఇవ్వలేక వ్యాపారస్తులు తిప్పి పంపారు. మరికొందరు చిల్లర కోసం రూ.వెరుు్యకి రూ.100 కమీషన్‌గా వసూలు చేశారు. కూరగాయల మార్కెట్లకు వచ్చేవారు రూ. 500 నోట్లు తెస్తుండడం.. వారు కొనుగోలు చేసేది రూ.20, రూ.50 మాత్రమే కావడంతో మిగతా మొత్తానికి చిల్లర ఇవ్వలేక సతమతమౌతున్నట్లు పలువురు వ్యాపారులు వాపోయారు. గత నాలుగు రోజుల నుండి వ్యాపారం సగం పడిపోరుుందని పలువురు చిల్లర వ్యాపారులు వెల్లడించారు. నోట్ల యాతన! పెద్ద నోట్ల రద్దు మహానగరంలో సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చివేసింది. బ్యాంకులకు సోమవారం సెలవుకావడం, ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వలు లేకపోవడంతో జనం నరకయాతన అనుభవించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పూలు, పండ్లు ఇతర నిత్యావసరాలకు మార్కెట్లకు పోటెత్తిన జనానికి చిల్లర కష్టాలు చుక్కలు చూపారుు. ప్రతి ఒక్కరూ రూ.500, రూ.వెరుు్య నోట్లతో తరలిరావడంతో వ్యాపారులు సైతం చేసేదిలేక చేతులెత్తేశారు. చిల్లర కష్టాలతో పలు మార్కెట్లలో కొనుగోళ్లు అమాంతం పడిపోయారుు. మరికొన్ని చోట్ల ఇదే అదనుగా వ్యాపారులు నిత్యావసరాల ధరలను పెంచేసి వినియోగదారులను నిలువుదోపిడీ చేశారు. మరికొందరు రూ.వెరుు్య నోటు మార్చితే రూ.900 మాత్రమే ముట్టజెప్పారు. రూ.100 కమీషన్‌గా నొక్కేయడంతో వినియోగదారులు చేసేది లేక వారు అడిగినంతా చెల్లించారు. గ్రేటర్‌పరిధిలో ఏడు వేల ఏటీఎం కేంద్రాలుండగా..సోమవారం రెండువేలు కూడా పనిచేయకపోవడం గమనార్హం. వాటిల్లోనూ నగదు నిల్వచేసిన గంట లోపే నిండుకోవడంతో భారీ క్యూలైన్లలో నిల్చున్న వారు సొమ్మసిల్లారు. మహిళలు, వృద్ధులు, చంటిపిల్లలతో ఏటీఎం కేంద్రాలకు వచ్చిన వారికి నిరాశ తప్పలేదు. పలు ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు, ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిచ్చారుు. పలు ఏటీఎంలలో మధ్యాహ్నం వేళకే నగదు అరుుపోరుుంది. దీంతో చాలా మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండానే వెనుదిరిగారు. కేంద్ర ప్రభుత్వం ఏటీఎంల నుంచి తీసుకునే డబ్బు పరిమితి పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ‘కొత్త’ చిక్కులు... గత నాలుగురోజులుగా బ్యాంకుల నుంచి రూ.2 వేల నోట్లు పొందిన వినియోగదారులకు..ఆ సంబురం సోమవారం ఆవిరైంది. ఈ నోట్లతో కూరగాయలు, పాలు, పండ్లు, పూలు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బహిరంగ మార్కెట్లో అడుగుపెట్టిన వారికి తిప్పలు తప్పలేదు. రూ.500కే చిల్లర ఇవ్వలేమని..అదీ రూ.2 వేల నోట్లకు ఎలా చిల్లర ఇవ్వగలమంటూ పలువురు వ్యాపారులు చేతులెత్తేయడంతో ఈ నోట్లుకూడా అలంకార ప్రాయంగా మారాయని పలువురు వినియోగదారులు వాపోయారు. రైతుబజార్లు, మార్కెట్లలో ప్రత్యేకంగా చిల్లరకు కౌంటర్లు ఎర్పాటు చేయాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.