కళ తప్పిన కార్తీకం
మార్కెట్లు వెలవెల
సామాన్యులకు ‘చిల్లర’ సమస్యలు
గిరాకీ లేక వ్యాపారులూ సతమతం
ఏటీఎంలలో నో క్యాష్..దిక్కుతోచని జనం
సిటీబ్యూరో: కార్తీక పౌర్ణమి..అదీ సోమవారం రావడంతో వ్యాపారాలు బాగా జరుగుతాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. పెద్దనోట్ల రద్దు..చిల్లర సమస్యతో ‘కార్తీక మార్కెట్’ కళతప్పింది. సోమవారం నగరంలోని గుడిమల్కాపూర్, సుల్తాన్‌బజార్, బడిచౌడీ మార్కెట్, అబిడ్‌స, బేగంబజార్, సిద్దంబర్‌బజార్, మోండా మార్కెట్, జుమ్మెరాత్‌బజార్‌లలో పూలు, పూజా సామాగ్రి అమ్మకాలు సగం పడిపోయాయని తెలుస్తోంది.
మరోవైపు చిల్లర సమస్య కారణంగా వ్యాపారులు కూడా చేసేదేమీ లేక ధరలను అమాంతం పెంచేశారు. ఓ పక్క నోట్ల రద్దు, మరో పక్క పూల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పూలను రూ. 400 కిలో చొప్పున వ్యాపారులు విక్రరుుంచారు. పలువురు వినియోగదారులు రూ.వెరుు్య(పాతవి),రూ. 2000 కొత్త నోట్లు తీసుకురావడంతో వారికి చిల్లర ఇవ్వలేక వ్యాపారస్తులు తిప్పి పంపారు. మరికొందరు చిల్లర కోసం రూ.వెరుు్యకి రూ.100 కమీషన్‌గా వసూలు చేశారు. కూరగాయల మార్కెట్లకు వచ్చేవారు రూ. 500 నోట్లు తెస్తుండడం.. వారు కొనుగోలు చేసేది రూ.20, రూ.50 మాత్రమే కావడంతో మిగతా మొత్తానికి చిల్లర ఇవ్వలేక సతమతమౌతున్నట్లు పలువురు వ్యాపారులు వాపోయారు. గత నాలుగు రోజుల నుండి వ్యాపారం సగం పడిపోరుుందని పలువురు చిల్లర వ్యాపారులు వెల్లడించారు.
నోట్ల యాతన!
పెద్ద నోట్ల రద్దు మహానగరంలో సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చివేసింది. బ్యాంకులకు సోమవారం సెలవుకావడం, ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వలు లేకపోవడంతో జనం నరకయాతన అనుభవించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పూలు, పండ్లు ఇతర నిత్యావసరాలకు మార్కెట్లకు పోటెత్తిన జనానికి చిల్లర కష్టాలు చుక్కలు చూపారుు. ప్రతి ఒక్కరూ రూ.500, రూ.వెరుు్య నోట్లతో తరలిరావడంతో వ్యాపారులు సైతం చేసేదిలేక చేతులెత్తేశారు. చిల్లర కష్టాలతో పలు మార్కెట్లలో కొనుగోళ్లు అమాంతం పడిపోయారుు. మరికొన్ని చోట్ల ఇదే అదనుగా వ్యాపారులు నిత్యావసరాల ధరలను పెంచేసి వినియోగదారులను నిలువుదోపిడీ చేశారు. మరికొందరు రూ.వెరుు్య నోటు మార్చితే రూ.900 మాత్రమే ముట్టజెప్పారు. రూ.100 కమీషన్‌గా నొక్కేయడంతో వినియోగదారులు చేసేది లేక వారు అడిగినంతా చెల్లించారు. గ్రేటర్‌పరిధిలో ఏడు వేల ఏటీఎం కేంద్రాలుండగా..సోమవారం రెండువేలు కూడా పనిచేయకపోవడం గమనార్హం. వాటిల్లోనూ నగదు నిల్వచేసిన గంట లోపే నిండుకోవడంతో భారీ క్యూలైన్లలో నిల్చున్న వారు సొమ్మసిల్లారు. మహిళలు, వృద్ధులు, చంటిపిల్లలతో ఏటీఎం కేంద్రాలకు వచ్చిన వారికి నిరాశ తప్పలేదు. పలు ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు, ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిచ్చారుు. పలు ఏటీఎంలలో మధ్యాహ్నం వేళకే నగదు అరుుపోరుుంది. దీంతో చాలా మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండానే వెనుదిరిగారు. కేంద్ర ప్రభుత్వం ఏటీఎంల నుంచి తీసుకునే డబ్బు పరిమితి పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
‘కొత్త’ చిక్కులు...
గత నాలుగురోజులుగా బ్యాంకుల నుంచి రూ.2 వేల నోట్లు పొందిన వినియోగదారులకు..ఆ సంబురం సోమవారం ఆవిరైంది. ఈ నోట్లతో కూరగాయలు, పాలు, పండ్లు, పూలు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బహిరంగ మార్కెట్‌లో అడుగుపెట్టిన వారికి తిప్పలు తప్పలేదు. రూ.500కే చిల్లర ఇవ్వలేమని..అదీ రూ.2 వేల నోట్లకు ఎలా చిల్లర ఇవ్వగలమంటూ పలువురు వ్యాపారులు చేతులెత్తేయడంతో ఈ నోట్లుకూడా అలంకార ప్రాయంగా మారాయని పలువురు వినియోగదారులు వాపోయారు. రైతుబజార్లు, మార్కెట్లలో ప్రత్యేకంగా చిల్లరకు కౌంటర్‌లు ఎర్పాటు చేయాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.