ATMs
-
ఏటీఎంల సంఖ్య కుదింపు!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ భారాన్ని తగ్గించుకొనే క్రమంలో ఏటీఎంల సంఖ్యను మరింతగా తగ్గించుకోవాలని రాష్ట్రంలోని బ్యాంకులు నిర్ణయించాయి. ఏడాది కాలంలో 5 శాతం ఏటీఎంలను తొలగించిన బ్యాంకులు... వచ్చే ఏడాదిలో మరో 10 శాతం వరకు ఏటీఎంలను తగ్గించుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 బ్యాంకులకు సంబంధించి ప్రస్తుతం 9,205 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. గతేడాది మార్చి నాటికి 9,660 ఏటీఎంలుండగా ఈ ఏడాది సెపె్టంబర్ నాటికి 455 ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేసినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకుల సమితి గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్ లావాదేవీలతో..: ఒక్కో ఏటీఎంపై నెలకు సగటున రూ. 2.5 లక్షల వరకు ప్రాథమికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని బ్యాంకులు చెబుతున్నాయి. ప్రతి 8 గంటలకు ఒక సెక్యూరిటీ గార్డు చొప్పున ముగ్గురు గార్డుల జీతాలు, ఏటీఎంను ఉంచే షాప్/షట్టర్ అద్దె, విద్యుత్ బిల్లుతోపాటు సాంకేతిక నిర్వహణ ఖర్చులు ఉంటున్నాయని వివరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా జరుగుతుండటం వల్ల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ తగ్గుతున్నట్లు బ్యాంకుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాష్ విత్‌డ్రాయల్స్ తక్కువగా ఉన్న ఏటీఎంలను బ్యాంకులు ఎత్తేస్తున్నాయి. ఇకపై కేవలం బ్రాంచి పరిధిలోనే వాటిని పరిమితం చేసేలా బ్యాంకులు ప్రణాళికను అమలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య 6 వేలకు పడిపోనుందని సమాచారం.పీఓఎస్‌ల జోరు... ఏటీఎంల సంఖ్యను ప్రాధాన్యత క్రమంలో తగ్గించాలని భావిస్తున్న బ్యాంకులు.. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్ల వాడకాన్ని మాత్రం ప్రోత్సహిస్తున్నాయి. వాటి ద్వారా బ్యాంకులకు అదనపు రాబడి ఉండటమే ప్రధాన కారణం. గతేడాది మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా 2,09,116 పీఓఎస్ మెషిన్లు ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య 2,74,602కు చేరింది. భవిష్యత్తులో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాయి. -
రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన!
రూ.2వేల నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో తెలియజేశారు. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వార్షిక నివేదికల ప్రకారం.. రూ.500, రూ.2,000 నోట్ల మొత్తం విలువ 2017 మార్చి చివరి నాటికి రూ.9.512 లక్షల కోట్లు. అదే 2022 మార్చి చివరి నాటికి రూ.27.057 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపకూడదని బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలు, కాలానుగుణ ధోరణి మొదలైన వాటి ఆధారంగా బ్యాంకులు అంచనా వేసి ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. కాగా రూ.2 వేల నోట్ల సర్క్యూలేషన్ పూర్తిగా తగ్గిపోయింది. పలు కారణాల చేత ఈ నోట్ల సర్క్యూలేషన్‌ను తగ్గించేసినట్టు తెలిసింది. ఆర్బీఐ గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క రూ.2000 కరెన్సీ నోటును కూడా ప్రింట్ చేయలేదు. ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2019లోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసినట్టు ఆర్బీఐ ఆ మధ్య తెలిపింది. అయితే అప్పటికే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. -
గోల్డ్ ఏటీఎంలూ వచ్చేస్తున్నాయ్
సనత్‌నగర్: నగదు విత్‌డ్రాయల్స్, జమకు ఉపయోగపడే ఏటీఎంల తరహాలోనే బంగారం కోసం కూడా ఏటీఎంలు దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. గోల్డ్ సిక్కా సంస్థ నెల, నెలన్నర వ్యవధిలో వీటిని ఏర్పాటు చేయనుంది. తొలుత హైదరాబాద్‌లో (చార్మినార్, సికింద్రాబాద్, అబిడ్స్) మూడు గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు సంస్థ సీఈవో ఎస్‌వై తరుజ్ గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వీటి నుంచి ఒకేసారి 0.5 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ బంగారాన్ని నాణేల రూపంలో కొనుగోలు చేయవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చని చెప్పారు. బంగారం స్వచ్ఛతకు సంబంధించిన వివరాలన్నింటితో ప్యూరిటీ సర్టిఫికెట్ కూడా కొనుగోలు సమయంలోనే పొందవచ్చని తరుజ్ వివరించారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన 5 కేజీల పసిడిని లోడ్ చేయవచ్చని తరుజ్ వివరించారు. భారత్‌లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చన్నారు. ప్రస్తు తం దుబాయ్, బ్రిటన్లలో మాత్రమే ఏటీఎంల ద్వారా 10 గ్రాములు, 20 గ్రాముల గోల్డ్ కాయిన్స్ ను కొనుగోలు చేసే సదుపాయం ఉందని చెప్పారు. -
కాయిన్ వేస్తే బియ్యం..
సాక్షి, బెంగళూరు: నగదు డ్రా చేసుకునే ఏటీఎం తరహాలో బియ్యం కోసం ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం బీపీఎల్ కార్డు కలిగిన వారికి ఉచితంగా, ఏపీఎల్ కార్డు కలిగిన వారికి నిర్ధిష్ట మొత్తంలో నగదు చెల్లించి బియ్యం, పప్పులు పొందే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. అయితే సరుకుల కోసం రేషన్ దుకాణాలు తెరిచే సమయానికి వెళ్లి గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ ఏ సమయంలోనైనా బియ్యం తీసుకునేలా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం ప్రపంచంలోని ఇండోనేసియా, వియత్నాం దేశాల్లో మాత్రమే అమలులో ఉంది. కరోనా నేపథ్యంలో వినియోగదారులు క్యూలో నిల్చోకుండా ఈ విధానాన్ని ఆయా దేశాల్లో అమలు చేస్తున్నారు. దీన్ని కర్ణాటకలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కె.గోపాలయ్య కూడా ఇటీవల ధ్రువీకరించారు. ఏటీఎం రైస్ వ్యవస్థపై చర్చ సాగుతోందని, ఈ కార్యక్రమ సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
పెన్షనర్లు, ఏటీఎంలకు కొత్త నియమాలు
సాక్షి, ముంబై: కరోనావైరస్ సంక్షోభం, దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో నేటి (మే 1 ) నుంచి పెన్షనర్లు, ఏటీఎం నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా పెన్షనర్లకు పూర్తి పేమెంట్ లభించనుంది. అలాగే ఏటీఎం వినియోగం ద్వారా యూజర్లకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని కఠిన నియమాలు పాటించాల్సి వుంటుంది. (ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి) చదవండి : కరోనా : అయ్యయ్యో మారుతి! పెన్షనర్లకు పూర్తి పెన్షన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి ఈ రోజు నుంచి పూర్తి స్థాయి పెన్షన్ లభించనుంది. దీంతో 6 లక్షల 30వేల మందికి పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఫలితంగా ప్రభుత్వానికి 1,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అలాగే కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి లాక్డౌన్ మధ్య సుమారు 6 లక్షల సంస్థలకు ఉపశమనం ఇస్తూ, ఒకేసారి బకాయిలు చెల్లించకుండా నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) రిటర్న్స్ దాఖలు చేయడానికి యజమానులకు అనుమతినిచ్చింది. ఏటీఎం కేంద్రాల శానిటైజేషన్ కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడానికి వీలుగా కొన్ని నిబంధనలను ఆయా బ్యాంకులు కచ్చితంగా పాటించాలి. ఏటీఎంలను రోజూ శుభ్రం చేయడంతోపాటు వినియోగించిన ప్రతీసారీ శానిటైజ్ చేయాలి. రోజుకు రెండు సార్లు ఏటీఎంలను శానిటైజర్‌తో క్లీన్ చేయాలి. మరీ ముఖ్యంగా హాట్‌స్పాట్స్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు ఈ నియమాలను విధిగా పాటించాలి. లేదంటే సదరు ఏటీఎంలను సీజ్ చేస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ , తమిళనాడు లోని చెన్నైలలో ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. -
లాక్డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట
సాక్షి, ముంబై: దేశంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మొబైల్ వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త ఇది. ముఖ్యంగా ఆన్లైన్లో రీచార్జ్ చేసుకోలేని తమ వినియోగదారులను దృష్టిలో వుంచుకుని ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇకపై తమ దగ్గర ఉన్న ఏటీఎంలో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. టెలికాం దిగ్గజం జియో బాటలో నడిచిన ఎయిర్టెల్, వొడాఫోన్ కూడా తమ కస్టమర్లకు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతోపాటు ఎయిర్టెల్ వినియోగదారులు ఎంపిక చేసిన కొన్ని కిరాణా, ఫార్మసీ దుకాణాల్లో కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎయిర్టెల్ ఒక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్టెల్ వినియోగారులు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల ఏటీఎంల వద్ద రీఛార్జ్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బిఐ, యాక్సిస్, సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల ఏటీఎంలలో మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఇరు సంస్థలు ఈ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. వినియోగదారులు ఈ బ్యాంకుల ఏటీఎంలలో దేన్నైనా సందర్శించి వారి రీఛార్జిని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ వినియోగదారులు బిగ్ బజార్స్ , అపోలో ఫార్మసీలకు కూడా వెళ్లి వారి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏటీఎం రీచార్జ్ ఎలా చేసుకోవాలంటే.. ► కార్డును ఏటీఎంలలో ఇన్సెర్ట్ చేయాలి. ► ఏటీఎం మెషీన్ తెరపై కనిపించే మొబైల్ కంపెనీని ఎంచుకోవాలి. ► రీఛార్జ్ చేయదలిచిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ► రీఛార్జ్ చేసుకునే మొత్తాన్ని నమోదు చేయాలి. తరువాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత ఎంటర్ చేస్తే రీఛార్జ్ పూర్తయిందని నిర్ధారిస్తూ సందేశం వస్తుంది. రీచార్జ్ చేసుకున్న అమౌంట్ మీ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అవుతుంది. అలాగే మీ నెట్వర్క్ ఆపరేటర్ నుండి కూడా మెసేజ్ వస్తుంది. ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోలేని వ్యక్తులకు మాత్రమే ఏటీఎం రీఛార్జ్ సాధ్యమవుతుంది. దీంతోపాటు వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు ఎస్ఎంఎస్ రీఛార్జ్ సౌకర్యం కూడా అందుబాటులో వుంది. ముఖ్యంగా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు మాత్రమే ఎస్ఎంఎస్ రీఛార్జ్ ద్వారా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ రీచార్జ్ ఎలా అంటే మీ నంబర్ నుండి ఐడియా/వొడాఫోన్ నంబరు టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, రీచార్జ్ సొమ్ము టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, ఐసీఐసీఐ, లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతా చివరి ఆరు అంకెలను నమోదు చేసి 9717000002 లేదా 5676782కు ఎస్ఎంఎస్ పంపితే రీచార్జ్ పూర్తవుతుంది. కాగా కరోనా వైరస్ కారణంగా ఇబ్బందుల నేపథ్యంలో జియో కూడా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బిఐ, యాక్సిస్ , సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల ఏటీఎంలద్వారా మొబైల్ రీచార్జ్ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే వినియోగదారుల వోడాఫోన్, ఎయిర్టెల్ తమ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్ల వాలిడిటీని ఏప్రిల్ 17వరకు పెంచాయి. తక్కువ ఆదాయ వినియోగదారుల ఖాతాలను రూ.10తో జమ చేశాయి. మరోవైపు రిలయన్స్ జియో కూడా ఏప్రిల్ 17 వరకు 100 కాల్స్ , 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
బ్యాంకులకు వరుస సెలవులు
సాక్షి, అమరావతి: ఆగస్టు నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకులకు ఆ రోజున కూడా సెలవు. ఈ సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ చెల్లింపులు కూడా పనిచేయవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు. -
నగదు మింగేస్తున్న ఏటీఎంలు
సాక్షి, కర్నూలు: బ్యాంకులకు వెళ్లి అకౌంట్లలో నగదు డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తే.. అక్కడి సిబ్బంది తీసుకోకుండా ఏటీఎం సెంటరులోని నగదు డిపాజిట్ మిషన్‌లో డిపాజిట్ చేయమని సూచిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలు ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటీఎం మిషన్ ద్వారా నగదు డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తే మధ్యలో సాంకేతిక సమస్యలు తలెత్తి మిషన్ స్ట్రక్ అయిపోతోంది. డబ్బులేమో మిషన్‌లోకి వెళ్లి పోతున్నాయి. నగదు మాత్రం అకౌంట్లలో జమ కావడం లేదు. దీంతో బ్యాంకు ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం అన్ని ప్రధాన బ్యాంకులు నగదు డిపాజిట్ మిషన్లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రతి రోజు వందల మంది అత్యవసరాల నిమిత్తం ఏటీఎం సెంటర్లలోని డిపాజిట్ మిషన్ల ద్వారా నగదును అకౌంట్లలో జమ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా డిపాజిట్ మిషన్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కర్నూలు నగరంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచీకి ఖాతాదారుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఏటీఎం సెంటరులో నగదు డిపాజిట్ మిషన్లు పెట్టారు. అయితే వారం 10 రోజులుగా సాంకేతిక సమస్యలు ఖాతా దారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నగదు మిషన్‌లోకి వెల్లిపోయినా నగదు ఖాతాలో జమ కాకపోవడంతో ఖాతాదారుల ఆందోళన చెందు తున్నారు. 10 రోజుల నుంచి రోజు 10 నుంచి 15 వరకు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. సమస్య ఉన్నా చర్యలు సున్నా... ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. 10 రోజులకుపైగా ఈ సమస్య ఉన్నా ఎస్బీఐ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మిషన్లకు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జీఎం, ఇతర ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. అయినా సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగదు డిపాజిట్ చేస్తే రసీదు రావడం లేదు. ఈ సమస్యలను ఎస్బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన లేదు. ఫిర్యాదు చేస్తే 7 రోజులకు సమస్య పరిష్కారం అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలనే పరిష్కరించకపోతే గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నిస్తున్నారు. అత్యవసరంగా డబ్బు పంపాలనుకుంటే.. సీను రివర్స్ ఆదోని పట్టణానికి చెందిన తేజ కర్నూలులో సెయింట్ జోసఫ్ కాలేజీలో బయో టెక్నాలజీ చదువుతున్నాడు. ఆదోనిలోని తండ్రి ఖాతాకు రూ.49 వేలు పంపేందుకు బుధవారం ఎస్బీఐ మెయిన్ బ్రాంచీలోని ఏటీఎం సెంటరులోని నగదు డిపాజిట్ మిషన్‌ను అశ్రయించారు. నగదు మిషన్‌లో పెట్టి వివరాలు నమోదు చేసిన తర్వాత స్ట్రక్ అయ్యి మొత్తం నగదు లోనికి వెల్లింది. ఇంతవరకు నగదు ఖాతాకు జమ కాలేదు. అత్యవసరం అనుకుంటే సమస్య పరిష్కారానికి వారం రోజులు పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. -
ఎస్బీఐ : కొత్త నోట్ల కోసం ఇంకా...
ఇండోర్: ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేసిన తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతూ వస్తోంది. 2000 రూపాయి నోటు నుంచి 500 రూపాయి నోట్లు, 200 రూపాయి నోట్లు, 50 రూపాయి నోట్లు, 20 రూపాయి నోట్లు, 10 రూపాయి నోట్లు ఇలా కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ కొత్త నోట్లను పాతనోట్లతో పోలిస్తే మరిన్ని భద్రతా పరమైన ఫీచర్లతో ప్రవేశపెడుతోంది. అయితే పాత నోట్లకు, కొత్త నోట్లకు సైజుల్లో మార్పులు ఉండటం వల్ల.. కొత్త నోట్లకు అనుకూలంగా బ్యాంక్‌లు ఏటీఎంలను మార్చాల్సి వస్తుంది. డిమానిటైజేషన్ పూర్తయి ఇప్పటికి 21 నెలల కావొస్తున్నా.. ఇంకా 18,315 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేయాల్సి ఉందని దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ కోరిన మేరకు ఆర్టీఐ డేటాలో ఎస్బీఐ ఈ విషయం తెలిపింది. ఏటీఎం రికాలిబ్రేషన్( ఏటీఎం పునరుద్ధరణ) ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. కొత్త నోట్లు రూ.2000, రూ.500, రూ.200ను పంపిణీ చేయడానికి ఎన్ని ఏటీఎంలను రికాలిబ్రేట్ చేశారని చంద్రశేఖర్ ఎస్బీఐను ఆర్టీఐ ద్వారా కోరాడు. చంద్రశేఖరన్ ప్రశ్నకు ఆగస్టు 18న ఎస్బీఐ ఇచ్చిన సమాధానంలో... మొత్తం 59,521 ఏటీఎంలు ఉండగా, 41,386 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేసినట్టు పేర్కొంది. ఈ ప్రక్రియకు మొత్తం రూ.22.50 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. ఇంకా 18,135 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేయాల్సి ఉందని, అవి ప్రస్తుతం కొత్త కరెన్సీ నోట్ల పంపిణీకి సిద్ధంగా లేవని చెప్పింది. కాగ, 2016 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
74 శాతం ఏటీఎంల పరిస్థితి అంతే..!
న్యూఢిల్లీ : ఏటీఎంలలో ఈ మధ్య పెద్ద ఎత్తున్న మోసాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసాలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం అవి అవుట్ డేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేయడమేనట. దేశంలో కనీసం 74 శాతం ఏటీఎంలు అవుట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తున్నాయని, దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 25 శాతం మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏటీఎంలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల అసమర్థతపై తలెత్తిన ప్రశ్నలు సందర్భంగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. 75 శాతం వరకు ఏటీఎంలు అన్సపోర్టెడ్ సాఫ్ట్‌వేర్‌తో నగదును పంపిణీ చేస్తున్నాయని.. దీంతో మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపింది. దేశంలో చాలా వరకు ఏటీఎంలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే ఉన్నాయని, 89 శాతం వాటికి చెందినవేనని పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఏటీఎంలలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు విపరీతంగా అందినట్టు కూడా చెప్పింది. రిజర్వు బ్యాంక్ వద్ద పలు ఫిర్యాదులు దాఖలైనప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఇంకా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడం లేదు. గత నెలలో ఆర్బీఐ ఓ అడ్వయిజరీ నోట్‌ను సైతం జారీ చేసింది. నగదును సరఫరా చేసే సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు కాలంలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు మోసాలపై అథారిటీల వద్ద 25వేల వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మధ్యన హ్యాకర్లు కొత్త కొత్త పద్ధతులతో హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. వీటి నుంచి బయటపడటానికి బ్యాంకులు తమ సిస్టమ్‌లను పూర్తిగా అప్టూడేట్ చేయాల్సి ఉంది. -
కొత్త 100 నోటు : 100 కోట్ల ఖర్చు
న్యూఢిల్లీ : లేత వంగ పువ్వు వర్ణంలో కొత్త వంద రూపాయి నోటు త్వరలోనే చలామణిలోకి రాబోతుంది. ఈ నోటు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నోటు కంటే కాస్త చిన్నదిగా ఉన్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో ఏటీఎంలలో ఈ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, ఏటీఎంలను మార్చాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల 40 వేట ఏటీఎంలను కొత్త వంద నోటుకు అనుగుణంగా మార్చాల్సి వస్తుందని ఏటీఎం ఆపరేటర్లు తెలిపారు. దీనికోసం దాదాపు 100 కోట్ల రూపాయలను ఏటీఎం ఇండస్ట్రి వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు గడువు కూడా ఏడాదికి మించి పట్టనుందని తెలిపారు. కొత్త బ్యాంక్ నోటు 66 ఎంఎం x 142 ఎంఎం సైజులో ఉండనుందని ఆర్బీఐ నోటిఫికేషన్లో తెలిసింది. ఇది ప్రస్తుతమున్న 73 ఎంఎం x 157 ఎంఎం పరిణామాల కంటే తక్కువ. ‘కొత్త 100 రూపాయల నోట్ల కోసం రికాలిబ్రేషన్ చేసేందుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని మేము నమ్ముతున్నాం. దీనికి 12 నెలల మేర సమయం పట్టే అవకాశముంది’ అని హిటాచి పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోని ఆంటోని తెలిపారు. కొత్త నోట్లతో తమకు సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త ప్రమాణాలు, మరింత భద్రతా అంశాలతో కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తోంది. తాజాగా తెస్తున్న రూ.100 నోటు ఈ క్రమంలో అయిదో నోటు. అంతకుముందు కొత్త రూ.500, 2000, రూ.50, 200 నోట్లు వచ్చాయి. వీటిల్లో రూ.50ని ఏటీఎంలలో ఉంచడం లేదు. కొత్త నోట్లకు అనుగుణంగా దేశంలోని 2.4 లక్షల ఏటీఎంలలో ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా మళ్లీ రూ.100 నోట్ల జారీకి అనుగుణంగా తీర్చిదిద్దాలంటే, ఒత్తిడి పెరిగినట్లేనని ఏటీఎం పరిశ్రమ చెబుతోంది. కొత్త వంద నోట్ల ప్రింటింగ్ ఇప్పటికే దేవాస్‌లో ప్రారంభమైందని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రతి ఒక్క ఏటీఎంలో నాలుగు క్యాసెట్స్ ఉంటాయి. రెండు క్యాసెట్లను సింగిల్ డినామినేషన్‌కు, మరో రెండు క్యాసెట్లు అత్యధిక డినామినేషన్ నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు ఉన్నాయి. 2.4 లక్షల ఏటీఎంల నిర్వహణ ఇలా.. దేశంలో ఉన్న మొత్తం ఏటీఎంలు 2.4 లక్షలు. ఇందులో ఎన్సీఆర్ 1.1 లక్షల ఏటీఎంలను నిర్వహిస్తుండగా.. 55,000 ఏటీఎంలను హిటాచి నిర్వహిస్తోంది. 12,000 ఏటీఎమ్‌లు ఎఫ్ఐఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. గత ఆగస్టులో ప్రవేశపెట్టిన రూ.200 నోట్ల కోసం ఏటీఎమ్‌లను మార్చడానికి రూ.100-120 కోట్లు ఖర్చయ్యాయి. కొత్త నోటుకు అనుగుణంగా ఒక్కో ఏటీఎం మార్చడానికి అయ్యే ఖర్చు రూ. 3000-4000 ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. -
ఏటీఎంల భద్రతా ప్రమాణాలను పెంచండి
ముంబై: భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఏటీఎంలను ఆధునికీకరించాలని బ్యాంకింగ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ నత్తనడకన సాగడాన్ని తీవ్రంగా తీసుకున్న ఆర్బీఐ, ఏటీఎంల అప్‌గ్రేడేషన్‌కు కాలపరిమితినీ నిర్దేశించింది, దీనిని అనుసరించకపోతే చర్యలు తప్పవని స్పష్టంచేసింది. అన్ని బ్యాంకుల చీఫ్‌లు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనిప్రకారం ఆగస్టు నాటికి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలి. వచ్చే ఏడాది జూన్ నాటికి దశల వారీగా ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ వెర్షన్‌ను అప్డేట్ చేయాలి. ఫిబ్రవరి చివరినాటికి దేశ వ్యాప్తంగా 2.06 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎంల సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌కు 2017 ఏప్రిల్‌లో ఆర్బీఐ ఒక సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, బ్యాంకులు ఈ ప్రక్రియను వేగవంతం చేయడం లేదు. మరోవైపు ఏటీఎం మోసా లూ పెరుగుతున్నాయి. ఏటీఎంల భద్రతా ప్రమా ణాలు, సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల బ్యాంకింగ్ కస్టమర్ల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆర్బీఐ పేర్కొంది. -
86 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి
న్యూఢిల్లీ: నగదు కొరత సమస్య శుక్రవారం నాటికి పరిష్కారమవుతుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా 86 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని, నగదు కొరత సమస్య తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘దేశమంతటా ఒకే విధంగా ఉన్న సమస్య కాదు ఇది. తెలంగాణ, బిహార్ వంటి ప్రదేశాల్లో సమస్య ఉంది. శుక్రవారంతో పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాలకు నగదు గురువారం సాయంత్రానికి చేరుకుంటుంది’’ అని రజనీష్ కుమార్ మీడియాకు చెప్పారు. కరెన్సీ అనేది చేతులు మారాలని, దాన్ని తీసుకుని అలానే ఉంచేసుకుంటే బ్యాంకులు ఏమి సరఫరా చేయగలవని ఆయన ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి నగదును ఉపసంహరించుకుంటే అది తిరిగి బ్యాంకులకు చేరాలన్నారు. మరోవైపు డిమాండ్ ఏర్పడిన ప్రాంతాలకు నగదు సరఫరా పెంపునకు చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. 2.2 లక్షల ఏటీఎంలకు గాను 86 శాతం ఏటీఎంలు నగదు నిల్వలతో పనిచేస్తున్నాయని ప్రకటించాయి. మంగళవారం 60 శాతం ఏటీఎంలే పనిచేసిన విషయాన్ని గుర్తు చేశాయి. ఎన్నికలకు ముందు నగదును నిల్వ చేయడం, ఏటీఎంలను రూ.200 నోట్లకు అనుగుణంగా మార్పు చేయకపోవడం సమస్యకు కారణంగా పేర్కొన్నాయి. రూ.70,000 వేల కోట్ల మేర నగదు కొరతను అధిగమించేందుకు నాలుగు కేంద్రాలు రోజులో పూర్తి సమయం పాటు రూ.500, రూ.200 నోట్లను ముద్రిస్తున్నట్టు తెలిపాయి. ఒక్క రోజు నిబంధనకు మారిపోవాలి వ్యాపార సంస్థలు ‘ఒక్కరోజు చెల్లింపు ఉల్లంఘన’ నిబంధనకు మారిపోవాలని రజనీష్ అన్నారు. రుణ బకాయిలను సమయానికి చెల్లించేయాలని సూచిం చారు. బకాయిలను ఒక్కరోజులోగా చెల్లించకపోతే పరిశీలన జాబితాలో చేర్చాల్సి వస్తుందని కస్టమర్లను హెచ్చరించాలంటూ బ్యాంకులను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ ఆదేశించిన విషయంలో రజనీష్ కుమార్ దీనిపై ప్రకటన చేయడం గమనార్హం. చాలా వరకు బ్యాంకులు ఒక్క రోజు నిబంధనను అమలు చేయడంలో విఫలమవుతుండటంపై స్వామినాథన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణకు ఇది సమయం కాదు! ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఇది సమయం కాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఇందుకు సహకరించడం లేదని ఆయన పేర్కొన్నారు. -
తీరని కరెన్సీ కష్టాలు...
న్యూఢిల్లీ: కరెన్సీ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పలు ఏటీఎంలలో నగదు కొరత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, బిహార్, త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని పలు ఏటీఎంలు పనిచేయకపోవడమో లేదా నో క్యాష్ బోర్డులు వేలాడదీసో దర్శనమిస్తూ పెద్ద నోట్ల రద్దు సమయంలో పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. దేశరాజధాని న్యూఢిల్లీలో కూడా బుధవారం కొన్ని ఏటీఎంలలో అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిచ్చాయి. మరోవైపు, కరెన్సీ సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల ఏటీఎంలలో దాదాపు 80 శాతం ఏటీఎంలు మళ్లీ సాధారణంగా పనిచేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఇది అరవై శాతమే ఉంది. రానున్న ఎన్నికలు, పంటల కొనుగోళ్ల కోసం చెల్లింపులు మొదలైన వాటి కారణంగా నగదుకు అసాధారణ డిమాండ్ నెలకొన్నట్లు అధికారులు వివరించారు. బ్యాంకులు వేగంగా ఏటీఎంలలో నగదు భర్తీ చేస్తుండగా, నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌లు నిరంతరాయంగా చిన్న నోట్ల ముద్రణ కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. అటు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఏటీఎంలను రూ. 500 నోట్లతో భర్తీ చేయాలని సూచించారు. అలాగే, శాఖలన్నింటికీ నగదు సరఫరాను మరింతగా పెంచాలని, 80 శాతం పైగా ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రాల వారీగా డిమాండ్ తీరుతెన్నులను కేంద్రం విశ్లేషిస్తోంది. వారాంతంలోగా సాధారణ పరిస్థితి..: 24 గంటల వ్యవధిలో తమ ఏటీఎంలలో నగదు లభ్యతను మరింతగా పెంచినట్లు ఎస్బీఐ వెల్లడించింది. క్రితంరోజున 85% ఏటీఎంలు పనిచేస్తుండగా.. బుధవారం 92% ఏటీఎంలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వారాంతం లోగా సాధారణ పరిస్థితి నెలకొనవచ్చని అంచనాలు ఉన్నాయి. నగదు కొరత కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనట్లు కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తెలిపాయి. తమ 9,679 ఏటీఎంలలో 90% ఏటీఎంలలో సాధారణంగానే నగదు లభ్యత ఉంటుందని, ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోందని పీఎన్బీ ప్రతినిధి తెలిపారు. నగదు కొరత 70వేల కోట్లు: ఎస్బీఐ రీసెర్చ్ ముంబై: ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్.. కరెన్సీ కొరతేమీ లేదంటున్నప్పటికీ.. ఏకంగా రూ. 70,000 కోట్ల మేర కొరత ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఏటీఎంల నుంచి నెలవారీగా జరిగే విత్‌డ్రాయల్స్‌లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. ఆర్థిక వృద్ధి, ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు మొదలైన వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ రీసెర్చ్ నగదు కొరత గణాంకాలను అంచనా వేసింది. నామినల్ జీడీపీ వృద్ధి 9.8% స్థాయిలో ఉన్న పక్షంలో మార్చి ఆఖరుకి ప్రజల వద్ద రూ. 19.4 లక్షల కోట్లు ఉండాలని, అయితే రూ. 17.5 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. అలాగని ఈ రూ. 1.9 లక్షల కోట్ల మొత్తాన్ని లోటుగా చూడటానికి లేదని, ఇందులో రూ. 1.2 లక్షల కోట్ల మొత్తం డిజిటల్ లావాదేవీలది ఉం టుందని తెలిపింది. ఆ రకంగా చూస్తే మొత్తం మీద సుమారు రూ. 70,000 కోట్లు మేర లోటు ఉండొచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఏటీఎంల నుంచి డెబిట్ కార్డుల ద్వారా రూ. 15.29 లక్షల కోట్లు నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు జరిగాయని, అంతక్రితం ఆరు నెలలతో పోలిస్తి ఇది 12.2% అధికమని వివరించింది. కొరతతో వాటికి మేలు!! ప్రస్తుత కరెన్సీ కొరత వల్ల తమకు ప్రయోజనం కలిగిందంటున్నాయి మొబైల్ వాలెట్ సంస్థలు. పేటీఎం, మొబిక్విక్, ఫోన్‌పే వంటి సంస్థలు వాటి ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పట్టణాల నుంచి గతనెలతో పోలిస్తే లావాదేవీలు 30 శాతం పెరిగాయని పేటీఎం బ్రాండ్ కలిగిన వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. మొబిక్విక్ సహవ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ఉపాసన టకు మాట్లాడుతూ.. తాజా నగదు కొరత వల్ల చాలా మంది మొబైల్ వాలెట్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘గత కొన్ని రోజులుగా మా ప్లాట్‌పామ్‌లో డిజిటల్ పేమెంట్స్, క్యూఆర్ ఆధారిత చెల్లింపులలో 27 శాతం వృద్ధి నమోదయ్యింది’ అని వివరించారు. -
ఏటీఎంకు వెళ్తే నో క్యాష్..
-
బ్యాంక్ డల్.. ఏటీఎం నిల్!
సాక్షి, హైదరాబాద్: ఏటీఎంకు వెళ్తే నో క్యాష్.. బ్యాంకుకు వెళ్తే గంటలకొద్దీ పడిగాపులు.. అంతసేపు నిరీక్షించినా పది వేలు దక్కితే అదే మహాభాగ్యం.. ముందురోజు వ్యాపారం ద్వారా వచ్చిన నగదును గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తెచ్చి డిపాజిట్ చేస్తేగానీ సేవింగ్స్ ఖాతాదారులకు డబ్బులివ్వని పరిస్థితి.. హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో ఇదీ దుస్థితి! మిగతా జిల్లాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఏటీఎంలన్నీ మూతపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా నో క్యాష్ బోర్డులే కనిపిస్తుండటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. బ్యాంకులకు వాటికిచ్చే నిష్పత్తి ప్రకారమే నగదు అందజేస్తున్నామని, హైదరాబాద్‌లోని బ్యాంకులకు ఈ నెల మొదటి వారంలో రమారమి రూ.3000 కోట్ల పైచిలుకు అందజేశామని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. మరి అంత డబ్బు వచ్చినా ఖాతాదారులకు ఎందుకు చేరడం లేదన్న ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం చెప్పలేకపోతోంది. ‘‘బ్యాంకు మేనేజర్లు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నట్లు కొన్ని కేసులను పరిశీలిస్తే అర్థమైంది. ఆబిడ్స్‌లో ఓ బ్యాంకుకు వారి ప్రధాన కార్యాలయం నుంచి ఈ నెల 6న రూ.175 కోట్లు వెళ్లాయి. ఆ మొత్తం నగదును సదరు బ్యాంకు మేనేజర్ కేవలం ముగ్గురు ఖాతాదారులకే పంపిణీ చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది’’అని ఆర్బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఏటీఎంలు, బ్యాంకుల్లో నగదు కొరతకు బ్యాంకుల మధ్య సమన్వయ లోపం కూడా ఓ కారణమని ఆయన పేర్కొన్నారు. బుధవారం నుంచి నగదు కొరత రాకుండా కొన్ని చర్యలు తీసుకోబోతున్నామని, అందుకు ప్రధాన బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశామని ఆ అధికారి చెప్పారు. మూతపడుతున్న ఏటీఎంలు అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏటీఎంల సంఖ్య ఏటికేటా పెరిగిపోతోంది. ప్రతి వంద మీటర్లకు ఓ ఏటీఎం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఇక్కడ మాత్రం బ్యాంకులు తిరోగమనంలో పయనిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ తన 30 శాతం ఏటీఎంలలో నెలల తరబడి నగదును లోడ్ చేయడం లేదు. పెద్దనోట్ల రద్దు నాటి నుంచీ ఆ ఏటీఎంలను నిరర్థకంగా ఉంచింది. వాటిలో నగదు విచారణ, చెక్ బుక్ రిక్వెస్ట్ వంటి సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో అన్ని బ్యాంకులకు కలిపి 8,781 ఏటీఎంలు ఉండగా.. అందులో పెద్దనోట్లు రద్దయినప్పట్నుంచీ దాదాపు 40 శాతం అంటే 3,800 ఏటీఎంల్లో నగదు లోడ్ చేయడం లేదు. మరో 20 శాతం ఏటీఎంలలో వారానికి ఒకసారి మాత్రమే నగదు ఉంచుతున్నారు. మొత్తంగా 40 శాతం ఏటీఎంల్లోనే నగదు లోడ్ చేస్తున్నారు. క్రమేపీ వాటి సంఖ్య కూడా తగ్గిస్తూ వస్తున్నారు. తాజాగా పరిశీలిస్తే వెయ్యి లోపు ఏటీఎంల్లోనే నగదు అందుబాటులో ఉంచినట్టు స్పష్టమవుతోంది. అదీ క్యాష్ పెట్టిన గంటలోపే అయిపోతోంది. కొన్ని ఏటీఎంల్లో రూ.4 వేలకు మించి రాకుండా మార్పులు చేశారు. దీంతో ఖాతాదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మరో నాలుగైదు రోజుల్లో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఒకరు చెప్పారు. జైట్లీకి కేటీఆర్ కౌంటర్ తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న నగదు కొరతపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిసూ.. ఇది ఆకస్మాత్తుగా ఏర్పడ్డ ఇబ్బంది అని వివరణ ఇచ్చారు. అయితే దీనికి మంత్రి కె.తారక రామారావు కౌంటర్ ఇచ్చారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగా ఏర్పడ లేదంటూ ట్వీటర్లో బదులిచ్చారు. నగదు కొరతపై గత మూడు నెలలుగా పదేపదే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న ఈ సమస్యపై ఆర్థిక శాఖ, ఆర్బీఐ లోతుగా పరిశీలన జరపాలని సూచించారు. ఎందుకీ కటకట..? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్–2017 (ఎఫ్ఆర్డీఐ) బిల్లు చట్ట రూపం దాలిస్తే బ్యాంకుల్లో తమ సొమ్ముకు భద్రత ఉండదని ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. బ్యాంకుల్లో జరుగుతున్న భారీ స్కామ్‌లతో ఆ వ్యవస్థపైనే నమ్మకం సడలిపోతోంది. దీంతో ఖాతాల్లోంచి డబ్బులు తీసేవారే తప్ప వేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో డిపాజిట్లు 15.3 శాతంగా ఉంటే.. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి కేవలం 6.7 శాతం మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. - కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆ రాష్ట్రంలో నగదు అవసరం అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భారీగా నోట్ల కట్టలు ఆ రాష్ట్రానికి తరలుతున్నాయి. - ఈ ఏడాది మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండడంతో చాలా చోట్ల రాజకీయ నేతలు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్న రాజకీయ పార్టీలు ఇప్పటికే భారీ సంఖ్యలో రెండు వేల నోట్లను అక్రమంగా నిల్వ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
కరెన్సీ కటకట
ధర్మవరానికి చెందిన ఓబిరెడ్డి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పెట్రోల్ అయిపోయింది. పెట్రోలు బంకులో స్వైపింగ్ మిషన్ పనిచేయలేదు. డబ్బులు తీసుకుందామని ఏటీఎంకు వెళితే నగదు లేదని మూసివేశారు. నాలుగైదు ఏటీఎంలు తిరిగినా అదే కథ. చివరికి తన స్నేహితునికి ఫోన్ చేసిన రూ.500 అప్పు ఇప్పించుకుని పెట్రోల్ పోయించుకున్నాడు. నగదు చేతిలో లేక ఏటీఎంలలో రాక జిల్లాలోని జనం పడుతున్న ఇబ్బందులకు ఓబిరెడ్డి ఉదంతమే నిదర్శనం. ► జిల్లాలోని ప్రధాన బ్యాంకులు 36 ► 456 అన్ని బ్యాంకుల శాఖలు ► రూ.కోట్లలో 50–70 రోజూ విత్‌డ్రా అవుతున్న మొత్తం ధర్మవరం: జిల్లాలో ఎవరి నోట విన్నా.. కరెన్సీ కష్టాలే. ఖాతాలో డబ్బులున్నా.. చిల్లిగవ్వ చేతికందక జనమంతా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత డిపాజిట్లు తగ్గిపోవడం... విత్‌డ్రాలు పెరిగిపోవడంతో అన్ని బ్యాంకుల్లో నగదు నిండుకుంటోంది.. ఇక నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు లావాదేవీల రుసుముమలకు భయపడి జనం రహిత లావాదేవీలను అంగీకరించడం లేదు. దీంతో జిల్లాలోని ఏ ఏటీఎం ముందు చూసినా నోక్యాష్ బోర్డులు కనిపిస్తోంది. అరా కొరా ఉన్నా.. జనం బారులు తీరికనిపిస్తున్నారు. ఇక రెండు, మూడు రోజులు సెలవు వచ్చిందంటే...పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది. జమకాని నగదు: జిల్లాలోని చాలా బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా అవుతోందే తప్ప డిపాజిట్(జమ) కావడం లేదు. బయటికి చెప్పకపోయినప్పడికీ బ్యాంకర్లను ఈ విషయం చాలా కలవరపాటుకు గురిచేస్తోంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో తొలి రెండు నెలలు ప్రజలు డబ్బుల కోసం పడరానిపాట్లు పడ్డారు. ఆ తరువాత కొంత సర్దుకున్నప్పటికీ నానాటికీ పెరుతున్న బ్యాంకుల నిబంధనలు వినియోగదారులను బ్యాంకు అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. బ్యాంకులు ఏంటీఎంల ద్వారా నగదులావాదేవీలపై చార్జీల భారం మోపుతుండటం, మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల్లో నగదు జమచేయడం లేదు. దీనికి తోడు ఎఫ్‌డీఐ రూమర్లపై రిజర్వ్‌బ్యాంక్ కూడా స్పష్టమైన ప్రకటనేదీ వెలువరించకపోవడంతో బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు తగ్గిపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నగదుకు తీవ్ర కొరత ఏర్పడింది. బ్యాంకుల్లోనూ∙కొరత: జిల్లాలో మొత్తం 36 ప్రిన్సిపల్ బ్యాంకులుండగా.. వాటికి 456 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా ఆయా బ్యాంకుల శాఖలకు సంబంధించిన 556 ఏటీఎం కేంద్రాలున్నాయి. మరో 50 దాకా ఏటీఎంలను ఇండిక్యాష్ తదితర ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. బ్యాంకర్లు తెలిపిన మేరకు ఆయా బ్యాంకులు, వాటి శాఖలు, ఏటీఎంలలో సాధారణ సమయాల్లో అయితే రోజుకు రూ.50 నుంచి 70 కోట్ల మేర నగదు ఉపసంహరణలు జరుగుతుండగా..అదే మొత్తంలో నగదు డిపాజిట్లు (జమ)జరుగుతుంటాయి. అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత చాలామంది బ్యాంకుల్లో డబ్బును జమ చేసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో నగదు డిపాట్, ఉప సంహరణల తేడా 20 నుంచి 30 శాతం ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసిన మొత్తం డబ్బులో 30 శాతం దాకా వినియోగదారులు తమ వద్దే ఉంచుకుంటున్నట్లు సమాచారం. దీంతోనే బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడిందని చెబుతున్నారు. మరోవైపు ఆర్బీఐ నుంచి నగదు రాకపోవడం కూడా కరెన్సీ కటకటకు మరో కారణంగా తెలుస్తోంది. -
సంక్రాంతికి కరెన్సీ కష్టం
ఆదిలాబాద్ : జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన ప్రజలు నగదు కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. నోట్ల రద్దు తర్వాత సంవత్సరంపాటు కొనసాగిన కష్టాలు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు సైతం అదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఏటీఎంలు పని చేయకపోవడంతో నగదు కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. ప్రతి రోజు ఏటీఎం వద్దకు వెళ్తున్న వినియోగదారులు నో క్యాష్ బోర్డు చూసి వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వరకు ఏటీఎంలు ఉండగా 20 మాత్రమే పని చేస్తున్నాయి. వాటిలో కూడా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే నగదు ఉండడంతో వినియోగదారులు బారులు తీరుతున్నారు. నగదు కొరతపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పూట పరేషాన్.. ఎంతో సుఖసంతోషాలతో జరుపుకోవాల్సిన సంక్రాంతి పండగ నోట్ల కష్టాలు తీసుకొచ్చింది. జిల్లాలో వారం రోజుల నుంచి ఏటీఎంలలో నగదు కనిపించడం లేదు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చేతినిండా డబ్బులు ఉండాల్సిన ప్రజలు వాటి కోసం చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పండుగ చేసుకోవడం గగనంగా మారింది. జిల్లా కేంద్రంలో సుమారు 25 ఏటీఎంలు ఉండగా ఐదారు ఏటీఎంలు మాత్రమే పని చేస్తున్నాయి. ఉదయం నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వినియోగదారులు ఎక్కడ ఏటీఎం పని చేస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కార్డు చేతపట్టుకుని తిరుగుతున్నప్పటికీ డబ్బులు లేకపోవడంతో ఇంటికి పండగ సామగ్రి సైతం తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. బ్యాంకుల్లో సైతం రూ.5 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇటు ఏటీఎంలలో అటు బ్యాంకుల్లో నగదు సమస్య ఏర్పడడంతో ప్రజల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.. మూతపడ్డ ఏటీఎంలు.. జిల్లా వ్యాప్తంగా ఏ ఏటీఎం’చూసినా నో క్యాష్ బోర్డులు, షెటర్లు మూసి ఉంచడం కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో ఏటీఎంలో నగదు ఉంచిన అధికారులు సంక్రాంతి పండుగకు సరిపడా నగదు ఏర్పాటు చేయాల్సింది పోయి మొత్తానికి ఏటీఎంలు మూసి వేయడం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నగదు కష్టాలపై స్పందించి ఏటీఎంలలో డబ్బులను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. -
నో క్యాష్!
కొత్త సంవత్సరంలో మళ్లీ పాత కథ మొదలైంది. కరెన్సీకోసం కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంలవద్ద బారులు తీరిన జనాలు కనిపిస్తున్నారు. బ్యాంకుకెళ్తే... వారు నామమాత్రంగా మొత్తాలిచ్చి సరిపెడుతున్నారు. అక్కడా రద్దీ తప్పట్లేదు. సంక్రాంతి సమీపిస్తోంది. అన్నిరకాల అవసరాలూ ఇప్పుడే ఉంటాయి. బ్యాంకుల్లో మొత్తాలున్నాయిగానీ... అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందక రైతులు... ఉద్యోగులు... పెన్షనర్లు... చిరు వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. విజయనగరం అర్బన్/పార్వతీపురం/రామభద్రపురం: జిల్లాలో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కరెన్సీ కష్టాలే కనిపిస్తున్నాయి. ప్రజానీకం డబ్బుల కోసం పూర్తిగా ఏటీఎంలపైనే అధారపడ్డారు. నగదు ఉన్న ఏటీఎంల కోసం ప్రజలు గాలించడం కనిపించింది. మధ్యాహ్నం 2.00 గంటల వరకు విజయనగరం పట్టణంలోని అన్ని ఏటీఎంలలోనూ నగదు పెట్టలేదు. ఆ తరువాత బ్యాం క్ శాఖలకు ఆనుకొని ఉన్న ఏటీఎంలో నగదు పెట్టడం కనిపించింది. సొమ్ముండీ ఖాతాదారులకు కరెన్సీ కష్టాలు తీరడంలేదు. నగదు తిప్పలు పది రోజులుగా మరింత పెరిగాయి. నగదు విత్‌డ్రా చేసుకునేందుకు నానా యాతన అనుభవిస్తున్నారు. చాలా చోట్ల బాంకుల్లో నగదు నిల్వలు లేవు. కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న మొత్తాలను బట్టి ఒక్కో ఖాతాదారుకి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నారు. 289 ఏటీఎంలో పనిచేసినవి 80 జిల్లా వ్యాప్తంగా 289 జాతీయ, గ్రామీణ బ్యాంకులున్నా యి. వీటికి నుబంధంగా 267 ఏటీఎంలున్నాయి. గ్రామాల్లో 74, పట్టణాల్లో 193 ఏటీఎంలు న్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.12 కోట్ల వరకు నగదు లావాదేవీలు అవుతాయి, సంబంధిత బ్యాంకులకు ఆర్బీఐ నుంచి రోజుకు కనీసం రూ.10 కోట్ల వంతున వారంలో కనీసం ఒక్కసారైనా నగదు పంపిణీ చేసే బ్యాంక్ చెస్ట్ కేంద్రాలకు వస్తాయి. ఒకటో తేదీకే వారానికి సరిపడే నగదును ఆర్బీఐ పంపిణీ చేయాలి. కానీ తాజాగా జనవరి నెలకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఒక్కపైసాకూడా రాలేరు. దీం తో ఏటీఎంలకు నగదు కొరత ఏర్పడింది. బ్యాంకులో జరిగి న లావాదేవీల వల్ల వచ్చే మొ త్తాన్ని మాత్రమే ఏటీఎంలకు చేరుస్తున్నారు. సహజంగా దా చుకున్న సొమ్ములు సంక్రాం తి పండగ ఖర్చుకోసం జనవరినెలలో తీసుకుంటారు. వా రం రోజులుగా నగదు చేతికి అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నకు రబీ కష్టాలు సాధారణంగా ఖరీఫ్‌లో పండిన పంట ద్వారా వచ్చిన ఆదాయాన్ని రబీకోసం పెట్టుబడి పెడతారు. ఆ విధంగా ధాన్యం, పత్తి వంటి పంటలు అమ్మగా వచ్చిన డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లగా డబ్బులు లేవని, రేపు మాపు అంటూ బ్యాంకు అధికారులు తిప్పుతున్నారు. దీనివల్ల రబీ సాగు పెట్టుబడులకు అప్పడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నాట్లు వేయడానికి, ఎరువులు కొనుగోలు, కూలీలకు, దుక్కులకు డబ్బులు చెల్లించడానికే గాదు... ఖరీఫ్ సాగుకు చేసిన అప్పులూ తీర్చాల్సి ఉంది. నగదు లేదన్న సాకుతో బ్యాంకర్లు డబ్బులు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనజీవుల వెతలు జిల్లాలొ దాదాపుగా 30వేలకు పైబడి ప్రభుత్వ ఉద్యోగులు, 30 వేలమంది విశ్రాంత ఉద్యోగులు, 25 వేలమంది ఔట్సోర్సింగ్, 80 వేల వరకు ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒకటో తారీఖు ఎప్పుడొస్తుందా.. జీతాలు ఎప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తుంటారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడం, బ్యాంకర్లు నగదు కొరత అని చెప్పడం, ఏటీఎంలకు వెళితే నోక్యాష్ బోర్డులు కనిపించడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. జీతం కోసం విధులు మానుకొని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో రూ.10 వేలు మాత్రమే ఇస్తుండటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురంలో కొన్నింటే నగదు పార్వతీపురం పట్టణంలో 20 వరకు ఏటీఎం సెంటర్లుండగా కొన్ని సెంటర్లలోనే నగదు లభ్యమౌతోంది. చాలా ఏటీఎంలు ఏడాదిగా పనిచేయకపోగా, పనిచేస్తున్నవాటిలో నగదు నిల్వలు లేవు. బ్యాంకునకు వెళ్లి తీసుకుందామంటే అక్కడ చాంతాడంత క్యూ కనిపిస్తోంది. పండగ అవసరాలకోసం వచ్చేవారికి రూ.10 వేలకు మించి ఇవ్వడంలేదు. మరోవైపు నోట్ల రద్దు పుకారు ఇటీవల కాలంలో రెండు వేల రూపాయల నోట్లు రద్దవుతాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో రెండు వేల రూపాయలను ఎవరూ తీసుకుకోవడానికి, ఇంట్లో నిల్వ ఉంచుకోవడానికి ఇష్టపడడంలేదు. అంతే గాకుండా వారి వద్ద ఉన్న రూ.500 నోట్లను అట్టిపెట్టుకుంటున్నారు. దీనివల్లే నగదు కొరత ఏర్పడుతోంది. రామభద్రపురానికి చెందిన ఈయన పేరు కనిమెరక వెంకటి. ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేసిన ఈయన పదిహేను రోజుల క్రితం దానిని విక్రయించారు. మొత్తం 40 క్వింటాళ్ల పత్తికి రూ. లక్ష 60 వేల పైచిలుకు నగదు స్టేట్‌బ్యాంకు ఖాతాలో జమయింది. ఇప్పుడు ఆయనకు డబ్బు అవసరం కాగా బ్యాంకులో నగదు లేకపోవడంతో బ్యాంకర్లు ఇవ్వలేకపోతున్నారు. ఏటీఎంలు... బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రెండు మూడు రోజులకోసారి రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాడంగి మండలం బొత్సవానివలసకు చెందిన ఈయన పేరు కె.జగ్గునాయుడు. ఈయన పాల సొసైటీకి కార్యదర్శి కావడంతో పాలు సరఫరా చేసిన పాడి రైతులకు పదిహేను రోజులకోసారి పేమెంట్లు ఇవ్వాలి. విశాఖ డెయిరీ రూ.40 కోట్ల వరకు లావాదేవీలు ఉం టాయనీ అయినా రూ. లక్ష,59 వేలు నగదు ఇవ్వడానికి బ్యాంకులు సహకరించడం లేదనివాపోతున్నారు. పాడి రైతులు పశువుల పోషణకు, కుటుంబపోషణకు ఇబ్బందులు పడుతున్నారనీ, తననూ అనరాని మాటలు అం టున్నారనీ చెప్పారు. బ్యాంకర్లు మాత్రం నగదు నిల్వ లేదు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్బీఐ ఆర్డర్ : ఈ నోట్లు ఏటీఎంలలో పెట్టండి
ముంబై : పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కొరతను తగ్గించడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.200 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను ప్రస్తుతం బ్యాంకుల ద్వారా మాత్రమే అందిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ నోట్లు ఏటీఎంలలోకి రానున్నాయి. ప్రజలకు రూ.200 డినామినేషన్ నోటును అందుబాటులోకి తీసుకురావడానికి ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేయాలని ఆర్బీఐ, బ్యాంకులను ఆదేశించింది. తక్కువ డినామినేషన్ కరెన్సీ సరఫరాను ప్రోత్సహించేందుకు త్వరలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొంది. రెగ్యులేటరీ ఆదేశాలను అమల్లోకి తీసుకురావడానికి బ్యాంకింగ్ పరిశ్రమ దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. బ్యాంకులు, ఏటీఏం తయారీదారులు ఎంత వీలైతే అంత త్వరగా రూ.200 నోట్లను ఏటీఎంల ద్వారా అందించడం ప్రారంభించాలని ఆర్బీఐ ఆదేశించినట్టు ఓ బ్యాంకరు చెప్పారు. ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయడానికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిసింది. ఇప్పటికే ఏటీఎంల రీక్యాలిబరేట్ ప్రారంభమైనట్టు హిటాచి పేమెంట్ సర్వీసెస్ ఎండీ లోని ఆంటోని చెప్పారు. దీనికి ఖర్చు అధికంగానే ఉండనుందని, కానీ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు పోనున్నట్టు చెప్పారు. రూ.200 నోట్లను ఎక్కువగా అందించడం కోసం ఆర్బీఐ కూడా రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేసింది.ఈ విషయంపై ఆర్బీఐ ఇంకా స్పందించలేదు. పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు తర్వాత సెంట్రల్ బ్యాంకు ఎక్కువగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. దీంతో చిల్లర నోట్ల కొరత ఏర్పడింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే నగదు విలువ కూడా పెరిగినట్టు తెలిసింది. 2016 సెప్టెంబర్‌లో రూ.2.22 లక్షల కోట్ల నగదును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకుంటే, 2017 సెప్టెంబర్‌లో రూ.2.44 లక్షల కోట్ల నగదు విత్‌డ్రా అయింది. -
ఏటీఎంలకు నిలిచిపోయిన పెద్ద నోట్లు
న్యూఢిల్లీ : పట్నాలో మళ్లీ డిమానిటైజేషన్ రోజులు పునరావృతమవుతున్నాయి. రెండు రోజుల నుంచి పట్నా వాసులు పెద్ద నోట్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఏటీఎంలకు రూ.500, రూ.2000 నోట్ల సరఫరాను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ నుంచి పెద్ద నోట్ల సరఫరా ఆగిపోవడంతో పెద్ద నోట్ల కొరత సమస్య తలెత్తింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన దాదాపు 300 ఏటీఎంలకు పెద్ద నోట్ల సప్లై ఆగిపోవడంతో అక్కడి ప్రజలకు ఈ ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎస్బీఐ మెయిన్ బ్రాంచు చీఫ్ మేనేజర్ సయ్యద్ ముజఫర్ ఆర్బీఐను సంప్రదించిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు నగదును అందించడానికి బ్యాంకు బ్రాంచు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మరోపక్క గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద నోట్లను అక్కడికి తరలించడంతోనే ఇక్కడ నిలిచిపోయినట్లు ఆర్జేడీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అక్కడ పెద్దనోట్లతో ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్జేడీ విమర్శలపై స్పందించిన బిహార్ బీజేపీ లీడర్ మంగళ్ పాండే... విపక్షాలు గుజరాత్ ఫోబియాతో బాధపడుతున్నాయన్నారు. తాత్కాలిక సమస్యలకు అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేయకూడదని త్వరలో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. -
ఇక నో క్యూ: ఇంటి వద్దకే డబ్బులు
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిల్చునే అవసరం లేకుండా వారి ఇంటి వద్దనే బ్యాంకులను ప్రాథమిక సర్వీసులు అందజేయాలని ఆర్బీఐ ఆదేశించింది. 2017 డిసెంబర్ 31 నుంచి ఈ చర్యలను అమల్లోకి తీసుకురావాలని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. నగదు స్వీకరించడం, డెలివరీ చేయడం, చెక్ బుక్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించడం, లైఫ్ సర్టిఫికేట్లు అందించడం వంటి సర్వీసులను సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని తెలిపింది. ఈ ప్రొగ్రామ్ అమలు కోసం బ్యాంకులు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటుచేయాలని, సమస్యలను ఎప్పడికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలని పేర్కొంది. అయితే ఈ సేవలందించినందుకు గాను ఎంత మొత్తంలో ఛార్జీలు విధించనుందో మాత్రం ఆర్బీఐ ఇంకా స్పష్టంచేయలేదు. ఇప్పటి నుంచి పెన్షనర్లు తమ ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షన్ పేయింగ్ బ్యాంకు బ్రాంచుల వద్ద సమర్పించాల్సి ఉంది. పెన్షనర్లు సమర్పించిన ఈ సర్టిఫికేట్లను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చెక్ బుక్‌లను అందుకోవడానికి కూడా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇక బ్యాంకులకు రావాల్సినవసరం లేదు. -
అదే మధనం
నెల్లూరు (సెంట్రల్): నోట్ల కష్టాలు మొదలై ఏడాదైంది. 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రూ.ఐదొందలు, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన వెలువడిన విషయం విదితమే. దాంతో ప్రజల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆ రోజు రాత్రి నుంచి ఏటీఎంలు మూతపడ్డాయి. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అన్నపానీ యాలు మానేసి పడిగాపులు పడాల్సిన దుస్థితి దాపురించింది. కష్టం ఫలించి రూ.2 వేల నోట్లు చేతికందినా చిల్లర దొరక్క అవస్థలు పడ్డారు. జీతం సొమ్ము బ్యాంక్ ఖాతాలో ఉన్నా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పింఛను సొమ్ముల కోసం వృద్ధులు అష్టకష్టాలు పడ్డారు. రూ.500 కొత్త నోట్ల విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలా మొదలైన కష్టాలు కనీసం 50 రోజులపాటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఆ తరువాత క్రమంగా ఇబ్బందులు తగ్గుతూ వచ్చినా.. పూర్తిగా వీడలేదు. నేటికీ చిల్లర నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చాలా ఏటీఎంలు నేటికీ దిష్టి బొమ్మల్లానే కనిపిస్తున్నాయి. నలధనం నిర్మూలన, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించడంతో ప్రజలు కష్టనష్టాలను భరిస్తూ వచ్చారు. కానీ.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం చేసిన గాయం ఇంకా మానలేదు. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికీ కోలుకోలేదు. ఆస్తులు అమ్మేవారు ఉన్నా కొనేవారు ముందుకు రాకపోవడంతో ఈ వ్యాపారం కుప్పకూలింది. రూ.2 వేలు, రూ.500 నోట్లు మార్చుకునేందుకు కూలీలు, సామాన్యులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిల్లర నోట్ల సమస్య తీర్చేం దుకు రూ.200, రూ.50 కొత్త నోట్లను విడుదల చేసినా ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం పాత 100 నోట్లు, పాత 50 నోట్లు మాత్రమే దిక్కయ్యాయి. లక్ష్యం ఏమైంది! నగదు రహిత లావాదేవీలు నిర్వహిం చడం ద్వారా ప్రజల కష్టాలు తీరుస్తామని.. కరెన్సీ నోట్ల నుంచి విముక్తి కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం చేపట్టాయి. నెల్లూరు జిల్లాలో డిజిధన్ లాంటి మేళాలు సైతం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలు జరిపిన వారికి పెద్దఎత్తున బహుమతులు ఇస్తామని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు కూడా. కొన్ని రోజులకే అందరూ ఆ విషయాన్ని గాలికొదిలేశారు. 90 శాతం ఆర్థిక లావాదేవీలు కరెన్సీ నోట్ల ఆధారంగానే సాగుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులంతా స్వైపింగ్ యంత్రాల ఆధారంగా లావాదేవీలు జరపాలని ఆదేశాలొచ్చాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లంటూ ఆర్బాటం చేశారు. అయితే, స్వైపింగ్ మెషిన్ల పంపిణీలో వెనుకబడ్డారు. జిల్లాలో సుమారు 6 వేల మంది వ్యాపారుల నుంచి స్వైపింగ్ మెషిన్ల కోసం దరఖాస్తులు అందగా.. కేవలం 2,804 మెషిన్లను అందుబాటులోకి తెచ్చి చేతులెత్తేశారు. నగదు రహిత గ్రామాలపై దృష్టి ఏదీ జిల్లాలో కొన్ని గ్రామాలను నగదు రహితంగా మారుస్తామని ప్రకటిం చారు. ఇప్పటికీ ఒక్క గ్రామాన్ని కూడా అలా తీర్చిదిద్దలేకపోయారు. చివరకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన రైల్వేలోనూ 10 శాతం కూడా నగదు రహిత లావాదేవీలు అమలు కావడం లేదు. టికెట్ కొన్నవారు స్వైపింగ్ మెషిన్ ద్వారా నగదు చెల్లించేందుకు దాదాపు 2 నుంచి 5 నిమిషాలు పడుతోంది. ఆ లోపు ఆన్లైన్లో ఉన్న టికెట్లు అయిపోతున్నాయి. దీంతో చాలామంది రిజర్వేషన్ చేసుకునే సందర్భంలోనూ నగదు చెల్లిస్తున్నారు. స్వైపింగ్ మెషిన్లు అందుబాటులో లేవు జిల్లాకు స్వైపింగ్ మెషిన్లు కావా లని ఉన్నతాధికారులకు నివేదిం చాం. అవసరానికి తగినన్ని మెషిన్లు అందుబాటులో లేవు. స్వైపింగ్‌పై పన్ను వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ కారణంగా చాలామంది నగదు రహితంపై మొగ్గు చూపడం లేదు. నగదుతోనే లావాదేవీలు చేస్తున్నారు. జిల్లాలోని పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించాం. –బి.వెంకట్రావ్, -
చీకటి జ్ఞాపకం
కేంద్ర ప్రభుత్వం ఉన్నఫలంగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నవంబర్ 8వ తేదీని జనం మర్చిపోలేకపోతున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి బుధవారం నాటికి సంవత్సరం పూర్తయినా నోట్ల కష్టాల నుంచి జనం ఇంకా తేరుకోలేకపోతున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన నుంచీ డబ్బుల కోసం జనం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. నల్లధనాన్ని వెలికితీసి అవినీతి పరుల ఆటకట్టిస్తామని, ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి దేశాన్ని సుసంపన్నం చేస్తామని పాలకులు గొప్పలు చెప్పడంతో నోట్ల రద్దును మొదట కొన్ని వర్గాలు స్వాగతించాయి. కానీ... నాలుగు రోజుల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. పెద్దనోట్లు రద్దు..చిన్ననోట్ల కొరతతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కరెన్సీ కోసం కటకట పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు అందుకు అనుగుణంగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రెండు రోజులు గడవక ముందే ప్రజలను కరెన్సీ కష్టాలు చుట్టుముట్టాయి. ఏటీఎంలన్నీ మూతపడగా...బ్యాంకులు జనజాతరను తలపించాయి. పెద్ద నోట్ల మార్పిడి, డిపాజిట్లపై పూటకో నిబంధన, రోజుకో షరతు విధించడం, బ్యాంకుల్లో సరైన సదుపాయాలు, తగినంత నగదు నిల్వలు లేకపోవడంతో అటు బ్యాంకర్లు ఇటు అన్ని వర్గాల ప్రజలు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. మొదట్లో కేవలం రూ.2 వేల రూపాయల కొత్త నోట్లు మాత్రమే విడుదల చేయడంతో దాన్ని చిల్లర చేసుకునేందుకు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రూ.100 నోటు ఒకటి దొరికిందంటే పండుగ చేసుకున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాతి పడుకునేదాకా నిద్రాహారాలు మాని ఇంట్లో ఎందరంటే అందరూ బ్యాంకుల వద్ద పడిగాపలు కాశారు. రాజకీయ నాయకులు, కొందరు సంపన్న వర్గాలు, బ్యాంకు అధికారులు తెలిసిన కొందరు ఎలాగోలా డబ్బుల మార్పిడి, డిపాజిట్లు సులభంగా చేసుకున్నారు. 80 శాతం మంది సామాన్య, మ«ధ్య తరగతి, పేద వర్గాలు నోట్ల కష్టాలతో నానా అవస్థలు పడ్డారు. అందరికీ ఇబ్బందే నోట్ల రద్దుతో దాదాపుగా అందరూ ఇబ్బంది పడ్డారు. పెళ్లిళ్లు, చదువులు, ఆస్పత్రుల్లో చేరిన వారు సకాలంలో డబ్బులు కట్టలేక సతమతమయ్యారు. సామాజిక పింఛన్ అందక వృద్ధులు, వికలాంగులు, నెలవారీ పెన్షన్ అందక విశ్రాంత ఉద్యోగులు, వేతనం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ వర్గాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు, పొట్టకూటి కోసం పేదలు, తోపుడుబండ్లు, చిరువ్యాపారులు, కార్మికులు, కూలీలు... ఇలా ఒకవర్గం కాదు దాదాపు అన్ని వర్గాల ప్రజలు భయం గుప్పిట్లో బతికారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా 34 ప్రిన్సిపల్ బ్యాంకులు వాటి పరిధిలో 457 శాఖలు పనిచేస్తున్నాయి. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో నగదు సరఫరా అంతంత మాత్రంగా ఉండటంతో పాక్షికంగా సేవలందించాయి. రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా డబ్బులు అందని పరిస్థితి. బ్యాంకు దగ్గర బారులు తీరినా మధ్యలో ‘నోక్యాష్–క్యాష్‌నిల్’ బోర్డులు దర్శనమిచ్చేవి. నోట్ల రద్దుకు ముందు ఒక్కో బ్యాంకు చెస్ట్‌లో రూ.50 నుంచి రూ.70 కోట్లు నిల్వ ఉండగా... నోట్ల రద్దుతో డబ్బంతా ఖాళీ అయ్యింది. ఇపుడు కూడా ఒక్కో చెస్ట్‌లో రూ.5 కోట్లకు మించి నిల్వ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సగానికిపైగా మూత జిల్లా వ్యాప్తంగా 556 ఏటీఎం సెంటర్లు పనిచేస్తున్నా... గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 30 నుంచి 40 ఏటీఎంలకు మంచి పనిచేయలేదు. అవి కూడా పాక్షికంగా సేవలందించడంతో అన్ని వర్గాలు ఏటీఎంల వద్ద పడిగాపులు కాశారు. ఈ నేపథ్యంలో సగానికి పైగా ఏటీఎంలు నిరవధికంగా మూతబడ్డాయి. నగదు రహితం...వేదనా భరితం నగదు రహిత లావాదేవీలు అంటూ స్వైప్‌మిషన్లు, సేల్స్ మిషన్లు, మినీఏటీఎంలు, బడ్డీ, వాలెట్ యాప్‌లు అంటూ జనాన్ని భయంగుప్పిట్లోకి నెట్టేశారు. సంవత్సరం పూర్తయినా నగదు రహిత లావాదేవీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. 3 వేల వరకు స్వైప్‌మిషన్లు పంపిణీ చేసినా అందులో సగం కూడా పనిచేయలేదు. శింగనమల మండలం పెరవలి గ్రామాన్ని దత్తత తీసుకున్న సిండికేట్ బ్యాంకు వందశాతం నగదు రహితం చేస్తామని చెప్పినా 10 శాతం కూడా అమలు చేయలేక చతికిలపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఆశయం కూడా నెరవేరకపోవడంతో నోట్ల రద్దును మెజార్టీ ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నగదు రాక నరక యాతన ఒక రోజు నగదు ఉంటుంది, మరొక రోజు ఉండేది కాదు. ఉద్యోగులు బ్యాంకు వెళ్లి డబ్బు తెచ్చుకోలేని పరిస్థితి. నోట్ల రద్దు తో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సంవత్సరమయినా అధికారులు ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. అందువల్లే ఇప్పుడు కూడా ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు. – రామాంజనేయులు, టీచర్, ఆనందరావుపేట కూలీలకు డబ్బులివ్వలేకపోయాం పెద్దనోట్లు రద్దు తర్వాత నగదు కోసం రైతులందరం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అప్పటి నుంచి ఇ ప్పటి వరకు ఏటీఎంలు సక్రమంగా పని చేయకపోవడంతో పెట్టుబడుల కోసం, కూలీల డబ్బులు చెల్లింపుల కోసం ఇబ్బందులు పడుతున్నాం. పెనకచెర్లడ్యాంలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో ఎప్పుడూ డబ్బులుండవు. బ్యాంకు వద్దకు వెళ్లి క్యూలో నిలబడి నగదు తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఏటీఎంలు ఉన్న ప్రయోజనం లేదు. – నాగలింగారెడ్డి, రైతు, పెనకచెర్ల -
3 నెలల్లో 350 ఏటీఎంలు మూత
సాక్షి,న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు సాగిస్తోంది. డిజిటల్ లావాదేవీలకు ప్రజలను ప్రేరేపించేందుకు క్రమంగా ఏటీఎంల సంఖ్యనూ కుదించేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి.నోట్ల రద్దు అనంతరం ఏటీఎంలు మూతపడుతుండటంతో క్యాష్‌లెస్ దిశగా ప్రభుత్వం, బ్యాంకులు విస్పష్ట సంకేతాలు పంపుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్య మూడు నెలల కాలంలో ఏకంగా 350 ఏటీఎంలు మూతపడ్డాయి. గత ఏడాది నవంబర్‌లో నోట్ల రద్దు అనంతరం ప్రజలు పేటీఎం వంటి ఇతర నగదు రహిత ఫ్లాట్ఫ్లాంలపైకి మళ్లడంతో ఏటీఎంల సంఖ్య తగ్గిందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా తక్కువ కియోస్క్‌లతో పనినడిపించాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ఏటీఎంల సంఖ్య తగ్గడం కేవలం 0.16 శాతమే అయినా, గత నాలుగేళ్లుగా ఏటీఎంల సంఖ్య ఏటా 16.4 శాతం పెరుగుతున్న క్రమంలో వీటి సంఖ్య తొలిసారిగా పడిపోవడం గమనార్హం. మెట్రో నగరాల్లో ఏటీఎంల నిర్వహణ బ్యాంకులకు భారంగా మారడం కూడా వీటిని కుదించేందుకు బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయి. ఎస్బీఐ తన అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న అనంతరం పలు ఏటీఎంలను మూసివేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కూడా ఏటీఎంలను కుదించాయి. -
ఏటీఎంలను మూసేస్తున్నారు..
సాక్షి, న్యూఢిల్లీ : నగదురహిత దేశంగా భారత్ రూపుదిద్దుకుంటోంది అనడంలో మరో ఆధారం. దేశవ్యాప్తంగా ఆ ఏడాదిలో జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 358 ఏటీఎంల మేర తగ్గిపోయాయి. ఏటీఎంల సంఖ్య తగ్గిపోవడం ఇదే తొలిసారి. గత నాలుగేళ్లలో ఏటీఎంల సంఖ్య 16.4 శాతం పెరిగినప్పటికీ, గతేడాది నుంచి మాత్రం వృద్ధి 3.6 శాతం మందగించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం క్రమక్రమంగా నగరాల్లో ఏటీఎంల సంఖ్యను బ్యాంకులు కూడా తగ్గిచేస్తున్నాయి. దేశంలో అతిపెద్ద ఏటీఎం నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఎస్బీఐ కూడా తన ఏటీఎంల సంఖ్యను తగ్గించేసింది. ఈ ఏడాది జూన్‌లో 59,291 ఏటీఎంలు కలిగి ఉన్న ఎస్బీఐ, ఆ సంఖ్యను ఆగస్టు నాటికి 59,200కి కుదించింది. పంజాబ్ నేషన్ బ్యాంకు కూడా 10,502గా ఉన్న ఏటీఎంలను, 10,083కు తగ్గించింది. ఇలా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా తన ఏటీఎంల సంఖ్యను తగ్గించేసింది. మెట్రోల్లో, ఎయిర్‌పోర్టుల్లో, ప్రైమ్ లోకేషన్లలో ధరలు అద్దె ధరలు పెరిగిపోతుండటం కూడా దీనికి మరో కారణం. మరోవైపు సెక్యురిటీ స్టాఫ్‌కు, ఏటీఎం ఆపరేటర్లకు చెల్లించే వేతనాలు, ఎలక్ట్రిసిటీ బిల్స్, మెయింటనెన్స్ ఛార్జీలు ఇలా ప్రతి ఒక్కటి బ్యాంకులకు భారంగా నిలుస్తోంది. నగదు రహిత దేశంగా భారత్‌ను మరల్చాలని మరోవైపు నుంచి ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ వ్యయాలను తగ్గించుకుంటూ.. ఏటీఎంల సంఖ్యను తగ్గించేస్తున్నాయి. ఎస్బీఐ ఇటీవల అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకున్న క్రమంలో, అనుబంధ బ్యాంకు ఏటీఎం ఉన్న దగ్గర తన ఏటీఎంను మూసివేయడం వంటి చర్యను చేపట్టింది. దీంతో కస్టమర్లకు అంత పెద్ద ప్రభావం చూపదని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.. హెచ్డీఎఫ్సీ రేషనలైజేషన్ క్రమంలో, తన కొన్ని మిషన్లను, రద్దీ ప్రాంతాలకు తరలించింది. ప్రజలు కూడా అంతకముందు తమ డెబిట్ కార్డులను ఏటీఎం విత్ డ్రాలకు వాడేవారు. కానీ ప్రస్తుతం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాల్సినవసరం లేకుండా దుకాణాల్లోనే టెల్లర్ మిషన్లు వచ్చేశాయి. తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని అక్కడే డెబిట్ కార్డుల ద్వారా బిల్లు చెల్లింపులు చేసేస్తున్నారు. -
ఏటీఎంలలోకి కొత్త రూ.200 నోట్లు ఎప్పుడంటే..
చెన్నై : చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు వచ్చిన రూ.200 నోటు ఏటీఎంలలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతమైతే ఈ నోటు బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఏటీఎంలలోకి రావడానికి మాత్రం ఈ ఏడాది ఆఖరి వరకు ఆగాల్సిందేనట. కొత్త సంవత్సరం నాటికి లేదా దాని కంటే ముందు ఏటీఎంల ద్వారా ఈ రూ.200 నోట్లను అందించే అవకాశాలున్నాయని బ్యాంకింగ్ అదికారులు చెప్పారు. ప్రస్తుతం బ్యాంకులు ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని, వాటిని రీకాలిబ్రేట్ చేయడానికి మరికొంత కాలం పట్టే అవకాశముందని ఎన్సీఆర్ ఎండీ నవ్రోజ్ డస్టర్ చెప్పారు. ఎన్సీఆర్ దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఏటీఎంలను ఆపరేట్ చేస్తోంది. ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేయడం సులువైన పని అని ప్రజలు భావిస్తున్నారని, కానీ అది చాలా కష్టంతో కూడుకున్నది అని కెనరా బ్యాంక్ ఛైర్మన్ రాకేశ్ శర్మ అన్నారు. రీకాలిబ్రేషన్‌కు చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియని, దీనికోసం వారాల తరబడి సమయం పడుతుందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు సమయంలో రాత్రింబవళ్లు కష్టపడ్డామని, కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రెండు వారాల్లో మార్చామని తెలిపారు. ప్రస్తుతం అంత తొందరపాటు ఏమీ లేదన్నారు. కొంత సమయం తీసుకుని ఏటీఎంలను రీకాలిబ్రేషన్ చేపడతామని రాకేశ్ శర్మ చెప్పారు. ప్రస్తుతం తన నెట్‌వర్క్‌లో 10వేలకు పైగా ఏటీఎంలను కెనరా బ్యాంకు కలిగి ఉంది. -
ఏటీఎంల్లో రూ.200 నోట్లకు 3 నెలలు ఆగాల్సిందే
న్యూఢిల్లీ: ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన రూ.200 నోట్లు ఏటీఎం మెషిన్లలోకి రావడానికి ఎంత లేదన్నా మరో మూడు నెలల వరకు సమయం పట్టేట్టు ఉంది. రూ.200 నోట్లు పట్టే విధంగా ఏటీఎం మెషిన్లలో మార్పులు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. కొత్త రూ.200 నోటుకు అనుగుణంగా ఏటీఎం యంత్రాల్లో మార్పులు చేయాలంటూ ఆర్బీఐ నుంచి తమకు ఆదేశాలేవీ రాలేదని ఏటీఎం నిర్వహణా కంపెనీలు అంటున్నాయి. కొన్ని బ్యాంకులు అనధికారికంగా కొత్త నోటుకు అనుగుణంగా మార్పులు చేసి చూడాలని కోరినట్టు తెలిపాయి. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2.25 లక్షల ఏటీఎంలలోనూ మార్పులు చేయాలా? అన్నదానిపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. -
రూ.200నోటు లాంచ్, ఏటీఎంలు సిద్దమేనా?
సాక్షి, ఢిల్లీ: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వినాయక చవితి సందర్భంగా కొత్త రూ.200 నోట్లను ప్రవేశపెట్టింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన మూడో కొత్త నోటు ఇదే. ఈ నోటు విడుదలైన వెంటనే ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద భారీగా జనాలు క్యూ కట్టి మరీ ఈ నోటును సొంతం చేసుకుంటున్నారు. రూ.200 నోటుతో పాటు కొత్త రూ.50 నోటును కూడా ఆర్బీఐ నేడే మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే కొత్త రూ.200 మీ పక్కనే ఉన్న ఏటీఎంలలోకి వస్తుందా? అంటే ఏటీఎంలో ఈ నోట్లను విత్‌డ్రా చేసుకోవడానికి మరో 2 వారాల పాటు వేచిచూడాల్సి ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. రిపోర్టుల ప్రకారం ఈ నోట్లను పంపిణీ చేయడానికి వీలుగా ఏటీఎంలను రీక్యాలిబరేషన్ చేయాల్సి ఉందని తెలిసింది. ప్రస్తుతం ఎంపికచేసిన ఆర్బీఐ ఆఫీసుల వద్ద, బ్యాంకుల వద్ద మాత్రమే కొత్త రూ.200 నోటు అందుబాటులో ఉంటుందని రిపోర్టులు తెలిపాయి. ఏటీఎంల సామర్థ్యంతో నోట్ల సరఫరాను ఏటీఎం ప్రొవైడర్లు సరిపోల్చి చూడాల్సి ఉందన్నారు. ప్రతి క్యాసెట్లో ప్రస్తుతం 2,500 నోట్లు మాత్రమే అవకాశం ఉంది. దీంతో రూ.200 నోట్లను పంపిణీ చేయాలంటే మరో రెండు వారాలైన సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. మహాత్మాగాంధీ(కొత్త సిరీస్)లో, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నేటి నుంచి ఈ నోట్లను జారీచేస్తోంది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబించించేలా సాంచీ స్థూపం ఈ నోట్లపై ఉంటుంది. ప్రకాశవంతమైన పసుపు రంగులో ఈ నోట్లు ఉన్నాయి. -
ఏటీఎంలో ఐసీఐసీఐ పర్సనల్ లోన్స్
రూ.15 లక్షల వరకు తక్షణ ఆమోదం ముంబై: ఏటీఎంలు అంటే క్యాష్ విత్‌డ్రాయెల్స్, బ్యాలెన్స్ చెకప్ వంటి సేవలు మాత్రమే కాదు. అంతకు మించి అంటోంది దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ. ఇది తాజాగా రుణ మంజూరు ప్రక్రియను సరళతరం చేస్తూ వినూత్నమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏటీఎంల ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను తక్షణం పొందొచ్చంటోంది బ్యాంక్. ఇవి అందరికీ కాదండోయ్.. వేతనం అకౌంట్ కలిగి ఉన్న వారికే. అయితే ఇక్కడ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు అందించే సిబిల్ స్కోర్ సమాచారం ఆధారంగా ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్‌కు అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వీరికి ఏటీఎంలో లావాదేవీ నిర్వహించిన తర్వాత స్క్రీన్‌పై రుణ అర్హతకు సంబంధించిన ఒక మేసేజ్ కనిపిస్తుంది. రుణం తీసుకోవాలని భావిస్తే ఐదేళ్ల కాలపరిమితితో రూ.15 లక్షల వరకు మొత్తాన్ని పొందొచ్చు. ఇది కస్టమర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పై రుణ వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలన్నీఅందుబాటులో ఉంటాయి. -
రైతుల సేవల కోసం ఏటీఎంలు
డీసీసీడీ చైర్మన్ రాజా అమలాపురం టౌన్ : రైతుల సేవల కోసం జిల్లాలో డీసీసీబీ బ్రాంచీల వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ వరపుల రాజా వెల్లడించారు. అమలాపురం డీసీసీబీ బ్రాంచి వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఏటీఎంను రాజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి కాకినాడలో ఒకటి, అమలాపురం, రాజోలు, అంబాజీపేటల్లో డీసీసీబీ ఆధ్వర్యంలో ఏటీఎంలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటి ద్వారా ప్రస్తుతానికి కేవలం తమ సహకార రంగానికి చెందిన రైతులు మాత్రమే సేవలు పొందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొద్ది నెలల తర్వాత ఈ ఏటీఎంలు అందరూ సద్వినియోగం చేసుకునేలా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. జిల్లాలో మిగిలిన డీసీసీబీ బ్రాంచీల వద్ద కూడా ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాజా వివరించారు. అమలాపురం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, డీసీసీబీ సీఈవో మంచాల ధర్మారావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, డీసీసీబీ డైరెక్టర్లు ఇళ్ల గోపాలకృష్ణ, గోదశి నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రూ.200 నోట్లపై షాకింగ్ నిర్ణయం?
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లో నెలకొన్న చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా త్వరలోనే రూ.200 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ ఆర్డర్ కూడా షురూ అయింది. 2017 ఏడాది ముగియడానికి ముందే ఈ కొత్త నోట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీని వల్ల లోయర్-డినామినేషన్ కరెన్సీకి సంబంధించిన డిమాండ్, సప్లై మధ్య అంతరం తగ్గుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్తగా తీసుకురాబోతున్న రూ.200 కరెన్సీ నోటుపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా షాకింగ్ నిర్ణయం కూడా తీసుకోబోతుందని తెలుస్తోంది. ఈ నోట్లను ఏటీఎంల ద్వారా అందించకూడదని యోచిస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీటిని కేవలం బ్యాంకు బ్రాంచుల వద్దనే సర్క్యూలేట్ చేయాలని ఆర్బీఐ చూస్తుందట. అచ్చం రూ.10, రూ.20, రూ.50 కరెన్సీ నోట్ల మాదిరిగా ఈ కొత్త రూ.200 నోట్లు కూడా కేవలం బ్యాంకు బ్రాంచులోనే లభ్యం కానున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతేడాది నవంబర్‌లో పాత రూ.500, రూ.1000 నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రద్దుతో మార్కెట్లోకి ఎక్కువగా కొత్త రూ.2000, రూ.500 సప్లయ్ చేయడంతో చిన్న నోట్ల సమస్య ఏర్పడింది. నోట్లు ఉన్నప్పటికీ వాటిని ఖర్చు చేయాలేని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. దీంతో రూ.200 నోట్లను కొత్తగా తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే రద్దుచేసిన రూ.1000 నోటును ఇప్పట్లో తీసుకొచ్చే ఉద్దేశ్యాలు లేనట్టు ఆర్బీఐ వర్గాలు చెప్పాయి. -
మళ్లీ నగదు కష్టాలు
- ఏటీఎంల వద్ద నోక్యాష్ బోర్డులు - బ్యాంకులలో తగ్గిన నిల్వ - ఆర్బీఐ చిల్లిగవ్వ విదల్చని వైనం - 712 ఏటీఎంలకు పనిచేస్తున్నవి 150 - బ్యాంకు డిపాజిట్లకు ప్రజలు అనాసక్తి - స్వల్పంగానే నగదురహిత లావాదేవీలు మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. ఏటీఎంల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. నెల రోజులుగా ఆర్బీఐ చిల్లిగవ్వ కూడా విదిల్చకపోవడంతో బ్యాంకుల్లో నగదు కొరత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 596 బ్యాంకు శాఖల్లో రూ.488.99 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. ఆర్బీఐ నుంచి నగదు రాకుంటే నగదు కష్టాలు పెరిగే ప్రమాదం ఉంది. 712 ఏటీఎంలలో 150 ఏటీఎంలకు మించి పనిచేయడం లేదు. అవి కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. చిన్న బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో ఏటీఎంలను తాత్కాలికంగా మూసివేశారు. ఖాతాదారులు నగదు డిపాజిట్ చేసేందుకు అనాసక్తి చూపుతున్నారు. దీంతో నగదు కొరత ఏర్పడుతోంది. నగదు రహిత లావాదేవీలు నామమాత్రంగా కొనసాగుతుండడంతో నగదు కష్టాలు మొదటికొచ్చాయి. తిరుపతి (అలిపిరి): జిల్లాలో నగదు కట కట ప్రారంభమయ్యింది. గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత రెండు నెలల పాటు జిల్లాలో నగదు కష్టాలతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఈఏడాది ఆరంభం తర్వాత నుంచి నగదు కష్టాల నుంచి పోయాయి. ఆర్బీఐ బ్యాంకులకు దశలవారీగా నగదు పంపిణీ చేస్తూ వచ్చింది. నగదు రహితం పేరుతో జూన్‌లో ఆర్బీఐ పైసా కూడా విదల్చ లేదు. ఫలితంగా బ్యాంకులో నగదు నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం 40 జాతీయ బ్యాంకుల పరిధిలో 596 బ్యాంకు శాఖలున్నాయి. వీటిలో రూ.488.99 కోట్లు మాత్రమే నిల్వ ఉంది. జూలై మొదటి వారంలో బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలానే కొనసాగితే రెండు వారాల్లో నగదు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదముందని తెలుస్తోంది. ఏటీఎంలలో నో మనీ.. జిల్లాలో 712 ఏటీఎం కేంద్రాలుంటే 150కు మించి పనిచేయడం లేదు. వాటిలో కూడా గంటల వ్యవధిలో నగదు ఖాళీ అవుతోంది. దీంతో ఏటీఎం కేంద్రాలకు వెళ్లే ఖాతాదారులకు అవస్థలు తప్పడం లేదు. చిన్న బ్యాంకు శాఖలు ఏటీఎం కేంద్రాలను నిర్వహించలేక తాత్కాలికంగా మూసివేశాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు, పుంగనూరు వంటి ప్రాంతా ల్లో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్, యూనియన్ బ్యాంక్ శాఖలకు చెందిన ఏటీఎంలలో నగదు లేక బోసిపోయాయి. సోమవారం మధ్యాహ్నం ఎస్బీఐ శాఖలకు చెందిన ఏటీఎంలో నగదు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొద్దిసేపట్లోనే నగదు ఖాళీ అయిపోయింది. నగదు డిపాజిట్లకు అనాసక్తి ఖాతాదారులు బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకుంటున్నారే గాని డిపాజిట్ చేయడం లేదు. దీంతో బ్యాంకులో రొటేషన్ ఆగిపోయింది. మూడుసార్లకు మించి నగదును డిపాజిట్, విత్‌డ్రాలు చేస్తే సేవా పన్ను విధిస్తామని బ్యాంకులు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. నామమాత్రంగా నగదు రహితం.. నగదు కష్టాల నుంచి గట్టేక్కడానికి నగదు రహితం ఒక్కటే శరణ్యమని అధికారులు చెప్పుకొచ్చారు. బ్యాంకర్లు కూడా దీనినే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీల్లో ఖాతాదారులు దారుణంగా మోసపోతున్నాడు. స్వైపింగ్ ద్వారా కొనుగొలు చేసే ఖాతాదారులకు రూ.100కి రూ.1.20 సర్వీసు ట్యాక్స్ పడుతోంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే కంటికి కనిపించకుండా సర్వీసు చార్జీల పేరుతో నగదు ఖాతాల్లోనుంచి మాయమవుతుండడంతో ప్రజలు నగదు రహితం జోలికి వెళ్లడానికి భయపడుతున్నారు. బ్యాంకుల్లో నగదు కొరత జిల్లా బ్యాంకుల్లో నగదు కొరత వాస్తవమే. ఏటీఎంలు పరిమితిగా> పనిచేస్తున్నాయి. ఆర్బీఐ నుంచి నగదు రావాల్సివుంది. నెల రోజులుగా జిల్లాకు ఆర్బీఐ నగదును పంపిణీ చేయలేదు. దీంతో బ్యాంకుల్లో తాత్కాలిక నగదు కొరత ఏర్పడింది. వారం రోజుల్లో నగదు చేరే అవకాశం వుంది. –లక్ష్మీనారాయణ, డీజీఎం,లీడ్ బ్యాంక్, తిరుపతి -
హైదరాబాద్‌ను వణికిస్తున్న కొత్త వైరస్
-
రూ.5 వేలు ఇస్తే ఏం చేసుకుంటాం..?
బ్యాంకు అధికారుల తీరుకు నిరసనగా ఖాతాదారుల రాస్తారోకో కోటగిరి(బాన్సువాడ): తమ డబ్బులు ఇవ్వాలని బ్యాంకుకు వెళ్తే అధికారులు కేవలం రూ.5వేలు ఇస్తున్నారని, వాటితో ఏంచేయాలో తోచడంలేదని మంగళవారం కోటగిరిలో ఖాతాదారులు రాస్తారోకో చేశారు. తమకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని వేడుకుంటున్నప్పటికీ రోజుకు రూ.5 వేలకంటే ఎక్కువ ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో తీవ్ర ఇబ్బంది పడుతన్నామని చెప్పారు. ఏటీఎంలకు వెళ్తే ఏటీఎంలో డబ్బులుండవని, బ్యాంకుకు వస్తే రూ. 5 వేలకంటె ఎక్కువ ఇవ్వడం కుదరదని అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. తాము బ్యాంకుల్లో 4 నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ చేశామని డబ్బులివ్వకపోతే మా గతి ఎట్లా అని మరికొందరు ఖాతాదారులు ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్యాంకు అధికారులతో మాట్లాడారు. దీంతో బ్యాంకు మేనేజర్ జోషిప్రకాశ్ అక్కడికి చేరుకొని ఖాతాదారులతో మాట్లాడారు. శుభకార్యాలు జరిపే వారికి రోజుకు రూ. 50 వేల వరకు ఇచ్చేందుకు యత్నిస్తామన్నారు. ఈవిషయం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. దీంతో ఖాతాదారులు రాస్తారోకో విరమించారు. కాగా రుద్రూర్ మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంకు క్యాషియార్పై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రవర్తన ఏమీ బాగులేదని, డబ్బులు కట్టడానికి బ్యాంకుకు వెళ్తే ఖాతాదారులపై దుర్భాషలాడుతున్నారని డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైరస్ భయం.. బెంగళూరులో ఏటీఎంల బంద్
బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘వన్నా క్రై’ కంప్యూటర్ వైరస్ భయం బెంగళూరును కూడా తాకింది. దీంతో ముందుజాగ్రత్తగా పలుచోట్ల ఏటీఎంలను మూసివేశారు. మూడురోజులుగా ప్రపంచవ్యాప్తంగా వన్నా క్రై అనే ర్యాన్సమ్వేర్ కంప్యూటర్లకు వ్యాపిస్తూ ఆన్లైన్లో విధ్వంసం సృష్టిస్తుండడం తెలిసిందే. ఈ వైరస్ సోకిన కంప్యూటర్లు పనిచేయడం మానేస్తాయి. అందులోని సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. హ్యాకర్లు డిమాండ్ చేసినంత డబ్బు చెల్లిస్తేగానీ కంప్యూటర్ మళ్లీ పనిచేయదు. ఈ క్రమంలోనే బెంగళూరులో సోమవారం సాయంత్రం నాటికి కొన్ని ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను అనధికారికంగా మూసివేశారు. ఏటీఎంలలో ప్రస్తుతం విండోస్‌ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టం ఉందని దీనిలో భద్రతా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని తేలింది. దీంతో వన్నా క్రై మాల్వేర్ను తట్టుకునేలా విండోస్ ఎక్స్‌పీని అప్డేట్ చేయడం కోసం ఏటీఎంలను మూసివేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. బెంగళూరే కాకుండా మైసూరు, మంగళూరు, హుబ్లి–ధార్వాడ, బళ్లారి తదితర నగరాల్లోనూ అనేకచోట్ల ఏటీఎంలను బ్యాంకులు మూసివేశాయి. -
కంచికి చేరని కరెన్సీ కష్టాలు
• ఐదు నెలలు దాటినా తీరని వెతలు • మళ్లీ నవంబర్ నాటి పరిస్థితులు • ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు • బ్యాంకుల్లో అడుగంటిన నగదు నిల్వలు • మళ్లీ పడిపోతున్న వ్యాపారాలు పెద్ద నోట్ల రద్దు.. ప్రజలెవ్వరూ ఊహించని పరిణా మం. ఆర్థిక వ్యవస్థ మూలాలనే కదిలించిన నిర్ణయం. నెలలు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడంలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు పేరుతో మార్చిలో బ్యాంకులు విధించిన ఆంక్షలు.. ఏప్రిల్‌లో కూడా కొనసాగిస్తుండడంతో కరెన్సీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఏ ఏటీఎం వద్దకెళ్లినా నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తుంటే.. అడుగంటిన నగదు నిల్వల కారణంగా బ్యాంకుల్లో సైతం ఆర్థిక లావాదేవీలు తగ్గిపోయాయి. మళ్లీ నవంబర్ నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి. విశాఖపట్నం/విశాఖ సిటీ : జిల్లాలో ప్రతిరోజు కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం రోజుకు కనీసం రూ.50కోట్ల మధ్య లావేదేవీలు జరగని పరిస్థితి కన్పిస్తోంది. జిల్లాలో 1100 ఏటీఎంలుండగా.. వాటిలో కనీసం వంద ఏటీఎంల్లో కూడా డబ్బుల్లేని పరిస్థితి. గడిచిన 20 రోజుల్లో ఆర్బీఐ నుంచి జిల్లాకు రూ.350 కోట్ల కరెన్సీ వచ్చింది. ఈ మొత్తంలో 70 శాతం ఏటీఎంలకు తరలించగా.. 30 శాతం మాత్రమే బ్యాంకుల్లో ఉంచారు. ఏటీఎంల్లో క్యాష్ దాదాపు పూర్తి కావడంతో అన్ని నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు అడుగంటడం, డిపాజిట్లు పెద్దగా లేకపోవడంతో నగదు చెల్లింపులపై ఆంక్షలు విధిస్తున్నారు. రూ.పది వేలు అడుగుతున్న వారికి ఐదువేలు.. ఐదు వేలు అడుగుతున్న వారికి రెండు వేలతో సరిపెడుతున్నారు. పెద్దనోట్ల రద్దుకు ముందు జిల్లాలో 10 నుంచి 15 శాతం మాత్రమే ఆన్లైన్ లావాదేవీలు జరిగేవి. ప్రస్తుతం ఆన్లైన్ లావాదేవీలు 40 శాతం పెరిగాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా మాత్రం 25 శాతం మించి జరగడం లేదు. ఏటీఎం కార్డుపై నగదురహిత లావాదేవీలు చేసేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడతున్నారు. ఉన్నత విద్యావంతులు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కాస్తో కూస్తో ఆన్లైన్ లావాదేవీలతో బండినెట్టుకొస్తున్నా.. చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు నరకయాతన పడుతున్నారు. ఆన్లైన్ చెల్లింపులు ఎలా చెయ్యాలో తెలీక.. సరైన సమయానికి డబ్బులు అందక వేలాది మంది మనోవేదనకు గురవుతున్నారు. సాంకేతిక లోపాల కారణంగా చెల్లింపులు జరిగినట్టుగా మెస్సేజ్ రావడం.. తీరా అవతల ఖాతాలకు జమ కాకపోవడంతో డబ్బు ఏమైయ్యాయో తెలియక గగ్గోలు పెడుతున్నారు. తగ్గిన స్వైపింగ్ వినియోగం పెద్దనోట్ల రద్దుకు ముందు 6,084 స్వైపింగ్ మెషిన్లు జిల్లాలో ఉండేవి. ఆ తర్వాత వాటి సంఖ్య 9 వేలకు చేరినప్పటికి ప్రస్తుతం వినియోగంలో 4 వేలకు మించిలేవు. వేలిముద్ర ద్వారా నగదు చెల్లింపుల కోసం ఇటీవల ప్రారంభించిన ‘భీమ్యాప్’డివైస్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు 600 వరకు మాత్రమే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. స్వైపింగ్ మెషిన్ల స్థానే వీటిని తీసుకురావాలంటే కనీసం 40 వేల డీవైఎస్లు అవసరమని అంచనా వేస్తున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్లలో దాదాపు 80 శాతం మేర పడిపోయిన వ్యాపారాలు.. జనవరిలో కాస్త గాడిలో పడ్డాయి. ప్రస్తుతం 50 నుంచి 60 శాతానికి మించి వ్యాపార లావాదేవీలు జరగడం లేదని వ్యాపారవర్గాలు వాపోతున్నాయి. -
జీతాలు రావు.. జీవితాలకూ దెబ్బే!
పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికీ పనిచేయని 25 శాతం ఏటీఎంలు వాటి మూతతో ఏటీఎం నిర్వహణ సంస్థల నష్టం రూ.600 కోట్లు నగదు సరఫరా చేసే క్యాష్ లాజిస్టిక్ సంస్థల నష్టం రూ.170 కోట్లపైనే ఏటీఎంల తయారీ, వాటితో ముడిపడి ఉన్న సంస్థలన్నీ నష్టాల్లోనే.. చివరికి సెక్యూరిటీ గార్డులనందించే ఏజెన్సీలపైనా ప్రభావం ఏటీఎంల ముందుండే సెక్యూరిటీ గార్డుల వేతనాల్లో కోత నగదు కొరతలో వైట్ లేబుల్ ఏటీఎంలు.. క్యాష్ లాజిస్టిక్ సంస్థల మూత ఈ ఏటీఎం ఆర్థిక వ్యవస్థ డిజిటల్ వైపు మళ్లడం ప్రశ్నార్థకమే! ఏటీఎం అంటే.. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్.. మన దృష్టిలోమాత్రం ఎనీ టైమ్ మనీ! కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా ఏటీఎంలకు అర్థం మారిపోయింది. ఇప్పుడు ఎనీ టైమ్ మూత! అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే నోట్ల రద్దు నాటి నుంచి ఇప్పటిదాకా డబ్బుల ముఖం చూడని ఏటీఎంలు చాలానే ఉన్నాయి. దేశంలో నగదు వినియోగం తగ్గి డిజిటల్ వైపు మళ్లాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం నగదు తక్కువగా అందుబాటులో ఉండేలా చేసి.. రకరకాల డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తోంది. డిజిటల్ వైపు మళ్లితే.. జవాబుదారీతనం పెరుగుతుందని, పన్నుల వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.... కానీ ఇదంతా నోటుకు ఒకవైపు మాత్రమే. అదే మరోవైపు చూస్తే.. దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏటీఎంలు పనిచేయకుంటే సామాన్యుల జీతాలు చేతికి రావు. ఏటీఎంల చుట్టూ అల్లుకున్న కొన్ని వేల జీవితాలు కూడా ఛిద్రమైపోతున్నాయ్. ఏటీఎంల చుట్టూ ఉన్న ఆర్థిక వ్యవస్థ కొన్ని వేల కోట్లు నష్టపోతోంది. ఆ వ్యవస్థపై ఆధారపడ్డ చిన్నాపెద్దా ఉద్యోగులంతా దిక్కులు చూస్తున్నారు. ఈ చీకటి కోణంపై ఈ వారం ‘ఫోకస్’.. (శ్రీనాథ్ అడెపు, సాక్షి బిజినెస్ బ్యూరో) చిన్నపిల్లలు కథ చెప్పమని అడగ్గానే.. తల్లిదండ్రులైనా, తాతబామ్మలైనా మొదట చెప్పేది ఏడు చేపల కథే. ఎండలేని చేప వెనుక ఎంత నిర్లక్ష్యపు నెట్వర్క్ ఉందో చెప్పడమే ఆ కథ ఉద్దేశం. ఇప్పుడు అదే కథను ఏటీఎంలకు అన్వయిస్తే!? ఎందుకంటే ఎన్నో ఏటీఎంలున్నా చాలా వాటిలో డబ్బుల్లేవు. కొన్నయితే తెరుచుకోవటమే లేదు. మరి ఏటీఎంకు వెళ్లి.. ఏటీఎం ఏటీఎం ఎందుకు డబ్బులివ్వటం లేదని అడిగితే అది ఏం చెబుతుంది? డబ్బులు లోడ్ చేయకుండా నేనెక్కడిస్తా అంటుంది.. లోడ్ చేసే సంస్థని అడిగితే బ్యాంకులు డబ్బులివ్వందే తామెలా పెడతా మంటాయి. మరి బ్యాంకుల్ని అడిగితే రిజర్వు బ్యాంకువైపు వేలు చూపిస్తాయి.. రిజర్వుబ్యాంకును అడిగితే.. డబ్బులెందుకు? డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చుగా? అంటుంది. కానీ ఈ గొలుసులో బయటకు కనిపించకుండా దెబ్బతిన్న పాత్రలు చాలానే ఉన్నాయి. అవి జవాబుదారీ కాకపోయినా ప్రభావి తమయ్యాయన్నది మాత్రం పచ్చినిజం. నష్టాల్లో సంస్థలు ఈ ఏటీఎం గొలుసులో దెబ్బతిన్న వాటిలో మొదట చెప్పుకోవాల్సింది ఏటీఎం తయారీ సంస్థల గురించి.. తరవాత క్యాష్ లాజిస్టిక్ కంపెనీలు, నిర్వహణ సంస్థలు, ఏటీఎం సెక్యూరిటీ సంస్థల గురించి..! ప్రస్తుతం దేశంలోని 2,07,402 ఏటీఎంలలో 25 శాతం అంటే 51,850 ఏటీఎంలు మూతపడి ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ గొలుసు సంస్థలు రోజుకు రూ.5 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి. మూతపడిన ఏటీఎంల సంఖ్య ఇంకా ఎక్కువేనన్నది పరిశ్రమ వర్గాల మాట. ఆ లెక్కన నష్టమూ ఎక్కువే. నవంబర్ 9 నుంచి చూస్తే.. ఇప్పటిదాకా ఏటీఎం నిర్వహణ సంస్థలకు రూ.600 కోట్లు, నగదు సరఫరా చేసే లాజిస్టిక్ సంస్థలకు రూ.170 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయా సంస్థలు చెబుతున్నాయి. అంటే రోజుకు రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.770 కోట్ల నష్టం. ఇక సెక్యూరిటీ సంస్థలు, నిర్వహణ సంస్థల నష్టాన్ని కూడా కలిపితే ఇంకా పెరుగుతుంది. ఏపీ, తెలంగాణల్లో 17 వేల ఏటీఎంలు ఆర్బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 52 బ్యాంకులు, 2,07,402 ఏటీఎంలున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాకు 19.7 ఏటీఎంల చొప్పున అన్న మాట. మహారాష్ట్రలో అత్యధికంగా 24,829 ఏటీఎంలుండగా... తమిళనాట 23,728 ఏటీఎంలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 17 వేల ఏటీఎంలున్నాయి. ఈ ఏటీఎంలలో అత్యధికం బ్రౌన్ లేబుల్ కాగా.. దీన్నొక వ్యాపారంగా భావించి వైట్‌లేబుల్ ఏటీఎంలు కూడా నాలుగేళ్ల కింద రంగంలోకి దిగాయి. ప్రైవేటు సంస్థల ‘వైట్ లేబుల్’ ఏ ఏటీఎంపై అయినా దాని బ్యాంకు లోగో ముద్రించి ఉంటుంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ.. ఇలా ముద్రించి ఉన్నవన్నీ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలే. వైట్ లేబుల్ ఏటీఎంలకు బ్యాంకు లోగోలుండవు. వీటిని పూర్తిగా ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తుంటాయి. అంటే ఏటీఎం యంత్రాన్ని కొనటం నుంచి సాఫ్ట్వేర్, నిర్వహణ, నగదు సరఫరా వరకు అన్ని సేవలూ ప్రైవేట్ సంస్థలే నడిపిస్తాయి. ఈ కంపెనీలకు ఏం లాభమంటే? మనం ఏ బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డుతో ఆ ఏటీఎంలో లావాదేవీలు నిర్వహిస్తామో ఆ బ్యాంకు వైట్ లేబుల్ సంస్థలకు ఇంటర్చేంజ్ చార్జీలను చెల్లిస్తుంది. ⇒ ఇంటర్చేంజ్ చార్జీలు నగదు లావాదేవీలకైతే ఒక్కో దానికి రూ.15, నాన్ –క్యాష్ లావాదేవీలకు అంటే ఖాతా వివరాలు, మినీ స్టేట్మెంట్, చెక్‌బుక్ రిక్వెస్ట్, పిన్ చేంజ్ వంటి వాటికైతే ఒక్కోదానికి రూ.5 చొప్పున ఉంటాయి. ⇒ టాటా కమ్యూనికేషన్స్ , ఎన్ సీఆర్, ముత్తూట్ ఫైనాన్స్ , హిటాచీ, వక్రంగి, ఏజీఎస్ తదితర 15 కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. బ్యాంకులు+ ఔట్సోర్సింగ్ = బ్రౌన్ లేబుల్ ⇒ బ్యాంకు లోగోలున్నవన్నీ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలే. వీటిలో బ్యాంకు ఆవరణలో ఉండేవి ఆన్ సైట్, ఇతర ప్రాంతాల్లో ఉండేవి ఆఫ్‌సైట్ ఏటీఎంలు. ఈ ఏటీఎంలలో చాలావరకూ బ్యాంకులు ఔట్సోర్సింగ్కే ఇస్తాయి. ⇒ నగదు సరఫరా, ఏటీఎం స్థలాన్ని ఎంపిక చేయటం మాత్రమే బ్యాంకులు చేస్తాయి. వాటిలో విద్యుత్ సరఫరా, స్టేషనరీ, మౌలిక ఏర్పాట్లు, సెక్యూరిటీ గార్డు వంటివన్నీ ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయి. ఇందుకు బ్యాంకులు నెలవారీ చార్జీలు చెల్లిస్తాయి. ⇒ ఎన్ సీఆర్, టాటా, హిటాచీ, ఐసీఐసీ ఐ, ధనలక్ష్మి, రత్నా కర్ తదితర సంస్థ లు ఈ నిర్వహణ రంగంలో ఉన్నాయి. వైట్‌లేబుల్ మూత..బ్యాంకులకూ నష్టమే బ్యాంకులు తమ ఆదాయంలో 20–25 శాతాన్ని ఏటీఎంలపై ఖర్చు చేస్తుంటాయి. వాటివల్ల బ్యాంకులకు ఆదాయమేమీ రాకపోయినా ఖాతాదారులకు అందుబాటులో ఉండటానికి ఆ ఖర్చు తప్పదు. ఒక్కో ఏటీఎం నిర్వహణకు బ్యాంకుకు నెలకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. దీన్ని బ్యాంకులు రికవరీ చేయాలంటే ఆయా ఏటీఎం నుంచి నెలకు 5 వేలు లేదా రోజుకు 170 లావాదేవీలు జరగాల్సి ఉంటుంది. కానీ నోట్ల రద్దు తర్వాత ఈ లావాదేవీల సగటు 120కి పడిపోయినట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ చెప్పారు. ‘‘దీంతో బ్యాంకుల ఏటీఎంలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. కానీ బ్యాంకులకు ఇతరత్రా ఆదాయ మార్గాలుంటాయి కనక ఈ వ్యయాన్ని భరిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంలు ఈ వ్యయాన్ని భరించలేక.. నగదు కొరతతో ఏటీఎంలను మూసేస్తున్నాయి. వైట్ లేబుల్ ఏటీఎంల నష్టం రూ.600 కోట్లు 2012లో వైట్ లేబుల్ ఏటీఎంలకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ప్రస్తుతం ఇవి దేశవ్యాప్తంగా 13,900 దాకా ఉన్నాయి. టాటా కమ్యూనికేషన్స కు 9,060, బీటీఐ పేమెంట్స్‌కు 4,096, హిటాచీ పేమెంట్స్‌కు 652, వక్రంగీకి 328, ముత్తూట్‌కు 207, ఏటీఎస్‌కు 218 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో 45 శాతం గ్రామీణ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మూతపడి ఉన్నాయి. నోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు వైట్ లేబుల్ ఏటీఎంల నిర్వహణ కంపెనీలకు రూ.600 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. 60 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తేంటి? దేశంలో ఎన్ సీఆర్, ఒర్టెక్స్, ఏసీజీ, క్యాష్ కనెక్ట్, డైబోల్డ్ నిక్స్డోర్ఫ్, ఎఫ్ఎస్ఎస్, టీఎండీ సెక్యూరిటీ, జీఎంవీ వంటి 20కి పైగా కంపెనీలు ఏటీఎంల తయారీలో ఉన్నాయి. ఇవి ఏటీఎం తయారీతో పాటూ సాఫ్ట్వేర్, సీఆర్ఎం, నగదు నిర్వహణ, నెట్వర్క్ మేనేజ్మెంట్ వంటి సేవలు కూడా అందిస్తుంటాయి. నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేయటానికి వారం రోజుల ముందే 18–20 వేల కొత్త ఏటీఎంల తయారీ కోసం వాటికి ఆర్డర్లు వచ్చాయి. కానీ నోట్ల రద్దు తరవాత పరిస్థితి మారిపోయింది. ఉన్న ఏటీఎంలనే తగ్గించుకోవటానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ‘‘ఉన్న ఏటీఎంలకే డబ్బులివ్వలేకపోతున్నాం. అంతా డిజిటల్‌వైపు మళ్లుతున్న తరుణంలో కొత్త ఏటీఎంలు ఇకపై అవసరం ఉండకపోవచ్చు’’ అని ఓ బ్యాంకు ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తాము ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తరఫున ఆర్బీఐకి ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. దీంతో బ్యాంకులు ఆర్డర్లను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘అలాగని చెప్పలేం. ఈ పరిస్థితి కొద్ది కాలమే ఉంటుంది. మరో 6 నెలల్లో పరిస్థితి సానుకూలంగా మారుతుంది’’ అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ లినోయ్ ఆంటోని ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం దేశంలోని ఏటీఎం తయారీ సంస్థల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు వారికి చేతినిండా పనిలేదు. ఏటీఎంల ఆర్డర్లు లేక సతమతమవుతున్న కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించటం భారంగా మారుతున్నట్లు ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. సెక్యూరిటీ గార్డుల జీతాలూ తగ్గాయి! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 800 ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలున్నాయి. వాటిలో నాలుగు లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 50 వేల మంది ఏటీఎం సెక్యూరిటీ గార్డులేనని అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అధ్యక్షుడు సి.భాస్కర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ‘‘గార్డుల విభాగంలో 20 శాతం కొరత ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో గార్డు ఉద్యోగం అంటే చిన్నచూపు. అందుకే అస్సాం, బిహార్, మహారాష్ట్ర నుంచి తీసుకుంటుంటాం. వారికి ఎక్కువ పనిగంటలు కల్పిస్తూ వేతనాలు ఎక్కువొచ్చేలా చేస్తాం. అంటే 8 గంటల పని దినాలను 4 గంటల ఓవర్‌టైం కలిపి 12 గంటలు చేస్తాం. దీంతో వారికి రూ.10–11 వేల జీతం వస్తుంది. నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలు ఖాళీగా ఉంటుండడంతో బ్యాంకులు సెక్యూరిటీ గార్డులు వద్దంటున్నాయి. వారికి పని కల్పించడం కోసం మిగతా వాళ్ల పని గంటలను తగ్గిస్తున్నాం. దీంతో గార్డుల వేతనాల స్థాయి రూ.6 వేలకు పడిపోయింది’’ అని వివరించారు. ఇంకా చెప్పాలంటే ఏటీఎం సెక్యూరిటీ గార్డులకు కేటాయించే 3 జతల దుస్తులు, షూలు ఇప్పుడు పనికిరాకుండా మూల నపడున్నాయి. వాటి మీద ఆధారపడి ఉన్న బట్టలు కుట్టేవాళ్లు, లాండ్రీ షాపులు వంటి వ్యాపారులకూ ఇబ్బందే. ఇక ఏటీఎంల కోసం షట్టర్లు కేటాయిస్తే ఎక్కువ అద్దె వస్తుందని ఆశపడేవారికీ చుక్కెదురే. ఇవన్నీ చెబుతూ పోతే... ఏటీఎంల చుట్టూ చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థే ఉంది. మరి ఇదంతా డిజిటల్‌కు మళ్లుతుందా? ఏమో! నగదు సరఫరా సంస్థలూ దెబ్బతిన్నాయ్! బ్యాంకు నుంచి ఏటీఎంకు నగదును సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా క్యాష్ లాజిస్టిక్ సంస్థలున్నాయి. దేశంలో ఎక్సెల్ క్యాష్ మేనేజ్మెంట్, చెక్‌మేట్, బ్రింక్స్ ఆర్య ఇండియా, ఐఎస్ఎస్–ఎస్డీబీ, ఎస్ఐఎస్ క్యాష్ సర్వీసెస్, సీఎంఎస్ సెక్యూరిటీస్, రింటర్ సేఫ్‌గార్డ్ వంటి 50కి పైగా సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్స్, ఏటీఎం రీప్లేస్మెంట్, క్యాష్ పికప్, డెలివరీ, క్యాష్ ఇన్ ట్రాన్సిట్, స్మార్ట్ కార్డ్స్, పాస్‌పోర్ట్, డాక్యుమెంట్స్ వంటి సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో లక్షకు పైగా లాజిస్టిక్ వాహనాలు, 2 లక్షల మంది ఉద్యోగులుంటారని క్యాష్ లాజిస్టిక్స్ అసోసియేషన్ (సీఎల్ఏ) చెబుతోంది. నగదు సరఫరా లేక ఈ వాహనాలు ఖాళీగా ఉంటున్నాయని, దీంతో ఈ సంస్థలకు రూ.170 కోట్ల నష్టం వాటిల్లిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 14 క్యాష్ లాజిస్టిక్స్ సంస్థలు, 42 వేల వాహనాలున్నాయి. క్యాష్ లాజిస్టిక్ సంస్థల్లో డ్రైవర్లు, గన్ మన్లు, కస్టోడియన్లు, లోడర్స్, క్యాష్ ఆపరేటర్స్, మేనేజర్లు.. ఇలా 85 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్క ఏటీఎంలో నెలకు 10 సార్లు నగదు నింపితే వీరికి చెల్లించేది రూ.7 వేలు. ఒక ఏటీఎంలో నగదును నింపటానికి డ్రైవర్, గన్ మన్, కస్టోడియన్, క్యాష్ లోడర్, క్యాష్ ఆపరేటర్ మొత్తం ఐదుగురు ఉద్యోగుల అవసరముంటుంది. ‘‘నోట్ల రద్దుకు ముందువరకూ ఈ సంస్థలు రోజుకు రూ.15,000 కోట్ల నగదును సరఫరా చేసేవి. ఇపుడు రూ.5,000 కోట్లు కూడా కష్టంగా మారింది. కనీసం 10 వేల వాహనాలు కూడా తిరగటం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు రూ.15–20 లక్షల నష్టం వాటిల్లుతోంది’’ అని ఎక్సెల్ క్యాష్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సి.మురళీ మాధవన్ ‘సాక్షి’తో చెప్పారు. క్యాష్ సరఫరా వాహనాలు ప్రత్యేకంగా తయారు చేసేవి కనుక వీటిని ఇతర అవసరాలకు వినియోగించలేరు. వాహనాలను ఖాళీగా ఉంచటం, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి రావటంతో.. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన 3 కంపెనీలు బోర్డు తిప్పేశాయి. క్యాష్ ట్రాన్సిట్ సేవలతో పాటూ ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్న ఒకటిరెండు పెద్ద కంపెనీలు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. అమెరికాకు చెందిన బ్రింక్స్.. ఇండియాలోని బ్రింక్స్ ఆర్య ఇండియా యూనిట్‌ను రూ.400 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైంది కూడా. -
ఖాతాలో లెక్క.. చేతికి దక్కేదెలా?
అనంతపురం: బ్యాంక్ ఖాతాలో నిండుగా లెక్క ఉన్నా.. జనం చేతికి అందడం లేదు. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ (ఏటీఎం)లపైనే ఇంత కాలం ఆధారపడి నగదు విత్ డ్రా చేసుకున్న జిల్లా వాసులు నగదు కొరత కారణంతో సరికొత్త ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న గ్రామీణ ప్రజలు సైతం ఇంతకాలం నగదు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌ల కన్నా తొలి ప్రాధాన్యత ఏటీఎం కేంద్రాలకే ఇస్తూ వచ్చారు. అయితే ఐదు నెలల క్రితం పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జనం నగదు కష్టాలు రెట్టింపయ్యాయి. అవన్నీ తాత్కలికమే... పరిస్థితి కొన్ని రోజుల్లో సర్దుకుంటుందంటూ చెప్పుతూ వచ్చిన పాలకులు ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులపై పెదవి విప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. పనిచేస్తున్న 30 శాతం ఏటీఎంల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడు నగదు వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. నగదు కోసం బ్యాంక్‌ల వద్ద గంటల తరబడి వేచి ఉండలేక ప్రజల్లో అసహనం తలెత్తుతోంది. -
'రూ.30వేలకు మించి క్యాష్ ఇవ్వలేం'
-
క్యాష్ లెస్ బ్యాంక్
-
'రూ.30వేలకు మించి క్యాష్ ఇవ్వలేం'
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్న క్రమంలో మళ్లీ నగరంలో నగదు కొరత ప్రారంభమైంది. విత్ డ్రా పరిమితి ఆంక్షలన్నింటిన్నీ ఆర్బీఐ ఎత్తివేసినప్పటికీ ప్రజలను నగదు కష్టాలు వీడటం లేదు. ఎక్కడ ఏటీఎంలు చూసినా నో క్యాష్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. ఒక్క ఏటీఎంలలోనే కాక, ఇటు బ్యాంకుల్లోనూ నగదు కొరత భారీగా ఏర్పడినట్టు తెలుస్తోంది. రోజువారీ నగదు డిపాజిట్లు తగ్గడంతో పాటు నెలరోజులుగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రానికి డిమాండ్ కు తగ్గ మేర నగదు రాకపోవడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నట్టు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా వెల్లువెత్తిన డిపాజిట్లు ఇటీవల దారుణంగా పడిపోయాయని బ్యాంకర్లు చెప్పారు. చలామణిలోకి తీసుకొచ్చిన కొత్త కరెన్సీ నోట్ల డిపాజిట్లు చాలా తక్కువగా వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా నగదు అందించడం కష్టతరంగా మారుతుందని వారు వాపోతున్నారు. ఆర్బీఐ ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ రూ.30 వేలకంటే మించి నగదు ఇవ్వలేమని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలోనే మరింత నగదు కష్టాలు పెరుగుతాయని బ్యాంకర్లు పేర్కొన్నారు. మరోవైపు నగదు లావాదేవీలను తగ్గించడానికి ప్రభుత్వం నిబంధనల మీద నిబంధనలు తీసుకొస్తూనే ఉంది. నగదు లావాదేవీలను రూ.2 లక్షలకే పరిమితం చేసేందుకు కొత్త చట్టాలను కూడా తీసుకొస్తోంది. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం, కొత్త కరెన్సీ నోట్లు రూ.2000, రూ.500లను చలామణిలోకి తీసుకొచ్చింది. విత్ డ్రా పరిమితులు విధిస్తూ వీటిని ప్రజల్లోకి తీసుకొచ్చింది. కానీ బ్యాంకుల నుంచి ఖాతాదారుల చేతికి వచ్చిన రూ.2000 నోట్లు తిరిగి డిపాజిట్లకు రావడం లేదు. మార్కెట్లో లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకుల్లో డిపాజిట్ కాక నగదు కొరత సమస్య తీవ్రమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి.. దీనికి తోడు ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి కొత్త నోట్ల పంపిణీ డిమాండ్‌కు తగ్గట్టు లేదని తెలుస్తోంది. -
మనీ ట్రబుల్స్
4 వేల ఏటీఎంలు అవుట్ ఆఫ్ సర్వీస్ సిటీబ్యూరో: నగరంలో మళ్లీ క్యాష్ కష్టాలు మొదలయ్యాయి. రిజర్వు బ్యాంకు నుంచి వచ్చే నగదు సరఫరాపై భారీ కోత పడింది. దీనికి తోడు శుభకార్యాలు, ఏటీఎం విత్‌డ్రాలపై అదనపు చార్జీల బాదుడు తోడవటంతో గురువారం నగరంలో ఏకంగా నాలుగువేల ఏటీఎంలలో అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు వేలాడదీశారు. ఇటీవలే కరెంటు, సేవింగ్ ఖాతాలపై నగదు ఉపసంహరణ పరిమితి సడలింపుతో నగరంలో భారీగా నగదు విత్‌డ్రాలు మొదలయ్యాయి. నోట్ల రద్దుకు ముందు 75 శాతం డిపాజిట్లు, 25 శాతం విత్‌డ్రా చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అందుకు భిన్నంగా మారింది. కేవలం 25 శాతం మంది డిపాజిట్లు చేస్తే, మిగిలిన 75 శాతం మంది నగదును వివిధ రూపాల్లో విత్‌డ్రా చేస్తున్నారు. తొలుత బ్యాంకులకు వచ్చి తమ సేవింగ్, కరెంట్ ఖాతాల్లో డబ్బును విత్‌డ్రా చేసుకునేవారి సంఖ్య అధికంగా ఉండడంతో వచ్చిన డబ్బును వారికి సర్దేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేరుగా వచ్చే ఖాతాదారులకు కూడా నగదు సరిపోక పక్క బ్రాంచీల నుంచి తెచ్చిచ్చే పరిస్థితి నెలకొంటుంతోంది. దీంతో బ్యాంక్‌ను ఆనుకుని ఉన్న ఎటీఎంల (ఆన్‌సైడ్)తో పాటు బ్యాంకులకు దూరంగా ఉన్న (ఆఫ్‌సైడ్) ఏటీఎంలకూ కరెన్సీ కొరత ఏర్పడింది. ఇందులో ఆన్‌సైడ్ ఏటీఎంలలో కొద్ది మొత్తంలో నగదు పెడుతున్న బ్యాంకులు, ఆఫ్‌సైడ్ ఏటీఎంలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. ఆర్బీఐ నుంచి నిలిచిన సరఫరా నగరంలో ఆరువేలకు పైగా ఉన్న ఏటీఎంలలో 80 శాతం ఏటీఎంలకు ప్రైవేటు ఏజెన్సీలు నగదును సరఫరా చేస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నుంచే నగదు సరఫరా నిలిచిపోయిందని, ఈ పరిస్థితి ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని ఆ ఏజెన్సీలకు చెందిన ఓ అధికారి చెప్పారు. నగదు నియంత్రణలో భాగంగానే ఆలా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే పరిమితికి మించి చేసే విత్‌డ్రాలపై చార్జీలు కూడా వసూలు చేస్తుండటంతో, ఖాతాదారులు ఒకేమారు భారీ మొత్తాన్ని డ్రా చేస్తున్నారు. దీనివల్ల కూడా మార్కెట్లో నగదు ఇబ్బంది వస్తోందని తెలిపారు. నగరంలో ఆన్లైన్, యాప్స్ ద్వారా క్యాష్‌లెస్ సర్వీసులు పొందే అవకాశం ఉన్న వారు కూడా నగదు కోసం వెంపర్లాడుతుండడం కూడా ఇబ్బందులకు కారణమన్నారు. -
ఆంక్షల్లేవు.. కానీ క్యాష్ ఏదీ?
⇒ నగదు విత్‌డ్రాపై పరిమితులు ఎత్తేసిన ఆర్బీఐ ⇒ ఇకపై డీమోనిటైజేషన్ ముందునాటి పరిస్థితులు ⇒ ఏటీఎంలలో నగదుకు కటకటే!! న్యూఢిల్లీ: సేవింగ్స్ బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలపై విధించిన అన్ని పరిమితులనూ ఆర్బీఐ సోమవారం నుంచి తొలగించింది. దీంతో గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన ఆంక్షలకు తెరపడింది. ఏటీఎం నగదు ఉపసంహరణలపై విధించిన ఆంక్షలన్నీ మార్చి 13 నుంచి తొలగిపోతాయని ఆర్బీఐ గతనెల్లోనే ప్రకటించింది. కరెంటు ఖాతాలు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాల నుంచి చేసే విత్డ్రాయల్స్పై ఆంక్షలను జనవరి 30నే ఎత్తివేసింది. ఒకటి తర్వాత ఒకటి... గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ రాత్రి నుంచీ ప్రజల వద్దనున్న పెద్దనోట్లు చెల్లకుండా పోయాయి. కొత్త నోట్ల కొరత ఉండడంతో ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేయటంపై ఆర్బీఐ పరిమితులు పెట్టింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం నుంచి రోజులో రూ.2,000 మాత్రమే విత్‌డ్రా చెయ్యాలని పరిమితి పెట్టి... నవంబర్ 14 నుంచి దీన్ని రూ.2,500కు పెంచింది. జనవరి 1 నుంచి రూ.4,500కు, జనవరి 16 నుంచి రూ.10,000కు పెంచింది. బ్యాంకు శాఖల నుంచి చేసే విత్‌డ్రాయల్స్‌కూ పరిమితులు పెట్టింది. ఈ ఆంక్షలన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి. రీమోనిటైజేషన్... అంటే కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ ముగిసిందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ మధ్యే చెప్పారు. అయితే, ఇప్పటికీ చాలా ఏటీఎంలలో నగదుకు కటకట కొనసాగుతూనే ఉంది. బ్యాంకులు నెలకు 3 విత్‌డ్రాయల్స్‌ను మాత్రమే ఉచితంగా అనుమతిస్తూ... అంతకు మించితే ఇపుడు చార్జీలు వడ్డిస్తున్నాయి. దీంతో చాలామంది మధ్య తరగతి వారు తమ జీతం మొత్తాన్ని ఆ మూడు లావాదేవీల్లోనే తీసేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఏటీఎంలలో నగదు కొరతకు ఇదీ ఒక కారణమన్నది బ్యాంకింగ్ వర్గాల మాట. ⇔ డీమోనిటైజేషన్ ప్రకటన మర్నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇంట్రాడేలో బీఎస్ఈ 1,689 పాయింట్లు, నిఫ్టీ 541 పాయింట్ల మేర పతనమయ్యాయి. ⇔ అందరూ ఏటీఎంలపై ఆధారపడుతున్నందున ప్రజల వద్ద ఉన్న నగదులో ఎక్కువ శాతం పెద్ద నోట్లే కావడంతో అవి చెల్లని పరిస్థితుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటీఎంలు అన్నీ పనిచేయడానికి దాదాపు నెల రోజులు పట్టింది. అందుబాటులో ఉన్న ఏటీఎంలు సైతం నగదు లేక వెలవెలబోయాయి. ⇔ నగదు కొరత కారణంగా 4 లక్షల ట్రక్కులు జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నిలిచిపోయాయి. పాత నోట్లను అనుమతించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రభుత్వం స్పందించి టోల్ వసూళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఆస్పత్రులు, ఆయిల్ కంపెనీల వద్ద పాత నోట్లు చెల్లుతాయని ప్రకటించింది. ⇔ నగదు కొరతతో పారిశ్రామికోత్పత్తి దెబ్బతింది. అక్టోబర్‌లో పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ 54.5 ఉండగా, నవంబర్‌లో 46.7కు పడిపోయింది. ⇔ ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలో జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో 7 శాతం లోపునకు పడిపోతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అంచనాలు వేశాయి. కానీ, కేంద్ర గణాంక విభాగం మాత్రం మూడో త్రైమాసికంలో జీడీపీ 7 శాతంగా నమోదైనట్టు ప్రకటించింది. ⇔ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా దాడులకు దిగి డిసెంబర్ చివరి నాటికి లెక్కల్లో చూపని రూ.4,172 కోట్ల నల్లధనాన్ని గుర్తించింది. కొత్త నోట్లను పెద్ద మొత్తంలో పోగు చేసిన వారి నుంచి రూ.105 కోట్ల విలువ మేర సీజ్ చేసింది. సాధారణ పరిస్థితే ఏటీఎంల నుంచి మా కస్టమర్ల నగదు ఉపసంహరణలు డీమోనిటైజేషన్‌కు ముందు సాధారణంగా రూ.18,000గా ఉండేది. ఇతర బ్యాంకు కస్టమర్ల ఉపసంహరణలు రూ.10,000గా ఉండేది. ప్రస్తుత పరిస్థితి పెద్ద నోట్ల రద్దు ముందు మాదిరిగానే ఉంది. – రాజీవ్ ఆనంద్, యాక్సిక్ బ్యాంకు రూ.2,000 నోటంటే నో...! కస్టమర్ల తీరు మారింది. వారిప్పుడు ఏటీఎంల నుంచి రూ.1,900 ఉపసంహరించుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల రూ.500 నోట్లు మూడు, రూ.100 నోట్లు నాలుగు వస్తాయి. రూ.2,000 నోట్లు ఉంటే తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. – నవరోజ్ దస్తూర్, ఎండీ, ఎన్సీఆర్ ఇండియా (అతిపెద్ద ఏటీఎం సంస్థ) -
మూతపడ్డ బ్యాంకులు
విశాఖపట్నం: బ్యాంకులు మూతపడ్డాయి. వేతన సంబంధ అంశాలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీ యూ) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె చేయడంతో వందల కోట్ల లావాదేవీలకు బ్రేకులు పడ్డాయి. జిల్లాలో 750 బ్రాంచ్‌లుండగా వాటి పరిధిలో 1,112 ఏటీఎంలు పని చేస్తున్నాయి. బ్యాంకులు మూతపడడంతో మంగళవారం ఏటీఎంల వద్ద రద్దీ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.150 కోట్ల మేర లావాదేవీలకు బ్రేకులు పడినట్టుగా అంచనా. కాగా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు పనిచేసినా చెక్ క్లియరెన్సుల విషయంలో కొంతమేర ఇబ్బంది తప్పలేదు. భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఏ) అనుబంధ సంఘాలు, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్లు సమ్మెలో పాల్గొన్నారు. వరుస సెలవులు రావడంతో నగదు లేక చాలా ఏటీఎం వద్ద మళ్లీ నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె విషయంపై అవగాహన లేని వందలాది మంది ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లగా..అక్కడ సమ్మె కారణంగా మూతపడినట్టుగా బోర్డులు దర్శనమివ్వడంతో నిరుత్సాహంతో వెనుదిరగడం కన్పించింది. -
నిలిచిన బ్యాంకింగ్
• ఏటీఎంలు ఖాళీ • దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ప్రభావం న్యూఢిల్లీ: డిమాండ్ల సాధనకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు దాదాపుగా స్తంభించాయి. చాలా ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు లేక నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. వేతనాలతో పాటు వివిధ డిమాండ్లతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తమ సమ్మె విజయవంతమైందని, అన్ని బ్యాంకుల శాఖలు మూతబడ్డాయని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ‘నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ మొదలైన కార్యకలాపాలేవీ జరగలేదు. ప్రభుత్వ ట్రెజరీ లావాదేవీలు, ఎగుమతి..దిగుమతి లావాదేవీలు, మనీ మార్కెట్ కార్యకలాపాలు మొదలైనవి నిలిచాయి‘ అని చెప్పారు. నగదు బదిలీలు, క్యాష్ రెమిటెన్సులపైనా ప్రతికూల ప్రభావం పడింది. రిజర్వ్ బ్యాంక్ పనిచేసినా.. ఉద్యోగులు అందుబాటులో లేక క్లియరింగ్ కార్యకలాపాలకూ విఘాతం కలిగిందని వెంకటాచలం పేర్కొన్నారు. చాలా చోట్ల ఏటీఎంలు ఖాళీ అయిపోయాయని, పని చేసిన కొన్ని బ్యాంకుల్లోనూ నగదు పరిమిత స్థాయిలోనే ఉందని ఆయన వివరించారు. రూ.1.3 లక్షల కోట్ల లావాదేవీలపై ప్రభావం.. బ్యాంకింగ్ సమ్మె కారణంగా దాదాపు రూ. 1.3 లక్షల కోట్ల మేర ఫారెక్స్, క్లియరింగ్ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడనుందని పరిశ్రమల సమాఖ్య అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. భారీగా పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై కేంద్రం కసరత్తు చేయాలని ఆయన పేర్కొన్నారు. డిమాండ్లు ఇవీ... యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు తమ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వెల్లడించాయి. తమ శాఖల్లో కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ.. ఏటీఎంలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఖాతాదారులకు యథాప్రకారం సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది. మరోవైపు, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. యూఎఫ్‌బీయూలో 9 యూనియన్లు ఉండగా.. 2 యూనియన్లు(భారతీయ మజ్దూర్ సంఘ్‌కు చెందిన ది నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్) కూడా సమ్మెలో పాల్గొనలేదు. అవుట్సోర్సింగ్ తదితర సంస్కరణలు నిలిపివేయాలని, నోట్ల రద్దు అనంతరం మరిన్ని గంటలు అధికంగా పనిచేసిన ఉద్యోగులు.. అధికారులకు తగిన పరిహారం ఇవ్వాలని, తదుపరి వేతన సవరణ సమీక్షను సత్వరం చేపట్టాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది. అలాగే, అన్ని క్యాడర్లలో సముచిత స్థాయిలో నియామకాలు జరపాలని, మొండిబకాయిల రికవరీకి కఠిన చర్యలు తీసుకోవాలని.. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ కేసులు వేయాలని, టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను జవాబుదారీగా చేయాలన్నవి మిగతా డిమాండ్లు. డీమోనిటైజేషన్ వల్ల బ్యాంకులకు అయిన అదనపు వ్యయాలను సైతం రీయింబర్స్ చేయాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది. -
రూ. 2000 నోటు రంగు పోతోంది!
షాజహాన్ పూర్: ఏటీఎంలో వచ్చిన రూ.2,000 నోటు రంగు పోతోందని ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి శనివారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. రితిక్ గుప్తా అనే వ్యక్తి భారతీయ స్టేట్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంకు వెళ్లి రూ.10 వేలు తీయగా ఐదు రూ.2,000 నోట్లు వచ్చాయి. వాటిలో ఒక దాని రంగు పోతోందని రితిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది దొంగనోటు కాదనీ, రంగు పోతున్నట్లుగా ఫిర్యాదు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. ఏటీఎంలో దొంగనోట్లు వచ్చే అవకాశం లేదని బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ చెప్పారు. ఇటీవలే రిజర్వు బ్యాంకు బదులు చిల్ర్డన్ బ్యాంకు అని రాసి ఉన్న నాలుగు నోట్లు ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో రావడం తెలిసిందే. -
ఏటీఎంల్లో క్యాష్ విత్‌డ్రా పరిమితులు ఎత్తివేత
-
ఏటీఎంల్లో క్యాష్ విత్‌డ్రా పరిమితులు ఎత్తివేత
న్యూఢిల్లీ : ఏటీఎంల్లో నగదు విత్డ్రాయల్స్పై ఆర్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎంల్లో విధించిన క్యాష్ విత్‌డ్రా నిబంధనలను కరెంట్ ఖాతాదారులకు, క్యాష్ క్రెడిట్ ఖతాదారులకు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఎత్తివేస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2017 ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. భవిష్యత్తుల్లో వీరికి కూడా నిబంధనలు ఎత్తివేయడాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ప్రస్తుతం వారానికి రూ.24 డ్రా చేసుకునే అవకాశమే ఉంది. 2017-18కి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీనే కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఈ నిబంధనలు ఎత్తివేయడం విశేషం. కాగ జనవరి 16న కరెంటు ఖాతా నుంచి నగదు ఉపసంహరణ పరిమితి వారానికి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలను ప్రస్తుతం పూర్తిగా ఎత్తివేశారు. (చదవండి: ఏటీఎంలలో విత్‌డ్రా పరిమితి పెంపు) -
బ్యాంకులు కిటకిట
సాక్షి, చెన్నై : నాలుగు రోజులు సెలవుల అనంతరం బుధవారం బ్యాంకులు తెరచుకున్నాయి. జనం ఒక్కసారిగా దూసుకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి. ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడంతో జనానికి తిప్పలు తప్పలేదు. పెద్ద నోట్ల రద్దుతో జనం పడిన పాట్లు వర్ణణాతీతం. కొత్త నోట్ల రాక, కొత్త రూ.ఐదు వందల నోటు దర్శనంతో చిల్లర పాట్ల నుంచి కొంతమేరకు ఉపశమనం కలిగింది. క్రమంగా నగదు విత్‌డ్రాకు విధించిన ఆంక్షలు సడలిస్తూ రావడం ప్రజలకు ఊరటే. అయితే, అందుకు తగ్గట్టుగా నోట్లు బ్యాంకుల్లో, ఏటీఎంలలో కరువే. ఇక రోజుకు రూ. 10 వేలు ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునే విధంగా ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఏటీఎంలలో నగదు లేకపోవడంతో జనాలకు కరెన్సీ కష్టాలు తప్పలేదు. బ్యాంకులకు నాలుగు రోజులు వరుసగా సెలవులు రావడంతో జనానికి నోట్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. బుధవారం బ్యాంకులన్నీ తెరచుకున్నాయి. దీంతో ఖాతాదారులు నగదు కోసం బ్యాంకులకు పోటెత్తారు. జనం సంఖ్య పెరగడంతో మళ్లీ బ్యాంకుల ముందు బారులు తప్పలేదు. ఇక, ఏటీఎంలలో పది వేలు విత్ డ్రా చేసుకోవచ్చన్న ఆనందంతో వెళితే నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడంతో ప్రజలు నిరుత్సాహపడ్డారు. అయితే, కొన్ని ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉండడంతో జనాలు అక్కడ క్యూ కట్టారు. వరుస సెలవుల పుణ్యమా అని జనానికి కరెన్సీ కష్టాలు మరో రెండురోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఆర్బీఐ తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసే వాళ్లే అధికం. -
పండుగకు పైసలెట్లా..!
బ్యాంకుల వద్ద అవే బారులు రెండు నెలలు గడిచినా తీరని వ్యథ వేతన జీవులకు తప్పని కష్టాలు విత్‌డ్రా పెంచినా.. పనిచేయని ఏటీఎంలు మంచిర్యాల అగ్రికల్చర్ :గంటలు, రోజులు, నెలలు గడుస్తున్నాయి.. నగదు కొరత మాత్రం తీరడం లేదు. కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేసి నేటితో రెండు నెలలు గడిచినా బ్యాంకుల ఎదుట అవే బారులు కనిపిస్తున్నాయి. శనివారం జిల్లాలో పలు బ్యాంకులు, ఏటీఎంల ఎదుట పెద్ద ఎత్తున ప్రజలు క్యూలైన్లు కట్టారు. సంక్రాంతి – మిగతా 2లోu పండుగకు పైసలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పండుగ వారం, పది రోజుల ముందు నుంచే పలు పట్టణాలు, గ్రామాల్లో గృహిణులు పిండి తినుబండరాలు తయారు చేస్తుంటారు. ముఖ్యంగా సంక్రాతి పండుగకు పెట్టింది పేరైన సకినాలు ఇప్పటికే తయారు చేస్తుండేవారు. కానీ.. ఈ ఏడాది పెద్ద నోట్ల రద్దు, నగదు కొరతతో ఆ సందడే కనిపించడం లేదు. సామాన్య జనాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి కార్మికుల వేతనాలు పడి వారం గడుస్తోంది. ఇటు పింఛన్‌దారులు ఈ నెల 1వ తేదీ నుంచి బ్యాంకుల వద్ద బారులు తీరుతూనే ఉన్నారు. ఏటీఎంలో నగదు విత్‌డ్రా రూ.4500లకు పెంచినా నగదు పెట్టడమే లేదు. గతంలో రూ.2 వేలు వచ్చిన ఏటీఎంలు ఇప్పుడు మొత్తానికే పనిచేయడం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నగదు కొరత ఇబ్బంది 50 రోజుల్లో తొలగిపోతాయని ప్రకటించినా.. 60 రోజులు గడుస్తున్నా ఆ ఇబ్బందులు మాత్రం అదే విధంగా కొనసాగుతున్నాయి. ‘సంకురాత్రి పండుగ వచ్చిందంటే పదిరోజుల ముందు నుంచే బియ్యం పిండి పట్టించి సకినాలు, గారెలు చేసుకునేటోళ్లం. ఈ ఏడాది నోట్లు రద్దుతో వడ్లు అమ్మినా పైసలు ఇత్తలేరు. వాయిదా పెడతండ్రు. అటు బ్యాంకుల పైసలు అత్తలెవ్వు. పండుగ చేసుకునేటట్లు లేదు. రోజంతా బ్యాంకు ముందు లైను కడితే రెండు వేలు ఇత్తండ్రు.’ అని హాజీపూర్‌కు చెందిన నాత మల్లమ్మ వాపోయింది. సొంత ఖాతాదారులకే.. : బ్యాంకులు సొంత ఖాతాదారులకు మాత్రమే నగదు అందిస్తున్నాయి. దీంతో ఇటీవల జిల్లాల ఆవిర్భావంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులకు ఖాతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో బదిలీలపై వచ్చిన పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు స్థానికంగా బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకులో ఉన్న జీతం డబ్బు ఏ ఏటీఎంలోనైనా తీసుకునే అవకాశం ఉండటంతో చాలా మంది బ్యాంకు ఖాతాలు మార్చుకోలేదు. ప్రస్తుతం అలాంటి వారు బ్యాంకు శాఖల వద్దకు వెళ్తే తమ బ్రాంచిలో ఉండే ఖతాదారులకు మాత్రమే డబ్బులు ఇస్తామని స్పష్టంగా చెబుతుండటంతో పలువురు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఖాతాదారుడికే క్యాష్!
సొంత బ్రాంచి ఖాతాదారులకే పరిమితమవుతున్న బ్యాంకు సేవలు సాక్షి, హైదరాబాద్: సామాన్యుడిని నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నోట్లు రద్దు చేసి 55 రోజులవుతున్నా సరిపడ నగదు అందక జనం ఇబ్బందులపాలవుతున్నారు. అటు బ్యాంకులు కూడా సొంత ఖాతాదారులకే సేవలను పరిమితం చేస్తున్నాయి. ఏటీఎంల్లో ఎక్కడా క్యాష్ అందుబాటులో ఉండడం లేదు. అక్కడక్కడ కొన్ని ఏటీఎంలు పనిచేస్తున్నా అందులో వేరే బ్యాంకుకు చెందిన కార్డుల ద్వారా డబ్బులు రావడం లేదు. దీంతో ఖాతాదారులంతా కచ్చితంగా తమ బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నెల ప్రారంభం కావడంతో వేతన జీవులు సైతం జీతం డబ్బు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధవారం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. బ్యాంకుల వద్ద నగదు నిల్వలు లేకపోవడంతో ఖాతాదారులకు రూ.10 వేలతో సరిపెడుతున్నారు. హైదరాబాద్‌లోని దాదాపు అన్ని స్టేట్ బ్యాంకు శాఖల్లో ఖాతాదారులకు బుధవారం రూ.10 వేలే ఇచ్చారు. ఐసీఐసీఐ తదితర ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రం మధ్యాహ్నం వరకు ఒక్కో ఖాతాదారుడికి రూ.24 వేలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుడికి రూ.4 వేలు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల్లో రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారు. బ్యాంకులకు తిరిగి రాని కొత్త నోట్లు బ్యాంకుల్లో నగదు లావాదేవీల్లో డిపాజిట్లు, విత్‌డ్రాల నిష్పత్తి దాదాపు సమానంగా ఉంటుంది. ఈ నిష్పత్తిలో వ్యత్యాసం ఉంటేనే ప్రధాన కార్యాలయం లేదా ప్రధాన బ్రాంచి నుంచి నగదును తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్దనోట్ల రద్దుతో ఈ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వచ్చింది. పాతనోట్లు డిపాజిట్ చేసిన ఖాతాదారులంతా తిరిగి వాటిని తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. డిపాజిట్ అయిన మొత్తంలో కేవలం 35 శాతం మాత్రమే బ్యాంకులకు కొత్త నోట్ల రూపంలో నగదు వచ్చింది. దీంతో బ్యాంకులు వాటినే ఖాతాదారులకు పంపిణీ చేస్తున్నారు. మార్కెట్లోకి చేరిన కొత్త నోట్లు బ్యాంకుల్లో జమకావడం లేదు. మణికొండలోని ల్యాంకో హిల్స్ ఎస్బీఐలో నవంబర్ 8కి ముందు రోజుకు సగటున రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు డిపాజిట్ అయ్యేది. ప్రస్తుతం డిపాజిట్లు రూ.10 లక్షలు కూడా దాటడం లేదని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. అలాగే రాజేంద్రనగర్ ఎస్బీహెచ్లో రోజుకు రూ.60 లక్షల డిపాజిట్లు ఉండేవి. ఇప్పుడు కేవలం రూ.5 లక్షలు మాత్రమే వస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతి రోజూ ప్రధాన బ్యాంకు నుంచి నగదును తెచ్చుకోవాల్సి వస్తోందని, దీంతో సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలలో క్యాష్ నిల్ ఏటీఎం మెషీన్లలో క్యాష్‌ను అందుబాటులో ఉంచేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో బ్యాంకుకు అనుసంధానంగా ఉన్న ఏటీఎంలు గత రెండు నెలలుగా మూతబడే ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించి 7,548 ఏటీఎంలున్నాయి. వీటిలో కొత్తనోట్లకు అనువుగా ఉండేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో పాటు క్యాష్ట్రేలు మార్చేశారు. కానీ క్యాష్ లేకపోవడంతో ఈ మెషీన్లు ఔటాఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఏటీఎం మెషీన్లలో నగదు అందుబాటులో ఉంచితే ఇతర బ్యాంకులకు చెందిన ఖాతాదారులు సైతం విత్‌డ్రా చేస్తారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బ్రాంచికి చెందిన ఖాతాదారులకు నేరుగా నగదు ఇస్తే తమపై ఒత్తిడి తగ్గుతుందన్న ఉద్దేశంతో.. ఏటీఎం మెషీన్లలో నగదును పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు సంతృప్తికర స్థాయిలో నగదు వచ్చిన తర్వాతే ఏటీఎం మెషీన్లు పనిచేసే అవకాశం ఉంది. -
84 ఏటీఎంలు.. పనిచేస్తున్నవి 19
56 రోజులుగా నగదు కోసం తిప్పలు రూ.10 వేలకు కుదించిన విత్‌డ్రాలు అందుబాటులోకి రాని రూ.500 నోట్లు రూ. 2000 వేల నోటుతో చిల్లరకు కష్టాలు మంచిర్యాల అగ్రికల్చర్ : ప్రజలకు నోట్ల కష్టాలు తీరడం లేదు. జనవరి నెల వచ్చి నాలుగు రోజులు గడిచినా బ్యాంకుల నుంచి అరకొరగానే సేవలు అందుతున్నాయి. మంగళవారం కూడా నగదు కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సింగరేణి కార్మికులు, రైతులు, వ్యాపారులు, పింఛన్‌దారులు బ్యాంకులకు తరలివచ్చారు. అయినా.. ఎవరికీ పూర్తి స్థాయి లో నగదు అందలేదు. ఏటీఎంల్లో కూడా నగదు లేక జనం అవస్థలు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరతతో అల్లాడుతున్న వేతన జీవులకు జనవరి నెల ఒకటో తేదీ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కానరాని రూ.500 నోట్లు నోట్లు రద్దయినప్పటి నుంచి జిల్లాకు ఇప్పటికి వరకు రూ.600 కోట్ల మేరకు పైగా డిమాండ్ ఉండగా ఆర్బీఐ నుంచి వివిధ బ్యాంకులకు రూ.340 కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇందులో 80 శాతం రెండు వేలు నోట్లే మిగితా 20 శాతం చిల్లర నోట్లు. గంటల తరబడి క్యూల్లో నిలబడి తీసుకున్న నగదు రూ.2 వేల నోట్ల రూపంలో అందడంతో చిల్లర కోసం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాటిని మార్చేందేకు నానా అవస్థలు పడుతున్నారు. చిల్లర సమస్యల లేకుండా చేసేందుకు రూ.500 నోట్లు పంపుతున్నామని ఆర్బీఐ ప్రకటించినా క్షేత్రస్థాయిలో వాటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఏ బ్యాంకుకు, ఏ ఏటీఎంకు వెళ్లినా రూ.2 వేల నోట్లే వస్తున్నాయి. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు జిల్లాకు వచ్చినట్లు తెలుస్తున్నా బయట కనిపించడం లేదు. మరోపక్క జిల్లాకు వచ్చిన రూ.500 నోట్లు ఎక్కడున్నాయనే చర్చ జోరుగానే సాగుతోంది. రూ.500 నోట్లు తగినన్ని విడుదల చేసి ఉంటే చిల్లర కష్టాలు కొంతమేరకు తగ్గేవని ప్రజలు పేర్కొంటున్నారు. రూ.10 వేలకే పరిమితం.. ప్రతినెలా ఒకటి నుంచి వారం రోజులపాటు ఉద్యోగులకు మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారికి డబ్బుల అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో రెండు రోజులుగా ఉద్యోగులు పెన్షనర్లు ఇతర అన్ని వర్గాల వారు బ్యాంకులకు పోటెత్తారు. ఈ క్రమంలో బ్యాంకులకు వస్తున్న నగదు ఏ మూలకు సరిపోవడంలేదు. జిల్లా కేంద్రంలోని ప్రధాన బ్యాంకులన్నీ ఉద్యోగస్తులకు రూ.10 వేలు విత్‌డ్రాకే పరిమితం అవుతున్నాయి. ఒక్కో ఉద్యోగికి రూ.20 నుంచి రూ.60 వేల వరకు వేతనం ఉంటున్నా.. పది వేలతోనే సరిపెడుతున్నారు. మిగితా వారికి రెండు నుంచి నాలుగు వేలకు మించి ఇవ్వడం లేదు. సామాన్య ప్రజానికానికి వారానికి ఒక్కో ఖాతాదారుడికి రూ.24 వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. ఎక్కడా ఆ పరిస్థితి లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంత బ్యాంకుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కేవలం రూ.2 వేలు నుంచి నాలుగు వేల రూపాయల వరకు మాత్రమే విత్‌డ్రా ఇస్తున్నారు. తీరని కష్టాలు రోజులు గడుస్తున్నా నగదు కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల వద్ద సామాన్య ప్రజనీకానితోపాటు వేతనాల కోసం క్యూలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు 98 ఉండగా వీటి ద్వారా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులు రోజుకు రూ.10 నుంచి రూ.20 లక్షలు ఖాతాదారులకు చెల్లించేందుకు అందుబాటులో ఉండేవి. కానీ.. ఇప్పుడు రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకే పరిమితం అవుతున్నాయి. జిల్లాలో గ్రామీణ బ్యాంకులకు స్టేట్‌బ్యాంకు నుంచి నగదు సరఫరా అవుతుంది. స్టేట్‌బ్యాంకుల ఆర్బీఐ నుంచి అనకొర నగదు వస్తుండటంతో గతంలో ఇచ్చిన పెద్ద మొత్తంలో సగం కూడా ఇవ్వడం లేదు. దీంతో రెండు వేలు, నాలుగు వేలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. వారంలో రూ.24 వేలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది. రూ.600 కోట్లు డిపాజిట్.. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి వివిధ బ్యాంకుల్లో రూ.600 కోట్ల వరకు డిపాజిట్ చేశారు. నోట్లు రద్దయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ నుంచి జిల్లాకు రూ.340 కోట్ల వరకు వచ్చాయి. ఇందులో కొత్తగా వచ్చిన రెండు వేల నోట్లు రూ.310 కోట్లు. దీంతోపాటు ఇటీవల చెలామణికి వచ్చిన కొత్త రూ.500 నోట్లు పదికోట్లు కాగా.. మిగితా రూ.20 కోట్లు వంద, యాబై, ఇరవై, పది నోట్లతోపాటు పది రూపాయల కాయిన్స్ ఖాతాదారులకు అందించారు. రద్దయిన వాటి స్థానంలో సగం కూడా కొత్త నోట్లు అందుబాటులోకి రాలేదు. జిల్లాలో 65 వేల మంది ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి కార్మికులు ఉంటారు. వీరందరికీ ఒకటో తారీఖు నుంచి వారం రోజులపాటు వంద కోట్ల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయంలో సరిపడా నగదు జిల్లాలో వివిధ బ్యాంకులకు చేరాల్సి ఉన్నా.. ఆర్బీఐ నుంచి ఈ నెల 2వ తేదీ నుంచి ప్రధాన బ్యాంకులకు రూ.10 కోట్ల లోపే వచ్చినట్లు తెలుస్తోంది. ఏటీఎంలలో నో క్యాష్.. ఏటీఎంల అర్థం మారిపోయింది. ఎనీటైం మనీ బదులు, నో క్యాష్ ఏటీఎంలుగా మారిపోతున్నాయి. ఏటీఎంల్లో 90 శాతం నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. మిగితా పదిశాతంలో ఉదయం పూట పెట్టిన నగదు మధ్యాహ్నం వరకు ఖాళీ అవుతోంది. జిల్లాలో ఉన్న 84 ఏటీఎం కేంద్రాలకు గాను 21 ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఉదయం డబ్బులు పెడుతారని ఏటీఎం వద్ద క్యూ కడుతున్నా.. పెట్టకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. రావడం లేదు.. ఖాతాదారులు బ్యాంకు నుంచి నగదు తీసుకెళ్లడమే తప్ప నెలన్నర రోజులుగా రావడమే లేదు. గతంలో వస్తూపోతుంటే రొటేషన్ అవుతుండేది. కానీ.. నోట్లు రద్దయినప్పటి నుంచి తీసుకెళ్లడమే తప్ప డిపాజిట్ లేకుండాపోయింది. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు సరిపడా నోట్లు అందుబాటులో ఉంచడం లేదు. దీంతో ఖాతాదారులకు తక్కువగా ఇవ్వడం జరుగుతోంది. సర్దిచెబుతూ పంపిస్తున్నాం. నగదు రహిత లావాదేవీలు చేసుకోవాలని సూచిస్తున్నాం. – శ్రీనివాస్‌రావు, ఎస్బీహెచ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ -
‘చిల్లర’ కష్టాలు
రెండు నెలల నుంచి నిలిచిన రూ. 100, 50, 10 నోట్ల సరఫరా బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లు కొన్ని ఏటీఎంలలోనే రూ.500 నోట్లు జగిత్యాల : రద్దయిన ‘పెద్ద’నోటు.. ‘చిల్లర’ కష్టాలు తెచ్చిపెట్టింది. బ్యాంకుల్లో అవుతున్న డిపాజిట్లలో అన్నీ పెద్దనోట్లే ఉండడం.. ఆర్బీఐ నుంచీ కొత్త రూ. 2వేల నోట్లు మాత్రమే వస్తుండడంతో ఇటు బ్యాంకులు.. అటు ప్రజలకు చిల్లర ఇక్కట్లు తప్పడం లేదు. రూ. 2వేల పెద్దనోటు మార్కెట్లో వచ్చి రెండు నెలలు కావస్తున్నా.. దాని చెలామణి నేడూ ప్రజలకు సవాలుగా మారింది. రూ. 2వేలతో బజారుకు వెళ్తే అందులో కనీసం రూ. 500 మేర ఖరీదు చేయనిదే వ్యాపారులు సరుకులు ఇవ్వడం లేదు. దీంతో ప్రజలు అవసరం లేకున్నా.. కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇటు వ్యాపారులూ.. రూ. 2వేలకు చిల్లర ఇవ్వలేక తమ గిరాకీని కోల్పోతున్నారు. ప్రస్తుతం ఏటీఎంలు.. బ్యాంకుల్లో అందుబాటులో లేని రూ. 500, రూ. 100, రూ. 50, రూ. 10 నోట్లు సామాన్యుడి బతుకుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. గడిచిన రెండు నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా.. రూ. 223 కోట్లు డిపాజిట్ల రూపంలో వివిధ బ్యాంకుల్లో జమా కాగా.. ఇప్పటి వరకు కేవలం రూ. 110 కోట్ల నగదు మాత్రమే ఆర్బిఐ నుంచి జిల్లాకు చేరింది. జరిగిన డిపాజిట్లు.. వచ్చిన నగదులో అన్నీ పెద్దనోట్లే ఉండడంతో చిల్లర కష్టాలు వచ్చిపడ్డాయి. మరోపక్క.. పాత పెద్దనోట్లు రద్దయినప్పటి నుంచి బ్యాంకులకు రూ. 100, రూ. 50, రూ. 10 కొత్తనోట్ల సరఫరాకు బ్రేక్‌పడింది. ప్రజలూ తమ వద్ద ఉన్న పెద్దనోట్లు వదిలించుకోవడంపైనే దృష్టిపెట్టారు. దీంతో బ్యాంకులు, మార్కెట్లో చిల్లర కష్టాలు వచ్చిపడ్డాయి. డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు వచ్చిన చిన్న నోట్లనే మేనేజర్లు ఖాతాదారులకు ఇస్తున్నారు. చిల్లరలేని పక్షంలో ఖాతాదారులనే సర్దుకోవాలని చెప్తున్నారు. గత నెల 31వ తేదీ వరకు కేవలం రూ. 2వేల నోటు మాత్రమే బ్యాంకుల నుంచి పంపిణీ అయ్యాయి. మొన్నటి వరకు ఏటీఎంల ద్వారా రూ. 2వేలు ఉన్న పరిమితిని రూ. 4,500కు పెంచడంతో ఈ నెల ఒకటో తేదిన రూ. 500 నోట్లు బ్యాంకులకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ నోటూ కేవలం ఏటీఎంలలో మాత్రమే దర్శనమిస్తోంది. బ్యాంకులకు వెళ్లిన వారికి రూ. 2వేల నోటు మాత్రమే అందుతోంది. చిల్లర కావాలంటే ఖాతాదారులే సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బ్యాంకుల్లో మాత్రం ప్రజలకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఇదీలావుంటే.. ఆర్బీఐ నుంచి అవసరం మేరకు నగదు రాకపోవడంతో జిల్లాలో ఉన్న బ్యాంకర్లు రోజుకో ఏటీఎం చొప్పున ఎంపిక చేసిన వాటిలో డబ్బులు జమా చేస్తున్నారు. ఏటీఎంలోనే రూ. 500 నోటు.. ఆర్బీఐ కొత్తగా చెలామణిలోకి తెచ్చిన రూ.500 నోటు జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వచ్చిన అరకొర నోట్లనే బ్యాంకర్లు సర్దుబాటు చేస్తున్నారు. బ్యాంకుల్లో రూ. 100 నోట్లు అందుబాటులో లేకపోవడం.. ఈ నెల ఒకటో తేది నుంచి ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి రూ. 2వేల నుంచి రూ. 4,500లకు పెంచడంతో కొత్తగా వచ్చిన అరకొర రూ. 500 నోట్లను ఏటీఎంలలో జమా చేస్తున్నారు. కోరుట్ల, మెట్పల్లి వంటి పట్టణాల్లోని ఏటీఎంలలో మాత్రం రూ. 2వేలతో పాటు రూ. 500 నోట్లు ఉంటున్నాయి. జిల్లా కేంద్రంలో మాత్రం ఏటీఎంలోనూ రూ. 500 నోటు కనబడడం లేదు. రూ. 100 నోటు మాత్రమే ఏటీఎంలలో అందుబాటులో ఉంది. తెరుచుకోని ఏటీఎంలు.. జిల్లాలో సగానికి పైగా ఏటీఎంలు నేటికీ తెరుచుకోలేదు. పైగా మొన్నటి వరకు తెరిచి ఉన్న ఏటీఎంలు సైతం రెండ్రొజుల నుంచి తాళం వేసి కనబడుతున్నాయి. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి.. 97 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో 60 ఏటీఎంలు అసలు తెరుచుకోవడమే లేదు. తెరుచుకుంటోన్న 37 ఏటీఎంల ముందు జనం బారులు తీరడంతో గంటలోపే నగదు అయిపోతోంది. దీంతో అవి మళ్లీ మూతబడుతున్నాయి. విత్‌డ్రా పరిమితి పెంపుతో.. ఏటీఎంల ముందు జనం బారులు తీరడం, అవసరం మేరకు నగదు అందుబాటులో లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ప్రధాన పట్టణాల్లో రోజుకు రెండుకు మించి ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. మంగళవారం జిల్లా కేంద్రంలో నాలుగు ఏటీఎంలు పనిచేశాయి.కోరుట్లలో రెండ్రొజుల నుంచి కేవలం గాయత్రి ఏటీఎం మాత్రమే పనిచేస్తోంది. మెట్పల్లిలో రోజు ఐదు ఏటీఎంలు తెరుచుకుంటుండగా.. గంటలోపే ఖాళీ అవుతున్నాయి. -
మళ్లీ అవే బారులు
► వేతన కష్టాలు షురూ.. ► ఇబ్బందులు పడ్డ పెన్షనర్లు ► బ్యాంకులు, ఏటీఎంల క్యూ నిర్మల్ టౌన్ : వేతనజీవుల కష్టాలు ప్రారంభమయ్యాయి. వేతనాలు అలా ఖాతాలో వేయడమే ఆలస్యం బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద బారులు ప్రారంభమయ్యాయి. ప్రతీ నెల వేతనం కోసం ఎదురుచూసే సగటు జీవికి ఈసారి కూడా కష్టాలు తప్పేలా లేవు. బ్యాంకుల్లో తగినంత నగదు లేకపోవడంతో బ్యాంకు అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. అలాగే బ్యాంకుల వద్ద కూడా ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లను చేయలేదు. దీంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు పడాలి అంటూ వారు అసహనం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడి 50 రోజులు దాటినా ఇంకా ఎలాంటి నగదు కొరత వేధిస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచే బారులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద వేతన జీవులు ఉదయం నుంచే బారులు తీరి కనిపించారు. బ్యాంకుల్లో పూర్తిస్థాయిలో నగదు లేకపోవడంతో మళ్లీ పాత పరిస్థితే కనిపించింది. బ్యాంకుల నుంచి ప్రతీరోజు రూ.10 వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నా, అంతస్థాయిలో నగదు లేకపోవడంతో పరిమితిని తగ్గించి నగదును ఖాతాదారులకు అందజేశారు. ఏటీఎంలలో కూడా భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరి కనిపించారు. ఎస్బీహెచ్ ప్రధాన ఏటీఎం మూసి ఉండడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా సేవలు అందించిన ఏటీఎం మూసి ఉండడంతో వారు ఇక్కట్లు పడ్డారు. ఏటీఎంలలో రూ.4,500 నగదు వస్తుండడం ఒక్కటే ఇన్ని కష్టాల మధ్య వేతన జీవులకు ఊరట కలిగించే అంశం. తప్పని ఇబ్బందులు రెండు నెలలుగా వేతనాల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటి నుంచి బ్యాంకు అధికారులు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. బ్యాంకుల్లో వేతనాల కోసం వచ్చే ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. దీంతో పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మహిళ ఉద్యోగులు సైతం క్యూలైన్లలో వేచి ఉండలేక అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ బ్యాంకుల్లో అ లాంటి ఏర్పాట్లు కనిపించలేదు. ఒకవైపు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం మరోవైపు క్యూలైన్లలో నిల్చుండాల్సి రావడంతో వారు అసహనం వ్యక్తంచేశారు. మొదటి తేదీ ఆదివారం రావడంతో సోమవారం పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్దకు చేరుకున్నారు. ఉదయం బ్యాంకులు తెరవకముందే పింఛన్ దారులు పడిగాపులు కాయడం కనిపించింది. వేతన ఇబ్బందులకు మూడో నెల పెద్ద నోట్ల రద్దు అనంతరం రెండు నెలలుగా వేతన కష్టాలను వివిధ ఉగ్యోగులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మూడో నెల కూడా వారికి వేతనాల వెతలు తప్పలేదు. నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, ఇతర అవసరాల కోసం నగదు అవసరమవుతుంది. కనీస అవసరాలయిన వీటి కోసం కూడా సరిపడా నగదు చేతికి అందకపోతుండడంతో వేతన జీవులు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలలుగా తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని, ఈ నెల అయినా ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేస్తుందని వారు ఆశపడ్డారు. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. -
నోట్ల వేట
సిరిసిల్ల : కొత్త సంవత్సరంలోనూ జనాలకు నోట్ల తిప్పలు తప్పలేదు. ఆదివారం బ్యాంకులకు సెలవ కావడంతో నగదు కోసం ఖాతాదారులకు ఏటీఎంలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో 16 ఏటీఎంలు ఉండగా.. ఎస్బీహెచ్, గాయత్రీ బ్యాంకుల ఏటీఎం మాత్రమే పని చేశాయి. మిగతా వాటి ఎదుట ‘నో క్యాష్’ బోర్డులు తగిలించారు. నెలమొదటి రోజు కావడంతో బ్యాలెన్స్ పరిశీలించేందుకు, నగదు డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు ఏటీఎంల ఎదుట బారులు తీరా రు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల డబ్బులు ఖాతాల్లో పడడంతో వారు సైతం నగదు కోసం ఏటీఎంలను ఆశ్రయించారు. అయితే, ఆర్బీఐ తాజా నిర్ణయంతో పనిచేసే రెండు ఏటీఎంల నుంచి రూ.4500 విత్‌డ్రా చేసుకున్న ఖాతాదారులు కాస్త ఊపిరి తీల్చుకున్నారు. మొన్నటి వరకు రోజుకు రూ.2000, ఆ తర్వాత రూ.2,500 తీసుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా రూ.4,500 తీసుకున్నారు. ఇందులో రూ.రెండువేల నోట్లు రెండు, ఐదు వం దల నోట్లు అందాయి. కొత్త సంవత్సరం వేళ సిరిసిల్లలో పాత సమస్యనే జనాన్ని వెంటాడింది. అన్ని బ్యాంకులు ఏటీఎంల్లో డబ్బులను అందుబాటులో ఉంచితే.. బ్యాంకుల్లో జనం రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. నేటి నుంచి రద్దీ.. ఉద్యోగులకు సోమవారం వేతనాలు తమ బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. దీంతో వేతనాలు డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీనిని అధిగమిం చేందుకు బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలి ఉంది. -
అసలు పనిచేసే ఏటీఎంలెన్నో తెలుసా?
-
ముగిసిన గడువు
పాత రూ.500, రూ.1000 నోట్లకు తెర చివరి రోజు పెద్దగా కనిపించని నగదు మార్పిడి 98 బ్యాంకులు, 139 పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి ఏటీఎంల వద్ద కొనసాగిన క్యూలు మంచిర్యాల అగ్రికల్చర్ : పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి గడువు ముగిసింది. యాబై రోజులపాటు సాగిన ఈ నోట్ల మార్పిడి ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధనం బయటికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందు లు మాత్రం తప్పడం లేదు. జిల్లాలో నెలన్నరోజులపాటు దగ్గర ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ఎదుట బారులు తీరారు. చివరి రోజు తక్కువే.. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ 98 బ్యాంకుల్లో, వారం రోజులపాటు 139 పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. చివరి – మిగతా 2లోu రోజైన శుక్రవారం నగదు మార్పిడికి పెద్దగా జనసందడి కనిపించలేదు. బ్యాంకుల్లో ఎక్కువగా విత్‌డ్రాకు మాత్రమే జనాలు వస్తున్నారు. పాత నోట్లను రద్దు చేసి 52 రోజులు గడిచినా ఇంకా నగదు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాంకుల అవసరం మేరకు డబ్బు చేరకపోవడం, ఏటీఎంల నుంచి సరిపడా చేతికందపోవడంతో ప్రజలు కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నోట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా, ఏటీఎం వద్ద బారులదీరినా వారి చేతికందేది కొద్ది మొత్తంలోనే.. అందులో రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో దానికి చిల్లర దొరక్క చూసుకొని మురువాల్సి వస్తోంది. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి పనికి రాకుండాపోతున్నాయి. వివిధ రూపాల్లో అవకాశాలు.. నవంబర్ 8 నుంచి రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో మార్చుకునేందుకు వివిధ రకాల ఆప్షన్లు ఇచ్చింది. ఈ నోట్ల మార్పిడి రోజుకు నాలుగు వేల చొప్పున ఆ నెల మొత్తం అవకాశం ఇచ్చింది. దీంతోపాటు ప్రభుత్వ పన్నుల చెల్లింపునకూ రూ. వెయ్యి, రూ.500 నోట్లను అంగీకరించింది. పన్నులు చెల్లింపునకు మూడు సార్లు గడువు పెంచుతూ వచ్చింది. చివరిగా డిసెంబర్ 15 వరకు గడవు ఇచ్చింది. తదనంతరం పాత నోట్లను బ్యాంకుల్లో వారివారి ఖాతాల్లో జమ చేసేందుకు నిబంధన విధించింది. మార్చుకోవడంతోపాటు పన్నులు చెల్లించగా మిగిలిన నోట్లను జమ చేసుకునేందుకు డిసెంబర్ 30 వరకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో నల్లకుబేరులు శత విధాలు ప్రయాత్నిస్తునే ఉన్నారు. పాత నోట్లు దొరికితే జైలే.. రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకులో జమ చేయడానికి గడవు ముగిసినందునా ఇక ఈ నోట్లు దేనికీ ఉపయోగపడవు. ఆర్బీఐ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పలు రకాల నిబంధనలతో మార్చి 31 వరకు జమ చేసుకునేందుకు గడువు ఉంది. తదుపరి కూడా ఈ నోట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. రద్దుచేసిన నోట్లు రూ.10 వేల వరకు ఉంటే పెద్దగా పట్టించుకోరు. కానీ.. అంతకుమించి ఎక్కువ ఉన్నా.. ఇతరులకు బదిలీ చేసినా శిక్షార్హులే అవుతారు. నల్లకుబేరుల్లో రైళ్లు పరుగు.. పెద్ద మొత్తంలో అక్రమంగా సంపాదించిన నగదు పాత రూ.500, 1000 నోట్లను మార్చుకునేందుకు నల్లకుబేరులు గడిచిన 50 రోజులు శతవిధాలా ప్రయత్నించారు. నోట్ల మార్పిడికి కమీషన్ ఏజెంట్లను సైతం ఆశ్రయించారు. జిల్లాలో ఎక్కువగా రియల్ ఎస్టేట్, బంగారం, ఇతర వ్యాపారుల ద్వారా అక్రమంగా సంపాదించిన వారు నగుదు మార్చుకునేందకు పలు అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ఇప్పటికే నగదు మార్పిడి చేస్తూ కొంత మంది కమీషన్ ఏజెంట్లు పట్టుబడ్డ సంఘటనలూ ఉన్నాయి. నల్లకుబేరులు పేదలను పావులుగా వాడుకొని జన్‌ధన్ ఖాతాల్లో సైతం డిపాట్ చేయించినట్లు తెలుస్తోంది. నోట్లు రద్దయిన వారం రోజుల్లో పెద్ద మొత్తంలో బంగారం విక్రయాలు కూడా పెరిగాయి. రూ.500, 1000 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకు, పోస్టాఫీసుల్లో సుమారుగా రూ.600 కోట్ల నోట్లను జమచేసినట్లు తెలుస్తోంది. -
అసలు పనిచేసే ఏటీఎంలెన్నో తెలుసా?
ముంబై: పెద్ద నోట్ల రద్దులో అత్యంత కీలకమైన ఘట్టం.. రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు డిసెంబర్ 30 శుక్రవారంతో ముగిసింది. ఈ లోపల ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సరిపడ నగదు విషయంలో ప్రభుత్వం వాగ్దానం నెరవేరినట్టు కనిపించడం లేదు. దేశీయంగా ఉన్న ఏటీఎంలో కేవలం 30 శాతం మాత్రమే నగదును అందిస్తున్నాయని, మిగతా రెండు వంతులకు పైగా ఏటీఎంలు నోక్యాష్ బోర్డులనే వెక్కిరిస్తున్నట్టు వెల్లడైంది. దీంతో ఈ ఏటీఎంలు ఉన్నా ఒకటే లేకపోయినే ఒకటే అన్నచందాగా మారాయి. బ్యాంకులు సైతం కస్టమర్లకు నగదును తమ బ్రాంచ్ కార్యాలయాల నుంచే అందిస్తున్నాయని ఏటీఎంలలో మాత్రం నగదు నింపడం లేదని తెలిసింది. కేవలం 30 శాతం అంటే 66,000 ఏటీఎంలు మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నాయని ఏటీఎం ఇండస్ట్రి కాన్ఫడరేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ పటేల్ తెలిపారు. రెండు నెలల డీమోనిటైజేషన్ కాలంలో కేవలం 20 శాతం ఏటీఎంలలోనే రెగ్యులర్‌గా నగదును నింపినట్టు ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజూ రూ.7-8 లక్షల వరకు ఏటీఎంలలో నగదును నింపేవారని, కానీ నోట్ల రద్దు అనంతరం రోజుకు కేవలం రూ.2-3 లక్షల నగదునే నింపినట్టు తెలిసింది. అత్యధిక మొత్తంలో నగదు కావాలనుకునే వారు బ్యాంకుల్లోనే నగదు తీసుకోవడానికి మొగ్గుచూపారని భారత్, దక్షిణాసియా ఎన్సీఆర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్రోజ్ దస్తూర్ చెప్పారు. ఎస్బీఐ ఒక్క బ్యాంకే ఏటీఎంలలో నగదును మంచిగా ఫిల్ చేసిందని, ప్రైవేట్ బ్యాంకులు తమ కార్యాలయాల నుంచే నగదును అందించాయని తెలిపారు. -
బోరుమనీ..
జిల్లాలో ఒడవని పెద్ద నోట్ల కష్టాలు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద కొనసాగుతున్న బారులు నగదు కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు అత్యవసర సేవలకు అవస్థలు 50 రోజులు దాటినా అదే పరిస్థితి జనగామ : ‘‘డిసెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే కరెన్సీ కష్టాలు ఉంటాయి.. తర్వాత నుంచి అందరు ఎప్పటిలాగే బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు తీసుకోవచ్చు..’’ అని దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేసి 50 రోజులు దాటినా జిల్లాలో నోటు పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. నగదు కోసం బ్యాంకులు, ఏటీఎం సెం టర్ల వద్ద ఖాతాదారులు బారులు తీరుతూనే ఉంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. నల్లధనం వెలికితీత, నకిలీనోట్ల చెలామణి ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8వ తేదీన పాత రూ.500, రూ1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి మొదలైన కరెన్సీ కష్టాలు నేటికి తీరడం లేదు. జిల్లాలోని 13 మండలాల్లో 22 జాతీ య బ్యాంకులు, 16 రీజినల్ రూరల్ బ్యాంకులు, 3 కో ఆపరేటివ్ బ్యాం కులు, 6 ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాం కుల్లో సరిపడా డబ్బులు లేకపోవడంతో ఖాతాదారు లు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాం కులు తెరవక ముందే వందలాది మంది గేట్ల ఎదుట క్యూ కడుతున్నారు. కాగా, ముందు నిలబడిన వారికే కొంత నగదు ఇస్తుండగా, వెనకాల వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. పలు చోట్ల నో క్యాష్ బోర్డులు.. జిల్లా కేంద్రంలోని ఎస్బీహెచ్, ఎస్బీఐ, గ్రామీణ వికాస్ బ్యాంకులు శుక్రవారం ఖాతాదారులతో రద్దీగా మారాయి. గుండా మండల కేంద్రంలోని ఎస్బీహెచ్, నర్మెట మండల కేంద్రంలోని బ్యాంకు ఆఫ్ బరోడా ఎదుట భారీ లైన్లు కట్టారు. ఆయా ప్రాంతాల్లో ముందున్న వారికే నోట్లు రాగా.. వెనకున్న వారికి అందలేదు. తరిగొప్పులలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో కేవలం 150 మందికి మాత్రమే ముందుగా టోకెన్లు ఇచ్చి మిగతా వారిని రేపు రమ్మని అధికారులు వెనక్కి పంపించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంకులో ఉదయం పూటనే డబ్బుల కోసం ఖాతాదారులు బారులు తీరారు. రెండు గంటల తర్వాత అధికారులు ఇక్కడ నో క్యాష్ బోర్డు తగి లించారు. మూడు గంటల పాటు క్యూలో నిలబడినా ఫలితం లేకుండా పోయింది. గ్రామీణ వికాస్ బ్యాంకులోనే అదే దుస్థితి నెలకొంది. స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఎస్బీహెచ్, ఎస్బీఐ బ్యాం కులు రద్దీగా మారాయి. ఇక్కడ కేవలం రూ.6 వేలు మాత్రమే ఇచ్చారు. కొడకండ్ల ఎస్బీఐ బ్యాంకులో కేవలం రూ.2 వేలు మాత్రమే ఇచ్చారు. రెండు గంటల పాటు లైన్లో నిలబడితే చేతికి ఇచ్చారు. దేవరుప్పుల ఆంధ్రా బ్యాంకులో బారులు తీరారు. ఖాతాదారులు ఎక్కు వ మందికి రావడంతో రద్దీగా మారిం ది. రఘునాథపల్లిలోని ఎస్బీహెచ్, ఎస్బీఐ, గ్రామీణ వికాస్ బ్యాంకులు, పాలకుర్తిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు, గ్రామీణ వికాస బ్యాంకుల్లో రెండు, మూడు గంటల పాటు క్యూలో నిలబడిన చేతిలోకి నోట్లు రాలేదు. పనిచేయని ఏటీఎంలు.. పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి జిల్లాలోని ఏటీఎంలు పనిచేయడం లేదు. జిల్లాలో మొత్తం 33 ఏటీఎంలు ఉండ గా.. ఎక్కడ కూడా సరిగా పనిచేయడం లేదు. పలు ఏటీఎంల్లో అధికారులు క్యాష్ పెట్టడమే మానేశా రు. ఎస్బీఐ, ఎస్బీహెచ్ ఏటీఎంలు మినహా ఎక్కడ పనిచేయడం లేదు. డిపాజిట్లు తక్కువ.. విత్ డ్రాలు ఎక్కువ.. పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు అధి కారులు శుక్రవారం చివరి గడువు విధించా రు. దీంతో కొంతమంది తమ వద్ద ఉన్న పాత రూ.500. రూ.1000 నోట్లను జమ చేసేందుకు బ్యాంకుల వద్దకు వచ్చారు. డిపాజిట్లు చేసేందుకు తక్కువ సంఖ్యలో వచ్చినప్పటికి విత్ డ్రా కోసం వందల సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకుల్లో క్యూ కట్టారు. సరి పడా నగదు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిపోయారు. మొత్తంగా సకాలంలో నగదు అందక ప్రజలందరూ బోరు‘మనీ’ విలపిస్తున్నారు. -
క్యాష్ లేట్ సేవలు
నగదు రహిత లావాదేవీలకు సెల్ నంబర్ల చిక్కు జిల్లాలో 30 శాతం మందికి మొబైల్ ఫోన్లు లేవు ఇంటింటి సర్వేలో తేల్చిన అధికారులు క్యాష్‌లెస్ సేవలకు అంతరాయం జనగామ : దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు నగదు పాట్లు పడుతూనే ఉన్నారు. నిత్యావసర వస్తువుల నుంచి అత్యవసర సేవల కోసం చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నా తగినంత డబ్బు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పల్లెల్లో నగదు రహిత సేవలను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించడంతో జిల్లాలో వాటిని విజయవంతం చేసేందుకు అధికారులు కొన్ని రోజులుగా కృషి చేస్తున్నారు. అయితే కొత్త జిల్లాగా రూపాంతరం చెందిన జనగామలో క్యాష్‌లెస్ లావాదేవీల వైపు అడుగులు పడుతున్న తరుణంలో సెల్ నం బర్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. నగదు లేకుండా కార్డుతో అందించే సేవల్లో కీలకపాత్ర పోషించే సెల్ నంబర్లు ప్రజలందరికీ లేకపోవడంతో అధికారులు సందిగ్దంలో పడ్డారు. 35,947 మందికి ఖాతాలు లేవు.. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు కలిసి ఇటీవల 13 మండలాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు. నవంబర్ మొదటి వారంలో నిర్వహించిన సర్వేతో జిల్లాలో 1,54,519 కుటుం బాలు ఉండగా, 17,619 కుటుంబాలు డెబిట్ కార్డు, స్మార్ట్ ఫోన్‌తో లావాదేవీలు కొనసాగిస్తున్నారు. కాగా, 87,969 మందికి ఖాతాలు ఉండగా, 35,947 మందికి లేవు. ఇదిలా ఉండగా అకౌం ట్ల మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికి బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు కొన్ని గ్రామాలను క్యాష్‌లెస్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. పైలెట్‌గా ఆరు గ్రామాల ఎంపిక.. జిల్లాలో 28 గ్రామాలను క్యాష్‌లెస్ సేవల కింద ఎంపిక చేశారు. ఇందులో శామీర్‌పేట, కొడవటూర్, బండనాగారం, తమ్మడపె ల్లి, యశ్వంతాపూర్, నష్కల్ను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రారంభిం చేందుకు అధికా రులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం కార్డుల జారీ, స్వైపింగ్ మిషన్ల వినియోగంపై చైతన్యం చేస్తున్నారు. ఆధార్, సెల్ నంబర్లు కీలకం.. క్యాష్‌లెస్ లావాదేవీల్లో ఆధార్ నంబర్, సెల్ నంబర్ కీలకంగా ఉంటాయి. స్వైపింగ్ మిషన్‌లో కార్డును స్వైప్ చేసినప్పుడు విని యోగదారుడి సెల్ నంబర్‌కు మెసెజ్ వస్తుంది. ఇందులో ఎంత వరకు ఖర్చు చేశామనేది మెసెజ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే అసలే సెల్ నంబర్ లేని వారికి క్యాష్‌లెస్ లావాదేవీలు అందకుండా పోతున్నాయి. కుటుంబానికి మొత్తంగా ఒకే నంబర్.. జనగామ మండలం శామీర్‌పేటలో నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహించడంలో జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. ఈ గ్రామంలో ఇప్పటివరకు 73 మందికి సెల్ నంబర్లు లేవు. కొన్ని గ్రామాల్లో ఇంట్లో ఒకటే నంబర్ ఉంది, ఇద్దరు కలిపి ఒకే నం బర్ను వినియోగిస్తున్నారు. బ్యాంకుల్లో ఒకటే నంబర్‌ను ఇద్దరు వినియోగించడం, ఖాతా, ఏటీఎం జారీలో ఒకటే సెల్ నంబ ర్ను ఇవ్వడం కారణంగా స్వైప్ చేసిన సమయంలో మెసెజ్ రాదు. దీంతో వినియోగదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా ముందు సెల్ నంబర్లు తీసుకు నే విధంగా అధికారులు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. అయితే అధికారులు బీఎస్ఎన్ఎల్ నంబర్ తీసుకోవాలని సూచిస్తున్నప్పటికి ఆయా గ్రామాల్లో సిగ్నల్ ప్రాబ్లమ్ కారణంగా చాలామంది తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇలా క్యాష్‌లెస్ లావాదేవీలకు సెల్ నంబర్లు లేకపోవడం అధికారుల ప్రయత్నానికి ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా, జిల్లాలో 30 శాతం మందికి సెల్ నంబర్లు లేవని తెలిసింది. -
నగదులో.. నల్లధనం లేనట్లేనా..!
తెలంగాణలో రూ.70 వేల కోట్లు దాటిన డిపాజిట్లు ► డిసెంబర్ పదో తేదీ నాటికే రూ.60 వేల కోట్లకు చేరిన డిపాజిట్లు ► ఆ తర్వాత వివరాల వెల్లడిపై గోప్యత పాటిస్తున్న ఆర్బీఐ ► రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చింది రూ.22 వేల కోట్లే సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నల్లధనం లేదని తేటతెల్లమైనట్లేనా...! పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న నగదుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. కేంద్రం నిర్ణయించిన గడువుకు ముందే రాష్ట్రంలో చెలామణిలో ఉన్న 500, 1000 నోట్లన్నీ తిరిగి బ్యాంకు ఖాతాల్లోకి చేరుకోవటం గమనార్హం. దీంతో నగదు రూపంలో నల్లధనం నిల్వలేవీ రాష్ట్రంలో లేవని లెక్క తేలినట్లయింది. కేంద్రం, ఆర్బీఐ అంచనాల ప్రకారం తెలంగాణలో రూ.70 వేల కోట్ల విలువైన పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నాయి. డిసెంబరు 30వ తేదీకి ఒక రోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో జమైన పెద్ద నోట్ల విలువ రూ.70 వేల కోట్లకు చేరినట్లు అంచనాలున్నాయి. ఈనెల 10వ తేదీ నాటికి ప్రజలు జమ చేసిన డబ్బు, మార్చుకున్న పాత నోట్ల విలువ రూ.60 వేల కోట్లు. స్వయంగా ఆర్బీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన సమాచారం ఇది. ఆ తర్వాత బ్యాంకులకు వచ్చిన డబ్బు వివరాలను ఆర్బీఐ అధికారికంగా వెల్లడించకుండా గోప్యత పాటించింది. కానీ గడిచిన 19 రోజుల్లో రమారమి రూ.10 వేల కోట్ల డబ్బు జమ అయినట్లు బ్యాంకు అధికారులు, ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లకు సరిపడే సంఖ్యలో నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి చేరాయి. బడాబాబులు, నల్ల కుబేరులు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమ దగ్గర నిల్వ ఉన్న నగదును బ్యాంకుల్లో వేసుకునేందుకు వెనుకంజ వేస్తారని, దీంతో రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల నుంచి రూ.65 వేల కోట్ల మధ్యలోనే పెద్ద నోట్లు బ్యాంకులకు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఆర్బీఐ సైతం అదే అంచనాలను వ్యక్తం చేసింది. కానీ పెద్ద నోట్లు అంచనాకు మించి జమ కావటంతో తాజా పరిణామాలను అధికారులు మరో కోణంలో విశ్లేషించుకుంటున్నారు. తెలంగాణలో పన్ను పరిధిలోకి వచ్చే డబ్బు గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. బడా బాబులు సైతం తమ దగ్గరున్న నగదును బ్యాంకుల్లో జమ చేశారని, దీంతో ఇప్పటివరకు పన్ను ఎగవేతకు గురైన డబ్బు సైతం బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిందని లెక్కలేస్తున్నారు. బ్యాంకుల్లో చేరిన డబ్బు పక్కాగా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొందరు నల్ల కుబేరులు సర్కారుకు చిక్కకుండా నల్లధనంతో భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేసిన అభియోగాలున్నాయి. కేంద్రం నిర్ణయం వెలువడిన ఒక రోజు వ్యవధిలోనే వందలాది కోట్ల బంగారం వ్యాపారం జరిగిందని ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు గుర్తించటం ఈ పరిణామాలను ధ్రువపరుస్తోంది. యాభై రోజులుగా ఉత్కంఠ నల్లధనానికి అడ్డుకట్ట వేసే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసింది. తొలుత బ్యాంకులకు వెళ్లి రూ.4000 వరకు నగదు మార్పిడికి అవకాశం ఇచ్చింది. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఫీజులు, బకాయిలు, పన్నుల చెల్లింపులకు పాత నోట్లు వినియోగించే వెసులుబాటు కల్పించింది. దీంతో పెట్రోలు బంకుల వద్ద, కరెంటు బిల్లులు, కార్పొరేషన్ మున్సిపల్ బిల్లుల బకాయిలన్నీ చెల్లించేందుకు నవంబర్ నెలాఖరు వరకు జనం ఎగబడ్డారు. క్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ సడలింపులన్నీ ఎత్తివేసింది. డిసెంబర్ 30 వరకు ప్రజలు బ్యాంకు ఖాతాల్లో పాత నోట్లు జమ చేయాలని గడువు విధించింది. గడువు సమీపించటంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పాత నోట్లు బ్యాంకులకు చేరాయి.. ఎన్ని కొత్త నోట్లు రాష్ట్రానికి పంపిణీ అయ్యాయనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికీ తీరని నోట్ల కొరత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చి 50 రోజులు గడచినా రాష్ట్రంలో నగదు కొరత తీరలేదు. ప్రజలు జమ చేసిన డబ్బుతో పోలిస్తే.. రాష్ట్రానికి వచ్చిన కొత్త నోట్లు ఇప్పటికీ మూడో వంతు కంటే తక్కువగా ఉన్నాయి. గురువారం నాటికి రాష్ట్రానికి రూ.22 వేల కోట్ల కొత్త నోట్లు పంపిణీ అయ్యాయి. మరోవైపు ఖాతాదారులు బ్యాంకుల్లో వేసిన పాత నోట్లకు సరిపడే డబ్బును తిరిగి విత్‌డ్రా చేసుకోలేక పోతున్నారు. నగదు ఉపసంహరణపై కేంద్రం విధించిన ఆంక్షలు కొనసాగుతుండటంతో సామాన్యు లు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 80 శాతం ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులున్నాయి. ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల నుంచి వారానికి రూ.24 వేలు మించకుండా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశమున్నప్పటికీ.. అది ఆచరణలో అమలు కావటం లేదు. నగదు లేదనే కారణంతో బ్యాంకులు ఖాతాదారులను తిప్పి పంపిస్తున్నాయి. తమ దగ్గరున్న కొద్దిపాటి నగదును సర్దుబాటు చేసేందుకు రూ.6000కు మించి ఇవ్వలేమని తమ వినియోగదారులకు కరాఖండిగా చెబుతున్నాయి. -
అంతటా రద్దీ
కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు కిక్కిరిసిన బ్యాంకులు పాక్షికంగానే పనిచేసిన ఏటీఎంలు రెండు రోజుల సెలవు తర్వాత సోమవారం బ్యాంకులు తెరుచుకోవడంతో ఖాతాదారులు పోటెత్తారు. జిల్లా అంతటా చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని బ్యాంకు శాఖల్లోనూ రద్దీ కన్పించింది. 48 రోజులవుతున్నా ప్రజలకు కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకులకు తగినంత నగదు సరఫరా కాకపోవడంతో రోజూ సర్దుబాట్లు చేయాల్సి వస్తోంది. ఒకేసారి రూ.24 వేలు విత్‌డ్రా తీసుకోవచ్చనే నిబంధన ఉన్నా.. ఇప్పటివరకు ఎక్కడా సాధ్యం కాలేదు. ఖాతాదారులు, నగదు నిల్వలను బట్టి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారు. అత్యవసరమో లేదా సిఫారసు ఉంటే తప్ప కొంచెం కూడా ఎక్కువ ఇవ్వని పరిస్థితి ఉంది. కరెన్సీ చెస్ట్‌లు కలిగిన ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్, సిండికేట్ బ్యాంకు తదితర వాటిలోనూ విత్‌డ్రాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. సర్దుబాట్లు చేయకుంటే ఇబ్బందులు తప్పవని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) ఎంవీఆర్ మురళీకృష్ణ, ఏజీఎం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లాలోని బ్యాంకుల్లో ఎక్కడా 'నోక్యాష్' బోర్డు పెట్టకున్నా, నగదు సరఫరా ఆలస్యం కావడంతో కొన్ని శాఖల్లో మధ్యాహ్నం తర్వాత విత్‌డ్రాలు ప్రారంభించారు. మరోవైపు పాత రూ.500, రూ.1,000 నోట్ల డిపాజిట్లు చేసుకునేందుకు విధించిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. అయినా పెద్దగా డిపాజిట్లు పెరగలేదని ఏపీజీబీ, సిండికేట్, కెనరా, ఆంధ్రా బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. కొన్ని శాఖల్లో మాత్రమే 10 శాతం మేర పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ బ్యాంకుల్లో మాత్రం కొంత పెరిగినట్లు సమాచారం. అనంతపురం సాయినగర్‌లోని ఎస్బీఐ ప్రధానశాఖలో జనం పోటెత్తారు. రెండు రోజుల సెలవు ప్రభావం స్పష్టంగా కనిపించింది. సామాన్యులు, వృద్ధులు, వికలాంగులు, పెన్షనర్లు, ఉద్యోగులు డిపాజిట్లు, విత్‌డ్రాల కోసం బారులుతీరారు. ఇక్కడ పోలీసు పçహారా మధ్య లావాదేవీలు కొనసాగాయి. ఏటీఎంల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రధాన బ్యాంకులకు చెందిన ఒకట్రెండు ఏటీఎంలు మినహా మిగతావి పనిచేయలేదు. అలాగే కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు పాక్షికంగా పనిచేశాయి. బ్యాంకు వేళలు ముగిసిన తర్వాత తాము ఏటీఎంలలో డబ్బు పెడుతున్నట్లు ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజర్ పి.అమ్మయ్య తెలిపారు. -
ప్రశ్నార్థకంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణ
► అందుబాటులో లేని స్వైపింగ్ మిషన్లు ► ప్రశ్నార్థకంగా మారిన నగదు రహిత లావాదేవీల నిర్వహణ కడప అగ్రికల్చర్: నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవాలంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకుల్లో ఖాతా ఉండాలి. తప్పని సరిగా రూపే,డెబిట్ కార్డులు ఉండాలి. జిల్లాలో 75 శాతం మందికి ఖాతాలు ఉన్నా అందులో 30 శాతం మందికి కూడా డెబిట్, రూపే, ఏటీఎం కార్డులు లేవు. ఈ పరిస్థితిలో దుకాణాలు, పెట్రోలు బంకుల్లో పాయింట్ ఆఫ్ స్కేల్ మిషన్లు(పీఓఎస్ఎం) పెట్టి నగదు రహిత లావాదేవీలు చేయలేమని వ్యాపారులు అంటున్నారు. . జిల్లాలో రిజిస్టర్ చేసుకున్న షాపులు 3100, చౌకదుకాణాలు 1740 ఉన్నాయి. ఇందులో 2437 పీఓఎస్‌ఎంలు ఉన్నాయి. జిల్లాకు 10 వేల స్వైపింగ్ మిషన్లు కావాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదికలు పంపింది. కిరాణా, మెడికల్ షాపులు, వస్త్ర, బంగారు, తదితర దుకాణాల్లో తప్పని సరిగా పీఓఎస్‌ఎంలు ఏర్పాటు చేసుకుని డెబిట్, రూపే కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించింది. అయితే ఆయా షాపుల నిర్వాహకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కార్మిక, వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న అంచనా ప్రకారం షాపులు దాదాపు 20 వేల దాకా ఉన్నట్లు సమాచారం. పీఓఎస్ఎంల కోసం వచ్చిన దరఖాస్తులు 150 దాకా ఉన్నట్లు బ్యాంకర్లు తెలిపారు. దీనిబట్టి చూస్తే నగదు రహిత లావాదేవీలపై వ్యాపార వర్గాలు అంతగా ఆసక్తి చూపడంలేదని తేటతెల్లమవుతోంది. బ్యాంకు ఖాతాలు ఉన్నా... డెబిట్ కార్డులు లేవు జిల్లాలో 29 లక్షలకు పైగా జనాభా ఉంది. జిల్లా మొత్తం 33 బ్యాంకులకు సంబంధించి 330 బ్రాంచీలు పనిచేస్తున్నాయి. ఇందులో పట్టణాల్లో 1,86,092, గ్రామీణ ప్రాంతాల్లో 1,97,658 ఖాతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని రకాల కార్డులు 3,51,547 అందజేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం మందికి డెబిట్ కార్డులు లేవు. దీనిని బట్టి చూస్తే జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సాధ్యమైన పని కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కేవలం పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్ల్లో మాత్రమే వీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని, చిన్న దుకాణాల్లో ఈ విధానం అమలు చేసే పరిస్థితి లేదని చిరువ్యాపారులు చెబుతున్నారు. చౌక దుకాణాల్లో కనిపించని మినీ ఏటీఎంలు, స్వైపింగ్ మిషన్లు జిల్లాలో 1740 రేష¯ŒSషాపులు ఉన్నాయి. ఈ షాపుల డీలర్లను బిజినెస్ కరస్పాండెట్లుగా నియమించి, మినీ ఏటీఎంలు, డెబిట్ కార్డులు అందజేసి నగదు రహిత లావేదేవీలు నిర్వహిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పినా ఎక్కడ కూడా అది అమలు కావడం లేదు. స్వైపింగ్ మిషన్లు అందజేయకపోవడంతో నగదు రహితం అమలుకు నోచుకోలేదు. -
కాస్త ఊరట?
ఆర్బీఐ నుంచి రూ.1500 కోట్లు రాక.. ఇందులో విశాఖకు రూ.300 కోట్లు విశాఖపట్నం : నగదు కష్టాల నుంచి జిల్లా వాసులకు కాస్త ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. రిజర్వు బ్యాంకు నుంచి విశాఖకు మంగళవారం సాయంత్రం రూ.1500 కోట్ల నగదు చేరింది. రిజర్వు బ్యాంకు రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల శాఖలకు నగదును విశాఖలోని స్కేబ్ (స్టేట్ బ్యాంకు చెస్ట్ బ్రాంచి) నుంచే పంపిస్తుంటుంది. రూ.500, వెయ్యి నోట్ల రద్దుకు ముందు రోజు అంటే నవంబరు ఏడో తేదీన కొత్త 2 వేల రూపాయల నోట్లను పెద్దసంఖ్యలో విశాఖకు పంపింది. ఆ మర్నాడే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ సొమ్మును ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సమక్షంలో చేరవేశారు. ఆ తర్వాత స్కేబ్‌కు ఇంత మొత్తంలో నగదు రావడం ఇదే తొలిసారి. ఈ సొమ్మును బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని బ్యాంకు శాఖలకు అందేలా వ్యాన్లు, కంటెయినర్ల ద్వారా పంపనున్నారు. మంగళవారం స్కేబ్‌కు వచ్చిన రూ.1500 కోట్లలో దాదాపు రూ.300 కోట్లను విశాఖకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈనెల 18న విశాఖకు రిజర్వు బ్యాంకు రూ.376 కోట్ల నగదును పంపింది. సోమవారం చలామణీ అయ్యాక మంగళవారం నాటికి జిల్లాలో రూ.211 కోట్ల నగదు బ్యాలెన్స్ ఉంది. మంగళవారం వచ్చిన సొమ్ముతో విశాఖ నగరం, జిల్లా అవసరాలకు రూ.500 కోట్ల నగదు ఉంటుందన్నమాట! క్రిస్మస్ను దృష్టిలో ఉంచుకుని.. నాలుగు రోజుల్లో రానున్న క్రిస్మస్ పండగను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ అదనపు నగదును పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంకుల్లో నగదు కొరతతో ఖాతాదార్లకు తగినంత సొమ్ము ఇవ్వడం లేదు. ఏటీఎంల్లో అరకొరగా పెడుతున్న నగదు గంట, రెండు గంటల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. జిల్లా, నగర వ్యాప్తంగా ఉన్న 1112 ఏటీఎంల్లో 25 శాతం ఏటీఎంలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. పనిచేస్తున్న ఏటీఎంల్లో నగదు ఉండడం లేదు. దీంతో జనం పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా రిజర్వు బ్యాంకు నుంచి వచ్చిన సొమ్ముతో బుధవారం నుంచి బ్యాంకులతో పాటు ఏటీఎంల్లోనూ కొంతమేర పాట్లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు తాజాగా ఆర్బీఐ నుంచి వచ్చిన నగదులో 10, 20, 50, 100, 500 రూపాయల నోట్లు ఉన్నాయి. అన్నిటికీ మించి రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తే జనానికి చాలా వరకు నగదు కష్టాలు, చిల్లర కష్టాలు తీరనున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఏటీఎంల్లో రూ.500 నోట్లు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న రూ.500 నోట్లు నగరానికి వచ్చేశాయి. కొత్త నోటు సైజు చిన్నది కావడంతో ఇప్పటికే చాలా ఏటీఎంల్లో సాంకేతిక మార్పులు చేశారు. జిల్లాలోని సగానికి పైగా మిషన్లలో ఈ మార్పులను విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఆయా ఏటీఎంల్లో కొత్త రూ.500 నోట్లను అందుబాటులో ఉంచే అవకాశం ఉందని బ్యాంకు వర్గాల సమాచారం. ఇప్పటికే మంగళవారం నుంచి బ్యాంకుల ద్వారా ఈ రూ.500 నోట్లను ఖాతాదార్లకు చెల్లింపులు జరుపుతున్నారు. బుధవారం నుంచి ఇవి మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే రెండు వేల రూపాయల కొత్త నోట్ల మార్పిడికి పడుతున్న అగచాట్ల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. -
నగదు కరువై..నిద్రకు వెలియై..!
- రాత్రి పూటా ఏటీఎంల వద్ద పడిగాపులు - 45 రోజులవుతున్నా మారని తీరు - కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు.. కర్నూలు(అగ్రికల్చర్): పెద్దనోట్లు రద్దు చేసి ఇప్పటికి నెలన్నర రోజులు అవుతున్నా.. నగదు కష్టాలు తీరడం లేదు. వేలాది మంది పగలు పనులకు వెళ్తూ..రాత్రిళ్లు ఏటీఎంల దగ్గరు పడిగాపులు కాస్తూ నిద్రకు దూరం అవుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు..ఇతర అన్ని వర్గాల వారు ఉన్న డబ్బును బ్యాంకుల్లో దాచుకున్నారు. దాచుకున్న డబ్బును తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. జిల్లాలో బుధవారం స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచీలతో పాటు వివిధ బ్రాంచీల్లో నో క్యాష్ అంటూ బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్ని బ్యాంకుల్లో నగదు ఉన్నా ఇచ్చేది రూ.2వేల నుంచి 6వేల వరకే. ఇప్పటికే నగదు కోసం క్యూలో నిలబడి అస్వస్థతకు గురై జిల్లాలో ఇద్దురు వృద్ధులు మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ లైన్లో గంటల తరబడి నిలబడలేక అస్వస్థతకు గురువుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 34 బ్యాంకులకు 445 బ్రాంచీలు ఉన్నాయి. బుధవారం 375 బ్రాంచీల్లో నగదు లేదు. జిల్లా మొత్తంగా 485 ఏటీఎంలు ఉండగా బుధవారం 20 మాత్రమే పనిచేశాయి. వారంలో రూ.24వేలు తీసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించినా.. నగదు కొరతతో రూ.4000 కూడా తీసుకోలేకపోతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థిథఙఅధ్వానంగా ఉంది. సగటు జీవి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజల దగ్గర ఉన్న డబ్బు 8వేల కోట్లు ఇప్పటి వరకు డిపాజిట్లుగా బ్యాంకులకు వచ్చాయి. జిల్లాకు వచ్చిన కొత్త కరెన్సీ రూ. 1000 కోట్లకు మించలేదు. -
ప్రాణాలు పోతున్నాయ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:జిల్లావ్యాప్తంగా నోట్ల కష్టాలు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి 40 రోజులు దాటింది. రానురాను నోట్ల ఇబ్బందులు తొలగుతాయనుకుంటే.. మరింతగా పెరుగుతున్నాయి. డబ్బుల కోసం జనం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా చేతికి పైసా అందడం లేదు. కొన్ని బ్యాంకులు ఏటీఎంలను అస్సలు తెరవడం లేదు. జిల్లావ్యాప్తంగా 450కిపైగా ఏటీఎంలు ఉంటే అందులో 50 కూడా పని చేయడం లేదు. డబ్బుల కోసం జనం రేయింబవళ్లు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. అయినా డబ్బులు అందకపోవడంతో సహనం నసిస్తోంది. వారి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. పెద్ద నోట్లను రద్దు చేయాలన్న చంద్రబాబుపైనా, అటు నోట్లను రద్దు చేసిన కేంద్రంపైనా జనం ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతున్నారు. డబ్బుల కోసం పీసీపల్లి మండలం పెదవీర్లపాడు సిండికేట్ బ్యాంకు ముందు స్థానికులు ఆందోళనకు దిగితే.. డబ్బులు అందలేదన్న ఆవేదనతో ముండ్లమూరు మండలం పెదఉల్లగల్లు గ్రామానికి చెందిన పాలకేంద్రం నిర్వాహకుడు బుచ్చి నాగమునిరెడ్డి ఏకంగా గుండెపోటుతో ప్రాణాలే కోల్పోయాడు. సామాన్యుల చేతికందని నోట్లు.. ఇప్పటి వరకు జిల్లాకు ఆర్బీఐ నుంచి రూ.2,800కోట్లు డబ్బులు వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నా యి. తాజాగా శనివారం సాయంత్రానికి మరో రూ.220 కోట్లు జిల్లాకు రానుంది. రూ.180 కోట్లు(రూ.2వేల నోట్లు), మరో రూ.40 కోట్లు(రూ.500 నోట్లు) రానున్నట్లు సమాచారం.ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.3వేల కోట్ల డిపాజిట్లు రాగా,రూ.1200 కోట్లు విత్‌డ్రాయల్స్ జరిగా యి. ఇంత డబ్బులు జిల్లాకు వచ్చిన సామాన్య జనానికి మాత్రం డబ్బులు అందటం లేదు.కొన్ని బ్యాంకుల నుంచి కొందరు బడా బాబులకు నేరుగా డబ్బులుఅందుతున్నట్లు ఆరోపణలున్నాయి.డబ్బులు మార్చుకునేందుకు కొందరు నేతలుఅధికారాన్ని అడ్డు పెడుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ కారణాలతోనే ఆర్బీఐ నుంచి వచ్చిన డబ్బులు సామాన్యులకు అందడం లేదన్న ఆరోపణలున్నాయి. వచ్చిన డబ్బులో అధిక మొత్తం పెద్దలకే సరిపోతుండటంతో సామాన్యులకు తగినంత డబ్బులు అందుబాటులో ఉండ టం లేదు. జిల్లా కేంద్రాలు మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఏటీఎంలతో పాటు డబ్బుల్లేక కొన్ని బ్యాంకులను సైతం మూసివేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుల కష్టాలు అధికమయ్యాయి. వారిలో ఆవేదనతో పాటు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. -
రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం జనం విలవిల
-
తీరని కష్టం..
-
కష్టాలు.. కన్నీళ్లే!
►రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం జనం విలవిల ►క్యూలైన్లలో సొమ్మసిల్లుతున్న వృద్ధులు ► పలు చోట్ల తొక్కిసలాటలు, ఆందోళనలు సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నగదు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనమంతా బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు కాస్తున్నారు. చాలా చోట్ల బ్యాంకుల్లో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకే అదీ తొలి వంద, రెండు వందల మంది ఖాతాదారులకే చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు నగదు లేదంటూ ‘నో క్యాష్’ బోర్డులు పెడుతున్నారు. అటు గురువారం కూడా హైదరాబాద్‌లోని సుమారు 1,435 బ్యాంకుల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరారు. మొత్తంగా ఉన్న ఏడువేల ఏటీఎంలలో గురువారం తెరుచుకున్నవి వెయ్యిలోపు మాత్రమే. ఎస్డీ రోడ్‌లోని సిండికేట్ బ్యాంకు వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు క్యూలైన్లో నిలబడిన కృష్ణ సూర్యనారాయణ (65) అనే రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను పోలీసులు వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఇక పలు చోట్ల బ్యాంకులు ఇచ్చే కొద్దిపాటి నగదు అయినా.. వారానికి ఒకసారి మాత్రమే ఇస్తామని చెబుతుండడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు కష్టాలతో కోఠి, అబిడ్స్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, మోండా మార్కెట్, చార్మినార్ తదితర మార్కెట్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలు.. ఆందోళనలు.. నగదు కోసం బ్యాంకుల వద్దకు జనం భారీ సంఖ్యలో చేరుకుంటుండడంతో తొక్కిసలాట, తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల నగదు అందక జనం ఆందోళనలకు దిగుతున్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట భారీగా జనం చేరారు. ఉదయం 10.30కు బ్యాంకు గేటు తెరవడంతో.. వారంతా ఒక్కసారికి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ రైతులు, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వేర్వేరుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. నగదు ఇవ్వకుంటే తాము పంటలు ఎలా వేసుకోవాలంటూ బ్యాంకుల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఎస్బీహెచ్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నగదు లేదనడంతో రైతులు రాస్తారోకో చేశారు. ఏటీఎంకు పూజలతో నిరసన జనాలకు డబ్బులు అందజేయాల్సిన ఏటీఎంలు.. నోట్ల రద్దుతో ఎందుకూ పనికిరాని డబ్బాలుగా మారిపోయాయి. దీంతో జనం ఏటీఎంలకు పూజలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో గురువారం కామారెడ్డిలోని పలు ఏటీఎంలకు పట్టణ కాంగ్రెస్ నేతలు పూజలు చేశారు. అన్ని బ్యాంకుల ఏటీఎంలలోనూ డబ్బులు పెట్టడం లేదని.. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కన్నయ్య పేర్కొన్నారు. తిండీతిప్పలూ బ్యాంకు వద్దే.. అటు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తోపాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం కొండపాక, దుద్దెడ ఆంధ్రా బ్యాంకులకు వచ్చారు. రూ.4వేల చొప్పున ఇస్తామంటూ బ్యాంకు అధికారులు వారికి టోకెన్లు ఇచ్చారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ సేవలు పనిచేయకపోవడంతో నగదు ఇవ్వలేదు. దీంతో ఖాతాదారుల్లో చాలా మంది బ్యాంకు వద్దే నిరీక్షించారు. వారిలో కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్న సద్దులు తిని కడుపు నింపుకున్నారు. వృద్ధురాలికి ‘పెద్ద’ కష్టం ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు భాగ్యమ్మ (70). ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామం. చేతిలో చిల్లి గవ్వ లేని దుస్థితిలో గురువారం పింఛన్ సొమ్ము తీసుకుం దామని చెరువుమాధారం ఏపీజీవీ బ్యాంకుకు వచ్చింది. 2 గంట ల పాటు క్యూలో నిలబడడంతో.. సొమ్మసిల్లి పడిపోయింది. ఇది చూసిన మస్తాన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే భాగ్యమ్మ తుంటి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడు తన పరిస్థితేమిటని వృద్ధురాలు కన్నీరమున్నీరవుతోంది. క్యూలైన్లోనే బీడీలు చుడుతూ.. రోజూ బీడీలు చుడితేగానీ పూట గడవని పరిస్థితి వారిది. నోట్ల రద్దుతో చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి. దీంతో అటు బ్యాంకుల ముందు క్యూలైన్లో ఉంటూనే.. ఇటు బీడీలూ చుడుతు న్నారు కొందరు మహిళలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఆం ధ్రాబ్యాంకు ఎదుట గురువారం తెల్ల వారుజామున కనిపించిన దృశ్యమిది. పోత్గల్‌కు చెందిన ఈర్ల లక్ష్మి, ముస్తా బాద్‌కు చెందిన ఆరుట్ల లక్ష్మి, మరి కొందరు క్యూలైన్ల ఉండే బీడీలు చుడుతూ తమ వంతు కోసం ఎదురు చూశారు. గంటలు గంటలు నిలబడా ల్సి వస్తోందని, దాంతో పని పోతుం దనే ఉద్దేశంతో లైన్లోనే బీడీలు చుడుతున్నామని వారు పేర్కొన్నారు. అమ్మా.. పాలకులను కదిలించేనా నీ కంటి చెమ్మ.. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి.. ఉన్నచోటి నుంచి కదలాలన్నా కష్టమైన పరిస్థితి.. అటు తిండికీ, ఇటు మందులకూ నెల నెలా వచ్చే పింఛన్ డబ్బులే దిక్కు.. కానీ ‘నోట్ల రద్దు’తో ఆ పింఛన్ సొమ్మునూ తీసుకోలేని పరిస్థితి.. కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుకు వచ్చినా లైన్లో నిలబడలేక.. నిలబడినా సొమ్ము చేతికి అందక కన్నీళ్లే మిగులుతున్నాయి.. గురువారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం షాపూర్‌నగర్ ఎస్బీహెచ్ బ్రాంచీకి వచ్చిన కమలమ్మ అనే వృద్ధురాలికి ఇదే పరిస్థితి ఎదురైంది. దుండిగల్ మండలం బౌరంపేట్‌కు చెందిన ఆమె.. అందరికన్నా ముందే బ్యాంకుకు వచ్చింది. కానీ నగదు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో.. తల బాదుకుంటూ, రోదిస్తూ ఇంటిదారి పట్టింది. ఇలా పింఛన్ సొమ్ము అందక ఎందరో పండుటాకులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. వాస్తవానికి తొలుత పింఛన్ల సొమ్మును నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేసేవారు. తర్వాత ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘నగదు’ సమస్యల నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులకు కష్టాలు తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా?.. పాత పద్ధతిలో నేరుగా పింఛన్ సొమ్ము అందజేసేందుకు ఏర్పాట్లు చేయలేదా..? -
మరికొన్ని రోజులు ఏటీఎంలకు నో క్యాష్
-
ఏటీఎంలకు నో క్యాష్
న్యూఢిల్లీ: కరెన్సీ కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పట్లో కష్టాలు తీరేలాలేవు. ఏటీఎంలలో మరికొన్ని రోజుల పాటు నగదు అందుబాటులో ఉండదు. డబ్బును బ్యాంకులకే పంపాలని ఆర్బీఐ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 2.10 లక్షల ఏటీఎంలు ఉండగా కొన్నింటిలోనే నగదు అందుబాటులో ఉంటోంది. కేవలం 27 వేల ఏటీఎంలలో మాత్రమే డబ్బు లభిస్తోంది. గత నెలలో 30 శాతం ఏటీఎంలలో డబ్బు నింపగా, ప్రస్తుతం 13 శాతం ఏటీఎంలలోనే నగదు అందుబాటులో ఉంటోంది. గత నెల 8న కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత కరెన్సీ సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్తగా ముద్రించిన 500, 2000 రూపాయల నోట్లు డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులోకి రాలేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీగా క్యూలు ఉంటున్నాయి. చాలా ఏటీఎంలు మూతపడగా, చాలా చోట్ల బ్యాంకుల్లో కూడా డబ్బు లేదని చెబుతున్నారు. -
అన్ని దారులూ అటువైపే
నోట్ల కొరత ఇంతింత కాదయా.. సరిపడునంత నగదు నిల్వలు లేవు బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూ జాతరను తలపిస్తున్న వైనం అనంతపురం అర్బన్ : పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం వాటి స్థానంలో కొత్త కరెన్సీని సమకూర్చలేకపోయింది. రిజర్వ్ బ్యాంకు నుంచి అరకొరగా వస్తున్న నగదును అన్ని బ్యాంకులూ పంచుకుని ఖాతాదారులకు తలా కొంత పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే అవసరాలకు తగినంత నగదు అందకపోవడంతో జనం ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ఈ నెల పదకొండో తేదీ వచ్చిన రూ.90 కోట్ల నగదుతోనే బ్యాంకులు, ఏటీఎంలకు కేటాయించి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బుధవారం నాటికి జిల్లా వ్యాప్తంగా నగదు నిల్వలు తగ్గిపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. విత్ డ్రా పరిమితి రూ.2వేల నుంచి రూ.4వేలకు మించడం లేదు. ఏది కొనుగోలు చేయాలన్నా నగదు అవసరమవుతోంది. నగదు రహిత లావాదేవీలు జరిపి నోట్ల కష్టాల నుంచి బయటపడవచ్చని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా స్వైపింగ్ మిషన్లు ఎక్కడా లేవు. చేసేది లేక ప్రజలు నగదుతోనే లావాదేవీలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో నగదు కోసం ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల వద్దకు ఉదయం 7 గంటల నుంచే చేరుకున్నారు. మరికొందరు ఏటీఎంలు ఎక్కడతెరిచారో, ఎక్కడ నగదు వస్తోందో అన్వేషించి మరీ అక్కడకు వాలిపోతున్నారు. ఎన్ని పనులు ఉన్నా అన్నింటినీ మానుకుని, నగదు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం ఓపికను కూడగట్టుకుని మరీ గంటల తరబడి క్యూలోనే నిల్చుంటున్నారు. కొన్ని చోట్ల ఏటీఎంలు తెరిచినా అందులో నగదు లేకపోవడం, స్టేట్మెంట్లు చూసుకునేందుకు పేపర్ రోల్ కూడా ఉంచకపోవడంతో జనం ఉసూరుమంటూ వెనుదిరిగారు. గురువారం నగదు వచ్చే అవకాశం ఉందని, అయితే ఎంత మొత్తం అనే సమాచారం లేదని బ్యాంకర్లు తెలిపారు. లోన్ బిల్లులు కూడా తీసుకోవడం లేదు : పుష్పవల్లి, జూనియర్ అసిస్టెంట్, అనంతపురం డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఇక బిల్లులు కూడా తీసుకోవడం లేదు. లోన్‌కి సంబంధించిన బిల్లులకు మూడు రోజులుగా తిరుగుతున్నాను. బ్యాంక్‌లోకి వెళ్లనీయడం లేదు. ఉద్యోగానికి సెలవుపెట్టి రావాల్సి వస్తోంది. మాటల్లో చెప్పలేని ఇబ్బంది : కీర్తి, గృహిణి, సోమనాథ్ నగర్, అనంతపురం బ్యాంకులు, ఏటీఎం చుట్టు తిరుగుతున్నా కనీసం అవసరానికి సరిపడా నగదు అందడం లేదు. మా ఇబ్బందుల్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఉదయం 8.30 గంటలకు వచ్చి లైన్లో నిల్చొని ఏటీఎంలో వచ్చే రూ.2 వేలు తీసుకుంటున్నాం. ఈ రోజు బ్యాంక్‌లోనూ రూ.2 వేలు ఇచ్చారు. ఇంటి అవసరాలకు చాలా కష్టంగా ఉంది. -
గంటల తరబడి నిరీక్షణ
∙జోగిపేటలో తెరుచుకోని ఏటీఎంలు ∙బ్యాంకుల్లో భారీ క్యూలైన్లు ∙ఆంధ్రాబ్యాంకు గేటుకు తాళం ∙విత్‌డ్రా ఓచర్లను పంపిణీ చేసిన కానిస్టేబుల్ జోగిపేట : మూడు రోజులు పాటు బ్యాంకులన్నీ మూసి ఉండటంతో ఖాతాదారులు, ప్రజలు ఒక్కసారిగా బ్యాంకుల వద్ద ఎగబడ్డారు. ఉదయం బ్యాంకు తెరుచుకోక ముందే 9 గంటల వరకు క్యూలో నిలబడ్డారు. ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల వద్ద ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారంతా మెయిన్ రోడ్డు వరకు క్యూలో నిలబడ్డారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆంధ్రాబ్యాంకులోకి ఒకేసారి ప్రజలు రావడంతో పోలీసులు అదుపు చేశారు. గేట్‌కు తాళం వేశారు. 10 మంది చొప్పున లోపలికి వదిలారు. కొందరు నగదును తమ ఖాతాల్లో వేసుకున్నారు. మరికొందరు డబ్బు డ్రా చేసుకున్నారు. కొందరు రద్దయిన నోట్లను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. వృద్ధులు, బాలికలు ఇబ్బందులు పడుతూ డబ్బు డ్రా చేసుకుంటున్నారు. మంజూరైన రుణాన్ని ఒకేసారి ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రాకపోవడంతో సెల్ప్‌హెల్ప్ గ్రూపుల మహిళలూ అవస్థలు పడ్డారు. ఎస్బీహెచ్ వద్దకు ఒకేసారి ప్రజలు రావడంతో మేనేజర్ మారుతికుమారే స్వయంగా వారిని అదుపు చేయాల్సి వచ్చింది. అందరికీ డబ్బులు ఇస్తామని, సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా బ్యాంకులు తెరచి ఉంటాయని అన్నారు. మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు క్యూలో చాలా సేపు నిలబడాల్సి రావడంతో ఇబ్బంది పడ్డారు. ఆసరా పథకం పింఛన్లు తీసుకోవడానికి వచ్చిన మహిళలు కిందే కూర్చున్నారు. రూ.ఆరు వేలు మాత్రమే.. మూడు రోజుల వరకు ఎస్బీహెచ్లో రూ.10 వేల వరకు డబ్బు పంపిణీ చేశారు. మంగళవారం మాత్రం ఒక్కరికి రూ.6 వేలు మాత్రమే చెల్లించబడునని పోస్టర్లను అతికించారు. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. సగం రోజు సెలవుపెట్టి వచ్చినా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రూ.10 వేలు చెల్లించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నగదు అందుబాటులో లేకపోవడంతోనే రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నట్లు మేనేజర్ మారుతికుమార్ నచ్చజెప్పారు. అత్యవసరమైన వారికి డబ్బులను సమకూర్చేందుకు మేనేజర్ సహకరిస్తున్నట్లు సమాచారం. ఎస్బీఐలో చాలా రోజులుగా రూ.2,500, రూ.4 వేలు మాత్రమే ఖాతాదారులకు చెల్లిస్తున్నారు. మూడు రోజుల తర్వాత నగదు జోగిపేటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పెద్దనోట్లు రద్దయిన తర్వాత పోలీసు శాఖ కీలకంగా వ్యవహరిస్తోందనే చెప్పొచ్చు. వందల సంఖ్యలో ప్రజలు డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు చేరుకొని గొడవ చేస్తేంటే పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. గత నెల రోజులుగా జోగిపేట పోలీసులు చేస్తున్న కృషిని బ్యాంకుల మేనేజర్లు అభినందిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకు వద్ద రద్దీ ఎక్కువ కావడంతో బ్యాంకు మెయిన్ గేట్‌ను మూసేసి కొందరినే పంపిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది చేయాల్సిన పని పోలీసులే చేస్తున్నారు. డబ్బు డ్రా చేసుకునేందుకు అవసరమైన ఓచర్లను కానిస్టేబుల్లే క్యూలో నిలబడ్డ వారికి ముందుగానే పంపిణీ చేస్తున్నారు. వారు తమకు ఎంత అవసరం ఉందో రాసిపెట్టుకుంటే తొందరగా పని పూర్తయ్యేందుకు వీలుంటుందని సహకరిస్తున్నారు. -
వేతన జీవులు విలవిల..
సాక్షి, సిటీబ్యూరో: నెల నెలా జీతం డబ్బులు చేతికందితే తప్ప బతుకుబండి ముందుకు సాగని వేతన జీవులకు కరెన్సీ కొరత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. బ్యాంకుల్లోంచి తగినంత నగదు డ్రా చేసేందుకు అవకాశం లేక, ఏటీఎంలలో డబ్బుల్లేక ప్రజలు కరెన్సీ కష్టాలను అనుభవిస్తున్నారు. నగరంలో తెరిచి ఉన్న ఏటీఎంల వద్ద ఫర్లాంగుల కొద్దీ క్యూలే దర్శనమిస్తున్నాయి. మరోవైపు నూటికి తొంభై శాతం ఏటీఎంలు ‘నో క్యాష్ ’ బోర్డులతోనే కనిపిస్తున్నాయి. ప్రతి నెలా మొదటి వారంలోనే జీతాలు అందుకొని ఇంటి అద్దెలు, పాలు, పేపర్, పిల్లల ఫీజులు, నిత్యావసరవస్తువులు, ఆటోచార్జీలు, వంటగ్యాస్, బస్‌పాస్‌లు వంటివి తెచ్చుకొనే సగటు నగర జీవి ప్రతి రూపాయి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. సోమవారం కూడా నగరంలో ఇదే పరిస్థితి నెలకొంది. నగరమతటా నోటు కష్టాలే కనిపించాయి. వారానికి రూ.24 వేలు చెల్లిస్తాయన్న బ్యాంకులు రూ. 3 వేల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. దీంతో అవసరాలకు డబ్బుల్లేక ఏటీఎంలను ఆశ్రయిస్తే గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మొదటి తారీఖు దాటి రెండు వారాలు కావస్తున్నా ఇంటి కిరాయీలు చెల్లించకపోవడంతో ఓనర్ల నుంచి ఒత్తిళ్లు తప్పడం లేదు. బియ్యం, పప్పులు, వంటనూనెలు, తదితర అవసరాల కోసం, ఇతరత్రా ఖర్చుల కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తుందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏ ఇద్దరి నోట విన్నా నోటు కష్టాలే వినిపిస్తున్నాయి. నలుగురు కలిసిన చోట నోట్ల బాధలే ఏకరువు పెడుతున్నారు. ఆకస్మాత్తుగా ఏటీఎంల మూత... మరోవైపు ఎంతో ఆశగా ఏటీఎంల వద్ద పడిగాపులు కాసేవాళ్లకు ఒకవైపు తాము లైన్లో నించొని ఉండగానే ఏటీఎంలలో డబ్బులు ఖాళీ అయిపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఉస్సూరంటూ వెనుదిరగాల్సి వస్తోంది.తెల్లవారు జామున, అర్దరాత్రి పూట కూడా జనం ఏటీఎంల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. నగరంలోని సికింద్రాబాద్, ఆబిడ్స్,కోఠి, దిల్సుఖ్నగర్, ఉప్పల్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పని చేయని ఏటీఎంలు, ఉన్న చోట భారీ క్యూలైన్లు, బ్యాంకుల్లో తగినన్ని డబ్బులు చేతికందక వెనుదిరిగే వచ్చే ఖాతాదారులు కనిపిస్తున్నారు. నోట్ల రద్దు అనంతరం నెలకొన్న కష్టాలు, బాధలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. -
మ‘నీరసం’
ఏటీఎంల వద్ద గడిచిపోతున్న కాలం నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడతున్న ప్రజలు జిల్లాకు నగదు సరఫరా అంతంత∙మాత్రమే తీరని చిల్లర కొరత సాక్షి, రాజమహేంద్రవరం : పెద్దనోట్లు రద్దు చేసి నెల రోజులు దాటుతున్నా నగదు కొరత సమస్య తీరడం లేదు. నెల రోజులుగా ప్రజలు జీవితంలో సగ భాగం బ్యాంకులు ఏటీఎంల వద్ద నిల్చోవడానికే సరిపోయింది. ఆర్బీఐ నుంచి జిల్లాకు అవసరమైన నగదు సరఫరా కాకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. ఇక మూడు రోజుల నుంచి బ్యాంకులకు సెలవులు కావడంతో సోమవారం కూడా ప్రజలు నగదు కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జిల్లాలోని 931 ఏటీఎంలలో ఐదు శాతం మాత్రమే పని చేశాయి. రాజమహేంద్రవరంలో మూ డు ఎస్బీఐ, ఒక హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో మాత్రమే నగదు లభిస్తుండడం నగదు కొరతకు తార్కాణం. ప్రజలు కాళ్లరిగేలా నగదు ఎక్కడ లభిస్తుందోనని వెతుకుతున్నారు. నగదు ఉన్న ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలుంటున్నాయి. చివరకు గంటల తరబడి క్యూలో నిల్చుంటే రూ.రెండు వేలు అందడం కూడా గగమనమవుతోంది. శనివారం జిల్లాకు వచ్చిన రూ.80 కోట్లలో రూ.500 నోట్లున్నాయి. ఎస్బీఐ ఏటీఎంలలో ఇవి లభిస్తున్నాయి. ఆ 80 కోట్లూ ఏ మూలకు? శనివారం జిల్లాకు రూ.80 కోట్లు రావడంతో ఈ మొత్తాన్ని ఆయా బ్యాంకులకు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 756 బ్యాంకులు ఉన్నాయి. రూ.80 కోట్లు ప్రస్తుతం అవసరాలకు ఏమాత్రం సరిపోవు. సాధారణంగా ఒక లీడ్ బ్యాంక్‌లో రోజుకు రూ.200 కోట్ల నగదు నిల్వలు ఉండాలని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. ఇలాంటి లీడ్ బ్యాంకులు జిల్లాలో 36 ఉన్నాయి. చేసేది లేక వచ్చిన నగదునే బ్యాంకులు అందరికీ సర్దుతున్నాయి. వారానికి రూ.24 వేలు తీసుకునే అవకాశం ఉన్నా ఆ మేరకు నగదు లేకపోవడంతో పరిమితులు విధించి ఇస్తున్నాయి. ఖాతాల్లో నగదు ఉన్నా తీసుకునే అవకాశం లేక ప్రజలు బ్యాంకు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. మరికొన్నిచోట్ల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేస్తున్నారు. 3 రోజుల సెలవుల తర్వాత బ్యాంకు లు మంగళవారం తెరచుకోనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని బ్యాంకు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిల్లర కష్టాలు ఇంకా తొలగలేదు. రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సినిమా థియేటర్లకు రూ.రెడు వేల నోట్ల సెగ తగులుతోంది. సోమవారం రాజమహేంద్రవరానికి చెందిన సురేష్ ఇటీవల విడుదలైన చిత్రం టికెట్ల కోసం లైన్లో నిల్చున్నారు. రూ.110 టిక్కెట్లు పది తీసుకుని రూ.2 వేల నోటు ఇచ్చాడు. అయితే రూ.900 చిల్లర లేదని, రూ.100 నో ట్లివ్వాలని థియేటర్ సిబ్బంది చెప్పారు. చేసే ది లేక బ్లాక్‌లో రూ.150 పెట్టి కొన్నానని సు రేష్ వాపోయాడు. పండ్లు, చిరు వ్యాపారులు చిల్లర లేక బేరాలు వదులుకుంటున్నారు. -
సేమ్ సీన్..!
సాక్షి, నల్లగొండ : రెండో రోజు కూడా జిల్లాలోని ఏటీఎంలు ప్రజలకు చుక్కలు చూపించాయి. వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చిన రెండో రోజు ఆదివారం జిల్లాలో రెండు ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. నల్లగొండ పట్టణంలో రెండు చోట్ల మినహా జిల్లాలో ఉన్న 172 ఏటీఎంల్లో ఎక్కడా డబ్బులు రాలేదు. చాలా చోట్ల అసలు ఏటీఎంల షట్టర్లు కూడా తీయకపోవడం, తీసినా నగదు లేకపోవడంతో ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసిన జిల్లా ప్రజానీకం నిరాశకు గురయ్యారు. ఇప్పటికే నగదుకు తీవ్ర కొరత ఉండడంతో మధ్య, పేద తరగతులకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, వరుసగా వచ్చిన సెలవులు వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నా రుు. ఉన్న డబ్బులు ఖర్చయిపోయాయి. ఈ నేపథ్యం లో ఏటీఎంల నుంచి డబ్బులు రాకపోవడంతో కనీస ఖర్చులకు కూడా డబ్బులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం చేబదుళ్లు ఇచ్చే వారూ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నా రు. మూడు రోజులు ఎప్పుడు అయిపోతాయా? మంగళవారం ఎప్పుడు వస్తుందా? బ్యాం కులు ఎప్పుడు తెరచుకుంటాయా అని ఎదురుచూడడం మినహా చేసేదేమీ లేక క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ముందు చూపు లేకనే..! వాస్తవానికి పెద్ద నోట్లు రద్దయి ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి రోజుకు రూ.2వేలకు కుదించినా గత నెలరోజుల్లో ప్రజలు కొంత మేర మాత్రమే ఇబ్బందులు పడ్డారు. రోజు మొత్తం తిరిగితే కనీసం ఒక్కచోటరుునా డబ్బులు దొరికే పరిస్థితి ఉండడంతో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టుకున్నారు. కొందరు బ్యాంకులకు వెళ్లి లైన్లో నిలబడి రూ.4వేలు తెచ్చుకున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి బ్యాంకుల ముందు ఉదయాన్నే క్యూలు కట్టి ఎలాగొలా రూ.4వేల వరకరుునా తీసుకెళ్లగలిగారు. కానీ, వరుసగా మూడు రోజులుగా బ్యాంకులకు సెలవులు వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బ్యాంకర్లు చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ప్రజలు ఇప్పుడు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కనీసం రూ.150-200 కోట్లయినా తెప్పించి ఏటీఎంలలో పెడితే ఇంత ఇబ్బంది ఉండేది కాదని నిపుణులంటున్నారు. జిల్లాలో మొత్తం 15లక్షల బ్యాంకు ఖాతాలుంటే.. అందులో 10లక్షల ఏటీఎం కార్డులున్నా... అందులో సగం మంది రోజూ డ్రా చేసినా... రోజుకు రూ.2వేల చొప్పున 5లక్షల మందికి రూ.100 కోట్లు సరిపోయేవని, మూడు రోజులకు రూ.300 కోట్లు కావాల్సి ఉన్నా...కనీసం అందులో సగమయినా అందుబాటులో ఉండేలా బ్యాంకర్లు, ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రజలకు ఇన్ని ఇబ్బందులుండేవి కాదని వారంటున్నారు. కానీ, అటు బ్యాంకర్లు కానీ, ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజల కరెన్సీ కష్టాలపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. జిల్లాలో పరిస్థితి ఇది.... మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల్లో ఉన్న 31 ఏటీఎంలు ఆదివారం తీయలేదు. దీంతో డబ్బుల కోసం ఏటీఎంల వద్దకు వెళ్లిన వారికి నిరాశే ఎదురయింది. కనీస ఖర్చులకు కూడా డబ్బుల్లేక ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. చేబదుళ్లు ఇచ్చే వారు కూడా లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడు మంగళవారం వస్తుందా... ఎప్పుడు బ్యాంకులు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నారు. దేవరకొండ డివిజన్లో ఆదివారం అన్ని ఏటీఎంలు దాదాపుగా మూసి ఉన్నాయి. తెరచి ఉన్న ఒకటి, రెండు ఏటీఎంల్లో సైతం డబ్బులు లేకుండా నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చారుు. దీంతో ఏటీఎం లో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ప్రజలు చేసేదేమీ లేక నిరాశగా వెనుదిరిగారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 23 ఏటీఎం కేంద్రాల్లో ఏ ఒక్క ఏటీఎం కేంద్రంమూ ఆదివారం తెరచుకోలేదు. వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులుండతో ఎక్కడైనా ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు ఉండకపోతాయా అని ఆశతో ప్రజలు వాటి చుట్టూ తిరిగా రు. కానీ ఏటీఎం కేంద్రాల్లోనూ లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహంగా వెళ్లిపోతున్నారు. నల్లగొండ పట్టణంలో రెండు మినహా మిగతా ఏటీఎంలన్నీ మూతపడ్డారుు. రామాలయం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం, పూజిత అపార్ట్మెంట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎస్బీఐ ఏటీఎంల్లో మాత్రమే నగదు అందుబాటులో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఖాతాదారులు ఈ రెండు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకున్నారు. ఏటీఎంల వద్ద ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎస్బీఐ నల్లగొండ పట్టణంలో పీఓఎస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెట్రోల్‌బంక్‌లు, ట్రేడర్స్, ఎంపోరియంలు, స్టేషనరీ దుకాణాల్లో పీఓఎస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖాతాదారులు డెబిట్ కార్డులు ఉపయోగించి పీఓఎస్ కేంద్రాల్లో రెండు వేలు డ్రా చేసుకోవచ్చును. దీనినే అదునుగా చేసుకుని పీఓఎస్ కేంద్రాల నిర్వాహకులు రూ. రెండు వేలకు రూ.60ల చొప్పున కమీషన్ వసూలు చేస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని 24 ఎటీఎంల్లో ఆదివారం ఒక్కటీ పనిచేయలేదు. దామరచర్ల, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండలాల్లో నవంబర్ 9 నుంచి పని చేయడంలేదు. సమీప ప్రాంతాలవారు ఎటీఎంలు పని చేస్తాయని మిర్యాలగూడకు వ చ్చి మూసివేసి ఉండటంతో నిరాశతో వెళ్లిపోయారు. నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక్క ఏటీఎం కూడా పనిచేయలేదు. నకిరేకల్, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్ శాలిగౌరారం మండలాలతో ఏటీఎంలు కూడా పనిచేయలేదు. -
ఖాళీ !
విజయవాడ, గుంటూరు నగరాల్లో 3 ఏటీఎంలలోనే నగదు మిగిలిన ప్రాంతాల్లో ‘నో క్యాష్’ బోర్డులే ఆదివారం సరదాలు, సంతోషాలకు బ్రేక్ 33 రోజులైనా ప్రజలను వీడని కరెన్సీ కష్టాలు నేడు కూడా బ్యాంకులకు సెలవు.. ఆందోళనలో జనం సాక్షి, అమరావతి బ్యూరో : ‘నోట్ల రద్దు ఆషామాషీ నిర్ణయం కాదు. అనేక ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు మరింత పెరుగుతాయి. కానీ 50 రోజుల్లో నోట్ల కష్టాలు సర్దుకుంటాయి. కళ్లముందే పరిస్థితి మెరుగుపడుతుంది..’ అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం రోజురోజుకూ నోట్ల కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. సెలవు అయినా ఆదివారం చేతిలో డబ్బులు లేక ప్రజలు అల్లాడిపోయారు. రెండు జిల్లాల్లో 1,778 ఏటీఎం కేంద్రాలు ఉండగా, పది కూడా పనిచేయడం లేదు. విజయవాడ, గుంటూరు నగరాల్లో కేవలం మూడు ఏటీఎం కేంద్రాలు మాత్రమే పనిచేశాయి. దీంతో డబ్బులు లేక జాలీగా గడపాల్సిన ఆదివారం అందరూ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. 33 రోజులు గడిచినా... రూ.500, రూ.1,000 నోట్లు రద్దుచేసి 33 రోజులు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు డబ్బు వస్తున్నప్పటికీ లైనులో నిలుచున్నవారిని కొన్ని గంటల్లోనే ‘నో క్యాష్’ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఇప్పుడు వరుస సెలవుల కారణంగా రెండు జిల్లాల్లో బ్యాంకులు మూసివేశారు. ఏటీఎంలలోనూ నగదు నిల్వలు లేవు. సోమవారం కూడా బ్యాంకులకు సెలవు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు నగరాల్లో.. పదుల సంఖ్యలోనే..! విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆదివారం ఉదయం నుంచే ఏ ప్రాంతంలో ఏటీఎంలు పని చేస్తున్నాయని ప్రజలు ఆరా తీయడం కనిపింది. గుంటూరులో నగరంపాలెంలోని ఎస్బీఐ ప్రధాన శాఖకు చెందిన ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేసింది. దీంతో అక్కడ ప్రజలు బారులుతీరారు. విజయవాడ నగరంలోని బందరు రోడ్డులో కోస్టల్ బ్యాంకు ఏటీఎం, బీఆర్టీఎస్ రహదారి సమీపంలోని మధురానగర్‌లో ఒక ఏటీఎం మాత్రమే పనిచేశాయి. అక్కడ భారీ క్యూలైన్ కనిపించింది. మిగిలిన ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చాయి. సాయంత్రం కొన్ని ఏటీఎం కేంద్రాలు పని చేసినా, గంట వ్యవధిలోనే నగదు ఖాళీ అయ్యింది. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఏటీఎంలు పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూఅదే తీరు! రెండు జిల్లాలోని మిగిలిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని బ్యాంకుల ఏటీఎంలు మూతపడ్డాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 48 ఏటీఎం కేంద్రాలు ఉండగా.. ఆదివారం ఒక్కటీ పనిచేయలేదు. విజయవాడ తూర్పు, పశ్చిమ, గన్నవరం, పెడన, పామర్రు, నూజివీడు, మైలవరం, కైకలూరు, నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.అవనిగడ్డలో ఐదు రోజులుగా ఒక్క ఏటీఎం కూడా పని చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గుడివాడ నియోజకవర్గంలో 51 ఏటీఎంలు ఉండగా, పట్టణంలోని ఎస్బీఐ ప్రధాన శాఖ ఏటీఎం మాత్రమే పనిచేసింది. తిరువూరు పట్టణంలో రెండు ఏటీఎంలు ఉదయం కొద్దిసేపు పనిచేశాయి. కృష్ణా జిల్లాలో మొత్తం నాలుగు ఏటీఎంలు పనిచేశాయి. గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. -
నో వీకెండ్..నో జాయ్
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్/నాగోల్/ కూకట్పల్లి/రాంగోపాల్‌పేట్: డబ్బు ఇప్పుడు ఒక మాయా వస్తువైంది. కనీకనిపించనట్లు, ఉండీ లేనట్లు, చేతికి వచ్చీ రానట్లు...అంతా ఎడారిలో ఎండమావుల సదృశ్యంగా మారింది. డబ్బుల కోసం రోడ్డెక్కే ప్రతి వ్యక్తిని బ్యాంకులు, ఏటీఎంలు అపహాస్యం చేస్తున్నాయి. ఖాతాల్లో డబ్బులు ఉన్నా అవసరానికి వినియోగించుకోలేని దుస్థితి. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను అవసరానికి వాడుకునే హక్కు లేకుండా పోయింది. గంటల తరబడి పడిగాపులు కాస్తే వెయ్యో, రెండు వేలో చేతిలో పెట్టి పంపించే బ్యాంకులు ఒకవైపు...ఎప్పుడు తెచుకుంటాయో, ఎప్పుడు మూసుకుంటాయో తెలియని ఏటీఎంలు మరోవైపు లక్షలాది జనాన్ని నానా అగచాట్లకు గురి చేస్తున్నాయి. తెల్లారిందంటే చాలు జనం ఇళ్ల నుంచి నేరుగా ఏటీఎంలు, బ్యాంకులకే పరుగులు తీస్తున్నారు. కానీ ఎంత దూరం వెళ్లినా ఎండమావులను తలపించే విధంగా సగం మూసి, సగం తెరుచుకొన్న షట్టర్లతో కనిపించే ఏటీఎంలు, ‘ఔట్ ఆఫ్ సర్వీస్’ అంటూ వేలాడే బోర్డులు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. ఒకవేళ ఎక్కడో ఒక చోట తెరుచుకొన్నా క్షణాల్లోనే డబ్బులు ఖాళీ అవుతున్నాయి. లైన్లో ఉన్న జనం లైన్లో ఉండగానే ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్దరాత్రి, తెల్లవారు జామున..సమయం ఏదైతేనేం. ప్రాంతం ఏదైతేనేం...కనిపించే దృశ్యం ఇదే. నెల రోజులు దాటినా జనానికి కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. పెళ్లిళ్లు నిలిచిపోతున్నాయి. శుభకార్యాలు ఆగిపోతున్నాయి. ఆపదలు వేధిస్తున్నాయి. అత్యవసరాలు నిలదీస్తున్నారుు.డబ్బు కొరత కారణంగా సగటు నగర జీవి ఎన్ని బాధలు పడాలో అన్నీ పడుతున్నాడు. నగరంలో కరెన్సీ కష్టాలను తెలుసుకునేందుకు శనివారం పలు మార్గాల్లో సాక్షి బృదం ‘స్పెషల్ విజిట్’ నిర్వహించింది. ఈ బృందం పర్యటించిన అన్ని మార్గాల్లోనూ 96 శాతం ఏటీఎంలు ‘ ఔటాఫ్ సర్వీస్’ బోర్డులతోనే కనిపించాయి. పర్యటన ఇలా సాగింది... ఎల్బీనగర్, చైతన్యపురి, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ మార్గం, చందానగర్ నుంచి బోరుున్‌పల్లి వరకు, ఉప్పల్ గాంధీ బొమ్మ నుంచి అంబర్పేట్ వరకు ఛే నెంబర్, రామంతాపూర్, హబ్సిగూడ, నల్లకుంట, విద్యానగర్, మెట్టుగూడ, ప్రాంతాల్లో, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జనరల్ బజార్ మీదుగా బేగంపేట్, అమీర్‌పేట్, పంజగుట్ట, సోమాజిగూడ, రాణీగంజ్, ప్యారడైజ్, తదితర ప్రాంతాల మీదుగా ఈ పర్యటన సాగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగిన ఈ పర్యటనలో ఎస్బీహెచ్, ఎస్బీఐ.హెడీఎఫ్సీ, ఐసీఐసీఐ, కెనరా, విజయ, డీసీబీ, ఆంధ్రా తదితర బ్యాంకులకు చెందిన మొత్తం 335 ఏటీఎంలను పరిశీలించగా వాటిలో 11 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. మిగతా 324 ఏటీఎంలు మూసి ఉన్నాయి. తెరిచిన ఏటీఎం కేంద్రాలన్నింటిలోనూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకే డబ్బులు ఖాళీ అయ్యాయి. ఒకవైపు వందలాది మంది లైన్లలో ఉండగానే ఏటీఎంల్లో డబ్బులు ఖాళీ అయ్యాయి. ఎంతో ఆశగా వచ్చిన వాళ్లు నిరాశతో, నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్లారు. వివిధ మార్గాల్లో... చైతన్యపురి నుంచి చాదర్‌ఘాట్ వరకు రోడ్డుకు ఇరువైపులా 35 ఏటీఎంలు ఉన్నారుు. కానీ ఏ ఒక్క ఏటీఎంలోనూ నగదు లేదు. దిల్సుఖ్నగర్ చౌరస్తాలో ఉన్న ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలో మాత్రం నగదు జమచేసే మిషన్ తప్ప.. డ్రా చేసే ఏటీఎం పనిచేయడం లేదు. మలక్‌పేట డి మార్ట్ వద్ద స్వైపింగ్ మిషన్ ద్వారా రూ.2 వేలు ఇస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున జనం క్యూలో నిలబడ్డారు. సికింద్రాబాద్ నుంచి సోమాజిగూడ మార్గంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మోండా, ఎంజీరోడ్, ఆర్పీరోడ్, ప్యాట్నీ, బేగంపేట్, గ్రీన్ ల్యాండ్స, అమీర్‌పేట్, పంజగుట్ట, రాజ్‌భవన్, నెక్లెస్‌రోడ్ రాణిగంజ్, ఎంజీ రోడ్ వరకు ఏ ఒక్క ఏటీఎం పనిచేయలేదు. ప్రతి ఏటీఎం వద్ద నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తూ కనిపించాయి. గ్రీన్ల్యాండ్సలోని విజయ బ్యాంకు వద్ద ఉదయం 10 గంటల నుంచి 11.30గంటల వరకు వినియోగదారులు డబ్బు డ్రా చేసుకున్నారు. 11.30 గంటలకు డబ్బు అయిపోవడంతో నో క్యాష్ బోర్డు పెట్టారు. అప్పటికే వందల మంది క్యూలో ఉన్న ప్రజలు ఉసూరుమంటూ వెళ్లిపోయారు. ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీహెచ్ వద్ద నో క్యాష్ బోర్డు ఉన్నా...ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిల్చున్నారు. డబ్బు వస్తుందేమోనని ఆశతో ఎదురు చూశారు. కానీ గంటల తరబడి ఎదురు చూసినా ఫలితం కనిపించలేదు. ఈ రూట్లో ఉన్న 81 ఏటీఎంలలో గంట పాటు గ్రీన్ల్యాండ్స వద్ద ఉన్న ఏటీఎం ఒక్కటే పని చేసింది. చందానగర్ నుంచి బోరుున్‌పల్లి వరకు నిర్వహించిన విజిట్‌లో మొత్తం 165 ఏటీఎంలలో 129 ఏటీఎంలు మూసి ఉన్నారుు. 4 మాత్రమే గంట సేపు డబ్బులు అందించాయి. మరో 32 ఏటీఎంలు తెరుచుకొని ఉన్నాయి. కానీ డబ్బుల్లేవు. నిజాంపేట రోడ్డులోని విజయబ్యాంకు ఏటీఎం ఉదయం 9.30 గంటలకు ప్రజలకు డబ్బులు అందించింది. కొద్ది సేపట్లోనే ‘నో క్యాష్ బోర్డు’ పెట్టేశారు. కూకట్‌పల్లిలోని డి మార్ట్ మాల్ వద్ద ఉదయం 6 గంటల నుంచి ప్రజలు లైన్లో నిల్చొని టోకెన్ తీసుకుని డబ్బుల కోసం వేచి ఉన్నారు. ఇక్కడ కేవలం 150 మందికి రూ.2000 నోటును అందజేశారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హైదర్‌నగర్, నిజాంపేట రోడ్డు, అడ్డగుట్ట, భాగ్యనగర్ కాలనీలోని ఏటీఎంలు ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు కన్పించాయి. కొన్ని చోట్ల 20 రోజులైనా క్యాష్ పెట్టడం లేదని స్థానికులు పేర్కొన్నారు. నిజాంపేట రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు యూకో బ్యాంకు , భాగ్యనగర్ కాలనీలోని ఆంధ్రాబ్యాంకుతో పాటు ఎస్బీఐ ఏటీఎంలు తెరిచినప్పటికీ ఉండకపోవడంతో ఖాతాదారులు ఏటీఎం సెంటర్ల వద్దకు వచ్చి నోక్యాష్‌బోర్డులు ఉండటంతో వెనుదిరిగివెళ్తున్నారు బాలానగర్, ఫతేనగర్‌లోని ఏటీఎంలలో అన్ని మూత ఉన్నారుు. కేవలం రెండు ఏటీఎంలు మాత్రమే పని చేశాయి. ఉప్పల్ నుంచి అంబర్పేట్ మార్గంలో రామంతాపూర్, హబ్సిగూడ, మెట్టుగూడ, తార్నాక, విద్యానగర్, నల్లకుంట, ఛే నెంబర్, అంబర్పేట్ ప్రాంతాల్లో మొత్తం 34 ఏటీఎంలుండగా కేవలం ఆరు ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. నోట్ల రద్దు పుణ్యమా అని సిటీజనులు వీకెండ్ సరదాలకు స్వస్తి చెప్పారు. అకౌంట్లో డబ్బులున్నా..తీసుకునే వీలులేక సెలవు రోజుల్లోనూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. వరుసగా మూడు రోజులు హాలిడేస్ వస్తే నగరంలో వీకెండ్ జోష్ కనిపిస్తుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సిటీలో ఏటీఎంలు మూతపడడం..బ్యాంకులు చుక్కలు చూపుతుండడంతో చేతిలో నగదు లేకుండా పోతోంది. ఉన్నకొద్దిపాటి డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో సరదాలకు ఫుల్స్టాప్ పెట్టారు నగరవాసులు. ఇక నగరంలో నగదు కష్టాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ శనివారం వివిధ ప్రాంతాల్లో విజిట్ నిర్వహించగా..ఏటీఎంలు, బ్యాంకుల నిర్వహణ డొల్లతనం బయటపడింది. రెండువేల నగదు కోసం నగరవాసులు పడుతున్న కష్టాలు వెలుగుచూశాయి. 96 శాతం ఏటీఎంలు మూతబడే కన్పించారుు. అన్ని చోట్లా అవుటాఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. -
అర్ధరాత్రి.. ఆగంతకులు
టైమ్ అర్ధరాత్రి 2.. చిమ్మచీకటి.. హైదరాబాద్ మహానగరం.. కొంతమంది ఒక్కసారిగా రోడ్డు మీదకొచ్చారు.. అందరూ మంకీ క్యాప్‌లు వేసుకున్నారు.. వాళ్ల కళ్లు చింతనిప్పుల్లా మండుతున్నాయి.. గుంపుగా బయల్దేరారు. వారు దేనికోసమో వెతుకుతున్నారు.. రోడ్డు మీద వెళ్తున్నారే గానీ.. వాళ్లు కళ్లు ఎక్స్‌రేలా పరిసరప్రాంతాలను జల్లెడ పట్టేస్తున్నాయి.. ఈ రోజు తమ టార్గెట్‌ను ఎలాగైనా పూర్తిచేయాలనే పట్టుదలతో ఉన్నారు వారు.. అదిగో టార్గెట్.. వాళ్ల కళ్లల్లో మెరుపు.. అందరూ గుంపుగా ఒక్కసారిగా ఉరికారు.. ఇంతకీ వీళ్లంతా ఉరికి ఏం చేశారు?? వెళ్లి.. ఏటీఎం ముందు లైను కట్టారు. సగటు నగరవాసి దుస్థితి ఇదీ.. చాలా ఏటీఎంల్లో డబ్బుల్లేక.. ఉదయం సమయంలో గంటలుగంటలు చేంతాళ్లను తలపించే క్యూలో నిల్చున్నా.. ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి వేళలో ఇలాంటి సన్నివేశాలు నిత్యకృత్యమవుతున్నాయి. నిద్రలు మానుకుని మరీ.. నగదు ఉన్న ఏటీఎంల వేటలో మునిగిపోతున్నారు. ఎవరైనా ఏటీఎం వద్ద కనిపిస్తే.. అక్కడ ఆగి ఆశగా చూడటం.. ‘భయ్యా.. డబ్బులున్నాయా’ అని ఆరాలు తీయడం కామన్‌గా మారింది. ఆ సమయంలో అయితే.. జనం తాకిడి తక్కువుంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. కొందరు యాప్‌ల సాయంతో.. మరికొందరు తెలిసిన వాళ్లను కనుక్కొని వెళ్తున్నారు. అర్ధరాత్రి డ్యూటీలు చేసే ఉద్యోగులు.. ఇప్పుడు ఇళ్లకు వెళ్లకుండా ఏటీఎంలకు వెళ్తున్నారు. అలాగనీ.. అర్ధరాత్రి కూడా ప్రతిసారి నగదు ఈజీగా దొరకని పరిస్థితి.. ఇదీ నగరవాసి దుస్థితి.. - సాక్షి తెలంగాణ డెస్క్ పరిస్థితి దుర్భరం.. ఆ మధ్య వరకూ కాస్తో.. కూస్తో.. రాత్రి పూట ప్రయత్నిస్తే.. దొరికేవి.. ఒకటో తారీఖు తర్వాత పరిస్థితి మరింత దుర్భరంగా మారింది.. ఎక్కడా దొరకడం లేదు. నేను అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని.. ఇంటికి వెళ్లకుండా ఏటీఎంల వేటలో మునిగిపోతున్నా.. అయినా దొరకడం లేదు.. - కిశోర్, ప్రైవేటు ఉద్యోగి, మెహిదీపట్నం..