సాక్షి, నల్లగొండ : రెండో రోజు కూడా జిల్లాలోని ఏటీఎంలు ప్రజలకు చుక్కలు చూపించాయి. వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చిన రెండో రోజు ఆదివారం జిల్లాలో రెండు ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. నల్లగొండ పట్టణంలో రెండు చోట్ల మినహా జిల్లాలో ఉన్న 172 ఏటీఎంల్లో ఎక్కడా డబ్బులు రాలేదు. చాలా చోట్ల అసలు ఏటీఎంల షట్టర్లు కూడా తీయకపోవడం, తీసినా నగదు లేకపోవడంతో ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసిన జిల్లా ప్రజానీకం నిరాశకు గురయ్యారు. ఇప్పటికే నగదుకు తీవ్ర కొరత ఉండడంతో మధ్య, పేద తరగతులకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, వరుసగా వచ్చిన సెలవులు వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నా రుు. ఉన్న డబ్బులు ఖర్చయిపోయాయి. ఈ నేపథ్యం లో ఏటీఎంల నుంచి డబ్బులు రాకపోవడంతో కనీస ఖర్చులకు కూడా డబ్బులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం చేబదుళ్లు ఇచ్చే వారూ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నా రు. మూడు రోజులు ఎప్పుడు అయిపోతాయా? మంగళవారం ఎప్పుడు వస్తుందా? బ్యాం కులు ఎప్పుడు తెరచుకుంటాయా అని ఎదురుచూడడం మినహా చేసేదేమీ లేక క్షణమొక యుగంగా గడుపుతున్నారు.
ముందు చూపు లేకనే..!
వాస్తవానికి పెద్ద నోట్లు రద్దయి ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి రోజుకు రూ.2వేలకు కుదించినా గత నెలరోజుల్లో ప్రజలు కొంత మేర మాత్రమే ఇబ్బందులు పడ్డారు. రోజు మొత్తం తిరిగితే కనీసం ఒక్కచోటరుునా డబ్బులు దొరికే పరిస్థితి ఉండడంతో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టుకున్నారు. కొందరు బ్యాంకులకు వెళ్లి లైన్లో నిలబడి రూ.4వేలు తెచ్చుకున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి బ్యాంకుల ముందు ఉదయాన్నే క్యూలు కట్టి ఎలాగొలా రూ.4వేల వరకరుునా తీసుకెళ్లగలిగారు. కానీ, వరుసగా మూడు రోజులుగా బ్యాంకులకు సెలవులు వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బ్యాంకర్లు చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ప్రజలు ఇప్పుడు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కనీసం రూ.150-200 కోట్లయినా తెప్పించి ఏటీఎంలలో పెడితే ఇంత ఇబ్బంది ఉండేది కాదని నిపుణులంటున్నారు. జిల్లాలో మొత్తం 15లక్షల బ్యాంకు ఖాతాలుంటే.. అందులో 10లక్షల ఏటీఎం కార్డులున్నా... అందులో సగం మంది రోజూ డ్రా చేసినా... రోజుకు రూ.2వేల చొప్పున 5లక్షల మందికి రూ.100 కోట్లు సరిపోయేవని, మూడు రోజులకు రూ.300 కోట్లు కావాల్సి ఉన్నా...కనీసం అందులో సగమయినా అందుబాటులో ఉండేలా బ్యాంకర్లు, ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రజలకు ఇన్ని ఇబ్బందులుండేవి కాదని వారంటున్నారు. కానీ, అటు బ్యాంకర్లు కానీ, ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజల కరెన్సీ కష్టాలపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం.
జిల్లాలో పరిస్థితి ఇది....
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల్లో ఉన్న 31 ఏటీఎంలు ఆదివారం తీయలేదు. దీంతో డబ్బుల కోసం ఏటీఎంల వద్దకు వెళ్లిన వారికి నిరాశే ఎదురయింది. కనీస ఖర్చులకు కూడా డబ్బుల్లేక ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. చేబదుళ్లు ఇచ్చే వారు కూడా లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడు మంగళవారం వస్తుందా... ఎప్పుడు బ్యాంకులు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నారు. దేవరకొండ డివిజన్‌లో ఆదివారం అన్ని ఏటీఎంలు దాదాపుగా మూసి ఉన్నాయి. తెరచి ఉన్న ఒకటి, రెండు ఏటీఎంల్లో సైతం డబ్బులు లేకుండా నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చారుు. దీంతో ఏటీఎం లో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ప్రజలు చేసేదేమీ లేక నిరాశగా వెనుదిరిగారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 23 ఏటీఎం కేంద్రాల్లో ఏ ఒక్క ఏటీఎం కేంద్రంమూ ఆదివారం తెరచుకోలేదు. వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులుండతో ఎక్కడైనా ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు ఉండకపోతాయా అని ఆశతో ప్రజలు వాటి చుట్టూ తిరిగా రు. కానీ ఏటీఎం కేంద్రాల్లోనూ లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహంగా వెళ్లిపోతున్నారు.
నల్లగొండ పట్టణంలో రెండు మినహా మిగతా ఏటీఎంలన్నీ మూతపడ్డారుు. రామాలయం ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం, పూజిత అపార్ట్‌మెంట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎస్‌బీఐ ఏటీఎంల్లో మాత్రమే నగదు అందుబాటులో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఖాతాదారులు ఈ రెండు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకున్నారు. ఏటీఎంల వద్ద ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎస్‌బీఐ నల్లగొండ పట్టణంలో పీఓఎస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెట్రోల్‌బంక్‌లు, ట్రేడర్స్, ఎంపోరియంలు, స్టేషనరీ దుకాణాల్లో పీఓఎస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖాతాదారులు డెబిట్ కార్డులు ఉపయోగించి పీఓఎస్ కేంద్రాల్లో రెండు వేలు డ్రా చేసుకోవచ్చును. దీనినే అదునుగా చేసుకుని పీఓఎస్ కేంద్రాల నిర్వాహకులు రూ. రెండు వేలకు రూ.60ల చొప్పున కమీషన్ వసూలు చేస్తున్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని 24 ఎటీఎంల్లో ఆదివారం ఒక్కటీ పనిచేయలేదు. దామరచర్ల, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండలాల్లో నవంబర్ 9 నుంచి పని చేయడంలేదు. సమీప ప్రాంతాలవారు ఎటీఎంలు పని చేస్తాయని మిర్యాలగూడకు వ చ్చి మూసివేసి ఉండటంతో నిరాశతో వెళ్లిపోయారు.
నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక్క ఏటీఎం కూడా పనిచేయలేదు. నకిరేకల్, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్ శాలిగౌరారం మండలాలతో ఏటీఎంలు కూడా పనిచేయలేదు.
సేమ్ సీన్..!
Published Mon, Dec 12 2016 3:58 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement