ఇక నో క్యూ: ఇంటి వద్దకే డబ్బులు | No more ATM queues for people above 70 | Sakshi
Sakshi News home page

ఏటీఎంల వద్ద నో క్యూ: ఇంటి వద్దకే డబ్బులు

Published Sat, Nov 11 2017 8:28 AM | Last Updated on Sat, Nov 11 2017 8:44 AM

No more ATM queues for people above 70 - Sakshi

ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిల్చునే అవసరం లేకుండా వారి ఇంటి వద్దనే బ్యాంకులను ప్రాథమిక సర్వీసులు అందజేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. 2017 డిసెంబర్‌ 31 నుంచి ఈ చర్యలను అమల్లోకి తీసుకురావాలని ఆర్‌బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. నగదు స్వీకరించడం, డెలివరీ చేయడం, చెక్‌ బుక్స్‌, డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించడం, లైఫ్‌ సర్టిఫికేట్లు అందించడం వంటి సర్వీసులను సీనియర్‌ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని తెలిపింది. 

ఈ ప్రొగ్రామ్‌ అమలు కోసం బ్యాంకులు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటుచేయాలని, సమస్యలను ఎప్పడికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలని పేర్కొంది. అయితే ఈ సేవలందించినందుకు గాను ఎంత మొత్తంలో ఛార్జీలు విధించనుందో మాత్రం ఆర్‌బీఐ ఇంకా స్పష్టంచేయలేదు. ఇప్పటి నుంచి పెన్షనర్లు తమ ఫిజికల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పెన్షన్‌ పేయింగ్‌ బ్యాంకు బ్రాంచుల వద్ద సమర్పించాల్సి ఉంది. పెన్షనర్లు సమర్పించిన ఈ సర్టిఫికేట్లను కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్స్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. చెక్‌ బుక్‌లను అందుకోవడానికి కూడా సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు ఇక బ్యాంకులకు రావాల్సినవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement