నోట్ల వేట
సిరిసిల్ల : కొత్త సంవత్సరంలోనూ జనాలకు నోట్ల తిప్పలు తప్పలేదు. ఆదివారం బ్యాంకులకు సెలవ కావడంతో నగదు కోసం ఖాతాదారులకు ఏటీఎంలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో 16 ఏటీఎంలు ఉండగా.. ఎస్‌బీహెచ్, గాయత్రీ బ్యాంకుల ఏటీఎం మాత్రమే పని చేశాయి. మిగతా వాటి ఎదుట ‘నో క్యాష్’ బోర్డులు తగిలించారు. నెలమొదటి రోజు కావడంతో బ్యాలెన్స్ పరిశీలించేందుకు, నగదు డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు ఏటీఎంల ఎదుట బారులు తీరా రు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల డబ్బులు ఖాతాల్లో పడడంతో వారు సైతం నగదు కోసం ఏటీఎంలను ఆశ్రయించారు. అయితే, ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో పనిచేసే రెండు ఏటీఎంల నుంచి రూ.4500 విత్‌డ్రా చేసుకున్న ఖాతాదారులు కాస్త ఊపిరి తీల్చుకున్నారు.
మొన్నటి వరకు రోజుకు రూ.2000, ఆ తర్వాత రూ.2,500 తీసుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా రూ.4,500 తీసుకున్నారు. ఇందులో రూ.రెండువేల నోట్లు రెండు, ఐదు వం దల నోట్లు అందాయి. కొత్త సంవత్సరం వేళ సిరిసిల్లలో పాత సమస్యనే జనాన్ని వెంటాడింది. అన్ని బ్యాంకులు ఏటీఎంల్లో డబ్బులను అందుబాటులో ఉంచితే.. బ్యాంకుల్లో జనం రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు.
నేటి నుంచి రద్దీ..
ఉద్యోగులకు సోమవారం వేతనాలు తమ బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. దీంతో వేతనాలు డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీనిని అధిగమిం చేందుకు బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలి ఉంది.