సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బ్యాంకులు, పోస్టాఫీస్‌ల వద్ద రద్దీ కొనసా గుతోంది. పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు, నగదు తీసుకు నేందుకు జనం బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో శనివారం కూడా ఏటీఎం కేంద్రాలు పనిచేయలేదు. బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమి చ్చారుు. సంగారెడ్డి జిల్లాలో ఉదయం 8 నుంచే జనం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద బారులు తీరారు. సంగారెడ్డి, జోగిపేట, పటాన్‌చెరు, సదాశివపేట, జహీరాబాద్ తదితర పట్టణాల్లో ఏటీఎంలు పనిచేయలేదు. నల్లగొండ జిల్లా లోనూ నాలుగో రోజు ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పలేదు.
చాలా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసు కుంటున్నా కొత్త నోట్లు ఇవ్వడం లేదు. కొన్ని బ్యాంకుల్లో కొత్త రూ.500, 2000 నోట్లు ఇస్తు న్నా.. చిల్లర సమస్య ఎదురైంది. ఇక బ్యాం కుల్లో రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఇక సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పాత నోట్లు డిపాజిట్ చేసుకోవడం తప్ప కొత్తవి ఇవ్వడం లేదు. వారం తర్వాత రావాల ని తిప్పి పంపుతున్నారు. అసలు ఈ మండలం మొత్తమ్మీద ఉన్నది ఈ ఒక్క బ్యాంకే. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధార పడ్డారు. సాగుకు కావాల్సిన వస్తువులు, విత్తనా లతో పాటు నిత్యావసర వస్తువులు కొనాలంటే కొత్త నోట్లు, చిల్లర నోట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.
యాదాద్రిలో భక్తుల తిప్పలు
యాదగిరిగుట్టలోనూ భక్తులకు నోట్ల పాట్లు తప్పలేదు. రూ.500, 1000 నోట్లు చెల్లక.. రూ.2000 నోట్లకు చిల్లర దొరక్క ఇబ్బందులు ఎదురయ్యారుు. ప్రసాద విక్రయశాల, నిత్య కై ంకర్యాల టికెట్ కౌంటర్లలో సరిపడా చిల్లర లేకపోవడంతో.. ఒకానొక దశలో భక్తులను వెనక్కి పంపారు. దీంతో కొంత మంది భక్తులు ప్రసాదాలు తీసుకోకుండా వెళ్లిపోగా... మరికొందరు స్వామి, అమ్మవారి నిత్యపూజల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు.
నోట్ల కోసం వచ్చి ఫిట్స్‌కు గురై..
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట ఎస్‌బీహెచ్‌కు నోట్లు మార్చుకునేందుకు వచ్చిన ఓ మహిళ ఫిట్స్ వచ్చి పడిపోయారు. కొంతసేపు సృ్పహ కోల్పోయారు. దీంతో అక్కడే ఉన్న కొందరు సపర్యలు చేయడంతో ఆమె కోలుకున్నారు.
ప్రైవేట్ ఉద్యోగి ఖాతాలో రూ.4 లక్షలు జమ.. విత్‌డ్రా
మెదక్ జోన్: ఓ ప్రైవేటు ఉద్యోగి ఖాతాలో రూ.14 వేలు ఉన్నారుు. కానీ శుక్రవారం రాత్రి ఆ ఖాతాలో ఏకంగా రూ.4 లక్షలు జమయ్యారుు. ఆ వెంటనే ఆ డబ్బంతా విత్‌డ్రా అరుుంది. అసలే పాత నోట్ల మార్పిడి, కొత్త నోట్ల వ్యవహారం గందరగోళంగా ఉన్న ఈ సమయంలో దీనిపై సందేహాలు వ్యక్తమవుతున్నారుు. నల్లధనం చెల్లుబాటుకు ఇది మార్గమేమోనన్న అనుమానాలు వస్తున్నారుు. మెదక్ జిల్లా రారుునిపల్లికి చెందిన ఎం.రాజాగౌడ్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు మెదక్ పట్టణంలోని ఎస్‌బీహెచ్ (ఏడీబీ) బ్యాంకులో ఖాతా ఉంది. శుక్రవారం రాత్రి ఆ ఖాతాలో రూ.4 లక్షలు జమ చేసినట్లుగా ఎస్సెమ్మెస్ వచ్చింది. ఆ వెంటనే ఆ డబ్బులు డ్రా అరుునట్లుగా మరో మెసేజ్ వచ్చింది. శనివారం రాజాగౌడ్ బ్యాంకుకు వచ్చి సిబ్బందికి ఈ విషయం చెప్పగా.. ఖాతాను పరిశీలించి చూస్తామని చెప్పారు. అరుుతే నల్లధనాన్ని మార్చుకునేందుకు ఇలా ఖాతాలను వాడుకుంటున్నారా? లేక మరేదైనా సమస్యా? అని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
రుణాలు ఇవ్వడం లేదు
‘‘నోట్ల మార్పిడి వ్యవహారంతో బ్యాంకులు రైతులకు రుణాలు రెన్యూవల్ చేయడం లేదు. కొత్త రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం కూడా రావడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు..’’
- ఉపేందర్‌రెడ్డి, ముడుపుగల్, మహబూబాబాద్ మండలం
ఉప్పు, మిరపకాయలకూ డబ్బుల్లేవు
‘‘వానకాలం వడ్లు అమ్మితే రూ.10 వేలు వచ్చినరుు. వాటిని పట్టుకొని దుకాణానికి పోతే చెల్లవని వెల్లగొట్టిండు. ఇదెక్కడి గోస. పొద్దున లేచి డబ్బులు, ఖాతా బుక్కు పట్టుకుపొరుు బ్యాంకులో డబ్బులేసిన. కొత్త నోట్ల కోసం వారం తర్వాత రావాలని చెప్తున్నరు. ఇంట్లో ఉప్పు, మిరపకాయలకు కూడా పైసల్లేవు..’’
- మంక్యానాయక్, తాళ్లతండా, సిద్దిపేట జిల్లా
విత్తనాలు ఎట్లా పెట్టాలె?
‘‘మక్కలు అమ్మితే సావుకారి రూ.20 వేలు పెద్ద నోట్లు ఇచ్చిండు. యాసంగి పంటకు పెట్టుబడికి, ఎరువులు తెద్దామని ఇంట్లనే పెట్టిన. ఇప్పుడవి చెల్లవంటే.. పొలంకాడ పని వదులుకొని బ్యాం కుకు వచ్చి, ఖాతాల జమచే సిన. మళ్లీ తీసుకుం దామంటే.. వారం ఆగాలని అంటున్నరు. ఎరు వులు ఎట్లా తేవాలె, ఎరువులు లేంది విత్తనం ఎట్లా పెట్టాలె?’’
- స్వామి, రాజుతండా, సిద్దిపేట జిల్లా
జిల్లాల్లో ఎక్కడ చూసినా..
Published Sun, Nov 13 2016 3:27 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
Advertisement
Advertisement