- డీసీసీడీ చైర్మన్ రాజా
రైతుల సేవల కోసం ఏటీఎంలు
Published Fri, Jul 14 2017 12:08 AM | Last Updated on Thu, Jul 25 2019 5:24 PM
అమలాపురం టౌన్ :
రైతుల సేవల కోసం జిల్లాలో డీసీసీబీ బ్రాంచీల వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ వరపుల రాజా వెల్లడించారు. అమలాపురం డీసీసీబీ బ్రాంచి వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఏటీఎంను రాజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి కాకినాడలో ఒకటి, అమలాపురం, రాజోలు, అంబాజీపేటల్లో డీసీసీబీ ఆధ్వర్యంలో ఏటీఎంలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటి ద్వారా ప్రస్తుతానికి కేవలం తమ సహకార రంగానికి చెందిన రైతులు మాత్రమే సేవలు పొందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొద్ది నెలల తర్వాత ఈ ఏటీఎంలు అందరూ సద్వినియోగం చేసుకునేలా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. జిల్లాలో మిగిలిన డీసీసీబీ బ్రాంచీల వద్ద కూడా ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాజా వివరించారు. అమలాపురం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, డీసీసీబీ సీఈవో మంచాల ధర్మారావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, డీసీసీబీ డైరెక్టర్లు ఇళ్ల గోపాలకృష్ణ, గోదశి నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement