Helpline Centre
-
ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ సిబ్బందికి కరోనా
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెల్ప్‌లైన్ సెంటర్ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి మంగళవారం తెలిపారు. ఐదు రోజుల క్రితం సీఎం హెల్ప్‌లైన్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకిందని, తాజాగా ఆ సంఖ్య 80కి చేరిందని ఆయన చెప్పారు. నెల క్రితం హెల్ప్‌లైన్ ఆఫీస్‌ను తనిఖీ చేయగా.. వారంతా కోవిడ్ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నట్టు వెల్లడైందని తెలిపారు. కాగా, సామాన్యుల అభ్యర్థనల్ని పరిశీలించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గతేడాది 1076 హెల్ప్‌లైన్ ప్రారంభించారు. ఔట్సోర్సింగ్ సంస్థ దీనిని నిర్వహిస్తోంది. 24/7 పనిచేసే ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌తో సీఎం కార్యాలయ సిబ్బందితో ఎవరైనా మాట్లాడొచ్చు. (చదవండి: బ్యాంకు అద్దాల తలుపు తగిలి మహిళ మృతి) -
లాక్డౌన్ : వలస కూలీల కోసం కంట్రోల్ రూమ్‌లు..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్‌ను మే 3వరకూ పొడిగించడంతో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లాక్డౌన్ పొడిగింపుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన అనంతరం కార్మిక శాఖ ఈ వివరాలు వెల్లడించింది. మహమ్మారి కేసుల తీవ్రత తగ్గితే ఏప్రిల్ 20 నుంచి కొన్ని ప్రాంతాల్లో షరతులతో కూడిన సడలింపును ప్రకటించవచ్చని ప్రధాని ప్రకటన ఆధారంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత మూడువారాలుగా అమల్లో ఉన్న లాక్డౌన్లో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో స్వస్ధలాలకు చేరుకోలేక వేలాది వలస కూలీలు ఇబ్బందులు పడగా, మరికొందరు వేతనాలు అందక..ఉద్యోగాలు కోల్పోయి మరికొందరు అసంఘటిత రంగ కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వలస కూలీల ఇబ్బందుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన కార్మిక శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ 20 కంటోల్ రూంలను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్‌లు కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశాలతో పాటు వీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి పరిష్కరిస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫోన్ నెంబర్లు, వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా ఈ కాల్‌సెంటర్స్‌ను కార్మికులు సంప్రదించవచ్చని పేర్కొంది. కార్మికులు ఎవరైనా కాల్ సెంటర్స్‌లో ఆయా నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి : మోదీజీ! ఈ ప్రశ్నలకు బదులేదీ? -
మడిలో మాణాక్యాలు
సాక్షి, బిబ్బిలి(విజయనగరం) : వేకువనే నిద్ర లేస్తారు. అమ్మానాన్నలతో పొలానికెళ్తారు. పంట పనులకు సాయం చేస్తారు. కోసిన కూరగాయల్ని తట్టల్లో మార్కెట్‌కు తరలిస్తారు.. కన్నవారికి కుడి భుజంలా ఉంటూనే.. చక్కగా చదువుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కంటే కూతుర్నే కనాలి.. అన్నట్టున్న ఈ బంగారు తల్లులంతా మండలానికి చెందిన విద్యార్థినులు. పేద కుటుంబాలకు చెందిన వీరిలో అత్యధికులు ఉన్నత విద్య పూర్తి చేశారు. మరికొందరు చదువుకుంటున్నారు. వ్యవసాయ పనులన్నీ ఉదయం 8 గంటల్లోగా పూర్తిచేసి మళ్లీ కళాశాలకు బయలుదేరి వెళ్తూ చదువులోనూ ముందుంటున్న రామభద్రపురం మండల విద్యార్థినులపై కథనమిది. మండల కేంద్రంలోని ఎరుసు సత్యారావు, చిన్నమ్మి దంపతుల కుమార్తెలు శ్యామల ఎమ్మెస్సీ బీఈడీ, మాధవి డిగ్రీ, డైట్ శిక్షణ పూర్తి చేశారు. చింతల శ్రీనివాసరావు, పుణ్యవతి దంపతుల కుమార్తెలు సంగీత ఇంటర్ ద్వితీయ ఏడాది, నాగమణి డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నారు. కర్రి సాంబ, అన్నపూర్ణ దంపతుల కుమార్తెలు సాయి డిగ్రీ, ఐటీఐ, అశ్వని ఇంటర్, గొర్లి శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతుల కుమార్తె ఝాన్సీ డిగ్రీ పూర్తి చేశారు. మరికొందరు ప్రస్తుతం చదువుకుంటున్నారు. వేకువ జామునే లేచి.. వీరు ఉన్నత విద్య చదువుతున్నాం కదా.. అని ఏమాత్రం బిడియపడకుండా రోజూ తెల్లారే తల్లిదండ్రులతో కలసి పొలాలకు వెళ్లి కూరగాయలు కోసుకొని మార్కెట్లో విక్రయిస్తారు. మరికొందరు కుటుంబ భారాన్ని కూడా మోస్తూ పెద్ద దిక్కు అవుతున్నారు. వ్యవసాయ పనులతో పాటు పాడి పశువులను పోషిస్తూ వాటికి గడ్డి కోయడం, దాణాలు పెట్టడం, పాలు పితకడం, పాల కేంద్రాలకు పాలు సరఫరా చేయడం వంటి పనులు కష్టపడి చేస్తూ ఆదాయ మార్గాలను చూసుకుంటున్నారు. పొలం పనులు చేస్తా నేను ఎమ్మెస్సీ, బీఈడీ చేశాను. బాడంగి టీఎల్ఎన్ స్కూల్లో ఉపాధ్యాయినిగా చేస్తున్నాను. రోజూ వేకువ జామున చెల్లి మాధవి, అమ్మ, నాన్నలతో కలసి కూరగాయలు కోసేందుకు పొలానికి వెళ్తాం. కూరగాయలు కోసి మార్కెట్లో విక్రయించిన తరువాత చెల్లి కాలేజీకి, నేను స్కూల్‌కు వెళ్తాం. తల్లిదండ్రులకు సహాయపడుతున్నందుకు ఆనందంగా ఉంది. – ఎరుసు శ్యామల, ఎమ్మెస్సీ, బీఈడీ, రామభద్రపురం ఆనందంగా ఉంది నేను, అక్క చదువుకుంటూ అన్ని పనుల్లోనూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాం. తోడ పుట్టిన అన్నదమ్ములు లేరు కాబట్టి మేమే అమ్మ, నాన్నలకు సహాయపడుతున్నాం. పూర్వం నుంచి వ్యవసాయ కుటుంబానికి చెందిన వారం కాబట్టి ఈ పనులు చేయడం ఆనందంగా ఉంది. – చింతల నాగమణి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, రామభద్రపురం. కుమార్తెలే అండ ఉన్నత విద్య చదువుకుంటూ వ్యవసాయ, ఇంటి పనుల్లో కుమార్తెలే సహాయపడుతున్నారు. రోజూ ఉదయం మాతో పాటు పొలంలోకి వచ్చి కూరగాయలు కోస్తారు. మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తారు. వ్యవసాయంలో కలుపు తీయడం వంటి పనులు చేస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. కొడుకులు లేరన్న బాధ మాలో లేదు. – చింతల పుణ్యవతి, సంగీత, నాగమణి తల్లి, రామభద్రపురం -
సీఎం చొరవతో ఇంటికి వస్తాడనుకున్నాం..
సాక్షి, జ్ఞానాపురం(విశాఖ దక్షిణం): బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నీరజ్‌కుమార్ మృతితో జ్ఞానాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో అందిన చికిత్సతో ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాడనుకున్న నీరజ్ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆదివారం కాన్వెంట్ కూడలి శ్మశానవాటికలో నీరజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. జ్ఞానాపురం బాబు కాలనీకి చెందిన నీరజ్‌కుమార్ టెన్త్ వరకు రవీంద్రభారతి పాఠశాలలో చదువుకున్నాడు. 2017–18 టెన్త్‌లో 9.5 జీపీఏతో ఉత్తమ విద్యార్థిగా మంచిపేరు సంపాదించుకున్నాడు. నీరజ్ తండ్రి అప్పలనాయుడు పూర్ణామార్కెట్‌లో కలాసీ తల్లి దేవి గృహిణి సోదరుడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. కుమారులను ఉన్నత చదువులు చదివించాలని తపన పడ్డారు. అయితే నీరజ్‌కు బ్లడ్ క్యాన్సర్ రావడంతో వారి ఆశల అడియాసలయ్యాయి. మెరుగైన వైద్యం అందించే ఆర్థిక స్తోమత వారికి లేదు. దీంతో గత నెల 4న విశాఖ వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయం వద్ద నీరజ్ స్నేహితులు పరిస్థితి వివరించారు. చికిత్సకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇవ్వడంతో వారి ఆశలు చిగురించాయి. ఈ మేరకు వైద్యం కూడా అందించారు. వైద్యులు పొట్టన పెట్టుకున్నారు! మరో మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తాడనుకున్న తమ కుమారుడు నీరజ్‌ను వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి విగతజీవిని చేసి పంపారని ఆయన తల్లిదండ్రులు ఆరోపించారు. డిశ్చార్జి అయి తమతో ఎప్పటిలాగే తిరుగుతాడని అనుకున్న స్నేహితులు, కాలనీవాసులు, కుటుంబ సభ్యులు.. నీరజ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. డాక్టర్ హరికృష్ణ, భాస్కర్లు చికిత్స చేసేవారని, శనివారం డాక్టర్ డొక్క ప్రదీప్ హంగమా చేసి ఆక్సిజన్ అందలేదంటూ తమ కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని, ఆయనపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు. -
‘డిగ్రీ’ కాలేజీ మార్పునకు మరో చాన్స్!
సాక్షి, హైదరాబాద్ : డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కమిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కాలేజీల్లో చేరిన, మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు మరోసారి ఆప్షన్లకు అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన 74 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో విజ్ఞాపనలు స్వీకరించనున్నట్లు సమాచారం. కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తమ తల్లిదండ్రుల నుంచి వన్‌టైమ్ పాస్వర్డ్ తీసుకొని తమ కాలేజీల్లో సీట్లు వచ్చేలా ఆప్షన్లు ఇచ్చారని, ఫలితంగా ఇష్టం లేని కాలేజీల్లో సీట్లొచ్చాయని దాదా పు 2 వేల మంది విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ లోని దోస్త్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో వారికి రెండో దశలో ఆప్షన్లకు అవకాశమిచ్చిన దోస్త్.. వారితోపాటు అన్ని జిల్లాల విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని జిల్లాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సమస్య పరిష్కారం కాకపోతే హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సహకారంతో విజ్ఞప్తుల కాపీని స్కాన్ చేయించి హైదరాబాద్ కళాశాల విద్యా కమిషనర్ కార్యాలయంలోని సూపర్ హెల్ప్‌లైన్ కేంద్రానికి పంపితే సమస్య పరిష్కరించి మూడో దశలో ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టనున్నారు. 84 వేల మందికీ అవకాశం మొదటి దశ ప్రవేశాలల్లో సీట్లు పొందిన 84 వేల మంది విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పించాలని దోస్త్ నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థులు ఇచ్చిన మొదటి ఆప్షన్ ప్రకారమే వారికి సీట్లు లభించినందున రెండో దశ కౌన్సెలింగ్‌లో వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొదటి దశలో సీట్లు వచ్చిన వారు కూడా కాలేజీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఇందుకు దోస్త్ వెబ్సైట్లో పేర్కొన్న హెల్ప్‌లైన్ కేంద్రాల్లో విజ్ఞప్తి చేసేలా చర్యలు చేపట్టింది. -
రైతుల సేవల కోసం ఏటీఎంలు
డీసీసీడీ చైర్మన్ రాజా అమలాపురం టౌన్ : రైతుల సేవల కోసం జిల్లాలో డీసీసీబీ బ్రాంచీల వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ వరపుల రాజా వెల్లడించారు. అమలాపురం డీసీసీబీ బ్రాంచి వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఏటీఎంను రాజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి కాకినాడలో ఒకటి, అమలాపురం, రాజోలు, అంబాజీపేటల్లో డీసీసీబీ ఆధ్వర్యంలో ఏటీఎంలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటి ద్వారా ప్రస్తుతానికి కేవలం తమ సహకార రంగానికి చెందిన రైతులు మాత్రమే సేవలు పొందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొద్ది నెలల తర్వాత ఈ ఏటీఎంలు అందరూ సద్వినియోగం చేసుకునేలా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. జిల్లాలో మిగిలిన డీసీసీబీ బ్రాంచీల వద్ద కూడా ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాజా వివరించారు. అమలాపురం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, డీసీసీబీ సీఈవో మంచాల ధర్మారావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, డీసీసీబీ డైరెక్టర్లు ఇళ్ల గోపాలకృష్ణ, గోదశి నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆపన్నులకు చేయూత
ముద్దులొలికే చిన్నారులు... విధివశాత్తు అంగ వైకల్యంతో పుట్టారు. 12 ఏళ్లయినా శరీర ఎదుగుదల లేక మరొకరిపై ఆధారపడ్డారు. పలు ప్రాంతాల్లో చికిత్సలు చేయించినా డబ్బు ఖర్చు తప్ప ఫలితం కనిపించలేదు. వీరి పోషణ నిరుపేద తల్లిదండ్రులకు భారమైంది. విషయం తెలుసుకున్న స్వామి జపానందా వారిని అక్కున చేర్చుకున్నారు. పావగడ తాలూకాలోని కొత్తూరు గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు అళ్లప్ప, మల్లమ్మకు శిల్ప, మంజుల అనే పిల్లలు ఉన్నారు. అంగవైకల్యంతో జన్మించిన వీరి ఆలనాపాలనకు ఎవరో ఒకరు కచ్చితంగా ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలకు వీరి పోషణ భారమైంది. కంటి ముందర పాకుతున్న 12 ఏళ్ల పిల్లలను చూస్తూ కన్నీటి పర్యాంతమవడం తప్ప ఏమీ చేయలేని అసహాయ స్థితి ఆ తల్లిదండ్రులది. ఈ విషయం తెలుసుకున్న స్వామి జపానంద బుధవారం వారి ఇంటికి వెళ్లి ఇద్దరు అమ్మాయిలను పరామర్శించారు. కుటుంబ పరిస్థితులు తెలుసుకుని పిల్లలకు నెలవారీ అయ్యే ఖర్చులకు తానే భరిస్తానంటూ భరోసానిచ్చారు. అలాగే కొత్తూరులో త్వరలో మొబైల్ వైద్యసేవలకు హామీనిచ్చారు. -
ఐసెట్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
పోచమ్మమైదాన్ / కేయూ క్యాంపస్ : ఐసెట్‌లో అర్హత సాధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు వరంగల్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 1 నుంచి 3వేల వరకు, మధ్యాహ్నం 6001 నుంచి 9వేల వరకు, హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఉదయం 3001 నుంచి 6 వేల వరకు, మధ్యాహ్నం 9001 నుంచి 12వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్లను పరిశీలించారు. పరిశీలన అనంతరం విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్చార్జి శంకర్, కోఆర్డినేటర్ అభినవ్, సత్యనారాయణ, రాఘవులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆర్ట్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుకర్, ఏటీబీటీ ప్రసాద్, ఎస్ఎం రహమాన్, ఎస్.సుధీర్, డాక్టర్ నహిత, శ్రీలత, అన్వర్‌పాషా, సుధాకర్, అశోక్, శైలజ, రవీందర్‌రెడ్డి, కళాశాల అసిస్టెం ట్ రిజిస్ట్రార్ రాజయ్య పాల్గొన్నారు. నేటి ర్యాంకుల పరిశీలన శనివారం ఉదయం వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో 12,001 నుంచి 15వేల వరకు, మధ్యాహ్నం 18,001 నుంచి 21 వేల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఉదయం 15,001 నుంచి 18 వేల వరకు, మధ్యాహ్నం 21,001 నుంచి 24 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. -
వన్యప్రాణులనుంచీ రక్షణకు టోల్ ఫ్రీ నెంబర్..
కర్ణాటకః అడవి జంతువులు తమ పంటపొలాలను నాశనం చేస్తున్నాయని, తమ ఖరీదైన పశువులను పులి చంపేసిందని, చెరకు పంటను ఏనుగుల గుంపు తొక్కేసిందంటూ ఆందోళన చెందే మారుమూల గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు వైల్డ్ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రభుత్వ పరిహారం వెంటనే అందేట్లుగా గ్రామసస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమస్యలను వెంటనే తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. లబ్ధిదారులకోసం 'వైల్డ్ సేవ' ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు కొందరికి 'ఫీల్డ్ ఏజెంట్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తాము నష్టపోయామంటూ రైతులు దరఖాస్తులు చేసుకొని కార్యాలయాలచుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులకు వెంటనే పరిహారం అందేలా 'వైల్డ్ సేవ' కార్యక్రమం చేపట్టారు. నష్టపోయిన రైతులకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ఆధ్వర్యంలో ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అటవీ శాఖతో కలసి కర్ణాటక, తమిళనాడుల్లోని సుమారు 284 గ్రామాల్లో వన్యప్రాణులనుంచి జనజీవనాన్ని రక్షించడంతోపాటు... వైల్డ్ సేవ కార్యక్రమంతో అంతరించిపోతున్న అడవి జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా కలిగిన అటవీ ప్రాంతాలమీత దృష్టి సారించి.. అక్కడి ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా ప్రయత్సిస్తున్నారు. సుమారు 20 వేల రూపాయల ఖరీదు చేసే అవును పులి చంపేయడంతో పరిహారంకోసం దరఖాస్తు చేసుకున్నఓ రైతు.. వైల్డ్ సర్వీస్ తో 9 వేల రూపాయలు పొందాడు. అయితే పరిహారం తక్కువ వచ్చినా.. తనకు సంతృప్తిగానే ఉందన్న అతడు... గతంలో పరిహారంకోసం అధికారులచుట్టూ, కార్యాలయాలచుట్టూ తిరగడంతోపాటు పరిహారం పొందేందుకు డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేదని తెలిపాడు. అదీకాక ముందుగా పంటదాడులు, చనిపోయిన పశువుల ఫొటోలు తీసుకొని, గంటలకొద్దీ ప్రయాణం చేసి అటవీశాఖ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేదని, సమయానికి అధికారులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్తున్నాడు. 'వైల్డ్ సేవ' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల ద్వారా సేవలు అందించడంతో వెంటనే పరిహారం పొందగల్గుతున్నట్లు స్థానిక రైతులు చెప్తున్నారు. అంతేకాదు 'వైల్డ్ సేవ' ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ తో తమకు జంతువులనుంచీ రక్షణతోపాటు, సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను అడవిజంతువులు నాశనం చేశాయనో, పశువులను చంపేశాయనో గ్రామస్థులు, రైతులనుంచీ తమకు రోజుకు ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంటుందని, ఒక్కో ఏజెంట్ కు సుమారు 20 కిలోమీటర్ల పరిథిలో ఉన్న 70 గ్రామాలనుంచీ ఫోన్లు వస్తాయని, వచ్చిన ఎనిమిది గంటల్లోపు అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఫీల్డ్ ఏజెంట్లు చెప్తున్నారు. ఏడుగురు ఫీల్డ్ ఏజెంట్లతో గత సంవత్సరం ప్రారంభించిన వైల్డ్ సేవా కార్యక్రమంలో భాగంగా పంటలు, ఆస్తుల నష్టం కేసుల్లో ఇప్పటిదాకా సుమారు 3,261 పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' తెలిపింది. దీంతోపాటు.. 148 వరకూ పులులు, అడవికుక్కలద్వారా నష్టపోయిన పశుసంపద, తీవ్ర గాయాలైన 11 మంది, ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' నివేదించింది. -
నేటి నుంచి బీ-ఫార్మసీ కౌన్సెలింగ్
15 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 18 వరకు వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ, ఫార్మ్-డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 13 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు 20న సీట్లు కేటాయించనుంది. రాష్ట్రంలోని 173 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో బీఫార్మసీలో 2,060, ఫార్మ్-డీలో 330, బయో టెక్నాలజీలో 42 సీట్లు భర్తీ చేయనుంది. వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, ఇంటర్మీడియెట్ మెమో, టీసీ, 6వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెట్, కులం, నివాస ధ్రువీకరణ పత్రం, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఇదీ షెడ్యూల్.. 15న 1 నుంచి 25 వేల ర్యాంకు, 16న 25,001 నుంచి 50 వేల ర్యాంకు, 17న 50,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 15, 16న 1 నుంచి 25 వేల ర్యాంకు, 16, 17న 25,001 నుంచి 50 వేల ర్యాంకు, 17,18న 50,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 18న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 20న సీట్లు కేటాయిస్తారు. ఇవీ హెల్ప్‌లైన్ కేంద్రాలు.. మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం (రుద్రంపూర్), వరంగల్, బెల్లంపల్లి, నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, వరంగల్‌లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్‌లోని బీఆర్ ఆంబేడ్కర్ జీఎంఆర్ మహిళా పాలిటెక్నిక్, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, చందూలాల్ బారాదరిలోని క్యూ క్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్, రామంతాపూర్‌లోని జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్, సాంకేతిక విద్యా భవన్. -
రెండో భార్య కోసం ఓ డేటింగ్ సైట్
బ్రిటన్ కు చెందిన ఓ ముస్లిం వ్యాపార వేత్త పురుషులకోసం ఓ డేటింగ్ సైట్ లాంచ్ చేశాడు. దీని ద్వారా పురుషులు రెండో భార్యను ఈజీగా వెతుక్కోవచ్చని ప్రకటించడంతో దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ఆజాద్ చాయ్ వాలా సెకండ్వైఫ్. కాం , పోలీగమీ.కాం పేరుతో వీటిని లాంచ్ చేశాడు. ముఖ్యంగా ముస్లిం మతం పురుషులు లక్ష్యంగా ఏర్పాటు చేయగా..ఆ తర్వాత అన్ని మతల పురుషులకు అవకాశం కల్పించాడు. దీంతో ఇది వీర లెవెల్లో విజయవంతమై.. క్రమంగా అన్ని మతాల పురుషులు రిజష్టర్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు రెండో పెళ్లి చట్ట విరుద్ధమైన బ్రిటన్ లో ఇలాంటి వెబ్ సైట్ ఓపెన్ చేయడం విశేషం. గత ఏడాది లాంచ్ చేసిన ఈ వెబ్ సైట్లలో ప్రస్తుతం, సెకండ్వైఫ్. కాం లో 35,000 మంది, పోలీగమీ.కాం 7,000 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే నిజానికి తన ప్రయత్నం ఒంటరి మహిళలకు ఒక పరిష్కారం చూపిస్తోందని, తన సేవ విశ్వసనీయతను ప్రోత్సహిస్తుందనీ ఆజాద్ పేర్కొన్నాడు. తన వెబ్ సైట్ పాత కాలపు విలువలను కాపాడుతూనే.. అటు ఎలాంటి అమర్యాదను, విద్వేషాలను అనుమతించదని ఉద్ఘాటించాడు. తాను ఎలాంటి నేర చర్యలను ప్రోత్సహించడం లేదని వివరణ ఇచ్చాడు. నలుగురు భార్యలను కలిగి ఉండడానికి తమ మతం అనుమతిస్తుందని, అలాగే ఇతర మతాల కూడా బహుభార్యత్వాన్ని అనుమతిస్తున్నాయని వాదించాడు. . -
డిగ్రీ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం
జిల్లాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ సమాచారంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్ తెలిపారు. ఇందుకోసం వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచామని, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ ఆన్లైన్ ప్రవేశాలకు అంగీకరించిందని, విద్యార్థులు ఆ కాలేజీలో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్లకు సంబంధించి సహకారం అందించేందుకు జిల్లాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హెల్ప్‌లైన్ కేంద్రంలో సరైన సహకారం అందకపోతే సంబంధిత చీఫ్ కో-ఆర్డినేటర్లను సంప్రదించవచ్చన్నారు. గురువారం సాయంత్రానికి 1,21,376 మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారని, అందులో 1,10,649 మంది ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
తిరుపతి, చిత్తూరులో హెల్ప్‌లైన్ సెంటర్లు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. దీనికోసం జిల్లాలో మూడు హెల్ప్ లైన్ సెంటర్లను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఏర్పాటుచేశారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బాలాజీ కాలనీలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, చిత్తూరులో పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు ఆయా తేదీల్లో ర్యాంకుల వారీగా సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో 1 నుంచి 2,500, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల్లో 2,501 నుంచి 5వేల ర్యాంకు వరకు, చిత్తూరులోని పీకీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో 1 నుంచి 5వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. జిల్లాలోని ఎస్టీ విద్యార్థులు మాత్రం ఆయా తేదీల్లో తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనే సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం లేని విద్యార్థులు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డును వెంట తీసుకురావాలి. -
ఇంగ్లండ్ 310/6 శ్రీలంకతో రెండో టెస్టు
చెస్టర్ లీ స్ట్రీట్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అలెక్స్ హేల్స్ (145 బంతుల్లో 83; 9 ఫోర్లు; 1 సిక్స్), జో రూట్ (119 బంతుల్లో 80; 5 ఫోర్లు) అర్ధ సెంచరీల కారణంగా శుక్రవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఆరు వికెట్లకు 310 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (57 బంతుల్లో 48; 5 ఫోర్లు), విన్స్ (59 బంతుల్లో 35; 4 ఫోర్లు) రాణించారు. మూడో వికెట్‌కు హేల్స్‌తో కలిసి 96 పరుగులు జోడించిన రూట్.. నాలుగో వికెట్‌కు విన్స్‌తో 59 పరుగులు జత చేశాడు. ఆట ముగిసే సమయానికి క్రీజులో మొయిన్ అలీ (70 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), వోక్స్ (8 బ్యాటింగ్) ఉన్నారు. నువాన్ ప్రదీప్‌కు మూడు, సిరివర్ధనకు రెండు వికెట్లు దక్కాయి. -
అభిమానుల కంటతడి సంతోషాన్నిచ్చింది
చెన్నై చిన్నది సమంత. అయితే ఇప్పుడామె చెన్నైకే పరిమితం కాదు.దక్షిణాది సినీ ప్రేమికుల కలలరాణి. ప్లాపుల నుంచి టాప్కు ఎదిగిన నాయకి. అపజయాలు విజయాలకు తొలిమెట్టు అన్న నానుడిని నిజం చేసిన నటి సమంత. నటుడు విజయ్‌తో నటించిన తొలి చిత్రం కత్తి, మలి చిత్రం తెరి చిత్రాలతో విజయ పథంలో దూసుకుపోతున్న సమంత అలాంటి విజయాన్ని తెలుగులో తొలి చిత్రం ఏం మాయ చేశావే తోనే సొంతం చేసుకున్నారు. నటిగా ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న సమంత ఒక మానవత్వం ఉన్న మనిషిగాను మహోపకారం చేస్తూ మన్ననలు అందుకుంటున్నారు. సమంత ఇప్పటికి 70 మంది గుండె సంబంధిత బాధితులకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. దీని గురించి సమంత తెలుపుతూ తాను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నటి నన్నారు. నటిగా ఆరేళ్లు పూర్తి చేసుకుంటున్న తాను సంపాదించిన దానిలో తనకు చేతనైన సాయాన్ని ఇతరులకు అందించాలని భావిస్తుంటానన్నారు. ఇప్పటికి 70 మందికి ఉచిత గుండె శస్త్ర చికిత్స చేయించినా ఇకపై కూడా తన సేవాకార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.ఇందు కోసం ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ట్రస్టును నెల కొలిపినట్లు వెల్లడించారు. తెరి చిత్రం సక్సెస్ మీట్లో పాల్గొనలేకపోయానని,అందుకు కారణం చేతి నిండా చిత్రాలతో రాత్రనకాపగలనకా నటిస్తూ బిజీగా ఉండడమే కారణం అన్నారు. అయితే తెరి చిత్రాన్ని తెలుగులో చూశానని, అందులో తాను చనిపోయిన సన్నివేశాన్ని చూసిన అభిమానులు కంటతడి పెట్టడం తనకు సంతోషాన్నినిచ్చిందన్నారు. అదే విజయంగా భావించానని అన్న సమంత గురువారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు. -
బిహారీలను కాపాడిన పోలీసులు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వరద నీళ్లలో చిక్కుకున్న బిహార్ యువకులను స్థానిక పోలీసులు రక్షించారు. దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం రైల్వే స్టేషన్లో వరదల కారణంగా చప్రా ఎక్స్‌ప్రెస్ రైలును బుధవారం మధ్యాహ్నం నిలిపివేశారు. రైలులో ప్రయాణిస్తున్న నలుగురు బిహారీ యువకులు రైలు దిగి నీళ్లలో నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా వరదనీళ్లు రావడంతో అందులో చిక్కుకున్నారు. దారి తెలియక ఇబ్బందిపడుతున్న వారిని అటుగా వెళ్తున్న దొరవారిసత్రం ఎస్ఐ సుబ్బారావు, పోలీసులు గమనించి వెంటనే యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో రైల్లోని ప్రయాణికులు కాపాడిన పోలీసులను అభినందించారు. -
'రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి'
నర్సాపురం : పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. నర్సాపురం మండలంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంట దెబ్బతిన్న రైతులకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని కొత్తపల్లి డిమాండ్ చేశారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. -
బైక్ పై వచ్చి 6లక్షలు కోట్టేశారు
బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షల నగదు బ్యాగును గుంజుకుని పరారయ్యారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖరపురంలోని ప్రియాంక ఆగ్రో లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.6 లక్షల నగదును నార్త్ రాజుపాలెంలోని ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు గుమస్తా రాఘవరావు తీసుకువెళుతున్నారు. కంపెనీకి అరకిలోమీటరు దూరంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు రాఘవరావు చేతిలో ఉన్న నగదు బ్యాగును లాక్కుని పరారయ్యారు. దీనిపై బాధితుడు కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు..
లక్నో: లేనిపోని అనుమానాలతో, అపోహలతో నిష్కారణంగా భార్యలను వేధించుకు తినే భర్తలని చూశాం. అన్యోన్యంగా కలకాలం ఆదిదంపతుల్లా జీవించిన జంటల్నీ చూశాం. కానీ, భార్య మనసు తెలుసుకుని ఆమెకు తగిన న్యాయం చేసే భర్తలు కూడా ఉన్నారని నిరూపించాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన పూల్చాంద్. వినడానికి సినిమా స్టోరీలా అనిపించినా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో నిజంగానే జరిగిన సంఘటన ఇది. మూడేళ్ల తరువాత భార్యను కలుసుకోవాలని ఎంతో ఆతృతగా సొంత ఊరుకు వచ్చిన పూల్ చంద్‌కు అతని భార్య చందా పెద్ద షాకిచ్చింది. దీంతో అతనికి ఆవేశం పొంగుకొచ్చింది. అయితే ఆవేశాన్ని అణచుకొని స్థిమితంగా ఆలోచించాడు... తమ మధ్య నెలకొన్న సంక్షోభానికి చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నాడు.... అంతేనా..... కుటుంబ సభ్యుల్ని, గ్రామ పెద్దల్ని ఒప్పించాడు. .. ఇంతకీ భార్య ఇచ్చిన షాక్ ఏంటి? ఏమిటా పరిష్కారం.... అందర్నీ ఎలా ఒప్పించాడంటే... వివరాల్లోకి వెడితే ఫైజాబాద్‌కు చెందిన పూల్ చంద్ పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా భార్య చందాను కాపురానికి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా జలంధర్‌కు వెళ్ళిపోయాడు. ఫోన్లో మాత్రమే భార్యాభర్తలిద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. అయితే కొన్నాళ్ల తరువాత ఇంటికి వచ్చిన అతనికి భార్య చందా షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నానంటూ బాంబు పేల్చింది. కేవలం పెద్దల కోసమే పెళ్లి చేసుకున్నానని... ఇక తన వల్ల కాదని తేల్చిచెప్పింది. దీంతోపాటూ పెళ్లి సమయంలో తనకు పెట్టిన నగలు, బట్టలు అన్నీ అతనికి తిరిగి ఇచ్చేసింది. పూల్చంద్తో కలిసి కాపురం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీంతో పూల్ చంద్ హతాశుడయ్యాడు. అందరిలాగానే అతడు కూడా చాలా ఆవేశానికి లోనయ్యాడు. అయితే... భార్య నిజాయితీగా వ్యవహరించిన తీరు తనని ఆకట్టుకుందని పూల్‌చంద్ తెలిపాడు. పెళ్లికి ముందే చందా, సూరజ్ ప్రేమించుకున్నారని, అందుకే ఎలాగైనా వారికి న్యాయం చేయాలని భావించానని చెప్పాడు. తమ పెళ్లి మూలంగా విడిపోయిన ప్రేమికుల్ని తిరిగి కలపాలనే ఉద్దేశంతోనే కష్టపడి తమ కుటుంబసభ్యులను, గ్రామ పెద్దలను ఒప్పించినట్లు పూల్‌చంద్ వెల్లడించాడు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో చందాకు కోరుకున్న ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించడమే కాకుండా, కానుకలతో అత్తారింటికి సాగనంపాడు. -
దరికి చేర్చే దారి కాల్ సెంటర్
పుష్కరఘాట్ (రాజమండ్రి): పుష్కర స్నానాలకు వచ్చి తప్పిపోయిన యాత్రికులను తిరిగి బంధువుల వద్దకు చేర్చడంలో కాల్‌సెంటర్లు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ రూమ్ కాల్‌సెంటర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో తప్పిపోయిన వారి వివరాలను టోల్‌ఫ్రీ నంబర్ 12890 ద్వారా నమోదు చేసుకుని ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో పది లైన్లతో కూడిన కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం వరకు సుమారు రెండు వేల మంది తప్పిపోయిన వారి వివరాలు నమోదు చేశారు. 1,930 మందిని గుర్తించి వారి బంధువుల వద్దకు చేర్చారు. మిగిలిన వారి వివరాల లభ్యం కాలేదు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్సెంటర్లో వివిధ కళాశాలల విద్యార్థులు సేవలందిస్తున్నారు. పుష్కర యాత్రికులకు సేవలు అందించే భాగ్యం కలిగినందుకు వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర సేవ చేస్తానని ఊహించలేదు పుష్కరాల్లో సేవలందించే భాగ్యం లభిస్తుందని ఊహించలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రెవెన్యూ శాఖ పిలిచిన ఇంటర్వ్యూలో కాల్‌సెంటర్ ఆపరేటర్‌గా ఎంపికై 12 రోజులు సేవలందించడం జీవితంలో మర్చిపోలేనిది. - పి.సాయికుమార్, కాకినాడ ఈ అనుభవం మర్చిపోలేనిది పుష్కరాల్లో విధులు నిర్వహించడం గొప్ప విష యం. కాల్సెంటర్లో పని చేసే అవకాశం లభించినప్పుడు చాలా సంతోషించాను. ఈ అనుభవం జీవితంలో మర్చిపోలేనిది. - వి.హర్షిత, సీఏ విద్యార్థిని -
శ్రుతి పెద్ద మనసు
పక్కవాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేసి ఆదుకోవడం మానవత్వం. అలాంటి సాయపడేగుణం తనకుందని నిరూపించుకున్నారు శ్రుతిహాసన్. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తొలుత తెలుగు, హిందీ, తమిళం భాషల్లో అంతగా లక్ ఉన్న నటి అనిపించుకోకపోయినా ఇప్పుడామె సూపర్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. పాత్రలకు న్యాయం చేయడానికి అందాలారబోతలో హద్దులు మీరడానికైనా వెనుకాడని ధారాళ మనసు శృతి హాసన్దేనన్న పేరుంది. ఇతరుల కష్టాలకు కరిగిపోయే మనసామెది. ఇందుకు సాక్ష్యం ఇటీవల ఆమె కాశ్మీర్ వరద బాధితుల నివారణకు అందించిన పెద్ద మొత్తంలో విరాళమే. సమీప కాలంలో కాశ్మీర్‌ను వరదలు ముంచెత్తి ప్రాణనష్టంతోపాటు భారీ ఆస్తి నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. దీంతో దేశ ప్రధాని వరద బాధితులకు చేయూత నివ్వండంటూ ప్రకటించారు. బాలీవుడ్ నటులు సల్మాన్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, కునాల్ కపూర్, సోనాక్షి సిన్హా వంటి వారు కొంత మొత్తాన్ని అందించారు. అలాంటి వారి పట్టికలో మన శ్రుతిహాసన్ కూడా ఉండటం విశేషం. ఈమె కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం భారీ మొత్తాన్ని ప్రధానమంత్రి నిధికి అందించారు. అంతేకాదు యువతీ యువకులు, సేవా సంఘాలు వరద బాధితులకు విరివిగా విరాళాలు అందించి ఆదుకోవాలని పిలుపు నిచ్చారు. అందమైన మనసు గల నటి శ్రుతిహాసన్ అని నిరూపించారు. దీని గురించి శ్రుతి మాట్లాడుతూ మనిషికి అందం మాత్రం ఉంటే చాలదు. తెలివి కూడా ఉండాలన్నారు. తెలివిలేని వారికి అందం నిరుపయోగం అన్నారు. అందం ఇతరులను ఆకర్షించవచ్చు. అయితే జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తెలివితేటలు చాలా అవసరం అన్నారు. -
అనధికార లేఅవుట్లతో అప్రమత్తం
పెరిగిన భూ మోసాలు ఉడా పరిధిలో 476 లేఅవుట్లకే అనుమతి అనధికార లేఅవుట్ల నియంత్రణకు హెల్ప్‌లైన్ సెంటర్ ఇకపై ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్ సెల్’ సేవల కోసం : 0866-2571271 వీజీటీఎం ఉడా వైస్ చైర్పర్సన్ పి.ఉషాకుమారి సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలోని అనధికార లేఅవుట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉడా వైస్ చైర్పర్సన్ పి.ఉషాకుమారి సూచించారు. ఇటీవల కాలంలో అనధికార లేఅవుట్లు భారీగా వెలిశాయని, ఉడా అనుమతులు ఉన్నాయని ప్రచారం చేసుకుని మోసాలు చేస్తున్నారని చెప్పారు. ఉడా పరిధిలో భూములు కొనేవారు సమగ్ర వివరాలు తెలుసుకుని, పూర్తి సమాచారంతో ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. నగరంలోని ఉడా కార్యాలయంలో శుక్రవారం ఉషాకుమారి విలేకరులతో మాట్లాడారు. రాజధాని అయిన క్రమంలో నగరానికి ప్రాధాన్యత పెరిగిందని, దీంతో పలువురు బ్రోకర్లు అనుమతి లేని స్థలాలను, భవనాలను ఉడా అనుమతులు ఉన్నాయని చెప్పి విక్రరుుస్తున్నారని చెప్పారు. ఇలాంటి మోసాల బారిన ప్రజలు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. ఇందుకు ఉడా కార్యాలయంలో ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటుచేశామని, విక్రయాలకు అవసరమైన సమాచారాన్ని ఈ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చని ఆమె చెప్పారు. ఇప్పటివరకు ఉడా ద్వారా అనుమతులు పొందిన లేఅవుట్ల సమాచారాన్ని, వాటి ప్లాన్‌ను తమ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2008 నుంచి 2014 సంవత్సరం జూన్ వరకు 476 లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చామని వీసీ ఉషాకుమారి తెలిపారు. వీటిలో ల్యాండ్ కన్వర్షన్ సమయంలో చెల్లించే నాళాఫీజును అనేక వెంచర్లు చెల్లించలేదని చెప్పారు. 476 లేఅవుట్లకు గానూ 226 లేఅవుట్లు నాళాఫీజు చెల్లించాయని, కృష్ణాజిల్లాలో 166, గుంటూరు జిల్లాలో 36 లేఅవుట్లు ఫీజులు చెల్లించలేదని తాము నిర్ధారించినట్లు తెలిపారు. ఉడా నిబంధనల ప్రకారం ప్లాన్ సిద్ధంచేసిన 476 లే అవుట్లకు ఇప్పటివరకు అనుమతులు ఇచ్చామని, లే అవుట్ అనుమతుల సమయంలో ఉడా మార్టగేజ్ విధానం ఉంటుందని, ప్లాన్‌లో చూపిన విధంగానే నిర్మాణాలు చేస్తే అప్పుడు మార్టగేజ్‌ను విడుదల చేస్తామని, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి వీలు కల్పిస్తామని చెప్పారు. అక్రమ లేఅవుట్ల విషయంపై సమాచారం తమకు రాగానే వాటిని పరిశీలించి కూల్చివేస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. గ్రామాల్లో పంచాయతీలదే బాధ్యత వీజీటీఎం ఉడా పరిధిలోని గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు ఉంటే.. వాటిని తొలగించే బాధ్యత ఆయా గ్రామ పంచాయితీ కార్యదర్శులదేనని ఉషాకుమారి సృష్టంచేశారు. గ్రామ పరిధిలోని లేఅవుట్‌ను పంచాయితీ కార్యదర్శులు వ్యక్తిగతంగా తనిఖీలు చేశాకే.. అనుమతులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచాయితీ కార్యదర్శులు అక్రమార్కులకు కొమ్ముకాస్తే సహించబోమని, వారిపై జిల్లా పంచాయతీ అధికారి చర్యలు తీసుకుంటారని చెప్పారు. గ్రామ పంచాయతీ, మండల తహశీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికార లేఅవుట్ల వివరాలను, ఉడా ప్లాన్‌ను డిస్ప్లే ఉంచుతామని చెప్పారు. అలాగే, ఉడా సేవలు, ఇతర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించటానికి కరప్రతాలతో పంపిణీ చేస్తామన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ‘గ్రివెన్స్ సెల్’ నిర్వహిస్తామని ఆమె చెప్పారు. మధ్యాహ్నం వరకు తాను అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తానని, మధ్యాహ్నం నుంచి ఉడా కార్యదర్శి నేతృత్వంలో ఫిర్యాదుల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదులు అందజేస్తే తక్షణమే పరిష్కరిస్తామన్నారు. అలాగే, ఉడా సేవలకు సంబంధించి 0866-2571271 నంబరులో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఉడా కార్యదర్శి డీవీ రమణారెడ్డి, ముఖ్య ప్రణాళికాధికారి టి.రామచంద్రరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డీఎస్ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు కాపాడింది రోజానే
కారు ప్రమాదానికి గురై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తనను మానవత్వంతో కాపాడిన శాసనసభ్యురాలు, నటి రోజాకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు కలైంజియం. ఈయన నటి అంజలి వివాదంలో వార్తల్లోకెక్కిన దర్శకుడు. ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కలైంజయం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. అయితే తాను ప్రాణాలతో ఉండటానికి నటి రోజానే కారణమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని గురించి దర్శకుడు కలైంజయం తెలుపుతూ ఆంధ్ర రాష్ట్రం రాజమండ్రిలో జరిగిన మిత్రుడి పెళ్లికి హాజరై మరుసటిరోజు ఉదయం చెన్నైకి తిరిగొస్తుండగా కారు చక్రం టైర్ బద్దలై కారులో ఉన్న వారందరూ హైవే రోడ్డుపై పడిపోయామన్నారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదని ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్‌పై పడి వున్నానని తెలిపారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదం చేస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యులు లేరని వెంటనే వారిని రప్పించి తమకు తగిన చికిత్స అందించాల్సిందిగా పోలీసు అధికారులు ఆస్పత్రి సిబ్బందిని అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. తనకు తెలుగు భాష తెలియకపోవడంతో ఏమి చేయలేని అశక్తుడిగా ఉండిపోయానన్నారు. తీవ్రగాయాలతో ఒళ్లంతా రక్తసిక్తమయిందని తెలిపారు. తనకు స్పృహ వచ్చి పోతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో వున్నానన్నారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నేరుగా తన బెడ్ వద్ద నిలబడి వున్న పోలీసు అధికారి వద్దకు వచ్చి తాను రోజా మేడమ్ వద్ద నుంచి వస్తున్నాను. మేడమ్ ఫోన్లో లైన్లో ఉన్నారు మాట్లాడండి అని చెప్పారన్నారు. దీంతో కొన్ని నిమిషాల్లోనే పెద్ద ప్రైవేటు ఆస్పత్రికి మార్చినట్లు చెప్పారు. అక్కడ ఎలాంటి ఫీజు లేకుండా మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డానన్నారు. ఇందుకు కారణమైన రోజాకు ఆమె భర్త ఆర్కె సెల్వమణికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని దర్శకుడు కలైంజయం పేర్కొన్నారు. -
కిటకిట లాడిన ఎంసెట్ హెల్ప్‌లైన్ కేంద్రాలు
గుంటూరు ఎడ్యుకేషన్ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో తమకు లభించిన సీట్లను ధ్రువీకరించుకునేందుకు విద్యార్థులు సోమవారం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో హెల్ప్‌లైన్ కేంద్రాలు కిటకిటలాడాయి. గత నెలలో జరిగిన సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరైన ఎంసెట్ ర్యాంకర్లకు రాష్ట్ర ఉన్నత మండలి శనివారం సీట్లు కేటాయించింది. ఈ క్రమంలో ఇంజినీరింగ్ కళాశాలలో పొందిన తమ సీటును ధ్రు వీకరించుకునేందుకు విద్యార్థులు సోమవారం జిల్లాలోని నాలుగు హెల్ప్ లైన్ కేంద్రాలకు వచ్చారు. ఉదయం 9 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ రాత్రి 7 గంటల వరకూ కొనసాగింది. దీనికి జిల్లాలో మొత్తం 1,804 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్‌లో ఒకటి నుంచి 50 వేల మధ్య ర్యాంకులు సాధించిన విద్యార్థులను అలాట్మెంట్ ఆర్డర్స్‌తో వచ్చి అడ్మిషన్ ధ్రువీకరించు కోవాలని ప్రకటించడంతో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తమ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని హెల్ప్‌లైన్ కేంద్రాలకు తరలివచ్చారు. సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన హెల్ప్‌లైన్ కేంద్రానికి అలాట్మెంట్ ఆర్డర్‌తో హాజరుకావాలని అధికారులు స్పష్టం చేసినప్పటికీ విద్యార్థులు గుంటూరులోని గుజ్జనగుండ్ల, సాంబశివపేటలోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వాహకులతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఫీజు రీ-యింబర్స్‌మెంట్ రూ. 35 వేలకు పైబడి ఫీజును చలానా రూపంలో చెల్లించాల్సి ఉండటంతో విద్యార్థులు హడావుడిగా బ్యాంకుల వద్దకు పరుగులు తీశారు. ఆ తరువాత తిరిగి వచ్చి తమ వంతు కోసం గంటల కొద్దీ ఎదురుచూశారు. రాత్రి 7 గంటల వరకూ కొనసాగిన అడ్మిషన్ ధ్రువీకరణ ప్రక్రియకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 491 మం ది, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 413 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 550 మం ది, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 350 మంది హాజరయ్యారు. నేడు 50,001 నుంచి లక్ష వరకూ హాజరు కావాలి.. 50,001 నుంచి లక్ష ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని సీట్లు పొందిన విద్యార్థులు మంగళవారం ధ్రువీకరణకు హాజరుకావాల్సి ఉంది. గతంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన హెల్ప్‌లైన్ కేంద్రంలోనే తిరిగి హాజరుకావాలని ఆయా కేంద్రాల కో-ఆర్డినేటర్లు తెలిపారు. పాలిసెట్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్ల ధ్రువీకరణ ప్రక్రి య సోమవారం ముగిసింది. చివరి రోజు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేం ద్ర ంలో 588 మంది, నల్లపాడులోని పాలిటెక్నిక్ కళాశాలలో 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
వెబ్ ఆప్షన్లకు రెడీ
నేటి నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్ కౌన్సెలింగ్ జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ప్రతి కేంద్రంలో నాలుగు సిస్టమ్స్ ఏర్పాటు ఎంసెట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. విద్యార్థులు నచ్చిన కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 17 నుంచి ఇంటర్నెట్లో తమ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కంచరపాలెం పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో నాలుగు కంప్యూటర్ సిస్టమ్‌లను ఇందు కోసం ఏర్పాటు చేశారు. వెబ్ ఆప్షన్లపై ఇప్పటికే అధికారులు శిక్షణ తరగతులు నిర్వహించారు. అవకాశం ఉంటే ఇంటి వద్దే ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. - విశాఖపట్నం సైట్‌లోని ప్రవేశించండిలా.. ముందుగా hhttps://eamcet. nic.inవెబ్సైట్ అడ్రస్‌ను టైప్ చేయాలి. ఇది కేవలం ఇం టర్నెట్ ఎక్స్‌ప్లోరర్ విండోస్-7 ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 9.0లో మాత్రమే తెరుచుకుంటుంది. అడ్రస్ టైప్ చేయగానే హోమ్ పేజీ వస్తుంది. ఇందులో 8 రకాల వివరాలు ఉంటాయి. హెల్ లైన్ కేంద్రాల వివరాలు, కోర్సుల జాబితా, జిల్లాల వారీగా కళాశాలలు వివరాలు, 2013లో ఎంసెట్ కౌన్సెలింగ్‌లో కటాఫ్ ర్యాంకుల వివరాలు లభ్యమవుతాయి. వీటిని తెరిచి మనం సమాచారం పొందాలి. ప్రతి కళాశాల, జిల్లాకు ప్రత్యేక కోడ్ నంబర్ ఇంగ్లీషు షార్ట్‌ఫామ్‌లో ఉంటుంది. వీటిని మనం నోట్ చేసుకుంటే మాన్యువల్ ఆప్షన్ ఫారం నింపడానికి సులువవుతుంది. ఆప్షన్ల నమోదు హోమ్ పేజీకి వెళ్లి క్యాండిడేట్స్ లాగిన్ వద్ద క్లిక్ చేయగానే ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్‌కు కేటాయించిన లాగిన్ ఐడీ నంబరు, హాల్ టికెట్ నంబరు, పాస్‌వర్డు, పుట్టిన తేదీ టైప్‌చేసి సైన్ ఇన్ చేయాలి. వెంటనే మరో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. (లాగిన్ అవగానే మీకు ఓటీపీ (ఒన్‌టైమ్ పాస్‌వర్డు)నంబరు మీమొబైల్కు వస్తుంది.) మీరిప్పుడు టెక్ట్స్ బాక్స్‌లో ఓటీపీ నంబరు ఎంటర్ చేయాలి. దీన్ని కన్ఫ్ర్మ్ చేసి తర్వాత క్లిక్ హియర్ ‘ఆప్షన్ ఎంట్రీ ’వద్ద క్లిక్ చేయాలి. సెలెక్ట్ డిజైర్డ్ డిస్ట్రిక్ట్స్ అనే స్క్రీన్ వస్తుంది. ఇందులో రీజినల్ వెజ్ (ఏయూ, ఓయూ, ఎస్వీయూ) జిల్లాలు వస్తా యి. ఇప్పుడు మీకు నచ్చిన జిల్లాను సెలెక్ట్ చేసుకున్న వెంటనే అన్ని వివరాలు డిస్ప్లే అవుతాయి. అనంతరం ఆప్షన్ ఎంట్రీ ఫారం వద్ద క్లిక్ చేస్తే ఫారం వస్తుంది. ఇందులో అక్కడి కాలేజీలోని కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలి. మనం ఎంపిక చేసుకున్న ప్రతి కోర్సుకు ప్రాధాన్య క్రమంలో నంబరు ఇవ్వాలి. ఇందుకోసం ముందుగానే మాన్యువల్ ఆప్షనల్ ఫారం నింపి ఉంచుకుంటే పని సులువవుతుంది. ఆప్షన్లు ఇచ్చినప్పుడు అయిదు నిమిషాలకోసారి సేవ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసిన ప్రతిసారి ఎంసెట్ హాల్‌టికెట్ నంబరు అడుగుతుంది. దీన్ని టైప్ చేస్తేనే సేవ్ అవుతుంది. సరిచూసుకోండి మీరిచ్చిన ఆప్షన్లు సరిచూసుకోవడానికి వ్యూ అండ్ ప్రింట్ పై క్లిక్ చేయండి. అన్ని వివరాలు వస్తాయి. ఒకవేళ మార్చుకోవాలంటే వెనక్కి వెళ్లి మార్చుకోవాలి. ఇలాంటప్పుడు మార్చిన ప్రతిసారి సేవ్ చేసుకుంటూ పోవాలి. లేదంటే పాత ఆప్షన్లు ఉండిపోతాయి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత సేవ్ అనంతరం కన్ఫర్మ్ చేసి లాగ్ అవుట్ చేయాలి. ఇక్కడితో ఐచ్ఛికాల ఎంపిక నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఒక్కసారి కన్ఫర్మ్ చేసి లాగవుట్ అయిన తర్వాత మళ్లీ మార్పులు చేసే వీలు ఉండదు. దీన్ని అందరూ గమనించాలి. లాగిన్ ఐడీ ప్రతి అభ్యర్థికి ఒక లాగి న్ ఐడీ కేటాయిస్తారు. ఇది చాలా ముఖ్యమైనది. మనం దీన్ని మర్చిపోకూడదు. పాస్ వర్డు సేవ్ అయిన వెంటనే మీకొక లాగిన్ ఐడీ మీ మొబైల్‌కు పంపిస్తారు. దీని ద్వారా మనం లాగిన్ అవ్వొచ్చు. సీట్ల కేటాయింపు సీట్ల కేటాయింపు వివరాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో చూసుకోవచ్చు. మీ మొబైల్‌కు కూడా వివరాలు వస్తాయి. క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ద్వారా సీటు కేటాయింపు ఆర్డరును డౌన్లోడ్ చేసుకుని ఫీజు ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకుల్లో చెల్లించుకోవచ్చు. మెరిట్ అభ్యర్థికి ఇచ్చిన ఆప్షన్ కేటాయింపు అనంతరం ఆ తర్వాతి ర్యాంకర్‌కు సీటు కేటాయిస్తారు. గమనిక ఆప్షన్లు ఇవ్వడానికి ముందుగా లాగిన్ ఐడీ రాకపోతే ఎంసెట్ స్పేస్ 01 స్పేస్ హాల్ టికెట్ నంబరు టైప్ చేసి మీ మొబైల్ ద్వారా 87904 99899కి మెసేజ్ పెడితే లాగిన్ ఐడీ పంపిస్తారు. ఒక వేళ పాస్వర్డ్ మర్చిపోతే లాగిన్ అయినప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ వద్ద క్లిక్ చేసి కొత్త పాస్‌వర్డు ఎంటర్ చేసుకోవచ్చు. మీ పాస్వర్డ్ ఎవ్వరికి తెలియనివ్వకూడదు. హెల్ప్‌లైన్ కేంద్రాలు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద ఇందుకోసం నాలుగు సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఇందుకోసం హెచ్ఎల్సీలు ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. వెబ్ ఆప్షన్లో సందేహాలు ఉన్నవారు ఈ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సంధ్యారాణి, కెమికల్ ఇంజిజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేముడు చెప్పారు. పాస్వర్డ్ క్రియేషన్ రెండో స్టెప్‌లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది వెబ్ ఆప్షన్ ప్రక్రియలో అత్యంత కీలకమైనది. ఇందుకోసం హోమ్‌పేజీలోని అడ్రస్ బార్లో క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ వద్ద క్లిక్ చేస్తే స్లాట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో పొందిన రశీదులో ఉన్న రిజిస్ట్రేషన్ నంబరు, ఎంసెట్ హాల్‌టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ‘జెనరేషన్ పాస్వర్డ్’ అనే సూచన వద్ద క్లిక్ చేయాలి. అప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్‌వర్డ్‌లో ఆంగ్ల అక్షరాలతో పాటు అంకెలు కూడా వాడాలి. కనీసం 8 క్యారక్టర్స్ ఉండాలి. మ్యాగ్జిమమ్ పది క్యారెక్టర్స్ ఉపయోగించాలి. దీన్ని మళ్లీ రీఎంటర్ పాస్‌వర్డ్‌లో నమోదు చేయాలి. మొబైల్ నంబరు తప్పనిసరి. ఇది కూడా వె రిఫికేషన్ సమయంలో ఇచ్చినదై ఉండాలి. ఈ-మెయిల్ ఉంటే నమోదు చేసి సేవ్పాస్వర్డ్ అనే కమాండ్ వద్ద క్లిక్ చేయాలి. ఇప్పుడు లాగవుట్ అవ్వాలి. తర్వాత హోమ్ పేజీకి వెళ్లాలి.