
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెల్ప్‌లైన్ సెంటర్ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి మంగళవారం తెలిపారు. ఐదు రోజుల క్రితం సీఎం హెల్ప్‌లైన్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకిందని, తాజాగా ఆ సంఖ్య 80కి చేరిందని ఆయన చెప్పారు. నెల క్రితం హెల్ప్‌లైన్ ఆఫీస్‌ను తనిఖీ చేయగా.. వారంతా కోవిడ్ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నట్టు వెల్లడైందని తెలిపారు. కాగా, సామాన్యుల అభ్యర్థనల్ని పరిశీలించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గతేడాది 1076 హెల్ప్‌లైన్ ప్రారంభించారు. ఔట్‌సోర్సింగ్ సంస్థ దీనిని నిర్వహిస్తోంది. 24/7 పనిచేసే ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌తో సీఎం కార్యాలయ సిబ్బందితో ఎవరైనా మాట్లాడొచ్చు.
(చదవండి: బ్యాంకు అద్దాల తలుపు తగిలి మహిళ మృతి)