ఇంగ్లండ్ 310/6 శ్రీలంకతో రెండో టెస్టు | England in the second Test against Sri Lanka 310/6 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ 310/6 శ్రీలంకతో రెండో టెస్టు

Published Sat, May 28 2016 1:22 AM | Last Updated on Thu, Jul 25 2019 5:24 PM

England in the second Test against Sri Lanka 310/6

చెస్టర్ లీ స్ట్రీట్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అలెక్స్ హేల్స్ (145 బంతుల్లో 83; 9 ఫోర్లు; 1 సిక్స్), జో రూట్ (119 బంతుల్లో 80; 5 ఫోర్లు) అర్ధ సెంచరీల కారణంగా  శుక్రవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఆరు వికెట్లకు 310 పరుగులు చేసింది.

బెయిర్‌స్టో (57 బంతుల్లో 48; 5 ఫోర్లు), విన్స్ (59 బంతుల్లో 35; 4 ఫోర్లు) రాణించారు. మూడో వికెట్‌కు హేల్స్‌తో కలిసి 96 పరుగులు జోడించిన రూట్.. నాలుగో వికెట్‌కు విన్స్‌తో 59 పరుగులు జత చేశాడు. ఆట ముగిసే సమయానికి క్రీజులో మొయిన్ అలీ (70 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), వోక్స్ (8 బ్యాటింగ్) ఉన్నారు. నువాన్ ప్రదీప్‌కు మూడు, సిరివర్ధనకు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement