Alex hels
-
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
హేల్స్, రూట్ శతకాల మోత మూడో వన్డేలోనూ విండీస్ చిత్తు బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అలెక్స్ హేల్స్ (107 బంతుల్లో 110; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), జో రూట్ (108 బంతుల్లో 101; 10 ఫోర్లు) శతకాల మోత మోగించడంతో చివరి వన్డేలో ఇంగ్లండ్ ఏకంగా 186 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. 1991 తర్వాత ఇంగ్లండ్ చేతిలో ఇలా క్లీన్‌స్వీప్ కావడం విండీస్కిదే తొలిసారి. అలాగే ఈ ప్రత్యర్థిపై ఇంత చెత్త ఓటమిని ఇంతకుముందెన్నడూ విండీస్ చవిచూడలేదు. గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో వికెట్‌కు రూట్, హేల్స్ మధ్య 192 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. జోసెఫ్‌కు నాలుగు, హోల్డర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత విండీస్ దారుణ ఆటతీరుతో 39.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. కార్టర్ (46; 8 ఫోర్లు) టాప్ స్కోరర్. ప్లంకెట్ (3/27), వోక్స్ (3/16) ధాటికి ఓ దశలో విండీస్ 87 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. హేల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... వోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. -
ఇంగ్లండ్ రికార్డు విజయం
మూడో వన్డేలో పాకిస్తాన్ చిత్తు నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ రికార్డు పరుగుల ప్రవాహంతో పాకిస్తాన్‌పై సిరీస్ గెలిచింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు వన్డేలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (122 బంతుల్లో 171; 22 ఫోర్లు, 4 సిక్సర్లు) విశ్వరూపంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 444 పరుగులు చేసింది. రూట్ (86 బంతుల్లో 85; 8 ఫోర్లు), బట్లర్ (51 బంతుల్లో 90 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), మోర్గాన్ (27 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు)లు కూడా చెలరేగారు. హసన్ అలీకి 2 వికెట్లు దక్కారుు. తరాత పాకిస్తాన్ 42.4 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటై ఓడింది. ఓపెనర్ షార్జిల్ ఖాన్ (30 బంతుల్లో 58; 12 ఫోర్లు, 1 సిక్స్), పదకొండో స్థానంలో దిగిన ఆమిర్ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు)మాత్రమే రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రషీద్ 2 వికెట్లు తీశారు. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్: 444/3 (హేల్స్ 171, బట్లర్90 నాటౌట్, రూట్ 85, మోర్గాన్ 57 నాటౌట్), పాకిస్తాన్: 275 (షార్జిల్ ఖాన్ 58, ఆమిర్ 58; వోక్స్ 4/41, రషీద్ 2/73). ఈ రికార్డుల వన్డేలో... ►పదేళ్ల క్రితం నెదర్లాండ్‌సపై శ్రీలంక సాధించిన అత్యధిక పరుగుల రికార్డు (443/9)ను ఇంగ్లండ్ తిరగరాసింది. ► రెండు టెస్టు దేశాల మధ్య సాగిన వన్డేలో ఇదే అత్యధిక స్కోరు. వెస్టిండీస్‌పై గతేడాది దక్షిణాఫ్రికా (439/2) చేసిన స్కోరు కూడా ఇప్పుడు కనుమరుగైంది. ►ఇంగ్లండ్ తరఫున వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన బట్లర్ (22 బంతుల్లో 50; 3 ఫోర్లు, 6 సిక్సర్లు). -
ఇంగ్లండ్ ‘రికార్డు’ విజయం
► హేల్స్, రాయ్ శతకాలు ► శ్రీలంకతో రెండో వన్డే బర్మింగ్‌హామ్: ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (110 బంతుల్లో 133 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), జేసన్ రాయ్ (95 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత శతకాలతో రెచ్చిపోయారు. దీంతో శుక్రవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డే టైగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 254 పరుగులు చేసింది. తరంగ (49 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్), చండిమాల్ (86 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా మాథ్యూస్ (54 బంతుల్లో 44; 3 ఫోర్లు), పెరీరా (45 బంతుల్లో 37; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్లంకెట్, రషీద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ల సూపర్ బ్యాటింగ్‌తో 34.1 ఓవర్లలో 256 పరుగులు చేసి నెగ్గింది. దీంతో ఒక్క వికెట్ కోల్పోకుండా 250కిపైగా పరుగులు చేసి గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. గతేడాది జింబాబ్వేపై న్యూజిలాండ్ 236 పరుగులు చేసి నెగ్గింది. అలాగే ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గతం (2010)లో స్ట్రాస్, ట్రాట్ రెండో వికెట్‌కు 250 పరుగులు జోడించారు. -
ఇంగ్లండ్ 310/6 శ్రీలంకతో రెండో టెస్టు
చెస్టర్ లీ స్ట్రీట్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అలెక్స్ హేల్స్ (145 బంతుల్లో 83; 9 ఫోర్లు; 1 సిక్స్), జో రూట్ (119 బంతుల్లో 80; 5 ఫోర్లు) అర్ధ సెంచరీల కారణంగా శుక్రవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఆరు వికెట్లకు 310 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (57 బంతుల్లో 48; 5 ఫోర్లు), విన్స్ (59 బంతుల్లో 35; 4 ఫోర్లు) రాణించారు. మూడో వికెట్‌కు హేల్స్‌తో కలిసి 96 పరుగులు జోడించిన రూట్.. నాలుగో వికెట్‌కు విన్స్‌తో 59 పరుగులు జత చేశాడు. ఆట ముగిసే సమయానికి క్రీజులో మొయిన్ అలీ (70 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), వోక్స్ (8 బ్యాటింగ్) ఉన్నారు. నువాన్ ప్రదీప్‌కు మూడు, సిరివర్ధనకు రెండు వికెట్లు దక్కాయి. -
ఇంగ్లండ్‌ను ఆదుకున్న హేల్స్
తొలి ఇన్నింగ్స్‌లో 171/5 శ్రీలంకతో తొలి టెస్టు లీడ్స్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడినా కోలుకుంది. లంక బౌలర్ల ధాటికి 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో అలెక్స్ హేల్స్ (154 బంతుల్లో 71 బ్యాటింగ్; 12 ఫోర్లు), బెయిర్‌స్టో (67 బంతుల్లో 54 బ్యాటింగ్; 6ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 88 పరుగులు జోడించడంతో... తొలి రోజు గురువారం 53 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. వర్షం కారణంగా నిర్ణీత ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. షనకకు 3 వికెట్లు దక్కాయి.