ఇంగ్లండ్ రికార్డు విజయం | England's record win | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ రికార్డు విజయం

Published Thu, Sep 1 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

ఇంగ్లండ్ రికార్డు విజయం

ఇంగ్లండ్ రికార్డు విజయం

మూడో వన్డేలో పాకిస్తాన్ చిత్తు 


నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ రికార్డు పరుగుల ప్రవాహంతో పాకిస్తాన్‌పై సిరీస్ గెలిచింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు వన్డేలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (122 బంతుల్లో 171; 22 ఫోర్లు, 4 సిక్సర్లు) విశ్వరూపంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 444 పరుగులు చేసింది. రూట్ (86 బంతుల్లో 85; 8 ఫోర్లు), బట్లర్ (51 బంతుల్లో 90 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), మోర్గాన్ (27 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు)లు కూడా చెలరేగారు. హసన్ అలీకి 2 వికెట్లు దక్కారుు.

తరాత పాకిస్తాన్ 42.4 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటై ఓడింది. ఓపెనర్ షార్జిల్ ఖాన్ (30 బంతుల్లో 58; 12 ఫోర్లు, 1 సిక్స్), పదకొండో స్థానంలో దిగిన ఆమిర్ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు)మాత్రమే రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రషీద్ 2 వికెట్లు తీశారు.

 
సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్: 444/3 (హేల్స్ 171, బట్లర్90 నాటౌట్, రూట్ 85, మోర్గాన్ 57 నాటౌట్), పాకిస్తాన్: 275 (షార్జిల్ ఖాన్ 58, ఆమిర్ 58; వోక్స్ 4/41, రషీద్ 2/73).

 

ఈ రికార్డుల వన్డేలో...
పదేళ్ల క్రితం నెదర్లాండ్‌‌సపై శ్రీలంక సాధించిన అత్యధిక పరుగుల రికార్డు (443/9)ను ఇంగ్లండ్ తిరగరాసింది.
రెండు టెస్టు దేశాల మధ్య సాగిన వన్డేలో ఇదే అత్యధిక స్కోరు. వెస్టిండీస్‌పై గతేడాది దక్షిణాఫ్రికా (439/2) చేసిన స్కోరు కూడా ఇప్పుడు కనుమరుగైంది.
ఇంగ్లండ్ తరఫున వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన బట్లర్ (22 బంతుల్లో 50; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement