కొన్ని ఘటనలు అత్యంత పాశవికంగా ఉంటాయి. మనుషులేనా..? అనే భయం కలుగుతుంటుంది. అదికూడా అభం శుభం తెలియని చిన్నారులు పట్ల ఇంత హేయంగా ప్రవర్తించడమా..! అనే జుగుప్సకరమైన బాధకలుగుతుంటుంది. అచ్చం అలాంటి గుండె తరుక్కుపోయే ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఆ చిట్టి తల్లికి పదేళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కంటిపాపలా కాచుకోవాల్సిన తండ్రి చేతిలోనే హతమవుతానని ఊహించి ఉండదు పాపం.
పదేళ్ల సారా షరీఫ్ ఇంగ్లండ్‌లో తన ఇంటిలోనే విగతజీవిగా కనిపించింది. ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉంది. చనిపోవడానికి ముందు దారుణమైన వేధింపులకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజమయ్యింది. చనిపోయినప్పుడు ఆ చిన్నారి ఒంటిపై మానవ పంటి గాయాలతో సహా మొత్తం 70 గాయలు ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో వెల్లడయ్యింది. అలాగే మెడ, వెన్నుముకతో సహ మొత్తం 25 చోట్ల ఎముకలు విరిగినట్లు నివేదక పేర్కొంది.
నా కెరీర్‌లో ఇలాంటి కేసు చూడలేదు
పోలీసులు సైతం ఈ ఘటన చూసి తమ 30 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి దారుణమైన కేసుని చూడలేదన్నారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ క్రెయిగ్ ఎమ్మెర్సన్ ఈ కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడమే గాక ఈ ఘటనతో సంబంధం ఉన్న నిందితులందర్నీ అరెస్టు చేశారు. ఈ కేసులో అత్యంత బాధకరమైన విషయం ఏమిటంటే కన్నతండ్రే ఆ చిన్నారిని ఇంత ఘోరమైన బాధలకు గురిచేయడమే. ఆమె బాల్యమంత భరించలేని బాధలతోనే గడిచింది.
యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది..
అక్కడితో ఆగక ఆ కిరాతక తండ్రి తన భార్యతో కలిసి ఆ చిన్నారిని దారుణంగా హతమార్చాడు. ఇందులో ఆ చిన్నారి మేనమామ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సారా ఉదంతంతో ఒక్కసారిగా యావత్ ప్రపంచంలో పిల్లల సంరక్షణ ఏ స్థితిలో ఉందనే భయాందోళన రేకెత్తించింది. ఈ ఘటనతో పిల్లలు సంరక్షణకు సంబంధించిన సంస్కరణలకు పిలుపునిచ్చారు సామాజికవేత్తలు.
నిజానికి ఇంగ్లాండ్‌లాంటి దేశంలో పిల్లల సంరక్షణకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినా కూడా ఆ చిన్నారి కథ విషాదంతో ముగిసిపోయే వరకు వెలుగులోకి రాలేదు. కాగా, ఈ కేసులో పోలీసులకు దొరికిన కీలక ఆధారం నిందితుడు ఉర్ఫాన్ షరీష్ స్వయంగా నా కూమార్తెను కొట్టి చంపానని చేతితో వ్రాసిన నోట్. అయితే విచారణలో మాత్రం బుకాయించే ప్రయంత్న చేశాడు, కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించేటప్పటికీ..తన భార్యతో కలిసి ఈ నేరం చేసినట్లు ఉర్ఫాన్ ఒప్పుకున్నాడు.
తీసుకోవాల్సిన చర్యలు..
ఇలాంటి ఘటనలు వేధింపులకు గురవ్వుతున్న చిన్నారులు భద్రత గురించే గాక కర్కశంగా ప్రవర్తించే తల్లిదండ్రులకు ఎలా బుద్ధి చెప్పాలో తెలియజెప్పుతోంది. వాస్తవానికి ఇలాంటి ఘటనలు అంతతేలిగ్గా బయటకురావు. అలాగే చుట్టుపక్కల వాళ్లు లేదా ఎవ్వరైనా ధైర్యం చేసి..ఇలాంటి కేసు గురించి పోలీసుల దృష్టికొచ్చేలా చేయడం అనేది అంత ఈజీ కాదు.
ఇవి అత్యంత సున్నితమైన కేసులు. ఈ విషయంలో చిన్నారుల భద్రత, సంక్షేమానికి సంబంధించి..ప్రభుత్వం హెల్ప్‌లైన్‌లు, కౌన్సిలింగ్ సెంటర్లతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విధంగా ఏ చిన్నారి బలవ్వకుండా ప్రభుత్వం, సమాజం చొరవ చూపితేగానీ..ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అంటున్నారు విశ్లేషకులు.
(చదవండి: సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! ఏముంది వెడ్డింగ్ కార్డ్..!)
Comments
Please login to add a commentAdd a comment