PAK VS ENG 3rd Test: పరుగుల యంత్రానికి బ్రేక్‌ | PAK VS ENG 3rd Test: Joe Root Out For Single Digit Score After 17 Innings | Sakshi
Sakshi News home page

PAK VS ENG 3rd Test: పరుగుల యంత్రానికి బ్రేక్‌

Published Thu, Oct 24 2024 1:14 PM | Last Updated on Thu, Oct 24 2024 1:25 PM

PAK VS ENG 3rd Test: Joe Root Out For Single Digit Score After 17 Innings

ఇటీవలికాలంలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న జో రూట్‌.. పాకిస్తాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. గత 17 ఇన్నింగ్స్‌ల్లో రూట్‌కు ఇది తొలి సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌. ఈ మ్యాచ్‌లో రూట్‌ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. పాక్‌ రెండు వైపుల నుంచి స్పిన్నర్లతోనే అటాక్‌ చేస్తుండటంతో ఇంగ్లండ్‌ ఒత్తిడిలో పడిపోయింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌  గెలిచి పాకిస్తాన్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. లంచ్‌ విరామం వరకు పాక్‌ కేవలం ఇద్దరు బౌలర్లను మాత్రమే ప్రయోగించింది. వారిద్దరు కూడా స్పిన్నర్లే. ఈ మ్యాచ్‌లో పాక్‌ కేవలం ఒకే ఒక పేసర్‌తో (ఆమెర్‌ జమాల్‌) బరిలోకి దిగింది. పాక్‌ స్పిన్నర్లు నౌమన్‌ అలీ (15-0-53-2), సాజిద్‌ ఖాన్‌ (15-3-55-3) ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఉక్కిబిక్కిరి చేస్తున్నారు. వీరి ధాటికి ఇంగ్లండ్‌ 110 పరుగులకే (30 ఓవర్లలో) సగం​ వికెట్లు కోల్పోయింది.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ (52) ఒక్కడు అర్ద సెంచరీతో రాణించాడు. జాక్‌ క్రాలే 29, ఓలీ పోప్‌ 3, జో రూట్‌ 5, హ్యారీ బ్రూక్‌ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బెన్‌ స్టోక్స్‌ (6), జేమీ స్మిత్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. 

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఇంగ్లండ్‌, రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గెలిచాయి. సిరీస్‌ డిసైడర్‌ అయిన ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌ కోసం పాకిస్తాన్‌ ప్రత్యేకమైన స్పిన్‌ ట్రాక్‌ను తయారు చేయించుకుంది.

తుది జట్లు..

ఇంగ్లండ్‌: జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జేమీ స్మిత్‌ (వికెట్‌కీపర్‌), గస్‌ అట్కిన్సన్‌, రెహాన్‌ అహ్మద్‌, జాక్‌ లీచ్‌, షోయబ్‌ బషీర్‌

పాకిస్తాన్‌: సైమ్‌ అయూబ్‌, అబ్దుల్లా షఫీక్‌, షాన్‌ మసూద్‌, కమ్రాన్‌ గులామ్‌, సౌద్‌ షకీల్‌, మొహ్మద్‌ రిజ్వాన్‌, అఘా సల్మాన్‌, ఆమెర్‌ జమాల్‌, నౌమన్‌ అలీ, సాజిద్‌ ఖాన్‌, జహీద్‌ మెహమూద్‌

చదవండి: రఫ్ఫాడించిన రబాడ.. సౌతాఫ్రికా ఘన విజయం

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement