62 ఏళ్ల తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్.. | Joe Root became the third England batsmen to score two double centuries in Tests | Sakshi
Sakshi News home page

62 ఏళ్ల తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్..

Published Sun, Jul 24 2016 12:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

62 ఏళ్ల తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్..

62 ఏళ్ల తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్..

మాంచెస్టర్: ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో జో రూట్ ఒకడు. విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్, కేన్ విలియమ్సన్, రూట్.. ఈ ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలోనూ దుమ్మురేపుతున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ (406 బంతుల్లో 254; 27 ఫోర్లు) కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ చేసి అరుదైన ఫీట్ సాధించాడు. 62 ఏళ్ల తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ స్వదేశంలో పాకిస్తాన్ పై డబుల్ సెంచరీ చేసిన రికార్డును రూట్ తన ఖాతాలో వేసుకున్కనాడు. కుక్ సెంచరీకి రూట్ విధ్వంసం తోడవ్వడంతో  పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152.2 ఓవర్లలో 8 వికెట్లకు 589 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్వదేశంలో పాక్‌పై డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.  గత కొన్న

రూట్ డబుల్ సెంచరీ.. వ్యక్తిగత రికార్డులు:

  • రెండు లేదా అంతకన్నా ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఇంగ్లండ్ మూడో ఆటగాడు రూట్. గతంలో అలిస్టర్ కుక్ మూడు డబుల్ సెంచరీలు చేయగా, కెవిన్ పీటర్సన్ రెండు ద్విశతకాలు చేశాడు.
  • స్వదేశంలో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ ఆటగాడు డబుల్ సెంచరీ చేయడం 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1954లో డెనిస్ కాంప్టన్ నాటింగ్ హామ్ టెస్టులో (278) ఈ ఫీట్ సాధించాడు.
  • పాకిస్తాన్ పై డబుల్ సెంచరీ నమోదు చేసిన నాల్గవ ఆటగాడు జో రూట్. ఇప్పటివరకూ డెనిస్ కాంప్టన్ (278), కుక్ (263), టెడ్ డెక్టర్స్ (205) మాత్రమే ఈ ఘనత సాధించారు.
  • రూట్ కెరీర్లో ఇది రెండో డబుల్ సెంచరీ. 2014లో లార్డ్స్ టెస్టులో శ్రీలంకపై (200) తొలి డబుల్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement