లండన్ : పాకిస్తాన్‌లో బయటి దేశాలు వచ్చి క్రికెట్ ఆడటానికి ఎప్పుడు సందేహిస్తూనే ఉంటాయి. 2009లో శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లు ఉన్న బస్సు హోటల్ నుంచి లాహోర్‌లోని గఢాఫీ స్టేడియానికి చేరుకునే క్రమంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనతో క్రీడాలోకం ఆశ్చర్యానికి గురయ్యింది. దీంతో ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. ఇతర దేశాలను పాకిస్తాన్ గడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతించలేదు.అయితే సరిగ్గా పదేళ్ల తర్వాత(2019లో) అదే లంక జట్టు పాకిస్తాన్ గడ్డపై ఆడేందుకు ఒప్పుకోవడం విశేషం . ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారినా పాక్‌లో పర్యటించడానికి ఏ జట్టు కూడా సాహసం చేయడం లేదు. (చదవండి : హగ్ చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చా : రైనా)
ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ ఫేస్‌బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. ' పాకిస్తాన్‌కు వెళ్లి క్రికెట్ ఆడటం చాలా ఇష్టపడతాను.. నిజంగా ఆ దేశంలో క్రికెట్ ఆడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడి వికెట్లు చూడడానికి బాగుంటాయి. పిచ్ ఫ్లాట్‌గా ఉంటూ.. బ్యాట్స్‌మెన్లకు అనుకూలిస్తాయి.. ' అంటూ కామెంట్ జత చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 'రూట్.. నీ రాకకోసం ఎదురుచూస్తుంటాం.. ఈరోజు రూట్ వస్తా అన్నాడు.. రేపు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్‌లు కూడా ఆడడానికి వస్తారు' అంటూ పాక్ జట్టు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment