ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌ | England clean sweep | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌

Published Sat, Mar 11 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌

ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌

హేల్స్, రూట్‌ శతకాల మోత 
మూడో వన్డేలోనూ విండీస్‌ చిత్తు  


బ్రిడ్జిటౌన్‌: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అలెక్స్‌ హేల్స్‌ (107 బంతుల్లో 110; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), జో రూట్‌ (108 బంతుల్లో 101; 10 ఫోర్లు) శతకాల మోత మోగించడంతో చివరి వన్డేలో ఇంగ్లండ్‌ ఏకంగా 186 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. 1991 తర్వాత ఇంగ్లండ్‌ చేతిలో ఇలా క్లీన్‌స్వీప్‌ కావడం విండీస్‌కిదే తొలిసారి. అలాగే ఈ ప్రత్యర్థిపై ఇంత చెత్త ఓటమిని ఇంతకుముందెన్నడూ విండీస్‌ చవిచూడలేదు.

గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. రెండో వికెట్‌కు రూట్, హేల్స్‌ మధ్య 192 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. జోసెఫ్‌కు నాలుగు, హోల్డర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత విండీస్‌ దారుణ ఆటతీరుతో 39.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. కార్టర్‌ (46; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. ప్లంకెట్‌ (3/27), వోక్స్‌ (3/16) ధాటికి ఓ దశలో విండీస్‌ 87 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. హేల్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... వోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారాలు లభించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement