ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు పట్టు బిగించింది. జో రూట్ (122), హ్యారీ బ్రూక్ (109) శతకాలతో విజృంభించడంతో ఇంగ్లీష్ టీమ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసింది. తద్వారా విండీస్ ముందు 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
స్మిత్, విలియమ్సన్ సరసన చేరిన రూట్
టెస్ట్‌ల్లో 32వ సెంచరీతో కదంతొక్కన రూట్.. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. స్మిత్, విలియమ్సన్ టెస్ట్‌ల్లో చెరి 32 సెంచరీలు చేశారు. ఫాబ్ ఫోర్‌గా పిలువబడే వారిలో స్మిత్, విలియమ్సన్, రూట్ తలో 32 టెస్ట్ సెంచరీలు చేయగా.. కోహ్లి 29 సెంచరీలతో వెనకపడ్డాడు.
రూట్ తాజా సెంచరీ ద్వారా సాధించిన రికార్డులు..
యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు
ఇంగ్లండ్ తరఫున రెండో అత్యధిక టెస్ట్ సెంచరీలు (కుక్ 33 సెంచరీలు)
యాక్టివ్ ప్లేయర్లలో మూడో అత్యధిక సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) (విరాట్ 80, రోహిత్ శర్మ 48, రూట్ 48)
టెస్ట్‌ల్లో తొలిసారి
ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 400 ప్లస్ స్కోర్లు (416 & 425) చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ ఈ ఫీట్ సాధించడం ఇది తొలిసారి. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో 12 సార్లు మాత్రమే ఈ ఫీట్ నమోదైంది. ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరు సార్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో 400 ప్లస్ స్కోర్లు చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఓలీ పోప్ (121) సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కవెమ్ హాడ్జ్ (120) కెరీర్‌లో తొలి సెంచరీతో కదంతొక్కాడు. 385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment