ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సాల్ట్ వెస్టిండీస్‌పై మూడు సెంచరీలు చేశాడు. సాల్ట్ తన టీ20 కెరీర్‌లో చేసిన మూడు సెంచరీలు విండీస్‌పై చేసినవే కావడం విశేషం. సాల్ట్ తర్వాత ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ఎవిన్ లెవిస్ (భారత్‌పై 2), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (భారత్‌పై 2), ముహమ్మద్ వసీం (ఐర్లాండ్‌పై 2), లెస్లీ డన్బర్‌లకు (బల్గేరియాపై 2) దక్కుతుంది.
బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన సాల్ట్
తాజాగా విండీస్‌పై చేసిన సెంచరీతో సాల్ట్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. సాల్ట్ 34 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేసి మ్యాక్స్‌వెల్ (5 సెంచరీలు), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4), ఎస్ డవిజి (3) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. టీ20ల్లో సాల్ట్, డవిజి సహా ముహమ్మద్ వసీం, కొలిన్ మున్రో, బాబర్ ఆజమ్‌లు తలో మూడు సెంచరీలు చేశారు.
కాగా, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ మెరుపు సెంచరీతో (54 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ (38), రొమారియో షెపర్డ్ (35 నాటౌట్), గుడకేశ్ మోటీ (33), ఆండ్రీ రసెల్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్ నాలుగు, ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సాల్ట్ సుడిగాలి శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సాల్ట్‌తో పాటు జాకబ్ బేతెల్ (58 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 17 పరుగులు చేయగా.. జోస్ బట్లర్ గోల్డన్ డకౌటయ్యాడు. మోటీ, షెపర్డ్‌కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment