బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు సత్తా చాటారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్‌లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 3, మార్క్ వుడ్ 0, ఓలీ పోప్ 10, హ్యారీ బ్రూక్ 2 నిరాశపర్చగా.. పదో నంబర్ ఆటగాడు గస్ అట్కిన్సన్ 21 పరుగులు చేశాడు.
విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఆలౌటైన అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (0), కిర్క్ మెక్‌కెంజీ (8) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (18), అలిక్ అథనాజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించి, సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment