స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జులై 28) ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టును చిత్తుగా ఓడించింది. మార్క్ వుడ్ (14-1-40-5) సెకెండ్ ఇన్నింగ్స్‌లో విండీస్‌ను కకావికలం (175 ఆలౌట్) చేశాడు.
అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 7.2 ఓవర్లలో ఛేదించింది. బెన్ స్టోక్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగి విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు చేశాడు. గతంలో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు ఇయాన్ బోథమ్ (28 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు పాక్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ (21) పేరిట ఉంది.
BEN STOKES - Fastest fifty in England Test history. 🔥🥶 pic.twitter.com/Lphj1mAap5
— Johns. (@CricCrazyJohns) July 28, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో స్టోక్స్‌కు జతగా బెన్ డకెట్ (16 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) కూడా చెలరేగాడు. ఓవర్‌నైట్ స్కోర్ 33/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది (175 పరుగులకు ఆలౌట్). మార్క్ వుడ్ ఐదేసి విండీస్‌ను కుప్పకూల్చాడు. అట్కిన్సన్ 2, వోక్స్, షోయబ్ బషీర్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో మికైల్ లూయిస్ (57), కవెమ్ హాడ్జ్ (55) హాఫ్ సెంచరీలు చేశాడు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్‌లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment