ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతుంది. హ్యారీ బ్రూక్ కెరీర్‌లో ఐదో శతకం.. సొంతగడ్డపై తొలి శతకం పూర్తి చేసి సత్తా చాటాడు. బ్రూక్ 118 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 109 పరుగుల వద్ద బ్రూక్.. జేడన్ సీల్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జాషువ డసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్రూక్ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేయడం విశేషం. బ్రూక్ క్రికెట్‌లో 14 టెస్ట్‌లు ఆడి 62.55 సగటున 1376 పరుగులు చేశాడు.
బ్రూక్‌కు జతగా మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న జో రూట్ కెరీర్‌లో 63వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ (68) టాప్‌లో ఉండగా.. శివ్‌నరైన్ చంద్రపాల్ (66) రెండో స్థానంలో నిలిచాడు. రూట్.. అలెన్ బోర్డర్, రాహుల్ ద్రవిడ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేయకముందే రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి (11869) ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. పాంటింగ్, కలిస్, ద్రవిడ్, కుక్, సంగక్కర, లారా.. రూట్ కంటే ముందున్నారు.
కాగా, నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 300 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ (80), జేమీ స్మిత్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 416 పరుగులు, విండీస్ 457 పరుగులు చేశాయి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (121), విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment