తొలి ఇన్నింగ్స్‌లో 171/5 శ్రీలంకతో తొలి టెస్టు
లీడ్స్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడినా కోలుకుంది. లంక బౌలర్ల ధాటికి 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో అలెక్స్ హేల్స్ (154 బంతుల్లో 71 బ్యాటింగ్; 12 ఫోర్లు), బెయిర్‌స్టో (67 బంతుల్లో 54 బ్యాటింగ్; 6ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు.
ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 88 పరుగులు జోడించడంతో... తొలి రోజు గురువారం 53 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. వర్షం కారణంగా నిర్ణీత ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. షనకకు 3 వికెట్లు దక్కాయి.
ఇంగ్లండ్‌ను ఆదుకున్న హేల్స్
Published Fri, May 20 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM
Advertisement
Advertisement