భారత్‌తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన
గాయంతో స్టోక్స్ దూరం
లండన్: చివరిసారి భారత్ వేదికగా 2023లో జరిగిన ప్రపంచకప్‌లో ఆడిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ క్రికెటర్ జో రూట్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో... ఆ తర్వాత పాకిస్తాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును ఆదివారం ప్రకటించారు. భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పోటీపడే ఇంగ్లండ్ జట్టును కూడా ఎంపిక చేశారు.
ఈ రెండు ఫార్మాట్‌లలో ఇంగ్లండ్ జట్టుకు వికెట్ కీపర్ జోస్ బట్లర్ నాయకత్వం వహిస్తాడు. టెస్టు ఫార్మాట్‌లో ఈ ఏడాదిని వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న రూట్ చివరి వన్డే 2023 ప్రపంచకప్‌లో ఆడాడు. 33 ఏళ్ల రూట్ ఇప్పటి వరకు 171 వన్డేలు ఆడి 6522 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్ వేసే రూట్ వన్డేల్లో 27 వికెట్లు కూడా పడగొట్టాడు.
మరోవైపు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెపె్టన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరిగే సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా స్టోక్స్‌కు తొడ కండరాల గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం స్టోక్స్ ఈ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫలితంగా అతని పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.
ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్‌సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
ఇంగ్లండ్ టి20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అట్కిన్‌సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
భారత్–ఇంగ్లండ్ టి20 సిరీస్ షెడ్యూల్
జనవరి 22: తొలి టి20 (కోల్‌కతాలో)
జనవరి 25: రెండో టి20 (చెన్నైలో)
జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్‌లో)
జనవరి 31: నాలుగో టి20 (పుణేలో)
ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబైలో)
భారత్–ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్
ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్‌లో)
ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్‌లో)
ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్‌లో)
Comments
Please login to add a commentAdd a comment