టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో ఆసక్తికర ఎంపికలేమీ జరుగలేదు. మోచేతి గాయం కారణంగా ఏడాదికాలంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇచ్చాడు.
పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డన్‌ను అనూహ్యంగా ఎంపిక చేశారు. జట్టులో స్పెషలిస్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేకపోవడంతో ఆ కోటాలో బెన్ డకెట్‌కు అవకాశం దక్కింది. వెటరన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ రైట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేసినా బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తాడు.
స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో ఆదిల్ రషీద్, టామ్ హార్ట్లీ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్.. ఆల్‌రౌండర్ల కోటాలో విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్.. పేసర్ల విభాగంలో రీస్ టాప్లే, మార్క్ వుడ్ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్
Comments
Please login to add a commentAdd a comment