రెండో భార్య కోసం ఓ డేటింగ్ సైట్ | Muslim entrepreneur sets up dating site that helps men find a second wife | Sakshi
Sakshi News home page

రెండో భార్య కోసం ఓ డేటింగ్ సైట్

Published Tue, Jun 21 2016 3:16 PM | Last Updated on Thu, Jul 25 2019 5:24 PM

రెండో భార్య కోసం ఓ డేటింగ్ సైట్ - Sakshi

రెండో భార్య కోసం ఓ డేటింగ్ సైట్

బ్రిటన్  కు చెందిన  ఓ ముస్లిం వ్యాపార వేత్త పురుషులకోసం ఓ  డేటింగ్  సైట్ లాంచ్ చేశాడు. దీని ద్వారా పురుషులు రెండో భార్యను ఈజీగా వెతుక్కోవచ్చని ప్రకటించడంతో  దీనికి  అనూహ్యమైన  స్పందన లభించింది. ఆజాద్ చాయ్ వాలా సెకండ్వైఫ్. కాం , పోలీగమీ.కాం పేరుతో  వీటిని  లాంచ్ చేశాడు. ముఖ్యంగా  ముస్లిం మతం పురుషులు లక్ష్యంగా  ఏర్పాటు చేయగా..ఆ తర్వాత అన్ని మతల పురుషులకు అవకాశం కల్పించాడు. దీంతో ఇది వీర లెవెల్లో విజయవంతమై.. క్రమంగా అన్ని మతాల పురుషులు రిజష్టర్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.  మరోవైపు  రెండో పెళ్లి చట్ట విరుద్ధమైన బ్రిటన్ లో ఇలాంటి వెబ్ సైట్ ఓపెన్ చేయడం  విశేషం. గత ఏడాది లాంచ్ చేసిన  ఈ వెబ్ సైట్లలో ప్రస్తుతం, సెకండ్వైఫ్. కాం లో  35,000 మంది,  పోలీగమీ.కాం  7,000  మంది  సభ్యులుగా ఉన్నారు.  

అయితే నిజానికి  తన ప్రయత్నం ఒంటరి మహిళలకు ఒక పరిష్కారం చూపిస్తోందని,  తన సేవ విశ్వసనీయతను ప్రోత్సహిస్తుందనీ  ఆజాద్   పేర్కొన్నాడు. తన వెబ్ సైట్ పాత కాలపు విలువలను కాపాడుతూనే.. అటు ఎలాంటి అమర్యాదను, విద్వేషాలను అనుమతించదని ఉద్ఘాటించాడు. తాను ఎలాంటి నేర చర్యలను ప్రోత్సహించడం లేదని  వివరణ ఇచ్చాడు. నలుగురు భార్యలను కలిగి ఉండడానికి తమ మతం  అనుమతిస్తుందని, అలాగే ఇతర మతాల కూడా బహుభార్యత్వాన్ని  అనుమతిస్తున్నాయని వాదించాడు. .

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement