dating site
-
పాదాలను చూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయ్యొచ్చట!!
కాళ్ల వేళ్లను బట్టి, చేతి రేఖలను బట్టి ఎటువంటి జీవిత భాగస్వామి దొరుకుతారో కొంతమంది అంచనా వేస్తారు. ఒక్కోసారి అంచనాలు బోల్తాకొట్టి, అటుఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఐతే తాజాగా ఓ డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ పాదాలు ఉన్న పురుషులకు వివాహేతర సంబంధాలు అధికంగా ఉంటాయని చెప్పింది. ‘మిర్రర్’ ఆన్లైన్ సైట్ ప్రచురించిన కథనాల ప్రకారం.. ‘ఇల్లిసిట్ ఎన్కౌంటర్స్’అనే డేటింగ్ సైట్ పురుషులపై నిర్వహించిన సర్వే ప్రకారం మగవారి కాలి పరిమాణాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. దాదాపుగా రెండువేల మంది పురుషులపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం మగవారి కాలి సైజును బట్టి జీవిత భాగస్వామిపట్ల వారు ఎంత నమ్మకంగా ఉంటారో వివరించింది. పెద్ద పాదాలు ఉన్న పురుషులు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఎక్కువని ఈ సర్వే తెల్పింది. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! ముఖ్యంగా 11 అంగుళాల పాదాలు ఉన్న పురుషులు 29 శాతం చీటింగ్ చేసే అవకాశం ఉందని, 10 అంగుళాల వారు 25 శాతం, 12 అంగుళాలుంటే 22 శాతం, 13 అంగుళాలుంటే మోసం చేసే అవకాశాలు 21 శాతం ఉంటుందని ఈ డేటింగ్ సైట్ సర్వేలో తేలింది. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వందలాది మంది పురుషులు స్వయంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని సర్వేలో అంగీకరించారట కూడా. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ‘ఇల్లిసిట్ ఎన్కౌంటర్స్’ సీఈవో జెస్సికా లియోనీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సర్వేపై ప్రజలు విభిన్న ప్రశ్నలు వేస్తున్నప్పటికీ మా లెక్కలు అబద్ధాలు చెప్పలేదని అన్నారు. కొంతమంది పురుషులు దీనిని కొట్టిపారేశారు కూడా. తమకు పెద్ద పాదాలు ఉన్నప్పటికీ తమ భాగస్వామిని ఎప్పుడూ మోసం చేయలేదని, నిజాయితీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనప్పటికీ చేతి రేఖలనుబట్టి, కాలి పరిమాణాలను బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే ఏ కొద్దిమందినో ప్రామాణికంగా తీసుకుని మొత్తం పురుషులు ఇలాగే ఉంటారని సైన్స్ కూడా చెప్పలేదు. ఏమంటారు? చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. -
నిన్ను డైరెక్టర్ చేస్తా.. ఆపై పెళ్లి చేసుకుంటా
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులోని గేటెడ్ కమ్యూనిటీల్లో హౌస్ కీపింగ్ కోసం ఓ సంస్థను నిర్వహిస్తున్నానని నమ్మించి.. అవసరార్థం వ్యాపార విస్తరణ, వైద్యావసరాల కోసమంటూ ఓ వితంతును వంచించి రూ.మూడు లక్షల వరకు కొల్లగొట్టిన సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ బి.ప్రకాష్ కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన రాజ్‌వన్స్ ఇండియన్ మేనేజ్మెంట్ స్టడీ పూర్తయ్యాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఆ తర్వాత మైనింగ్‌తో పాటు టీకప్‌ల తయారీ పరిశ్రమను నిర్వహించాడు. అయితే ఈ వ్యాపారాల్లో నష్టం రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అమాయకులను మోసగించి డబ్బులు సంపాదించేందుకు ఓ ఆన్లైన్ డేటింగ్ సైట్లో తన వివరాలు నిక్షిప్తం చేశాడు. అయితే 2019 మార్చి నుంచి ఓ వితంతువు రాజ్‌వన్స్‌తో పరిచయం పెంచుకుంది. ఈ సమయంలో తనకు కూడా విడాకులయ్యాయని, అయితే బెంగళూరులో బాగా లాభాలు చేకూర్చే హౌస్ కీపింగ్ సంస్థను నిర్వహిస్తున్నానంటూ నమ్మించాడు. ఆ తర్వాత తన కంపెనీలో డీలర్షిప్, డైరెక్టర్‌షిప్‌తో పాటు మీ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఇదంతా నిజమని నమ్మి తన వ్యాపార విస్తరణకు, వైద్యం కోసం డబ్బులు అవసరమంటూ చెప్పడంతో బాధితురాలు దఫాదఫాలుగా రూ.మూడు లక్షలు రాజ్‌వన్స్ పంపిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత నుంచి అతడు స్పందించలేకపోవడంతో మోసపోయానని తెలిసి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీ సులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక సాక్ష్యాలతో నిందితుడు రాజ్‌వన్స్‌ను బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి చర్లపల్లి జైలుకు తరలించారు. చదవండి: ఉద్యోగం ముసుగులో వ్యభిచారం -
డేటింగ్...చాటింగ్...చీటింగ్
యువకుల నుంచి డబ్బులు లాగుతున్న ఘరానా కిలేడీ ఈజీమనీ కోసం వక్రమార్గాలు బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు సిటీబ్యూరో: డేటింగ్ సైట్లలో చాటింగ్ పేరుతో యువకులకు వల వేసి ఆ తర్వాత వారి ఫేస్బుక్ ఖాతాలోని కుటుంబసభ్యుల ఫొటోలను డేటింగ్ వెబ్సైట్లో పోస్టు చేస్తానని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న యువతిని సైబరాబాద్ సైబర్ క్రై మ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తమను డీసెంట్ చాట్ పేరుతో ఓ యువతి నమ్మించి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తోందని ప్రగతినగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ నెల 4న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిలేడీ ఆటకట్టించారు. మొదట సినిమా టికెట్లు...ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చైతన్యపురికి చెందిన నిందితురాలు డేటింగ్ సైట్లలో క్యూటీ 27, వైశాలి 33, స్మైలీ 31 పేర్లతో చాటింగ్ చేసేది. ఆ సైట్లలో కాంటాక్ట్ అయ్యే వారికి తన ఫోన్ నంబర్ ఇచ్చేది. డీసెంట్ చాట్ చేస్తానని, మీతో డేటింగ్ చేస్తానంటూ మల్టీప్లెక్స్‌లో నాలుగు మూవీ టికెట్లు బుక్ చేయాలంటూ కోరుతూ ఈమెరుుల్ ఐడీతో పాటు ఫోన్ నంబర్ పంపించేది. ఇదే తరహాలో నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో ట్వూ డేటింగ్ సైట్లో క్యూటీ(27) ప్రొఫైల్ పేరుతో చాటింగ్ చేసింది. మల్టీప్లెక్స్‌లో నాలుగు సినిమా టికెట్లను అడిగితే బుక్ చేసి తన మొబైల్ నంబర్ ద్వారా ఆమె సెల్ నంబర్‌కు బుకింగ్ ఐడీ పంపించాడు. ఆ సెల్‌నంబర్‌తో ఫేస్బుక్లో అతడి ప్రొఫైల్ తెలుసుకున్న నిందితురాలు అందులో అప్లోడ్ చేసిన అతడి కుటుంబసభ్యుల ఫొటోలను డౌన్లోడ్ చేసింది. మరుసటి రోజు అతడికి ఫోన్ చేసి రూ. 3,500 తన బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాలని, లేనిపక్షంలో మీ కుటుంబసభ్యుల ఫొటోలను డేటింగ్ సైట్లో అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో అతను ఆమె అడిగిన మొత్తాన్ని జమ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ కాల్ చేసి రూ.50వేలు కావాలని, అందుకు రెండు రోజుల సమయం ఇస్తున్నానని బెదిరించింది. అరుుతే బాధితుడు డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో అతడి కుటుంబసభ్యుల ఫొటోలను డేటింగ్ సైట్లలో ఆప్‌లోడ్ చేసి ‘కాల్ ఆర్ ఎస్ఎంఎస్’ అనే స్టేటస్‌తో పాటు సెల్‌నంబర్ పెట్టింది. దీంతో అతను ఆమెకు ఫోన్ చేసి కొంత గడువు కావాలని,, ఆలోపు ఆ ఫొటోలు డిలీట్ చేయమని కోరడంతో వాటిని తీసేసింది. అరుుతే అదే రోజు తమ కుటుంబసభ్యుల ఫొటోల స్థానంలో ఇతరుల ఫొటోలు, ఫోన్ నంబర్ ఆప్‌లోడ్ చేయడాన్ని గుర్తించిన బాధితుడు సదరు నంబర్‌కు కాల్ చేసి తనకు ఎదురైన ఎదురైన అనుభవాన్ని వివరించాడు. ఫ్రెండ్ నంబర్ ఇస్తే... సింగపూర్‌లో ఉంటున్న తన స్నేహితుడు డేటింగ్ సైట్లో స్మైలీ(31) పేరు గల అమ్మారుుతో చాటింగ్ చేశాడని, కమ్యూనికేషన్ కోసం ఇండియాకు వచ్చేంతవరకు తన నంబర్‌ను ఇచ్చాడని మొదటి బాధితుడితో రెండో బాధితుడు తెలిపాడు. ఆ సెల్ నంబర్ సహాయంతో ఫేస్బుక్లో ప్రొఫైల్ సెర్చ్ చేసి అందులో ఉన్న తన కుటుంబసభ్యుల ఫొటోలు డౌన్లోడ్ చేసిందని, నవంబర్ 2 ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే నిరాకరించంతో తన కుటుంబంలోని అమ్మారుుల ఫొటోలను డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేయడంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అసభ్యకరంగా కాల్స్ వచ్చాయని చెప్పాడు. దీంతో మొదటి బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రరుుంచడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నంబర్, మెరుుల్ చాటింగ్ ఆధారంగా చైతన్యపురికి చెందిన బట్టు రాజేశ్వరిని గురువారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ఏసీపీ జయరాం పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఈ ఘరానా కిలేడీని పట్టుకుని. కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
రెండో భార్య కోసం ఓ డేటింగ్ సైట్
బ్రిటన్ కు చెందిన ఓ ముస్లిం వ్యాపార వేత్త పురుషులకోసం ఓ డేటింగ్ సైట్ లాంచ్ చేశాడు. దీని ద్వారా పురుషులు రెండో భార్యను ఈజీగా వెతుక్కోవచ్చని ప్రకటించడంతో దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ఆజాద్ చాయ్ వాలా సెకండ్వైఫ్. కాం , పోలీగమీ.కాం పేరుతో వీటిని లాంచ్ చేశాడు. ముఖ్యంగా ముస్లిం మతం పురుషులు లక్ష్యంగా ఏర్పాటు చేయగా..ఆ తర్వాత అన్ని మతల పురుషులకు అవకాశం కల్పించాడు. దీంతో ఇది వీర లెవెల్లో విజయవంతమై.. క్రమంగా అన్ని మతాల పురుషులు రిజష్టర్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు రెండో పెళ్లి చట్ట విరుద్ధమైన బ్రిటన్ లో ఇలాంటి వెబ్ సైట్ ఓపెన్ చేయడం విశేషం. గత ఏడాది లాంచ్ చేసిన ఈ వెబ్ సైట్లలో ప్రస్తుతం, సెకండ్వైఫ్. కాం లో 35,000 మంది, పోలీగమీ.కాం 7,000 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే నిజానికి తన ప్రయత్నం ఒంటరి మహిళలకు ఒక పరిష్కారం చూపిస్తోందని, తన సేవ విశ్వసనీయతను ప్రోత్సహిస్తుందనీ ఆజాద్ పేర్కొన్నాడు. తన వెబ్ సైట్ పాత కాలపు విలువలను కాపాడుతూనే.. అటు ఎలాంటి అమర్యాదను, విద్వేషాలను అనుమతించదని ఉద్ఘాటించాడు. తాను ఎలాంటి నేర చర్యలను ప్రోత్సహించడం లేదని వివరణ ఇచ్చాడు. నలుగురు భార్యలను కలిగి ఉండడానికి తమ మతం అనుమతిస్తుందని, అలాగే ఇతర మతాల కూడా బహుభార్యత్వాన్ని అనుమతిస్తున్నాయని వాదించాడు. . -
రేప్ అనంతరం సారీ అంటూ మెసేజ్..
డెర్బి: ఆన్లైన్ డేటింగ్ సైట్లో పరిచయమైన ఐదుగురు మహిళలను ఓ వ్యక్తి రేప్ చేశాడు. ఆరో మహిళపై సైతం లైంగిక దాడికి ప్రయత్నించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని డెర్బీ ప్రాంతానికి చెందిన జాసన్ లారెన్స్(50).. ప్రముఖ డేటింగ్ వెబ్ సైట్ మ్యాచ్ డాట్ కామ్‌లో వేరు వేరు ప్రొఫైల్స్‌తో అమాయక మహిళలకు వల వేశాడు. తనతో సంభాషణలు ప్రైవేట్ మెయిల్ లేదా ఫోన్ ద్వారా చేయాలని డేటింగ్ వెబ్సైట్ ద్వారా పరిచయం అయిన మహిళలను కోరేవాడు. అలా తనతో ప్రైవేటు సంభాషణలు జరిపిన వారిని కలుసుకొని వారిపై లైంగిక దాడి పాల్పడ్డాడు. వ్యక్తిగత సంభాషణల ద్వారా తన నిజస్వరూపాన్ని మ్యాచ్ డాట్ కామ్ సైటు దృష్టిలో పడకుండా జాసన్ జాగ్రత్త పడ్డాడని ప్రాసిక్యూటర్ షాన్ స్మిత్ తెలిపారు. మూడు మిలియన్ల సభ్యులతో మ్యాచ్ డాట్ కామ్‌కు బ్రిటన్‌లో అతి పెద్ద డేటింగ్ సైటుగా పేరుంది. ఈ సైట్ ద్వారా మొదటగా 2013 నవంబర్‌లో పరిచయమైన ఓ మహిళను జాసన్ తన ఇంట్లోనే రేప్ చేశాడు. ఇక మరో ఘటనలో తనను కలుసుకోవడానికి వచ్చిన మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇలా రేప్‌లు చేసిన అనంతరం తాపీగా క్షమించమని మెసేజ్‌లు పెట్టడం జాసన్కున్న మరో అలవాటు. డెర్బీ క్రౌన్ కోర్టులో జాసన్ అకృత్యాలపై విచారణ జరుగుతోంది.