డేటింగ్...చాటింగ్...చీటింగ్ | Dating ... chatting ... Cheating | Sakshi
Sakshi News home page

డేటింగ్...చాటింగ్...చీటింగ్

Published Fri, Nov 11 2016 12:40 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

డేటింగ్...చాటింగ్...చీటింగ్ - Sakshi

డేటింగ్...చాటింగ్...చీటింగ్

యువకుల నుంచి డబ్బులు లాగుతున్న ఘరానా కిలేడీ
ఈజీమనీ కోసం వక్రమార్గాలు
బాధితుడి ఫిర్యాదు మేరకు  నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు


సిటీబ్యూరో: డేటింగ్ సైట్లలో చాటింగ్ పేరుతో యువకులకు వల వేసి ఆ తర్వాత వారి ఫేస్‌బుక్ ఖాతాలోని కుటుంబసభ్యుల ఫొటోలను డేటింగ్ వెబ్‌సైట్‌లో పోస్టు చేస్తానని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న యువతిని సైబరాబాద్ సైబర్ క్రై మ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.  తమను డీసెంట్ చాట్ పేరుతో ఓ యువతి నమ్మించి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తోందని ప్రగతినగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ నెల 4న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిలేడీ ఆటకట్టించారు.

మొదట సినిమా టికెట్లు...ఆ తర్వాత డబ్బులు డిమాండ్
చైతన్యపురికి చెందిన నిందితురాలు డేటింగ్ సైట్‌లలో క్యూటీ 27, వైశాలి 33, స్మైలీ 31 పేర్లతో చాటింగ్ చేసేది. ఆ సైట్లలో కాంటాక్ట్ అయ్యే వారికి తన ఫోన్ నంబర్ ఇచ్చేది. డీసెంట్ చాట్ చేస్తానని, మీతో డేటింగ్ చేస్తానంటూ మల్టీప్లెక్స్‌లో నాలుగు మూవీ టికెట్లు బుక్ చేయాలంటూ కోరుతూ ఈమెరుుల్ ఐడీతో పాటు ఫోన్ నంబర్ పంపించేది. ఇదే తరహాలో నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ట్వూ డేటింగ్ సైట్‌లో క్యూటీ(27) ప్రొఫైల్ పేరుతో చాటింగ్ చేసింది. మల్టీప్లెక్స్‌లో నాలుగు సినిమా టికెట్లను అడిగితే బుక్ చేసి తన మొబైల్ నంబర్ ద్వారా ఆమె సెల్ నంబర్‌కు బుకింగ్ ఐడీ పంపించాడు. ఆ సెల్‌నంబర్‌తో ఫేస్‌బుక్‌లో అతడి ప్రొఫైల్ తెలుసుకున్న నిందితురాలు అందులో అప్‌లోడ్ చేసిన అతడి కుటుంబసభ్యుల ఫొటోలను డౌన్‌లోడ్ చేసింది. మరుసటి రోజు అతడికి ఫోన్ చేసి రూ. 3,500 తన బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాలని, లేనిపక్షంలో మీ కుటుంబసభ్యుల ఫొటోలను డేటింగ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించడంతో అతను ఆమె అడిగిన మొత్తాన్ని జమ చేశాడు.

ఆ తర్వాత మళ్లీ ఫోన్ కాల్ చేసి రూ.50వేలు కావాలని, అందుకు రెండు రోజుల సమయం ఇస్తున్నానని బెదిరించింది. అరుుతే బాధితుడు  డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో అతడి కుటుంబసభ్యుల ఫొటోలను డేటింగ్ సైట్‌లలో ఆప్‌లోడ్ చేసి ‘కాల్ ఆర్ ఎస్‌ఎంఎస్’ అనే స్టేటస్‌తో పాటు సెల్‌నంబర్ పెట్టింది. దీంతో అతను ఆమెకు ఫోన్ చేసి కొంత గడువు కావాలని,, ఆలోపు ఆ ఫొటోలు డిలీట్ చేయమని కోరడంతో వాటిని తీసేసింది. అరుుతే అదే రోజు తమ కుటుంబసభ్యుల ఫొటోల స్థానంలో ఇతరుల ఫొటోలు, ఫోన్ నంబర్ ఆప్‌లోడ్ చేయడాన్ని గుర్తించిన బాధితుడు సదరు నంబర్‌కు కాల్ చేసి తనకు ఎదురైన ఎదురైన అనుభవాన్ని  వివరించాడు.

ఫ్రెండ్ నంబర్ ఇస్తే...
సింగపూర్‌లో ఉంటున్న తన స్నేహితుడు డేటింగ్ సైట్‌లో స్మైలీ(31) పేరు గల అమ్మారుుతో చాటింగ్ చేశాడని, కమ్యూనికేషన్ కోసం ఇండియాకు వచ్చేంతవరకు తన నంబర్‌ను ఇచ్చాడని మొదటి బాధితుడితో రెండో బాధితుడు తెలిపాడు. ఆ సెల్ నంబర్ సహాయంతో ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ సెర్చ్ చేసి అందులో ఉన్న తన కుటుంబసభ్యుల ఫొటోలు డౌన్‌లోడ్ చేసిందని, నవంబర్ 2 ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే నిరాకరించంతో తన కుటుంబంలోని అమ్మారుుల ఫొటోలను డేటింగ్ సైట్‌లలో అప్‌లోడ్ చేయడంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అసభ్యకరంగా కాల్స్ వచ్చాయని చెప్పాడు.

దీంతో మొదటి బాధితుడు  సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రరుుంచడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నంబర్, మెరుుల్ చాటింగ్ ఆధారంగా చైతన్యపురికి చెందిన బట్టు రాజేశ్వరిని గురువారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్‌ఏసీపీ జయరాం పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఈ ఘరానా కిలేడీని పట్టుకుని. కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement