Chatting
-
ఆన్లైన్ నుంచి అక్షింతల దాకా
ప్రేమను.. పెళ్లితో స్థిరపరచేది అదే! అయితే దానికి బాటలు వేసేవి మాత్రం పరస్పర నమ్మకం, గౌరవాలే! అలాంటి లవ్ స్టోరే ఇది! దాదాపు ఏడేళ్లపాటు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లితో ప్రేమను గెలిపించుకున్న ఆ జంటలోని అమ్మాయి.. రైతా, ఫిన్లండ్. అబ్బాయి .. ప్రదీప్, హైదరాబాద్. ప్రేమకథా కాలం.. 1997.. స్కూలింగ్ పూర్తి చేసుకున్న రైతా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇంగ్లిష్ భాషను నేర్చుకుంటోంది. ఫ్లూయెన్సీ కోసం యాహూ చాట్‌లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో ఒకరోజు ప్రదీప్ పరిచయం అయ్యాడు. సంభాషణలో ఆధ్యాత్మికం, తాత్వికం, మతపరమైన అంశాల నుంచి సామాజిక, రాజకీయ, పర్యావరణ విషయాలు, ప్రపంచ పౌరుల బాధ్యతలు వంటి వాటి మీద ప్రదీప్కున్న అవగాహనకు రైతా ముచ్చటపడింది. ప్రదీప్‌కూ రైతా పట్ల అదే భావన. నెమ్మదిగా స్నేహం పెరిగింది. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ప్రదీప్‌కి రైతా మీద ప్రేమ మొదలైంది. అప్పటికీ ఆ ఆన్లైన్ స్నేహం వయసు నాలుగేళ్లు. అప్పట్లో వెబ్కామ్స్ లేవు.. కాబట్టి ఒరినొకరు చూసుకోలేదు. కనీసం ఫొటోలు కూడా ఎక్సే ్చంజ్ చేసుకోలేదు. ఒక రోజు ప్రదీప్ మెయిల్ పెట్టాడు ‘రకస్తాన్ సినువా (నువ్వంటే ఇష్టం).. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యాలు రైతాకు. ఎందుకంటే ఫిన్లండ్ లో అంత త్వరగా ఎవరూ పెళ్లి ప్రపోజల్ తీసుకురారు. అలాంటిది అబ్బాయి కనీసం తనను చూడనైనా చూడకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు అని! ఓకే చెప్పింది. ఇద్దరిళ్లల్లో విషయం చెప్పేశారు. ప్రదీప్ జాతకంలో విదేశీ పిల్లే రాసి ఉందని, అదే జరగబోతోందని అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కానీ రైతా వాళ్లింట్లోనే ఒప్పుకోలేదు. కారణం అక్కడ మీడియా లో ఇండియా గురించి ఉన్న వ్యతిరేక ప్రచారమే! వాళ్లను ఒప్పించే ప్రయత్నంలో.. ప్రదీప్‌ను చూస్తే ఒప్పుకుంటారు అన్న ఆశతో‘ఫిన్లండ్ రండి’ అంది రైతా. వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీసా‘రిజెక్టయ్యింది. దాంతో‘నేనే హైదరాబాద్ వస్తాను’ అంటూ అభయమిచ్చింది రైతా! ‘ఎయ్ (.. వద్దు)’ అన్నారు ఆమె తల్లిదండ్రులు. ‘మిక్సీ (ఎందుకు)?’ అడిగింది అమ్మాయి. ‘ఇండియా సేఫ్ కాదు’ స్పష్టం చేశారు. వాదించింది రైతా. అయినా ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. ఈసారి ప్రదీప్ యూకేలో చదువును బహానా (సాకు)గా మలచుకున్నాడు. వీసా ఓకే అయింది. యూకే నుంచి తేలిగ్గానే ఫిన్లండ్కి వీసా దొరికింది. రైతా ఆనందానికి అవధుల్లేవు. పరిచయం అయిన ఏడేళ్లకు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఆ క్షణం రానేవచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇంకా నచ్చారు! రైతా తల్లిదండ్రులకూ నచ్చాడు ప్రదీప్! కానీ అమ్మాయి అక్కడికి వెళ్లి ఉండగలదా? అప్పటికీ ఇండియా మీద ఇంకా సానుకూలమైన అభి్రపాయానికి రాలేదు వాళ్లు. ‘ఉంటాను’ ధైర్యం చెప్పింది. ట్రయల్ గా హైదరాబాద్‌ను విజిట్ చేసింది కూడా! ఇక్కడి సోషల్ లైఫ్‌ను ఇష్టపడింది. ప్రదీప్ తల్లిదండ్రులకూ రైతా చాలా నచ్చింది. రైతా కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి, ప్రదీప్ కుటుంబాన్ని కలిసింది. అలా ఏడేళ్ల వాళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం, ఆశీర్వాదంతో ఏడడుగుల బంధమైంది. వాళ్ల పెళ్లికిప్పుడు ఇరవై ఏళ్లు. నలుగురు పిల్లలు. ప్రదీప్ కోసం రైతా శాకాహారిగా మారింది. తెలుగు నేర్చుకుంది. ప్రదీప్ జీవితంలోనే కాదు బిజినెస్‌లోనూ భాగస్వామైంది. ప్రదీప్ ఫీనిష్ నేర్చుకున్నాడు. తన కోసం ఆమె చేసుకున్న, చేసుకుంటున్న సర్దుబాట్లను అతను గుర్తిస్తాడు. అమె అభి్రపాయాలను గౌరవిస్తాడు. రైతా తల్లిదండ్రులు తన కూతురు చాలా అదృష్టవంతురాలని పొంగిపోతారు. ‘‘మేమొక మాట అనుకున్నాం.. పెళ్లనే గొప్ప బంధంలోకి అడుగుపెడుతున్నాం. మనమధ్య వచ్చే ఏ తగవైనా మన రిలేషన్‌షిప్‌ని మరింత స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు అని. దాన్నే ఆచరిస్తున్నాం!’ అని చెబుతోంది రైతా. – సరస్వతి రమ -
విద్యార్థినితో మాస్టారు అసభ్య చాటింగ్!
నందిగాం: నందిగాం మండలంలోని హరిదాసుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గత నెల 31రాత్రి ఓ విద్యార్థినితో అసభ్యంగా చాటింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్య వహారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో టీడీ పీ నేతలు రాజీయత్నాలకు దిగడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. హరిదాసు పురం డ్రిల్ మాస్టారు డిసెంబరు 31 అర్ధరాత్రి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక సెల్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షల పే రుతో అసభ్య చాటింగ్ చేసినట్లు సమాచారం.అయితే బాలిక కుటుంబసభ్యులు చాటింగ్ చూసి, తర్వాత రోజు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు, కొంతమంది గ్రామస్తుల సమ క్షంలో డ్రిల్ మాస్టర్‌ను నిలదీయడమే కాకుండా నందిగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉ పాధ్యాయు డు తరఫున వకల్తా పుచ్చుకుని రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నా.. ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. -
‘సాయం చేయరూ’... వాట్సప్‌పై దర్శన్?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య తరువాత దర్శన్ ఏం చేయాలో దిక్కుతోచక అనేక తప్పులు చేశాడు. అవన్నీ విచారణలో వెలుగు చూస్తున్నాయి. కేసు తనపైకి ఉండేందుకు ముగ్గురు రౌడీలకు రూ.30 లక్షలు ఇవ్వడం మొదలుకుని అనేక తప్పులు చేస్తూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు సాక్ష్యాధారాలుగా మారి ఆయన మెడకు చుట్టుకున్నాయి. రేణుకాస్వామి హత్య అనంతరం... కేసు నుంచి బయటపడేయాలని దర్శన్ పలువురు రాజకీయ నేతలను వాట్సాప్ ద్వారా కోరినట్టు పోలీసులు గుర్తించారు. దర్శన్‌ను అరెస్టు చేశాక అతని మొబైల్ స్వాధీనం చేసుకుని వాట్సాప్ కాల్స్మెసేజెస్ రిట్రీవ్ చేయగా ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి. -
వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
వాట్సప్ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాట్సప్ ఓపెన్ చేయగానే వాట్సప్ నిండా ఇబ్బడి ముబ్బడిగా ఉన్న మెసేజ్‌లు కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంటాయి.ఈ సమస్యను అదిగమించేందుకు వాట్సప్ యాజమాన్యం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనున్నట్లు వీబీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన బీటా వెర్షన్ యూజర్ల వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.ఇక ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే.. లేటెస్ట్గా వాట్సప్‌కు వచ్చే మెసేజ్‌లకు నోటిఫికేషన్ వస్తుంది. చదవని వాట్సప్ మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అవ్వనున్నాయి. -
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు. -
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్, అదెలా పనిచేస్తుందంటే?
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం మరో కొత్త ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టింది. 2021లో వాట్సాప్ ఫొటోలు, వీడియోల కోసం వ్యూ వన్స్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫీచర్ సాయంతో వీడియోలు, ఫోటోలు చూసిన వెంటనే వాటికంతట అవే అదృశ్యమవుతాయి. తాజాగా, అదే తరహాలో ఆడియో ఫైల్స్ అదృశ్యమయ్యేలా ఫీచర్‌ను వినియోగదారులకు అందించింది. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా వాట్సప్‌లో కుటుంబ సభ్యులు లేదంటే స్నేహితుల మధ్య జరిపిన వాయిస్ నోట్‌ను మీకు తెలియకుండా వేరే వాళ్లకు పంపే ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. తద్వారా మీరు పంపిన వాయిస్ మెసేజ్‌లు మూడు వ్యక్తికి చేరుతాయనే భయం పోనుంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా ఓ వాయిస్ మెసేజ్ పంపారు. అది అక్కడితోనే ఆగిపోవాలి. వేరే వాళ్లకు షేర్ కాకూడదు అంటే ఈ వ్యూవన్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. -
త్వరలోనే డిలీట్.. మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అలెర్ట్!
ఫేస్బుక్ (మెటా) సరిగ్గా మూడేళ్ల క్రితం చాట్ ఇంటిగ్రేషన్ అని ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ఫీచర్ సాయంతో యూజర్లు ఫేస్బుక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లోని వారి స్నేహితులతో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం మెటాలో సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. అయితే తాజాగా, ఆ ఫీచర్‌ను డిసెంబర్ నెలలో డిలీట్ చేస్తున్నట్లు మెటా ప్రకటించింది. మరి ఆఫీచర్ను ఎందుకు తొలగిస్తున్నారనే అంశంపై మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇటీవల యురేపియన్ యూనియన్‌కి చెందిన ప్రభుత్వ సంస్థ యూరోపియన్ కమిషన్ ‘యూరప్ డిజిటల్ మార్కెట్ యాక్ట్ (డీఎంఏ)’ లో కొన్ని మార్పులు చేసింది. వాటికి అనుగుణంగా ఆయా టెక్నాలజీ సంస్థలు మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల మధ్య క్రాస్ చాటింగ్ సదుపాయం ఉండేలా చూడాలని కోరింది. ఈ సమయంలో మెటా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. క్రాస్ చాటింగ్ సాదుపాయం లేకపోతే ‘క్రాస్ చాటింగ్ ఫీచర్‌ను తొలిగిస్తే యూజర్ల మధ్య మెసేజ్ పంపుకునే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు వీడియో కాల్స్ చేసుకునే వీలుండదు’ అని మెటా తెలిపింది. ఇప్పటికే యూజర్ల మధ్య జరిగిన చాటింగ్‌లు రీడ్-ఓన్లీ మెసేజ్లుగా మారిపోనున్నాయి. అంతేకాదు క్రాస్ చాటింగ్‌కు సంబంధం ఉన్న మెటా అకౌంట్స్‌ను తొలగిస్తామని వెల్లడించింది. ఒకవేళ యూజర్లు చాటింగ్ చేసుకోవాలంటే మెటా అకౌంట్స్ లేదా మెసేంజర్ నుంచి చాటింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. -
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నారా? ఆ మాయలో పడకండి
సోషల్ మీడియా ద్వారా చిన్న చిన్న అట్రాక్షన్స్కు లోనై ‘లవ్’ పేరుతో ట్రాఫికింగ్ బారిన పడుతున్న అమ్మాయిల వ్యథలు ఇటీవల ఎన్నో ఉంటున్నాయి. ఈ సమస్య సమాజంలో ఎలాంటి పరిణామాలను సృష్టిస్తుందో, ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెప్పే విషయాలను ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’’ మనం మాట్లాడుకోవాల్సిందే! ఆన్లైన్ లవ్ మాయలో పడొద్దు! ‘ప్రియ (పేరుమార్చడమైనది) కనిపించక రెండు రోజులవుతోంది. ఏం జరిగిందో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కంప్లైంట్ ఇచ్చిన ఒక రోజులోనే ప్రియని తీసుకొచ్చి, తల్లిదండ్రులకి అప్పజెప్పారు పోలీసులు. వారు చెప్పిన విషయం విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ప్రియ వయసు పదిహేనేళ్లు. పదో తరగతి చదువుతోంది. కరోనా టైమ్‌లో ఆన్లైన్ క్లాసెస్ కోసం తండ్రి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఇప్పటికీ ఆ ఫోన్ తనే వాడుతోంది. మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు విక్కీ. ఫ్రెండ్‌గా ఆమె మంచి చెడులు కనుక్కుంటూ, చాటింగ్ చేస్తూ ఉండేవాడు. మొదట వాయిస్ కాల్స్, ఆ తర్వాత వీడియో కాల్స్ మాట్లాడుతుండేవాడు. అతను చెప్పే ప్రేమ కబుర్లు ప్రియకు బాగా నచ్చాయి. అమ్మానాన్నలు ఎంతసేపూ చదువు చదువు అని అంటుంటారు. కానీ, వాటి గురించి విక్కీ మాట్లాడడు. ఒక్కరోజు విక్కీ చాట్ చేయకపోయినా, ఫోన్లో మాట్లాడకపోయినా ప్రియకు ఊపిరాడనట్లుండేది. విక్కీ ఏం చెప్పినా ప్రియ వెనకాడకపోయేది. రోజు రోజుకూ విక్కీ లేకపోతే తను బతకలేనని అనిపించసాగింది ప్రియకు. దీంతో ఓ రోజు విక్కీ చెప్పిన చోటుకు వెళ్లిపోవాలనుకుంది. దాంతో తల్లికి తెలియకుండా డబ్బులు తీసుకుని చెప్పకుండా వెళ్లిపోయింది. ఎవరికైనా చెబితే పరువు పోతుందనే భయం ఓ వైపు, కూతురు ఏమైందోననే భయం మరోవైపు వారిని కుదిపేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్‌తో.. ప్రియ ముంబైకి చేరుకున్నట్టు కనిపెట్టిన పోలీసులు, ఆమెను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. ఇలాంటి కథనాలు ఇటీవల మనం తరచూ వింటున్నాం. పెద్ద శిక్ష ♦ ఆన్లైన్లోనే కాదు బయట కూడా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి చిన్న చిన్న ఆకర్షణ పథకాలను అమలు చేసేవారుంటారు. ♦ మైనర్ అమ్మాయిలు/అబ్బాయిలు పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే కానుకలకు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. ♦ అవతలి వారు చెప్పేది నిజం అని నమ్మి, ఇంటిని వదిలి వెళ్లిపోతుంటారు. ♦ ఇంట్లో ప్రేమ దక్కలేదనో, మరో కారణం చేతనో బయటి వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతుంటారు. అలవాట్లు రుగ్మతలు అవుతున్నాయి. రుగ్మతలుగా మారడం వల్లే నేరాలు కూడా భిన్నంగా మారిపోయాయి. ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత పెరిగిందో, చెడు అంతకన్నా ఎక్కువ పెరిగింది. కొందరికి ఇదొక ఉపయోగకరమైన అడిక్షన్‌గా కూడా మారింది. ప్రతిదీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో అందరిలోనూ కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరిగాయి. దేనికోసం మనం ముందుకు వెళుతున్నాం అనే స్పష్టత ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. షార్ట్‌కట్స్‌లో సంపాదించాలనే ఆలోచన వల్ల కూడా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. చూడకూడనివి ఎక్కువ చూడటం వల్ల మనస్తత్వాలు మారుతున్నాయి. ఫోన్ చూడద్దని, ఇంటర్నెట్ చూడద్దని, ఎక్స్పోజర్ తగ్గించుకోమని చెప్పలేం. ఇవన్నీ మన జీవితంలో భాగమైనప్పుడు ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడం మాత్రమే ఈ రోజుల్లో కుటుంబాలకు అవసరం. ఈ రోజుల్లో మైనర్లు ఇంటర్నెట్లో ఎక్కువ ఉంటున్నారు. వారిని గమనిస్తూ, మంచి చెడులను చర్చిస్తూ ఉండాలి. ప్రేమ, పెళ్లి పేరుతోనో వెళ్లిపోయారని, వీటిని మిస్సింగ్ కేస్ కింద చూడం. కిడ్నాప్ కింద రిజిస్టర్ చేస్తాం. ట్రేస్ అవగానే రేప్ సెక్షన్స్ యాడ్ చేస్తాం. ఒక్కసారి పోక్సో కేసు కింద నమోదు చేసిన తర్వాత నేరస్తులకు శిక్ష భారీ ఎత్తున పడుతుంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ కింద కేస్ బుక్ అవుతుంది. మైనర్ని తీసుకువెళ్లి, పెళ్లి చేసుకున్నా అది చట్టరీత్యా నేరం. మైనర్ అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరు మిస్ అయినా దానిని ట్రాఫికింగ్‌కు సంబంధించిన సెక్షన్స్ కింద కేస్ రిజిస్టర్ చేస్తాం. రూరల్, అర్బన్ ఏరియాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆన్లైన్ ప్రేమల జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. – సుమతి, ఐపీఎస్, డీఐజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ ఇదొక వ్యసనం పరిచయం లేని వ్యక్తులు తమ పట్ల చూపే కన్సర్న్ని నిజమైన ప్రేమ అనుకొని భ్రమిస్తుంటారు కొందరు. ఈ మోహం ఆమె/ అతడి ఆరోగ్యం, భవిష్యత్తు సంబంధాలను ప్రభావితం చేస్తుంది. న్యూరలాజికల్ కెమికల్ అయిన ఫినైల్ ఇథైలమైన్ పెరగడం వల్ల ప్రేమభావాలు కలుగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మోహానికి గురైన వ్యక్తులు ఆల్కహాల్, డ్రగ్స్ వంటి అలవాట్లకు కూడా లోనవుతుంటారు. వారిలో ఆనందపు స్థాయులను పెంచుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందుకు సినిమాలు, ఇంటర్నెట్ పోర్న్ సదుపాయాలు కూడా పిల్లల మెదళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇదొక వ్యసనం అని చాలామంది గుర్తించరు. ఆన్లైన్ రిలేషన్షిప్స్ తల్లిదండ్రులకు తెలియడం లేదు. పిల్లల ఆన్లైన్ నెట్వర్కింగ్ గురించి తల్లితండ్రులకు, కౌన్సెలింగ్ థెరపీ ద్వారా పిల్లల్లోనూ మంచి మార్పులు తీసుకురావచ్చు. స్కూళ్లు, కాలేజీల్లో కూడా ‘లవ్, రిలేషన్షిప్స్’ డిజిటల్ వాడకం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విషయాల పైన అవగాహన తరగతులు తీసుకోవాలి. – డాక్టర్ గిడియన్,డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి -
సెల్ నెంబరే కీలకం!
బంజారాహిల్స్: సినీ ఫక్కీలో జరిగిన జూబ్లీహిల్స్ దొంగతనం కేసులో నిందితుడి జాడ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఒక వైపు టాస్‌్కఫోర్స్ పోలీసులు, ఇంకోవైపు క్రైం పోలీసులు ఎనిమిది బృందాలుగా రాష్ట్రంతో పాటు సరిహద్దులు, ఇతర రాష్ట్రాలను జల్లెడపడుతున్నాయి. ఎనిమిది గంటల పాటు గర్భిణిని బంధించి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలతో ఉడాయించిన ఘటనలో నిందితుడు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ కీలకంగా మారనుంది. మూడుచోట్ల ఈ సెల్‌ఫోన్ వినియోగించడంతో పోలీసులు టవర్‌డంప్ చేస్తూ నిందితుడు ఎవరెవరితో మాట్లాడాడు.. ఫోన్ నెంబర్ ఏంటి అన్నదానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితుడి ఆచూకీ పట్టుకునే దిశలో పోలీసులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. వైన్ బాటిల్ ఖాళీ చేశాడు... జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లో నివసించే ప్రముఖ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణ రాజు అలియాస్ ఎన్ఎస్ఎన్.రాజు ఇంట్లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎన్ఎస్ఎన్ రాజు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించాడు. అదే సమయంలో శుభకార్యం ముగించుకొని ఇంటికి వచ్చి న రాజు..ఆయన పెద్ద కూతురు అత్త, మామలు ఇంట్లోకి రాగా వారి వెనుకాలనే నిందితుడు కూడా ప్రవేశించాడు. కొద్దిసేపటికే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి అక్కడ నిల్చున్న ఆగంతకుడిని చూసి ఎన్ఎస్ఎన్.రాజు పెద్ద కూతురి అత్త, మామల డ్రైవర్ అని భ్రమపడి లోనికి వెళ్లిపోయింది. కొద్దిసేపట్లోనే పెద్ద కూతురు అత్తమామలు వెళ్ళిపోగా రాజు ఆయన భార్య లీల తమ గదిలో నిద్రించారు. మరో గదిలో చిన్న కూతురు నవ్య వర్క్‌ఫ్రం హోం ముగించుకొని రాత్రి 1.30 గంటల సమయంలో వాట్సాప్ మెసేజ్ చూస్తుండగా ఆగంతకుడు ఆమె బెడ్రూమ్లోకి ప్రవేశించాడు. అరిస్తే పొడిచేస్తానంటూ కత్తి చూపి బెదిరించాడు. దీంతో ఆమె నోరు మెదపలేదు. తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఇంట్లో అరకిలో ఆభరణాలు ఉన్నాయని, తన చెవులకు రూ.15 లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన కమ్మలు ఉన్నాయని, అవి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేయగా తనకు కేవలం డబ్బులే కావాలని, నగలు కాదని చెప్పాడు. ఓ వైపు ఆమెతో మాట్లాడుతూనే ఇంకోవైపు ఇంట్లోనే ఉన్న వైన్ తాగుతూ..ఆమెతో ముచ్చటిస్తూ మరో వైపు తన ఫోన్లో చాటింగ్‌చేస్తూ ఇంకోవైపు రూ.20 లక్షలు ఎలాగైనా తెప్పించాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు. మాట వినకపోతే పొడుస్తానంటూ తరచూ ఆమెను బెదిరించసాగాడు. ఆమె ఇంటి విషయాలపై కూడా చర్చించాడు. మీ అక్క నాలుగేళ్ల కూతురు ఉండాలి కదా..ఆమె ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. మీ గుట్టు మొత్తం నాకు తెలుసు డబ్బులు లేవంటే నమ్మను అంటూ లీలను హెచ్చరించాడు. ఇంట్లో నుంచే ఫోన్లో చాటింగ్ చేస్తూ వారితో మాట్లాడుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ కుటుంబ వివరాలు కనుక్కుంటూ డబ్బులు వచ్చేదాకా కాలంగడిపాడు. రెక్కీ నిర్వహించిన సమయంలో రోడ్డుపై ఒకసారి నిందితుడు ఫోన్లో మాట్లాడినట్లుగా ఇక్కడ సీసీ ఫుటేజీలు స్పష్టం చేస్తున్నాయి. ఇంట్లో ఛాటింగ్ చేసిన విషయం కూడా బాధితురాలు తెలిపింది. షాద్‌నగర్‌లో కారు దిగి బస్టాప్‌కు వెళ్లే క్రమంలో ఓ చోట ఆగి ఫోన్ మాట్లాడినట్లుగా అక్కడి సీసీఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. ఈ మూడు సంఘటనల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పైనే పోలీసులు ప్రధానంగా దృష్టిపెట్టారు. తనది నాందేడ్ అని నిందితుడు చెప్పిన క్రమంలో ఓబృందం అటు వైపు వెళ్ళింది. మరో బృందం బెంగళూరుకు, గోవాకు, ముంబైకి వెళ్ళింది. -
డాక్టర్‌ను బురిడీ కొట్టించిన అమెరికా యువతి
సాక్షి, చైన్నె: ప్రేమ, పెళ్లి పేరిట పుదుచ్చేరికి చెందిన వైద్యుడిని అమెరికాకు చెందిన ఓ యువతి బురిడీ కొట్టించింది. అతడి వద్ద నుంచి రూ. 37 లక్షలు తస్కరించి స్విచ్ ఆఫ్ చేసింది. వివరాలు.. ఆలస్యంగా మేల్కొన్న డాక్టర్ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. పుదుచ్చేరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాలాజీ(34) డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండో వివాహం చేసుకునేందుకు నిర్ణయించిన బాలాజీ తన వివరాలను ఓ వివాహ వెబ్సైట్లో పెట్టాడు. దీనిని చూసి అమెరికాలోని సోము శ్రీనాయర్ అనే యువతి బాలాజీకి దగ్గరైంది. ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకున్నారు. చాటింగ్‌లు చేసుకున్నారు. పరస్పరం తమ భావాలను అంది పుచ్చుకున్నారు. ఇద్దరు వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో అమెరికాలో తనకు హఠాత్తుగా రెండు సార్లు ఆర్థిక సమస్యలు ఎదురు కావడంతో ఆ యువతి బాలాజీని సాయం కోరింది. తనకు కాబోయే భార్యను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రూ. 37 లక్షలు అందజేశాడు. అయితే గత నాలుగైదు రోజులుగా సోమ శ్రీ నాయర్ ఫోన్ స్పందించక పోవడం, సామాజిక మాధ్యమాల్లోని పేజీలను ఆమె బ్లాక్ చేసి ఉండటంతో తాను మోస పోయినట్లు గ్రహించిన డాక్టరు పోలీసులను ఆశ్రయించాడు. -
ఏఐ పై ఎలాన్ మస్క్ ఆందోళన, త్వరలో ‘ట్రూత్‌జీపీటీ’...
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాటింగ్ టెక్నాలజీ పెరిగిపోతుండడం పట్ల ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కార్లు, రాకెట్ల కంటే ఏఐ మరింత ప్రమాదకరం. దీనివల్ల మానవాళికి ముప్పు తప్పదు. మానవాళిని నిర్వీర్యం చేసే శక్తి ఏఐకి ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఏఐ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దానికి ప్రత్యామ్నాయంగా ‘ట్రూత్‌జీపీటీ’ పేరిట సొంత చాట్‌బాట్ తెస్తామన్నారు. మానవాళిని ధ్వంసం చేసే టెక్నాలజీ వద్దని, అర్థం చేసుకొనేది కావాలని అన్నారు. కృత్రిమ మేధను నియంత్రించే వ్యవస్థ ఉండాలన్న ప్రతిపాదనను సమర్థించారు. -
నాపై కుట్రలు చేశారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాలు, ఇటు జిల్లా ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. కాగా, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మంగళవారం స్పందించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, బురద జల్లేందుకే కొందరు సోషల్ మీడియా వేదికగా కుట్రలు చేశారని ఆరోపించారు. వారి వివరాలను బయటపెడతానని స్పష్టం చేశారు. మూడు రోజులుగా సోషల్ మీడియా లో యువతుల కోసం చాటింగ్ పేరుతో వైరలైన ఫొటోలతో తనకు సంబంధంలేదని తెలిపారు. డెయిరీ విస్తరణ కోసం ఎమ్మెల్యేగా పిలిస్తే వెళ్లానని, అంతకుమించి తనకు ఏం తెలియదన్నారు. బాధిత రైతులు నిర్వాహకులపై కేసులు పెట్ట గా, కొందరు కావాలనే తనపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. డెయిరీ నిర్వాహకులపై ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనే పలుచోట్ల కేసులు ఉన్నాయని చెప్పారు. మరోవైపు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని డెయిరీలో పనిచేసిన ఓ ఉద్యోగి, పలువురు రైతులు నిర్వాహకులపై ఆరోపణలు చేశా రు. కాగా, డెయిరీ భాగస్వామి షెజల్ మంగళవారం మరో వీడియోను విలేకరులకు విడుదల చేశారు. ‘మేం బ్లాక్మెయిల్ చేస్తున్నామంటున్నారు, ఇంతటి తో ఆపేస్తే ఆయనకు మంచిది, లేదంటే నిజాల్ని బయటపెడతా’ అని వీడియోలో పేర్కొన్నారు. -
దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని..
బెంగళూరు: అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడ్ని దారుణం హత్య చేశారు నలుగురు వ్యక్తులు. కర్రతో కొట్టి అతడ్ని హతమార్చారు. కర్ణాటక బెంగళూరులో ఈ పాశవిక ఘటన వెలుగుచూసింది. మృతుడి పేరు గోవిందరాజు. కొద్దిరోజులుగా ఓ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అనిల్ అనే వ్యక్తి అతనిపై కక్ష పెంచుకున్నాడు. పథకం పన్ని అతడ్ని ఇంట్లో నుంచి బయటకు పిలిపించాడు. బైక్‌పై అంద్రల్లి తీసుకెళ్లాడు. అనంతరం లోహిత్, భరత్, కిశోర్ కూడా అంద్రల్లి వెళ్లారు. నలుగురు కలిసి గోవిందరాజుపై విచక్షణా రహితంగా కర్రతలో దాడి చేశారు. అతడ్ని చావబాదారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం గోవిందరాజు మృతదేహాన్ని లోహిత్ కారులో దాచారు. తర్వాత తీసుకెళ్లి ఛార్ముడిఘాట్ ప్రాంతంలో పడేశారు. సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. అయితే గోవిందరాజు కన్పించడం లేదని అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్లు నేరం అంగీకరించారు. వారు చెప్పిన వివరాలతో గోవిందరాజు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు -
భలే భలే..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం కొత్త కొత్త అప్డేట్లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. వినియోగదారులు ఇప్పటి వరకు వారి వాట్సాప్ స్టేటస్‌లో ఫోటోలు, వీడియోలు మాత్రమే పోస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో వాయిస్ నోట్‌ను సైతం వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చని వాట్సాప్ అప్డేట్స్ ఇచ్చే వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. యూజర్లు స్టేటస్‌లో టెక్ట్స్‌తో పాటు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఫోన్ వాట్సాప్ కీబోర్డులో టెక్ట్స్ టైప్ చేసే ఐకాన్ కింద భాగంలో మైక్రోఫోన్ సింబల్‌పై క్లిక్ చేస్తే వాయిస్ చెప్పొచ్చని, అదే వాయిస్‌ను స్టేటస్‌గా పెట్టుకోవచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. దీంతో పాటు వాట్సాప్ కాల్స్ ట్యాబ్‌ను డెస్క్‌టాప్ వెర్షన్ తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది వినియోగంలోకి వస్తే యూజర్లు ఇప్పుడు డెస్క్‌టాప్ యాప్ నుండి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ యాప్‌లో కాల్ హిస్టరీ, కాల్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్ ఉండగా.. త్వరలో యూజర్లందరికి వినియోగంలోకి రానుంది. -
Hyderabad: అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్‌గా వారితో చాటింగ్
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్ క్రియేట్ చేసి, అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్‌గా వారితో చాట్ చేస్తూ... నగ్నంగా వీడియో కాల్ మాట్లాడించి బ్లాక్ మొయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్న ఓ కేటుగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్ కాలనీలో నివాసం ఉండే కూచికుల సాయకృష్ణారెడ్డి (31) నగరంలో ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇన్‌స్ట్రాగామ్ ద్వారా అమ్మాయి పేరుతో ఇతరులను పరిచయం చేసుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నానని పేర్కొని ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు. దీంతో నగరానికి చెందిన ఓ యువకుడు చాట్ చేయగా, అతడితో అతను నగ్న వీడియో కాల్ చేయడానికి ప్రేరేపించాడు. అనంతరం సెల్‌ఫోన్ స్కీన్ రికార్డ్ చేసి దాని వీడియో క్లిప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. చదవండి: ఐదేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని యువతిని అడిగితే.. -
నూటొక్క జిల్లాల.. కేటుగాడు!
అతను ఉన్నత చదువులు చదివాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశాడు. అయితే తన ప్రతిభను, అర్హతలను సక్రమంగా కాకుండా వక్రమార్గంలో వాడాడు. కొన్నేళ్ల క్రితం మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకుని, చాటింగ్‌తోనే చీటింగ్ చేసి రూ.లక్షలు కొట్టేశాడు. చాలా సులువుగా డబ్బులు రావడంతో అప్పటినుంచి అదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచి.. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో యువతులకు వల వేసి మోసాలకు పాల్పడ్డాడు. అంతేకాదు.. గంజాయి స్మగ్లింగ్, నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఉద్యోగాల పేరిట మోసాలు.. ఇలా అతని నేరాల చిట్టా చేంతాడంత ఉంది. చివరకు పోలీసుల చేతికి చిక్కడంతో అతగాడి లీలలకు తెరపడింది. చిత్తూరు అర్బన్: పెళ్లికాని యువతులను మ్యాట్రిమోనీ (వివాహ సంబంధాల) వెబ్సైట్ల ద్వారా పరిచయం చేసుకుని, వారి నుంచి రూ.లక్షలు కాజేసే కేటుగాడిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలు సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్ (33) డిగ్రీ వరకు అద్దంకిలో చదివి, హైదరాబాద్‌లో ఎంసీఏ చేశాడు. ఆపై ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్ చేస్తూ మధ్యలో మానేశాడు. కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేశాడు. 2017లో ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తన ఫొటో ఉంచగా.. ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో ఆన్లైన్ చాటింగ్ చేసి రూ.లక్షలు కాజేశాడు. కష్టపడకుండానే డబ్బులు రావడంతో ఇదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచిపెట్టి.. విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టేవాడు. నకిలీ పేర్లతో పెళ్లికాని యువతులతో ఆన్లైన్లో చాటింగ్ చేయడం, పరిచయం పెరిగాక మాయమాటలు చెప్పి వారితో డబ్బులు తన బ్యాంకు ఖాతాలోకి వేయించుకునేవాడు. అలా.. 2017లో ఒంగోలుకు చెందిన ఓ టెకీ యువతి వద్ద రూ.27 లక్షలు, 2018లో నరసరావుపేటకు చెందిన మరో టెకీ యువతి వద్ద రూ.40 లక్షలు కాజేసి రెండు సార్లు అరెస్టు కూడా అయ్యాడు. జైలు జీవితం అనుభవించినా శ్రీనివాస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. రెండు నెలల క్రితం చిత్తూరుకు చెందిన ఓ యువతిని మ్యాట్రిమోనీ ద్వారా మోసం చేసి రూ.1.4 లక్షలు, మదనపల్లెలో మరో యువతిని మోసం చేసి రూ.7 లక్షలు కాజేశాడు. బాధిత యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికోసం గాలిస్తుండగా.. చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డు వద్ద నాలుగు కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. విచారణలో శ్రీనివాస్ లీలలు వెలుగుచూశాయి. నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేయడం లాంటి నేరాల చిట్టా బయటపడింది. నిందితుడి నుంచి రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. -
నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది
ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ చాటింగ్‌లు, బ్రౌజింగ్‌లు.. నిద్రను దోచుకుని, శరీరంలో ప్రతికూలమైన మార్పులు తెచ్చిపెడుతున్నాయి. నిద్రలేమితో ముఖం పాలిపోయి..కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి.. ఎంతటి కళ గల ముఖమైనా డల్‌గా మారిపోతుంది. నిజానికి సరైన నిద్రే సౌందర్య రహస్యం అంటారు నిపుణులు. దానికి చక్కని బహుమతి..హ్యాండ్ హెల్డ్ స్లీప్ ఎయిడ్ ఇస్ట్రుమెంట్. కంటినిండా నిద్రను తెచ్చి..ముఖ వర్చస్సును పెంచుతుంది. చిత్రంలోని ఈ మైక్రో–కరెంట్ స్మార్ట్ హిప్నాసిస్ ఇస్ట్రుమెంట్..హైటెక్నాలజీతో రూపొందింది. ఈ పరికరం ప్రధానంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది. ఈ డివైజ్‌ని చేతితో పట్టుకుని, రిలాక్స్డ్గా కళ్లు మూసుకుంటే చాలు.. మెదడులోని కండరాలను ఉత్తేజపరచి.. కళ్ల మీద నిద్రను మోసుకొస్తుంది. ఇది సురక్షితమైనది.. తేలికైనది..పరిమాణంలో చిన్నది. పోర్టబుల్ మాత్రమే కాదు సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్ మోడ్స్ ఉంటాయి. తక్కువ ఫ్రీక్వెన్సీకి డికంప్రెషన్ మోడ్, హై ఫ్రీక్వెన్సీకి ఎగ్జిటేషన్ మోడ్ నొక్కాలి. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్ మైనస్ బటన్ నొక్కాలి. ఈ స్లీప్ ఎయిడ్ పరికరాన్ని ఆఫీసులో ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సుమారు 15 నిమిషాలు వాడితే.. తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. దీన్ని చేతికి బ్రేస్లెట్లా వేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన బ్యాండ్ ఉంటుంది. ఆ పరికరాన్ని చేతికి పెట్టుకొని నిద్రపోతే తెల్లవారాక.. ఆ రోజు ఉల్లాసంగా.. ఉత్సాహంగా మొదలవుతుంది. దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే సుమారు రూ. 2,200. -
మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్
అనంతపురం క్రైం: సామాజిక మాధ్యమాల వినియోగం ఏ స్థాయిలో పెరుగుతోందో.. సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. కొందరు మోసగాళ్లు వాట్సాప్, ఫేస్బుక్ సామాజిక మాధ్యమాల ద్వారా వల వేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి.. మాయ‘లేడి’ ఉచ్చులో చిక్కి రూ.23 లక్షలు నష్టపోయాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సదరు వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం అతని సెల్‌ఫోన్‌కు ‘హాయ్’ అంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. కొత్త నంబర్ కావడం, అందులోనూ అందమైన అమ్మాయి ప్రొఫైల్ పిక్చర్ ఉండడంతో అతను స్పందించాడు. కొన్ని రోజుల పాటు వారి మధ్య సంభాషణ నడిచింది. తరచూ వాట్సాప్ కాల్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే మాయ‘లేడి’ నగ్నంగా వీడియో కాల్స్ చేసింది. తానేం తక్కువ కాదంటూ అతనూ రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే ఉచ్చులో చిక్కుకున్నాడు. అతని నగ్న వీడియోలను అధిక సంఖ్యలో సేకరించిన మాయ‘లేడి’ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, బంధువులకు పంపుతానంటూ బెదిరించింది. డబ్బు డిమాండ్ చేయడంతో పలు దఫాలుగా రూ.23 లక్షల దాకా సమర్పించుకున్నాడు. అయినప్పటికీ బెదిరింపులు ఆగలేదు. దీంతో విసిగిపోయిన అతను చివరకు పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ మిత్రకు ఫిర్యాదు చేయండి సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైబర్ మోసాలకు గురైన వారు స్థానిక పోలీసు స్టేషన్లో గానీ, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్(9121211100)కు గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో బ్యాంకు, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎవరైనా అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని పేర్కొన్నారు. ఇవీ చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. సీక్రెట్ యాప్‌తో భార్య ఫోన్ ట్యాపింగ్.. ఆమెపై నీడలా భర్త -
ఓయో రూమ్‌కు వస్తే ఉద్యోగం ఇస్తా..
సాక్షి, బంజారాహిల్స్: ఉద్యోగం కావాలంటే ఓయో రూమ్‌కు రావాలంటూ ఓ ఉద్యోగి అసభ్యంగా చాటింగ్ చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి(28) వారం క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని ఓ ఇమ్మిగ్రేషన్ సంస్థలో ఉద్యోగానికి హాజరైంది. ఇక్కడ పని చేస్తున్న మాజీ మేనేజర్ సుమంత్ మూడ్రోజుల క్రితం ఆమెతో చాటింగ్‌లో చేయసాగాడు. ఓయో రూమ్ బుక్ చేశానని ఉద్యోగం అక్కడే ఇస్తానంటూ చెప్పాడు. ఆందోళన చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ఇమ్మిగ్రేషన్ సెంటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుమంత్‌పై పోలీసులు ఐపీసీ 509 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ ) -
ఇన్‌స్టా పరిచయం.. పోలీస్ స్టేషన్లో పంచాయితీ
మంచిర్యాలక్రైం: వారిద్దరికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. యువతీ, యువకుడి పరిచయం కాస్త స్నేహంగా మారి.. చివరికి పోలీస్‌స్టేషన్‌కు చేరిన సంఘటన జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తల్లి రాధ తెలిపిన కథనం ప్రకారం.. భూపాలపల్లికి చెందిన ఓరుగంటి ఉదయ్‌కిరణ్ మంచిర్యాలలోని హైటెక్ సిటీలో గిటార్ నేర్పిస్తుంటాడు. అతడికి ఇన్స్ట్ర్రాగ్రామ్లో ఓ యువతితో పరిచయం అయింది. వాళ్లిద్దరు కొంత కాలంగా వాట్సాప్ మెస్సేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకోవడంతో పాటు ఫోన్‌కాల్స్ మాట్లాడుకున్నారు. గత నెల 17న సదరు యువతి ఇంటికి రమ్మని తన కొడుకుని ఆహ్వానించిందని ఉదయ్‌కిరణ్ తల్లి రాధ ఆరోపిస్తోంది. ఇంటికి వెళ్లిన ఉదయ్‌కిరణ్‌తో యువతి సెల్ఫీలు కూడా దిగిందని అనంతరం తన మేనమామలు, తమ్ముడు, అమ్మతో కలిసి ఉదయ్‌కిరణ్‌ను బంధించి పెళ్లి చేసుకోవాలని బెదిరించడమే కాకుండా దాడి చేయించిందని ఆరోపించింది. అనంతరం ఉదయ్‌కిరణ్‌ను పోలీసులకు అప్పగించారని, పోలీసులకు తాను ఫిర్యాదు చేస్తే తిరస్కరిస్తున్నట్లు రాధ పేర్కొంది. ఈ విషయమై సీఐ ముత్తి లింగయ్యను వివరణ కోరగా ఉదయ్‌కిరణ్ తల్లి రాధ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సదరు యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్‌కిరణ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చదవండి: కొత్త నిబంధనలతో పెళ్లిళ్ళు సాధ్యమయ్యేనా? -
మరో అమ్మాయితో భర్త చాటింగ్.. భార్య ఆత్మహత్య
సాక్షి, రామచంద్రాపురం(పటాన్చెరు): మరో అమ్మాయితో భర్త రహస్యంగా వాట్సప్ చాటింగ్ చేస్తున్నాడనే మనస్తాపం చెంది ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంఘటన రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లికార్జున నగర్లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన రామలక్ష్మి(25) మూడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డితో వివాహం జరిగింది. జీవనోపాధికై రామచంద్రపురం వలస వచ్చారు. వెంకట్ రెడ్డి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహ సమయంలో కట్నం కింద ఎకరం భూమి, 50 గ్రాముల బంగారం, నగదును ఇచ్చారు. వివాహం జరిగిన సమయంలో ఇద్దరు మంచిగానే కాపురం చేశారు. వారికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. మృతురాలి భర్త వెంకట్ రెడ్డి ఆయన పని చేసే కంపెనీలో ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరుచుకున్నాడు. రహస్యంగా వాట్సాప్ లో ఆమెతో చాటింగ్ చేసేవాడు. ఈ విషయంలో గతంలో మృతురాలు రామలక్ష్మి భర్త వెంకట్ రెడ్డిని నిలదీసింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. చదవండి: విషాదం.. పెళ్లయిన ఆర్నెళ్లకే ఈ విషయంలో కూతురు సంసారం పాడవుతుందన్న ఆలోచనతో అల్లుడికి నచ్చజెప్పారు. ఆ సమయంలో తను చాటింగ్ చేయనని హామీ ఇచ్చాడు. కాగా మృతురాలు రామలక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా పుట్టింటికి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చింది. ఆ సమయంలో భర్త తిరిగి అమ్మాయితో చాటింగ్ చేసిన మెసేజ్‌ను చూసి ఆ మెసేజ్‌లను తన చెల్లికి పంపించింది. తన చెల్లికి ఫోన్ చేసి బావ మారలేదని, తిరిగి ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని ఆ బాధ భరించలేక చనిపోతున్నా అని ఫోన్ పెట్టేసింది. తిరిగి చెల్లెలు ఫోన్ చేసినా తీయకపోవడంతో తల్లిదండ్రులకు తెలియజేసింది. కాగా సోమవారం తెల్లవారుజామున అల్లుడు వెంకట్ రెడ్డి తమకు ఫోన్ చేసి తమ కూతురు రామలక్ష్మి పడక గదిలో ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారని తెలిపారు. తమ అల్లుడు మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి తన కూతురు ఉరి వేసుకుని చనిపోయిందని అల్లుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో విషాదం ఒంటికి నిప్పంటించుకొని.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): నిప్పంటించుకొని మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సదాశివపేట పట్టణంలోని దత్తత్రేయనగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివపేట పట్టణంలోని దత్తాత్రేయనగర్ కాలనీకి చెందిన గాండ్ల శ్రీలత (35)కు కూకట్‌పల్లిలోని నిజాంపేట్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. శ్రీలత కంది మండలం ఎర్థనూర్, మామిడిపల్లి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించింది. ఆదివారం రాత్రి పుట్టింటికి వచ్చిన ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సోమవారం సదాశివపేట పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మైనర్‌తో అసభ్య చాటింగ్
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికతో అసభ్యంగా చాటింగ్ చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన యువకుడిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ ప్రారంభించిన భోపాల్ పోలీసులు శనివారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం గంగన్నగూడ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డిని అరెస్టు చేశారు. భోపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ మైనర్ బాలికకు సాయినాథ్‌రెడ్డి నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో సదరు బాలిక అక్టోబర్‌లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. (చదవండి: తోబుట్టువుల మధ్య పెళ్లి ఆమోదయోగ్యం కాదు:హైకోర్టు) పోలీసులు ఫేస్బుక్ చాటింగ్ ఆధారంగా విచారణ చేపట్టగా, కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక ఫేస్బుక్ ఐడీ నుంచి మెసేజ్‌లు వస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన బాలికను విచారించగా.. తన ఫేస్బుక్ ఖాతాను సాయినాథ్‌రెడ్డి సాయంతో తెరిచానని చెప్పడంతో శనివారం పోలీసులు సాయినాథ్‌రెడ్డిని అరెస్టు చేసి భోపాల్ తీసుకెళ్లారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతామని వారు తెలిపారు. కాగా తనను అనుమానిస్తున్నారని భావించిన ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన బాలిక శనివారం శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం శంషాబాద్ లీమ్స్ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో..) -
‘కరోనా’ ఆటవిడుపు
సాక్షి, హైదరాబాద్: కాసేపు మన గురించి మనం ఆలోచించుకునేంత తీరికే లేనంతగా భవిష్యత్తు ప్రణాళికలతో తలమునకలు.. కొత్త అభిరుచులు, అలవాట్లకు అవకాశమే లేనంతగా ఉరుకులు పరుగుల జీవనం.. ఇష్టమైన పుస్తకాలు చదవడం, సంగీతం నేర్చుకోవడం, పాటలు పాడటం, గార్డెనింగ్, ఫొటోగ్రఫీ.. ఇవన్నీ చేయాలని, నేర్చుకోవాలని ఉన్నా అందుకు టైమివ్వని రోజువారీ ఒత్తిళ్లు.. బలవంతంగా మనసులోనే అణచివేసుకున్న చిన్నచిన్న కోరికలు.. ఇవన్నీ నెరవేర్చుకోవడానికి ఇప్పుడు ‘కరోనా లాక్డౌన్’ రూపంలో టైమొచ్చింది. మే నెల 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖాళీ సమయాన్నెలా గడపాలి? భారంగా గడుస్తోన్న సమయాన్ని ఇష్టంగా ఎలా మలచుకోవాలనే ఆలోచనలు ప్రజల్లో కొత్త మొగ్గలు తొడుగుతున్నాయి. దగ్గర చేస్తున్న ‘వీడియో కాలింగ్’ సుదీర్ఘ లాక్‌డౌన్‌తో బయటకు వెళ్లలేక, ఆత్మీయులు, స్నేహితులను కలుసుకోలేక, కబుర్లు లేక ఇబ్బంది పడుతున్న వారు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోని సన్నిహితులు, కుటుంబసభ్యులు, స్నేహితులతో ఒకేసారి కొన్ని బృందాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌గా మారింది. ప్రధానంగా అమెరికా, ఇతర పశ్చిమదేశాల్లోని తెలుగువారు ఇక్కడున్న తమ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు, సన్నిహితులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ ఆపత్కాల సమయంలో దూరంగా ఉన్న వారిని, వివిధచోట్ల ఉంటున్న తమ వారిని ఈవిధంగా ఒకేసారి చూసి ఆనందంతో పెద్దవయస్కులు తబ్బిబ్బవుతున్నారు. అక్కడ మొదలైన ఈ ట్రెండ్‌ను మన యువత సైతం అందిపుచ్చుకుని స్నేహితులు, బంధువులతో లైవ్‌లో వీడియో కాన్ఫరెన్సింగ్ చేస్తున్నారు. వాట్సాప్ చాటింగులు ఎదురెదురుగా కబుర్లాడుకునే ముచ్చట తీరుస్తున్నాయి. తమలోని అభిరుచులు, కొత్త టాలెంట్లను పంచుకోవడానికి వాట్సాప్ వేదికవుతోంది. సెల్ఫోన్లు క్షేమసమాచారాలను చేరవేస్తూ, ఆరాతీస్తూ క్షణం తీరికలేకుండా మోగుతున్నాయి. లైఫ్‌లైన్ మారుస్తున్న ‘ఆన్లైన్ పాఠాలు’ లాక్‌డౌన్‌తో జాగింగ్, యోగా వంటివి చేయలేకపోతున్నామని భావిస్తున్న వారికి ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఆ లోటు తీరుతోంది. తాను నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాస్‌లకు మంచి స్పందన వస్తోందని యోగా ట్రైనర్ హర్షిత సోని చెబుతున్నారు. రచనలు, తమలోని భావాలకు అక్షరరూపం ఇవ్వడం ఎలా? అన్న దానిపై ఆన్లైన్ కోర్సు నిర్వహిస్తున్న భావన.. లాక్డౌన్ సమయంలో దీనికి మంచి స్పందన వచ్చిందని, ఇందులో అందరి ఇంటరాక్షన్ పెరుగుతోందన్నారు. కాగా, పర్ఫెక్ట్ కాఫీ రుచి కోసం ఏం చేయాలి, ఏయే పద్ధతులను అనుసరించాలనే అంశంపై రోస్టరీ కాఫీ హౌస్‌కు చెందిన నిషాంత్ పర్సనల్ ఆన్లైన్ క్లాసులు నడుపుతున్నారు. కాఫీ చేయడంలో మెలకువలు, రహస్యాలను ఈ క్లాసుల్లో ఆయన ఆన్లైన్లో వివరిస్తున్నారు. వంట, పాట, సంగీతం, చదువు.. కొత్త వంటకాలు, కొత్త భాషలు, మ్యూజిక్ నేర్చుకోవడం, యోగా, జాగింగ్ వర్కవుట్స్, నృత్యం, పెయింటింగ్ వేయడం వంటి అభిరుచులు నెరవేర్చుకోడానికి యూట్యూబ్ ఒక భాండాగారంగా ఉపయోగపడుతోంది. పలువురు యూట్యూబ్ నుంచి తమ అభిరుచులు, కోరికలు తీర్చుకునేందుకు, కొత్త టెక్నిక్‌ల సాధనపై దృష్టి నిలిపారు. ఇంకొందరు ఔత్సాహికులు సొంత బ్లాగ్‌లను ప్రారంభిస్తున్నారు. పుస్తక పఠనం, టీవీ క్షణం, పక్షులను చూడడం, సంగీత సాధన, పాటలు పాడటం, కథలు–కవిత్వం రాయడం, ఇండోర్‌గేమ్స్, మొక్కల పెంపకం, ఫొటోగ్రఫీ వంటి వాటిలో మరికొందరు నిమగ్నమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇంకా సిలబస్ పూర్తికాక, అనుకున్న సమయానికి వార్షిక పరీక్షలు జరగక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు వరంగా మారాయి. ఆన్లైన్లో వీడియో, ఆడియో రూపాల్లో పాఠాలు వినడంతో పాటు పీడీఎఫ్ ఫార్మాట్లో అందుబాటులో ఉన్న నోట్స్ డౌన్లోడ్ చేసుకుని చదువులో వెనకబడకుండా జాగ్రత్తపడుతున్నారు. -
చాటింగ్ ట్రీట్మెంట్!
‘హలో డాక్టర్.. నేను గత రెండు రోజులుగా జలుబు, తలనొప్పితో బాధపడుతున్నాను. సరైన మందులు సూచించగలరు.. అంటూ ఓ పేషెంట్ వాట్సాప్ సందేశం.ఓకే... మీరు రెండురోజుల పాటు ఫలానా యాంటీబయాటిక్స్ వాడండి. అప్పటికీ తగ్గకుంటే క్లినిక్‌కు రండి.. అంటూ డాక్టర్ రిప్లై. సాక్షి, హైదరాబాద్ :ఇదే చాటింగ్ ట్రీట్మెంట్ అంటే.. గ్రేటర్లో ఇటీవల ఇది క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా ఐటీ కారిడార్‌లో పలు ఐటీ, బీపీఓ, కెపీఓ కంపెనీల్లో ఈ ట్రెండ్ క్రమంగా విస్తరిస్తోంది. తలనొప్పి, కడుపునొప్పి, మైగ్రేన్, వంటి నొప్పులు, వైరల్ ఫీవర్, జలుబు.. తదితర స్వల్పకాలిక అనారోగ్యాలకు మాత్రమే ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలాచేస్తే ఉద్యోగుల సమయం చాలా ఆదా అవుతోందని వారిలో పని సామర్థ్యం పెరుగుతుందని ఆయా కంపెనీలు భావిస్తుండటం విశేషం. వృత్తి, ఉద్యోగాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే తమకు ఇలాంటి సేవలు అవసరమేనని ఉద్యోగు లు అంటున్నారు. ఇలాంటి వైద్యం నాణ్యతపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాంటీబయాటిక్స్, ఇతర మందుల డోసు ఎక్కువైతే కొన్నిసార్లు ఆరోగ్యానికి బదులు మరింత అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. చాటింగ్ ట్రీట్మెంట్ ఇలా... తమ ఉద్యోగులకు వైద్య సేవలందించేందుకు పలు కంపెనీలు పలువురు ఫిజీషియన్లు, ఇతర స్పెషలిస్ట్ వైద్యులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా వైద్యుల ఫోన్ నంబర్లను తమ ఉద్యోగులకు అందజేసి వారి శారీరక, అనారోగ్య సమస్యలను నేరుగా ఆయా వైద్యులతో చాటింగ్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పిస్తున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యులకు నెలవారీగా ఆయా కంపెనీలు పారితోషికం అందిస్తున్నాయి. పనివేళల్లో అనారోగ్యానికి గురయ్యే ఉద్యోగి ఆస్పత్రికి వెళ్లి గంటల తరబడి నిరీక్షించేంత సమయం చిక్కనందున ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. పని సామర్థ్యం మెరుగు... దీర్ఘకాలిక అనారోగ్యాలు, జీవనశైలి వ్యాధులున్నవారు మాత్రం నేరుగా స్పెషాలిటీ వైద్య సేవల కోసం ఆయా ఆస్పత్రులకు వెళుతున్నట్లు చెబుతున్నారు. పని ఒత్తిడి ఎక్కువైతే మానసిక వైద్యుల ను చాటింగ్ ద్వారా సంప్రదించి అవసరమైన సలహాలు, సూచనలు తమ ఉద్యోగులు పొందుతున్నట్లు వెల్స్‌ఫార్గో ఐటీ సంస్థ హెచ్ఆర్ విభాగం ప్రతినిధి సత్యలింగం ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగా ఉంటేనే వారి పనిసామ ర్థ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. మరికొన్ని కంపెనీలు విదేశాల్లో ఉన్న వైద్య నిపుణుల సలహాలు, సూచనలను తమ ఉద్యోగులు పొందేందుకు టెలీ మెడిసిన్ సేవలను సైతం వినియోగిస్తుండటం గ్రేటర్లో నయా ట్రెండ్‌గా మారింది. చాటింగ్ ట్రీట్మెంట్ ఉద్యోగులకు వెసులుబాటును, వైద్యులకు కాసులను, కంపెనీలను లాభాల బాట పట్టిస్తుండటం విశేషం. -
అమ్మాయితో చాటింగ్ చేస్తున్నారా?
స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అని ఇష్టపడ్డ అమ్మాయి చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే కాలాలు చెల్లాయి. పావురాలతో సందేశాలు, ఉత్తరాలతో ప్రేమలేఖలు అంతరించి, వాట్సాప్ రూపంలో ప్రేమకు ఓ వారధి ఏర్పడింది. ఇష్టపడ్డ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకోవటం, చాటింగ్‌లు చేయటం లాంటివి నేడు మామూలు విషయాలు. అయితే రోజులు గడుస్తున్నా అమ్మాయికి తమ ప్రేమను చెప్పలేని వాళ్లు చాలనే ఉంటారు. ప్రేమ సంగతి పక్కన పెడితే! ఇష్టమొచ్చినట్లు చాటింగ్ చేసి ‘వీడితో అసలు స్నేహమే వద్దురా బాబు!’ అనుకునే స్థితికి వారిని తీసుకువస్తారు. చాటింగ్‌తో ఎదుటి వారిని ఇంప్రెస్ చెయ్యటానికి ఓ పద్దతి అవసరం. ఒక రకంగా చెప్పాలంటే చాటింగ్ చేయటం అన్నది ఓ కళ. 1) ఆసక్తికరమైన అంశం మీరు అమ్మాయితో చాటింగ్ చేస్తున్నపుడు ఆమెకు బోర్ కొట్టకుండా చూసుకోవటం ముఖ్యమైన విషయం. ఆ అమ్మాయికి ఇష్టమైన టాపిక్‌పై చాటింగ్ చేయటం మంచిది. ఇష్టమైన ప్రదేశాలు, వంటలు, సినిమాలు, హీరో, హీరోయిన్లు లాంటి విషయాలపై చర్చ జరుగుండటం మంచిది. 2) స్టిక్కర్లు, ఎమోజీలు మీ చాటింగ్‌లో ఫన్నీ ఎమోజీలు, స్టిక్కర్లు ఉండేలా చూసుకోండి. ఇవి మీ తత్వాన్ని తెలియజేస్తాయి. చాటింగ్ బోరు కొట్టకుండా ఉండటానికి ఉపయోగపడాతాయి. 3) జోకులు చాటింగ్ మధ్యమధ్యలో కొన్ని జోకులు వెయ్యండి! ఆమెను నవ్వించండి. మీలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆమెను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. మీరు స్వతహాగా నవ్వించగలిగే వారైతే పర్లేదు కానీ, అలా కాకపోతే.. ఆమెను నవ్వించ బోయి మీరు నవ్వులపాలవుతారు. 4) విసిగించకండి చాటింగ్ చేస్తున్నపుడు ఒకే విషయాన్ని పదేపదే అడిగి ఆమెను విసిగించకండి. అలా చేస్తే మీ మెసెజ్‌లకు సమాధానం దొరకటం కష్టమవుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల పట్ల తొందరపాటు అస్సలు పనికిరాదు. తన జీవితంపై మీరు అనవసరమైన ఆసక్తిచూపుతున్నారనే భావన కల్గుతుంది. 5) వ్యక్తిగత జీవితం ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీవితాలను గోప్యంగా ఉంచాలనుకోవటం పరిపాటి. ఈ విషయాన్ని మనం గుర్తెరుగాలి. వారి వ్యక్తిగత విషయాలను చొరవగా అడగటం వద్దు. హద్దులను దాటి ప్రవర్తించటం మంచిది కాదు. ఇలాంటి విషయాలే మీ మధ్య అగాథాలను తేవచ్చు. 6) మీ రోజూ వారి జీవితం మీ నిత్య జీవితంలో చోటుచేసుకునే ఫన్నీ విషయాలను ఆమెతో పంచుకోండి. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంపండి. 7) బలవంతం వద్దు అవసరమైనప్పుడు మాత్రమే చాటింగ్ చేయండి. ఇష్టమొచ్చినపుడు మెసెజ్‌లు చేస్తూ వారినుంచి రిప్లయ్ రాకపోతే ఇబ్బంది పడటం.. ఆ తర్వాత వారిని ఇబ్బంది పెట్టడం తగదు. మీరు పనిపాట లేకుండా తేరగా ఉన్నారన్న భావన ఆమెకు కలిగించవద్దు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
భార్య ఉండగానే మరో యువతితో చాటింగ్.. తలాక్
బొమ్మనహళ్లి : మరో యువతితో చాటింగ్ చేయడాన్ని ప్రశ్నించడంతో భార్యకు తలాక్ చెప్పిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితురాలు ఆర్టీనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు...యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆర్టీనగరకు చెందిన సయ్యద్ రెహమాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు కొంత కాలం అన్యోనంగా జీవించారు. మూడు నెలల తరువాత సయ్యద్ జులాయిగా తిరుగుతూ ఉద్యోగం మాని భార్య సంపాదనపై జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా మరో యువతితో నిత్యం చాటింగ్‌లు చేసేవాడు. ఏకంగా ఇంటికే పిలుచుకుని వచ్చేవాడు. దీంతో భార్య ప్రశ్నించడంతో ఆమెను నిత్యం వేధించి కొట్టేవాడు. దీంతో బాధితురాలు విషయాన్ని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులకు తెలిపింది. ఇటీవల ఇద్దరు బెంగళూరు చేరుకున్నారు. ఆర్టీనగరలో నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ సయ్యద్‌లో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో ఏకంగా మరో వివాహం చేసుకోవడానికి యత్నించాడు. ఈ నేపథ్యంలో భార్యకు తలాక్ చెప్పాడు. దీంతో బాధితురాలు ఆర్టీనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదని బాధితురాలు వాపోయింది. -
చాటింగ్ చేస్తోందని మందలించడంతో..
శంకరపల్లి (చేవెళ్ల): ఫోన్లో చాటింగ్ చేస్తున్నావని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఒంటికి నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన శంకర్పల్లి మండలంలోని కొండకల్లో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శృతి(20) శనివారం ఉదయం తన మొబైల్ ఫోన్‌తో ఇతరులతో చాటింగ్ చేయసాగింది. ఈ విషయం గమనించిన తల్లి పుణ్యవతి ఫోన్‌ను లాక్కొని ఎవరితో చాటింగ్ చేస్తున్నావని ప్రశ్నించి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శృతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్ని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ప్లోఈసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాట్సప్ తెచ్చిన తంటా
మారేడుపల్లి : వాట్సాప్ చాటింగ్ కారణంగా కుటుంబాల్లో నెలకొన్న వివాదం ఇద్దరి ఆత్మహత్యకు దారితీసిన సంఘటన మారేడుపల్లి, వాల్మీకినగర్‌లో చోటు చేసుకుంది. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వాల్మీకినగర్‌కు చెందిన వెన్నెల (19, సంజీవయ్యనగర్‌కు చెందిన శివకుమార్ చిన్ననాటి స్నేహితులు. శివకుమార్‌కు గత ఆగస్టు 15న లహరి అనే యువతితో వివాహం జరిగింది. అతను తరచూ వెన్నెలతో వాట్సాప్‌లో ఛాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన లహరి భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో మనస్తాసానికిలోనైన శివకుమార్ శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంతెలియడంతో వెన్నెల అదేరోజు సాయంత్రం యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. వెన్నెల తండ్రి రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి మృతితో వాల్మీకినగర్, సంజీవయ్యనగర్‌లలో విషాధ ఛాయలునెలకొన్నాయి. -
సిమ్ తీశాడు.. చాటింగ్ చేశాడు!
సాక్షి, సిటీబ్యూరో: గొలుసు కట్టు పథకంతో దేశవ్యాప్తంగా 35 లక్షల మందిని మోసగించి దాదాపు రూ.3,000 కోట్ల వరకు మోసం చేసిన కేసులో రెండో నిందితుడైన బన్సీలాల్‌ను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నాలుగు రోజుల నుంచి సమాజంతో ఎటువంటి సంబంధం లేకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ముప్పుతిప్పలు పెడుతున్న బన్సీలాల్‌ను పట్టుకునేందుకు మంగళవారం ప్రత్యేక బృందాలు హర్యానా బయలుదేరి వెళ్లాయి. నాలుగురోజులు స్తబ్ధుగా ఉన్న బన్సీలాల్ సెల్‌ఫోన్ వాట్సాప్ చాటింగ్, కాల్స్ ద్వారా హర్యానాలోనే ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు ఇప్పటికే అక్కడి పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఒకటిరెండు రోజుల్లో బన్సీలాల్‌ను పట్టుకుంటే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన కీలక నిందితుడు రాధేశ్యామ్, సురేందర్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఎంఎల్‌ఎంపై మరిన్ని ఫిర్యాదులు మీరు రూ.7,500లు చెల్లిస్తే చాలు.. చేరినందుకు రూ.2,500ల ఫీజును మినహాయించి మిగిలిన రూ.5 వేలకు డ్రెస్సులు లేదంటే ఆరోగ్యకర ఉత్పత్తులు ఇస్తాం. మీ ద్వారా మరో ఇద్దరు సభ్యులను చేర్పిస్తే రూ.500 బోనస్‌తో పాటు రెండేళ్ల పాటు నెలకు రూ.2,500 అంటే రూ.60,000 సంపాదించుకోవచ్చు. కూర్చున్న దగ్గర మీ ఖాతాలోకి వచ్చి డబ్బు జమవుతుంద’ంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఆశజూపి దాదాపు రూ.3000 కోట్ల వ్యాపార మోసాలు చేసిన ఏడో తరగతి వరకే చదివిన హర్యానాకు చెందిన 34 ఏళ్ల రాధేశ్యామ్‌తో పాటు అతడికి సహకారం అందించిన సురేందర్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. వీరి అరెస్టు రోజునే శుక్రవారం ఒక్కరోజే రూ.75 కోట్లు వీరి బ్యాంక్ ఖాతాలకు జమ అవడంతో అవాక్కైన సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మరింత మంది డబ్బులు జమ చేసే అవకాశం ఉండటంతో ఆ ఖాతాలు ఫ్రీజ్ చేయించారు. అలాగే ఆ కంపెనీ వెబ్సైట్ ఫ్యూచర్‌మేకర్.బిజ్ ఓపెన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మోసం గురించి సీపీ సజ్జనార్ దృష్టికి వచ్చిన వారంరోజుల్లోనే నిందితులను పట్టుకొని భారీ మోసం గుట్టురట్టు చేశారు. మల్టీ లెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం)లో చేరాలంటే ఒకటికీ పదిసార్లు ఆలోచించేలా సైబరాబాద్ పోలీసులు చేసిన విస్తృత ప్రచారంతో ఇతర ఎంఎల్ఎం కంపెనీలపై ఫిర్యాదులు పొటెత్తుతున్నాయి. తమ వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారంటూ ఇతర కంపెనీలపై కొంతమంది ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అప్పుడు దర్జీగా..ఇప్పుడు దర్జాగా హిస్సార్ జిల్లాలోని శిష్వాల్ గ్రామానికి చెందిన రాధేశ్యామ్ తన సోదరుడితో కలిసి దర్జీగా పనిచేశాడు. ఆ సంపాదన ఎటూ సరిపోకపోవడంతో తనకు వచ్చిన హిందీ భాషతో గుడ్‌వే, రైట్ కనెక్ట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల్లో అనతికాలంలోనే ఉన్నతస్థానానికి వెళ్లాడు. అదేదో సొంతంగా చేస్తే భారీ మొత్తంలో డబ్బులు వస్తాయన్న ఆశతో బన్సీలాల్, సురేందర్‌సింగ్‌లతో కలిసి 2015లో హిస్సార్‌లోని రెడ్ స్క్వేర్ మార్కెట్ ప్రాంతంలో ఎఫ్ఎంఎల్సీ కార్యాలయాన్ని తెరిచాడు. హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నిరుద్యోగులు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులకు పార్ట్‌టైమ్ ఆదాయం పేరిట లక్షల్లో మందికి కుచ్చుటోపీ పెట్టారు. ఇలా రూ.కోట్లు చేతిలో మెదలడంతో స్వగ్రామంలో కోటలాంటి ఇంటిని నిర్మించాడు. అయితే గత ఆరు నెలల నుంచి అమీర్‌పేటలో కార్యకలాపాలు ప్రారంభించి ప్రసంగాలు ఇచ్చి వందలమందిని చేర్పించాడు. అయితే ఓ ప్రైవేట్ ఉద్యోగి అనుమానంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో రాధేశ్యామ్ మోసాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
పడగ్గదిలో ‘సోషల్’ ట్రెండ్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసులు తమకు తెలియకుండానే నిద్రకు దూరమవుతున్నారు. ఏకాంతంగా ఉండే పడక గదులను సైతం సైబర్ ‘చాట్ రూం’లుగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు నట్టింట్లోకి మాత్రమే పరిమితమైన ల్యాప్‌టాప్.. ట్యాబ్.. స్మార్ట్‌ఫోన్.. ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు పడక సమయంలోనూ బెడ్‌మీదకు చేరుతున్నాయి. దీంతో సిటీజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. ‘సెంచురీ మాట్రిసెస్’ దేశవ్యాప్తంగా పది నగరాల్లోని ప్రజల ‘స్లీపింగ్ ట్రెండ్స్’(నిద్ర అలవాట్లు)పై చేసిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలో అగ్రభాగాన నిలవడం గమనార్హం. ఈ నగరంలో సుమారు 70 శాతం మంది స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో గడుపుతున్నట్టు తేలింది. ఎప్పటికప్పుడు తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. అంతేకాదు ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల్లో సినిమాలు, తమకు నచ్చిన షోలను వీక్షిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక ఈ సర్వేలో రెండో స్థానంలో నిలిచిన విశాఖపట్నంలో 66 శాతం మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ప్రకటించారు. మూడోస్థానంలో నిలిచిన బెంగళూరులో 65 శాతం మంది, నాలుగో స్థానంలో నిలిచిన ఇండోర్‌లో 58 శాతం మంది, ఐదోస్థానంలో ఉన్న పూణేలో 56 శాతం మంది పడక గదుల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులతో కుస్తీ పడుతూ నిద్రకు దూరమవుతున్నట్లు తేలడం గమనార్హం. పలు నగరాల్లో నిద్ర అలవాట్లు ఇలా.. సెంచురీ మాట్రిసెస్ దేశవ్యాప్తంగా పది నగరాల్లో ప్రజల స్లీపింగ్ ట్రెండ్స్‌పై సర్వే చేసింది. ఇందులో సుమారు పదివేల మంది నుంచి ‘ఆన్లైన్’లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, సహా.. స్మార్ట్ఫోన్లలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్డేట్ అవుతోన్న ఫీడ్‌ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా పది నగరాల్లో సరాసరి 53 శాతం మంది రాత్రి సమయాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోనే గడుపుతూ కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం రాత్రి 11–12 గంటల మధ్య నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ ఉదయం 5–6 గంటల మధ్య మేల్కొనాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు సర్వేలో పేర్కొన్నారు. ఇక అధిక పని ఒత్తిడి.. ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజుల పాటు పని ప్రదేశాలు.. జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు తేలింది. అధికంగా వీక్షిస్తే ప్రమాదమే.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అవసరాన్ని బట్టి ఉపయోగించాలి. గంటల తరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లు, వాటిలోని సూక్ష్మ నరాలు అధిక ఒత్తిడికి గురవుతాయి. దీంతో మెడ, మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంటే మేలు. – డాక్టర్ రవీంద్రగౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
ఒకరి ఫోన్ నంబర్‌పై మరొకరు అకౌంట్ తెరిచి..
లింగంపేట(ఎల్లారెడ్డి): గతనెల 20వ తేదీన ప్రజాప్రతినిధులు, అధికారులపై అసభ్య పదజాలంతో ఫేస్బుక్లో చాటింగ్ చేసిన సైబర్ క్రైం నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం లింగంపేట మండలకేంద్రంలో ఎల్లారెడ్డి డీఎస్పీ చంద్రశేఖర్ కేసు వివరాలను వెల్లడించారు. లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామానికి చెందిన రాందాస్ రాజేశ్వర్‌గౌడ్ అదే గ్రామానికి చెందిన చిన్నప్ప సంతోష్ ఫోన్ నంబరుపై తన ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇందుకు సంతోష్ ఫోన్ నంబరుపైనే పాస్వర్డ్ ఉన్న విషయం తెలుకొని సంతోష్ పేరుపైనే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో గతనెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుభాష్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు సంపత్‌గౌడ్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, తనతండ్రి వెంకగౌడ్తోపాటు పలువురిపై అసభ్య పదజాలంతో ఫేస్బుక్లో మెస్సేజ్‌లు పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయమై బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైంగా నమోదు చేసి విచారణ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ మెయిన్ బ్రాంచ్‌కి సమాచారం ఇచ్చి సదరు మెసేజ్ ఎక్కడి నుంచి, ఎవరి పేరుపై ఉంది, ఎవరు చాటింగ్ చేశారు అని విచారణ చేయగా జియో ఫోన్ నంబర్ తీసుకున్న ఐడీ ప్రూప్ ద్వారా కేసును ఛేదించినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుడు రాందాస్ రాజేశ్వర్‌గౌడ్‌ను విచారణ చేయగా పాతకక్షలతో ఇలా చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. రాజేశ్వర్‌గౌడ్, సంతోష్‌కు చెందిన పంట చేలు పక్కపక్కనే ఉంటాయి. కొంతకాలం క్రితం సంతోష్ తన పొలంలోకి రాజేశ్వర్‌గౌడ్ పొలం మీదుగా విద్యుత్ వైర్లు తీసుకెళ్తుండగా వైరు సరిపోకపోవడంతో తీగలు మధ్యలోనే వదిలేశాడు. అయితే విద్యుత్ తీగలు తన పంట చేనులో సంతోష్ వదిలివేసింది గమనించిన రాజేశ్వర్‌గౌడ్ తమను చంపడానికే వైర్లు వదిలేశావని గొడవ పడ్డారు. సంతోష్‌ను ఎలాగైనా పోలీసులతో కొట్టించాలని కక్షకట్టిన రాజేశ్వర్‌గౌడ్, సంతోష్ ఫోన్ నంబరుపై ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి పలువురిపై అసభ్యంగా మెస్సేజ్‌లు పెట్టినట్లు తెలిపారు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ సుధాకర్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది అనిల్, రాజు, హన్మాండ్లు, శ్యామ్ పాల్గొన్నారు. -
భార్యభర్తలు కలిసి ఆన్లైన్ చాటింగ్‌తో
భాగ్యనగర్‌కాలనీ: మింగిల్ ఆన్లైన్ ద్వారా చాటింగ్ చేస్తూ ఓ వ్యక్తిని లోబర్చుకుని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న భార్యభర్తలపై కేసు నమోదైన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సిఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న కె.రమాకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మింగిల్ ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా కవిత అలియాస్ స్వాతితో పరిచయం ఏర్పడింది. దీంతో రోజూ చాటింగ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అయితే కవిత అలియాస్ స్వాతి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, నాలుగు లక్షల రూపాయలు అవసరముందని రమాకాంత్‌ను వేడుకుంది. దీంతో రమాకాంత్ తన వద్ద అంత డబ్బు లేదని ఈ నెల 9వ తేదీన 5 వేల రూపాయలు నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. తిరిగి మళ్లీ అడగడంతో 14వ తేదీన మరో 10 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయగా ఇంతటితో ఆగకుండా అతని వద్ద నుంచి ఎలాగైనా డబ్బులు లాగాలని పథకం వేసిన భార్యభర్తలు సతీష్, స్వాతి చాటింగ్‌లో లక్ష రూపాయలు కావాలని మరోసారి అతనిని వేడుకున్నారు. దీంతో తాను ఇవ్వలేనంటూ తేల్చి చెప్పడంతో ఆన్లైన్ మెసేజ్‌ల ద్వారా అతడిని ప్రేమలోకి దించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే సెల్ ఫోన్ ద్వారా ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకున్నారు. ఇంతటితో ఆగకుండా స్వాతి బాండ్ పేపర్లు తీసుకుని మీ ఇంటికి వస్తానని లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వాలని కోరింది. దీంతో అతడు నిరాకరించాడు. అయితే స్వాతి తన భర్తతో డబ్బులు ఇవ్వాలని రమాకాంత్‌తో ఫోన్లో మాట్లాడించింది. దీంతో రమాకాంత్ తాను ఇవ్వలేనని చెప్పడంతో చాటింగ్ ద్వారా మరింత ఒత్తిడి తీసుకువచ్చింది. సెల్ఫోన్లో వారు ఇద్దరు మాట్లాడుకున్న మెసేజ్‌లను భర్త సతీష్ రమాకాంత్ ఇంటికి వెళ్లి తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే మెసేజ్‌లు బయటపెడితే ఇబ్బందికరంగా ఉంటుందని బెదిరించటమే కాకుండా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో వారి నుంచి వేధింపులు తాళలేక రమాకాంత్ కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘వదినా అసూయగా ఉందా’!
డర్బన్ : టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మధ్య ఇన్స్టాగ్రాం వేదికగా జరిగిన సరదా చాటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు రోహిత్ శర్మ ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నాడు. దీనికి క్యాప్షన్‌గా ‘ట్రైనింగ్ సెషన్ అనంతరం సేద తీరుతున్నాం. పక్కనే చాహల్, శార్దూల్ ఠాకూర్లున్నారు’ అని పేర్కొన్నాడు. దీనికి చాహల్ ‘వదినా.. అసూయగా ఉందా అని కామెంట్ చేశాడు. వెంటనే రితికా ‘హ హ హ.. నీవు నా మైండ్‌ను బాగా చదివావు’ అని బదులిచ్చింది. ఇక్కడితో ఆగని చాహల్ ‘వదినా.. ఒక నెల రోజుల పాటు అన్నకు నేనే తోడుగా ఉంటానని’ మరో కామెంట్ చేశాడు. ఈ సరదా కామెంట్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక టెస్ట్ సిరీస్ ముందు సతీమణులతో భారత క్రికెటర్లు దక్షిణాఫ్రికా వచ్చిన విషయం తెలిసిందే. వీరంతా టెస్ట్ సిరీస్ అనంతరం స్వదేశానికి వెళ్లిపోయారు. ఇక ఆరు వన్డేల సిరీస్‌లో డర్బెన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. -
చాటింగ్ పేరుతో చీటింగ్
► అమ్మాయిలను ఎరచూపి రూ.13.29 లక్షలు స్వాహా సీతమ్మధార (విశాఖ ఉత్తరం): మాయమాటలు చెప్పి అమ్మాయిలను ఎరచూపి ఆన్లైన్లో ఓ వ్యక్తి ఖాతాలోంచి రూ.13.29 లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసుకు సంబంధించి ఫోర్తుటౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బంగకు చెందిన రైల్వే న్యూ కాలనీలో నివాసం ఉంటున్న సుభాష్ చంద్రదాస్(60) విశ్రాంత రైల్వే ఉద్యోగి. అతనికి సౌరబ్దాస్ (17) అనే కుమారుడు ఉన్నాడు. సౌరబ్దాస్కు కొన్నాళ్ల కిందట అమ్మాయిలతో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. వారితో రోజూ చాటింగ్ చేయడంతో స్నేహితులయ్యారు. అనంతరం మాయమాటాలు చెప్పి నగదు కావాలని అడిగారు. దీంతో సౌరబ్ దాస్ తన తండ్రి ఖాతా నుంచి ఆన్లైన్లో రూ.30 వేలు, రూ.40వేలు చొప్పున 34 సార్లు కార్డు ద్వారా నగదు బదిలీ చేశాడు. రెండు రోజుల కిందట సుభాష్ చంద్రదాస్ ఖాతా చూసుకుంటే అందులో నగదు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే కార్డు ద్వారా కుమారుడు సౌరబ్దాస్ ఆన్లైన్లో నగదు బదిలీ చేశాడని గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా ఇతర రాష్ట్రాలకు పోలీసు బృందాలను పంపించారు. -
చాటింగ్ చీటింగ్: యువతులూ తక్కువేం కాదు!
అమీర్‌పేట్ మధురానగర్‌కు చెందిన ముమ్మడి కార్తికేయ చిన్న స్థాయి దర్శకుడు. ఇతడికి విశాఖపట్నంలోని శీలానగర్కు చెందిన వివాహిత ఫేస్బుక్లో పరిచయమైంది. చాటింగ్ చేసి ఆమెకు మాయమాటలు చెప్పాడు. సిటీకి రప్పించి నయవంచన చేశాడు. కార్తికేయను మేడిపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ జానకి, ట్యాక్స్ కన్సల్టెంట్ యశ్వంత్ కుమార్ ఉదంతం గతేడాది వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్లో పరిచయమైన జానకితో సాన్నిహిత్యం పెంచుకొని మోసం చేసిన యశ్వంత్... ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. నగర చరిత్రలోనే తొలి ఫేస్బుక్ మర్డర్‌గా ఇది రికార్డులకెక్కింది. కేవలం ఈ రెండే కాదు.. ఫేస్బుక్ ఆధారంగా జరుగుతున్న నేరాలు ఘోరాలు సిటీలో అనేకం ఉన్నాయి. అయితే వీటిలో 10 శాతం కూడా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కట్లేదు. నేరుగా పరిచయం లేకపోయినా ‘ముఖ పరిచయం’తో ముందడుగు వేస్తున్న వాళ్లు నిండా మునుగుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని నగరవాసులు, ముఖ్యంగా యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా సిటీలో సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్స్‌పై ప్రత్యేక కథనం.. – సాక్షి, సిటీబ్యూరో అతడో సైబర్ శాడిస్ట్... బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివసించే అబ్దుల్ మాజిద్ ఫేస్బుక్లో అమ్మాయిల నకిలీ ఖాతాలు తెరిచాడు. సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినుల ప్రొఫైల్స్‌ను గుర్తించి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపించేవాడు. అవతలి వారు అమ్మాయినే కదా అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో అసలు కథ మొదలెడతాడు. వారితో స్నేహపూరితంగా చాటింగ్ చేస్తూ వ్యక్తిగత విషయాలు అడుగుతాడు. స్నేహం పెరిగిన తర్వాత వారి ఆంతరంగిక అంశాల్లోకి తలదూర్చుతాడు. విద్యార్థినుల నగ్న చిత్రాలు, వీడియోలు సంగ్రహిస్తాడు. చాటింగ్ ద్వారా అసభ్యకరమైన సంభాషణలు కొనసాగిస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, తల్లిదండ్రులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతాడు. ఈ తరహాలో బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. మాజిద్‌ను 2015 సెప్టెంబర్ 11న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడు దాదాపు 80 మందిని వంచించిన్నట్లు ఆరోపణలున్నాయి. జైలు నుంచి వచ్చినా అదే పంథాలో రెచ్చిపోతూ గతేడాది ఏప్రిల్‌లో హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. స్నేహం ముసుగులో మోసం.. ‘ఫేస్బుక్ మర్డర్’ జానకి ఉదంతం వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందే నగరంలో ‘ఫేస్బుక్ రేప్’ ఘటన చోటుచేసుకుంది. టోలిచౌకిలోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇతడికి సమీప ప్రాంతంలో నివసించే ఓ యువతి ఫేస్బుక్లో పరిచయమైంది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమెతో కొన్ని రోజుల పాటు స్నేహంగా ఉన్న అతడు... గతేడాది ఫిబ్రవరిలో తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వయంగా వెళ్లి కారులో ఎక్కించుకొని వచ్చాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఈ నయవంచకుడు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు. బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతో వంచన.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బాబూరావు ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తాడు. తన ఈ–మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ సైతం అందులో పొందుపరుస్తాడు. దరఖాస్తు చేసుకున్న వారిలో యువతులు, మహిళల్ని ఎంచుకుంటాడు. దరఖాస్తు పత్రాల్లో ఉన్న వారి ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీలు తీసుకుంటాడు. వీటి ఆధారంగా వారితో చాటింగ్ చేయడం ప్రారంభిస్తాడు. తొలుత ఉద్యోగానికి సంబంధించిన విషయాలే చర్చించే బాబూరావు... కొన్నాళ్లకు వారిని మాయజేస్తూ వ్యక్తిగత అంశాలతో పాటు అభ్యంతరకర, అశ్లీల సందేశాలూ పంపిస్తుంటాడు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత సదరు యువతి/మహిళకు ఫోన్ చేసి ‘చాటింగ్’ వివరాలను కుటుంబీకులు, సంబంధీకులకు చెప్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు. తాను అడిగినంత ఇవ్వాలంటూ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ నగర విద్యార్థిని ఫిర్యాదుతో సీసీఎస్ అధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. యువతులూ తక్కువేం కాదు.. ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి యువకుల్ని ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్న ఇద్దరు యువతులూ నగరంలో పట్టుబడ్డారు. పాతబస్తీలోని పత్తర్‌గట్టీ, రికాబ్ గంజ్‌లకు చెందిన ఇద్దరు యువతులు స్నేహితులు. వీరిద్దరూ తప్పిపోయారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నాక అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఫేస్బుల్లో అందమైన అమ్మాయిల ఫొటోలతో వీరు ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా యువకుల్ని ఆకర్షిస్తూ వారితో స్నేహం, చాటింగ్ చేస్తూ ముగ్గులోకి దింపారు. ఆ యువకుల నుంచి నగదు, నగలు, కెమెరాలు, ఫోన్లు రాబట్టుకున్నారు. ఆ డబ్బుతో డెహ్రాడూన్, ఊటీ, వైజాగ్‌లలో జల్సాలు చేస్తుండేవారు. ఈ పంథాలో వీరిద్దరూ 17 మంది యువకుల్ని మోసం చేశారు. పరిచయం లేని స్నేహం వద్దు... కేవలం దారుణమైన నేరాలే కాదు... ఫేస్బుక్ ద్వారా వేధింపులకు సంబంధించిన కేసులు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. యువతుల పేర్లతో ఖాతాలు తెరిచి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్మెయిల్ చేయడం వంటివీ ఉంటున్నాయి. అపరిచిత వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యువతులు యాక్సెప్ట్ చేయొద్దు. పరిచయం లేని వారితో స్నేహం, చాటింగ్స్ చేయొద్దు. పరిచయమున్న వారితోనూ వ్యక్తిగత, ఆంతరంగిక అంశాలు ప్రస్తావించొద్దు. – సైబర్ క్రైమ్ పోలీసులు -
డేటింగ్...చాటింగ్...చీటింగ్
యువకుల నుంచి డబ్బులు లాగుతున్న ఘరానా కిలేడీ ఈజీమనీ కోసం వక్రమార్గాలు బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు సిటీబ్యూరో: డేటింగ్ సైట్లలో చాటింగ్ పేరుతో యువకులకు వల వేసి ఆ తర్వాత వారి ఫేస్బుక్ ఖాతాలోని కుటుంబసభ్యుల ఫొటోలను డేటింగ్ వెబ్సైట్లో పోస్టు చేస్తానని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న యువతిని సైబరాబాద్ సైబర్ క్రై మ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తమను డీసెంట్ చాట్ పేరుతో ఓ యువతి నమ్మించి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తోందని ప్రగతినగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ నెల 4న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిలేడీ ఆటకట్టించారు. మొదట సినిమా టికెట్లు...ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చైతన్యపురికి చెందిన నిందితురాలు డేటింగ్ సైట్లలో క్యూటీ 27, వైశాలి 33, స్మైలీ 31 పేర్లతో చాటింగ్ చేసేది. ఆ సైట్లలో కాంటాక్ట్ అయ్యే వారికి తన ఫోన్ నంబర్ ఇచ్చేది. డీసెంట్ చాట్ చేస్తానని, మీతో డేటింగ్ చేస్తానంటూ మల్టీప్లెక్స్‌లో నాలుగు మూవీ టికెట్లు బుక్ చేయాలంటూ కోరుతూ ఈమెరుుల్ ఐడీతో పాటు ఫోన్ నంబర్ పంపించేది. ఇదే తరహాలో నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో ట్వూ డేటింగ్ సైట్లో క్యూటీ(27) ప్రొఫైల్ పేరుతో చాటింగ్ చేసింది. మల్టీప్లెక్స్‌లో నాలుగు సినిమా టికెట్లను అడిగితే బుక్ చేసి తన మొబైల్ నంబర్ ద్వారా ఆమె సెల్ నంబర్‌కు బుకింగ్ ఐడీ పంపించాడు. ఆ సెల్‌నంబర్‌తో ఫేస్బుక్లో అతడి ప్రొఫైల్ తెలుసుకున్న నిందితురాలు అందులో అప్లోడ్ చేసిన అతడి కుటుంబసభ్యుల ఫొటోలను డౌన్లోడ్ చేసింది. మరుసటి రోజు అతడికి ఫోన్ చేసి రూ. 3,500 తన బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాలని, లేనిపక్షంలో మీ కుటుంబసభ్యుల ఫొటోలను డేటింగ్ సైట్లో అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో అతను ఆమె అడిగిన మొత్తాన్ని జమ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ కాల్ చేసి రూ.50వేలు కావాలని, అందుకు రెండు రోజుల సమయం ఇస్తున్నానని బెదిరించింది. అరుుతే బాధితుడు డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో అతడి కుటుంబసభ్యుల ఫొటోలను డేటింగ్ సైట్లలో ఆప్‌లోడ్ చేసి ‘కాల్ ఆర్ ఎస్ఎంఎస్’ అనే స్టేటస్‌తో పాటు సెల్‌నంబర్ పెట్టింది. దీంతో అతను ఆమెకు ఫోన్ చేసి కొంత గడువు కావాలని,, ఆలోపు ఆ ఫొటోలు డిలీట్ చేయమని కోరడంతో వాటిని తీసేసింది. అరుుతే అదే రోజు తమ కుటుంబసభ్యుల ఫొటోల స్థానంలో ఇతరుల ఫొటోలు, ఫోన్ నంబర్ ఆప్‌లోడ్ చేయడాన్ని గుర్తించిన బాధితుడు సదరు నంబర్‌కు కాల్ చేసి తనకు ఎదురైన ఎదురైన అనుభవాన్ని వివరించాడు. ఫ్రెండ్ నంబర్ ఇస్తే... సింగపూర్‌లో ఉంటున్న తన స్నేహితుడు డేటింగ్ సైట్లో స్మైలీ(31) పేరు గల అమ్మారుుతో చాటింగ్ చేశాడని, కమ్యూనికేషన్ కోసం ఇండియాకు వచ్చేంతవరకు తన నంబర్‌ను ఇచ్చాడని మొదటి బాధితుడితో రెండో బాధితుడు తెలిపాడు. ఆ సెల్ నంబర్ సహాయంతో ఫేస్బుక్లో ప్రొఫైల్ సెర్చ్ చేసి అందులో ఉన్న తన కుటుంబసభ్యుల ఫొటోలు డౌన్లోడ్ చేసిందని, నవంబర్ 2 ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే నిరాకరించంతో తన కుటుంబంలోని అమ్మారుుల ఫొటోలను డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేయడంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అసభ్యకరంగా కాల్స్ వచ్చాయని చెప్పాడు. దీంతో మొదటి బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రరుుంచడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నంబర్, మెరుుల్ చాటింగ్ ఆధారంగా చైతన్యపురికి చెందిన బట్టు రాజేశ్వరిని గురువారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ఏసీపీ జయరాం పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఈ ఘరానా కిలేడీని పట్టుకుని. కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
ఉత్తమ పదం
మొబైల్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో రోజుకు లక్షల మంది తమ ఆత్మీయులతో చాటింగ్ చేస్తుంటారు. అందులోనే తమ ఆనందాన్ని పంచుకుంటారు. బాధను చెప్పుకొని ఊరట పొందుతారు. అలా తమ చాటింగుల్లో కొన్నేళ్లు నుంచి పదాలతో పాటు ఈమోజీలనూ పంపుకుంటున్నారు. ఈమోజీ (జపానీ పదం) అంటే మనకు తెలియని కొత్త పదం అనుకోకండి. వాటిని మనం ముద్దుగా స్మైలీస్ అంటుంటాం. అసలు ఈ గొడవంతా ఏంటీ అంటే ఇటీవల ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్లు ఆనందబాష్పాలతో ఉండే స్మైలీకి 2015కు గాను ‘ది బెస్ట్ వర్డ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించారట. దానికి కారణం ఈ ఏడాది మొబైల్స్, ఆన్లైన్లో చాటింగ్ చేసేవాళ్లలో ఎక్కువమంది ఈ ఐకాన్‌ను ఉపయోగించారట. ఇది ‘పదం’ కాకపోయినా ఎమోషనల్ సమయాల్లో మంచి ఎక్స్‌ప్రెషన్‌గా మెసేజుల్లో ఉపయోగిస్తున్నారు కాబట్టి దీన్ని పదంగా భావించింది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సంస్థ. -
చదువు మూరెడు.. నెట్ బారెడు!
* కాలేజీ చదువులకన్నా ఇంటర్నెట్కే ప్రాధాన్యం * చాటింగ్, గేమ్స్‌కు 10 వేల గంటలు..పుస్తక పఠనానికి 5 వేల గంటలే * తాజా అధ్యయనంలో విస్తుగొలిపే గణాంకాలు * ఆవహిస్తున్న మానసిక రుగ్మతలు: మానసిక వైద్యులు సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన ఇంటర్నెట్ విప్లవం అంతులేని ప్రయోజనాలతోపాటు భయంకరమైన దుష్ర్పభావాలనూ మోసుకొస్తోంది. విభిన్న రూపాలు సంతరించుకున్న డిజిటల్ మాధ్యమం ప్రజల జీవితాలను శాసించే స్థాయికి చేరుతోంది. ఇంటర్నెట్ సహా సకల సదుపాయాలున్న స్మార్ట్ఫోన్ల ప్రవేశం ప్రజలు ప్రత్యేకించి విద్యార్థులను పూనకంలా ఆవహిస్తోంది. జీవితాలను నిలబెట్టే చదువుకన్నా విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యం ఇంటర్నెట్ ఆధారిత సేవలకు ఇచ్చేలా వారిని ‘నెట్’లోకంలో విహరింపజేస్తోంది. దీంతో విద్యార్థులు వాస్తవ ప్రపంచానికి దూరమవుతున్నారు. దేశంలో 2000 సంవత్సరంలో 50 లక్షల మంది ఇంటర్నెట్ వినియోగదారులుండగా 2014 నాటికి ఆ సంఖ్య 23.40 కోట్లకు చేరుకుంది. ఒక సర్వే ప్రకారం ఒక విద్యార్థి తన కాలేజీ జీవితంలో సరాసరి 10 వేల గంటలకు తక్కువ కాకుండా కంప్యూటర్లు, మొబైల్స్‌ల్లో వీడియో గేమ్స్, చాటింగ్‌కు సమయం కేటాయిస్తుంటే... పుస్తకాలు చదవడానికి కేవలం 5 వేల గంటలు కూడా కేటాయించడంలేదట. ఈ పరిణామం యువతలో తీవ్రమైన మానసిక రుగ్మతలు కలిగించే ప్రమాదం ఉందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎందరో ఇటువంటి వ్యాధులతో సతమతం అవుతున్నారని చెబుతున్నారు. శారీరక శ్రమకు దూరం... విద్యార్థులు శారీరక శ్రమ లేకుండా స్మార్ట్ఫోన్లలో వినోదానికే పరిమితం అవుతుండటంతో మానసిక అలసటకు గురవుతున్నారు. దీంతో జీవితం రోజురోజుకూ సోమరితనంగా మారుతోంది. దీని ప్రభావం వారి మానసిక స్థితిపై పడుతోంది. పిల్లల జీవితాలు కంప్యూటర్లు, వీడియో గేమ్స్, డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్స్, సెల్ఫోన్లు వాటి ద్వారా మెసేజ్‌లు, ఫొటోలు, చాటింగ్‌లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. దీనివల్ల వారి వాస్తవ జీవితం ప్రమాదంలో పడుతోంది. దేశంలోని పట్టణ జనాభాలో 60% మంది ఇంటర్నెట్ లేకుండా జీవితాన్ని గడపడంలేదని, అందులో సగం మంది రోజుకు 4 గంటల వరకు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారని, 19% మంది వారానికి తమ కుటుంబంతో గడిపే కాలం కంటే ఎక్కువ భాగం ఇంటర్నెట్కే అతుక్కుపోతున్నారని తాజా గణాంకాలు చెబుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. హింసాత్మక ధోరణులు... స్మార్ట్ఫోన్ల ద్వారా ఉచితంగా వీడియోగేమ్స్, 3డీ గేమ్స్ వంటివి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం రావడంతో పిల్లలు వాటికి బానిసలు అవుతున్నారు. హింసాత్మక ధోరణిలో ఉంటున్న వీడియో గేమ్స్ కారణంగా యువతీ యువకుల్లో దూకుడు భావనలు, దూకుడు మనస్తత్వం, హింసాత్మక ఆలోచనలు పెరిగిపోతున్నాయి. రోజుకు 2 నుంచి 7 గంటలపాటు వీడియో గేమ్స్ ఆడేవారిలో ఒక రకమైన మానసిక రుగ్మతలు ఏర్పడుతున్నాయి. సామాజిక వెబ్సైట్లు మానసిక రుగ్మతలకు వేదికలుగా మారుతున్నాయి. అసూయ, ఆశ, నిరాశ, ఆత్మన్యూనత వంటివి తెలియకుండానే ప్రభావం చూపుతున్నాయి. అయితే యువతను ఇటువంటి వాటికి దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. మానసిక రుగ్మతలు... దేశంలో 6 వేల మంది ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ఒక సర్వే చేయగా 80% మంది ఇంటర్నెట్, మొబైల్స్ కారణంగా నిద్రలేమి, సరైన వేళకు భోజనం చేయకపోవడం, ఉద్యోగం, వ్యాపార వ్యవహారాల్లో సమయపాలన పాటించకపోవడం తదితర అంశాల్లో విఫలం అవుతున్నారని తేలింది. దీనివల్ల మానసిక రుగ్మతలతోపాటు అసిడిటీ, స్థూలకా యం వంటి అనారోగ్యాలకు గురవుతున్నారు. 13% మంది విద్య, వృత్తి సామర్థ్యాల్లో వెనుకబడుతున్నారు. 2% మంది ప్రతికూల పరిస్థితుల్లోకి (పిచ్చివారుగా) మారుతున్నారు. కొందరు తాగుడుకు బానిసలవుతున్నారు. 25% మంది వరకు యువతీ యువకులు పూర్తిగా ఇంటర్నెట్కు బానిసలైపోయారు. మానసిక ఒత్తిడికి, రుగ్మతలకు గురవుతున్నారు. శారీరకంగా జబ్బులకు గురవుతున్నారు. -
ఆవేశం వద్దు..ఆలోచించి చేద్దాం
సహజంగా ఉరకలు వేసే యువ ఉత్సాహన్ని తమ విజయ సోపానంగా మలచుకోవాల్సిన యువత ఆ శక్తిని క్షణికానందానికి వినియోగిస్తున్నారు. తమలోని అంతర్గత శక్తుల విలువ తెలియక అందుబాటులో ఉన్న ఆధునిక వనరులతో తాత్కాలిక సంతోషాల కోసం ఖర్చుచేస్తున్నారు. టీవీ వ్యామోహం మొదలుకొని వాహనాల మోజు, ఇంటర్నెట్, అర చేతిలో సెల్‌ఫోన్, అభిరుచులకు అనుగణమైన వస్త్ర ప్రపంచం వైపు పరుగులు పెట్టే యువత ఆ ఉత్సాహన్ని పటిష్ట లక్ష్య నిర్దేశం కోసం ఉపయోగిస్తే అద్భుతాలు సాధిస్తారని మానసిక వైద్య నిపుణలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువత కోసం ప్రత్యేక కథనం. ఆకర్షణలు అదుపులో ఉండాలి విభిన్నమైన ఆశయాలు, ఆకాంక్షల మధ్య అనునిత్యం సమరం సాగించే యువతరం జీవితాన్ని రంగుల కలలా సాగించాలని చూస్తుంది. తమ ఆకర్షణలను అదుపులో పెట్టుకొని అందుకు ఉపయోగపడే వనరులను పురోగతి సోపానాలుగా చేసుకునే శక్తి కూడా తమకు ఉందని మరచిపోతుంది. తమ అభిరుచులను సంతృప్తిపరచడం కోసం గంటల తరబడి కాలాన్ని వెచ్చించ గల సామర్థ్యాన్ని సరైన దారిలోకి మళ్లిస్తే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చన్న విషయాన్ని విస్మరిస్తుంది. ప్రస్తుతం యువతకు అత్యంత ప్రీతిగా మారుతున్న ఇంటర్నెట్, సెల్‌ఫోన్, ఆధునిక ద్విచక్ర వాహనాల వినియోగం,స్నేహితులతో విలాస సమయాలనే విస్మరించాల్సిన అవసరం లేకుండానే ఆ వ్యాపకాలను తమకు అనుకులంగా మార్చుకునే అపాయాన్ని వీరు అలవర్చుకోవాల్సి ఉంది. బైక్ అవసరాలకు మాత్రమే... కాలంతో పాటు పరుగులు పెట్టించేందుకు నేటి యువతరం అత్యావశ్యకంగా భావించే అధునాతన బైక్‌ల వినియోగం నిజానికి తమకు అవసరమా.. లేక అభిరుచా.. అనేది సరిగా బేరీజు వేసుకున్న తరువాత వాటి వైపు మొగ్గు చూపాలి. ప్రత్యామ్నాయ రవాణా వనరులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సొంతగా ఒక వాహనం అవసరం లేదు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది యువతే కావడం గమనార్హం. స్థోమత ఉండి మోటారు వాహనాలను సమకుర్చుకున్నా అది కెరీర్‌కి అమూల్యమైన కాలాన్ని మిగేల్చేందుకు ఉపయోగపడుతుందనుకున్నప్పుడే అంగీకరించాలి. కేవలం వినోదానికి వినియోగించే వస్తువుగా భావిస్తే ప్రాణాలకే ముప్పు కావొచ్చు. ఇంటర్నెట్ సరదాలకు వాడొద్దు ప్రపంచంలోని విజ్ఞాన సర్వస్వాన్ని మన కళ్లముందు ఆవిష్కరించే ఈ సాంకేతిక వనరును మూడొంతుల మంది సరదాలు తీర్చే సాధనంగా ఉపయోగిస్తున్నారు. పాఠ్యంశాలు మొదలుకొని పోటీ పరీక్షల వరకూ అవసరమైన ఏ సమాచారానికైన సిద్దంగా ఉండే ఇంటర్నెట్ కేవలం ఆకతాయితనాన్ని, అశ్లీలాన్ని వెతుకుతూ పోతే పురోగతికి బదులు పతనానికి దారితీస్తుంది. అందరికీ అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ సదుపాయాన్ని వినోద వ్యాపకంగా కాక విజ్ఞాన సేకరణకు అవకాశంగా మార్చుకుంటే యువతకు ప్రయోజనం కలుగుతుంది. సైబర్ నేర ప్రపంచంలో ఇరుక్కోవద్దు సాంకేతిక విప్లవంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సెల్‌ఫోన్ సౌకర్యం దుర్వినియోగం కారణంగా హానికరంగానే మారుతుంది. క్రమశిక్షణాయుతమైన సద్వినియోగంతో తమకు ఎంతో ఉపయోగకరంగా మారాల్సిన సెల్‌ఫోన్ ఇప్పుడు నిర్లక్ష్యం మొదలుకొని నిండు ప్రాణాలను బలి తీసుకునే వరకూ వెళ్తోంది. చివరకు సైబర్ నేర ప్రపంచంలోకి నెట్టేస్తోంది. యువత స్వీయ నియంత్రణ ద్వారా సొల్లు కబుర్లకు, చాటింగ్, పామాజిక అనుసంధాన వెబ్సైట్లలో కాలక్షేపానికి కాస్త దూరం పాటిస్తే దుష్ఫలితాల స్థానంలో సత్ఫలితాలను చూడొచ్చు. -
ఛాటింగ్ మత్తులో యువత..
కంప్యూటర్‌తో చేతులు కలిపి కొత్త ప్రపంచానికి కిటికీలు(విండోస్) తెరిచాం. మీటల(కీబోర్డ్)తో ఆటలు నేర్చిన వేళ్లు శోధన యంత్రం(సెర్చింజన్)లో పయనిస్తున్నాం. అంతర్జాలానికి(ఇంటర్నెట్) మంత్రం వేసి అవాహనం చేసుకున్నాం. నవయుగానికి దారులు వేస్తూ భూమికి అవతలి వైపునకు చూస్తూ పిచ్చాపాటి (ఛాటింగ్) మొదలుపెట్టాం. అందరితోనూ మాటలు(సోషల్ నెట్వర్కింగ్) కలిపి కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. అంతటితో ఆగామా..! నేటి కాలం నిత్యావసరం..చేతిలో అమరిపోయే బుల్లి పరికరంతో(మొబైల్) ఖండాంతరాలు దాటి మాటలు కలుపుతున్నాం. ప్రపంచ విజ్ఞానాన్ని, సుదూరంలో ఉన్న సన్నిహితుల యోగక్షేమాలను తెలుసుకోడానికి రోజుకో కొత్త పేజీ(యాప్)ని సృష్టించుకుంటున్నాం. ‘ఈ-ప్రపంచంలో(నెట్వరల్డ్)లో మేలెంతుందో కీడూ అంతే వుంది. విశాఖ రూరల్ : ఛాటింగ్.. నేటి ఆధునిక తరంలో వచ్చిన అద్భుతం. దేశ విదాశాల్లోని వ్యక్తులందరితోనూ సంభాషిస్తూ, వారి మనోభావాలను, విజ్ఞానాన్ని పంచుకోడానికి ఇదో అద్వితీయమైన సాధనం. ప్రపంచ వ్యాప్తంగా క్షణాల్లో సందేహాలు తీర్చుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఉండడం వల్ల లైవ్ ఛాటింగ్లకు రోజురోజుకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో ఛాటింగ్ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ప్రపంచంలో ఎక్కడివారినైనా పరిచయం చేసుకునే అవకాశం ఉండడంతో కంప్యూటర్, సెల్‌ఫోన్ కోసం తెలిసిన ప్రతి ఒక్కరికీ ఛాటింగ్ ఒక అలవాటైపోయింది. దాంతో అనేక బహుళజాతి కంపెనీలు ఆన్లైన్ ఛాటింగ్‌లతో పాటు సోషల్నెట్వర్కింగ్ సైట్లను ప్రవేశపెట్టాయి. గతంలో ఒక వెలుగువెలిగిన ఆర్కుట్ ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోగా.. ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్, హాయ్5, ఇండియా రాక్స్, పికాసా ఇలా వందల సంఖ్యలో సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. వీటి రాకతో నెట్ ఛాటింగ్ కాస్త వెనుకబడ్డా వినియోగం మాత్రం తగ్గలేదు. అయితే మెసెంజర్లలో వ్యక్తిగత వివరాలు ఇతరులకు తెలిసే అవకాశం లేదు. సోషల్ నెట్‌వర్క్‌లలో మాత్రం వ్యక్తిగత సమాచారంతో పాటు స్నేహితులతో చేసిన సంభాషణలు కూడా ప్రతి ఒక్కరికీ పూర్తిగా తెలిసిపోతుంది. వీటిలో కొన్ని సెక్యూరిటీ మెళకువలు ఉన్నా అవి పూర్తి స్థాయిలో మేలును కలిగించేవి కావని నిపుణుల భావన. ఛాటింగ్ మత్తులో యువత.. ఛాటింగ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఛాటింగ్ ఒక అవసరంలా కాకుండా యువతకు ఒక నిషాగా మారిపోయింది. ఆ మత్తులో కెరీర్‌ను నాశనం చేసుకున్న వారిలో యువతీ, యువకులు కోకొల్లలు. ఈ ఛాట్ రూమ్‌లు కొంత మందికి తమ కెరీర్ మలుచుకోడానికి పనికివస్తుంటే మరికొంత మందికి చేదు అనుభవాలను మిగుల్చుతున్నాయి. ఛాటింగ్‌లతో సమయాన్ని వృథా చేసిన వాళ్లు నూటికి 90 శాతం యువతరమే. జీవితాన్ని నిర్ణయించుకునే ప్రధానమైన దశలో ఎక్కువ సమయం ఛాటింగ్‌ల మూలంగా వ్యర్థమైపోతోంది. ఛాటింగ్ ఉపయోగాలు.. * విజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూ గొప్ప ఆశయాలతో ముందడుగు వేస్తున్నా ఉపయోగించుకునే వారిని బట్టి అది అందించే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కత్తి ఒకటే అయినా దాన్ని ఉపయోగించిన వారిని బట్టి ప్రయోజనం మారినట్టే చక్కగా ఉపయోగించుకుంటే ఛాటింగ్ మన అభివృద్ధికి రాచబాట వేస్తుంది. * తెలివైన వారు, విభిన్న రంగాల్లో నిపుణులతో ఛాటింగ్ మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్పిస్తుంది. * అనుకోకుండా వచ్చే సందేహాలను అప్పటికప్పుడు వెంటనే నివృత్తి చేసుకోడానికి చాలా రెట్లు బాగా ఉపకరిస్తాయి. * పరిస్థితుల ప్రభావం వల్ల కలిగే ఒత్తిడిల నుంచి చక్కని పరిష్కారాన్ని మిత్రుల ద్వారా పొందవచ్చు. * ముఖాముఖి సంభాషణ చేయవచ్చు. * పరీక్షా సమయంలో విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసుకోడానికి అనుకూలం. * కాలేజీల్లో, సంస్థల్లో కార్యక్రమాలు జరిపే బృందాల మధ్య సమాచారం పంచుకునేందుకు ఇంటర్నెట్ ఛాటింగ్ ఉపయోగపడుతుంది. * సోషల్ నెట్వర్కింగ్ సైట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డేటా, ఫొటోలు, వీడియోలు, సాఫ్ట్వేర్ ఇలా ప్రతీది ఒక గ్రూప్‌లో ఉన్నవారితో ఒకేసారి పంచుకోవచ్చు. * మిగతా సమాచార వ్యవస్థలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితోనైనా మాట్లాడవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. * ఛాటింగ్.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అనర్ధాలు ఎక్కువే ఉన్నాయి. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. * పొఫైల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉంచకూడదు. అలాగే ప్రొఫైల్ ఆధారంగా ఎదుట వ్యక్తిని అంచనా వేయకూడదు. * ఛాట్చేసిన ప్రతీ వ్యక్తిని ఫ్రెండ్స్ లిస్టులో చేర్చుకోకండి. దాని వల్ల ఇష్టం లేని వ్యక్తుల నుంచి తప్పించుకోవడం కష్టమవుతుంది. వారి బారిన పడకుండా ఉండడానికి లాగిన్ అయిన ప్రతీసారి ఇన్విజిబుల్ మోడ్‌లోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా అయితే మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్న ఫ్రెండ్స్‌కు మీరు దూరమైపోతారు. * అపరిచితుల నుంచి వచ్చిన ఇమేజ్‌లు, లింక్‌లు, మెసేజ్‌లను తొందరపడి ఓపెన్ చేయకండి. వాటిలో వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. * ఛాటింగ్‌లో కలిసిన ఫ్రెండ్స్‌ను అక్కడే పరిమితం చేయాలి. ముక్కూమొహం తెలియని వారికి నేరుగా కలుసుకోడానికి ప్రయత్నించకూడదు. * చిన్న పిల్లలు ఛాటింగ్‌లో కూర్చొని ఉన్నప్పుడు దగ్గర ఉండి పరిశీలించాలి. * సైబర్ కేఫ్లలోని కంప్యూటర్ల ద్వారా మీరు ఛాటింగ్ చేస్తున్నట్లైతే ‘లాగ్ ఆన్ ఆటోమేటికల్లీ’ ఆప్షన్‌ను సెలక్ట్ చేయకండి. మీ తరువాత ఆ సిస్టంపై కూర్చున్న వారు మీ ఐడీతో ఛాట్ చేసే ప్రమాదం ఉంది. మెసెంజర్ నుంచి పూర్తిగా లాగ్అవుట్ చేసిన తరువాతే సైబర్‌కేఫ్ నుంచి బయటకు రండి. * ‘వన్నా ఛాట్ విత్ మీ’ అంటూ అడగకుండానే ముందుకు వచ్చి పదే పదే బజ్ చేస్తూ విసిగించే వారిని ఎక్కువగా ఎంటర్టైన్ చేయకండి. ఛాట్ రూముల్లో జరిగే చర్చల్లో నథింగ్లు, నాన్సెన్స్లే ఎక్కువ. మీ కెరీర్‌కి ఉపయోగపడే ఛాట్ రూమ్‌ను ఎంపిక చేసుకోవడంలో శ్రద్ధ వహించాలి. అన్నింటినీ మించి ఆఫీసులో ఛాటింగ్ చేయకండి. ఆఫీస్‌లో మీరు ఎవరితో ఛాట్ చేస్తున్నారో మీ బాస్ కనిపెట్టే అవకాశం ఉంటుంది. * ఛాటింగ్, సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో అపరిచితులతో మాట్లాడడం మంచిది కాదు. ఛాటింగ్ ద్వారా ఛీటింగ్ చేసిన కేసులు లెక్కకందనన్ని నమోదయ్యాయి. * ఇంట్లో టీ నేజ్ పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారో పరిశీలించాలి. * ముఖ పరిచయం లేనివారితో ఛాటింగ్ ఆసక్తిగా ఉన్నా అంత సేఫ్ కాదన్న విషయాన్ని గుర్తించాలి. * కాబట్టి యువతీయువకులు ఛాటింగ్, సోషల్నెట్వర్క్లతో బీ కేర్‌ఫుల్. మొబైల్ అప్లికేషన్ల హవా నిన్న మొన్నటి వరకు కంప్యూటర్లలో చాటింగ్ కొనసాగితే.. స్మార్ట్ఫోన్లు ఆ పరిస్థితులను మార్చివేశాయి. కంప్యూటర్ల అవసరం లేకుండా స్మార్ట్ఫోన్లలో ఛాటింగ్ అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్, వీఛాట్, ఛాటాన్, హైక్, ఫెస్బుక్ మెసెంజర్ ఇలా రోజుకో కొత్త అప్లికేషన్లు పుట్టుకొస్తున్నాయి. విదేశీ కంపెనీల నిర్వహణలో ఉన్న ఈ లైవ్‌ఛాట్ అప్లికేషన్లకు మంచి డిమాండ్ ఏర్పడడంతో దేశీయ కంపెనీలు సైతం ఈ ఛాట్ యాప్‌లపై దృష్టి సారించాయి. విదేశీ యాప్‌లకు ధీటుగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. దేశీయ ఐటీ కంపెనీలు రూపొందించే యాప్‌లను వినియోగించి తద్వారా దేశాభివృద్ధికి, ఇక్కడ ఐటీ పురోగతికి సహకారం అందించాలని సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇటీవలే పిలుపునిచ్చారు. దీన్ని బట్టే ఛాటింగ్ అప్లికేషన్ల హవా ఎంత మేర ఉందో, వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అర్థం చేసుకోవచ్చు. -
హర్యానా యువతిపై అత్యాచారం
హాలెండ్ వ్యక్తి అరెస్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పీఎస్‌లో కేసు నమోదు నెట్ చాటింగ్‌లో పరిచయం 8 నెలలుగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు దొడ్డబళ్లాపురం : హర్యానా చెందిన యువతిపై అత్యాచారం ఆపై మోసం చేసాడన్న ఆరోపణపై హాలెండ్‌కు చెందిన వ్యక్తిని ఇక్కడి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని డచ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ సంస్థలో డెరైక్టర్‌గా పని చేస్తున్న హాలెండ్‌కు చెందిన పీటర్(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన యువతి (25) ఇతనిపై మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీటర్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి డీసీపీ వికాస్ కుమార్ మాట్లాడుతూ... హర్యానాకు చెందిన యువతికి జనవరిలో నెట్ చాటింగ్ ద్వారా పీటర్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో పీటర్ ఆమెను వివాహం చేసుకుంటానని బెంగళూరుకు రప్పించి, ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న స్విస్టౌన్ రిసార్ట్‌లో కొన్నాళ్లు సహజీవనం చేశాడు. బాధితురాలు గర్భవతి కాగా, ఆమెను అబార్షన్ చేసుకోమని బెదిరించాడని, తన ను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి 8 నెలలుగా అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పీటర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. -
వీటినీ వాడుతున్నారా..!
వాట్సప్‌ను ఫేస్బుక్ వాళ్లు టేకోవర్ చేసేంత వరకూ దాన్ని వాడిన వాళ్లెంతమంది?! అంతకన్నా ముందు ఆర్కుట్ మాయలో నుంచి బయటకొచ్చి ఫేస్బుక్ బాట పట్టిన తొలివాళ్లలో మీరున్నారా! ఇప్పుడు కూడా మీరు వాట్సప్‌ను వాడుకోవడానికి, ఫేస్బుక్ మెసెంజర్కే పరిమితం అవుతున్నారా? లేక ‘వాట్స్ న్యూ’అంటూ వెదుకుతున్నారా! వెదికేవాళ్లకే అయితే ఇవి పరిచయమే... వాడుకోవడానికి కొత్త సదుపాయాల కోసం వేచి చూస్తున్న వారి కోసం ఇప్పుడు వీటి పరిచయం ఒక అవసరం. టెక్నాలజీని వాడుకోవడంలో రెండు రకాలైన పద్ధతులున్నాయి. అవకాశం ఉంది కదా అని వాడుకోవడం, అందరూ వాడుతున్నారని అనుసరించడం. డబ్బు ఖర్చు పెట్టి వాడుకొనే సేవల విషయం ఎలా ఉన్నా... అందుబాటులో ఉన్న సేవలను అందిపుచ్చుకోవడం మంచి సదుపాయం. అలాంటి సదుపాయాలు కొన్ని... పాథ్టాక్.. వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్ల తీరున పాథ్టాక్లో కూడా మెసేజింగ్ ఉచితం. దీని ద్వారా వాయిస్ మెసేజ్‌లు పంపడానికి కూడా అవకాశం ఉంటుంది. మొదట సోషల్నెట్వర్కింగ్ సైట్ గా మొదలై తర్వాత మెసేజింగ్ అప్లికేషన్‌గా నిలిచింది. మరి టెక్ట్స్ మెసేజింగ్, ఆడియో చాటింగ్ కోసం అయితే ఉన్న అప్లికేషన్లు చాలు.. ఇందులో కొత్త ఏముంది? అంటే.. అది వాడుతుంటే కానీ అర్థం కాదు. కొత్తదారిలో నడిపిస్తూ భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది ఈ అప్లికేషన్. ప్రత్యేకత: పాథ్టాక్లో సర్వర్‌లో మీ చాటింగ్ కేవలం 24 గంటలు మాత్రమే సేవ్ అయ్యి ఉంటుంది. తర్వాత పాత ఊసుల ప్రస్తావన ఉండదు. చాటింగ్‌ను ఎప్పటికప్పుడు ఎరేజ్ చేయాలనుకొనే వారికి పాథ్టాక్ బెస్ట్‌ఫ్రెండ్! లైన్... ఇంకా ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్న అప్లికేషన్ ఇది. 230 దేశాల్లో దీని వాడకందార్లు ఉన్నా.. ఆసియాదేశాల్లో కొంచెం ఎక్కువగా వాడుతున్నారు. మొత్తంగా ఐదు కోట్లమంది యూజర్లున్నారు. అయితే ఈ మెసెంజర్ అప్లికేషన్స్‌తో ఒక సమస్య ఉంటుంది. ఈ అప్లికేషన్‌ను మనం అనుసంధానం చేసుకోవడమే కాకుండా, స్నేహితులు కూడా ఇన్స్టాల్ చేసుకొంటేనే చాట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారం చూసుకొంటే లైన్ వినియోగం విస్తృతం కాలేదని చెప్పవచ్చు. ప్రత్యేకత: లైన్‌ను వాడటం ద్వారా ఎక్కడనుంచి ఎక్కడికైనా, ఎప్పుడైనా ఉచితంగా టెక్ట్స్ చాట్‌తోపాటు వీడియో చాట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేగాక లైన్ అప్లికేషన్లేని స్మార్ట్ఫోన్స్తో కూడా అనుసంధానం కావడానికి అవకాశం ఉంటుంది. అయితే అలా చేయాలంటే కొంత చార్జ్ అవుతుంది. వుయ్ చాట్.. ఇప్పుడిప్పుడే వాడకంలో ఉన్న చాటింగ్ అప్లికేషన్ ఇది. అయితే వాట్సప్ అంత విస్తృతం కాలేదు. గ్రూప్ చాటింగ్ విషయంలో వుయ్చాట్కు తిరుగులేదు. ఒకేసారి. వందమంది స్నేహితులు ఒకే చాట్‌రూమ్‌లో ఉంటూ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాన్ఫరెన్స్‌లా మాట్లాడుకోవడానికి, సమూహంగా చాట్ చేసుకోవడానికి వుయ్చాట్ను మించిన అప్లికేషన్ ప్రస్తుతానికి అయితే లేదు. ప్రత్యేకత: కచ్చితంగా గ్రూప్ చాటింగ్. వైబర్.. వీడియో చాటింగ్ కోసం ఇప్పుడిప్పుడు విస్తృతం అవుతున్న అప్లికేషన్లలో వైబర్ ఒకటి. ప్రస్తుతానికి విశ్వవ్యాప్తంగా కలిపి దాదాపు 20 కోట్ల మంది యూజర్లున్నారు. మనదగ్గర మాత్రం వైబర్ వినియోగదారులు తక్కువమందే. ఇందులో కూడా గ్రూప్చాటింగ్స్కు అవకాశం ఉంటుంది. ఉత్తమ నాణ్యతతో వీడియో చాటింగ్ చేయడానికి వైబర్ మంచి అప్లికేషన్.. స్కైప్ ఫర్ స్మార్ట్‌ఫోన్.. వీడియో చాటింగ్ కోసం అందుబాటులో ఉన్న స్మార్ట్ అప్లికేషన్లు అన్నీ ఒక ఎత్తు అయితే స్మార్ట్‌ఫోన్‌లో స్కైప్ వాడటం మరో ఎత్తు. అన్ని అప్లికేషన్లూ మొబైల్ నంబర్ మీద రిజిస్టర్ అవుతాయి. దాని వల్ల కొన్ని ఇబ్బందులు ఉండనే ఉంటాయి. అదే స్కైప్ అయితే ఇ-మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో స్కైప్ ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. స్నాప్‌చాట్.. పేరుకు తగ్గట్టుగా ఈ అప్లికేషన్ చాలా రోజుల వరకూ ఫోటో షేరింగ్ కు మాత్రమే అవకాశం ఇచ్చేది. అయితే తాజాగా వీడియోకాలింగ్ అప్లికేషన్ గా మారింది. వాడాలి కానీ వీడియో చాటింగ్ విషయంలో స్నాప్‌చాట్ ప్రత్యేకత ఎంతో ఉంది! టచ్‌లో ఉండండి! కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు కాకుండా... మళ్లీ మళ్లీ అప్లికేషన్లు అందించే స్టోర్లలోకి ఎంటరయ్యేది తక్కువమందే! ఒకే క్లిక్‌తో ఐఫోన్ వినియోగదారులు ఐస్టోర్లోకి, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్‌లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఆ అప్లికేషన్ల వెల్లువలోకి ప్రవేశిస్తే.. లెక్కలేనన్ని నూతన అప్లికేషన్లు పలకరిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాటితో టచ్లోఉంటే ఇట్టే టెక్శావీలుగా మారిపోవచ్చు! అందుబాటులోకి వస్తున్న నూతన అప్లికేషన్లను ఆస్వాదించవచ్చు! -
ఫేస్బుక్ చాటింగ్ బానిసగా యువత
ఫేస్బుక్లో ఫొటో అప్డేట్ చేయకపోతే ఆ రోజు ఏదోలా ఉంటుంది. అప్డేట్ చేసిన ఫొటోకు లైక్‌లు రాకపోతే ఇంకా బాధగా ఉంటుంది. వాట్సప్‌లో అయితే రోజూ ఇరవై మెసేజ్‌లైనా పడాల్సిందే. ఎవరు ట్విట్టర్లో ఏం రాశారో తెలుసుకోకపోతే నిద్రే పట్టదు. నేటి తరం విద్యార్థుల కోరికలివి. ప్రపంచం కుగ్రామమై ఇంటర్నెట్ మనుషులను కలుపుతున్న ఈ రోజుల్లో యువత సోషల్ మాయలో పడుతోంది. తద్వారా ప్రమాదాలను కొని తెచ్చుకుంటోంది. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, తెలియని వారితో చాటింగ్‌లు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. దీనికి తోడు సమయమూ వృథా అవుతోంది. విజయనగరం టౌన్: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి అనుగుణంగా సద్వినియోగం చేసుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్‌ను పొందేందుకు సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. కానీ నేటి తరం మాత్రం సోషల్‌మీడియాలో ఉండడం స్టేటస్ సింబల్‌గా భావిస్తోంది. ఫేస్బుక్, వాట్స్ ఆఫ్, ట్విటర్ వంటి వాటి ద్వారా ప్రపంచాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఉత్సాహమే ప్రమాదాలకు కారణమవుతోంది. రాత్రి, పగలు సెల్‌ఫోన్ చేతిలో పెట్టుకుని చాటింగ్‌తో గడిపేసే విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లతో కాలం గడిపేస్తున్నారు. ఇంటర్నెట్, ఫేస్బుక్ మాయలో పడిన వారికెవరికైనా ఆకలి దప్పికలు ఉండవు. యువతీ, యువకులు ఫేస్బుక్ మాయలో పడి బంగారు జీవితాన్ని బలి చేసుకుంటున్న ఘటనలూ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ నెట్వర్క్ ఎంత ఫేమస్ అంటే చాలామంది మొబైల్ ఫోన్లలో ఫేస్‌బుక్‌లు అకౌంట్లు తప్పనిసరి అయిపోయాయి. జిల్లాలోనూ యువతి ఇదే ధోరణి. విద్యార్థుల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్బుక్ ఉపయోగిస్తే అదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైమ్‌పాస్‌కు వాడుకుంటే అనర్థాలకు దారి తీస్తుందని విద్యా వేత్తలు అంటున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏం చేస్తున్నారు. వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే అంశాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు. స్మార్టఫోన్లు వాడుతున్న వారిపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాలని అంటున్నారు. చాటింగ్ బానిసగా యువత ప్రస్తుతం హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులు చాటింగ్ అనే వ్యసనానికి బానిసలుగా తయారయ్యారు. చదువు కంటే ముందు దీనికి బానిసగా మారుతూ ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే చిన్నతనంగా భావిస్తున్నారు. తీరిక దొరికినప్పుడల్లా కంప్యూటర్, సెల్ఫోన్లలో ఫేస్బుక్ చాటింగ్‌లు చేస్తూ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు. దీంతో వారి చదువు దెబ్బ తింటోంది. ఆలోచన ధోరణి కూడా మారుతోంది. ఇక కొత్త పరిచయాల చాలా సార్లు ప్రమాదానికి హేతువులవుతున్నాయి. దీనికి తోడూ బినామీ అకౌంట్లతో ఫేస్బుక్ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు,సెలబ్రెటీలు, ప్రముఖుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేయడంతో కొందరికి తెలియని కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. అందుకే విద్యార్థులు ఈ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పలువురు విద్యా వేత్తలు సూచిస్తున్నారు. -
ఫేస్బుక్ స్నేహం ప్రమాదకరం
హైస్కూల్ స్థాయి విద్యార్థి సైతం ఫేస్బుక్ వినియోగిస్తున్నాడంటే యూజర్లు ఏ సంఖ్యలో ఉన్నా రో అర్థమవుతుంది. చదువుకంటే ముందు దీనికి బాని సగా మారు తూ ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే చిన్నతనంగా భావించే వారున్నారంటే అతిశయోక్తి కాదు. తీరిక దొరికినప్పుడల్లా కంప్యూటర్, సెల్ఫోన్లలో ఫేస్బుక్ చాటిం గ్లు చేస్తూ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు యువతీ యువకులు. ఈ తరహ లోకంలో ఎందరో అపరిచిత వ్యక్తులు తారసపడుతున్నారు. వారితో చాటింగ్, పోస్టు లు, లైకులు చేస్తూ స్నేహం పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిచయాలు కొందరి జీవి తాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. తీయటి పలుకుతో వచ్చే సందేశాలకు యువతీ యువకులు వారి మాయలోపడి అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. దీనికితోడు బినా మీ అకౌంట్లతో ఫేస్బుక్ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు, సెలబ్రేటీలు, ప్రముఖల ఫొటోలను మార్ఫింగ్ చేసి అపలోడ్ చెయ్యడంతో కొందరికి తెలియని కష్టాలు వచ్చిపడుతున్నాయి. పైశాచిక ఆనందంతో అలా చేసేవారెవరో తెలి యకపోగా అమాయకులు అడ్డంగా బుక్ అవుతున్నారు. న్యూఢిల్లీ : మారిన సాంకేతిక విప్లవంలో వింత ప్రపంచం లాంటి ఇంటర్నెట్, ఫేస్బుక్ అకౌంట్లతో మునిగి తేలుతున్న వారికి వయస్సుతో పనిలేదనిపిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఫేస్బుక్ అకౌం ట్ కలి గి ఉండడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో విరివిగా విస్తరించిన సోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్బుక్ ప్రాచుర్యం పొందింది. తమకు నచ్చిన అంశాన్ని స్నేహితులతో పంచుకోవడం, నచ్చిన చిత్రాలను, సందేశాలను పోస్ట్ చేయడం. ఆ తరువాత వాటికి ఎన్ని లైక్‌లు, షేర్ లు, కామెంట్లు వచ్చాయో చూసుకోవడం పరిపాటయింది. కళాశాలల, పాఠశాలల విద్యార్థులే కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఫేస్ బుక్‌తో నిత్యం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎక్కడ చూసినా, సందర్భమేదైనా ఫేస్బుక్ చర్చలే కనిపిస్తున్నాయి. సోషల్ నెట్వర్క్ ఎంత ఫేమస్ అంటే చాలామంది మొబైల్ఫోన్లనో ఫేస్బుక్ అకౌంట్లు ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటన క్షణాల్లో నేడు సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. ఏమూల ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరినీ ఫేస్బుక్ వైపు మళ్ళిస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో యువత ఫేస్బుక్ ద్వారా చేసుకున్న చాటింగ్‌లు ఘర్షణలకు దారితీయడం, ఒకరి పార్టీని ఒకరు విమర్శించుకుంటూ తగవులు పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఇంటర్ విద్యార్థినితో ఓ ఆకతాయి చేసిన చాటింగ్ ఆ యువతి ఇల్లు విడిచి వచ్చేలా చేసింది. దీంతో కుటుంబ తగాదాలు చోటు చేసుకున్నాయి. తల్లిదండ్రులు దృష్టి సారించాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్బుక్ ఉపయోగిస్తే ఆదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించా లి. తమ పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏంచేస్తున్నా రు. వాటిని ఏవిధంగా వాడుతున్నారనే దానిపై దృష్టిసారించాలి. అడగ్గానే ఇంటర్ విద్యార్థికి కూడా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొని చేతి లో పెడుతున్నారు. ఫోన్లలో గేమ్లాడుతున్నామని చెప్పి ఎక్కువ సమ యం ఫేస్బుక్ చాటింగ్‌లు చేస్తుంటారు.. వాటిని గమనించాలి. పిల్లల స్నేహాలు, పరిచయాలు, ప్రవర్తనలపై ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ఆఫర్లతో హోరెత్తిస్తున్న ఆపరేటర్లు వినియోగదారుల వాడకాన్ని దృష్టిలో పెటుకుని వివిధ కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్ ఆపరేటర్లు ఇంటర్నెట్, ఫేస్‌బుక్‌ల అకౌంట్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ఆఫర్లు కూడా ఎక్కువగా రాత్రి సమయంలో వినియోగించుకునే విధంగా ఉంటున్నాయి. కొన్ని నెట్వర్కలు ఒక్క రూపాయితో రాత్రి ఫేస్బుక్, రూ.12 లతో అర్ధరాత్రి దాటిన తరువాత అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇవన్నీ యువతకోసమేనంటూ ప్రచారం చేస్తున్నాయి. బినామీపేర్లతో అకౌంట్లు ఎన్నో... కొందరు బినామీ పేర్లతో అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మా యిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్ లతో ఫ్రెండ్షిప్లు పెంచుకుని వారితో చాటింగ్ చేస్తారు. ఒకరికి ఒక రు తెలియక పోయినా రిక్వెస్ట్‌లతో వేలసంఖ్యలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ పెరి గిపోతారు. ఈ క్రమంలోనే అశ్లీల చిత్రాలు అప్లోడ్ చెయ్యడం దగ్గర నుంచి వ్యక్తిగత కామెంట్లతో మెసేజ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రేటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయ డం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందు తున్నా రు. ఒక ఫేస్బుక్ అకౌంట్‌కు ఫ్రెండ్స్‌గా ఉన్న వారందరికి ఈ మెసేజ్ లేదా చిత్రాలు అప్లోడ్ అవుతాయి. వీటన్నింటినీ బినామీ అకౌంట్ల నుంచి పంపుతున్నారు. వీటివల్ల వచ్చే సమస్యల్లో చిక్కు కుని అమా యకులు కేసుల్లో ఇరు క్కుని చట్టానికి చిక్కుతున్నారు. సైబర్ నేరాల గురించి తెలియని అమాయకులు ఫేస్బుక్లో ఫొటోలు పెట్టు కుంటే వాటిని డౌన్లోడ్ చేసి కామెంట్లతో అప్లోడ్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట చోటుచేసుకోవడం చూస్తున్నాం. ఈ సంఘట నలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితే గాని బినా మీల సంగతి బయటకు రావడంలేదు. పోలీస్‌ల దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్బుక్ అకౌంట్ గురించి ఆరాతీస్తే అసలు ఫేస్బుక్ అంటే తెలియని అమాయకుల వివరాలు బయటపడుతున్నాయి. ఎక్కువగా నెట్ సెంటర్‌కు వెళ్లి చాటింగ్ చేసేవారు బినామీ అకౌంట్లు క్రియేట్ చేసి అమాయకులను ఇరికిస్తున్నారు. -
జర జాగ్రత్త ఫేస్'బుక్' చేస్తుంది
► పెడదోవ పడుతున్న యువత ►చాటింగ్‌తో సమయం వృధా ►అపరిచిత వ్యక్తులతో ఫేస్బుక్ ►స్నేహం ప్రమాదకరం రాత్రి లేదు... పగలూ లేదు ఎప్పుడు చూసినా సెల్ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చుని ఏక చాటింగ్లే. పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లుతో కాలంగడిపేస్తున్నారు నేటి యువత. ఎనీటైం..ఎనీ ప్లేస్ చేతిలో సెల్‌తో చాటింగ్. ఇంటర్నెట్, ఫేస్బుక్ మాయలో పడ్డవారెవరైనా సరే వారికి ఆకలి దప్పికలుండవు. యువతీ, యువకులు ఫేస్బుక్ మాయలోపడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అడ్డంగా బుక్ అవుతూ ఊచలు లెక్కిస్తున్నారు. ఉప్పలగుప్తం : మారిన సాంకేతిక విప్లవంలో వింత ప్రపంచం లాంటి ఇంటర్నెట్, ఫేస్బుక్ అకౌంట్లతో మునిగి తేలుతున్న వారికి వయస్సుతో పనిలేదనిపిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉండడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో విరివిగా విస్తరించిన సోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్బుక్ ప్రాచుర్యం పొందింది. తమకు నచ్చిన అంశాన్ని స్నేహితులతో పంచుకోవడం, నచ్చిన చిత్రాలను, సందేశాలను పోస్ట్ చేయడం. ఆ తరువాత వాటికి ఎన్ని లైక్‌లు, షేర్లు, కామెంట్లు వచ్చాయో చూసుకోవడం పరిపాటయింది. కళాశాలల, పాఠశాలల విద్యార్థులే కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఫేస్‌బుక్‌తో నిత్యం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎక్కడ చూసినా, సందర్భమేదైనా ఫేస్బుక్ చర్చలే కనిపిస్తున్నాయి. సోషల్ నెట్వర్క్ ఎంత ఫేమస్ అంటే చాలామంది మొబైల్ఫోన్లనో ఫేస్బుక్ అకౌంట్లు ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటన క్షణాల్లో నేడు సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. ఏమూల ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరినీ ఫేస్బుక్ వైపు మళ్ళిస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో యువత ఫేస్బుక్ ద్వారా చేసుకున్న చాటింగ్‌లు ఘర్షణలకు దారితీయడం, ఒకరి పార్టీని ఒకరు విమర్శించుకుంటూ తగవులు పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఇంటర్ విద్యార్థినితో ఓ ఆకతాయి చేసిన చాటింగ్ ఆ యువతి ఇల్లు విడిచి వచ్చేలా చేసింది. దీంతో కుటుంబ తగాదాలు చోటు చేసుకున్నాయి. తల్లిదండ్రులు దృష్టి సారించాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్బుక్ ఉపయోగిస్తే ఆదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. తమ పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏంచేస్తున్నారు. వాటిని ఏవిధంగా వాడుతున్నారనే దానిపై దృష్టిసారించాలి. అడగ్గానే ఇంటర్ విద్యార్థికి కూడా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొని చేతిలో పెడుతున్నారు. ఫోన్లలో గేమ్లాడుతున్నామని చెప్పి ఎక్కువ సమయం ఫేస్బుక్ చాటింగ్‌లు చేస్తుంటారు.. వాటిని గమనించాలి. పిల్లల స్నేహాలు, పరిచయాలు, ప్రవర్తనలపై ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ఆఫర్లతో హోరెత్తిస్తున్న ఆపరేటర్లు వినియోగదారుల వాడకాన్ని దృష్టిలో పెటుకుని వివిధ కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్ ఆపరేటర్లు ఇంటర్నెట్, ఫేస్‌బుక్‌ల అకౌంట్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ఆఫర్లు కూడా ఎక్కువగా రాత్రి సమయంలో వినియోగించుకునే విధంగా ఉంటున్నాయి. కొన్ని నెట్వర్కలు ఒక్క రూపాయితో రాత్రి ఫేస్బుక్, రూ.12 లతో అర్ధరాత్రి దాటిన తరువాత అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇవన్నీ యువతకోసమేనంటూ ప్రచారం చేస్తున్నాయి. బినామీపేర్లతో అకౌంట్లు ఎన్నో... కొందరు బినామీ పేర్లతో అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్‌లతో ఫ్రెండ్షిప్లు పెంచుకుని వారితో చాటింగ్ చేస్తారు. ఒకరికి ఒకరు తెలియక పోయినా రిక్వెస్ట్‌లతో వేలసంఖ్యలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ పెరిగిపోతారు. ఈ క్రమంలోనే అశ్లీల చిత్రాలు అప్లోడ్ చెయ్యడం దగ్గర నుంచి వ్యక్తిగత కామెంట్లతో మెసేజ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రేటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒక ఫేస్బుక్ అకౌంట్‌కు ఫ్రెండ్స్‌గా ఉన్న వారందరికి ఈ మెసేజ్ లేదా చిత్రాలు అప్లోడ్ అవుతాయి. వీటన్నింటినీ బినామీ అకౌంట్ల నుంచి పంపుతున్నారు. వీటివల్ల వచ్చే సమస్యల్లో చిక్కుకుని అమాయకులు కేసుల్లో ఇరుక్కుని చట్టానికి చిక్కుతున్నారు. సైబర్ నేరాల గురించి తెలియని అమాయకులు ఫేస్బుక్లో ఫొటోలు పెట్టుకుంటే వాటిని డౌన్లోడ్ చేసి కామెంట్లతో అప్లోడ్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట చోటుచేసుకోవడం చూస్తున్నాం. ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితేగాని బినామీల సంగతి బయటకు రావడంలేదు. పోలీస్‌ల దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్బుక్ అకౌంట్ గురించి ఆరాతీస్తే అసలు ఫేస్బుక్ అంటే తెలియని అమాయకుల వివరాలు బయటపడుతున్నాయి. ఎక్కువగా నెట్ సెంటర్‌కు వె ళ్లి చాటింగ్ చేసేవారు బినామీ అకౌంట్లు క్రియేట్ చేసి అమాయకులను ఇరికిస్తున్నారు. గంటల తరబడి చాటింగ్ హైస్కూల్ స్థాయి విద్యార్థి సైతం ఫేస్బుక్ వినియోగిస్తున్నాడంటే యూజర్లు ఏ సంఖ్యలో ఉన్నారో అర్థమవుతుంది. చదువుకంటే ముందు దీనికి బానిసగా మారుతూ ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే చిన్నతనంగా భావించే వారున్నారంటే అతిశయోక్తి కాదు. తీరిక దొరికినప్పుడల్లా కంప్యూటర్, సెల్ఫోన్లలో ఫేస్బుక్ చాటింగ్‌లు చేస్తూ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు యువతీ యువకులు. ఈ తరహ లోకంలో ఎందరో అపరిచిత వ్యక్తులు తారసపడుతున్నారు. వారితో చాటింగ్, పోస్టులు, లైకులు చేస్తూ స్నేహం పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిచయాలు కొందరి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. తీయటి పలుకుతో వచ్చే సందేశాలకు యువతీ యువకులు వారి మాయలోపడి అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. దీనికితోడు బినామీ అకౌంట్లతో ఫేస్బుక్ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు, సెలబ్రేటీలు, ప్రముఖల ఫొటోలను మార్ఫింగ్ చేసి అపలోడ్ చెయ్యడంతో కొందరికి తెలియని కష్టాలు వచ్చిపడుతున్నాయి. పైశాచిక ఆనందంతో అలా చేసేవారెవరో తెలియకపోగా అమాయకులు అడ్డంగా బుక్ అవుతున్నారు. -
చాటింగ్‌తో లాభం!
నేటి తరం ఎక్కువగా అంకితం అవుతున్నవాటిలో ఆన్లైన్ చాటింగ్ ఒకటి. చాటింగ్ ద్వారా కొన్ని చీటింగ్స్ జరుగుతాయని అంటారు. కానీ, దానివల్ల లాభం చేకూరుతుందనే కథాంశంతో లావణ్య చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘చాటింగ్’. అభినయకృష్ణ, సునీత మరసీయర్ జంటగా టీయస్ కమల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వచ్చే నెల 4న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇదొక యూత్‌ఫుల్ లవ్, కామెడీ ఎంటర్టైనర్. చాటింగ్ వల్ల జరిగే మంచిపనులను చూపించే చిత్రం. జయంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
పీసీతో ఇలా... చకచకా!
ఇంట్లో ఓ పీసీ, దానికో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం చేయలేని పనంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఈమెయిళ్లు, చాటింగ్‌లు, ఆఫీసు పనులను పక్కనబెడితే... ఏ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా ఎన్నో సరదా, సీరియస్ పనులను చక్కబెట్టుకోవచ్చు. కేవలం గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ వంటి బ్రౌజర్లతో మాత్రమే ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు... ఏయే పనులు చేయవచ్చో మచ్చుకు చూద్దామా.... జీమెయిల్ కోసం రెండు ఆప్స్... జీమెయిల్లో మెసేజ్ టైప్ చేసి... మెయిల్ ఫలానా టైమ్‌కు, ఫలానా వారికి పంపితే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే బూమరాంగ్ మీకోసమే. www.boomeranggmail.com/వెబ్సైట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. మీ మెయిళ్లను మీరు అనుకున్న సమయానికి పంపేందుకు వీలు ఏర్పడుతుంది. అయితే ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్ కాకపోవడం గుర్తుంచుకోవాలి. బేసిక్ అకౌంట్ ద్వారా నెలకు 10 మెయిళ్లను ఉచితంగా షెడ్యూల్ చేసి పంపవచ్చు. అంతకంటే ఎక్కువ మెయిళ్లను పంపాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం సర్వీసులకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీకు ఒకటికంటే ఎక్కువ జీమెయిల్ అకౌంట్స్ ఉంటే... వాటిని ఒకేచోట చూసుకునేందుకు వీలు కల్పిస్తుంది చెకర్ ప్లస్ ఫర్ జీమెయిల్. క్రోమ్ వెబ్‌స్టోర్ ద్వారా లభించే ఈ ఎక్స్టెన్షన్లో ఒక డ్రాప్‌డౌన్ మెనూ ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్లలో చదవని మెయిళ్లు, వాటి ప్రివ్యూలు కనిపిస్తూంటాయి. ఫొటోలకు రంగులు అద్దండి... స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోలు తీయడం బాగా పెరిగిపోయింది. అయితే ఈ ఫొటోలకు సరదాగా రంగులద్దాలనుకుంటే? లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించాలను కుంటే సైకోపెయింట్ అవకాశం కల్పిస్తుంది. రకరకాల పెయింట్ శైలుల నుంచి ఆన్లైన్లోనే మీ ఫోటోలకు రంగులు అద్దవచ్చు. లేదంటే సిద్ధంగా ఉన్న కొన్ని టూల్స్‌ను వాడుకోవచ్చు కూడా. మీకు పెయింటింగ్‌తో పరిచయముంటే కొత్తకొత్త డిజిటల్ కళాఖండాలను తయారు చేసేందుకు ఈ వెబ్సైట్లో బోలెడు రకాల బ్రష్‌లు, పెయింట్ ఎఫెక్ట్లు ఇచ్చే ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం psykopaint.comవెబ్సైట్ చూడండి. ఐఫోన్ అప్లికేషన్గానూ సైకోపెయింట్ లభిస్తోంది. ఫోటోల ఎడిటింగ్... ఫోటోలకు పెయింట్ లక్షణాలను చేర్చేందుకు సైకోపెయింట్ ఉపయోగపడితే... సైజును సరిచేయడం, రంగులు నియంత్రించడం, వెలుతురును అడ్జస్ట్ చేయడం వంటి పనులకు పిక్స్‌లర్ దారి చూపుతుంది. పూర్తిస్థాయి ఫొటో ఎడిటింగ్ కోసం పిక్స్‌లర్ ఎడిటర్, ఎఫెక్ట్‌లను చేర్చేందుకు పిక్స్‌లర్ ఓ మాటిక్, వేగంగా కొన్ని అంశాలను మాత్రమే సరిచేయాలనుకుంటే పిక్స్‌లర్ ఎక్స్‌ప్రెస్.. ఇలా మూడు లేయర్లలో ఈ వెబ్సైట్ సేవలు పనిచేస్తాయి. ఒక్కో లేయర్లో ఫొటోల నాణ్యతను పెంచేందుకు కొన్ని టూల్స్ ఏర్పాటు చేశారు. ఎడిటింగ్ మొత్తం పూర్తయ్యాక మీ ఫోటోలను మళ్లీ కంప్యూటర్‌పై సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్: Pixlr.com ఈసెల్.ఎల్వై... వెయ్యి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక ఫొటో ద్వారా చెప్పవచ్చు. అలాంటి ఫోటోలకు అంకెలు, గ్రాఫ్‌లు కూడా కలిశాయనుకోండి... విషయాన్ని సూటిగా, వివరించవచ్చు. అచ్చంగా ఈ పనులన్నింటికీ ఉపయోగపడే వెబ్సైట్ ఈసెల్.ఎల్వై. దాదాపు 300కుపైగా ఉన్న లేఔట్లను ఉచితంగా వాడుకునే అవకాశముంది. ఆ లేఔట్లపై రకరకాల ఫొటోలు, చిత్రాలను చేర్చుకునే సౌలభ్యం ఉంది దీంట్లో. పూర్తయిన తరువాత ఇన్ఫోగ్రాఫిక్ను జెపీఈజీ, పీడీఎఫ్ ఫార్మాట్లలో సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ : www.easel.ly డెస్క్టాప్పై నోటీస్‌బోర్డు... ఏరోజుకు ఆరోజు మీరు చేయాల్సిన పనులను గుర్తు పెట్టుకునేందుకు ప్యాడ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. www.padlet.comవెబ్సైట్లో ఒకసారి ఫ్రీఅకౌంట్ను క్రియేట్ చేసుకుంటే చాలు. డెస్క్టాప్పై ఒక బ్లాంక్ నోటీస్‌బోర్డు ప్రత్యక్షమవుతుంది. మౌస్తో డబుల్‌ట్యాప్ చేయడం ద్వారా మీరు అందులో నోట్లు ఉంచుకోవచ్చు. టెక్ట్స్‌తోపాటు వెబ్‌లింక్‌లు, ఫైళ్లు, వెబ్‌క్యామ్‌తో తీసిన ఫొటోలను కూడా ఉంచుకోవచ్చు. ఇతరులతో షేర్ చేసుకునేందుకు అవకాశముంది. బ్లాంక్‌గా ఉండటం బోరు కొట్టిస్తూంటే అందమైన వాల్పేపర్లతో అలంకరించుకోవచ్చు. రకరకాల లేఔట్లతో తీర్చిదిద్దుకోవచ్చు కూడా. -
చాటింగ్ గీతాలు
అభినయ్‌కృష్ణ, సునీత జంటగా.. టీఎస్ కమల్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘చాటింగ్’. జయంత్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగబాబు ఆడియో సీడీని ఆవిష్కరించి, మంత్రి రుద్రరాజు పద్మరాజుకి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. హీరో అభినయ్ ఈ సినిమాకోసం ఎన్నో సాహసాలు చేశాడని దర్శకుడు అభినందించారు. ఇంకా నిర్మాత అశోక్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైర్లెస్ కమ్యూనికేషన్లో ప్రైస్‌లెస్ చాటింగ్!
మన కమ్యూనికేషన్ వైర్ లెస్... దీన్ని ప్రైస్ లెస్‌గా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. టెక్ట్స్, ఆడియో, వీడియో... ఏ రూపంలోనైనా సరే... మూడు మిక్స్ చేసి అయినా సరే... ఉచితంగా కమ్యూనికేట్ అవ్వడానికి చాలా సదుపాయాలున్నాయి. ఇంటర్నెట్ సదుపాయమున్న స్మార్ట్ డివైజ్ చేతిలో ఉండాలి కానీ.. స్నేహితులతో ఉచితంగా చాటింగ్ చేసుకోవచ్చు. సెల్‌ఫోన్ బిల్లును తగ్గించేసుకోవచ్చు! ఈ సదుపాయాన్ని కలిగించే స్మార్ట్‌ఫోన్ కమ్ పీసీ అప్లికేషన్లివి... చాలా మందికి స్కైప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. అయితే దీన్ని అందరూ ఉపయోగించట్లేదు. కొందరు తెలియక, మరి కొందరికి తీరిక లేక! కోట్లాది ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్న మన దేశంలో ఈ స్కైప్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువే. ప్రత్యేకంగా స్కైప్ అకౌంట్ లేకపోయినా, కేవలం స్కైప్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. అయితే.. మన వాళ్ల దగ్గర వెబ్‌క్యామ్ సదుపాయం సరిగా లేకపోవడం స్కైప్ వినియోగం తక్కువగా ఉండటానికి ఒక కారణమని అంటున్నారు నిపుణులు. ల్యాప్‌టాప్‌లు వాడుతున్న వారు మాత్రం స్కైప్‌ను విస్తృతంగా వాడుతున్నారు. ఉచితంగా వీడియో చాటింగ్ ముచ్చట తీర్చుకుంటున్నారు. కేవలం సదుపాయ కోణంలో మాత్రమే కాదు.. ఎగ్జైట్మెంట్ విషయంలో కూడా స్కైప్ వీడియో చాటింగ్ మంచి కిక్ ఇస్తుంది! మొబైల్స్ కోసం వియ్‌చాట్... భిన్నమైన మొబైల్ ప్లాట్పామ్స్ మీద పనిచేస్తుంది ఈ అప్లికేషన్. లైవ్‌చాట్, గ్రూప్‌చాట్, వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియన్, విండోస్ఫోన్లపై ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. దీంట్లోని ‘షేక్’ ఫీచర్ ద్వారా కొత్త ఫ్రెండ్స్‌ను సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పీసీ అయినా స్మార్ట్‌ఫోన్ అయినా గూగుల్ హ్యాంగౌట్స్.. జీమెయిల్ లేదా, గూగుల్‌ప్లస్ ద్వారా ఈ హ్యాంగౌట్‌ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్‌క్యామ్ ఉన్న పీసీ అయినా, ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ అయినా గూగుల్ హ్యాంగౌట్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే స్కైప్, వుయ్ చాట్ల కన్నా గూగుల్ హ్యాంగౌట్ వెనుకపడింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ విషయంలో 2.3 జింజర్ బ్రీడ్ ఆ తర్వాతి మోడళ్లపై ఇది పనిచేస్తుంది. ఐఫోన్ల విషయంలో ఐఓఎస్6 ఆ తర్వాతి మోడళ్లపై పనిచేస్తుంది. రీచార్జ్ అవసరం లేకుండా చేసే టాంగో... మొబైల్ ద్వారా ఫ్రీ కాల్స్ చేసుకోవడానికున్న మరో అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ ద్వారా వీడియో, వాయిస్ కాల్స్, టెక్ట్స్, ఫోటో షేరింగ్‌కు అవకాశం ఉంటుంది. ఫ్రింగ్ తో ఫోన్‌కాల్స్ ఫ్రీ... ఫ్రీగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి అవకాశమిచ్చే మరో ఉచిత అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ ద్వారా గరిష్టంగా నలుగురి వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం ఉంటుంది. ఫోన్ నంబర్‌తో అకౌంట్.. వైబర్ ఈ అప్లికేషన్ ద్వారా ప్రత్యేకమైన అకౌంట్ ఏదీ లేకుండానే ఫ్రీ ఛాటింగ్ చేసుకోవచ్చు. వైబర్ను ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ నంబర్ ద్వారానే అకౌంట్ క్రియేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న మిగతా నంబర్లలో వేటికైనా వైబర్ అకౌంట్ ఉంటే అవన్నీ ఆటోమెటిక్‌గా యాడ్ అవుతాయి. ఇవేకాదు... ఇంకా ఉన్నాయి.. నింబజ్ , వాట్స్ అప్, హైక్.. తదితరాలు కూడా ఉచిత కాలింగ్, టెక్ట్స్ మెసేజింగ్, వీడియో చాటింగ్ విషయాల్లో సదుపాయవంతమైన అప్లికేషన్స్‌గా ఉన్నాయి. -
చాటింగ్ పేరుతో చీటింగ్
ఒంగోలు, న్యూస్‌లైన్ :చాటింగ్ పేరుతో చీటింగ్ చేస్తున్న ఇద్దరు యువకుల గుట్టురట్టయింది. నాలుగు రోజుల క్రితం ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఒంగోలు టూటౌన్ పోలీసులు బీటెక్ పూర్తిచేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సైబర్ నేరం కింద కూడా కేసు నమోదు చేశారు. స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో టూటౌన్ సీఐ సూర్యనారాయణ ఆ వివరాలు వెల్లడించారు. అసలు ఏం జరిగిందంటే... కాకినాడకు చెందిన వికలాంగురాలైన ఓ యువతి బతుకుదెరువు కోసం ఒంగోలు చేరుకుంది. స్థానిక భాగ్యనగర్‌లో చైతన్య టెక్నికల్ సపోర్టు పేరుతో వ్యాపారం చేస్తున్న రావిపాటి చైతన్య(బీటెక్)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. రావిపాటి చైతన్య ఒంగోలులోని మామిడిపాలెం నివాసి. రామ్‌నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని తనకు పరిచయమైన వికలాంగురాలైన యువతితో అతను సహజీవనం చేస్తున్నాడు. అతని స్నేహితుడు అరుణ్‌కుమార్ కూడా వారితోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో చైతన్యతో సహజీవనం చేస్తున్న యువతి పట్ల అరుణ్‌కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఒంగోలు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. స్పందించిన సీఐ.. వెంటనే ఒక కానిస్టేబుల్‌ను పంపించి అరుణ్‌కుమార్‌ను తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. కాగా, ఇక్కడ కథ కొత్త మలుపు తిరిగింది. సైబర్ నేరం వెలుగులోకి ఇలా... సీఐ పంపిన కానిస్టేబుల్ అరుణ్‌కుమార్ కోసం చైతన్య టెక్నికల్ సపోర్టు సంస్థ వద్దకు వెళ్లాడు. అక్కడ చైతన్య, అరుణ్కుమార్లిద్దరూ చాటింగ్ చేస్తున్నారు. అక్కడకు వెళ్లిన కానిస్టేబుల్‌కి కూడా ఇంటర్నెట్ నాలెడ్జి ఉండటంతో వారు సైబర్ నేరానికి పాల్పడుతున్నట్లు వెంటనే గ్రహించాడు. వారిద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. తాము ఏం చేస్తున్నది...ఎందుకు చేస్తున్నది యువకులిద్దరూ బహిరంగం చేయడంతో వారిని అరె స్ట్ చేశారు. వారు ఉపయోగించిన కంప్యూటర్ను కూడా సీజ్ చేశారు. నేరం చేసింది ఇలా... చైతన్యకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు. ఆ క్లాస్మేట్ అన్నే కోణాల అరుణ్‌కుమార్. అలా చైతన్యకు, అరుణ్‌కుమార్‌కు మధ్య స్నేహం ఏర్పడింది. అరుణ్‌కుమార్ విజయవాడవాసి. కొద్దినెలల క్రితం చైతన్యకు అరుణ్‌కుమార్ ఫోన్‌చేసి తనకు అప్పులు పెరిగిపోయాయని, ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయాడు. దీంతో ఒంగోలుకు రమ్మని చెప్పిన చైతన్య అప్పులు తీరేందుకు, అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేశాడు. ఇద్దరూ ఆ ప్లాన్‌తో రంగంలోకి దిగారు. దొంగపేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్చేశారు. దాంతోపాటు చాట్.డ్యూడ్.కాం పేరుతో చాటింగ్ మొదలుపెట్టారు. అయితే, ఫేస్బుక్ అకౌంట్లో యువతిగా రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి పలువురు ఫేస్బుక్ యూజర్లు స్నేహితులుగా మారారు. వారితో లేడీవాయిస్లో హస్కీగా మాట్లాడుతూ బుట్టలో వేసుకున్నారు. తర్వాత చైతన్యతో సన్నిహితంగా ఉంటున్న యువతితో మాట్లాడించేవారు. దాంతోపాటు ఆమె ఫొటోలు అటాచ్‌చేసి ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని, తమకు డబ్బు కావాలని కోరేవారు. డబ్బులు ఇస్తే మీరు ఏం చేయమన్నా చేయడానికి సిద్ధమంటూ పరోక్షంగా అవతలి యువకులను చాటింగ్ ద్వారానే రెచ్చగొట్టేవారు. అయితే, అవతలి వ్యక్తులు కూడా వీరి మాటలకు పడిపోయి వారు కూడా కొంతమంది అమ్మాయిల ఫొటోలను వీరికి పంపారు. దీంతో ఆ ఫొటోలను తమకు పంపినందుకు తాము పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి అరెస్ట్ చేయిస్తామంటూ అవతలి వారిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టేవారు. అప్పటివరకు గుట్టుగా ఉన్న తమ విషయం ఎక్కడ రట్టవుతుందోనన్న భయంతో వీరికి ఫొటోలు పంపి బుక్ అయిన చాలామంది డబ్బు పంపడానికి సిద్ధపడేవారు. ఈ క్రమంలో నిందితులిద్దరూ కంకిపాడులోని ఒక బ్యాంకులో నకిలీ పత్రాలతో ఆర్యన్ అనే పేరుతో అకౌంట్ ఓపెన్చేశారు. బ్లాక్‌మెయిలింగ్ ద్వారా వచ్చేడబ్బును ఆ అకౌంట్లో వేయించుకునేవారు. ఇలా గత మూడు నెలల కాలంలో 3 లక్షల రూపాయలకుపైగా డబ్బు డ్రా చేశారు. ఇలా సైబర్ నేరం కొనసాగిస్తున్న సమయంలో చైతన్యతో సహజీవనం చేస్తున్న యువతి తాను ఇతరులతో మాట్లాడనంటూ మొండికేసింది. ఈ క్రమంలో చైతన్య, అరుణ్‌కుమార్‌లు ఒంగోలులోని ఇద్దరు యువతులతో పరిచయం ఏర్పరచుకుని మాట్లాడించారు. చివరకు ఒక యువతి చేసిన ఫిర్యాదుతో పాటు కానిస్టేబుల్ ఇంటర్నెట్ పరిజ్ఞానం నిందితులను పట్టించింది. నిందితులను పూర్తిగా విచారించి వారికి డబ్బు పంపిన వారిని, నకిలీ ఫేస్బుక్ అకౌంట్లతో మోసం చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు సీఐ తెలిపారు. -
స్మార్ట్‌ఫోన్‌తో ఆత్మసంభాషణ..!
మీకు స్మార్ట్‌ఫోన్ వినియోగంలో రొటీన్ అప్లికేషన్లతో బోర్ కొట్టిందా? గేమ్స్, చాటింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి అప్లికేషన్లతో విసుగనిపిస్తుంటే.. కొంచెం వెరైటీగా ట్రై చేయడానికి అవకాశమిస్తున్నారు ఇండియానాకు చెందిన దెయ్యాల పరిశోధకులు. భార్యాభర్తలైన రోజర్, జిల్లీలకు దెయ్యాలతో మంచి సంబంధ బాంధ్యవ్యాలున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని కూడా వారు దెయ్యాల స్టాండర్డ్‌కు తగ్గట్టుగా తీర్చారు. దెయ్యాలతో కమ్యూనికేట్ చేయడానికి తగ్గట్టుగా తాము స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను రూపొందించామని ప్రకటించారు ఈ దంపతులు. ఇక ఎలక్ట్రానిక్ డివైజ్ ల ద్వారా ఆత్మలతో కమ్యూనికేట్ కావచ్చనే వాదన కూడా చాలా పాతదే! పోలరాయిడ్ కెమెరాల తో దెయ్యాలను ఉనికిని గుర్తించవచ్చు... అనే థియరీలు ఉన్నాయి.