స్మార్ట్‌ఫోన్‌తో ఆత్మసంభాషణ..!
స్మార్ట్‌ఫోన్‌తో ఆత్మసంభాషణ..!
Published Thu, Aug 8 2013 11:59 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
మీకు స్మార్ట్‌ఫోన్ వినియోగంలో రొటీన్ అప్లికేషన్‌లతో బోర్ కొట్టిందా? గేమ్స్, చాటింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి అప్లికేషన్‌లతో విసుగనిపిస్తుంటే.. కొంచెం వెరైటీగా ట్రై చేయడానికి అవకాశమిస్తున్నారు ఇండియానాకు చెందిన దెయ్యాల పరిశోధకులు. భార్యాభర్తలైన రోజర్, జిల్లీలకు దెయ్యాలతో మంచి సంబంధ బాంధ్యవ్యాలున్నాయి.
ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని కూడా వారు దెయ్యాల స్టాండర్డ్‌కు తగ్గట్టుగా తీర్చారు. దెయ్యాలతో కమ్యూనికేట్ చేయడానికి తగ్గట్టుగా తాము స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను రూపొందించామని ప్రకటించారు ఈ దంపతులు. ఇక ఎలక్ట్రానిక్ డివైజ్ ల ద్వారా ఆత్మలతో కమ్యూనికేట్ కావచ్చనే వాదన కూడా చాలా పాతదే! పోలరాయిడ్ కెమెరాల తో దెయ్యాలను ఉనికిని గుర్తించవచ్చు... అనే థియరీలు ఉన్నాయి.
Advertisement
Advertisement