స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అని ఇష్టపడ్డ అమ్మాయి చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే కాలాలు చెల్లాయి. పావురాలతో సందేశాలు, ఉత్తరాలతో ప్రేమలేఖలు అంతరించి, వాట్సాప్ రూపంలో ప్రేమకు ఓ వారధి ఏర్పడింది. ఇష్టపడ్డ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకోవటం, చాటింగ్‌లు చేయటం లాంటివి నేడు మామూలు విషయాలు. అయితే రోజులు గడుస్తున్నా అమ్మాయికి తమ ప్రేమను చెప్పలేని వాళ్లు చాలనే ఉంటారు. ప్రేమ సంగతి పక్కన పెడితే! ఇష్టమొచ్చినట్లు చాటింగ్ చేసి ‘వీడితో అసలు స్నేహమే వద్దురా బాబు!’ అనుకునే స్థితికి వారిని తీసుకువస్తారు. చాటింగ్‌తో ఎదుటి వారిని ఇంప్రెస్ చెయ్యటానికి ఓ పద్దతి అవసరం. ఒక రకంగా చెప్పాలంటే చాటింగ్ చేయటం అన్నది ఓ కళ.
1) ఆసక్తికరమైన అంశం
మీరు అమ్మాయితో చాటింగ్ చేస్తున్నపుడు ఆమెకు బోర్ కొట్టకుండా చూసుకోవటం ముఖ్యమైన విషయం. ఆ అమ్మాయికి ఇష్టమైన టాపిక్‌పై చాటింగ్ చేయటం మంచిది. ఇష్టమైన ప్రదేశాలు, వంటలు, సినిమాలు, హీరో, హీరోయిన్లు లాంటి విషయాలపై చర్చ జరుగుండటం మంచిది.
2) స్టిక్కర్లు, ఎమోజీలు
మీ చాటింగ్‌లో ఫన్నీ ఎమోజీలు, స్టిక్కర్లు ఉండేలా చూసుకోండి. ఇవి మీ తత్వాన్ని తెలియజేస్తాయి. చాటింగ్ బోరు కొట్టకుండా ఉండటానికి ఉపయోగపడాతాయి.
3) జోకులు
చాటింగ్ మధ్యమధ్యలో కొన్ని జోకులు వెయ్యండి! ఆమెను నవ్వించండి. మీలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆమెను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. మీరు స్వతహాగా నవ్వించగలిగే వారైతే పర్లేదు కానీ, అలా కాకపోతే.. ఆమెను నవ్వించ బోయి మీరు నవ్వులపాలవుతారు.
4) విసిగించకండి
చాటింగ్ చేస్తున్నపుడు ఒకే విషయాన్ని పదేపదే అడిగి ఆమెను విసిగించకండి. అలా చేస్తే మీ మెసెజ్‌లకు సమాధానం దొరకటం కష్టమవుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల పట్ల తొందరపాటు అస్సలు పనికిరాదు. తన జీవితంపై మీరు అనవసరమైన ఆసక్తిచూపుతున్నారనే భావన కల్గుతుంది.
5) వ్యక్తిగత జీవితం
ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీవితాలను గోప్యంగా ఉంచాలనుకోవటం పరిపాటి. ఈ విషయాన్ని మనం గుర్తెరుగాలి. వారి వ్యక్తిగత విషయాలను చొరవగా అడగటం వద్దు. హద్దులను దాటి ప్రవర్తించటం మంచిది కాదు. ఇలాంటి విషయాలే మీ మధ్య అగాథాలను తేవచ్చు.
6) మీ రోజూ వారి జీవితం
మీ నిత్య జీవితంలో చోటుచేసుకునే ఫన్నీ విషయాలను ఆమెతో పంచుకోండి. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంపండి.
7) బలవంతం వద్దు
అవసరమైనప్పుడు మాత్రమే చాటింగ్ చేయండి. ఇష్టమొచ్చినపుడు మెసెజ్‌లు చేస్తూ వారినుంచి రిప్లయ్ రాకపోతే ఇబ్బంది పడటం.. ఆ తర్వాత వారిని ఇబ్బంది పెట్టడం తగదు. మీరు పనిపాట లేకుండా తేరగా ఉన్నారన్న భావన ఆమెకు కలిగించవద్దు.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
చాటింగ్‌తో అమ్మాయిని ఇంప్రెస్ చేయటం..
Published Thu, Oct 10 2019 4:03 PM | Last Updated on Thu, Oct 10 2019 4:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment