
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం మరో కొత్త ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టింది. 2021లో వాట్సాప్ ఫొటోలు, వీడియోల కోసం వ్యూ వన్స్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఆ ఫీచర్ సాయంతో వీడియోలు, ఫోటోలు చూసిన వెంటనే వాటికంతట అవే అదృశ్యమవుతాయి. తాజాగా, అదే తరహాలో ఆడియో ఫైల్స్ అదృశ్యమయ్యేలా ఫీచర్‌ను వినియోగదారులకు అందించింది. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా వాట్సప్‌లో కుటుంబ సభ్యులు లేదంటే స్నేహితుల మధ్య జరిపిన వాయిస్ నోట్‌ను మీకు తెలియకుండా వేరే వాళ్లకు పంపే ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది.
తద్వారా మీరు పంపిన వాయిస్ మెసేజ్‌లు మూడు వ్యక్తికి చేరుతాయనే భయం పోనుంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా ఓ వాయిస్ మెసేజ్ పంపారు. అది అక్కడితోనే ఆగిపోవాలి. వేరే వాళ్లకు షేర్ కాకూడదు అంటే ఈ వ్యూవన్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment