messaging app
-
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్, అదెలా పనిచేస్తుందంటే?
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్ల కోసం మరో కొత్త ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టింది. 2021లో వాట్సాప్ ఫొటోలు, వీడియోల కోసం వ్యూ వన్స్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫీచర్ సాయంతో వీడియోలు, ఫోటోలు చూసిన వెంటనే వాటికంతట అవే అదృశ్యమవుతాయి. తాజాగా, అదే తరహాలో ఆడియో ఫైల్స్ అదృశ్యమయ్యేలా ఫీచర్‌ను వినియోగదారులకు అందించింది. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా వాట్సప్‌లో కుటుంబ సభ్యులు లేదంటే స్నేహితుల మధ్య జరిపిన వాయిస్ నోట్‌ను మీకు తెలియకుండా వేరే వాళ్లకు పంపే ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. తద్వారా మీరు పంపిన వాయిస్ మెసేజ్‌లు మూడు వ్యక్తికి చేరుతాయనే భయం పోనుంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా ఓ వాయిస్ మెసేజ్ పంపారు. అది అక్కడితోనే ఆగిపోవాలి. వేరే వాళ్లకు షేర్ కాకూడదు అంటే ఈ వ్యూవన్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. -
ప్రాక్సిమస్ గ్రూప్ గూటికి రూట్ మొబైల్
న్యూఢిల్లీ: ఎంటర్ప్రైజ్ మెసేజింగ్ సేవల సంస్థ రూట్ మొబైల్లో బెల్జియంకు చెందిన ప్రాక్సిమస్ గ్రూప్ 84 శాతం వరకు వాటాలను దక్కించుకోనుంది. ఇందులో భాగంగా ముందు దాదాపు 58 శాతం వాటాలను రూ. 5,922 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌తో నిబంధనల ప్రకారం.. 26 శాతం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి రానుండటంతో, ఆ మేరకు షేర్లన్నింటినీ కొనుగోలు చేస్తే మొత్తం 84 శాతం వరకూ వాటాలను పెంచుకునే అవకాశం ఉంది. అయితే, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ వాటా కనీసం 25 శాతం ఉండాలనే నిబంధన మేరకు 12 నెలల్లోగా కొన్ని షేర్లను విక్రయించి తన వాటాను 75%కి తగ్గించుకోవాల్సి రానుంది. షేరు ఒక్కింటికి రూ. 1,626.40 చొప్పున అనుబంధ సంస్థ ప్రాక్సిమస్ ఓపల్ ద్వారా ప్రాక్సిమస్ గ్రూప్ తమ సంస్థలో 57.56% వాటాలను కొనుగోలు చేయనున్నట్లు రూట్ మొబైల్ తెలిపింది. లావాదేవీ పూర్తయ్యాక రూట్ మొబైల్ సీఈవో రాజ్‌దీప్ గుప్తా తన ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతూనే.. గ్రూప్ సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) కార్యకలాపాలకు సారథ్యం వహిస్తారు. రూట్ మొబైల్లో వాటాల కొనుగోలుతో అంతర్జాతీయంగా సీపాస్ విభాగంలో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ప్రాక్సిమస్ గ్రూప్ సీఈవో గిలామ్ బూటిన్ తెలిపారు. ప్రాక్సిమస్ సంస్థలో పెట్టుబడి.. ఒప్పందం ప్రకారం రూట్ మొబైల్ వ్యవస్థాపక వాటాదారుల్లో కొందరు ప్రాక్సిమస్ ఓపల్లో అలాగే ప్రాక్సిమస్కు చెందిన మరో అనుబంధ సంస్థ టెలీసైన్లో మైనారిటీ వాటాలు తీసుకోనున్నారు. ఇందుకోసం 299.6 మిలియన్ యూరోలను వెచి్చంచనున్నారు. రూట్ మొబైల్ మరింత ముందుగానే బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు టెలీసైన్తో భాగస్వామ్యం ఉపయోగపడగలదని గుప్తా ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీఎస్ఈలో రూట్ మొబైల్ షేరు సుమారు 9% క్షీణించి రూ. 1,486 వద్ద క్లోజైంది. -
వాట్సాప్‌లో ఎడిట్ ఫీచర్ ప్రారంభం
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్తగా ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. పొరపాటున, తప్పుగా పంపిన సందేశాల్లో మార్పులు చేసుకోవచ్చు. అక్షర దోషాలు ఉంటే సరి చేసుకోవచ్చు. ఈ మేరకు ఎడిట్ బటన్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. రాంగ్ మెసేజ్‌లు ఎడిట్ చేసుకోవడానికి తొలి 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. సందేశం తప్పుగా వెళ్లినట్లు భావిస్తే దాన్ని మొత్తం తొలగించాల్సిన అవసరం లేదు. మార్పులు చేస్తే సరిపోతుంది. దీనివల్ల యూజర్లకు చాటింగ్‌పై మరింత కంట్రోల్ లభిస్తుందని యాజమాన్యం తెలియజేసింది. మెసేజ్‌లు ఎలా ఎడిట్ చేయాలి? 1. వాట్సాప్ యాప్‌లో ఎనీ చాట్‌లోకి వెళ్లాలి. 2. పొరపాటున పంపిన మెసేజ్‌పై వేలితో కాసేపు నొక్కి ఉంచాలి(లాంగ్ ప్రెస్). 3. ఇప్పుడు ఎడిట్ మెసేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కి, సందేశాన్ని ఎడిట్ చేయొచ్చు. మెసేజ్ పంపిన తర్వాత కేవలం 15 నిమిషాలలోపే ఈ వెసులుబాటు ఉంది. గడువు దాటితే ఆ మెసేజ్‌ను పూర్తిగా డిలీట్ చేయడం మినహా మరో మార్గం లేదు. -
Whatsapp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. అదేంటో తెలుసా?
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా లాక్ చాట్ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ చాట్‌లోని వ్యక్తిగత ఫోటోలు, వీడియాలు,చాట్లను వేరే వాళ్లు చూడకుండా లాక్ వేయొచ్చు. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. యూజర్లు ఒకసారి ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్ సాయంతో లాక్ చాట్ ఆప్షన్ వినియోగిస్తే సదరు చాట్‌ను వేరే వాళ్లు చూడడం, లేదంటే చోరి చేసే వీలుండదు. అంతేకాదు లాక్ చాట్‌లో ఉన్న వీడియోలు, ఫోటోలు సైతం ఫోన్ గ్యాలరీలు సేవ్ కావు. ఒకవేళ ఎవరైనా మీ అనుమతి లేకుండా ఫోన్ తీసుకుని పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్ లేకుండా లాక్ చాట్ తెరవడానికి ప్రయత్నిస్తే.. ఆ చాట్ మొత్తం డిలీట్ చేయాలని కోరుతుంది. అలా ఇతరులు వాట్సాప్ చాట్‌ను చూడకుండా లాక్ చాట్ అదనపు ప్రొటెక్షన్ లేయర్‌గా పనిచేస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ది దశలోనే ఉండగా..దీన్ని అధికారికంగా యూజర్లకు ఎప్పుడు అందిస్తారనే సంగతి తెలియాల్సి ఉంది. -
AP: బడికి డుమ్మా కొడితే ఇంటికే మెసేజ్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని ప్రకాశరావుపేటకు చెందిన రాకేష్ పొద్దున్నే ఎంచక్కా తయరై, పుస్తకాల బ్యాగు భుజాన వేసుకొని ఠంచన్‌గా బడికి బయలుదేరాడు. కానీ ఉదయం 11గంటలకు ఆ విద్యార్ధి తండ్రి వెంకటరావు సెల్‌ఫోన్‌కు ‘మీ బాబు ఈ రోజు స్కూల్‌కు ఆబ్సెంట్ అయ్యాడు’ అని మెసేజ్ వచ్చింది.తమ కుమారుడు బడికి వెళ్లి చదువుకుంటున్నాడనుకున్న ఆ తల్లిదండ్రులు, ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌తో పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. రాకేష్ కాలనీ సమీపంలో తోటి మిత్రులతో ఆడుతూ కనిపించాడు. అక్కడ నుంచి బడికి తీసుకెళ్లి వదిలాడు. స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ హాజరు నమోదు ద్వారా సత్ఫలితాలు కనిపిస్తొన్నాయి. విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1,397 పాఠశాలలు ఉండగా, ఇందులో 3,54,740 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ప్రతి రోజూ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళ్లేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. పాఠశాలల్లో 90 శాతం హాజరు నమోదౌతుండటమే కాక, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఏర్పడింది. చదువులవైపు మళ్లించేలా.. విద్యార్థులందరినీ బడికి రప్పించి, వారికి విద్యాబుద్ధులు నేరి్పంచాలనే లక్ష్యంతో మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. చదువులకు తోడ్పాటు అందించాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న అమ్మ ఒడి పథకం లబి్ధపొందేందుకు పాఠశాల పనిదినాల్లో 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరుశాతం పెంపుతో పాటు, మధ్యాహ్న భోజన పథకం పారదర్శకంగా అమలయ్యేలా స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ హాజరు నమోదుపై విద్యాశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బడికి రాకుంటే ఇంటికే వలంటీర్ ప్రతి రోజూ ఉదయం 9.15 నుంచి 10 గంటల మధ్యలో పాఠశాలల్లో హాజరు నమోదు చేసేలా జిల్లా విద్యాశాఖాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల తల్లిదండ్రులు, క్లాస్ టీచర్, అదే విధంగా గ్రామ/వార్డు వలంటీరు సెల్‌ఫోన్ నంబర్‌ను చైల్డ్ ఇన్ఫోతో కూడిన స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌కు అనుసంధానం చేశారు. యాప్‌లో విద్యార్థి హాజరు నమోదు కాకుంటే వెంటనే వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళ్తొంది. వరుసగా మూడు రోజులు విద్యార్థి పాఠశాలకు గైర్హాజర్ అయినట్లైతే సచివాలయ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా వలంటీర్‌కు సమాచారం వెళ్తోంది. దీంతో వలంటీరు విద్యార్థి ఇంటికి వెళ్లి , బడికి రాకపోవడానికి గల కారణాలు తెలుసుకునేలా విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి రోజూ పర్యవేక్షణ విద్యార్థుల హాజరు నమోదుపై ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా యాప్‌ద్వారానే హాజరువేయాలి. విద్యార్థులను చదువుల వైపు మళ్లించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఇటువంటి ఏర్పాట్లు చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుంది. – ఎల్. చంద్రకళ, డీఈవో, ఉమ్మడి విశాఖ జిల్లా హాజరుశాతం పెరిగింది స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారానే విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నాం. దీని వల్ల బడికి రాని విద్యార్థులెవరనేది వెంటనే తెలుసుకునే అవకాశం కలిగింది. ఇలాంటి పర్యవేక్షణతో బడిలో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. ల్లిదండ్రులను కూడా భాగస్వామ్యులను చేయటం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తొన్నాయి. – బాబు, హెచ్ఎం, మధురానగర్ పీఎస్, విశాఖ జిల్లా. -
రిస్టోర్ అయిన వాట్సాప్ సేవలు
-
వాట్సాప్ సేవలు పునరుద్ధరణ
భారత్‌తో పాటు పలు దేశాల్లో నిలిచిపోయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సుమారు 95 నిమిషాల తర్వాత సేవలను పునరుద్ధరించించి మాతృ సంస్థ మెటా. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల యూజర్లు మెసేజ్‌లు పంపేందుకు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత.. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించకపోవటం, డబుల్ టిక్, బ్లూటిక్ మార్కులు కనిపించలేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో పడ్డారు యూజర్లు. సమస్య తలెత్తిన తర్వాత వేల మంది వినియోగదారులు వెబ్సైట్లో ఫిర్యాదులు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు! -
Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు!
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాట్సాప్‌ను ప్రజలు వినియోగిస్తున్నారు. అన్ని దేశాల్లో కలిపి దాదాపు 244 కోట్లు మంది ఇప్పటివరకు వాట్సాప్ సేవలను వాడుతున్నారు. నవంబర్ 2009లో ప్రాథమికంగా వాట్సాప్‌ను యాపిల్ యూజర్ల కోసం తీసుకొచ్చారు. 2010లో అండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ దశ తిరిగింది. కేవలం నాలుగేళ్లలోనూ 200 మిలియన్ యూజర్ల మార్కును చేరుకుంది. వాట్సాప్ పెరుగుతున్న తీరును చూసిన ఫేస్ బుక్.. వెంటనే బేరం పెట్టింది. ఏకంగా 19 బిలియన్ డాలర్లను వెచ్చించి 2014లో సొంతం చేసుకుంది. ఈ మొత్తం వాట్సాప్ విలువ కంటే 12 రెట్లు ఎక్కువ. భారత్ వ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల యూజర్లు ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ మెసెజ్‌లు పంపుకోవచ్చు. ప్రతీ రోజు దాదాపు పది వేల కోట్ల మెసెజ్‌లను వాట్సాప్ చేరవేస్తుంది. (చదవండి: దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం.. అయోమయంలో యూజర్లు!) వాట్సాప్ వచ్చిన తర్వాత దెబ్బ పడిన మొదటి సర్వీస్ SMS. అప్పటి వరకు ఒక్కో SMSకు కొంత మొత్తాన్ని చార్జ్ చేసిన మొబైల్ నెట్‌వర్క్‌లు వాట్సాప్ దెబ్బకు భారీగా నష్టపోయాయి. ఇక భారతీయులయితే వాట్సాప్‌ను ఎంతగా అభిమానించారంటే.. ఏం చేసినా వాట్సాప్‌లో పంచుకున్నారు. మెసెజ్ షేరింగ్, ఫోటో షేరింగ్, స్టేటస్.. ఇలా ప్రతీ అంశానికి వాట్సాప్‌పై ఆధారపడతారు.కొన్నాళ్లుగా కాలింగ్‌కు కూడా వాట్సాప్ ప్రత్యామ్నాయంగా మారింది. నేరుగా కాల్ చేస్తే రికార్డు అవుతుందనో.. లేక సౌకర్యంగా ఉంటుందనో వాట్సాప్ కాలింగ్‌నే నమ్ముకున్నారు చాలా మంది. ఇక విదేశాల్లో, లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారికి వాట్సాప్ కాలింగ్ ఎంతో సులభం. దీని వల్ల భారత్ లాంటి దేశాల్లో ISD ఇంటర్నేషనల్ కాలింగ్‌కు ఎంతో దెబ్బ పడింది. మొబైల్ నెట్‌వర్క్‌లు కన్నుమూసి తెరిచేలోపు వాట్సాప్ ఇంటర్నేషనల్ కాల్ ఎంతో ముందుకు వెళ్లింది. ఒకప్పుడు STD, ISD చేయాలంటే బూత్‌లకు వెళ్లేవాళ్లు. అపాయింట్మెంట్లు తీసుకునేవాళ్లు. వీటన్నింటికి వాట్సాప్ బెస్ట్సొల్యూషన్గా మారింది. ఇక వాట్సాప్ గ్రూపుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ప్రతీ వాట్సాప్ యూజర్ కనీసం 10 గ్రూపుల్లో చేరడం, తమకు నచ్చిన అంశాలను బేస్ చేసుకుని గ్రూప్‌లు క్రియేట్ చేయడం వీపరీతంగా పెరిగింది. దీనికి తోడు మీడియాకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారింది. ప్రతీ వార్తను వాట్సాప్‌లో షేర్ చేసుకోవడం అనవాయితీగా మారింది. ఏకంగా వాట్సాప్ బేస్డ్గా మీడియా అంటే వార్తా ఛానళ్లు, పబ్లికేషన్లు నడుస్తుండడం ఆశ్చర్యం. గతంలో గోడ పత్రికలన్నీ ఇప్పుడు వాట్సాప్ పత్రికలుగా మారిపోయాయి. (చదవండి: WhatsApp Down కలకలం: స్పందించిన మెటా) -
భారీ షాక్.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
మీరు పాత ఐఫోన్‌ని(iPhone) ఉపయోగిస్తున్నారా లేదా మీ ఫోన్ ఐఓఎస్(iOS) పాత వెర్షన్లో రన్ అవుతుందా?అయితే మీ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలి లేదా iOS లేటెస్ట్ వెర్షన్‌లోకి అప్డేట్ చేసుకోవాలి. ఇలా చేయకుంటే ఆ ఫోన్లలో ఇకపై వాట్సాప్ సేవలను వినియోగించడం కుదరుదు. ఎందుకంటే ఈ దీపావళి తర్వాత నుంచి కొన్ని ఐఫోన్లలో వాట్సాప్ పని చేయదు. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 24 నుంచి ఐఫోన్5, ఐఫోన్ 5సీ మొబైల్స్‌తో పాటు ios 10, ios 11తో పని చేస్తున్న ఐఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఫోన్లను ios 12, లేదా ఆపైన వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 లేదా అంతకంటే తక్కువ వెర్షర్ ఓఎస్‌లు(os) మీద పని చేస్తున్న మొబైల్స్‌లోనూ వాట్సాప్ సేవలు ఉండవు. iPhoneని ఎలా అప్‌గ్రేడ్ చేయాలి iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్డేట్ కాకపోతే వెంటనే అప్డేట్ చేయడం మంచిది. సెట్టింగ్‌లు > జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకుని, ఆపై సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడానికి లేటెస్ట్ iOS వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. కాగా ఆపిల్ గతంలో.. కొన్ని పాత iPhoneలలో వాట్సాప్ యాప్ పని చేయదని తెలిపింది. వాట్సాప్ ప్రకారం, మెసేజింగ్ యాప్ అక్టోబరు 24 నుంచి iOS 10, iOS 11 పరికరాల్లో పనిచేయదు. ఈ మేరకు పేర్కొన్న ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు హెచ్చరికలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే చదవండి: ఐటీ కంపెనీల ముందు పెను సవాళ్లు.. వచ్చే 12 నెలల్లో భారీ షాక్! -
8మంది కాదు.. ఒకే సారి 32మంది, వాట్సాప్‌లో ఇకపై..!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త ఫీచర్లు, రియాక్షన్స్‌తో పాటు లార్జ్ఫైల్ షేరింగ్ చేసే సౌకర్యాన్ని యూజర్లకు అందించనున్నట్లు మెటా ఫ్లాట్ ఫామ్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఎనిమిది మంది మాత్రమే గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ తాజాగా జుకర్ బెర్గ్ వాయిస్ కాల్స్ చేసే సదుపాయాన్ని 8 మంది నుంచి 32 మందికి పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ఒకే సారి 32 మందికి వాట్సాప్ నుంచి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీడియో, పీడీఎఫ్ వంటి 1జీబీ డేటా ఫైల్స్‌ను పంపుతుండగా ఇకపై 2జీబీ వరకు ఫార్వర్డ్ చేయోచ్చు. ఉదాహరణకు ఓ స్కూల్‌కు చెందిన 10 వాట్సప్ గ్రూప్‌లు ఉంటే.. అందరికి ఒకే సమయంలో ఒకే మెసేజ్‌ను పంపేలా టూల్‌ను డిజైన్ చేయనున్నట్లు వాట్సాప్ స్పోక్ పర్సన్ తెలిపారు. రోజూవారీ జీవితంలో భాగమైన చాటింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత అడ్వాన్స్‌గా యూజర్లకు పరిచయం చేసేలా కొత్త కొత్త యాప్స్‌ను బిల్డ్ చేస్తున్నట్లు జుకర్ బెర్గ్ తెలిపారు. తద్వారా వందల మంది యూజర్ల నుంచి వేల మంది యూజర్లు చాట్ చేసుకునేలా వీలు కలగనుంది. చదవండి: రూ.22వేల కోట్ల ఫైన్ ! జుకర్ బర్గ్ ఒక్కో యూజర్‌కు తలా రూ.5వేలు ఇస్తారా!! -
200 కోట్లకు వాట్సాప్ యూజర్ల సంఖ్య
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సుమారు 25 శాతం. వాట్సాప్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ప్రతీ వ్యక్తిగత మెసేజీకి పూర్తి స్థాయిలో గోప్యత ఉండేలా ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫాంను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. గతేడాది జూలై గణాంకాల ప్రకారం వాట్సాప్‌నకు భారత్‌లో 40 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. -
డిసెంబర్ నాటికి వాట్సాప్ పేమెంట్ సేవలు
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాది ఆఖరు నాటికల్లా నగదు చెల్లింపుల సేవలను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ వెల్లడించారు. మెసేజ్ పంపినంత సులువుగా నగదు బదిలీ ప్రక్రియను సులభతరం చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ‘యూపీఐ ప్రాతిపదికన భారతీయ బ్యాంకులతో కలిసి పేమెంట్స్ వ్యవస్థను రూపొందించాం. దీన్ని సరిగ్గా అమలు చేయగలిగితే భారత్‌లో మరింత మందిని ఆర్థిక సేవల పరిధిలోకి తేవొచ్చు. అలాగే డిజిటల్ ఎకానమీలోకి భాగంగా చేయొచ్చు. ఈ ఏడాది ఆఖర్లోగా పేమెంట్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విల్ చెప్పారు. అయితే, దీనికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు వచ్చాయా లేదా అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్..చెల్లింపుల సేవల విషయంలో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తదితర సంస్థలతో పోటీపడాల్సి ఉంటోంది. ప్రస్తుతం వాట్సాప్ ప్రయోగాత్మకంగా కొంత మంది యూజర్లకు మాత్రమే పేమెంట్ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తోంది. భారతీయ యూజర్ల చెల్లింపుల డేటాను భారత్‌లోనే భద్రపర్చాలన్న నిబంధనను పాటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవలే సంస్థ వెల్లడించింది. జూలైలో ట్రయల్ రన్ పూర్తవుతుందని, రిజర్వ్ బ్యాంక్ అనుమతులన్నీ వచ్చాకే పూర్తి స్థాయిలో సేవలను ప్రారంభిస్తామని ఈ ఏడాది మే లో సుప్రీం కోర్టుకు తెలియజేసింది. 2017 నాటి గణాంకాల ప్రకారం వాట్సాప్‌కు భారత్‌లో 20 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారు. -
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక
సియోల్ : శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఎవరైతే వాడుతున్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. కొన్ని డివైజ్‌లు, మొబైల్ యూజర్లు స్టోర్ చేసుకున్న ఫోటోలను వారి అనుమతి లేకుండానే.. స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర కాంటాక్ట్‌లకు పంపుతున్నాయని తెలిసింది. కనీస హెచ్చరికలు కానీ, అనుమతి కానీ లేకుండా ఇలా జరుగుతుందని వెల్లడైంది. శాంసంగ్ మెసేజస్ కలిగి ఉన్నవారికి ఈ సమస్య తలెత్తుతున్నట్టు గిజ్మోడో తొలుత రిపోర్టు చేసింది. ఫైల్స్‌ను పంపుతున్నప్పటికీ, దాన్ని యూజర్లకు కూడా తెలుపడం లేదని రిపోర్టు పేర్కొంది. శాంసంగ్ ఫోన్లలో శాంసంగ్ మెసేజస్ అనేది డిఫాల్ట్ మెసేజింగ్ యాప్. దీనిలోని బగ్ కారణంగా ఈ సమస్య తలెత్తుతున్నట్టు తెలిసింది. గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ డివైజ్‌లు దీని బారిన పడ్డాయని, కేవలం రెండు మోడల్స్‌కు మాత్రమే ఈ సమస్య పరిమితం కాలేదని వెర్జ్ రిపోర్టు చేసింది. తాజాగా వస్తున్న రిపోర్టులు తమ దృష్టికి వచ్చాయని, తమ టెక్నికల్ టీమ్స్ దీన్ని విచారిస్తున్నాయని శాంసంగ్ ప్రకటన విడుదల చేసింది. దీని బారిన పడిన కస్టమర్లు 1-800-SAMSUNG వద్ద తమను డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయాల్సిందిగా శాంసంగ్ కోరింది. అనుమతి లేకుండా ఫోటోలను, డేటాను కాంటాక్ట్‌లకు పంపే బగ్ బారిన పడకుండా ఉండేందుకు, శాంసంగ్ మెసేజస్ అనుమతులను యూజర్లు ఉపసంహరించుకోవచ్చని శాంసంగ్ పేర్కొంది. -
వాట్సాప్‌కు గట్టి పోటీ: హైక్ ఆ ఫీచర్ తెచ్చేసింది
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను అధిగమించడానికి దేశీయ మెసేజింగ్ యాప్ హైక్ ఓ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను యాడ్ చేయకముందే, హైక్ తన ప్లాట్ ఫామ్ పై ఈ పేమెంట్స్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో 100 మిలియన్ కు పైగా ఉన్న తమ యూజర్లు, హైక్ ద్వారానే నగదు ట్రాన్స్ ఫర్స్, మొబైల్ బిల్స్ చెల్లించడం, రీఛార్జ్ చేసుకోవడం వంటి చేయవచ్చని కంపెనీ తెలిపింది. యూపీఐ ద్వారా ఉచితంగా, వెనువెంటనే బ్యాంకు నుంచి బ్యాంకుకు ట్రాన్స్ ఫర్లు, ఎలాంటి బ్యాంకు అకౌంట్లు లేకుండా వాలెట్ నుంచి వాలెట్ కు తక్షణ నగదు ట్రాన్స్ ఫర్ వంటివి చేసుకోవచ్చని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ భారతి మిట్టల్ చెప్పారు. యాప్ నుంచి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చని తెలిపారు. గత ఆరు నెలలుగా తమ యూజర్లకు కొత్త అనుభవాన్ని అందించడం కోసం ఎంతో తాపత్రయపడ్డామని పేర్కొన్నారు.. భారత్ లో మెసేజింగ్ ప్లాట్ ఫామ్ పై పేమెంట్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన తొలి యాప్ తమదేనని సంతోషం వ్యక్తంచేశారు. యూజర్ ఇంటర్ ఫేస్ ను మెరుగుపరిచామని, అదేవిధంగా యాప్ కెమెరాకు కొత్త ఫీచర్లను యాడ్ చేసినట్టు మిట్టల్ తెలిపారు. హైక్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వాట్సాప్ డిజిటల్ పేమెంట్ సర్వీసులు అందజేయడం కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ గతేడాది తీసుకున్న హఠాత్తు నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పలు పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మెసేజింగ్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ యాప్స్ కూడా పేమెంట్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. -
టీనేజర్లకోసం ఫేస్బుక్ కొత్త యాప్ ‘టాక్’
న్యూయార్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. టీనేజర్లను దృష్టిలో పెట్టుకుని ‘టాక్’ అనే కొత్త యాప్‌ను పరిచయం చేయనుంది. లైంగిక వేధింపులకు, దోపిడీకి గురయ్యే యువకులను రక్షించే ఉద్దేశంతో ఫేస్బుక్ ఈ కొత్త మెసేజింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించనుందని తాజాగా నివేదికలు ద్వారా తెలుస్తోంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని పర్యవేక్షించటానికి అనుమతినిస్తుందని ఒక రిపోర్టు నివేదించింది. ఈ టాక్ ఖాతాల సెర్చింగ్‌కు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు. కేవలం టాక్ యూజర్లకు మాత్రమే. తద్వారా టీనేజర్లనే టార్గెట్‌గా ఎంచుకునే అపరచిత ఇంటర్నెట్ యూజర్లను ఇది నిరోధిస్తుందని కంపెనీ భావిస్తోందట. అంతేకాదు రక్షణాత్మకంగా ఉండటంతో ఎక్కువమంది తల్లిదండ్రులు దీనివైపు మొగ్గచూపుతారనేది సంస్థ ప్లాన్. వెబ్సైట్ సమాచారం ప్రకారం ఫేస్బుక్ మెయిన్ మెసెంజర్ యాప్ లో ఒక సాఫ్ట్వేర్ కోడ్‌ను జత చేసింది. దీని ప్రకారం తల్లిదండ్రులు తమపిల్లల కాంటాక్ట్‌పై పూర్తి నియంత్రణ ఉంటుందని చెప్పింది. ఈ టాక్ యాప్‌ద్వారా పిల్లల సంభాషణలను మీరు పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపింది. అయితే ఇది కూడా 13సం.రాల అంతకుపైబడిన వయసున్న టీనేజర్లకు మాత్రమే పరమితం కానున్నట్టు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న టీనేజర్ల తల్లిదండ్రులకు ఊరటనివ్వనుంది. తమ పిల్లల ఆన్లైన్ స్వేచ్ఛను పర్యవేక్షించడానికి ఉపయోగ పడనుంది. అలాగే ఎవరితో మాట్లాడుతున్నారో.. అనే ఆందోళన, భయాలనుంచి దూరం చేయనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఫేస్బుక్ అధికారింగా స్పందించాల్సి ఉంది. -
హైక్ నుంచి వీడియో కాల్స్: 2జీ ఉన్నా చాలు
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ హైక్ మెస్సెంజర్ తన ఖాతాదారుల కోసం వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. నెట్వర్క్ బాగుంటే 2జీలోనే అధిక నాణ్యతగల వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చని చెప్పింది. వీడియో కాలింగ్ సదుపాయాన్ని హైక్ బీటా వెర్షన్(ప్రయోగాత్మక సేవలు)తో సెప్టెంబరులోనే ప్రారంభించింది. ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తెచ్చింది. -
గూగుల్ ‘అల్లో’ మెసేజింగ్ యాప్ అదిరింది
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా ‘అల్లో’ అనే మెసేజింగ్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫేస్బుక్ మెసెంజర్, వాట్స్‌యాప్‌లకు గట్టి పోటినివ్వనుంది. అల్లో యాప్‌ను అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ యూజర్లిద్దరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో స్మార్ట్ రిప్లే, షేర్ చేసే ఫొటోలకు కాప్షన్ ఇవ్వడం, ఇమోజి, స్టిక్కర్స్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. వీటన్నింటి కన్నా ముఖ్యమైన ఫీచర్ మరొకటుంది. అదే గూగుల్ అసిస్టెంట్. ఈ ఫీచర్‌తో మనం మనకు కావలసిన సమాచారాన్ని క్షణాల్లో పొందొచ్చు. అంటే మనకు దగ్గరలోని పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్ ఇలా ఏ అంశానికి చెందిన సమాచారన్నైనా పొందొచ్చు. కాగా గూగుల్ ఇటీవలే డుయో అనే వీడియో కాలింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. -
ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ మెసేజింగ్ యాప్!
న్యూయార్క్: ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ సరికొత్త మెసేజింగ్ యాప్‌తో ముందుకు రాబోతోంది. దీనికోసం గూగుల్ సంస్థ దాదాపు ఏడాది కాలంగా తీవ్రంగా కసరత్తులు చేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ బుధవారం తెలిపింది. గూగుల్ మెసేజింగ్ యాప్ 'హ్యాంగౌట్' ఆశించినంత మేర యూజర్లను ఆకట్లుకోకపోవటంతో గూగుల్ ఈ ప్రయత్నాన్ని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త మెసేజింగ్ యాప్‌లో ఫేస్‌బుక్‌ను తలదన్నేలా యూజర్లకు అన్నిరకాల ఫీచర్లను అందుబాటులోకి తేవాలని గూగుల్ భావిస్తోంది. ఇందుకోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఉండే ఫీచర్లను, వెబ్‌పేజ్ లింక్‌లు యూజర్లకు యాప్‌లో అందుబాటులో ఉండేలా గూగుల్ దీన్ని రూపొందిస్తోంది. ఇటీవలి మొబైల్ ఫేస్బుక్ లోని ఫీచర్ల కంటే అడ్వాన్స్‌గా గూగుల్ ఈ యాప్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తున్నా.. ఇది ఎప్పటికి అందుబాటులోకి రానుందనే విషయం మాత్రం తెలియరాలేదు. -
ఐఎస్ఐఎస్ 'టెలిగ్రామ్' కుదరిదిక!
బెర్లిన్: తమ యాప్ ద్వారా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు 'టెలిగ్రామ్' సంస్థ ఉపక్రమించింది. తమ యూజర్లను ఉగ్రవాదం వైపు దారి మళ్లించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెలిగ్రామ్ నిర్వాహకులు అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. 12 భాషలకు సంబంధించిన సైట్లను ఐఎస్ఎస్ వినియోగిస్తుందని, ఉగ్రవాదులు తమ యాప్ వాడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గత వారం రోజుల నుంచి తాము చేసిన ప్రయత్నాలు ఫలించి ఐఎస్ఐఎస్ సైట్లను బ్లాక్ చేసే కోడింగ్ విధానాన్ని కనుగొన్నామని వెల్లడించింది. బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న టెలిగ్రామ్ యాప్ ద్వారా వ్యక్తిగత ఛాటింగ్ నుంచి గ్రూప్ ఛాటింగ్ వరకు 200 మంది ఒకేసారి మెసేజ్‌లు పంపుకోవచ్చు. అయితే ఈ యాప్ వాడి తమ యూజర్లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వారి కార్యకలాపాల వైపు ఆకర్షించకుండా ఉండేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా కోడింగ్ విధానాన్ని అనుసరించినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. టెలిగ్రామ్ యూజర్ల సమాచారాన్ని ఐఎస్ఎస్ ఉగ్రవాదులు రిట్రీవ్ చేయకుండా వారి డేటాని ఎన్‌క్రిప్ట్ చేసే యోచనలో యాప్ రూపకర్తలు ఉన్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిచండటంతో పాటు తమ చర్యలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న యాప్ నిర్వాహకులపై దాడులు చేయాలన్న యోచనలో ఉన్నట్లు ఐఎస్ఐఎస్ హెచ్చరిక సంకేతాలు పంపించింది. This week we blocked 78 ISIS-related channels across 12 languages. More info on our official channel: https://t.co/69Yhn2MCrK — Telegram Messenger (@telegram) November 18, 2015 -
డెస్క్‌టాప్ మీదకూ వాట్సప్!!
ఫేస్‌బుక్‌ను సైతం తలదన్ని, యువత క్రేజును విపరీతంగా సంపాదించుకున్న వాట్సప్ అప్లికేషన్.. ఇక త్వరలోనే డెస్క్‌టాప్ కంప్యూటర్లకు కూడా రాబోతోంది. ఇప్పటివరకు కేవలం స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లకు మాత్రమే పరిమితమైన వాట్సప్.. డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు కూడా అనుగుణంగా సిద్ధం అయిపోతోంది. ఈ విషయం అధికారికంగా ఇంతవరకు స్పష్టం కాలేదు గానీ.. ఈ దిశగా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయట. డెస్క్‌టాప్ వెర్షన్ కోసం కోడ్ సిద్ధం అవుతున్నట్లు 'టెలిగ్రాం' యాప్ సృష్టికర్త పాల్ డురోవ్ చెబుతున్నారు. వాట్సప్ వెర్షన్ వి2.11.471లో కూడా 'వాట్సప్ వెబ్' ప్రస్తావన ఉందని, అంతేకాకుండా కంప్యూటర్లలో లాగిన్ / లాగౌట్ అవ్వడం గురించి కూడా రాశారని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఫోన్లలో ఉన్న వాట్సప్‌లోకి లాగిన్ కావడం, అందులోంచి లాగౌట్ కావడం మాత్రం సాధ్యం కాదు. డెస్క్‌టాప్ వెర్షన్లో ఈ సదుపాయం కూడా కల్పించే ఆలోచనలో ఉన్నారట. దాంతోపాటు వినియోగదారుల స్టేటస్‌ను ట్రాక్ చేసేందుకూ ఏర్పాట్లున్నాయని పాల్ అంటున్నారు. ఇప్పటికే వైబర్, వీ చాట్, లైన్ లాంటి మెసేజింగ్ అప్లికేషన్లు పూర్తిస్థాయి వెబ్, పీసీ వెర్షన్లను అభివృద్ధి చేశాయి. అందుకే వాట్సప్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఇప్పటికే దాదాపు 60 కోట్ల మంది వినియోగదారులున్న వాట్సప్.. ఇక వెబ్ వెర్షన్ ప్రారంభిస్తే వీరి సంఖ్య మరింత పెరగడం మాత్రం గ్యారంటీ!!