
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్తగా ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. పొరపాటున, తప్పుగా పంపిన సందేశాల్లో మార్పులు చేసుకోవచ్చు. అక్షర దోషాలు ఉంటే సరి చేసుకోవచ్చు. ఈ మేరకు ఎడిట్ బటన్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. రాంగ్ మెసేజ్‌లు ఎడిట్ చేసుకోవడానికి తొలి 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. సందేశం తప్పుగా వెళ్లినట్లు భావిస్తే దాన్ని మొత్తం తొలగించాల్సిన అవసరం లేదు. మార్పులు చేస్తే సరిపోతుంది. దీనివల్ల యూజర్లకు చాటింగ్‌పై మరింత కంట్రోల్ లభిస్తుందని యాజమాన్యం తెలియజేసింది.
మెసేజ్‌లు ఎలా ఎడిట్ చేయాలి?
1. వాట్సాప్ యాప్‌లో ఎనీ చాట్‌లోకి వెళ్లాలి.
2. పొరపాటున పంపిన మెసేజ్‌పై వేలితో కాసేపు నొక్కి ఉంచాలి(లాంగ్ ప్రెస్).
3. ఇప్పుడు ఎడిట్ మెసేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కి, సందేశాన్ని ఎడిట్ చేయొచ్చు. మెసేజ్ పంపిన తర్వాత కేవలం 15 నిమిషాలలోపే ఈ వెసులుబాటు ఉంది. గడువు దాటితే ఆ మెసేజ్‌ను పూర్తిగా డిలీట్ చేయడం మినహా మరో మార్గం లేదు.
Comments
Please login to add a commentAdd a comment