editing tools
-
వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఇమేజ్ ఎడిటర్!
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులోకి వచ్చాక దానిని విరివిగా వాడేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపిస్తు న్నారు. తాము వాడే యాప్‌లలో ఏఐ ఉంటే దాని సాయంతో సరదా సరదా ప్రయోగాలు చేస్తుంటారు. దీంతో ఫొటోలు, ఇమేజ్‌లను ఎడిట్ చేసే ఏఐ ఆధారిత ఫీచర్ త్వరలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో అందుబుటులోకి వచ్చే అవకాశ ముంది. బీటా వెర్షన్ వినియోగదారులకు మొదట దీనిని వాడే అవకాశం ఇవ్వొచ్చని ‘వెబ్బేటాఇన్ఫో’ తన కథనంలో పేర్కొంది. ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యాప్‌లోని ఆప్షన్లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకుంటున్న యూజర్లు.. ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది అంబుబాటులోకి వస్తే ఇమేజ్ను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, బ్యాక్గ్రౌండ్లను మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.24.7.13 వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న వాళ్లకు ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్ ప్రాథమిక కోడ్‌ను అందుబాటులోకి తేవచ్చు. బేటా ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన టెస్టర్లనే తొలుత దీనిని వాడేందుకు అనుమతిస్తారు. సెర్చ్ బార్లో టైప్‌చేసి నేరుగా ఏఐ సర్వీస్‌తోనే చాటింగ్ చేసి కావాల్సిన ఫలితాలు పొందే ఫీచర్‌పైనా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాయిస్ నోట్ వచ్చే సందేశాలనూ ఓపెన్ చేయకుండానే టెక్ట్స్ రూపంలో చదవగలిగేలా మరో ఫీచర్‌ను యూజర్లకు అందివ్వాలని వాట్సాప్ భావిస్తోంది. -
వాట్సాప్‌లో ఎడిట్ ఫీచర్ ప్రారంభం
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్తగా ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. పొరపాటున, తప్పుగా పంపిన సందేశాల్లో మార్పులు చేసుకోవచ్చు. అక్షర దోషాలు ఉంటే సరి చేసుకోవచ్చు. ఈ మేరకు ఎడిట్ బటన్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. రాంగ్ మెసేజ్‌లు ఎడిట్ చేసుకోవడానికి తొలి 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. సందేశం తప్పుగా వెళ్లినట్లు భావిస్తే దాన్ని మొత్తం తొలగించాల్సిన అవసరం లేదు. మార్పులు చేస్తే సరిపోతుంది. దీనివల్ల యూజర్లకు చాటింగ్‌పై మరింత కంట్రోల్ లభిస్తుందని యాజమాన్యం తెలియజేసింది. మెసేజ్‌లు ఎలా ఎడిట్ చేయాలి? 1. వాట్సాప్ యాప్‌లో ఎనీ చాట్‌లోకి వెళ్లాలి. 2. పొరపాటున పంపిన మెసేజ్‌పై వేలితో కాసేపు నొక్కి ఉంచాలి(లాంగ్ ప్రెస్). 3. ఇప్పుడు ఎడిట్ మెసేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కి, సందేశాన్ని ఎడిట్ చేయొచ్చు. మెసేజ్ పంపిన తర్వాత కేవలం 15 నిమిషాలలోపే ఈ వెసులుబాటు ఉంది. గడువు దాటితే ఆ మెసేజ్‌ను పూర్తిగా డిలీట్ చేయడం మినహా మరో మార్గం లేదు. -
యూట్యూబ్ షార్ట్స్ కోసం కొత్త టూల్స్
‘షార్ట్స్’ కోసం యూట్యూబ్ కొత్త వీడియో ఎఫెక్ట్, ఎడిటింగ్ టూల్స్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల క్రియేటర్స్ మరింత మెరుగైన ‘షార్ట్స్’ను రూపొందించడానికి వీలవుతుంది. వ్యక్తిగత కామెంట్స్‌కు రిప్లే ఇచ్చే సదుపాయం కూడా రానుంది. ‘షార్ట్స్’ ద్వారా డబ్బు అర్జించడానికి ‘బ్రాండ్కనెక్ట్’ నుంచి ‘బ్రాండెడ్ కంటెంట్’ను బిల్డ్ చేయడం, షాపబుల్ వీడియోలు, లైవ్షాపింగ్... మొదలైన వాటికి ఐడియాలు, ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేదానిపై సలహాలు పొందవచ్చు. మరో కొత్త ఫీచర్ స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కొత్త మొబైల్ యాప్(ఐఫోన్, ఆండ్రాయిడ్లలో)ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వీడియోలను లైక్, డిస్లైక్ చేయడం, షేర్ చేయడం సులభం అవుతుంది. ఫుల్ స్క్రీన్ మోడ్‌లో కూడా బాటమ్ కార్నర్లో బటన్ వరుస కనిపిస్తుంది. దీని వల్ల రకరకాల ఆప్షన్లతో యాక్సెస్ కావడానికి వీలవుతుంది. యూట్యూబ్ ‘లూపింగ్ ఫీచర్’ అనే కొత్త ఫీచర్‌ను పరిక్షిస్తోంది. (క్లిక్: ప్రాణం లేదు.. అయినా బుడ్డోడి హావభావాలు అదుర్స్) -
అదిరిపోయే వీడియో ఎడిటింగ్ యాప్స్ మీకోసం..
పిండి కొద్ది రొట్టెలాగే... టెక్నాలజీ కొద్ది వీడియో! టెక్నాలజీతో ‘బొమ్మ అదిరిపోయింది’ అనిపించడానికి బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకొని మీ వీడియోలకు సాన పెడితే ‘శబ్భాష్’ అనిపించుకోవడం ఎంతసేపని! వీడియో ఎడిటింగ్‌కు మీరు కొత్త అయితే ‘ఎడోబ్ ప్రీమియర్ ఎలిమెంట్స్’ బెటర్. ‘క్రియేట్ - ఎడిట్- ఆర్గనైజ్ -షేర్ యువర్ వీడియోస్’ అంటున్న ఎడోబ్ ప్రీమియర్ ఎలిమెంట్స్‌కు ఈజీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌గా పేరుంది. స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవచ్చు. సెకండ్ల వ్యవధిలో వీడియోలను షార్ప్‌గా తీర్చిదిద్దవచ్చు. పర్ఫెక్ట్లెంత్తో మ్యూజిక్‌ను సెట్ చేయవచ్చు. ‘ఫైనల్ కట్ ప్రో’ను ప్రొఫెషనల్ టూల్‌గా చెబుతుంటారు. టాప్ యూట్యూబర్స్ దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. లాంగ్ టర్మ్ యూట్యూబర్స్కు ఎక్కువగా ఉపయోగపడే ‘ఫైనల్ కట్’లో ఫిల్టర్స్, మల్టీఛానెల్ ఆడియో టూల్స్, అడ్వాన్స్డ్ కలర్ గ్రేడింగ్ ఫీచర్లు ఉన్నాయి. మొబైల్‌ఫోన్ ఉపయోగించే సోషల్ మీడియా వీడియో క్రియేటర్స్ కోసం ‘ఎడోబ్ యాప్ ప్రీమియర్ రష్’ ఉపయోగపడుతుంది. వాయిస్ అండ్ మ్యూజిక్ మధ్య సౌండ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసే ‘ఆటో డకింగ్’ సదుపాయం అందుబాటులో ఉంది. ఆకట్టుకునే మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్స్ ఉన్నాయి. ‘షాట్‌కట్’ సాఫ్ట్‌వేర్‌తో సులభంగా వీడియోలు ఎడిట్ చేయవచ్చు. ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మెరుగైన వీడియో, ఆడియో టూల్స్, 4కే లాంటి వైడ్‌రేంజ్ ఫార్మట్స్ ఉన్నాయి. ‘వీమియో’ అనేది బెస్ట్ ఏఐ-అసిస్టెడ్ ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనిపించుకుంది. వేలాది ఫోటోలు, వీడియోలు ఉన్న స్టాక్లైబ్రరీతో యాక్సెస్ కావచ్చు, లైసెన్స్డ్ మ్యూజిక్ లైబ్రరీ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వాడుకోవచ్చు. ‘ఇన్వీడియో’ అనేది ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్. సోషల్ మీడియా కోసం మాత్రమే కాకుండా కంపెనీ వెబ్సైట్ల కోసం ఆకట్టుకునేలా వీడియోలు క్రియేట్ చేయవచ్చు. అయిదువేలకు పైగా ప్రీ-మేడ్ టెంప్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రీస్టాక్ లైబ్రరీ నుంచి ఫోటో,వీడియోలు,మ్యూజిక్‌ను ఉపయోగించవచ్చు. టెక్స్ - టు - వీడియో టూల్లాంటి స్రై్టకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ‘వుయ్వీడియో’ అనేది క్లౌడ్-బేస్డ్ ఆన్లైన్ ఎడిటర్. స్టాక్వీడియో లైబ్రరీ నుంచి వేలాది ఇమెజెస్, వీడియోలు, మ్యూజిక్‌తో యాక్సెస్ కావచ్చు. గ్రీన్‌స్క్రీన్, స్క్రీన్ రికార్డింగ్, కలర్గ్రేడింగ్... మొదలైన అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టూల్స్‌తో వీడియోలకు సినిమాటిక్ లుక్ ఇవ్వొచ్చు. స్లైడ్షోలు,ప్రచారయాత్రలతో పాటు సోషల్ మీడియాలో మార్కెటింగ్ వీడియోలు క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్ వీడియో మేకర్ బైటబుల్. స్టన్నింగ్ టెంప్లెట్స్ దీని సొంతం. వీడియోలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి హై రిజల్యూషన్‌తో కూడిన ఫోటోలు, స్టాక్వీడియోలు ఉన్నాయి. ఇక మీరు రెడియా! త్రినేత్రం అనుభవాన్ని మించిన జ్ఞానం ఏంఉంటుంది! తన అపారమైన అనుభవంతో అమెరికన్ ఫిల్మ్ఎడిటర్, డైరెక్టర్, సౌండ్ డిజైనర్ వాల్టర్ మర్చ్ ‘ఇన్ ది బ్లింక్ ఆఫ్ యాన్ ఐ’ అనే మంచి పుస్తకం రాశారు. వీడియో లేదా ఫిల్మ్ ఎడిటింగ్‌కు సంబంధించి బోలెడు విషయాలు తెలుసుకోవచ్చు. డిజిటల్ ఎడిటింగ్‌లో వచ్చిన మార్పులు, డిజిటల్ ఎడిటింగ్ ఉపయోగాలు, పరిమితులు...మొదలైనవి తెలుసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం ఇది. -
వాట్సాప్‌లో అదిరిపోయే ఫోటో ఫీచర్
వాట్సాప్ తన యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించడం కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పటి వరకు మనం వాట్సాప్ వెబ్, డెస్క్ టాప్ యాప్ ద్వారా నేరుగా ఫోటోలను పంపే ఆప్షన్ మాత్రమే ఉండేది. అయితే, వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్ వల్ల ఫోటోను ఎడిట్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ అవకాశం ఇప్పటివరకు మొబైల్ యాప్‌లో మాత్రమే ఉంది. కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఫోటోలను పంపడానికి ముందు స్టిక్కర్లను, ఏమోజీ, క్రాప్ చేయడానికి అదనపు ఆప్షన్ తో ఎడిట్ ఫీచర్ తీసుకొనివచ్చింది. ఈ ఫీచర్ వెంటనే యూజర్లందరికీ వెంటనే రాకపోవచ్చు. దశల వారీగా వెబ్, డెస్క్ టాప్ యూజర్లకు తీసుకోని రానున్నట్లు తన బ్లాగ్ లో పేర్కొంది. కొద్ది రోజుల క్రితమే 'వ్యూ వన్స్' పేరుతో ఇంతకు ముందు ఒక ఫీచర్ తీసుకొనివచ్చింది. వ్యూ వన్స్ ఫీచర్లో భాగంగా వాట్సాప్ యాప్‌లో ఫోటో లేదా వీడియోను సెండ్ చేసేటప్పుడు యాడ్ క్యాప్షన్ బార్ పక్కన కొత్తగా '1' చిహ్నాంపై ట్యాప్ చేయాలి. దీంతో రెసిపెంట్ మీరు పంపిన ఫోటోను లేదా వీడియోను ఒక్కసారి మాత్రమే చూడగలడు. రెసిపెంట్ మేసేజ్‌ను ఒపెన్ చేశాక ‘ఒపెన్డ్’ అనే సందేశం కన్పిస్తుంది. వ్యూ వన్స్ ఫీచర్‌తో మీడియా కంటెంట్‌ను రెసిపెంట్(గ్రహీత) ఫోటోలు లేదా వీడియోలు మొబైల్ గ్యాలరీలో సేవ్ కావు. -
వాట్సాప్ ఇక మరింత కొత్తగా..
శాన్ ప్రాన్సిస్కో: ప్రముఖ ఆడియో, వీడియో, టెక్స్ట్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను ప్రారంభించింది. మొబైల్ ఫోన్ లోని కెమెరాకు అనుసంధానం చేసి ఈ ఫీచర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్స్ తో ఇతరులకు పంపించే ఫోటోలు, వీడియోలపై నచ్చిన కామెంట్ పెట్టేందుకు, వాటిపై ఎలాంటి బొమ్మలైన గీసేందుకు, ఎమోజీలను యాడ్ చేసేందుకు వీలు కల్పించనుంది. 'ఇక నుంచి మీరు తీసిన ఒక ఫొటోనిగానీ, వీడియోనిగానీ ఇతరులతో పంచుకోవాలని అనుకున్నప్పుడు ఈ ఫొటోలకు, వీడియోల ఎడిటింగ్‌కు సంబంధించిన టూల్స్ మీకు వాటంతటవే కనిపిస్తాయి' అని వాట్సాప్ ఒక పోస్ట్ ద్వారా తెలిపింది. దీంతోపాటు ఇక నుంచి ఏవైనా వీడియోలో వాట్సాప్ ద్వారా రికార్డు చేసే సమయంలో జూమ్ చేసే సౌకర్యం కూడా కల్పించనుంది. మంగళవారం నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుండగా ఆపిల్ ఐఫోన్లకు త్వరలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.