
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులోకి వచ్చాక దానిని విరివిగా వాడేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపిస్తు న్నారు. తాము వాడే యాప్‌లలో ఏఐ ఉంటే దాని సాయంతో సరదా సరదా ప్రయోగాలు చేస్తుంటారు. దీంతో ఫొటోలు, ఇమేజ్‌లను ఎడిట్ చేసే ఏఐ ఆధారిత ఫీచర్ త్వరలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో అందుబుటులోకి వచ్చే అవకాశ ముంది. బీటా వెర్షన్ వినియోగదారులకు మొదట దీనిని వాడే అవకాశం ఇవ్వొచ్చని ‘వెబ్‌బేటాఇన్ఫో’ తన కథనంలో పేర్కొంది.
ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తే..
యాప్‌లోని ఆప్షన్లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకుంటున్న యూజర్లు.. ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది అంబుబాటులోకి వస్తే ఇమేజ్‌ను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, బ్యాక్‌గ్రౌండ్‌లను మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.24.7.13 వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకున్న వాళ్లకు ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్ ప్రాథమిక కోడ్‌ను అందుబాటులోకి తేవచ్చు. బేటా ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన టెస్టర్లనే తొలుత దీనిని వాడేందుకు అనుమతిస్తారు. సెర్చ్ బార్‌లో టైప్‌చేసి నేరుగా ఏఐ సర్వీస్‌తోనే చాటింగ్ చేసి కావాల్సిన ఫలితాలు పొందే ఫీచర్‌పైనా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాయిస్ నోట్ వచ్చే సందేశాలనూ ఓపెన్ చేయకుండానే టెక్ట్స్ రూపంలో చదవగలిగేలా మరో ఫీచర్‌ను యూజర్లకు అందివ్వాలని వాట్సాప్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment